హైదరాబాద్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఇకపై వారానికి ఐదురోజులే పనిదినాలను ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ సంక్షోభానికి పరిష్కారాలను వెదుకుతున్న ప్రభుత్వం.. ఈ ఐదు రోజుల పనిదినాలను కూడా అందులో భాగంగానే అమలు చేయాలనుకొంటోంది. వారానికి ఐదు రోజులే ప్రభుత్వ కార్యాలయాలను తెరవడం ద్వారా, 5 నుంచి 6 మిలియన్ విద్యుత్ యూనిట్లను ఆదా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సీఎం కిరణ్ తో చర్చలు జరిపారు. త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే.. వారంలో ఆరు రోజులు పనిచేస్తేనే పెండింగ్ లో ఎన్నో ఫైళ్లు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఐదురోజుల పనిదినాల పద్ధతిపై మాత్రం సామాన్యుల్లో అసంతృప్తే వ్యక్తమవుతోంది.
Read more...
5day work లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
5day work లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
22, జనవరి 2013, మంగళవారం
ప్రభుత్వోద్యోగులకు వారానికి ఐదు రోజులే పని
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
