26, జూన్ 2010, శనివారం

రసిక రాజధానులు

2 comments

ఒకప్పుడది చీకటి వ్యాపారం. చీకట్లు కమ్ముకుంటుంటే...వ్యాపారం జోరందుకునేది. పేద కుటుంబాల్లోనే వారే.. ఆ రొంపిలోకి దిగేవారు. కానీ.. ఇప్పుడు.. చీకట్లను దాటుకొని అది విస్తరిస్తోంది. హైక్లాస్ పేరుతో హైటెక్ సిటీనే మార్చేస్తోంది.

హైదరాబాద్‌లో జోరుగా సాగే బిజినెస్ అదే..
ఏ కాలమైనా.. ఏ సీజన్ అయినా... ఫుల్ బిజినెస్..
మాంద్యంలోనూ హవా తగ్గలేదు..
రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది
టర్నోవర్ పెంచుకోంటోంది..
ఇప్పుడు ఇంపోర్టెడ్ సరకునూ అందుబాటులోకి తెచ్చింది..
వేలకు వేలు పోయగలిగితే చాలు.. సర్వసుఖాలు క్షణాల్లో...

ఇంత హిస్టరీ చెబుతోంది.. ఒకే ఒక్క బిజినెస్ గురించి.. అదే వ్యభిచారం. అవును.. హైదారాబాద్‌కు ఇప్పుడు ఇదే అట్రాక్షన్. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వారంతా ముందుగా ఆరాతీస్తోంది కూడా దీనిగురించే. క్షణికానందం కోసం.. ఎంతైనా ఖర్చుపెట్టగలిగేవారు పెరుగుతుండడంతో... కాల్‌గర్ల్స్‌కు క్రేజ్ ఎక్కువవుతోంది. అందుకే.. రాష్ట్ర రాజధాని ఇప్పుడు రసిక రాజధానిగా మారిపోయింది. ఘనమైన చరిత్రను తోసిరాజని.. వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.
కుర్రాళ్ల బలహీనతను ఆసరా చేసుకుంటున్న సెక్స్‌ముఠాలు.. రాజధానిపై పట్టుబిగిస్తున్నాయి. రాష్ట్రం నలుమూల నుంచే కాక.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నవారిని టార్గెట్ చేసుకుంటూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రతీ చోటా ఈ బ్రోతల్ హౌస్‌ల ఉనికి కనపడుతూనే ఉంది. ఇద్దరు ముగ్గురు అమ్మాయిల దగ్గర నుంచి మొదలుపెడితే.. నెట్‌వర్క్‌గా వందలాదిమందితో బిజినెస్ చేస్తున్న ముఠాలు కూడా ఇప్పుడు రాజధానిలో పాగా వేశాయి. పైగా.. మారుతున్న టెక్నాలజీని ఊతం చేసుకుని ఫోన్‌కాల్స్‌లోనే పని కానిచ్చేస్తున్నాయి. హైటెక్ పద్దతుల్లో తమ కస్టమర్లను సెట్ చేసుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో మెయిన్ సెంటర్లైన.. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్‌.ఆర్.నగర్‌లలోనే వందలాది సెక్స్‌ముఠాలు పనిచేస్తున్నాయి. వీఐపీలు, హైక్లాస్ వారి కోసం ప్రత్యేకంగా అమ్మాయిలను ఏర్పాటు చేస్తున్నాయి. వెరైటీ కోరుకునే వారికోసం ఏకంగా విదేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకువస్తున్నాయి. కస్టమర్ల ఎంపిక విషయంలోనూ ఈ సెక్స్ సెంటర్ల యజమానులు చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఎంతో నమ్మకం కుదిరితేగానీ డీల్‌ కుదుర్చుకోరు. హైదరాబాద్ మొత్తం మీద చూస్తే.. ప్రతీరోజు కోట్లల్లోనే ఈ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది.

కాస్ట్‌లీ వ్యాపారమే...

అబ్బాయిలకు ఎరవేసే బ్రోకర్లు హైదరాబాద్‌లో వేలల్లో ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్, కాలేజ్ స్టూడెంట్స్, బ్యాచ్‌లర్స్‌ను వీరంతా ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి అందమైన అమ్మాయిలను రాజధానికి రప్పిస్తున్నాయి. కాస్ట్‌లీ ఏరియాల్లో డెన్‌లను ఏర్పాటు చేసుకొని.. సీక్రెట్ బిజెనెస్‌ను నిర్వహిస్తున్నాయి.
హైదరాబాద్‌లో సెక్స్ ట్రేడ్ డైలీ టర్నోవర్.. దాదాపు కోటి రూపాయలు. రాజధానిలో ఎంత హైరేంజ్‌లో వ్యభిచారం జరుగుతోందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి.. మనుషులను బట్టి రకరకాల లెవల్స్‌లో ఈ వ్యాపారం జరుగుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. మురికివాడల నుంచి ఫైస్టార్ హోటల్స్‌దాకా అన్నమాట. బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, పార్కుల దగ్గర లోక్లాస్ వ్యభిచారం జరుగుతుంటుంది. ఇక మిడిల్‌ లెవల్‌ అంతా బ్రోకర్ల ద్వారా జరుగుతుంది. అమ్మాయిల ఫొటోలు చూపించి ఈ తరహా దందా నిర్వహిస్తారు. రోజుకు 1500 నుంచి 3 వేల దాకా వసూలు చేస్తారు. మూడోది హైటెక్ వ్యవహారం. హైటెక్‌లోనూ రకరకాల సర్వీసులున్నాయి. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్‌ను అద్దెకు తీసుకుని వాటినే వ్యభిచార గృహాలుగా మార్చేస్తారు. విటులను రప్పించుకొని.. అక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 10 వేల దాకా వసూలు చేస్తారు. దీని తర్వాత స్థాయి హైక్లాస్ ఏరియాది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టల్లో ఈ తరహా దందా కొనసాగుతోంది. ఇండిపెండెంట్ హౌసుల్లో ఈ వ్యాపారం కొనసాగుతోంది. ఒక్కోరోజుకు 20 వేలకు పైగా ఖర్చుపెట్టగలిగితే తప్ప.. వీటిల్లోకి ఎవరూ అడుగుపెట్టలేరు.
ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెక్స్‌ట్రేడ్‌ కూడా జతకలుస్తోంది. పార్టీల పేరుతో నగర శివార్లలోని రిసార్టుల్లో ఈ తరహా బిజినెస్ ఎక్కువగా జరుగుతోంది. అశ్లీల నృత్యాలు.. ఆ పై అందాల విందులు వీటిల్లో కామన్. ఇక ఫామ్‌హౌసుల్లోనూ.. అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న సంఘటనలూ ఎక్కువగానే జరుగుతున్నాయి. గ్రూప్‌గా బుక్ చేసుకుంటారు కాబట్టి.. లక్షల్లోనే చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా ప్రతీ చోటా జరుగుతోందనడానికి ఆధారం.. ఇటీవల వరసగా పోలీసులకు దొరుకుతున్న వ్యభిచార ముఠాలే. ఫాంహౌసులు, రిసార్టులపై దృష్టి పెట్టిన పోలీసులు.. పెద్ద సంఖ్యలోనే డ్యాన్సర్లను అరెస్ట్ చేశారు. ఇక బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోనూ ఎన్నో వ్యభిచార ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ రెండు మూడు నెలల్లోనే వంద మందికి పైగా సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేశారు. అందరూ.. హైటెక్ సెక్స్‌ రాకెట్‌లో మునిగి ఉన్నవారే..

రాష్ట్రమంతా ఇదే రూటు

రాష్ట్రంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి బెజవాడ. అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ వెలసిన ఈ క్షేత్రం క్రమంగా వ్యభిచార కూపంలో కూరుకుపోతోంది. భక్తికి బదులు రక్తి రాజ్యమేలుతోంది. బెజవాడ బస్టాండ్ ఆధారంగా ఎంతోకాలంగా వ్యభిచార దందా జరుగుతున్నా ఎవరూ అరికట్టలేకపోతున్నారు. బస్సుదిగే ప్రతీ ప్రయాణీకుడిని.. ఎవరో ఒకరు లాడ్జీకి వెళదామంటూ అడగడం సర్వసాధారణం.
ఇప్పుడు మాత్రం ఈ బిజినెస్ కొత్త పుంతలు తొక్కుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్స్‌నే వ్యభిచార కేంద్రాలుగా మార్చేస్తున్నారు. ఫ్లాట్స్ అద్దెకు తీసుకోవడం.. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి విటులను ఆకర్షిస్తున్నారు.
అంతేకాదు.. మైనర్లతో వ్యభిచారం చేయించడంలోనూ విజయవాడది నెంబర్‌వన్ ప్లేస్. చిన్న పిల్లలను ఈ రొంపిలోకి దింపుతూ.. బ్రోకర్లు లక్షలు సంపాదిస్తున్నారు. అమ్మాయిలు కావాలంటూ.. జీ24 గంటల ప్రతినిధి అడిగితే.. బ్రోతల్ హౌస్ నిర్వహాకులు చెబుతున్న మాటలు వినండి.. పారిశ్రామికంగా.. పర్యాటకంగా ఎదుగుతున్న విశాఖలోనూ ఇదే పరిస్థితి. ఫ్రెండ్‌షిప్ క్లబ్‌ల పేరిట కుర్రాళ్లను బురిడీ కొట్టించి.. వ్యభిచారానికి అలవాటు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ వ్యభిచారం జోరుగానే సాగుతోంది. ప్రతీ పట్టణంలోనూ.. ముఠాలు భారీ ఎత్తున సెక్స్‌ట్రేడ్‌ను నిర్వహిస్తున్నాయి. లాడ్జీలు, హోటళ్లనే స్థావరాలుగా మార్చుకొంటున్నాయి. అప్పుడప్పుడూ పోలీసుల దాడుల్లో ఒకటీ అరా ఇలాంటి ముఠాలు దొరుకుతున్నా.. బయటకురాని ముఠాలు చాలానే ఉన్నాయి.

లక్షమంది సెక్స్‌వర్కర్లు

వ్యభిచారంపై రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన ఓ సర్వే ఒళ్లు జలధరించే నిజాలను బయటపెట్టింది. గతంతో పోల్చితే రాష్ట్రంలో వ్యభిచారం పదిశాతానికి పైగా పెరిగిందని ఈ సర్వేలో తేలింది. దాదాపు 211 పట్టణాల్లో వ్యభిచారం పెద్దఎత్తున సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే.. మిగిలిన జిల్లాల్లోనే 56 వేలకు పైగా సెక్స్‌వర్కర్లు ఉన్నారని సర్వే చెబుతోంది. రాజధాని కావడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే దాదాపు పదివేల మంది సెక్స్ వర్కర్లు ఉంటారని అంచనా. ఇదంతా అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఉన్నవారు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పోతున్నవారూ కలుపుకుంటే.. దాదాపు లక్షమంది మహిళలు.. వ్యభిచార వృత్తిలో కూరుకుపోయి ఉన్నారు.
వ్యభిచారానికి సంబంధించి 65 శాతం బుకింగ్‌లు కేవలం సెల్‌ఫోన్‌ల ద్వారానే జరుగుతున్నాయి. స్టార్‌హోటల్స్ నుంచి చిన్న చిన్న లాడ్జీల దాకా అన్నింటిలోనూ వ్యభిచారం జరుగుతూనే ఉంటోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖల్లో అయితే.. మసాజ్ సెంటర్ల రూపంలోనూ సెక్స్‌ట్రేడ్ కొనసాగుతోంది. పైకి మసాజ్ సెంటర్లలానే కనిపించినా.. అక్కడే.. బుకింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకప్రాంతానికి చెందిన వారు.. మరో ప్రాంతానికి వెళ్లి వ్యభిచారంలో పాల్గొంటున్నారు. ఈ నీచవృత్తిలో ఇరుక్కుంటున్న వారిలో మూడు రకాలున్నారు. పొట్టకూటి కోసం.. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచారం చేస్తున్నవారు మొదటి రకమైతే.. రెండో రకం జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం ఒళ్లు అమ్ముకుంటున్నవారు. ఇక మూడోరకం.. బలవంతంగా ఈ రొంపిలోకి దిగినవారు. డబ్బుకోసం ఎవరో ఒకరు అమ్మేస్తే..వ్యభిచార గృహాలకు వీరు చేరతారు. అక్కడ బందీలై.. అందులోనే జీవిస్తారు.
దేశవ్యాప్తంగా చూస్తే.. ఢిల్లీ,ముంబై, కోల్‌కతా, పూణేల్లో వ్యభిచారం విశృంఖలంగా సాగుతోంది. ఇక్కడి రెడ్‌లైట్ ఏరియాల్లో ఎక్కువమంది అమ్మాయిలు మనరాష్ట్రం వారే. హైదరాబాద్, విజయవాడ, అనంతపురం కేంద్రంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కొనసాగుతోంది. ప్రతీ నెలా కనీసం.. ఇరవై నుంచి ముప్పై మందిని ట్రాఫికింగ్ ముఠాలు తమ వలలో వేసుకుని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లిపోతున్నారు. ఇదంతా కూడా అత్యంత పకడ్బందీగా జరుగుతుంది. పేద కుటుంబాలు.. ఆదాయం కోసం ఎదురుచూసేవారిని టార్గెట్ చేసుకొని ముఠా సభ్యులు పని మొదలుపెడతారు. ఢిల్లీ, ముంబైల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని చెబుతారు. నెలకు ఇరవై, ముప్పైవేల జీతాన్ని ఆశచూపుతారు. చివరకు.. బ్రోతల్ హౌసుల్లో అమ్మేస్తారు. ఇలా దేశంలోని ప్రధాన పట్టణాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో.. ఎంతోమంది మహిళలకు విముక్తి లభించింది. వ్యభిచార గృహాల నుంచి సురక్షితంగా తీసుకొచ్చినప్పటికీ.. వీరందరికీ పునరావాసం కల్పించడమే సమస్యగా మారుతోంది.

మగాళ్లదే తప్పు..

లక్షమంది వ్యభిచారం చేస్తున్నారంటే.. దానికి పదింతల మగాళ్లు.. సెక్స్‌కోసం పక్కదారి పడుతున్నట్లే లెక్క. ఇంత విచ్చలవిడిగా రాష్ట్రంలో వ్యభిచారం సాగుతున్నా.. పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోవడంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని పట్టణాలన్ని రసిక రాజధానులు మారిపోయినా... ఎయిడ్స్ లాంటి మహమ్మారి ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నా.. ఈ వృత్తికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.
ప్రపంచంలోనే అతిపురాతన వృత్తి వ్యభిచారం. ప్రభుత్వాల అనుమతి లేకున్నా.. విచ్చలవిడిగా సాగుతూనే ఉంది. హైటెక్ రూపానికి మారి. .మరింత రెచ్చిపోతోంది. పెద్దగా కష్టపడకుండానే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఆశే వ్యభిచారం వైపు అమ్మాయిల చేత అడుగులు వేయిస్తోంది. సరిగ్గా ఈ కాసుల వలనే అందమైన అమ్మాయిలపై వేస్తున్నారు బ్రోకర్లు. వ్యభిచారంలోకి దింపుతున్నారు. ముందుగా అడ్డుకోవాల్సింది ఇలాంటి వారినే..
అయితే.. శరీరాలను అమ్ముకుంటూ సాగించే ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైడ్స్‌లో పట్టుబడ్డప్పుడు అమ్మాయిలనే కాక.. విటులను, బ్రోకర్లకు కూడా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. బలవంతంగా అమ్మాయిలను ఈ రొంపిలోకి దింపుతున్న వారిపై.. కఠినాతికఠినంగా వ్యవహరించాలి.
వ్యభిచారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు ఎక్కువగా హైక్లాస్ వ్యభిచారంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. హైటెక్ సెక్స్ బిజినెస్‌లో మునిగితేలుతున్నవారినే అరెస్టులు చేస్తున్నారు.
అయితే.. వ్యభిచారం గుట్టుగా సాగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఉప్పును అందించాల్సింది స్థానికులే. అంతేకాదు.. మీ పరిసర ప్రాంతాల్లో వ్యభిచారం జరగకుండా చూసుకోవాల్సింది కూడా పబ్లిక్కే.
వ్యభిచారంలో ఉన్న మహిళలంతా కోరుకుని వచ్చినవారు కాదు.. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినవారు. అందుకే.. వీరిని రక్షించడం మాత్రమేకాదు.. పునరావాసమూ దొరికేలా చేయాలి. మరో ఆదాయమార్గం ఉంటే.. మూడొంతుల మంది.. వ్యభిచారం నుంచి బయటపడతారు.
Read more...
25, జూన్ 2010, శుక్రవారం

ఆకాశంలో అగ్నిగోళాలు..

0 comments

ప్రపంచంలో అందమైన ప్రదేశాల్లో ఒకటి.. ఆస్ట్రేలియా. సిడ్నీ హార్బర్ బ్రిడ్జి.. ఓపెరా హౌస్.. ఆకాశాన్నంటుకునేలా కనిపించే భవనాలు.. అందమైన నదులు.. ఆకట్టుకునే దీవులు... ఇలా ఆస్ట్రేలియా సౌందర్యాన్ని వర్ణించుకుంటూ వెళితే అంతే ఉండదు. ఆ సౌందర్యాన్ని అలా చూస్తూ సేదతీరాల్సిందే. ఇలాంటి ఆస్ట్రేలియాకు ఇప్పుడో భయం మొదలయ్యింది. అదికూడా అలాంటి ఇలాంటి భయం కాదు.. ప్రాణభయం.
అంతరిక్షం నుంచి ఆస్ట్రేలియాపై దాడి చేయవచ్చంటూ సాగుతున్న ప్రచారం అలజడి సృష్టిస్తోంది. అయితే.. ఇది భూమిపైన ఉన్న దేశాలు చేసే దాడి కాదు.. విశ్వంలో మనకు తెలియని ప్రాంతాల్లో ఉండవచ్చని భావిస్తున్న గ్రహాంతరవాసుల నుంచి.. అసలు ఈ ఏలియన్స్ ఉన్నాయో లేదో నిర్ధారణ కాకపోయినా.. ఆస్ట్రేలియన్లు మాత్రం తమపై దాడి జరగవచ్చని భావిస్తున్నారు. భారీస్థాయిలో ఆస్ట్రేలియాలోని ఉత్తరప్రాంతాన్ని గ్రహాంతరవాసులు ముట్టడించవచ్చంటూ కొంతమంది ఖగోళపరిశోధకులు ప్రకటించడంతో.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది..
దీనికి కారణం.. ఆకాశంలో ఇటీవల చోటు చేసుకున్న మార్పులే.. రాత్రిళ్లు మిణుకు మిణుకుమంటూ మెరిసే నక్షత్రాల మధ్య.. తళతళమెరుస్తూ మాయమవుతున్న వింతవస్తువులు తరచుగా దర్శనమిస్తున్నాయి. ఇటీవలికాలంలో ఇవి మరీ ఎక్కువయ్యాయి. రాత్రుళ్లు ఆకాశంలోకి చూస్తే చాలు.. ఏదోమూల ఈతరహా మెరుపులు కనిపిస్తున్నాయి. ఖగోళంలో చోటుచేసుకున్న ఈ మార్పులే.. ఆస్ట్రేలియన్లను భయపెట్టిస్తున్నాయి.

గ్రహాంతరవాసులా?

కళ్లముందే మెరుస్తాయి.. వేగంగా దూసుకుపోతాయి. నక్షత్రాలను మించి వెలుగులను విరజిమ్ముతాయి. కొద్ది దూరంపోయి అకస్మాత్తుగా మాయమవుతాయి.. ఆకాశంలో తరచుగా కనిపించే దృశ్యాలివి. గ్రహాంతరవాసులపై ప్రయోగాలు చేస్తున్న వారు వీటిపై చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు గందరగోళం సృష్టించాయి. ఆకాశంలో ఇలా మిరిమిట్లుగొలుపుతూ కనిపించి మాయమయ్యే.. వాటిని.. శాస్త్రసాంకేతిక పరిభాషలో ఉల్కలుగా గుర్తించారు. విశ్వం నుంచి అదుపుతప్పి భూమిపైకి వస్తుంటాయని చెబుతారు. ఇప్పడు ఆస్ట్రేలియాలో కనిపిస్తున్న దృశ్యాలు కూడా ఇవేనన్నది కొంతమంది ఖగోళ పరిశోధకుల అభిప్రాయం.
అయితే.. ఇక్కడే ఓ సమస్య ఉంది. ఉల్కలకు ఉన్న లక్షణం.. కొంతదూరం పాటు వెళ్లి మాయమవడం. కానీ, ఆస్ట్రేలియాలో కనిపిస్తున్న దృశ్యాల్లో చాలావరకూ స్థిరంగా ఒకే చోట వెలుగుతున్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. గుండ్రంగా కనిపిస్తూ.. మిరుమిట్లు గొలుపుతూ.. ఒకే చోట ఎక్కువ సమయం ఉండేవి కూడా తరచుగా దర్శనమిస్తున్నాయి. ఉత్తర ఆస్ట్రేలియాలోని 370 కిలోమీటర్ల పొడవునా.. ఆకాశంలో ఇలా కాంతిగోళాలు ప్రత్యక్షమవుతున్నాయి. గ్రహాంతరవాసులపైనా, ఎగిరేపళ్లాలపైనా పరిశోధకులు చేసేవారు మాత్రం.. ఇవి ఏలియన్స్ వాహనాలే అంటున్నారు. ఉల్కలతో పోల్చితే ఈ కాంతిగోళాలు వింతగా ప్రవర్తించడం చూస్తుంటే.. అవి కచ్చింతంగా గ్రహాంతరవాసులే అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
వేసవిలో ఆస్ట్రేలియాపైకి ఇలా గ్రహాంతరవాసులు వస్తున్నాయని యూఎఫాలజిస్టులు ప్రకటించారు. అయితే.. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. గ్రహాంతరవాసుల కన్ను ఎప్పటినుంచో ఆస్ట్రేలియాపై ఉందని.. నిరంతరంగా నిఘా పెడుతున్నాయంటున్న యూఎఫాలజిస్టులు వేసవిలో మేఘాలు తక్కువగా ఉండడం వల్లే మన కంటికి కనిపిస్తున్నాయంటున్నారు. అంతేకాదు.. మన మిలిటరీ యాక్టివిటీస్‌ను కనిపెట్టడానికి ఈ నిఘా పెట్టారంటూ కంగారూల దేశంలో కంగారు పుట్టిస్తున్నారు.
ప్రపంచంలోని నాలుగు ఖండాలకు దూరంగా.. ఒంటరిగా ఉండండతోనే ఆస్ట్రేలియాపై గ్రహాంతరవాసులు కన్నేశాయా... ఈ ప్రాంతంలో స్థిరస్థావరాలు ఏర్పాటు చేసుకొని... ఆ తర్వాత ప్రపంచంపై దండెత్తాలనుకుంటున్నాయా.. ? ఈ అనుమానాలే.. ఆస్ట్రేలియన్లను భయపెడుతున్నాయి.

ఏమిటీ కాంతిపుంజాలు..

ఆస్ట్రేలియన్ల భయాన్ని కాసేపు పక్కన పెడదాం.. గ్రహాంతరవాసులు దాడి చేయవచ్చన్న వారి అనుమానాలనూ వదిలేద్దాం. కానీ, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు ఆకాశంలో ఆ కాంతిపుంజాల మాటేమిటి? ఈ కాంతి గోళాలు ఎలా సంభవిస్తున్నాయి. వీటిని ఎవరు పంపిస్తున్నారు..

ఆకాశంలో మెరుస్తూ కనిపించి మాయమయ్యేవే ఉల్కలు. వాస్తవానికి ఇవన్నీ గ్రహ శిథిలాలు. ఇవి ఎప్పటి నుంచో మనకు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. నింగిలోకి నిశితంగా చూస్తే.. కొన్ని వెలుగు రవ్వలు రాలిపడుతుంటాయి. సంవత్సరంలో దాదాపుగా ప్రతీరోజు ఇలాంటి దృశ్యాలు ఆకాశంలో కనిపిస్తూనే ఉంటాయి. సుదూరప్రాంతంలో విశ్వంలో ఇవి మండిపోతుండడం వల్ల.. మనకు వింతగా కనిపిస్తుంటాయి. అందుకే వీటినే ఖగోళ అద్భుతాలుగా భావిస్తారు.
మన సౌరమండలంలో ఇలాంటి ఉల్కలు, వాటికన్నా పెద్దవైన తోకచుక్కలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీటిలో ఇసుకరేణువంత పరిణామం మొదలుకొని కొన్ని వందల కిలోమీటర్ల వ్యాసం ఉన్నవాటినీ శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్షంలో పరిభ్రమిస్తూ ఒక్కోసారి గ్రహాలకు చేరువుగా వస్తాయి. ముఖ్యంగా మనకు చేరువలోకి వచ్చినవప్పుడు.. భూవాతావరణంతో సంగమించడం వల్ల.. వీటిచుట్టూ విపరీతమైన వేడి మొదలవుతుంది. వేగంగా దూసుకొని వస్తాయి కాబట్టి రాపిడికి.. మంటలు ఏర్పడతాయి. అవే మనకు కాంతిపుంజాల్లా కనిపిస్తాయి.
ఇలా వాతావరణంలోనే మండిపోవడం వల్ల.. భూమికి చేరకుండానే నాశనం అయిపోతున్నాయి. ఒక్కొక్కటి ఎక్కువగా కనిపించినా.. కొన్నిసార్లు పెద్ద మొత్తంలో ఇలా నింగినుంచి రాలిపడుతూ కనిపిస్తాయి. వీటిని.. ఉల్కాపాతాలుగా భావిస్తారు. గ్రహశకలాలు పెద్ద మొత్తంలో భూమికి చేరువలోకి వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యాలు సాక్షాత్కారమవుతాయి. ఆకాశం నుంచి ఎవరో ఆశీర్వదించి.. మనపై వరాలు కురిపిస్తున్నట్లుగా.. ఆకర్షణీయంగా ఇలా ఒకేసారి కిందకు మెరుస్తూ జారతాయి.. ఈ షూటింగ్ స్టార్స్.
అయితే.. ఒక్కోసారి.. పెద్దపెద్ద ఉల్కలు భూమిపైకి ప్రచండవేగంతో దూసుకువస్తాయి. వీటిని ఆపడం చాలా కష్టం. భూవాతావరణంలోకి కూడా చొచ్చుకుని వచ్చి.. భూమిని ఢీకొడతాయి. భూమికి ఇలాంటి వాటినుంచి ముప్పుకూడా పొంచి ఉంది. అయితే.. ఇటీవలకాలంలో మాత్రం భారీ స్థాయిలో ఉల్కలు మన భూమిపైకి దూసుకొని రాలేదు. ఒకవేళ వచ్చినా.. వాటిని విశ్వంలోనే నాశనం చేయడానికి ప్రపంచదేశాలు కొత్త కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి.

ప్రమాదం పొంచి ఉందా?
మానవపరిణామక్రమం మొదలుకానప్పుడు.. అంటే.. డైనోసార్ల కాలంలో ఓ పెద్ద ఉల్క మన భూమిని ఢీకొని ఉంటుందన్న అంచనా.. శాస్త్రవేత్తలది. డైనోసార్లతో పాటు భూమిపై ఉండే జీవరాశులను ఈ ఉల్కాపాతం నాశనం చేసిఉండొచ్చని భావిస్తున్నారు. డైనోసార్లు అంతం కావడంతో పాటు .. భూమిపైన అనూహ్యమార్పులు చోటుచేసుకోవడానికి ఇలాంటి ఉల్కలు ఢీకొనడమే కారణం అన్న అభిప్రాయం ఉంది. అయితే.. దీన్ని ఇంతవరకూ శాస్త్రీయంగా రుజువు చేయలేకపోయారు. రెండు శతాబ్దాలుగా చూస్తే.. దాదాపు 11 వందల ఉల్కలు భూమిపై పడినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గ్రహాంతరవాసుల రూపంలో కాకపోయినా.. సూర్యమండలంలో తిరుగుతున్న ఉల్కల వల్ల మనకు ప్రమాదం ఉండొచ్చన్న అనుమానాలూ భయపెడుతూనే ఉన్నాయి. అయితే.. ఏ ఉల్కలు ఎప్పుడు వస్తాయన్నది కచ్చితంగా లెక్కలు కట్టగలిగారు శాస్త్రవేత్తలు. అయితే.. 2036లో మాత్రం అపోఫిస్ అనే ఓ శకలం వల్ల మన భూమికి ముప్పు పొంచి ఉందంటూ ప్రమాద సంకేతాలు ఇస్తున్నారు ఖగోళ పరిశోధకులు. ప్రస్తుతం మనకు కనిపించనంత దూరంలో ఉన్న ఈ శకలం.. 2029 నాటికి భూమికి దగ్గరలోకి రానుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అంతవరకూ ఆగాల్సిందే.

ఎక్కడినుంచి వస్తున్నాయి?

సూర్యుడు.. సూర్యుడి చుట్టూ గ్రహాలు.. సూర్యమండలం అంటే ఇంతే అనుకుంటే పొరపాటు. గ్రహాలతో పాటు.. గ్రహశకలాలు కూడా అరుణతార చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. సూక్ష్మ పరిమాణం నుంచి ఉపగ్రహాల సైజులో ఉన్న ఈ శకలాలు.. గ్రహాలతో పాటే తిరుగుతున్నాయి. సోలార్ సిస్టంలో కొన్ని కోట్ల గ్రహశకలాలు ఉన్నాయి. సూర్యుడి దగ్గర నుంచి మొదలుపెడితే.. ముందుగా వచ్చే గ్రహం బుధుడు.. ఆ తర్వాత శుక్రుడు.. ఆపై భూమి ఉంటాయి. భూమిని దాటి వెళ్తే.. అంగారకుడు కనిపిస్తాడు. భూమికి అంగారకుడికి మధ్య సుమారు ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుందని అంచనా. అంగారకుడీనీ దాటిన తర్వాత.. బృహస్పతి వస్తుంది. ఈ రెండు గ్రహాల మధ్య దూరం 34 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు గ్రహాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలోనే ఉంది.. గ్రహశకలాలకు నెలవైన.. ఆస్టరాయిడ్ బెల్ట్. ఈ ఆస్టరాయిడ్ బెల్డ్ విస్తీర్ణం.. 28 కోట్ల కిలోమీటర్లు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతపెద్ద మొత్తంలో బెల్డ్ విస్తరించి ఉందంటే.. ఎన్ని ఉల్కలు ఉండిఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. ఇంత ఎక్కువగా ఆస్టరాయిడ్లు ఈ ప్రాంతంలో ఎందుకు ఉన్నాయి? దీనిపైనా.. అనేక సందేహాలు శాస్త్రవేత్తలను వెంటాడుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సూర్యమండలం ఏర్పడినప్పుడు.. గ్రహాల్లోకి చేరని పదార్థాలు విడిగా మిగిలిపోయి.. ఆస్టరాయిడ్లుగా సంచరిస్తున్నాయన్న భావనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక మరో వాదన ప్రకారం.. అంగారకుడికి.. బృహస్పతికి మధ్య.. ఓ గ్రహం గతంలో ఉండేదని.. అది విచ్ఛిన్నం కావడం వల్లే ఈ ఆస్టరాయిడ్ బెల్డ్ ఏర్పడిందన్నది కొంత మంది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ రెండు గ్రహాల మధ్య ఉన్న దూరం దీనికి ఆధారంగా చూపిస్తున్నారు. అయితే.. శాస్త్రీయంగా మాత్రం ఈ వాదన రుజువు కాలేదు.
ఆస్టరాయిడ్ బెల్ట్ తరహాలోనే.. ప్లూటోను దాటిన తర్వాత క్యూపర్ బెల్ట్ ఉంది. ఇందులోనూ ఎన్నో గ్రహశకలాలు ఉన్నాయి. ఆస్టరాయిడ్ బెల్డ్‌తో పోల్చితే.. ఈ క్యూపర్ బెల్డ్ పరిమాణంలో చాలా పెద్దది. ఇక్కడి నుంచే తోకచుక్కలు ఉద్భవించాయని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. ఆస్టరాయిడ్ బెల్డ్ నుంటే మనకు ఎక్కువగా సమస్యలు ఎదురుకానున్నాయి. దాదాపు 40 వేల ఏళ్ల క్రితమే.. ఓ భారీ ఆస్టరాయిడ్.. అమెరికాలోని ఆరిజోనాలో పడింది. దీని దాటికి కిలోమీటరుకు పైగా వ్యాసం ఉన్న ఓ పెద్ద గొయ్యి ఏర్పడింది.
ఇలాంటి ఆస్టరాయిడ్‌లు పెద్ద ఎత్తున భూమిపై పడితే జరిగేది వినాశనమే. అయితే.. ఒకేసారి మాకుమ్మడిగా ఇంతవరకూ పడలేదు కాబట్టి.. భవిష్యత్తులోనూ పడతాయని ఊహించలేం. కానీ... అప్పడప్పుడూ.. ఒకటీ రెండు ఉల్కలు మాత్రం భూమిని ఢీకొట్టే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి.
Read more...
23, జూన్ 2010, బుధవారం

ప్రకృతి 10 శత్రువులు

1 comments

మనకున్న గడువు వందేళ్లే..
వందేళ్ల తర్వాత మనిషి ఉండకపోవచ్చు..
భూమి నాశనం కావచ్చు
జీవరాశి మాయం కావచ్చు
పది ప్రమాదాలు పొంచి ఉన్నాయి
ఇలా కనీవినీ ఎరుగని ఉత్పాతాలకు భూమి వేదిక కాబోతోంది. మానవజాతి సమస్తాన్ని తుడిచికుపెట్టేసే మహాఉపద్రవాలు ముంచుకొస్తున్నాయి. మరికొన్ని సంవత్సరాల తర్వాత.. భూమి పచ్చగా కళకళలాడకపోవచ్చు. ఎగసిపడుతున్న అగ్నికీలలతో భగభగ మండుతుండొచ్చు. ప్రకృతంతా మాయమై.. స్మశానంగా మారిపోవచ్చు.

ఈ ఊహే భరించడం కష్టం. కానీ.. మరికొన్నేళ్లలో భూమికి ఆయుష్షు తీరిపోతోందనిపిస్తోంది. ప్రమాదాలు విలయ తాండవం చేస్తూ భూమిని ముంచెత్తడానికి వస్తున్నాయి. కొన్ని మనం కొనితెచ్చుకుంటున్నవైతే.. మరికొన్నింటిని ప్రకృతి పంపిస్తోంది. భూమికొచ్చే ప్రమాదాలపై ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. పది మహా ప్రమాదాలను గుర్తించారు. ఈ పదీ భూమిని నాశనం చేసేవే. పైగా.. మరో వందేళ్లలోపే ఇవన్నీ మన భూమిపై విరుచుకుపడొచ్చు. ఈ ప్రమాదాలన్నీ ఒకేసారి విరుచుకపడినా.. వేరువేరుగా ముంచెత్తినా.. భారీ విధ్వంసం మాత్రం ఖాయం. చెప్పాలంటే.. భూమి స్వరూపాన్నే మార్చేసే మహా ప్రమాదాలు. మరి ఆ ప్రమాదాలు ఏమిటి? భూమిపైకి ఎలా వస్తున్నాయి..?
తొలి శత్రువు

సముద్రంలో పట్టణాలు మునిగిపోవచ్చు...
రాష్ట్రాలు సముద్రం పాలు కావచ్చు..
దేశాలు మునిగిపోవచ్చు
భూమంతా నీటితో నిండిపోవచ్చు..

అవును.. నిన్నటి భయం.. ఇప్పుడు నిజం కాబోతోంది. ఈ భూగోళంపై మనిషి ఉండడానికి ఉన్న కొద్దిపాటి నేలను కూడా మింగేయడానికి రాకాసి సముద్రం ముందుకొస్తోంది. తన పరిణామాన్ని పెంచుకుంటూ నేలపైకి విరుచుకుపడబోతోంది.
దీనికి ఏకైక కారణం.. గ్లోబల్ వార్మింగ్. ప్రకృతి పది శత్రువుల్లో మొదటిది గ్లోబల్ వార్మింగ్. అంటే భూమండలం వేడెక్కడం. భూవాతావరణం.. ఒక్కో సెంటీగ్రేడ్ వేడెక్కేకొద్దీ.. ఊహించని ఉత్పాతాలు విరుచుకుపడుతుంటాయి. భూమిపై వాతావరణం సమతుల్యంగా ఉండడంలో గ్లేసియర్ల పాత్ర ఎంతో ఉంది. అంటార్కిటికా, ఆర్కిటికా మంచు ఖండాలపైనుంచి వస్తున్న శీతల గాలులే.. భూమిని నిత్యం చల్లబరుస్తున్నాయి. అయితే.. ఈ గ్లేసియర్లు క్రమంగా కరిగిపోతున్నాయి. మరో 25 సంవత్సరాల్లో ఆర్కిటికా మాయం కావచ్చన్నది పర్యావరణవేత్తల అంచనా. గ్లేసియర్లు కరగడం వల్ల ప్రధానంగా రెండు సమస్యలు ఏర్పడతాయి. మంచు కరిగి నీరుగా మారిపోవడం వల్ల.. సముద్రనీటిమట్టాలు పెరిగిపోతాయి. దీనివల్ల తీరప్రాంతాలు మునుగుతాయి. ముంబై, విశాఖ లాంటి నగరాలు.. వెనిస్‌లా మారిపోతాయి. సముద్ర మట్టం పెరగడం వల్ల ఇప్పటికే చాలా దేశాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. మరో తొంభై ఏళ్లలో మన పక్కనే ఉన్నమాల్దీవులు మాయం కానుంది. పశ్చిమబెంగాల్‌లోని సుందర్‌బన్‌లో ఇప్పటికే రెండు దీవులు సముద్రంలో మునిగిపోయాయి. తీరప్రాంతం ఎక్కువగా ఉన్న మనరాష్ట్రం గ్లోబల్‌వార్మింగ్ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండొచ్చు.
జీవనదులకు ప్రాణం పోసేది గ్లేసియర్లే. అలాంటి గ్లేసియర్లు కరిగిపోతే.. నదుల్లో నీటి ప్రవాహం ఉండదు. అంటే మంచినీటికి.. సాగునీటికి తీవ్రకొరత ఏర్పడుతుంది. గ్లేసియర్లు మాయం కావడం వల్ల వచ్చే రెండో సమస్య ఉష్ణోగ్రతలు పెరగడం. భూవాతావరణాన్ని చల్లబరిచే గాలులు ఆర్కిటికా నుంచి రావు కాబట్టి.. ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. మరో పదేళ్లలో నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. ఇప్పటికే దాదాపు 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను టెంపరేచర్ తాకుతోంది. ఇక 55 డిగ్రీలకు చేరిందంటే జీవించడం చాలా కష్టం. చాలాప్రాంతాలు ఎడారులుగా మారిపోతాయి.
కాలాలు మారిపోవడం... అనూహ్యంగా వర్షాలు కురవడం.. అనావృష్టి ఏర్పడడం.. ఇలా ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది గ్లోబల్ వార్మింగ్. ప్రపంచం నలుమూలలా పరిశ్రమల నుంచి విడుదలవుతున్న విషవాయుల పరిమాణం వాతావరణంలో పెరిగిపోతే.. ఆమ్ల వర్షాలు కూడా కురవొచ్చు. ఇలా ఏ రకంగా చూసుకున్నా.. గ్లోబల్ వార్మింగ్ మానవాళి పాలిట మహమ్మారిగానే చెప్పుకోవాలి. భూమి నాశనం కావడంలో దీనిపాత్రే ఎక్కువగా ఉండనుంది.

రెండో శత్రువు

నగరాలు..పట్టణాలు.. పల్లెలు.. ఎటూ చూసినా జనం. భూగోళం జనగోళంగా మారుతోంది. అంచనాలకు అందకుండా జనసంఖ్య పెరుగుతోంది. ఇదే ఇప్పుడు మహాప్రమాదాన్ని తెచ్చిపెట్టనుంది. పది శత్రువుల్లో రెండోది జనాభానే.
తాజా అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా.. దాదాపు 680 కోట్లు. 1960 నాటికి ఈ సంఖ్య కేవలం 300 కోట్లు మాత్రమే. అంటే.. యాభై ఏళ్లలోనే రెట్టింపు అయ్యింది. ఈ లెక్కన చూస్తే.. 2040 కల్లా ఈ సంఖ్య 900 కోట్లను దాటే అవకాశాలున్నాయి. వచ్చే ముప్పైఏళ్లలో 200 కోట్లకు పైగా జనాభా అదనంగా భూమిపై చేరతారన్నమాట. ఇలా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న జనాభా అన్ని దేశాలకు సమస్యాత్మకమే. జనాభా పరంగా అతిపెద్ద దేశాలైన చైనా, భారత్‌లకు ఎక్కువ ప్రమాదం ఉంది. వ్యవసాయక్షేత్రాలు క్రమంగా నివాసప్రాంతాలకు మారిపోతుండడంతో ఆహారధాన్యాల ఉత్పత్తి అనూహ్యంగా తగ్గిపోనుంది. ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది మొదటిదశ మాత్రమే. ఇప్పటికే మన దగ్గర ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇక క్రమంగా అందరికీ ఆహారం అందడం కష్టమవుతుంది. ఆకలిచావులు పెరుగుతాయి. అంతుచిక్కని రోగాలు విజృంభిస్తాయి. వీటన్నింటినీ తట్టుకోవడం చాలా కష్టం. ఇది ఏ ఒక్కదేశానికో పరిమితం కాదు.. అన్ని దేశాలకూ ఈ జనాభా పెరుగుదల ఊహించని ఉత్పాతాన్ని తెచ్చిపెట్టనుంది.

మూడోశత్రువు

ఇక మూడో శత్రువు అణుయుద్ధం. ఒకప్పటిలా ప్రపంచదేశాలన్నీ రెండు గ్రూపులుగా విడిపోయి యుద్ధం చేసుకునే పరిస్థితి అయితే లేదు కానీ.. వచ్చే యాభై ఏళ్లలో అణుయుద్ధం తప్పకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య విద్వేషాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వీటి మధ్య అణుయుద్ధం తప్పకపోవచ్చు. ఇదే సమయంలో ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య కూడా అణుయుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారత్ - పాకిస్తాన్‌ల గురించే. ఈ రెండు దాయాది దేశాల మధ్య కూడా భవిష్యత్తులో అణుయుద్ధం తప్పకపోవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సాధారణ యుద్ధాలతో పోల్చితే.. అణుయుద్ధాల తీవ్రత చాలా ఎక్కువ. ఒకచోట అణుబాంబు వేసినా.. దాని రేడియేషన్ ప్రభావం మొత్తం భూగోళాన్నే నాశనం చేస్తుంది. ఏ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగినా.. ప్రపంచమంతా నష్టపోవడం ఖాయం.


నాలుగో శత్రువు.. సైంటిఫిక్ జీవులు...
మనిషి ఆలోచలు పరిధులు దాటుతున్నాయి. సృష్టి రహస్య మూలాలను మరిచిపోయి.. ప్రతిసృష్టి చేయడానికి మనిషి తపిస్తున్నాడు. శతాబ్దాల నుంచి మరణాన్ని అధిగమించడానికి.. కొత్త జీవిని సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాడు. కృత్రిమ జన్యువును సృష్టించడంతో.. సృష్టి రహస్యాన్ని ఛేదించడం సులువుగానే కనిపిస్తోంది. శాస్త్రప్రయోగాలు ఇదే దిశలో ముందుకు సాగితే.. కృత్రిమ జీవులు ఈ భూమిపై పరుగులు తీస్తాయి. అయితే.. ఇలా తయారయ్యే కృత్రిమ జీవులే మనిషిని అంతం చేయవచ్చని శాస్త్ర ప్రపంచమే ఆందోళన చెందుతోంది.
అంతేకాదు.. ఇప్పుడు వచ్చేదంతా రోబో యుగం. శారీరక శ్రమను తగ్గించుకోవడానికి మనిషులు తయారు చేస్తున్న మరమనుషులు చరిత్ర గతిని మార్చేసే ప్రమాదం ఉంది. వచ్చే యాభై ఏళ్లలో సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే రోబోలను మనం తయారు చేసుకోగలం. సొంతగా ఆలోచించే పరిజ్ఞానం రోబోలకు వచ్చిందంటే.. అది మనిషిపై పెత్తనం చేయడానికే పూనుకొంటుంది. అదే జరిగితే.. ఈ ప్రపంచమంతా.. రోబోల చేతుల్లో చిక్కుకుపోతుంది. ఇలా సైంటిఫిక్ జీవుల నుంచి వచ్చే ప్రమాదాలను మనం కాదనలేం.

ఐదో శత్రువు ఏలియన్స్

భూమిపై తయారయ్యే జీవులే కాదు.. ఇతర గ్రహాల నుంచి వచ్చే జీవులూ భూమి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భూమికి ఉన్న ఐదో శత్రువు గ్రహాంతరవాసులు. ఈ సువిశాల రోదసీలో మనల్ని పోలిన.. లేదంటే.. మనల్ని మించిన బుద్ధి జీవులు ఉన్నాయన్నది శాస్త్రవేత్తల అంచనా. విశ్వంలో మనలాంటి జీవులను కనిపెట్టడానికి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే.. గ్రహాంతరవాసులపైన జరపుతున్న ప్రయోగాలు మంచికన్నా కీడు చేసే అవకాశాలే ఎక్కువే అంటున్నారు విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. ఈ భూమిపై ఏలియన్స్ దాడిచేసి మానవాళిని సమూలంగా నాశనం చేసే ప్రమాదం ఉందంటున్నారు.

ఆరో శత్రువు.. భారీ ఉల్క
ప్రతీ పదిలక్షల ఏళ్లకోమారు.. అతిపెద్ద ఉల్కలు భూమిని ఢీకొట్టవచ్చన్నది శాస్తవేత్తల అంచనా. భూమిపైన డైనోసార్లు అంతం కావడానికి ఇలాంటి ఉల్కాపాతమే కారణం కావచ్చన్నది ఎక్కువమంది అభిప్రాయం. 2036లో మళ్లీ ఓ భారీ ఉల్క భూమిని ఢీకొట్టవచ్చని ఖగోళపరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ఉల్క భూమి ఢీకొడితే.. భూమిపై పెను ఉత్పాతమే సంభవిస్తుంది. జీవరాశి నాశనం అవుతుంది. భూమి స్వరూపం కూడా మరిపోవచ్చు.

ఏడో శత్రువు సూర్యుడు

సమస్త జీవకోటికీ ప్రాణాధారం సూర్యుడు. భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిచ్చే వెలుగే.. జీవరాశి మనుగడకు ఆధారమవుతోంది. అయితే.. ఈ సూర్యుడే ఇప్పుడు భూమికి శత్రువు కాబోతున్నాడు. భూమికున్న ఏడో శత్రువు సౌరతుఫానులు.
నాసా తాజా అంచనాల ప్రకారం 2013లో సూర్యుడు మహాకల్లోలాన్ని సృష్టించనున్నాడు. నాలుగేళ్లుగా సుదీర్ఘ నిద్రలోఉన్న సూర్యుడు..ఇప్పుడు తన మొద్దునిద్రను వీడనున్నాడని నాసా పరిశోధనల్లో తేలింది. సూర్యుడిపై ఇటీవలికాలంలో లెక్కకుమిక్కిలిగా స్పాట్‌ల ఏర్పడుతున్నాయి. ఇవి వెదజల్లే సౌరజ్వాలల వల్ల రేడియో ధార్మిక తుఫాన్లు పుట్టుకొస్తాయి. వీటివల్ల సౌరమండలంలో ఎక్కువ నష్టపోయేది భూమండలమే. మన ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా పాడైపోతాయి. భూమంతా మాడి మసయ్యే ప్రమాదమూ ఉంది.

ఎనిమిదో శత్రువు అగ్నిపర్వతాలు
ఇక అగ్ని పర్వతాలు.. భూమికి ఎనిమిదో శత్రువు. ప్రతీ 50 వేల ఏళ్లకోసారి.. భారీ అగ్నిపర్వతాలు భూమికి ముప్పుతెస్తూనే ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం వచ్చే 70 ఏళ్లలో భారీ అగ్నిపర్వతం ఒకటి పేలవచ్చు. దీనివల్ల భూమిపై లావా ఎక్కువగా ప్రవహించి.. సల్ఫ్యూరిక్ యాసిడ్ పొరను ఏర్పరుస్తుంది. ఇంతకుముందు అగ్నిపర్వతాల వల్ల మానవాళికి పెద్దగా ప్రమాదం జరగకపోయినా.. ఇటీవల ఐస్‌లాండ్‌లో సంభవించిన పేలుడుతో యావత్ యూరప్ స్తంభించిపోయింది. గాలిలో ధూళిపేరుకుపోవడంతో.. ఎక్కడికక్కడ విమానాలు నిలిచిపోయాయి. అందుకే.. అగ్నిపర్వతాల వల్ల కూడా పెనుప్రమాదమే ఉంది.

తొమ్మిదో శత్రువు సునామీ

భూమికి పొంచిఉన్న శత్రువుల్లో సునామీది తొమ్మిదో స్థానం. 2004లో వచ్చిన సునామీలో ప్రపంచవ్యాప్తంగా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసారి విరుచుకుపడే సునామీ మరింత భీకరంగా ఉండనుంది. ఆఫ్రికా ఖండంలోని మడగాస్కర్ దీవుల నుంచి... ఆస్ట్రేలియా దాకా సునామీ వచ్చే అవకాశం ఉంది. ఇది రెండు ఖండాలకూ ప్రమాదకరమే.

పదో శత్రువు భూకంపం,తుఫాను

చివరిగా అయినా.. ప్రమాదకరమైన శత్రువు భూకంపం, తుఫానులు. తరచుగా వస్తున్న తుఫానులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. లక్షలాది ప్రాణాలను బలికొంటున్నాయి. వరదలు కూడా వినాశనంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇక భూకంపాల తీవ్రత కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. తరచుగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కసారి భూమికంపిస్తే చాలు.. ప్రపంచమంతా అల్లకల్లోలం కావడం ఖాయం.

Read more...
21, జూన్ 2010, సోమవారం

దొంగలబండి

0 comments

రైల్లో ప్రయాణించడం చాలా మందికి సరదా. సుధూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలును మించినది లేదన్నది చాలా మంది నమ్మకం. కానీ ఇప్పుడు ట్రైన్ పేరు చెబితేనే టెన్షన్ పడాల్సి వస్తోంది. తప్పక ట్రైన్స్‌లో వెళుతున్నా.. చివరి వరకూ బితుకు బితుకు మనాల్సి వస్తోంది..

ఆనందంగా మొదలయ్యే రైలు ప్రయాణం భయంతో ముగుస్తోంది. సంతోషానికి బదులు.. చికాకును, టెన్షన్‌ను కలిగిస్తోంది. సమయానికి ఇంటికి చేరాల్సిన వారు.. పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇదంతా.. కేవలం రైలు ప్రయాణం వల్లే. బస్సులో ఎక్కితే ప్రయాణించడం ఇబ్బందనుకుంటున్న జనానికి.. రైలు ప్రయాణం చేదు జ్ఞాపకాలనే మిగులుస్తోంది. అటు ధనాన్ని.. ఇటు సమయాన్ని హరిస్తోంది. చివరకు సుఖం లేకుండా చేస్తోంది.
ఇప్పుడు ట్రైన్ ప్రయాణం ఏమాత్రం సేఫ్ కాదు. ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణించే రైళ్లలో పరిస్థితి మరీదారుణం. ఎందుకంటే.. రైలుబళ్లు.. దొంగలబళ్లుగా మారిపోతున్నాయి. దోపిడీ దొంగల చేతుల్లో చిక్కుకుంటున్నాయి. అవును.. అత్యంత సులువుగా దొంగతనం చేయగలిగేవి మన రైళ్లు మాత్రమే. ఏ రైలుపైనైనా పడి .. ప్రయాణికుల సొత్తును క్షణాల్లో దోచుకుపోవచ్చు. అడ్డుకునే వాడూ.. ఎదురుతిరిగేవాడు.. పట్టుకునేవాడూ ఎవరూ ఉండరు. ఇదే దొంగలకు వరంలా మారింది. పైగా.. మన రైలును ఎవరైనా ఎక్కడైనా ఆపేయొచ్చు. స్టేషన్స్‌లోనే ఆగాల్సిన రైలు నిర్మానుష్య ప్రదేశాల్లో ఆగిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోగానే.. దొంగలు దూసుకువస్తారు. ఆడాళ్ల మెడలో గొలుసులు తెంపుకుపోతారు. ఇక ప్రయాణీకులు చేయగలిగింది.. ఏ స్టేషన్‌కో చేరుకుని ఫిర్యాదు చేయడమే..
అందుకే.. రైలు జర్నీ అంటే భయపడాల్సి వస్తోంది. పైగా భారీగా నగలతో, డబ్బుకట్టలతో వెళ్లేవారికి సురక్షితం కానే కాదు. మీరు ట్రైన్ దిగే సమయానికి అవి మీ దగ్గర ఉండకపోవచ్చు. మీరెళ్లేది దొంగలబళ్లు కావడమే అందుకు కారణం. ప్రతీ ట్రైన్‌లోనూ భద్రతా సిబ్బంది ఉంటారని అధికారులు చెప్పినప్పటికీ.. దొంగలొచ్చే సమయానికి మాత్రం ఎవరూ కనిపించరు. అందుకే.. ట్రైన్ జర్నీ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి..

పెరుగుతున్న దొంగతనాలు..
ఇటీవలికాలంలో రైళ్లలో దొంగతనాల సంఖ్య చాలా పెరిగిపోయింది. లక్షలాది రూపాయల ప్రజాధనం చోరుల పాలవుతోంది. తాజాగా.. ముంబై నుంచి విశాఖ వస్తున్న ఎల్టీ ఎక్స్‌ప్రెస్‌పై దొంగలు దాడి చేశారు. స్తంబల్పూర్ దగ్గర S-3 బోగీలో దోపిడీ చేశారు. దొంగలదాడిలో ప్రయాణీకులకు గాయాలు కూడా అయ్యాయి. ఇక రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలకు వస్తే.. అతిపెద్ద చోరీలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరిగాయి. జూన్ 17న ఒకేరోజు రెండు రైళ్లలో దోపిడీ జరిగింది. చైన్నై నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ట్రైన్‌ను గుంటూరు జిల్లా నడికుడి దాటిన తర్వాత దోచుకున్నారు. కేవలం పది నిమిషాల్లోనే దోపిడీ పూర్తయ్యింది. చెయిన్ లాగి ప్రయాణీకులను దోచుకున్న దొంగలు.. కాసేపట్లోనే మాయమయ్యారు.
నడికుడి నుంచి సికింద్రాబాద్ వచ్చే వరకూ చెన్నై ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులు భయంగానే గడపాల్సి వచ్చింది. సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత గానీ.. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయారు. ఇక నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన దోపిడీ కూడా ఇలాంటిదే. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌.. నల్గొండ జిల్లా విష్ణుపురం రైల్వేస్టేషన్‌లో ఆగినప్పుడు ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగలు దోచుకెళ్లారు. ఇదే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో జూన్ 11న కూడా చోరీ జరిగింది. గుంటూరు జిల్లా ధూళిపాల సమీపంలో దొంగలు ఈ ట్రైన్‌లో చొరబడి ఓ మహిళ నుంచి లక్షా యాభై వేల రూపాయల విలువైన నగలను దోచుకెళ్లారు. సికింద్రాబాద్ వస్తే తప్ప.. బాధితురాలు ఫిర్యాదు చేయడానికి అవకాశం చిక్కలేదు.
జూన్ 12 న సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళుతున్న సింహపురి ఎక్స్‌ప్రెస్‌లోనూ ఖమ్మం జిల్లాలో దొంగలు పడ్డారు. ఖమ్మం-మధిర మధ్య ట్రైన్‌ను ఆపి రాళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత ట్రైన్‌లో ఉన్నవారి నగలను దోచుకున్నారు. నాగర్ కోయిల్ నుంచి ముంబై వెళుతున్న ఓ ట్రైన్ ఇటీవలే.. పెనుగొండ రైల్వేస్టేషన్ వద్ద దోపిడీకి గురయ్యింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణీకుడిని దొంగలు దారుణంగా పొడిచి పారిపోయారు. ఇలాంటి దోపిడీలు నిత్యకృత్యం అయ్యాయి.

లాభాలపైనే దృష్టి

దేశం మొత్తంమీద రైల్వేశాఖకు భారీగా లాభాలు ఆర్జించుపెడుతోంది దక్షిణమధ్య రైల్వే. ప్రయాణీకులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణించేది కూడా సౌత్ సెంట్రల్ రైల్వేలోనే. భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ ప్రయాణీకుల భద్రతపై మాత్రం రైల్వే అధికారులు దృష్టిపెట్టడం లేదు. అరకొర సౌకర్యాలతోనే ట్రైన్స్‌ను పంపించివేస్తున్నారు. ప్రతీ కోచ్‌కూ రక్షణగా ఆర్పీఎఫ్ సిబ్బంది ఉండాల్సినప్పటికీ చాలా బోగీల్లో ఉండరు. కొన్నిసార్లైతే ట్రైన్ మొత్తానికి ఒకరు కూడా ఉండరు. ఇదేనా ప్రయాణీకులకు కల్పించాల్సిన భద్రత.
ఈ మధ్య వరసగా ట్రైన్స్‌లో దోపిడీలు జరుగుతున్నాయి. సాధారణంగా ఒక్క సంఘటన జరగగానే అధికారులు మేల్కొంటారు. మరోసారి అలాంటి దోపిడీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. మొద్దునిద్ర పోతున్న మన రైల్వేశాఖకు దోపిడీల సంగతే పట్టడం లేదు. అందుకే.. ముంబై నుంచి విశాఖకు వస్తున్న లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్‌లో కనీసం ఒక్క ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. సుధూర ప్రయాణాలు చేసే ఈ ట్రైన్‌లో ఏమాత్రం భద్రత లేదంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దోపిడీలు జరగగానే హడావిడి చేసే అధికార యంత్రాంగం.. క్రమంగా ఆ విషయాన్ని మర్చిపోతోంది.
నడికుడి-గుంటూరు మార్గంలో ఎక్కువగా దోపిడీలు జరుగుతున్నాయి. గత మూడు నెలల్లో 15 దొంగతనాలు జరిగాయి. అయినా.. ఈ రూట్‌లో ఎక్కడా సెక్యూరిటీని పటిష్టం చేయలేదు. పైగా మూడేళ్లుగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చోరీల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2008లో 454, 2009లో 601 దొంగతనాలు జరిగాయి. రాష్ట్రంలో ప్రధాన రైళ్లుగా భావించే నారాయణాద్రి, పద్మావతి, సింహపురి, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లలోనే దోపిడీలు జరగడంతో మిగిలిన ట్రైన్స్‌కూ దొంగలభయం ఉందంటున్నారు రైల్వే ప్రయాణీకులు.

మారుతున్న తీరు


బిస్కట్స్ ఇవ్వడం.. అంతా మత్తులో పడగానే చోరీ చేయడం పాతపద్దతి. అయినా.. ఇప్పటికీ ఎక్కువమంది దొంగలు దీన్నే ఫాలో అవుతున్నారు. ప్రయాణీకులను మాటల్లో పెట్టి.. మత్తుపదార్థాలు తినిపించి వారి సొమ్మును లూటీ చేస్తున్నారు. ఇక ప్రయాణీకులతోనే ఉంటూ.. వారికి తెలియకుండా చోరీ చేయడం రెండో పద్దతి.
అయితే.. ఇప్పుడు జరుగుతున్న చోరీలు ఈ రెండింటికి కాస్త భిన్నం. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలు అత్యంత పకడ్బందీగా తమ ప్లాన్‌ను అమలు చేస్తున్నాయి. అందరు ప్రయాణీకుల్లాగానే స్టేషన్‌లో రైలు ఎక్కే దొంగలు.. అర్థరాత్రి సమయంలో చైన్ లాగుతారు. ప్రయాణీకుల నగలు, డబ్బు దొచుకొని.. ట్రైన్‌లో నుంచి దూకేస్తారు. ఎవరైనా అడ్డం రావడానికి ప్రయత్నిస్తే.. మారణాయుధాలతో గాయపరుస్తారు. చాలావరకూ ఇలా ఎక్కుతున్న దొంగల వద్ద టికెట్లు ఉండవు. చాలాసార్లు ఆకతాయులు కూడా దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒకబోగీ నుంచి మరో బోగీకి మారుతూ.. జనాన్ని భయపెడుతున్నారు. అసలు రిజర్వ్‌డ్ బోగీల్లోకి కూడా టికెట్‌లేని ప్రయాణీకులు వస్తున్నారంటే.. అందుకు తప్పుపట్టాల్సింది ఎవరిని?
కాసుల కోసం కక్కుర్తి పడుతున్న టీటీలు, టికెట్ కన్‌ఫర్మ్ కాని వారిని కూడా రిజర్వ్‌డ్ బోగీల్లో ఎక్కించేస్తున్నారు. టికెట్ లేకుండా రిజర్వ్‌డ్ బోగీల్లో ఎక్కేవారినీ రైలు దింపడం టీటీలకు తెలియదు. ఇదే అన్ని సమస్యలకూ మూలం.
రైళ్లు ప్రయాణించే మార్గాల్లో చాలా ప్రాంతాల్లో తరచుగా దాడులు జరుగుతున్నాయి. రైలు రాగానే దుండగులు దానిపై రాళ్లవర్షం కురిపిస్తారు. ఒక్కసారిగా రాళ్లదాడికి కంగారుపడి ప్రయాణీకులు అరవగానే.. ఏం జరిగిందో అన్న అనుమానంతో ట్రైన్‌ను ఆపివేస్తారు. దీనికోసమే కాచుకుని ఉన్న దొంగలు ఒక్కసారిగా ట్రైన్‌పై పడి అందినంతా లాక్కెళతారు. ముంబై నుంచి వచ్చే ట్రైన్స్‌పై ఎక్కువగా ఈ తరహా దాడులే జరుగుతున్నాయి. ఇలా దాడులు జరుగుతున్న ప్రాంతాలు కొన్నే అయినా.. ఆ ప్రాంతాల్లో భద్రతపై రైల్వే శాఖ ఇంతవరకూ దృష్టి పెట్టలేదు.

బీహార్‌లో ఉన్నామా..


బీహార్‌లో ఎక్కువగా జరుగుతాయనుకునే రైలుదోపిడీలు ఇప్పుడు మన రాష్ట్రంలో సర్వసాధారణం అయిపోయాయి. వరసగా దొంగతనాలు జరుగుతున్నా.. ఒక్క కేసునూ ఛేదించకపోవడం.. దోపిడీలను అరికట్టలేకపోవడంతో రైల్వేశాఖ తీరుపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లూటీలు జరిగే రూట్‌లో కనీస పర్యవేక్షణ లేకపోవడాన్ని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు.
ప్రతీ స్టేషన్‌లోనూ భద్రత మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం దోపిడీలే అని ఊరుకుంటే.. రేపు హత్యలకూ దారితీసే ప్రమాదమూ ఉంది. ట్రైన్‌లోకి చొరబడే దొంగలు నగల కోసం ప్రాణాలు తీయడానికీ వెనుకాడకపోవచ్చు. మరి ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చాల్సిన బాధ్యత రైల్వేలకు లేదా..? అందుకే దోపిడీలు అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

జాగ్రత్తలు తప్పనిసరి
ప్రయాణం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవచ్చు. వీలైనంతవరకూ నగలు, డబ్బుతో ప్రయాణం చేయకండి. రాత్రిపూట ప్రయాణం చేస్తే.. కిటీకిలు వేయడం మరిచిపోకండి. బోగీ డోర్ కూడా వేసిఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక తోటి ప్రయాణీకులు ఇచ్చే ఆహార పదార్థాలను ఏమాత్రం తీసుకోకండి. ఒకవేళ ఎవరైనా దోపిడీకి పాల్పడుతుంటే.. అందరూ కలిసికట్టుగా ఎదుర్కోండి. అత్యవసరం అయితే తప్ప రాత్రిపూట చైన్ లాగకండి. ఎక్కడపడితే అక్కడ చైన్ లాగే విషయంలోనూ రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతీ కోచ్‌లోనూ రాత్రి పూట ఆర్పీఎప్ సిబ్బంది తిరిగేలా చూడాలి. ప్రమాదకర ప్రాంతాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రైన్ నిలపకూడదు. అంతేకాదు.. ఆ ప్రాంతాల్లో పోలీసులతో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండాలి. అప్పుడే ఈ దోపిడీలకు.. దొంగతనాలకు అడ్డుకట్ట పడుతుంది. పట్టీపట్టనట్లు రైల్వేశాఖ వ్యవహరిస్తు.. రైళుబళ్లు పూర్తిగా దొంగలబళ్లుగా మారిపోతాయి.

Read more...
19, జూన్ 2010, శనివారం

మాయల బజార్..

0 comments

తెలుగు సినీవినీలాకాశానికి మకుటంలాంటిది మాయాబజార్. అంతగొప్పగా మరో సినిమా తెలుగులో రాలేదు.. గ్రాఫిక్స్.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోయినా.. అత్యద్భుతంగా తెరకెక్కి.. అందరినీ సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది మాయాబజార్. ఒక్కమాటలో చెప్పాలంటే అందరినీ మాయ చేసేసింది. అయితే.. ఈ మాయల వెనుక రహస్యాలేమిటిన్నది ఇప్పుడు బయటపడింది..

లాహిరి..లాహిరి..లాహిరిలో అంటూ.. చల్లని వెన్నెలలో సాగే పాట మాయాబజార్ సినిమాకే కాదు.. తెలుగు సినిమాలన్నింటికీ హైలెట్. ఒకే పాటలో మూడు జంటలు కనిపించడమూ విశేషమే. ఈ పాటలో వెన్నెల కనిపించేంత అందంగా మరో సినిమాలో కనిపించలేదన్నది ఎంతోమంది మాట. అయితే.. ఇంత చల్లగా కనిపించే వెన్నెలను మిట్టమధ్యాహ్నం మండుటెండలో సృష్టించారు. అంతేకాదు.. టీవీలు తెలుగువారికి పరిచయం కాకముందే.. ఆ ఎఫెక్ట్‌నూ ఈ సినిమాలో చూపించారు. అదే ప్రియదర్శిని. శ్రీకృష్ణుడు ఇచ్చిన ప్రియదర్శినిని తెరవగానే నీవేనా నను పిలిచినదీ అంటూ శశిరేఖను అభిమన్యుడు పలకరించడమూ... ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇక మాయాబజార్‌లో కనిపించే మాయల సంగతైతే చెప్పనక్కరలేదు. కంప్యూటర్లు, గ్రాఫిక్స్ లేని యాభై ఏళ్ల కిందటే ఎన్నో అద్భుతాలను వెండితెరపై పండించిందీ సినిమా. అప్పటికీ ఇప్పటికీ అబ్బురమనిపించే సన్నివేశం.. ఘటోత్కచుడి వివాహభోజనం. రకరకాల వంటకాలతో ఉన్న ప్లేట్ల ముందు ఘటోత్కచుడి భారీ ఆకారాన్ని దాల్చడం.. నోరు తెరవగానే.. ఆహార పదార్థాలు గాల్లో తేలుకుంటూ వెళ్లడం.. రత్న గింబళి.. కర్రలు గాల్లో ఎగిరి వెళ్లి పండితులను కొట్టడం.. ఇలా ఎన్నో మాయలు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. అప్పట్లోనే ఈ సన్నివేశాన్ని ఎలా తీశారో ఎవరికీ అర్థం కాలేదు. డబుల్ ఎక్స్‌పోజర్ - మాస్క్ విధానంలో దీన్ని తీసినట్లు ఆ తర్వాతి కాలంలో కెమెరామెన్ బార్‌ట్లే చెప్పారు. సగ భాగానికి ఫార్వర్డ్ యాక్షన్, మిగతా సగానికి రివర్స్ యాక్షన్ ఇస్తే ఈ ఎఫెక్ట్ వస్తుందన్నారు. అయితే.. అలాంటి ఎఫెక్ట్‌ను మళ్లీ ఎవరూ తీయలేకపోయారు.. అదే బార్‌ట్లే ప్రతిభకు నిదర్శనం.
ఇక అభిమన్యుడు అడవిలోకి వెళ్లినప్పుడు కమ్ముకొచ్చే దావానలం పిక్చరైజేషన్ కూడా అద్భుతమే. అడవితో పాటు అభిమన్యుడి రథాన్ని.. దాన్ని చుట్టుముడుతున్న మంటలను ఒకేఫ్రేమ్‌లో చూపించడమూ అప్పట్లో సంచలనమే. అయితే.. ఇలాంటి అద్భుతాలను... మాయాబజార్ మాయలను.. సినిమాలోని రహస్యాలను విశ్లేషిస్తూ.. ఇప్పుడు ఓ పుస్తకం తెలుగవారందరికీ అందుబాటులోకి వచ్చింది. అలనాటి ఆణిముత్యం మాయాబజార్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు రచయిత రాంభట్ల నృసింహశర్మ.

స్టోరీ ఎక్కడిది?

సినిమా టైటిల్ మాయాబజార్ అయినా... కథంతా శశిరేఖా పరిణయమే. శశిరేఖగా మహానటి సావిత్రి అద్భుత నటన.. కృష్ణుడిగా ఎన్టీఆర్, అభిమన్యుడిగా అక్కినేని నటనాకౌశలం.. ఘటోత్కచుడిగా ఎస్వీ రంగారావు రాజసం మాయాబజార్‌కు ప్రాణం పోశాయనే చెప్పాలి. మాయాబజార్ చూస్తున్నంత సేపు.. క్యారెక్టర్లే కనిపిస్తాయి తప్ప.. అందులో నటీనటులు కాదు. అందుకే.. తెలుగు సినీ చరిత్రలో అజరామరంగా నిలిచిపోయింది మాయాబజార్.
శశిరేఖ పాత్ర అటు భారతంలో గానీ.. మరే ఇతిహాసాల్లోగానీ మనకు కనిపించదు. అసలు బలరాముడికి కూతురు ఉన్న విషయమూ ఎక్కడా ప్రస్తావనకు రాదు. పైగా.. శశిరేఖా పరిణయం మన దగ్గర ప్రాచుర్యం ఉన్న కథ కూడా కాదు. భారతం అందరికీ తెలిసినా... అభిమన్యుడి గురించి.. ఘటోత్కచుడి గురించి ఎక్కువగా తెలియదు కాబట్టి.. ఆ ఫాంటసీ క్యారెక్టర్లను ఆధారంగా చేసుకుని కథలు అల్లుకున్నారు మహారాష్ట్రలోని జానపదులు. అభిమన్యుడి ప్రేయసిగా.. వత్సల అనే పాత్రనూ ఈ జానపదులు సృష్టించారు. ఆ వత్సలే.. మన దగ్గర శశిరేఖ అయ్యిందన్న విషయం పరిశోధనలో తేలింది.
మరి మహారాష్ట్రలో పుట్టిన వత్సల మన దగ్గరకు ఎలా వచ్చింది.. మన దగ్గర శశిరేఖగా ఎలా మారింది..? దీనిపైనా పరిశోధన సాగింది. సన్నివేశాలను శశిరేఖా పరిణయం, తాళాంకనందనీ పరిణయం నుంచి తీసుకున్నప్పటికీ... మాయాబజార్ రచయత పింగళి నాగేంద్రరావు మూలకథను మాత్రం మహారాష్ట్ర జానపదం చిత్రకథ నుంచే తీసుకున్నారు. దానికి కారణం.. ఆయన మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందినవారే కావడమే.
అయితే.. మహారాష్ట్రకు చెందిన ఈ కథను మనకథే అన్నట్లుగా ఎలా మాయచేయగలిగారు. అచ్చ తెలుగు సంభాషణలు.. అద్బుతమైన పదప్రయోగాలు సినిమాలో ఎలా కనిపించాయి. దీనికి కారణం.. రచయిత పింగళి నాగేంద్రరావే. శశిరేఖాపరిణయం ఆధారంగా రాసిన రెండు గ్రంథాలు తెలుగులో అప్పటికే ఉన్నాయి. ఒకటి అప్పప్ప కవి విరచితమైన శశిరేఖాపరిణయం కాగా.. మరొకటి నరసింహాచారి రాసిన తాళాంకనందినీ పరిణయం. మాయాబజార్‌లో దాదాపు 27 సన్నివేశాలను... ఈ రెండు గ్రంథాల ఆధారంగానే తయారు చేశారంటున్నారు భజరే మయాబజార్ రచయత రాంభట్ల నృసింహశర్మ

మాయల బజార్..

మాయాబజార్ సినిమా తీసే విషయంలోనూ.. పాత్రలను తీర్చిదిద్దడంలోనూ డైరెక్టర్ కె.వి.రెడ్డి చాలా కష్టపడ్డారు. అయితే.. సినిమా కథలో ప్రధానాంశం శశిరేఖా పరిణయం కాబట్టి.. శశిరేఖకు ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చారు. శశిరేఖ ఊహాజనిత పాత్ర కాబట్టి.. ఊహాల పరిధిని మరింతగా పెంచారు. ఘటోత్కచుడు శశిరేఖగా మారడం.. గొంతుమార్చుకోవడానికి దృశ్యరూపం ఇచ్చి మాయాబజారులోకి అందరినీ తీసుకువెళ్లిపోయారు కేవీ రెడ్డి.
భారతంలోధుర్యోధనుడి తనయుడు లక్ష్మణకుమారుడు వీరుడు. కానీ, మాయాబజార్‌లో మాత్రం పిరికివాడుగా కనిపిస్తాడు. పేరే మాయాబజార్ కాబట్టి.. అసలు లక్షణాలను మాయం చేశారనుకోవచ్చు.
పుట్టినప్పటినుంచి కవచకుండలాలతో ఉండే కర్ణుడు ఈ సినిమాలో అవి లేకుండానే కనిపిస్తాడు. అంతేకాదు.. రాక్షసుడైన ఘటోత్కచుడు ఈ సినిమాతో తెలుగువారందరికీ ఆప్తుడిగా మారిపోయాడు. ఎంతో మంచివాడిగా మాయాబజార్‌లో కనిపిస్తాడు.
ఎన్టీఆర్‌ను శ్రీకృష్ణుడిగా నిలబెట్టింది కూడా మాయాబజారే. అన్ని పాత్రలకన్నా.. శ్రీకృష్ణ పాత్ర అలంకారం విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారు. శ్రీకృష్ణుడు ఏ కిరీటం ధరించాలన్నదానిపై పెద్ద కసరత్తే చేశారట. చివరకు విజయనగరంలో ఉండే కృష్ణ విగ్రహాన్ని చూసి, ఎన్టీఆర్‌కు కిరీటాన్ని తయారు చేశారు. దాని మహత్యమే కాబోలు.. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ అందరిమదిలోనూ నిలిచిపోయారు.
అభిమన్యుడు, శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ.. పాండవులు మాత్రం మాయాబజార్‌లో ఎక్కడా కనిపించరు. భారతానికి సంబంధించి పాండవులను మచ్చుకైనా చూపించని ఏకైక సినిమా కూడా మాయాబజారే కాబోలు. చివరకు సినిమా ముగింపులోనూ.. మాయాబజార్ ప్రత్యేకతే వేరు. సాధారణంగా హీరో హీరోయిన్ల మీద శుభం కార్డు వేయడం పరిపాటి. కానీ.. ఈ సినిమాలో మాత్రం హిడింబిగా నటించిన సూర్యకాంతంపైకి కెమెరా ఫోకస్ అవడంతో సినిమా అయిపోతుంది.. ఇది కూడా మాయాబజార్ ప్రత్యేకతే..

మాయాబజార్‌ ఘన విజయానికి సినిమా కథ ఓ కారణమైతే.. అందులో ఎన్నో మాయలను సృష్టించడమూ మరో కారణం. మాయాబజార్ విషయంలో ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చింది భజరే మాయాబజార్. పిక్చరైజేషన్ జరిగిన తీరుతో పాటు.. ఒక్కో క్యారెక్టర్‌ను ఎలా మలిచారు.. ఎందుకు మలిచారన్నదీ విశ్లేషిస్తుందీ పుస్తకం. అసలు మాయాబజార్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అపురూప కళాఖండంగా ఎందుకు నిలిచిపోయిందన్నది తెలుసుకోవాలంటే.. ఈ పుస్తకం చదవాల్సిందే.
Read more...
17, జూన్ 2010, గురువారం

ఎవరు విలన్?

11 comments

విలన్.. పేరే భయపెడుతుంది. కానీ.. ఇదే పేరుతో ఆల్‌టైం గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తీసిన సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి.. అందులోనూ అందాలరాశి ఐశ్వర్య కూడా నటిస్తుండడంతో.. అభిమానులు ఆతృతంగా సినిమాకోసం ఎదురుచూస్తున్నారు.. ఇంతకీ సినిమాలో విలన్ ఎవరు? ప్రధాన పాత్రలో కనిపించే విక్రమా.. పోలీస్ గెటప్‌లో ఉండే పృథ్వీరాజా?
దక్షిణాది క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం మరో ప్రయోగం చేశాడు. రామాయణం స్పూర్తిగా తీసుకొని విలన్ సినిమాను సిద్ధం చేశాడు. అది కూడా తమిళ్,తెలుగు, హిందీ మూడు భాషల్లో ఒకేసారి విడుదలవుతోంది. హిందీలో రావణ్‌గా.. తమిళ్‌లో రావణన్ గా.. తెలుగు విలన్‌గా పేర్లు మార్చుకొని థియేటర్లలోకి వస్తోంది.
విలన్ సినిమాలో అట్రాక్షన్ అంతా.. విక్రమ్, ఐశ్వర్యలే. సినిమా కథంతా ఈ రెండు క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతుంది. సినిమా టైటిల్ రోల్‌ ఎవరు పోషించారన్నది మణిరత్నం బయటపెట్టకపోయినా.. విక్రమ్ రోలే కావచ్చన్నది అందరి అంచనా. సినిమాలో వీరయ్య పాత్రను విక్రమ్ పోషించాడు. రాగిణి శర్మ పాత్రలో ఐశ్వర్య కనిపిస్తుంది. అడవిలో వీరిద్దరూ ఎందుకున్నారన్నదే సినిమా స్టోరీ..
ఇప్పటికే టీవీల్లో సందడి చేస్తున్న ట్రైలర్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. లొకేషన్లు.. ఐశ్వర్య, విక్రమ్‌ల గెటప్... వీరిద్దరి మధ్య సినిమాపై క్రేజ్‌ను పెంచుతున్నాయి. దట్టమైన అడవులు.. భీకరంగా కనిపిస్తున్న విక్రమ్ వేషధారణ.. సినిమాలన్నింటిలోకి ఇది కాస్త డిఫరెంట్ మూవీ అని చెప్పకనే చెబుతున్నాయి.


ఈ సినిమా కాస్త డిఫరెంట్..

విలన్ సినిమాను అన్ని సినిమాలతో పాటే ఒకే గాటన కట్టేయలేం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ కొత్త ప్రయోగంగా తెరకెక్కిందీ చిత్రం. తమిళ్,హిందీల్లో స్ట్రెయిట్ ఫిల్మ్‌గా షూటింగ్ జరుపుకొంది. కథ, కథాంశం.. షూటింగ్ లొకేషన్లు.. రెండు భాషల్లోనూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటాయి. కానీ.. ఆర్టిస్టులు మాత్రం రెండు భాషల్లోనూ మారిపోయారు. తమిళ్ నటించిన వారు.. హిందీలో కనిపించరు. ప్రాంతానికి తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసుకున్నారు మణి. తమిళ్‌లో లీడ్ రోల్‌ను విక్రమ్ పోషిస్తే.. హిందీలో ఆ పాత్రలో మనకు కనిపించేది అభిషేక్ బచ్చన్.
ఇక తెలుగులో పోషించిన పాత్రకు పూర్తిగా యాంటీరోల్‌లో హిందీలో కనిపిస్తాడు విక్రమ్. ఒకే కథకు సంబంధించిన సినిమాలైనప్పటికీ.. రెండు వెరైటీ క్యారెక్టర్లు పోషించే అవకాశం విక్రమ్‌కు దక్కింది. అదికూడా మణిరత్నంలాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో.. ఇలా రెండు విలక్షణ పాత్రలు చేయడం అరుదైన అవకాశమే. పైగా.. ఇలా ఒకే సినిమాలో వేరు వేరు భాషల్లో వేరు వేరు క్యారెక్టర్లు పోషించినవారు ఇప్పటివరకూ లేరనే చెప్పాలి.
తెలుగు, తమిళ్, హిందీల్లో ఒకే పాత్రలో కనిపిస్తుంది ఐశ్వర్య. అటు అభిషేక్‌తోనూ.. ఇటు విక్రమ్‌తోనూ ఒకే తరహాలో నటించి మంచిమార్కులు కొట్టేసింది. ముఖ్యంగా.. సీన్లకు తగ్గట్లుగా ధీరత్వం.. అమాయకత్వం.. బెదురుతనం.. ఇలా అన్ని ఫీలింగ్స్‌ను అత్యద్భుతంగా పలికించింది.
హిందీలో రావణ్‌గా.. తెలుగులో విలన్‌గా వస్తున్న ఈ సినిమా కోసం.. మణిరత్నం చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు మూడేళ్లపాటు పనిచేశారు. సినిమా ఆకట్టుకునేలా ఉండడానికి చాలావరకూ షూటింగ్‌ను కర్నాటకలోని దట్టమైన అడవుల్లో తీశారు. నెలల తరబడి.. అడవుల్లోనే గడిపారు. మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ.. దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేశారు. తమిళ్‌లో విక్రమ్ పోషించిన పాత్రను హిందీలో అభిషేక్ పోషించాడు కాబట్టి.. ఈ రెండు క్యారెక్టర్లను కంపేర్ చేయడం సహజమే. మరి వీరిద్దరిలో పాత్రకు ఎవరు ఎక్కువగా న్యాయం చేశారన్నది తెరపై చూడాల్సిందే.

విలన్‌లో ఏముంది?

రామాయణానికి.. విలన్ సినిమాకు సంబంధం ఉందా?
సినిమా స్టోరీ రామాయణానికి సంబంధించిందేనా?
విలన్ సినిమాలో విలన్ ఎవరు?
విలన్ సినిమా కాస్త డిఫరెంట్‌గానే ఉండనుంది. సినిమా స్టోరీ గురించి తెలుసుకునేముందు క్యారెక్టర్ల గురించి తెలుసుకోవాలి. సినిమాలో ప్రధాన పాత్ర వీరయ్య. ఈ క్యారెక్టర్‌లో విక్రమ్ నటించారు. ఈయనకో చెల్లెలు ఉంటుంది. ఆమే ప్రియమణి. ఇక క్లాసికల్ డ్యాన్సర్‌ రాగిణిగా ఐశ్వర్య కనిపిస్తుంది. ఐశ్వర్య భర్త దేవ్ పాత్రలో తమిళ్ హీరో పృథ్వీరాజ్ నటించారు. సినిమా కథలో ఈ నాలుగు క్యారెక్టర్లే కీలకం.
రాగిణితో సినిమా మొదలవుతుంది. రాగిణి డ్యాన్స్ చూసిన పోలీస్ ఆఫీసర్ దేవ్.. ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లిచేసుకుంటారు. లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న తరుణంలో దట్టమైన అటవీ ప్రాంతంలోకి దేవ్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అయితే.. అక్కడికి వెళ్లిన తర్వాత.. ఓ వాస్తవం ఈ పోలీస్ ఆఫీసర్‌కు బోధపడుతుంది. గిరిజనులకు సంబంధించి చట్టం,న్యాయం పూర్తిగా వీరయ్య అనే వ్యక్తి చేతుల్లోనే ఉన్నట్లు తెలుసుకుంటాడు దేవ్. వీరయ్య చెప్పిందే అక్కడ వేదం. పోలీస్ చట్టం అమలు కావాలంటే.. వీరయ్య ఉండకూడదనుకుంటాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్యా శతృత్వం పెరుగుతుంది. ఓ సారి ఇద్దరూ గొడవపడతారు. అప్పుడు గాయపడ్డ వీరయ్య.. రాగిణిని కిడ్నాప్ చేసి అడవిలోకి పారిపోతాడు. అక్కడి నుంచి కథ రకరకాల మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా.. రాగిణి, వీరయ్యల మనస్తత్వాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.
తెరపై ఎక్కువగా వీరయ్య, రాగిణి పాత్రలే కనిపిస్తాయి. ముందు విలన్‌గా వీరయ్యను చూసిన రాగిణి.. చివరకు మనసు మార్చుకుంటుందా.. లేక వీరయ్య చివరి వరకూ విలన్‌గానే ఉంటాడా? సినిమా అంతా కూడా రాగిణి దృష్టి నుంచే కనిపిస్తుందని ఇప్పటికే ప్రకటించాడు డైరెక్టర్ మణిరత్నం. అందాలబొమ్మ ఐశ్వర్యకూ కెరీర్‌లో ఇది డిఫరెంట్ రోల్ అనే చెప్పాలి.
ఇక హిందీ, తమిళ్‌లో సినిమా పేరు రావణ్ కాబట్టి.. రామాయణానికి ఈ సినిమాకు ఎంతోకొంత లింకు ఉంటుందని భావించడం సహజమే. అయితే.. ఇక్కడ రాముడెవరు? రావణుడెవరు? విక్రమా? పృథ్వీరాజా? ... రావణుడు సీతను ఎత్తుకెళ్లాడు కాబట్టి వీరయ్య పాత్రనే రావణుడు అనుకోవాల్సి ఉంటుంది. అయితే.. రావణుడిలా విక్రమ్‌ది నెగిటివ్ రోల్ కాదనే చెప్పొచ్చు. మరొకరి భార్యను కిడ్నాప్ చేశాడు కాబట్టే.. ఈ టైటిల్‌ను క్రియేటివ్‌గా పెట్టి ఉండొచ్చు. అయితే.. పోలీస్ ఆఫీసర్ భార్యను కిడ్నాప్ చేయడం ద్వారా.. వీరయ్య సాధించాలనుకున్నది ఏమిటి? చివరకు.. వీరయ్య చనిపోతాడా లేదా అన్నదీ సస్పెన్సే.

స్పెషల్ ట్రీట్‌మెంట్..
తమిళంలో ఓ సినిమా తీసి హిందీ, తెలుగులోకో.. హిందీలో సినిమా షూట్ చేసి తెలుగు, తమిళ్‌లోకో డబ్ చేసి చేతులు దులుపుకోలేదు మణిరత్నం. రావణ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. హిందీకి ప్రత్యేకంగా.. తమిళ్‌కి ప్రత్యేకంగా ఆర్టిస్టులను ఎంచుకున్నారు. దీనికి ప్రధాన కారణం.. రెండు చోట్లా సినిమాకు క్రేజ్ తేవడంతో పాటు.. ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు రాబట్టుకోవచ్చన్న వ్యూహం ఉంది. అందుకే ప్రధాన పాత్రలకు సంబంధించి ఆర్టిస్టుల మార్చారు. ఓ రకంగా చెప్పాలంటే.. ఒకేసారి రెండు సినిమాలను తీశారు మణిరత్నం.
మణిరత్నం చేసిన ఈ ప్రయోగం వల్ల.. తక్కువ ఖర్చుతో రెండు సినిమాలు పూర్తయ్యాయి. లొకేషన్లు.. షూటింగ్ ఖర్చులు చాలావరకూ కలిసొచ్చాయి. హిందీ, తమిళ్ వరకూ డబ్బింగ్ మూవీ అన్న ఫీల్ రాదు. పైగా.. ఇటు తమిళ్‌కు, అటు హిందీకి ఇటీవలి కాలంలో ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా పెరిగంది. సినిమాలో ఒరిజినాలిటీ లేకపోతే.. కలెక్షన్లు రావడం చాలా కష్టం. ఈ విషయం గురు సినిమాతో మణిరత్నానికి అర్థమయ్యింది. తమిళంలోనూ, తెలగులోనూ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే.. రావణ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. హిందీకి వేరుగా.. తమిళ్‌కు వేరుగా షూటింగ్ చేశారు. దీనివల్ల దేశమంతటా రావణ్‌కు స్పెషల్ క్రేజ్ వచ్చింది.
ఇక సినిమా నిర్మాణంలోనే రిలయన్స్ బిగ్ పిక్చర్స్‌తో టైఅప్ అయ్యి.. ఆర్థికభారాన్ని తగ్గించుకున్న మణిరత్నం.. రిలీజ్ విషయంలోనూ వ్యూహత్మకంగానే వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2200 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఇండియాలో హిందీ వెర్షన్ 1250 స్కీన్స్‌లో ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరగ్గా.. ఓవర్‌సీస్‌లో 325 స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇండియాలో తమిళ వెర్షన్‌ను 225 స్క్రీన్స్‌లోనూ, ఓవర్‌సీస్‌లో 150 స్క్రీన్స్‌లోనూ రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ.. 215 స్క్రీన్స్‌లో విలన్ విడుదలవుతోంది. అమెరికా, ఆస్ట్ర్లేలియా, న్యూజిలాండ్‌లో 25 స్క్రీన్స్‌లోనూ విలన్‌ను ప్రదర్శిస్తున్నారు. ఎంతలేదన్నా మూడువందల కోట్లను రావణ్ వసూలు చేయవచ్చని అంచనా. సినిమా స్టోరీ విషయంలోనూ.. షూటింగ్ విషయంలోనూ ఎంతో సీక్రెట్ మెయింటైన్ చేసిన మణిరత్నం.. సస్పెన్స్ అంతా తెరపైనే విప్పుతామంటున్నారు. మరి.. మణిమంత్రానికి కాసులు రాలతాయా..?

తెలుగంటే అలుసా..?

కోట్లాది రూపాయల బడ్జెట్.. విలక్షణమైన స్టోరీ.. ఎంతోమంది స్టార్లు.. అయినా.. సినిమాలో యాక్ట్ చేయించడానికి మణిరత్నానికి తెలుగువారు ఒక్కరూ కనిపించలేదు. కాసుల కోసం.. తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ తరహాలో విలన్‌ను రిలీజ్ చేస్తున్న మద్రాస్ టాకీస్.. ఆర్టిస్టుల విషయంలో మాత్రం మనవారికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలుగులో నటిస్తున్న ప్రియమణిని.. అడపాదడపా డబ్బింగ్ సినిమాలతో అలరిస్తున్న విక్రమ్‌నే.. తెలుగువారికి ప్రతినిధులన్న బిల్డప్ ఇస్తున్నారు మద్రాస్ టాకీస్ ఓనర్స్ మణిరత్నం, సుహాసిని..
తమిళ్ కోసం ప్రత్యేకంగా, హిందీ కోసం ప్రత్యేకంగా ఎంతో కేర్ తీసుకుని షూటింగ్ చేసిన మణిరత్నం తెలుగువారికి అవసరమైన ఎలిమెంట్లు మాత్రం ఒక్కటీ సినిమాలో పెట్టలేదు. తమిళంలో ఎడిట్ అయిన వెర్షన్‌కు భాష మార్చి తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగువారంటే.. తమిళులకు అంత అలుసా..?
మ్యూజిక్ మొఘల్ ఏ.ఆర్.రెహమాన్‌ ఈ సినిమాకు కంపోజ్ చేసినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గ ఒక్కపాటా లేదు. పైగా.. చైన్నైలోనూ.. ముంబైలోను ఆడియో ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించిన మణిరత్నం.. తెలుగులోకి మాత్రం సైలెంట్‌గా ఆడియోను పంప్ చేశారు. అసలు విలన్ ఆడియో ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ఎవరికీ తెలియదు. ఇక పాటలుకూడా.. అన్ని డబ్బింగ్ సినిమాల్లానే.. తమిళవాసనలు కొడుతున్నాయి.
సినిమా ప్రచారం చేయడానికి మాత్రం హైదరాబాద్‌కు వచ్చారు ఐశ్వర్య, విక్రమ్, మణిరత్నం, సుహాసిని. ప్రియమణి కూడా వారితో జతకలిసింది. ప్రెస్‌మీట్ అరేంజ్ చేసినా.. కంట్రోల్ అంతా సుహాసినీ చేతుల మీదుగానే సాగింది. ప్రశ్నలూ ఆమే అడిగింది.. జవాబులూ ఆమే చెప్పించింది. మొహమాటానికన్నట్లు చివర్లో ఎంతో కరుణించినట్లు ఓ రెండు ప్రశ్నలను అడగడానికి మీడియాకు ఛాన్స్ ఇచ్చింది. ఆమాత్రం దానికి.. హైదరాబాద్ దాకా రావాలా..? ప్రియమణికైతే అసలు మాట్లాడే ఛాన్సే ఇవ్వలేదు. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పమంటూ ఆర్డరేసింది. మణిరత్నాన్ని గౌరవించి ప్రియమణి ఆన్సర్ చెప్పినా.. కూల్‌గా ఉండమంటూ సుహాసినికీ సలహా ఇచ్చిందంటే ఆమె ఎంత ఓవర్ చేసిందే అర్థం చేసుకోవచ్చు.

మొత్తంమీద చూస్తే.. విలన్ సినిమాలో విలన్ ఎవరో గానీ.. తెలుగువారి పాలిట విలన్ మాత్రం కచ్చితంగా మణిరత్నమే. గొప్ప డైరెక్టర్ అని మనం మురిసిపోవడమే తప్ప.. మంచి ప్రేక్షకులను మన తెలుగువారికి ఆయన విలువ ఇచ్చింది లేదు.
Read more...
15, జూన్ 2010, మంగళవారం

బెజవాడ బూచోళ్లు..

2 comments

బూచాడంటే చిన్నపిల్లలకు భయం. మారాం చేసినా.. అన్నం తినకపోయినా బూచాడొస్తాడంటూ.. పిల్లలను భయపెట్టడం సహజం. కానీ బెజవాడ బూచాళ్లంటే మాత్రం.. పిల్లలకే కాదు పెద్దలకూ భయమే. వారు దౌర్జన్యం చేసినా.. కబ్జా చేసినా.. చివరకు మర్డర్లు చేసినా.. జనం నోరు మూసుకునే ఉంటారు తప్ప.. ఎదురించరు. కొన్నాళ్లుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బెజవాడ పెద్ద బూచి దేవినేని నెహ్రూకు.. ఇప్పుడు మరో బూచి ఎదురొచ్చి నిలిచింది. అదే.. వల్లభనేని వంశీ. ఈ ఇద్దరు బూచాళ్లతో.. బెజవాడ బితుకుబితుకమంటోంది..
విజయవాడ వెనక్కి పోతోందా?
రౌడీ రాజకీయాలకు వేదికవుతోందా?
దాడులు ప్రతిదాడులు జరగబోతున్నాయా..?
మళ్లీ నెత్తుటేర్లు పారనున్నాయా?
బెజవాడ భయపడుతోంది. ఇద్దరి మధ్య జరుగుతున్న పోరాటాన్ని చూస్తూ.. వణుకుతోంది. ఎవరిపై ఎవరు దాడులు చేస్తారో అని కలవరపడుతోంది. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో చాపకింద నీరులా విస్తరించిన పగలు..ప్రతీకారాలు.. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. మూడు దశాబ్దాల క్రితం నాటి ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ గుర్తుకుతెస్తున్నాయి..
ఇంత అలజడికి కారణం కేవలం ఇద్దరు వ్యక్తులు. ఒకరు.. కంకిపాడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, మరొకరు విజయవాడ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలైన వల్లభనేని వంశీ మోహన్. ఒకరిది కాంగ్రెస్ పార్టీ అయితే.. మరొకరిది తెలుగుదేశం పార్టీ. వీర్దదరి మధ్యా సాగుతున్న పోటీ.. ఇప్పుడు బెజవాడ పాలిట శాపంగా మారింది. వర్గాల పేరుతో కుమ్ములాటకు బీజం వేసింది.
ఇటు నెహ్రూ.. అటు వంశీ విజయవాడపై ఆధిపత్యం కోసం పావులు కదుపుతుండడం సమస్యలు సృష్టిస్తోంది. సామాన్యుడికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎంతోకాలంగా కొనసాగుతున్న నెహ్రూ హవాకు.. చెక్ చెప్పడానికి వంశీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సహజంగానే ఇది దేవినేని వర్గాన్ని ఇది రెచ్చగొడుతోంది. ఈ ఇద్దరి ఆధిపత్య పోరు ఇప్పుడు శృతిమించింది. ఒకరిపై మరొకరు నేరుగా మాటలయుద్ధం చేసుకునే దాకా వచ్చింది.

పోటాపోటీ
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కొట్టాడని ఆరోపిస్తూ.. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌పై వల్లభనేని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి అసలైన బెజవాడ రౌడీరాజకీయం తెరపైకి వచ్చింది. వంశీ, నెహ్రూలు ఒకరిపై ఒకరు నేరుగా విమర్శలు చేసుకుని వాతావరణాన్నిమరింత వేడెక్కించారు. వీరిద్దరి మాటలతోనే వివాదం సద్దుమణుగలేదు సరికదా.. రోజురోజుకూ పెరిగిపెద్దదవుతోంది. ఇప్పుడు రెండోస్థాయి నేతలు పోట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రెండువర్గాల నేతలూ ఎదురూ బొదురూ పడితే కొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఒకవర్గంపై మరో వర్గం విమర్శల విల్లు ఎక్కుపెట్టింది.
నెహ్రూ, వంశీల మధ్య వ్యక్తిగతంగానే వివాదం మొదలైనా.. క్రమంగా పార్టీల మధ్య పోరుగా మారిపోతోంది. టీడీపీ కార్పొరేటర్లు.. కాంగ్రెస్ కార్పొరేటర్లు.. ఎవరికి వారే పోటాపోటీగా ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. ఎదుటి వర్గంపై విరుచుకుపడుతున్నారు. టీడీపీ కార్పొరేటర్లకు నెహ్రూ టార్గెట్ అయితే.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వంశీ టార్గెట్.
ఇక కార్పొరేటర్లు భాష విషయంలోనూ తమ నేతలనే ఫాలో అవుతున్నారు. ఎంత ఘాటుగా మాట్లాడితే అంత గొప్పవాళ్లమని ఫీలవుతున్న పొలిటికల్ లీడర్లు.... ప్రజలకు నేతలమన్న విషయాన్ని మరిచిపోతున్నారు. పక్కా రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. జనాన్ని బెదరగొడుతున్నారు.వంశీ, నెహ్రూల మధ్య గొడవగానే చాలామంది దీన్ని భావిస్తున్నప్పటికీ.. ఇది బెజవాడ మొత్తానికి పాకిపోయేలా ఉంది. మళ్లీ వర్గపోరు మొదలవుతుందేమోనన్న అనుమానాలనూ కలిగిస్తోంది.

గొడవెందుకు?

వంశీకి.. నెహ్రూకు మధ్య వివాదం రావడానికి అసలు కారణం ఏమిటి? దీనికి గతంలో జరిగిన సంఘటలనూ.. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలూ రెండూ కారణమే. విజయవాడలో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి పావులు కదుపుతుండడంతోనే.. అసలు సమస్య మొదలయ్యింది.
వర్గపోరుకు శాశ్వత చిరునామా విజయవాడ. దశాబ్దాల తరబడి ఏదో రకంగా వర్గాల మధ్య పోరాటం సాగుతూనే ఉంది. అది రాజకీయాలకూ విస్తరించి.. రౌడీరాజకీయాన్ని సృష్టించింది. ఆ రౌడీరాజకీయానికి ఎవరు లీడర్ కావాలన్నదే తాజా గొడవకు అసలు కారణం.
బెజవాడ రాజకీయాల్లో ఎప్పటినుంచో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు దేవినేని నెహ్రూ. ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా.. బెజవాడలో తన పట్టు తప్పకుండా చూసుకుంటున్నారు. తన ఇలాకాలో తాను చెప్పిందే వేదం అన్నట్లుగా నడిపించారు. వంగవీటి రంగా మరణం తర్వాత.. నెహ్రూకు అడ్డులేకుండా పోయింది. రాజకీయంగా ఢీ అంటే ఢీ అన్నా.. వ్యక్తిగతంగా నెహ్రూతో పూర్తిస్థాయిలో తలపడ్డ నేతలూ ఈ మధ్య కాలంలో ఎవరూ లేరు. రంగా తనయుడు రాధాకృష్ణ కొంతకాలం హడావిడి చేసినా.. ఆయనకూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ.. వల్లభనేని వంశీ ప్రవేశంతో పరిస్థితి మారింది. గన్నవరం నుంచి టీడీపీ రాజకీయాల్లోకి వచ్చిన వల్లభనేని వంశీ విజయవాడ అర్భన్ అధ్యక్ష పదవిని అందుకునే దాకా ఎదిగారు. పార్టీపై పట్టుకోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్న వంశీ... అందుకు నెహ్రూను ఢీకొట్టడమే మార్గం అనుకున్నారు. వీరిద్దరిమధ్యా ఎన్నికల సమయంలోనే కోల్డ్‌వార్ మొదలైనప్పటికీ.. ప్రత్యక్షంగా నెహ్రూను దెబ్బకొట్టే అవకాశం ఇటీవలే వచ్చింది. ఓ దాడి కేసులో నెహ్రూ కొడుకుపైనే కేసు పెట్టించి.. టీడీపీ వర్గాల్లో తన ప్రతిష్టను పెంచుకున్నారు వల్లభనేని వంశీ.
నెహ్రూను ఢీ కొంటే వంశీకి వచ్చేదేమిటి? వాస్తవానికి నెహ్రూ, వంశీ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. విజయవాడలోని అదే సామాజిక వర్గంపై నెహ్రూకు మంచి పట్టుంది. అదే సమయంలో నెహ్రూ అంటే చాలామందికి భయమూ ఉంది. నెహ్రూ ఎదిరించి బతకడం కష్టమన్న అభిప్రాయమూ జనంలో ఉంది. అందుకే టీడీపీకి మద్దతిచ్చేవారు కూడా.. నెహ్రూకు వ్యతిరేకంగా పనిచేయడానికి పెద్దగా సిద్ధపడరు. ఇటీవల ఎన్నికలతోనే విజయవాడలోకి ఎంటరైన వంశీకి.. ఈ వర్గంపై పట్టుసాధించడం అత్యవసరం. భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలంటే నెహ్రూ ఆధిపత్యాన్ని తగ్గించి.. తన పట్టు పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకే.. ప్రతీ విషయంలోనూ నెహ్రూను వీలైనంతగా ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. మద్యం టెండర్ల విషయంలోనూ నెహ్రూ వర్గాన్ని వంశీ వర్గం ఢీకొంది. నెహ్రూ సోదరుడు నిర్వహించే బార్లు, మద్యం షాపులకు ఇంతవరకూ ఎవరూ పోటీగా టెండర్లు వేసేవారు కాదు. కానీ.. ఈ సారిమాత్రం వంశీ వర్గం వాటిపై కన్నేసింది. దీంతో.. ఎక్కువమొత్తం చెల్లించి వాటిని నెహ్రూ సోదరుడు బాజీప్రసాద్ దక్కించుకోవాల్సి వచ్చింది. టెండర్ల తెరిచే సమయంలోనూ ఇరువర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణ జరిగింది. అప్పటి నుంచీ రెండు వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఇక నేరుగా తన కొడుకుపైనే కేసు పెట్టడంతో వంశీని టార్గెట్ చేసుకోక తప్పదని గ్రహించారు నెహ్రూ. ఎన్నికల తర్వాత.. టీడీపీ కార్యకర్తలపై తరచుగా నెహ్రూ అనుచరులు దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే నెహ్రూకు భయపడి ఎవరూ పెద్దగా ఫిర్యాదు చేయడం లేదు. సరిగ్గా ఇలాంటి వారినే తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు వంశీ.
రాజకీయాల్లో బలం ఉన్నవాడిదే రాజ్యం. నెహ్రూకు అర్థబలం.. అంగబలం రెండూ ఉన్నాయి. వంశీకి అర్థం బలం ఉంది.. ఇప్పుడు పెంచుకోవాల్సింది అంగబలమే. అందుకే.. నెహ్రూను ఢీకొట్టడం ద్వారా... ఆయనకు ప్రత్యామ్నయంగా ఎదగాలనుకొంటున్నారు. కృష్ణాజిల్లాలో టీడీపీ బలంగానే ఉన్నప్పటికీ విజయవాడలో మాత్రం కాస్త బలహీనంగా ఉంది. దానికి కారణం రౌడీ రాజకీయమే. నెహ్రూ నియోజకవర్గంలో టీడీపీ తరపున కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. త్వరలోనే వస్తున్న కార్పొరేషన్ ఎన్నికలు.. వంశీ ప్రతిష్టకు సవాల్‌గా మారాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ సీట్లను గెలుచుకోవాలంటే.. ఇప్పటి నుంచే నెహ్రూను ఎదుర్కోక తప్పదు. అదే.. వీరిద్దరి మధ్యా గొడవకు అసలు కారణం.

దశాబ్దాల పోరు
విజయవాడ వర్గపోరు ఈనాటిది కాదు.. నలభై ఏళ్ల క్రితం మొదలైన ఆధిపత్య పోరు.. తరాలు మారుతున్నా.. మనుషులు మారుతున్నా కొనసాగుతూనే ఉంది. ఒకరినుంచి మరొకరు స్పూర్తి పొందుతూ.. రౌడీరాజకీయాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. రౌడీయిజం అంటే బెజవాడే అన్నంతగా పేరుపడిపోయిందంటే.. ఏ స్థాయిలో ఇక్కడ రౌడీలు హవా చెలాయించారో అర్థం చేసుకోవచ్చు..
రౌడీగా ముద్ర వేయించుకుంటే రాజకీయాల్లో హవా చెలాయించవచ్చన్నది ఎక్కువమంది నమ్మకం. దానికి తగ్గట్లుగానే.. బెజవాడ నేతల కార్యకలాపాలు సాగుతుంటాయి. 1970 నాటి నుంచీ ఇక్కడ ముఠా తగాదాలు మొదలయ్యాయి. అవేక్రమంగా రౌడీయిజానికి దారి తీశాయి. 1973లో కృష్ణలంక చెందిన చలసాని వెంకటరత్నం హత్య తర్వాత ఇవి మరింత పెరిగాయి. ఈ హత్య కేసులో వంగవీటి రాధాపై ఆరోపణలు వచ్చాయి. 1974 నవంబర్ 19న మ్యూజియం రోడ్డులో ఓ షాపు ఓపెనింగ్‌కు పిలిచి.. వంగవీటి రాధాను అత్యంత దారుణంగా ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ హత్య జరిగేనాటికి వంగవీటి రాధా, దేవినేని గాంధీ, నెహ్రూలు మిత్రులు. ఆ తర్వాత.. వీరిమధ్య విభేదాలు పెరిగాయి. రెండు వర్గాలు రాజకీయంగా ఎదగడానికి విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నాయి. యునైటెడ్ ఇండిపెండెంట్స్ అనే విద్యార్థి సంఘాన్ని వంగవీటి రంగా స్థాపిస్తే... యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌ను దేవినేని నెహ్రూ ప్రారంభించారు. ఈ రెండు ఆర్గనైజేన్స్ మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేవారు. ఇరు వర్గాల మధ్య ఆధిపత్యపోరుకు నిదర్శనంగా.. 1976లో SRR కాలేజ్ సమీపంలో దేవినేని గాంధీ హత్య జరిగింది. ఈ హత్య తర్వాత.. విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేది. ఆ తర్వాత రంగా.. నెహ్రూలు రాజకీయాల్లోకి ప్రవేశించారు. రంగా కాంగ్రెస్‌లో చేరితే.. నెహ్రూ టీడీపీలో చేరారు. ఇదే సమయంలో నెహ్రూ సోదరుడు దేవినేని మురళి బెజవాడలో తన పట్టుపెంచుకున్నారు. ఏలూరు రోడ్డు దందాలు నిర్వహిస్తూ క్రమంగా ఎదిగారు. దీనిపై కలత చెందిన రంగా వర్గం.. మురళి హత్యకు ప్రణాళిక వేసింది. 1987లో లా పరీక్షలు రాసి కారులో విజయవాడకు వస్తున్న మురళిని ప్రకాశం జిల్లా ఎడ్లపాడు వద్ద లారీతో ఢీకొట్టి.. ఆపై వెంటాడి చంపారు.
మురళి హత్య తర్వాత పగప్రతీకారాలతో నిండిపోయిన నెహ్రూ వర్గం.. రంగాను టార్గెట్ చేసుకుంది. ప్రాణాలకు ముప్పుందని భావించిన రంగా.. రక్షణ కల్పించాలని కోరుతూ తన ఇంటి సమీపంలోనే నిరాహారదీక్ష చేపట్టాడు. 1988 డిసెంబర్ 25 రాత్రి.. అయ్యప్ప భక్తుల రూపంలో ఓ బస్సులో వచ్చిన దుండగులు ఒక్కసారిగా రంగా నిరాహారదీక్ష శిబిరంపై దాడి చేశారు. రంగాను హత్య చేశారు. ఆ తర్వాత రోజు.. బెజవాడ అగ్నిగుండంగా మారిపోయింది. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులపై రంగా వర్గీయులు దాడులు చేసి నాశనం చేశారు. చాలావాటిని కాల్చిబూడిద చేశారు. రంగా తర్వాత.. అతని భార్య రత్నకుమారి రాజకీయప్రవేశం చేసినప్పటికీ క్రమంగా వర్గపోరు తగ్గింది. అయితే.. వంగవీటి రాధా తనయుడు శంతన్ ప్రవేశం, అతనిపై హత్యాయత్నం, ఇలాంటి సంఘటనలతో అప్పుడప్పుడూ బెజవాడ రాజకీయాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. వంగవీటి రంగాకు, దేవినేని నెహ్రూకు ఒకప్పుడు జరిగింది సామాజిక వర్గపోరనే చెప్పాలి. కులాలుగా విడిపోయిన జనం.. అప్పట్లో కత్తులు దూసుకున్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఒకే సామాజిక వర్గంలో రగడ మొదలయ్యింది. నెహ్రూ ఆధిపత్యానికి చెక్ చెప్పడానికి వంశీ బరిలోకి దిగారు. మరి వీరిద్దరి మధ్య పోరు ఎటు దారితీస్తుందన్నదే అందరినీ కలవరపెడుతోంది. ప్రచ్చన్నంగా సాగుతున్న ఈ యుద్ధం ప్రత్యక్షపోరుకు దారితీస్తే ఎదురయ్యే నష్టం ఊహించలేనిదే. మళ్లీ మూడు దశాబ్దాల కాలం నాటి పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళన జనాన్ని భయపెడుతోంది.

Read more...
11, జూన్ 2010, శుక్రవారం

సీ..రియల్ దాడులు

0 comments
ఎదురుగా ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడుకుంటారు.. వెనక్కితిరిగి ఆడిపోసుకుంటారు. ఒకర్ని ఎలా అణగదొక్కాలా అని నిరంతరం ఆలోచిస్తుంటారు.. ప్రత్యర్థి నాశనం చేయడమే లక్ష్యంగా ప్లాన్లు వేస్తుంటారు.. ఇలా చెబుతూ ఉంటే ఏదో తెలుగు టీవీ సీరియల్ గుర్తుకు వస్తోందా.. మీ ఊహ కరెక్టే.. కానీ.. ఇప్పుడు మాత్రం.. నిజజీవితంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.. అదీ బుల్లితెరపై అద్భుతంగా నటిస్తూ.. జనాన్ని టీవీలకు కట్టిపడేస్తున్న ఆర్టిస్టుల జీవితాల్లోనే..
మూడు సార్లు ఒకే తరహా మాట మాట్లాడడం.. డింపుల్‌ను కొడితే.. తన భర్త పడే బాధ తెలుస్తుందని... దాడి చేసిన మహిళ అరవడం... టీవీ ఆర్టిస్ట్ డింపుల్‌పై దాడిని సెన్షేనల్ చేశాయి. ఇంతకీ ఈ దాడి చేసింది ఎవరు? తోటి నటీనటీలేనా? డింపుల్‌పై దాడి ఎందుకు జరిగింది? డింపుల్‌ను గాయపరచడం ద్వారా ఏం సాధించాలనుకున్నారు?
టీవీ ఆర్టిస్ట్ డింపుల్‌పై దాడి వెనుక ఎన్నో కారణాలు కనిపిస్తాయి. తెలుగు సీరియళ్లలో ఇటీవలి కాలంలో బిజీ ఆర్టిస్టుగా మారింది డింపుల్. అదం.. అభినయం ఉండడంతో అవకాశాలు ఆమెకు అందివస్తున్నాయి. టీవీ ఇండస్ట్రీలో ఒక్కోమెట్టూ ఎదుగుతున్న ఈ టీవీ నటికి.. శత్రువులు ఎవరైనా ఉన్నారా?
డింపుల్ దృష్టిలో తనకు శత్రువులు ఎవరూ లేరు.. మరి దాడి చేసింది ఎవరు..? తరచి చూస్తే.. ఈ దాడికి మరో దాడికి సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. జూన్ 8న టీవీ ఆర్టిస్ట్ శ్రీధర్‌పై కూకట్‌పల్లి మలేషియా టౌన్‌షిప్ వద్ద స్పిరిట్‌ ఎటాక్ జరిగింది. ఆ మరుసటి రోజునే.. డింపుల్‌ను గుర్తుతెలియని మహిళ గాయపరిచింది. ఈ రెండు సంఘటనలూ వరసగా జరగడం వెనుక ఏదో ఓ బలమైన కారణం ఉండవచ్చని ఎవరికైనా అనుమానం కలగక మానదు.
వర్ధమాన టీవీ ఆర్టిస్ట్‌పై జరిగిన ఈ దాడి.. టీవీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇండస్ట్రీలో ఆధిపత్య పోరే.. ఈ దాడికి కారణమా? వృత్తిపరమైన విబేధాలే.. దాడులకు పురికొల్పుతున్నాయా? టీవీస్క్రీన్‌పై కనిపించే దృశ్యాలు.. ఇప్పుడు ఆర్టిస్టుల నిజజీవితాల్లోకి చొరబడుతున్నాయా..? డింపుల్‌పై దాడి ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెబుతుంది.

లోబరుచుకుంటున్న క్యారెక్టర్లు

ఆడాళ్లను ఏడ్పించడం.. ఎవరో ఒకరిని చంపడానికి ప్లాన్ వేయడం.. దాడి చేయడానికి కుట్ర పన్నడం.. ఇలాంటి సీన్లు తెలుగు టీవీ సీరియళ్లలో చాలా కామన్. సాధారణంగా ఏ సీరియల్ చూసినా.. ఎవరో ఒకరిని నాశనం చేయడానికి తెగ ట్రై చేసే క్యారెక్టర్లు కోకొల్లలు. కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిన సీరియల్స్‌లో... పాత్రలను పండించడంలో నటీనటులంతా ఆరితేరిపోయారు. పాత్రల్లో జీవిస్తూ... ఆ స్వభావాలను నిజజీవితానికీ ఆపాదించుకుంటున్నారు. సీరియల్స్ చూసి జనం మారడం సంగతేమో గానీ.. నటించి నటించీ.. యాక్టర్లే మారిపోతున్నారు.
ఇక డింపుల్‌పై జరిగిన దాడికి టీవీ ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులే కారణమన్నది చాలామంది అనుమానం. డింపుల్ చెబుతున్న మాటలు కూడా దీన్నే రుజువు చేస్తున్నాయి. అయితే.. నేరుగా ఎవరి పేరూ చెప్పకపోయినా... టీవీ ఆర్టిస్ట్ సెల్వరాజే దాడి చేయించి ఉంటాడన్న అనుమానాలను.. డింపుల్ వ్యక్తం చేస్తోంది. శ్రీధర్‌పైనా.. ఆతర్వాత తనపైనా జరిగిన దాడికి సెల్వరాజ్‌కూ సంబంధం ఉండవచ్చేమోనన్నది ఆమె సందేహం.
ఆరాధన అనే సీరియల్‌లో లీడ్‌రోల్‌లో నటిస్తున్న సెల్వరాజ్‌ను పక్కనపెట్టి.. ఆ అవకాశాన్ని శ్రీధర్‌కు ఇచ్చారు. ఈ మార్పును తట్టుకోలేకే.. సెల్వరాజ్ ఈ దాడి చేయించి ఉండవచ్చన్నది డింపుల్ అనుమానం. అయితే.. ఈ ఆరోపణలను మాత్రం సెల్వరాజ్ ఖండిస్తున్నాడు. ఆరాధనలోని ఓ చిన్న క్యారెక్టర్ పోయినందుకు ఫీల్ అయ్యే అవకాశమే లేదంటున్నాడు. పైగా తన ఎదుగుదలను ఓర్వలేకే.. ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నాడు.
మొత్తంమీద ఇద్దరు యాక్టర్ల మధ్య సాగుతున్న ఈ వివాదం డింపుల్‌పై దాడితో తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవచ్చు. ఒకరిద్దరు చేస్తున్న పనులతో అందరికీ చెడ్డపేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీవీ ఆర్టిస్టులు.

సెల్వరాజ్ పనేనా?

డింపుల్‌పై దాడి సెల్వరాజ్ చేయించాడా? లేక సెల్వరాజ్ పేరును కావాలనే ఎవరైనా ఇరికించారా? ఈ రెండింటి విషయంలో కాస్త క్లారిటీ లేదనే చెప్పాలి. ఎవరి వాదన వారిది.. ఎవరి అనుమానం వారిది.
అయితే.. ఆరాధన సీరియల్ విషయంలో జరిగిన మార్పులు.. సెల్వరాజ్ స్థానాన్ని శ్రీధర్ ఆక్యుపై చేయడం.. శ్రీధర్‌పై దాడి చేయడం.. ఇవన్నీ ఒకదానికొకటి లింకు ఉన్నట్లు కనపడతాయి. అయితే.. ఇక్కడ డింపుల్‌పై దాడి జరగడానికీ కారణం ఉంది. శ్రీధర్, డింపుల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. డింపుల్‌ను హింసిస్తే..శ్రీధర్ ఫీలవుతాడనే భావం వచ్చేలా.. దాడిచేసిన మహిళ చెప్పడమూ అనుమానాలను రేకెత్తిస్తోంది. దీనికి తోడు.. శ్రీధర్‌పై దాడి జరగగానే... ముందుగా బయటకు వచ్చిన పేరు సెల్వరాజ్. వాస్తవానికి సెల్వరాజ్‌పై పోలీసులకు శ్రీధర్ ఫిర్యాదు చేయలేదు. అయినా.. సెల్వరాజ్ కంగారు పడ్డాడు. మీడియా ముందుకు వచ్చి హడావిడి చేశాడు. కానీ.. విషయం అర్థమయ్యే సరికి సైలెంట్ అయ్యాడు. తన పేరు బయటకు తీసుకువచ్చిన వారిపై చర్యలు తీసుకుంటానంటున్నాడు.
తెలుగు సీరియల్స్‌లో తరచుగా యాక్టర్లు మారిపోతుంటారు. ఓ క్యారెక్టర్ పోషిస్తున్న యాక్టర్‌ను మార్చేసి మరో యాక్టర్‌ను ఆ ప్లేస్లో ప్రవేశపెడతారు. ఇప్పుడు ఆరాధన విషయంలో జరిగింది కూడా ఇదే. అయితే.. వ్యక్తిగత కారణాలతోనే ఇలా తమను తప్పిస్తున్నారని ఫీలవుతున్న నటులు కుమిలిపోతున్నారు. డైరెక్టర్లపైనా, ఆర్టిస్టులపైనా కక్షను పెంచుకుంటున్నారు. అయితే.. ఇది అంత మంచి పద్దతి కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతా బాగానే ఉందని చెప్పుకుంటున్నప్పుడు.. క్యారెక్టర్ మారగానే.. ఆర్టిస్టులు ఎందుకు ఫీలవుతున్నారు? వ్యక్తిగతంగా కక్షలు ఎందుకు పెంచుకుంటున్నారు.. దీనికి కారణం.. ఆ క్యారెక్టర్లతో అనుబంధం పెంచుకోవడమే. ఇంతకాలం తాము చేసిన క్యారెక్టర్‌లో.. మరొకరు కనిపిస్తారన్న విషయాన్ని బాధిత ఆర్టిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే.. ఆర్టిస్టులపై దాడులకు పాల్పడిన సంఘటనలు చాలా అరుదు. ఇప్పుడు డింపుల్, శ్రీధర్‌లపై జరిగిన దాడి కూడా ఇలాంటిదేనా? అంటే కచ్చితంగా చెప్పలేం. శ్రీధర్‌కు, సెల్వరాజ్‌కు మధ్య చోటు చేసుకున్న సంఘటనలను పావుగా వాడుకొని.. ఇండస్ట్రీలో కలతలు సృష్టించడానికి ఎవరో ఒకరు ప్రయత్నించి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే.. అది ఎవరన్నదే ఇప్పుడు సస్పెన్స్. అసలు ఇలా కలతలు రేపాల్సిన అవసరం ఎవరికుందన్నదీ తేలాల్సి ఉంది.

గాడి తప్పుతోందా..?

తెలుగు టీవీ ఇండస్ట్రీ గాడి తప్పుతోందా? నటీనటులకు అన్యాయం జరుగుతోందా? దర్శక నిర్మాతలు చేసే పనికి ఆర్టిస్టులు బలవుతున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను తెరపైకి తెచ్చాయి డింపుల్,శ్రీధర్‌లపై వరస దాడులు. తెలుగు టీవీ సీరియళ్లలను ఆర్టిస్టులను మార్చడం కొత్తదేమీ కాదు. ఒకప్పుడు ఎంతో పద్దతిగా, క్రమశిక్షణతో ఉండే టీవీ ఇండస్ట్రీలో ఇప్పుడు గ్రూపురాజకీయాలు నడుస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్టిస్టుల మధ్య సత్సంబంధాలకు బదులు ఆధిపత్యపోరు నడుస్తోందన్న వాదనా ఉంది. అయితే.. జనరేషన్ ఛేంజ్‌తో కొద్దిపాటి మార్పులే తప్ప.. పెద్దగా సమస్యలు లేవని ఇండస్ట్రీలో కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఆర్టిస్టుల వైఖరి కూడా చాలా సమస్యలను సృష్టిస్తోంది. ఒకటీ రెండు సీరియళ్లు చేయగానే.. బిల్డప్ పెంచేస్తున్న ఆర్టిస్టులతో దర్శకనిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవకాశాలు వచ్చేవరకూ ఎంతో ఒద్దికగా కనిపించే నటులు.. ఆ తర్వాత మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇక వ్యక్తిగత ప్రవర్తనా చికాకులను తెప్పిస్తోంది. సీరియల్స్‌లో ఆర్టిస్టులను మార్చడం వెనుకే వ్యక్తిగత ప్రవర్తనే అసలు కారణం.
అయితే.. కొన్నిరకాల ఒత్తిడుల కారణంగానూ ఆర్టిస్టులను తొలగిస్తున్నారు. మంచి క్యారెక్టర్ కోసం రాజకీయాలు చేస్తున్న కొంతమంది నటుల కారణంగా.. అప్పటివరకూ ఆ పాత్రలో జీవిస్తున్న వారికి ఒక్కసారిగా మరణశిక్ష పడుతోంది. ఇలాంటి పద్దతి అరికట్టాలంటే.. ఇండస్ట్రీ స్వరూపంలోనూ మార్పురావాలి. టీవీ ఆర్టిస్టుల సంఘాలు ఇలా అన్యాయాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.
ఏదైనా సమస్య వస్తే. .సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప.. వ్యక్తిగత దాడులకు తెగబడితే మాత్రం. అందరి పరువూ రోడ్డున పడుతుంది. అంతేకాదు ప్రేక్షకుల దృష్టిలోనూ చులకన అవుతారు.
Read more...
8, జూన్ 2010, మంగళవారం

అరచేతిలో మద్యం

4 comments

గుంటూరు జిల్లా నడికుడిలో రూ.5.21 కోట్లు..
విశాఖలో రూ.4.72 కోట్లు
హైదరాబాద్‌లో రూ.4.45 కోట్లు
ఒక్కో మద్యం దుకాణం కోసం వ్యాపారులు కురిపించిన కోట్ల వర్షం. అవును... కనీవినీ ఎరుగని రీతిలో.. ఎవరూ ఊహించని స్థాయిలో.. ఒక్కో మద్యం దుకాణం కోట్లల్లో పలికింది.
మద్యం దుకాణానికి కోటి రూపాయలకు పైగా టెండర్ పడిందన్న వార్తే రెండేళ్ల క్రితం కిక్కు ఎక్కిస్తే.. ఈసారి అలాంటి కిక్కులు చాలానే ఉన్నాయి. మద్యం లైసెన్సు టెండర్లలో ఈ సారి కోట్ల వర్షం కురిసింది. ప్రభుత్వం అంచనాలకు రెట్టింపు స్థాయిలో కొన్ని దుకాణాలకు టెండర్లు వచ్చాయి. 2008లో లక్షల్లో పలికిన దుకాణాలు ఈ సారి కోటి రూపాయలను దాటిపోయాయి. రాజధాని దగ్గర నుంచి మొదలుపెడితే రాష్ట్ర సరిహద్దుల వరకూ అన్నిచోట్లా.. ఒకే తరహా రెస్పాన్స్. మద్యాన్నే నమ్ముకున్న వ్యాపారులు కోట్లకు బెట్ కాశారు. విశాఖ జిల్లా పెదవాల్తేరులోని ఓ దుకాణం 4 కోట్ల 72 లక్షలు పలికి రికార్డు సృష్టించింది. విశాఖ వేగంగా డెవలప్ అవుతుండడంతో.. ఇంత ఎక్కువమొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడ్డాడో వ్యాపారి. ఇక హైదరాబాద్‌లో ఓల్డ్ అల్వాల్‌ మద్యం దుకాణం అత్యధిక విలువ దక్కించుకొంది. దాదాపు 4.45 కోట్ల రూపాయలు చెల్లించి ఈ దుకాణం లైసెన్సు దక్కించుకున్నాడు మైఖేల్ అనే వ్యాపారి.మూసాపేట్‌లోని దుకాణం మూడున్నర కోట్లు పలికింది. హైదరాబాద్లోని దుకాణాలన్నీ దాదాపు కోటిపైనే పలికాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రెండు కోట్ల పైనే చెల్లించి వ్యాపారులు లిక్కర్ షాపులను సొంతం చేసుకున్నారు.
జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మద్యం విషయంలో గుంటూరు జిల్లా రికార్డులు సృష్టించింది. అత్యధిక మొత్తానికి బిడ్ గుంటూరు జిల్లాలోనే పడగా.. దాచేపల్లిలోని రెండు దుకాణాల్లో ఒకటి రూ. 4.96 కోట్లు, మరొకటి రూ.4.36 కోట్లు పలికాయి. ఇక నల్గొండ జిల్లా మేళ్లచెరువులో 3.74 కోట్లకు టెండర్ పడింది. హైదరాబాద్‌లోని వరంగల్ రంగశాయిపేటలో దుకాణం విలువ 3.46 కోట్లు. ఇక రాజధాని పక్క జిల్లా.. మెదక్‌లోనూ మద్యం దుకాణాలు కోట్లను దాటాయి. మెదక్‌లోని వైన్‌షాప్‌కు 3.33కోట్లకు టెండర్ వేశారు. కరీంనగర్‌లో 2.31 కోట్లు, విజయనగరంలో 2.22 కోట్లు.. కర్నూలులో 2.10 కోట్లు ఇలా చెప్పుకుంటూ పోతే.. కోట్ల లెక్కలు చాలానే ఉన్నాయి.
రెండేళ్లకోమారు జరిగే ఈ టెండర్లలో లైసెన్సులను దక్కించుకోవడానికి వ్యాపారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎప్పుడూలేనంతగా ఈ సారి పోటీ ఉండడంతో.. భారీ మొత్తాలను కోట్ చేశారు. చాలావరకూ కోట్లల్లో టెండర్లు పలకడానికి కారణం ఇదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం షాపు ఉంటే.. భారీగా సంపాదించుకోవచ్చన్న అభిప్రాయంతోనూ ఎక్కువమంది టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. పైగా.. మాద్యంలో జోరుగా సాగుతున్న వ్యాపారమూ మద్యం ఒక్కటే. అందుకే.. ఈసారి లైసెన్సుల కోసం వేలాది మంది పోటీ పడ్డారు.
ప్రభుత్వం ఊహించనదానికన్నా ఎక్కువమొత్తాలనే అందిచాయి లైసెన్సు టెండర్లు. వేసవిలో ఖాళీఖజానాతో కొట్టుమిట్టాడుతున్న రోశయ్య సర్కార్ గొంతు తడిపాయి మద్యం టెండర్లు.

ఖజానా నిండింది

గల్లీ గల్లీకో వైన్ షాప్.. మంచినీళ్లు దొరకని చోట కూడా మద్యం దొరుకుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. 6596 మద్యం దుకాణాలున్నాయి. నిబంధనలకు నీళ్లు వదులుతున్న వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు. గుడి బడీ అన్న తేడా లేకుండా షాపులు ఏర్పాటు చేసేశారు. ఓ వైపు రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఎక్కువైపోయాయన్న ఆందోళనలో జనం ఉంటే.. వ్యాపారులు మాత్రం ఈ దుకాణాల సంఖ్య చాలా తక్కువనుకుంటున్నారు. పైగా.. మద్యం వ్యాపారమే అన్నిటికన్నా మంచి బిజినెస్‌గా భావిస్తున్నారు. అందుకే.. టెండర్లకు ఎప్పుడూలేనంత స్పందన ఈసారి వచ్చింది. ఎవరికి వారు మద్యం లైసెన్సులు దక్కించుకోవడానికి పోటీపడ్డారు. 2008లో ఈ దుకాణాలకు 19400 టెండర్లు మాత్రమే దాఖలైతే.. ఈ సారి వచ్చిన టెండర్లు 48602. కొన్ని కారణాలతో మరో 28 దుకాణాలు వేలం వాయిదా పడింది. రెండేళ్లక్రితంతో పోల్చితే రెండున్నర రెట్లకు పైగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ఒక్కో అప్లికేషన్‌కు పదివేల రూపాయలను ఎక్సైజ్‌శాఖ వసూలు చేయడంతో... ఈ రూపంలోనే 48.6 కోట్ల రూపాయలు ఖజానాకు జమయ్యాయి.
దరఖాస్తుల అమ్మకాలను బట్టి ప్రభుత్వ అంచనాలను మించే ఖజానాకు ఆదాయం అందవచ్చని తెలుస్తోంది. 2008-10 కాలానికి ప్రభుత్వానికి మద్యం దుకాణాల లైసెన్సు ఫీజు రూపంలో 3182 కోట్ల రూపాయలు వచ్చాయి. దీనిపై ఈ సారి 15 శాతం అప్‌సెట్ ప్రైస్‌ను ప్రభుత్వం నిర్ణయించింది. అంటే.. ఒక్కో దుకాణానికి ఇంతకు ముందు చెల్లించిన ధర కన్నా 15 శాతానికి మించి టెండర్ వేయాలన్నమాట. ఈ లెక్కన చూస్తే.. 3590 కోట్ల రూపాయలు లైసెన్సు ఫీజుల రూపేణా రావచ్చని రోశయ్య సర్కార్ భావిస్తోంది. కానీ.. టెండర్లు పడ్డ తీరు చూస్తే.. 5 వేల కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం రావచ్చు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సంక్షేమపథకాలపై నీలినీడలు కమ్ముకున్న సమయంలో.. మద్యం ద్వారా వచ్చే ఆదాయమే గట్టెక్కించనుంది.
ఇక మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపైనే ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 15 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సర్కార్ అంచనావేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాలే అవుతున్నాయి. 2004-05లో మద్యం అమ్మకాల ద్వారా.. 3834 కోట్ల రూపాయలు వస్తే.. 2005-06 కల్లా అది 4668 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇలా ఏటా వెయ్యి కోట్లకు పైగానే ఆదాయం పెరుగుతూ.. 2008-09 నాటికి పదివేల కోట్లకు చేరుకుంది. ఇక 2009-10 ఆర్థిక సంవత్సరానికి 12 వేల కోట్ల రూపాయలను సర్కార్ మద్యం అమ్మకాల ద్వారా సంపాదించింది. ఈసారి లైసెన్సు ధరలు పెరగడంతో.. మద్యం అమ్మకాలు కూడా అదే స్థాయిలో పెరిగే అంచనాలున్నాయి. అందుకే.. 15 వేల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ ఆదాయమే వచ్చే అవకాశాలే ఉన్నాయి.

ఎలా సంపాదిస్తారు?

ఒకప్పుడు లక్షల్లో సాగితే.. ఇప్పుడంతా కోట్ల మయం. చిన్న చిన్న పట్టణాలైనా... కోట్లు చెల్లించడానికి సిద్ధపడ్డారు మద్యం వ్యాపారులు. ఎలాగైనా మద్యం దుకాణాన్ని దక్కించుకోవడం కోసం అంచనాలను మించి కోట్ చేశారు. ఇందుకు ఉదాహరణ వరంగల్‌లోని ఓ మద్యం దుకాణమే. క్రితం సారి 70 లక్షలకు మాత్రమే పాడుకున్న సుధాకర్ అనే వ్యాపారి.. ఈసారి అదే దుకాణానికి 3 కోట్ల 45 లక్షల 68 వేల 444 రూపాయలకు టెండర్ వేశాడు. అంటే గతం కన్నా దాదాపు రెండున్నర కోట్లు ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడ్డాడు. మరి అంత డబ్బు ఎందుకు పెడుతున్నాడు.. దాన్ని తిరిగి సంపాదించుకోగలడా.. ? ఒకవేళ సంపాదించుకుంటే.. ఎలా సంపాదించుకుంటాడు? ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం వినండి..
మద్యం వ్యాపారుల ధైర్యానికి కారణం ప్రభుత్వమే. మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తూ.. చూసీచూడనట్లుగా ఉండడం వల్లే ఎంత వ్యాపారమైనా చేయవచ్చన్న నమ్మకం వ్యాపారుల్లో ఉంది. పైగా.. ఈ రెండేళ్ల కాలంలో ఎన్నికలూ రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. పైగా ఇవి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు కాబట్టి .. ప్రతీ చోటా మద్యం వ్యాపారం తారాస్థాయిలో సాగుతుంది. ప్రతీ దుకాణంలో కోట్లాది రూపాయల అమ్మకాలు జరుగుతాయి. ఒక్క దుకాణం ఉన్నా.. భారీగా సంపాదించుకోవచ్చు.. అందుకే.. లైసెన్సు కోసం కోట్లు ఖర్చుపెట్టడానికి కూడా ఎవరూ వెనుకాడడం లేదు. దీనికి తోడు మద్యం అమ్మకాల్లో ఏటేటా అనూహ్య వృద్ధి నమోదవుతోంది. మద్యం తాగుతున్న వారి సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. 2006లో జరిగిన ఓ సర్వే ప్రకారం 20 ఏళ్లకే మద్యం రుచి మరుగుతున్నారని తేలుతోంది. కాలంతో పాటే పరుగులు పెడుతున్న యువతరం.. మందు విషయంలోనూ అంతే జోరును కనబరుస్తోంది. పార్టీల పేరుతో పెగ్గుల మీద పెగ్గుల లాగించేస్తున్నారు. వీరంతా ఇప్పుడు వ్యాపారుల పాలిట కాసులు కురిపించే యంత్రాలు.
అంతేకాదు... మద్యం విషయంలో ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్న నిబంధన పాటించే అవకాశమూ తక్కువే. ఒక ప్రాంతంలో ఉన్న మద్యం వ్యాపారులంతా సిండికేట్ అవగలిగితే చాలు.. ఎమ్మార్పీపై 10 నుంచి 20 రూపాయలు ఎక్కువకే అమ్ముకోవచ్చు. దీన్ని అడిగేవారూ ఉండరు. ఎక్సైజ్ సిబ్బందికీ ముడుపులు టంచనుగా ముడతాయి కాబట్టి, దీనిపై వారు కూడా పెదవి మెదపరు. పైగా.. కొన్ని బ్రాండుల విషయంలో కృత్రిమ కొరతను సృష్టించి రెట్టింపు ధరకూ అమ్ముకోవచ్చు. మద్యం దుకాణాల్లో ఇటీవలి కాలంలో వరసగా అమలు చేస్తున్న విధానాలు ఇవే. మద్యానికి అలవాటు పడ్డవారు ఎంతకైనా కొనడానికి సిద్ధపడుతుండడమే.. వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. కోట్లకు టెండర్ వేసేలా ప్రేరేపించింది.

తాగండి బాబూ..తాగండి
తాగేవాడిని మరింత తాగమనేలానే ఉంది సర్కార్ తీరు. వాడవాడకో మద్యం షాపును ఏర్పాటు చేస్తూ.. అరచేతిలోకి మందును అందుబాటులోకి తెస్తోంది. గ్రామాలవైపు చూస్తే.. సరైన స్కూళ్లు ఉండవు.. హాస్పటల్స్ ఉన్నా సదుపాయాలు మాత్రం అరకొరే. రోగులకు ఇవ్వడానికి మందులూ ఉండవు.. అంతెందుకు గొంతెండితే తాగడానికి పరిశుభ్రమైన మంచినీళ్లు కూడా దొరకవు. ప్రజలకు అత్యవసరమైన వాటి పరిస్థితి ఎలా ఉన్నా పట్టించుకోని సర్కార్.. మద్యం విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ అమ్మకాలు తగ్గకుండా చూడడానికి ఎక్సైజ్ శాఖను పరుగులు పెట్టిస్తోంది. టార్గెట్లు విధిస్తోంది. లైసెన్సుడు దుకాణాల్లోనే మద్యం అమ్మాల్సి ఉన్నప్పటికీ గ్రామాల్లో అనధికారికంగా వెలుస్తున్న బెల్టు షాపులను ఏమాత్రం నియంత్రించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా లక్షకుపైగా బెల్డు షాపులు ఉన్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. మనిషి మనిషికీ మద్యాన్ని అందుబాటులోకి తెచ్చి... తాగుబోతులుగా తయారు చేస్తోంది. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తూ.. ఖజానాలో కాసులు నింపుకొంటోంది. వీటినుంచే.. ప్రజల సంక్షేమం కోసమంటూ అరకొరగా నిధులు విదుల్చుతోంది. అసలు మద్యం ద్వారా ఆదాయం సంపాదించుకోవాలన్న నీచమైన ఆలోచన నుంచి ఈ ప్రభుత్వం బయటపడుతుందా...?

ఇక ఇప్పుడు కోట్లల్లో లైసెన్సు ఫీజులు చెల్లించి టెండర్లు దక్కించుకున్నవాళ్లదీ ఇదే పరిస్థితి. చేసేది ఫక్తు వ్యాపారమే అయినప్పటికీ.. దానికీ సామాజిక కోణం అద్దుతున్నారు. ప్రజల కోసం.. ప్రజల సంక్షేమం కోసమే.. ఇంతమొత్తం చెల్లిస్తున్నామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.
మద్యం అమ్మకాలను ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకొన్నప్పడే.. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలను తట్టుకోవడానికి మాత్రం మద్యపాన విమోచన కమిటీ అని ఏర్పాటు చేసింది. అయినా.. ఏటాటా మద్యం తాగుతున్న వారి సంఖ్య పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఎంతమంది చేత మద్యం మానిపించారు? పైగా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామంటున్న రోశయ్య సర్కార్ చేస్తున్నదేమిటి? జనాన్ని మద్యానికి బానిసలుగా మార్చడమే సంక్షేమమా? సామాన్యుడి ఆరోగ్యాన్ని హరించడమే ప్రభుత్వం చేస్తున్న మేలా?

మద్య నియంత్రణ సాధ్యమేనా?


దశలవారీగా మద్యాన్ని నియంత్రిస్తామన్నది వైఎస్ ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించాక చెప్పిన మాట. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న పేరున్న వైఎస్.. ఈ మాటను మాత్రం నిలబెట్టుకోలేదు. వైఎస్‌కు అత్యంత నమ్మకస్తుడైన రోశ్యయ్య ముఖ్యమంత్రి పీఠమెక్కినా.. వైఎస్ మాట అమలు కాలేదు. మద్య నియంత్రణ మాట అటుంచితే.. దశల వారిగా మద్యం అమ్మకాలు ఎప్పుడూ లేనంతగా పెరిగాయి.

రాష్ట్రంలో ఇక మద్య ప్రవాహం కొనసాగనుంది. కోట్లకోట్లు పోసి లైసెన్సులు దక్కించుకున్న వ్యాపారులు.. ఆదాయమే లక్ష్యంగా విజృంభించనున్నారు. అడుగడుగుకో బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తారు.. పిల్లలకూ మద్యాన్ని అలవాటు చేసినా ఆశ్చర్యం లేదు.. ఎందుకంటే.. ఇప్పుడు లైసెన్సు ఫీజుగా కట్టిన మొత్తాన్ని సంపాదించాలంటే.. నీతిగా వ్యాపారం చేస్తే ఏ మాత్రం కుదరదు. ఎన్ని అక్రమమార్గాలు తొక్కితే అంతగా సంపాదించుకోవచ్చు. ఎప్పుడూ లేనంత ఆదాయం వస్తుందని ప్రభుత్వం సంబరపడవచ్చు గానీ.. అంతకు రెట్టింపు ఆదాయాన్ని మద్యం వ్యాపారులు జేబుల్లో వేసుకుంటారు..
ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం కారణంగా ఎన్నో పచ్చని సంసారాల్లో చిచ్చు రగులుతోంది. ఇటీవలికాలంలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, అత్యాచారాల సంఖ్య ఈ మధ్య మరీ ఎక్కువగా ఉంది. వీటన్నింటికీ కారణం.. మద్యమేనన్నది ఎన్నో పరిశీలనల్లో వెల్లడైన వాస్తవం. ఇది ప్రభుత్వానికీ తెలుసు. అయినా.. మద్యాన్ని ప్రోత్సహిస్తుందే తప్ప.. నియంత్రణకు మాత్రం ముందడుగు వేయదు. వేస్తామని చెబుతున్నా ఆచరణలో మాత్రం చూపించదు.
మద్యం విషయంలో ప్రభుత్వం వైఖరి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. కొన్నాళ్లుపోతే.. ఆదాయం కోసం పూర్తిగా మద్యాన్నే సర్కార్ నమ్ముకున్నా ఆశ్చర్య పోనక్కరలేదు. సామాన్య, మధ్యతరగతి జీవితాలను నాశనం చేస్తున్న మద్యం మహమ్మారిని పారద్రోలడానికి అంతా ముందుకు కదలాలన్న డిమాండ్ మళ్లీ వినిపిస్తోంది.
మరోసారి ప్రజాఉద్యమం వస్తే తప్ప ప్రభుత్వం ఆలోచన మారకపోవచ్చు. అయితే.. మద్యం మత్తులో నిండా మునిగిపోయిన సర్కార్‌కు జనం వాణి వినిపిస్తుందా.. సామాన్యుల బాధలు చెవికెక్కుతాయా?
Read more...
5, జూన్ 2010, శనివారం

వద్దు సరోజా వద్దు..

4 comments

అరుంధతిగా ఆరాధించిన వారే.. ఇప్పుడు అనుష్కను చీదరించుకుంటున్నారు.. వద్దు సరోదా వద్దంటున్నారు.. అనుష్క పేరు మార్చుకుంటే మంచిదంటున్నారు.. ఇంతకీ ఎవరు వారు... ఎచటి వారు.. ఎందుకంటున్నారు...?
అరుంధతిలో తన నటనతో శభాష్ అనిపించుకొన్న అందాల తార అనుష్క ఇప్పుడు మరో గెటప్ ఎత్తింది. వేదం సినిమాలో అమలాపురం సరోజగా మారింది. రాజసాన్ని పక్కనపెట్టి.. రాసలీలలు సాగించే పాత్రలో ఒదికిపోయింది. వేదంలో అనుష్కది ఓ వేశ్య పాత్ర. సరోజ వరకూ ఏ ఇబ్బంది లేదు కానీ.. దానికి ముందు అమలాపురం అతికించడమే ఇబ్బందులు సృష్టిస్తోంది. ముఖ్యంగా.. అమలాపురం వాసులైతే.. వేదం సినిమా దర్శకనిర్మాతలపై కస్సుమంటున్నారు.
సరోజ క్యారెక్టర్‌తో.. తమ ప్రాంత పరువు పోయిందంటున్నారు అమలాపురం వాసులు. ముఖ్యంగా బయటిప్రాంతం వారు.. ఈ క్యారెక్టర్ చూసి.. అమలాపురంలో అంతా వేశ్యలే ఉంటారేమో అని అనుకుంటారన్నది స్థానికుల భయం. పైగా.. అసలు రెడ్‌లైట్ ఏరియాగా ముద్రపడని తమ ప్రాంతంపై ఇలా చెడు ప్రచారం చేయడమూ సరికాదంటున్నారు. పైగా.. వేదం లాంటి మంచి పేరు పెట్టుకున్న సినిమాలో.. అమలాపురాన్ని కించపరిచేలా వేశ్య పాత్రను పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమలాపురం అనగానే ముందుగా గుర్తొచ్చేది కోనసీమ. గోదావరి పరవళ్లు.. కొబ్బరిచెట్ల అందాలు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రా కేరళ.. కోనసీమ. టూరిజం కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. పచ్చని పైర్లతో ప్రకృతి అందాలతో పరవశాన్ని కలిగించే ప్రాంతానికి.. అమలాపురం సరోజ క్యారెక్టర్‌ బ్యాడ్ ఇమేజ్ తెస్తుందని సామాజికవేత్తలూ వాపోతున్నారు. అసలు సరోజ క్యారెక్టర్‌కు అమలాపురం అని తగిలించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద క్రిష్ సృష్టించిన ఓ వేశ్య పాత్ర.. అమలాపురం ఇమేజ్‌ను చెడగొట్టేలా ఉందన్నది స్థానికుల ఆగ్రహం.

అమలాపురం అంటే అలుసా?

అల్లు అర్జున్‌కు స్టార్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టిన ఆర్యలోని ఐటెం సాంగ్‌లో అమలాపురం ప్రస్తావన వస్తుంది. రాష్ట్రం మొత్తాన్ని ఒక్క ఊపు ఊపింది ఈ సాంగ్. ఈ పాటతో అమలాపురం పేరు ప్రతీ ఒక్కరినోట్లోనూ నానింది. తమ ఊరికి స్పెషల్ క్రేజ్ వచ్చిందని అమలాపురం వాసులూ సంతోషపడ్డారు. అయితే.. ఈ సంబరం ఎంతో కాలం ఆగలేదు.. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో అమలాపురాన్ని ఎలా చూపించకూడదో అలాగే చూపించారు.
సినిమాల్లో రోజురోజుకూ దిగజారిపోతోంది అమలాపురం పరువు. పైగా.. అమలాపురం అంటే అందమైన అమ్మాయిలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా తెలుగు సినిమాల్లో చూపించడమూ.. వివాదాస్పదమవుతోంది. ఇది క్రమంగా శృతిమించి.. ఇప్పుడు వేదం సినిమాలో వేశ్య పేరుకు ముందు అమలాపురం తగిలించేదాకా వెళ్లిపోయింది.
ఓ ప్రాంతాన్ని మంచిగా చూపించకపోయినా పర్వేలేదు కానీ.. పేరు చెడొగొట్టేలా మాత్రం ఉండకూడదు. పైగా ఊరుకునే కొద్దీ.. అమలాపురం ఇమేజ్‌ను తెలుగుసినిమాలు మరింతగా దెబ్బతీసేలా ఉన్నాయి. అందుకే.. తమ పేరును చెడుగా వాడితే ఊరుకోమంటున్నారు. అవసరమైతే న్యాయపోరాటమూ చేస్తామంటున్నారు. అసలు సరోజకు అమలాపురం పేరు పెట్టాలనుకోలేదు. కాకినాడ సరోజ అని పెట్టాలనుకున్నాడట వేదం డైరెక్టర్ క్రిష్. అమలాపురం అయితే.. మరింత క్యాచీగా ఉంటుందనుకుని దానికి ఫిక్స్ అయిపోయాడు. ఎవరినీ కించపరచాలని ఈ పేరు పెట్టలేదంటున్నాడు.

పెద్దాపురం కష్టాలే..

రాష్ట్రంలో అందరికీ ఏ ప్రాంతమైనా తెలియకపోవచ్చు గానీ.. పెద్దాపురం అంటే మాత్రం టక్కున అర్థమైపోతుంది. సినిమా ఏదైనా సెక్స్ వర్కర్లు.. వ్యాంపు క్యారెక్టర్లుంటే వారికి కేరాఫ్ అడ్రస్‌ను పెద్దాపురంగానే చూపిస్తారు. ఇక మరీ ముదురు సినిమాలు.. చాలా వరకూ పెద్దాపురం పేరుతోనే వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. బయటప్రపంచానికి పెద్దాపురం ఓ రెడ్‌లైట్ ఏరియాగానే పరిచయం. దీనికి కారణం సినిమాలే అంటారు స్థానికులు. చివరకు తమ ఊరు పెద్దాపురం అని చెప్పుకోవడానికి కూడా జనం భయపడేస్థాయికి పెద్దాపురం ఇమేజ్ పడిపోయింది. ఎక్కడికి వెళ్లినా.. పక్కగ్రామాల పేర్లే చెప్పుకునేవారు పెద్దాపురం వాసులు.

పెద్దాపురానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. రాజులు.. రాజ్యాలు.. వ్యాపారాలు.. ఇలా ప్రతీదానితోనూ పెద్దాపురానికి అవినాభావ సంబంధం ఉంది. మహాభారతకాలం నాటి ఆనవాళ్లూ ఇక్కడ ఉన్నాయి. కానీ.. ఇవేవీ ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా.. పెద్దాపురం అంటే రెడ్‌లైట్ ఏరియానే. గమ్యం తీసిన క్రిష్ కూడా.. కోస్తా విషయంలోనూ ఇదే సామాజిక సమస్యను ఎంచుకున్నాడు. సెక్స్ వర్కర్ల పరిస్థితిని కళ్లకు కట్టాడు. అందుకే కాబోలు.. వేదంలో అనుష్క క్యారెక్టర్‌కు అమలాపురాన్ని అలంకారం చేశాడు.
పెద్దాపురం పేరు ఇప్పుడు A గ్రేడ్ సినిమాలకు వెళ్లిపోయింది. పైగా.. ఎప్పుడూ ఒకే పేరు చెబితూ ఉంటే చూసేవారికీ బోర్ కొడుతుంది. ఇదే సమయంలో అమలాపురం పేరు సినీజనానికి తెగ నచ్చేసింది. అందుకే ఇప్పుడు అందరి దృష్టీ.. పెద్దాపురం నుంచి అమలాపురానికి మళ్లింది. చెప్పాలంటే.. సినిమాల్లో పెద్దాపురం ప్లేస్‌ను అమలాపురం భర్తీ చేస్తోంది. పెద్దాపురం కష్టాలు ఇప్పుడు అమలాపురానికి వస్తున్నాయన్నమాట. ఇదే అమలాపురం వాసులకు గుబులు పుట్టిస్తోంది. ఇంతవరకూ మాది అమలాపురం అని చెప్పుకున్నవాళ్లు.. ఇక సిగ్గుపడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు.

సినిమా సినిమాకో వివాదం

ఈ మధ్య కాలంలో అతిపెద్ద వివాదం అదుర్స్ సినిమాను వెన్నాడింది. ఈ సినిమాలోని పాటలో ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ వివాదం చెలరేగింది. సినిమాపై ఎఫెక్ట్ పడేలా కనిపించడంతో.. చివరకు పాటను మార్చాల్సి వచ్చింది.
ఇక అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 సినిమా కూడా ఇదే రకంగా వివాదాల్లో చిక్కుకుంది. రింగ రింగ అంటూ యూత్‌ను షేక్ చేసినా.. పాటలో దొర్లిన అసభ్య పదాలపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో.. పాటను మార్చారు.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా మంచిహిట్ కొట్టిన రెఢీ సినిమా కూడా వివాదాల బారిన పడింది. ముఖ్యంగా కూడిపూడి డ్యాన్స్‌ను అసభ్యంగా చిత్రీకరించడంపై.. కళాకారులు భగ్గుమన్నారు.
మహాత్స సినిమాలో గాంధీ గొప్పదనాన్ని వర్ణిస్తూ రాసిన పాట కూడా.. రాజకీయ సుడిగుండంలో చిక్కుకొంది. ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ అనడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. పాటను కొద్దిగా మార్చాల్సి వచ్చింది.
నటీనటులు.. షూటింగ్ లొకేషన్లు ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకునే డైరెక్టర్లు.. ఇలా కొన్ని విషయాల్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. అవికాస్తా పెద్ద సమస్యగా మారుతున్నాయి. కొంతమంది చేసిన తప్పులను సరిదిద్దుకుంటుంటే.. చాలామంది మాత్రం అలాగే వదిలేస్తున్నారు. కానీ.. ఓ ప్రాంతాన్నో.. ఓ సామాజికవర్గానో.. విమర్శించడం మాత్రం సరికాదని తెలుగు సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులు తెలుసుకోవాలి. ఎవరినీ నొప్పించకుండా సినిమా తీసినప్పుడే.. మంచి పేరు దక్కుతుందని అర్థం చేసుకోవాలి.
Read more...
4, జూన్ 2010, శుక్రవారం

బంగారం కొంటున్నారా?

0 comments

అక్షయ తృతీయ అమ్మకాలతో ఒడ్డున పడ్డామనుకున్న వ్యాపారులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తరుణమిది. పసిడి పండుగ తర్వాత.. పరిస్థితి మారవచ్చని అంతా అంచనా వేశారు. బంగారం ధర కాస్త తగ్గితే.. వ్యాపారం మరింత జోరందుకుంటుందనీ ఊహించారు. దీనికి తోడు.. పెళ్లిళ్ల సీజన్ మొదలువుతుంది కాబట్టి అమ్మకాలు పెరగవచ్చని భావించారు. ఇదే సమయానికి బంగారం ధర మరింత పెరిగింది. ఇప్పుడు తులం బంగారం ధర 20 వేలకు చేరువ అవుతోంది. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు పెద్ద ఎత్తున గోల్డ్ కొందామనుకున్నవారు కాస్తా.. వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో.. అమ్మకాలు పడిపోతున్నాయి. మ్యారేజ్ సీజన్‌లో కస్టమర్లతో కళకళలాడాల్సిన జ్యూయలరీ షాపులు.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సిన వారు మాత్రమే ఇప్పుడు నగల దుకాణాల మెట్లు ఎక్కుతున్నారు.
ధర ఇంకా పెరగవచ్చన్న అంచనాలు కస్టమర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రస్తుత ధరలకే కొనలేని పరిస్థితులున్నాయంటున్న జనం.. ఇంకా పెరిగితే.. బంగారాన్ని మర్చిపోవాల్సిందేనంటున్నారు. నగలు కొనుగోలు చేయడానికి ఇంతకాలం వెయిట్ చేసిన వారికి మాత్రం.. ఈ ధరలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు కొనలేక.. మరికొంత కాలం ఆగలేక తిప్పలు పడుతున్నారు. ధరలు తగ్గితే తప్ప.. బంగారం కొనలేమంటున్నారు.
ఐదేళ్ల క్రితంతో పోల్చితే దాదాపు 200 శాతం దాకా బంగారం ధరలు పెరిగాయి. ఇది ఊహించని పరిణామం. ఎప్పటికప్పుడు బంగారం కొనడాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్న వారికి మాత్రం తాజా గోల్డ్ రేట్స్.. చుక్కలు చూపిస్తున్నాయి.

ధర ఎందుకు పెరుగుతోంది..?

వరల్డ్ వైడ్‌గా జరిగే గోల్డ్ బిజినెస్ ఒకెత్తైతే.. మన దేశంలో జరిగే వ్యాపారం మరో ఎత్తు. ప్రపంచ వినియోగంలో దాదాపు 30 శాతం ఇండియాలోనే జరుగుతోంది. పైగా.. మన దేశంలో విభిన్న మతాలు.. సంస్కృతులు.. సంప్రదాయాలు కాబట్టి.. దేశంలో ఏదో ఓ అవసరం పేరుతో బంగారాన్ని కొంటూనే ఉంటారు. ఇక మన మగువల సంగతి సరేసరి. మిడిల్ క్లాస్ నుంచి హైక్లాస్ దాకా స్వర్ణాభరణం ఒక్కటన్నా లేనివారు ఒక్కరూ ఉండరు. పెళ్లిళ్లకూ.. ఫంక్షన్లకంటూ ఏదో ఓ పేరుతో ఎప్పటికప్పుడు తమ సింగారానికి బంగారంతో మెరుగులు పెట్టుకుంటూనే ఉంటారు. అందుకే.. పసిడికి ఇంత డిమాండ్.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బంగారం ఎక్కువగా అమ్ముడైంది మనదేశంలోనే. నిరుడితో పోల్చితే.. పసిడి అమ్మకాల్లో 698 శాతం వృద్ధి నమోదయ్యింది. అంటే.. దాదాపు 193.5 టన్నుల బంగారాన్ని జనవరి నుంచి మార్చి మధ్యలోనే మనవాళ్లు కొనేశారు. ఇంతగా బంగారంపై మోజు చూపిస్తున్నారు కాబట్టే.. ఆకాశాన్నంటుకొంటోంది.
దేశీయంగాఉన్న డిమాండ్ పుత్తడి ధరల పెరుగుదలకు ఓ కారణమైతే.. అంతర్జాతీయంగా ఏర్పడ్డ పరిస్థితులు మరో కారణం. గ్రీస్ సంక్షోభం నేపథ్యంలో.. యూరప్ స్టాక్ మార్కెట్లు వరసగా పతనం చెందుతున్నాయి. ఆ ప్రభావం మన స్టాక్‌మార్కెట్లపైనా పడింది. భారీ లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. షేర్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారంతా.. ఇప్పుడు బంగారంవైపు దృష్టి మళ్లించారు. షేర్ ట్రేడింగ్‌కు బదులు గోల్డ్ ట్రేడింగ్ చేస్తుండడంతో .. డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డిమాండ్ సప్లై సూత్రాన్ని ఫాలో అయ్యే ధరలు.. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.
అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో రూపాయి ధర కూడా పతనమవుతోంది. మంగళవారం నాడు.. 18 నెలల కనిష్టస్థాయికి రూపాయి విలువ పడిపోయింది. ఇది కూడా పుత్తడి విలువ పెరగడానికి కారణం.

పసిడి ధర దిగుతుందా?

బంగారం ధరలు కాస్త దిగివచ్చినా కొనుక్కోవాలన్న ఆలోచనలో ఎంతోమంది ఉన్నారు. పసిడి ధరలు నిలకడగా లేకపోవడంతో.. కొనాలా వద్దా అన్న నిర్ణయాన్ని చాలామంది తీసుకోలేకపోతున్నారు. ఇలా ఊగిసలాడుతుండగానే.. రెక్కలు విప్పుకొని అందనంత ఎత్తుకు ఎగిరిపోతోంది బంగారం.
ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధర మరో రెండు వారాల్లోగా 20 వేల చేరువలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. మన మార్కెట్‌లో పదిగ్రాముల బంగారం ధర 19800 వద్ద ఆగిపోవచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. స్టాక్‌మార్కెట్లు, గోల్డ్ రేట్స్ అనూహ్యంగా పెరిగినప్పుడు ఎంతో కొంత కరెక్షన్ రావడం సహజం. ఈసారి కూడా బంగారం ధర విషయంలో ఇలానే కరెక్షన్ రావచ్చని అంచనా వేస్తున్నారు. బహుశా.. 17 నుంచి 18 వేల మధ్యకు త్వరలోనే దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికిప్పుడు బంగారం కొనాలనుకునే వారు కొంతకాలం ఎదురుచూస్తేనే మంచిది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ అయిపోతే.. బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. పైగా వచ్చేది ఆషాఢం కాబట్టి ఆభరణాలు కొనడానికి ఎవరూ మొగ్గు చూపరు. బిజినెస్ పెంచుకోవడం కోసం కస్టమర్లకు రకరకాల ఆఫర్లను జ్యూయలరీషాపులు ఇచ్చే అవకాశం ఉంది. పైగా ఇంటర్నేషనల్ మార్కెట్‌ కాస్త కుదుట పడితే.. గోల్డ్ ట్రేడింగ్ నుంచి స్టాక్‌మార్కెట్లవైపు ఇన్వెస్టర్లు దృష్టి మళ్లిస్తారు. డిమాండ్ తగ్గుతుంది కాబట్టి, ధరలూ తగ్గుతాయి. అత్యవసరం అయితే తప్ప.. ఇప్పుడు బంగారం కొనకపోవడమే శ్రేయస్కరం.



Read more...

ప్రమోషన్ ఫీట్లు

0 comments

టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ మొదలయ్యింది. షూటింగ్ అయిపోయిన తర్వాత.. ఏసీ గదులు దాటి బయటకు రాని స్టార్లు.. మండుటెండల్లో ఫీట్లు చేయాల్సి వస్తోంది. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కిన వేదం సినిమా... ప్రమోషన్‌లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకొంటోంది. ముఖ్యంగా.. డైరెక్టర్ క్రిష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు సినిమా ప్రమోషన్‌లో తమ మార్క్ చూపించారు..

వేదం.. టాలీవుడ్‌లో లేటెస్ట్ మూవీ. గమ్యం సినిమాతో అందరినీ ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ క్రిష్ తీసిన రెండో సినిమా. చాలా డిఫరెంట్ స్టోరీని ప్లాన్ చేసుకున్న క్రిష్.. ఆర్టిస్టులను కూడా అంతే సెలెక్టెడ్‌గా తీసుకున్నాడు. వెరైటీ సినిమాలతో దూసుకెళుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను, ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న మనోజ్‌ను.. హీరోయిన్లలో టాప్ రేంజ్‌కు వెళ్లిపోయిన అనుష్కను మెయిన్ రోల్స్‌కు ఎంచుకున్నాడు. అంతేకాదు.. అనుష్కకు ఓ వేశ్య పాత్రను ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విడుదలకు ముందే.. ఇంత ఆసక్తిని క్రియేట్ చేసుకున్న వేదంపై.. క్రిష్‌కు భారీ అంచనాలే ఉన్నాయి.
మా సినిమా కాస్త డిఫరెంట్ అంటున్న వేదం టీం.. సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఇప్పుడు బిజీగా ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంతవరకూ చేయని ప్రయోగాలన్నింటినీ ఈ సినిమా కోసం చేస్తోంది. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ యాక్టివ్ పార్టిసిపేషన్‌తో.. సరికొత్తగా పబ్లిక్‌లోకి వెళ్లి వేదం ప్రమోషన్. సినిమాలో కేబుల్ రాజుగా నటించిన అల్లు అర్జున్ ప్రమోషన్ కోసం అదే రోల్‌ని రియల్‌లైఫ్‌లో ఎత్తాడు. వైర్ భుజాన తగిలించికొని.. కేబుల్ రిపేర్లు చేస్తామంటూ.. రోడ్డెక్కాడు.. కేబుల్ రావడం లేదని కంప్లైట్ వచ్చిందో లేదో.. అలా ఎలక్ట్రిక్ పోల్ ఎక్కేసి రిపేర్ చేసేశాడు. అక్కడితోనే అయిపోలేదు టీవీ సరిగ్గా వస్తుందా లేదా అన్నది చెక్ చేసి మరీ కెబుల్ సెట్ చేశాడు. సినిమాతో వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ను ఇలా ఉపయోగించాడు బన్నీ. వేదం సినిమా షూటింగ్ ఎక్కువగా జరిగిన ఫిలింనగర్‌లోని బస్తీలోనే ఈ వెరైటీ ప్రమోషన్ మొదలయ్యింది. అల్లు అర్జున్‌ను చూడడానికి... జనం కూడా భారీగానే వచ్చారు.

ప్రమోషన్‌కు పెద్దపీట

వెరైటీగా సినిమాను ప్రమోట్ చేయడంలో సరికొత్త మార్గాన్ని చూపించింది వరుడు సినిమా. వధువు ఎవరన్నది చెప్పకుండా.. చివరి వరకూ సస్పెన్స్‌ను క్రియేట్ చేయడంలో గుణశేఖర్.. అండ్ అల్లు అర్జున్ టీం సక్సెస్ అయ్యింది. వధువు ఎవరై ఉండొచ్చన్న టాక్..సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. అయితే.. వధువు పాత్రలో నటించిన భానుశ్రీ మెహ్రా అంతగా ఆకట్టుకోకపోవడంతో.. ప్రమోషన్ ప్లాప్ అయ్యిందనే చెప్పొచ్చు..
సినిమాకు క్రేజ్ పెంచడం కోసం.. వరుడు టీం మరో ప్రయత్నాన్ని చేసింది. పెళ్లిళ్లకు హాజరై.. అందరినీ ఆకట్టుకుంది. హీరో అల్లు అర్జున్, హీరోయిన్ భానుశ్రీ మెహ్రా, డైరెక్టర్ గుణశేఖర్‌లు మెహదీపట్నంలో జరిగిన ఓ పెళ్లికి హాజరై... వధూవరులను ఆశీర్వదించారు. సినిమా స్టోరీ పెళ్లి గురించే కాబట్టి.. పనిలో పనిగా తమ వరుడునూ ప్రమోట్ చేసుకున్నారు.
ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే.. జనం మధ్యకు వెళ్లాల్సిందేనన్న సత్యాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించారు టాలీవుడ్ హీరోలు. అందుకే.. యావరేజ్ టాక్ వచ్చినా... కలెక్షన్లు పెంచుకోవడానికి.. సక్సెస్‌టూర్‌లు నిర్వహిస్తున్నారు. థియేటర్లకు జనాన్ని రప్పించడం కోసం.. ఈ మధ్యే.. రామరామ కృష్ణ కృష్ణ యూనిట్.. హైదరాబాద్ థియేటర్లన్నింటినీ చుట్టేసింది.
ఇక సింహాతో చాలా కాలం తర్వాత సూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణ కూడా ప్రమోషన్‌ కోసం వెరైటీగానే ప్రయత్నించారు. సినిమాపై ముందుగానే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న బాలయ్య... సెకండాఫ్‌ కథను.. మెయిన్‌రోల్స్ ఫొటోలను బయటకు రానివ్వలేదు. రిలీజ్ టైంకి టీవీ ప్రోమోల్లోనే బాలకృష్ణ కొత్త గెటప్ కనిపించింది. సినిమాకు కలెక్షన్లను రాబట్టడంలో ఈ సీక్రెట్ బాగానే పనిచేసింది. సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత.. సినిమా బిజినెస్‌లో బాలకృష్ణ జోక్యం చేసుకోరన్నది ఇండస్ట్రీలో టాక్. కానీ.. సింహా తర్వాత ఆయన స్టైల్ మార్చారు. రాష్ట్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను సందర్శిస్తూ.. సింహా సక్సెస్‌టూర్‌ను వెరైటీగా నిర్వహించారు. అభిమానుల్లోకి వెళ్లడం ద్వారా.. సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టారు.
మొత్తం మీద సినిమాను ఎలా మార్కెట్ చేసుకోవాలో.. కాస్త ఆలస్యంగా తెలుసుకున్న తెలుగు ఇండస్ట్రీ, ప్రమోషన్ వర్క్‌లో ఇప్పుడు బిజీగా మునిగిపోతోంది.

బాలీవుడ్‌ బాటలో..
బాలీవుడ్‌లో లేటెస్ట్ సెన్షేషన్.. రాజ్‌నీతి. అందాల హొయలతో.. ప్రేక్షకులకు కిక్‌ ఎక్కించే గ్లామర్ గర్ల్ కత్రీనా కైఫ్ ఈ సినిమాలో పొలిటికల్ లేడీగా కనిపిస్తోంది. కత్రీనా పోషించిన పాత్రకు సోనియాగాంధీని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకున్నారన్న టాక్.. ఇప్పటికే సినిమాపై క్రేజ్‌ను పెంచింది. దీనికి తోడు.. ప్రమోషన్‌ను కూడా కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు దర్శక నిర్మాత ప్రకాశ్ జా. సోనియా తనయుడు.. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని ఇందుకు రోల్‌మోడల్‌గా ఎంచుకున్నాడు. రాజ్‌నీతిలో నటించిన రణబీర్ కపూర్‌కు రాహుల్ గాంధీ తరహాలో.. లాల్చీ పైజమా వేయించి ముంబై లోకల్ ట్రైన్స్ ఎక్కించాడు. ఎన్నికల సమయంలో ముంబైలో రాహుల్ తిరిగినట్లుగానే.. రణబీర్ కూడా లోకల్ ట్రైన్స్‌లో సందడి చేశాడు.
ఇక జెనీలియా, షాహిద్ కపూర్ జంటగా నటించిన ఛాన్స్ పే డ్యాన్స్ సినిమాకూ ప్రమోషన్ వర్క్ వెరైటీగానే సాగింది. సినిమా రిలీజ్‌కు ముందు.. ఓ రాత్రంతా మారుతి-800లో హీరోహీరోయిన్లిద్దరూ హాయిగా గడిపేశారు. అర్థరాత్రి వరకూ అందరితో సరదాగా మాట్లాడుతూ.. సినిమాను ప్రమోట్ చేసి.. ఆ తర్వాత మాత్రం కారులో నైటవుట్ చేశారు. రాత్రంతా కారులో గడిపినందుకు ఈ సినిమాకు భారీగానే ప్రచారం జరిగింది.
కండల వీరుడు సల్మాన్ నటించిన.. వీర్ సినిమాకు పబ్లిసిటీ తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమాను ప్రమోట్ చేయడం కోసం... సల్మాన్ రకరకాల విన్యాసాలు చేశాడు. సినిమాలో నటించినట్లే రియల్‌గానూ హార్స్ రైడింగ్ చేశాడు. స్టార్ హీరో అయినప్పటికీ.. ఏమాత్రం మొహమాట పడకుండా FM రేడియో స్టేషన్‌లకు వెళ్లాడు. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో టూర్ కూడా చేశాడు. ఇలా కష్టపడ్డందుకు.. అనుకున్న ఫలితమే సల్మాన్‌కు దక్కింది.


పాఠాలు నేర్పిన అమీర్

బాలీవుడ్ మొదలుపెట్టింది.. టాలీవుడ్ ఫాలో అవుతోంది. అయితే.. ఇలా బాలీవుడ్‌కు.. టాలీవుడ్‌కు పాఠాలు నేర్పిన వ్యక్తి ఒకరున్నారు. హిందీ సినిమాల ట్రెండ్‌నే మార్చేసి.. వరసగా మెగా హిట్‌లతో దూసుకెళుతున్న ఆ హీరోనే.. అమీర్‌ఖాన్. కళాత్మక విలువలున్న సినిమాను కమర్షియల్‌గా ఎల్ హిట్ చేసుకోవచ్చో చూపించాడు అమీర్‌ఖాన్. ఆయన చూపిన బాటనే.. ఇప్పుడందరూ ఫాలో అవుతోంది.

గజిని ... బాలీవుడ్ వరకూ చూస్తే.. ఓ రీమేక్ సినిమా. మామూలుగా అయితే.. సినిమా షూటింగ్ అయిపోయాక, ఓ ప్రెస్‌మీట్ పెట్టి, ఓ టీవీ షోలో కనిపిస్తే.. పబ్లిసిటీ అయిపోతుంది. అంతవరకే ఆలోచిస్తే.. అతన్ అమీర్‌ఖాన్ కానట్లే. సినిమా సీక్రెట్లను తన గుప్పిట్లో ఒడిసిపట్టిన ఈ క్రేజీ హీరో.. దానికి మించి ఆలోచించాడు. ఓ దక్షిణాది సినిమాకు రీమేక్‌గా మాత్రమే ప్రేక్షకులు భావించకుండా ఉంచడానికి సరికొత్త ట్రిక్ ప్లే చేశాడు. గజిని కోసం తన బాడీషేప్‌ను ఎలా మార్చుకున్నాడో.. వీడియోలు రిలీజ్ చేశాడు.. వీటికి ఊహించని ఆదరణే లభించింది. సినిమాపై క్రేజ్ పెరిగింది. అక్కడితోనే ఆగలేదు. సినిమా తీయడం ఎంత కష్టమో.. నిర్మాత ఎంత ఖర్చుపెట్టాలో తెలుసుకాబట్టి.. సినిమా ప్రమోషన్‌ను తన భుజాలపై వేసుకున్నాడు. దేశవ్యాప్తంగా పర్యటించాడు. పిల్లలకు గజిని స్టైల్లో కటింగ్ చేయించాడు. ఎంతోమందిని గజినీల్లా తయారు చేసి.. మీడియా ముందుకు వచ్చాడు. థియేటర్ల దగ్గర గజిని బొమ్మలు పెట్టించాడు. ప్రేక్షకులతో కలిసిపోయాడు.. ఒక్కటేమిటి.. ఇలా చెప్పుకుంటూ వెళితే.. ప్రమోషన్ కోసం అమీర్‌ఖాన్ చేయని పనిలేదు. రోటీన్‌కు భిన్నంగా అమీర్ చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యాయి. గజినీ మూవీ మెగా హిట్ అయ్యింది.
ఇక త్రీ ఇడియట్స్. సినిమాలో నటించిన ముగ్గురి హీరోల్లో ఒకడైనా.. ప్రచార భారాన్నంతా మోసింది అమీర్‌ఖానే. గజినీతో పోల్చితే.. మరికాస్త డిఫరెంట్‌గా ఈసారి జనంలోకి ఎంటరయ్యాడు. హంగూ ఆర్భాటాలు లేకుండా సామాన్యుల ముందు సడన్‌గా ప్రత్యక్ష మయ్యాడు. యమహాపురి కోల్‌కతాలోకి ఇలానే వచ్చిన అమీర్‌ను ముందు ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. వీధుల్లో నడుస్తూ.. సరదాగా గడిపాడు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటికీ వెళ్లాడు.
ఆ తర్వాత మారువేషంలో వారణాసికి వెళ్లాడు. అక్కడ మాయమై ఓ పంజాబీ పెళ్లిలో ప్రత్యక్షమయ్యాడు. ఓ క్లాస్‌మేట్ కోసం అతని స్నేహితులు వెతుకుతారన్న సినిమా కాన్సెప్ట్‌ను జనంలోకి ఇలా వెరైటీగా పంపించాడు.
అమీర్ ప్రమోషన్‌కు రిజల్ట్‌గా బాలీవుడ్‌లోనే అత్యధిక కలెక్షన్లను సాధించింది త్రీ ఇడియట్స్. అటు యాక్టింగ్‌లోనూ.. ఇటు ప్రమోషన్‌లోనూ అదరగొడుతూ.. బాలీవుడ్ మార్కెటింగ్ గురు గా ఎదిగాడు అమీర్‌ఖాన్.
ఎన్ని సినిమాలు చేశారన్నది ముఖ్యం కాదు.. చేసిన సినిమా ఎంత హిట్ అయ్యిందీ.. ఆ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చిందన్నదే ముఖ్యం. అందుకే.. లగాన్ తర్వాత.. పూర్తిగా రూటు మార్చేశాడు. సెలెక్టడ్ మూవీలే చేస్తూ... వాటినీ ప్రమోట్ చేసుకుంటూ.. అగ్రస్థానానికి ఎదిగాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో నిర్మాతలకు కావల్సిన ఏకైక హీరో అమీర్‌ఖాన్ మాత్రమే. ఇంత ఇమేజ్ రావడానికి కారణం.. అమీర్ అమలు చేస్తున్న మార్కెటింగ్ సూత్రాలే.

ప్రమోషన్ తప్పనిసరి
సినిమాలో కథ, కథనం ఎంత బాగున్నా.. ఆ సినిమా గురించి ప్రచారం జరగకపోయినా.. ప్రేక్షకుల్లో ఆసక్తి కలగించలేకపోయినా.. హిట్ అవడం చాలా కష్టం. సినిమాకు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా దక్కదు అందుకే... సినిమా పబ్లిసిటీపై నిర్మాతలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కొన్నాళ్ల క్రితం సినిమా పబ్లిసిటీ అంటే కేవలం సినీపత్రికల్లో ఇంటర్వ్యూలు.. కటౌట్లు.. పోస్టర్లు. ఈ మధ్య కాలంలో చూస్తే.. టీవీల్లో ప్రోమోలు.. హీరో హీరోయిన్లతో స్పెషల్ ఇంటర్వ్యూలు.. అయితే.. ఇవి మాత్రమే జనాన్ని ఆకర్షించలేకపోతున్నాయి. పైగా.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. మంచి మంచి విజయాలు వరసగా వస్తే తప్ప.. పరిశ్రమ మళ్లీ కుదుటపడడం కష్టం. అందుకే... పబ్లిసిటీ విషయంలో అమీర్‌ఖాన్ ఫాలో అవుతున్న చిట్కాలను టాలీవుడ్‌లో అమలు చేస్తున్నారు.
హైక్లాస్ ప్రచారానికి తప్ప మాస్‌లోకి వెళ్లి హీరోలు ప్రచారం చేసిన సందర్భాలు చాలా తక్కువ. సినిమా విడుదలకు ముందైతే అలాంటివి అసలు లేవనే చెప్పాలి. కానీ.. వేదం ప్రమోషన్‌తో అల్లు అర్జున్ ఓ కొత్త మార్గాన్ని టాలీవుడ్‌కు చూపించాడనే చెప్పొచ్చు. ఈ తరహా ప్రచారం వల్ల సినిమాకు ఎక్కువగా పబ్లిసిటీ వచ్చి.. ఓపెనింగ్స్ పెరిగే అవకాశాలున్నాయి. టాప్ హీరోలు కూడా ప్రచారానికి వస్తే.. వారి సినిమాలు మరో పదికోట్లు అదనంగా వసూలు చేసే అవకాశం ఉంది. అంతేకాదు.. వ్యక్తిగతంగానూ ఆ హీరోల ఇమేజ్ పెరుగుతుంది.
సినిమా తీయాలంటే.. కొన్ని కోట్లు కావాలి. పెట్టిన పెట్టుబడికి లాభం ఎంతో కొంత వచ్చినప్పుడు ఆ నిర్మాత మరో సినిమాను ధైర్యంగా తీయగలుగుతాడు. దానికి సినిమాలో నటించిన హీరోలు హీరోయిన్లు సహకరించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అమీర్‌ఖాన్‌లాంటి నమ్మకమైన హీరో తెలుగు నిర్మాతలకు కావాలి. ఆ ప్లేస్‌లో నేనున్నానంటూ ఇప్పటికే అల్లు అర్జున్ రోడ్డుపైకి వచ్చేశాడు. మరి మిగిలిన హీరోలు ఇంకా ఏసీ రూమూల్లోనే ఉంటారా.. లేక .. ప్రచారం కోసం జనం మధ్యకు వస్తారా..
Read more...

Labels

TOP (604) POLITICS (313) news (297) telangana (177) congress (117) entertainment (98) seemandhra (66) tdp (58) jagan (47) tollywood (45) chandrababu (36) bjp (30) cinema (28) ysrcp (28) CRICKET (27) kcr (26) election (25) trs (25) downloads (24) balakrishna (23) modi (22) sports (22) డౌన్‌లోడ్‌ (22) bifurcation (21) hyderabad (18) sonia (18) terrorist (17) cm kiran (15) division (15) cbi (14) samaikya protest (14) sex (14) technology (14) chiranjeevi (13) chirnajeevi (13) rahul gandhi (13) ANDHRA PRADESH (12) shinde (12) vijayawada (12) bollywood (11) cm (11) ramadasu (11) sachin (11) sankeertana (11) upa (11) youtube (11) kiran kumar (10) special (10) పాటలు (10) jail (9) ntr (9) ramcharan (9) health (8) world (8) anna hazare (7) dilsuknagar blast (7) pawan kalyan (7) POLLING (6) acb (6) botsa (6) cabinet note (6) case (6) deeksha (6) mahesh babu (6) padayatra (6) pavan (6) police (6) science (6) t note (6) varma (6) పుస్తకాలు (6) HOME MINISTRY (5) afzal guru (5) aishwarya (5) apngo (5) arrest (5) babu (5) delhi (5) digvijaysingh (5) gali (5) hang (5) india vs australia (5) kavuri (5) liquor (5) pranab (5) protest (5) results (5) sania (5) tjac (5) variety (5) vijayamma (5) తెలంగాణ (5) GOM (4) INDIAN MUJAHIDEEN (4) IPL (4) advani (4) all party meeting (4) bail (4) breaking news (4) cabinet (4) capital (4) china (4) death (4) dhoni (4) employees (4) gujarat (4) jayalalitha (4) life (4) maoist (4) ministers (4) murder (4) nagarjuna (4) pakistan (4) pallam raju (4) president (4) resign (4) retirement (4) tsunami (4) ఆరోగ్యం (4) సానియా (4) Amitab (3) BIHAR (3) FODDER SCAM (3) LALU PRASAD YADAV (3) MANMOHAN (3) assembly (3) businessman (3) byelection (3) cash for vote (3) court (3) crime (3) dasari (3) dgp (3) divotional (3) dl ravindra reddy (3) flood (3) ganesh immersion (3) haryana (3) helicopter (3) hindutva terrorism (3) hyderabad blasts (3) ias officer (3) india (3) jayasudha (3) ktr (3) letter (3) madyam (3) mamatha (3) mobile (3) photos (3) prajarajyam (3) priyanka (3) puri jagan (3) resigns (3) rohit sharma (3) scam (3) space (3) specail (3) sridevi (3) sriram rajyam (3) sushma swaraj (3) tamilnadu (3) tirumala (3) tirupati (3) train (3) tv9 (3) up results (3) virat kohli (3) voters (3) చంద్రబాబు (3) తిరుపతి (3) తిరుమల (3) నక్సల్స్‌ (3) మావోయిస్ట్‌ (3) BALAPUR LADDU (2) CHALO ASSEMBLY (2) CHIDAMBARAM (2) COAL SCAM (2) POLITITCS (2) airlines (2) akbaruddin (2) akkineni (2) america (2) anti rape bill (2) ap capital (2) attack (2) attarintiki daredi (2) australia (2) baba ramedv (2) bapu (2) bezawada (2) bomb blast (2) budget (2) building (2) business (2) car (2) cheating (2) clarke (2) core committee (2) daggubati book (2) death centence (2) deepika (2) delhi tour (2) diamond (2) digvijay (2) dlf (2) electricity (2) emotions (2) etv (2) family war (2) farmers (2) flex dispute (2) governor (2) harikrishna (2) heroin (2) heroine anjali (2) highcourt (2) indian railway (2) jaggareddy (2) jaipur one day (2) jana sena party (2) jd sheelam (2) kajal (2) kamal hasan (2) kasab (2) kedarnath (2) kerala (2) kodandaram (2) kollywood (2) krishna district (2) kvp (2) laddu (2) lanka vs india (2) lb stadium meeting (2) loan waiver (2) lokesh (2) love (2) march (2) mayabazar (2) merger (2) mim (2) money (2) mopidevi (2) movie (2) mps resign (2) nadendla manohar (2) nagababu (2) national (2) naxal (2) nayana tara (2) nda (2) new party (2) norway couple (2) padma awards (2) parliament (2) payyavula keshav (2) petrol (2) pm post (2) power cuts (2) power strike (2) prabhas (2) purandeshwari (2) raids (2) rajyasabha (2) ramoji (2) rastrapathi (2) records (2) rift in bjp (2) robert vadra (2) rtc (2) sale (2) samaikya (2) samaikya shankaravam (2) sanjay dutt (2) sashikala (2) satya sai (2) satyam (2) secret note (2) settlers (2) sharmila (2) sharukh (2) sonia angry (2) south india shopping mall (2) speaker (2) spy (2) strike (2) strike call off (2) sunil reddy (2) supreme court (2) syndicate (2) taj mahal (2) tamil cinema (2) tihar jail (2) transfer (2) ttd (2) tv18 (2) up (2) uppal test (2) vamshi (2) venkanna (2) vileenam (2) vishaka (2) war (2) wineshop (2) ఈవీఎం (2) గ్లోబల్‌వార్మింగ్ (2) చిరంజీవి (2) నాసా (2) రాజశేఖరరెడ్డి (2) వైఎస్‌ (2) హైదరాబాద్ (2) 10 pack (1) 1000 tonnes gold (1) 1000cr club (1) 11 yrs boy became father (1) 16 years (1) 24gantalu (1) 30 floor building (1) 30 years 60 transfers (1) 360 hours (1) 5day work (1) 5kg cylinder (1) 9 wickets (1) ACCOUNTS (1) ALAKANANDA (1) BANKS (1) Briton (1) Briton Pm (1) Chhattisgarh (1) Cockroaches (1) DEPOSITS (1) DHARI DEVI (1) External Affairs (1) Finland (1) GVK (1) HYDRO POWER PROJECT (1) IED (1) JASHODABEN (1) MALALA (1) MIN CARDS (1) MNIC (1) MODI WIFE (1) MOM (1) NIMS (1) NOMINATION (1) OATH TAKING CERMONY (1) ORDINENCE (1) OSMANIA HOSPITAL (1) RECORD PRICE (1) RESIGN WITHDRAW (1) Rs. 20 kg rice (1) SARVEY (1) SHAILAJANATH (1) SRC (1) TELANGANA GOVERNMENT (1) TWENTY 20 (1) UK (1) UTHARAKAND (1) VOTE MISSING (1) abhaya case (1) abhishesk (1) abhishesk bachan (1) abuse (1) accident (1) adhinayakudu (1) ads (1) aiadmk (1) air india (1) ajith singh (1) ak antony (1) ali khan (1) all time record (1) alliance (1) anam ramnarayana (1) andaman (1) andhra (1) android app (1) animals (1) animation (1) anushka (1) aob (1) ar rehman (1) aradhya (1) arasavalli (1) archakulu (1) armoor (1) armur (1) arushi talwar (1) asaduddin (1) ashok babu (1) ashok khemka (1) asi (1) asia cup (1) asif ali zardari (1) assets (1) assom (1) atheist (1) atrocities (1) attack on maa tv (1) attahrintiki daredi (1) audio release (1) awards (1) ayodhya (1) azhaharuddin (1) babu assets (1) babu bike ride (1) babu food (1) bachan (1) badhsha (1) bahubali (1) bail for sale (1) bajaj (1) balaji (1) balakrishna daughter wedding card (1) ball of the century (1) ban (1) bandh (1) bandla ganesh (1) bangalore (1) bangaru talli (1) battle (1) bcci (1) beauty parlour (1) bengal (1) bengalore one day (1) betiB (1) bharataratna (1) bharathi (1) bhubaneshwar (1) bhuvaneshwar (1) bike racing (1) bikshagalla jac (1) bimari poster (1) blast (1) blog (1) blue film (1) boat (1) bokaro express (1) bombay bomb blast (1) books (1) brahmanandam (1) brand Ambassador (1) breast milk (1) bride (1) bride dance (1) brother anil (1) bundh (1) bussiness (1) butta renuka (1) byeelection (1) cameron (1) cancer (1) cannes (1) cartoon (1) cases (1) cash (1) cash seize (1) cashflow (1) cave (1) cellphone (1) censor board (1) central ministers (1) century (1) chakrapani (1) chanchalguda (1) chandra babu toungue slip (1) chardham yatra (1) charges (1) chennai airport (1) chicken rate (1) chicken@Rs.70 (1) child selling (1) child sexual abuse (1) children in the bus (1) chowtala (1) coffin (1) collapse (1) collections (1) colours awards (1) cooldrinks (1) cosmic ghost (1) courier (1) court notice (1) crash (1) credit card (1) culture (1) cwc (1) cyber crime (1) daggubati (1) danam (1) dance (1) dancing frogs (1) daughter (1) daundia kheda (1) dead (1) decision (1) delivery (1) dengue (1) devineni nehru (1) devineni uma (1) dhyanchand (1) diabetes (1) differences (1) divorce (1) dkaruna (1) dmk (1) doosukeltha (1) double century (1) double murder case (1) dowry (1) dravid (1) droupadi (1) drugs (1) dubai link (1) dubbing serials protest (1) ed (1) element (1) emaar (1) emmar (1) energy saving (1) environment (1) escape plan (1) etela (1) ex cm jail (1) excavation (1) extention (1) facebook (1) fake currency (1) fake notes (1) female selection (1) fever (1) film photo (1) fine (1) first look (1) first week collections (1) fish (1) five state election (1) flood area visit (1) folding car (1) formers (1) gabbarsingh (1) gaddafi (1) gadde (1) ganapathi (1) ganesh (1) gang rape (1) gas (1) geerareddy news (1) geeta reddy (1) george bailey (1) getups (1) girl (1) gmr (1) go air (1) goa (1) golden temple (1) gotlam accident (1) govindudu andarivadele (1) gudiwada (1) guinnes record (1) gun culture (1) guntur (1) hanta virus (1) hanuman junction (1) harish rao (1) harrasment (1) helicopter scam (1) high alert (1) hike (1) himachal govt (1) himalayas (1) hindu (1) hiriko (1) homeshop18 (1) hooch death (1) hooda (1) hot photos (1) hotel dasapallah (1) house (1) hrutik roshan (1) huffingtonpost.com (1) hug (1) humanity (1) income tax (1) india pakistan world cup (1) india vs lanka (1) india vs westindies (1) india won (1) indian origin (1) indian scientists (1) indonesia (1) indonesia open (1) indu links (1) inflation (1) ink attack (1) inspiring (1) iphone (1) iron ore mines (1) isro (1) it raids (1) italy (1) jac (1) jagan case (1) jarawa tribe (1) jc (1) jeedimetla (1) jesus (1) journalist protest (1) jsp (1) jumpings (1) jyothisam (1) jyothy (1) kalam (1) kanimuri bapiraju (1) kanna (1) kapil sibal (1) katama rayuda song (1) katrina (1) kavitha (1) kbc 7 (1) kbr park firing (1) kedarnath old photo (1) kesineni nani (1) khammam (1) kingfisher (1) kings punjab (1) kiran kumar reddy (1) kishan ji (1) kiss (1) kiss scene (1) kk (1) kodali nani (1) kohinoor (1) kolkata test (1) komatireddy (1) koneru prasad (1) koratala shiva (1) koun banega crorepati (1) krishna (1) krishna devaraya (1) krishna flood (1) krishnavamshi (1) krrish-3 (1) kuppam (1) kurnool (1) lady vip (1) lagadapati (1) lagadapati sawal (1) land pooling (1) landmine blast (1) lavanam (1) lease cancel (1) levy (1) libya (1) lobbying (1) loksabha (1) lord balaji (1) lord shiva (1) love jihad (1) made in telangana (1) madhya pradesh (1) maha sankalpam (1) malaika (1) manam (1) manasarovar yatra (1) mangalagiri (1) mangalyan (1) manisha (1) mansoon (1) maos turnover (1) markus bantle (1) marlapadu (1) mars (1) match fixing (1) maxwell (1) meat (1) media (1) meera kumar (1) mega family (1) mejarity (1) metro rail (1) migration (1) milatary coup (1) minister (1) minister son arrest (1) ministers resign (1) miss universe (1) missing (1) mlas (1) mohan babu (1) money transfer scheme rangarajan (1) mono rail (1) moon (1) mother milk (1) mount kailash (1) movie on arushi (1) mp (1) mps (1) mr perfct (1) mulayam (1) mumbai (1) mumbai blast (1) muni koti (1) muslim (1) nagam janardhan reddy (1) nagapur test (1) nalgonda (1) nandamuri wedding (1) nandi (1) nannapaneni (1) narasimhan (1) nato (1) ncp (1) ncs sugar factory (1) new rules (1) new scheme (1) newzealand (1) nimajjanam (1) nityananda (1) no assembly teermanam (1) no chain (1) no power generation (1) nobel peace price (1) noconfidence motion (1) noida (1) nomophobia (1) notice (1) nuclear power plant (1) nude (1) nude dance (1) nude pose (1) nukarapu surya prakasharao release (1) nun (1) obama (1) obama care (1) obesity (1) obuleshu (1) old (1) omc (1) one nation one card (1) onion price (1) online sale (1) operation (1) operation three star (1) original painting (1) over speed (1) over weight (1) padmashree (1) palakollu (1) panchayat election (1) paper (1) parliament attack (1) patna blast (1) patolla (1) pattabhi (1) penguin (1) petrol bunks (1) phokhran (1) photo shoot (1) pin (1) plane (1) plane ticket charges (1) pm (1) pm candidate (1) pmo (1) police checking (1) police security (1) police van (1) political entry (1) polling dates (1) polling percentage (1) poonam (1) population (1) potato (1) power (1) pradeep kasni (1) pre poll survey (1) pregnant (1) priests (1) prince William (1) problem (1) property (1) prostitution (1) prp (1) psycho (1) publicity (1) pujara (1) pune warriors (1) punishment (1) punjab (1) pv narasimharao (1) rabert vadra (1) rachabanda (1) ragging (1) rail budget (1) railway budget (1) railway charges (1) railway minister (1) railway station (1) rains (1) rajamouli (1) rajanarshimha (1) ramana deeskhitulu (1) ramayanam (1) ramleela (1) rampshow (1) ranchi (1) rani rudrama (1) ravi prakash (1) ravindra jadeja (1) rayala seema (1) rayala telangana (1) rbi (1) record chase (1) red plate (1) regional (1) rehman (1) reject (1) release post pone (1) reliance (1) renuka chowdary (1) research (1) reservations (1) revanth reddy (1) rpt (1) rythu garjana (1) sad (1) sahara (1) sai kumar (1) sailajanath (1) saina (1) samajwadi win (1) samara deeksha (1) samba (1) sangareddy (1) sanghi temple road murder (1) sarees (1) satya sai maha samadhi (1) satya-2 (1) save andhra pradesh (1) save fuel (1) savitri (1) school (1) school bus (1) secret behind kedarnath survival (1) secunderabad (1) seemandhra vidyut jac (1) sehwag (1) seize (1) seized (1) september 17 (1) setaire (1) sewage (1) sexual harassment (1) shami (1) shani (1) shankarrao (1) sharad pawar (1) shaving (1) shikar dhawan (1) shilpa shetty sarees (1) shiva temple (1) shutdown (1) shwetha basu prasad (1) sikkim (1) singapore (1) sixteen (1) slap (1) slipped (1) sms (1) sonam kapoor (1) sonia assets (1) sonia warns rahul (1) sony (1) sorangam (1) southwest monsoon (1) special package to seemandhra (1) special state (1) special status (1) spy reddy (1) src report (1) srilanka (1) stalin (1) starwar (1) state (1) state formation day (1) statement (1) states reorganisation (1) stone attack (1) stone pelting (1) suicide (1) sunny leone (1) super innings (1) super match (1) survey (1) suryaa (1) swiping (1) t bill (1) t leaders meet (1) t20 world cup (1) tamannah (1) tamil (1) tarun tejpal (1) tata nano (1) tata pixel (1) tax (1) tax abolished (1) tbill (1) tcong mps (1) teen sex (1) tehelka (1) tehseen aktar (1) telangana formation day (1) telugu vari charitra verpatu vadam (1) temple (1) tennis (1) termination (1) tg venkatesh (1) tomb (1) tourism (1) town for sale (1) transco (1) tribes (1) triseries (1) ttd chairman (1) ttdp fire (1) tuglaq road (1) tv artists (1) twin blasts (1) unique wedding (1) us shooting (1) us shutdown (1) usa (1) ut (1) utv movie (1) vaartha (1) vaastu (1) valasa (1) varun gandhi (1) varun tej (1) veena malik (1) viagra (1) victory (1) vikaruudin (1) vimochana dinam (1) violence (1) vishakha tour (1) vishnu (1) vishwaroopam (1) vizianagaram (1) viziayanagaram (1) vote (1) vote for cash (1) warangal (1) warning (1) water bill default (1) water bomb (1) water pollution (1) websites (1) west godavari (1) west indies (1) whitehouse (1) wife killed husband (1) will (1) without beard (1) yachaka jac (1) yarlagadda (1) yasin bhatkal (1) young india (1) ys accident (1) ysr (1) zee 24 gantalu (1) అసదుద్దీన్ (1) ఆంధ్ర (1) ఇంటర్నెట్ (1) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (1) ఉగ్రవాదం (1) ఉచిత బియ్యం (1) ఎటిఎం (1) ఎన్డీఏ (1) ఐపీఎల్‌ (1) కట్నం (1) కత్రీనా కైఫ్‌ (1) కరీంనగర్‌ (1) కిరీటం (1) కేరళ (1) కేసీఆర్‌ (1) కొవ్వూరు ఎమ్మెల్యే (1) కోటిలింగాల (1) కౌగిలి (1) ఖగోళం (1) గఢాఫీ (1) చందమామ (1) జగన్ (1) జేసీ దివాకర్‌రెడ్డి (1) టిఆర్‌ఎస్‌ (1) టిటిడీ (1) డీజీపి (1) దగ్గుబాటి (1) ద్రౌపది (1) నగదు బదిలీ (1) నగదు బదిలీ పథకం (1) నాగార్జున (1) నిమజ్జనం (1) పటేల్‌ (1) పిఆర్పీ (1) ప్రణబ్ (1) ప్రభాస్ (1) ప్రొటెం స్పీకర్‌ (1) ఫోటోలు (1) బడ్జెట్‌ (1) బిజినెస్ (1) బిల్లా (1) బీటీ వంకాయ (1) బొద్దింకలు (1) మంత్రులు (1) మజ్లిస్ (1) మణెమ్మ (1) మహాకూటమి (1) మాయాబజార్ (1) మూడో కూటమి (1) యార్లగడ్డ (1) రజనీకాంత్ (1) రహమాన్‌ (1) రహ్మాన్ ఇంటర్వ్యూ (1) రహ్మాన్‌ (1) రాజకీయాలు (1) రామారావు (1) రాయలసీమ (1) రిగ్గింగ్‌ (1) రుతుపవనాలు (1) లిబియా (1) వజ్రం (1) వరదలు (1) విడాకులు (1) వినాయకచవితి (1) విశ్వం (1) వేంకటేశ్వరుడు (1) వైఎస్ మృతి (1) వైరస్ (1) శాతవాహనులు (1) శివపుత్రులు (1) శ్రీశైలం నీళ్ళు (1) సచిన్ (1) సత్యం (1) సానియా పెళ్లి ఫోటోలు (1) స్మశానం (1)