ఏ ముహూర్తాన విశ్వరూపం సినిమా మొదలుపెట్టాడో గానీ, విలక్షణ నటుడు, నిర్మాత,దర్శకుడు కమల్ హాసన్ కు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. తన కలల ప్రాజెక్టు విశ్వరూపం ఎన్నో కష్టాలకు ఓర్చి తీసి.. విడుదల చేద్దామనుకునేసరికి వరసగా వివాదాలు చుట్టుముట్టాయి. పైరసీకి అడ్డుకట్ట వేసేలా.. థియేటర్ల కన్నా ముందుగా డీటీహెచ్ లలో రిలీజ్ చేయాలనకున్న కమల్ ప్రయత్నాన్ని తమిళనాడు థియేటర్ల యజమానులు అడ్డుకున్నారు. తమిళనాడులో ఎక్కడా సినిమా రిలీజ్ చేయమని చెప్పడంతో, కమల్ మనసు మార్చుకోక తప్పలేదు. ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక, తమిళనాడులోని ముస్లిం సంఘాలు విశ్వరూపానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. ముస్లింలకు వ్యతిరేకంగా విశ్వరూపం సినిమా ఉందని, దానిపై నిషేధం విధించాలని డిమాండ్ చేశాయి. పైగా, మహ్మమద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ రోజే ఈ సినిమా విడుదలవడంతో, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన తమిళనాడు సర్కార్ విశ్వరూపంపై నిషేధాన్ని విధించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు కమల్. షెడ్యూల్ ప్రకారం 25వ తేదీనే విడుదలయ్యే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, ఈ సినిమాను ప్రివ్యూ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, ఈనెల 26న ప్రివ్యూ ఏర్పాటు చేయాలని కోర్టు కమల్ ను ఆదేశించింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. శుక్రవారం రోజు ఓవర్ సీస్ రిలీజ్ కోసం అమెరికా చేరుకున్న కమల్.. సినిమా రిలీజ్ పై పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. అయితే, అమెరికాలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావడంతో ముందుగానే విడుదల చేసినా ఆశ్చర్యం లేదు.
Read more...
release post pone లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
release post pone లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
24, జనవరి 2013, గురువారం
కమల్ హాసన్ కు అన్నీ కష్టాలే
Categories :
ban . entertainment . kamal hasan . kollywood . movie . release post pone . tamil cinema . TOP . vishwaroopam
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
