ఉయ్ లైక్ బ్యాడ్ బాయ్స్... అంటూ బిజినెస్ మేన్ లో పెట్టిన పాట ఇప్పటికే వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలిసింది. రాముడిని కించపరిచారని, పాటను సినిమా నుంచి తొలగించాలంటూ విశ్వహిందూ పరిషత్ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తూనే ఉంది. కొంతమంది సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్లో దీనిపైనే ఇవాళ ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై స్పందన కోరినప్పుడు బిజినెస్ మేన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. పనీపాటా లేనివాళ్లకే మనోభావాలుంటాయంటూ, కేసులు పెట్టడంపై ఘాటుగా స్పందించారు పూరీ. పాటపెట్టడమే పెద్ద తప్పైతే, అవమానించి, మరో తప్పు చేశారంటూ మండిపడుతున్నారు హిందుత్వ సంస్థల నేతలు.
Read more...
businessman లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
businessman లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
23, జనవరి 2012, సోమవారం
పనీ పాటా లేనివాళ్లకే మనోభావాలా...?
Categories :
businessman . entertainment . mahesh babu . puri jagan . TOP
9, జనవరి 2012, సోమవారం
మహేశ్ ముద్దును ఎంజాయ్ చేసిన నమ్రత
Categories :
businessman . entertainment . kajal . kiss scene . mahesh babu . TOP
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. ఈ సారి రెచ్చిపోతున్నాడు. బిజినెస్ మేన్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న మహేశ్, హీరోయిన్ కాజల్ ను లిప్ లాక్ చేశాడు. ఇప్పటివరకూ హీరోయిన్లతో ఇలాంటి సీన్లకు దూరంగా ఉన్న మహేశ్ ఈ సారి మాత్రం కట్టుదాటేశాడు. ఆర్య - 2లో అల్లు అర్జున్ తో పెదాలపై ముద్దు పెట్టించుకున్న కాజల్, మహేశ్ విషయంలో మరింత చొరవచూపించింది. ఈ లిప్ లాక్ సీన్ దాదాపు నిమిషం పాటు తెరపై కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథే ప్రకటించాడు. కాజల్ కు ముద్దివ్వడానికి మహేశ్ భార్య నమ్రత కూడా సిగ్నల్ ఇచ్చిందట. ప్రివ్యూ చూపించినప్పుడు ఈ సీన్ ను ఆమె బాగా ఎంజాయ్ చేసిందట. ఈ సంగతీ పూరీగారే సెలవిచ్చారు.
Read more...
11, నవంబర్ 2011, శుక్రవారం
11.11.11. మహేశ్ బాబు బిజినెస్ మ్యాన్ ఫస్ట్ పోస్టర్
Categories :
businessman . cinema . entertainment . mahesh babu . puri jagan . tollywood . TOP
11.11.11 ను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. మళ్లీ తెలుగులో భారీ హిట్ కొట్టాలని ఎంతో కసిగా మహేశ్ బాబుతో తీస్తున్న బిజినెస్ మ్యాన్ పోస్టర్ ను ఈ సందర్భంగా రిలీజ్ చేశాడు. వచ్చే నెల 11కు ఆడియోను లాంచ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నాడు. అంతేకాదు, జనవరి 11 న రిలీజ్ కు సన్నాహాలు చేసుకుంటున్నాడు. అన్నీ పదకొండ్లే కుదిరేలా కదులుతున్నాడు. పోకిరి రికార్డులను మహేశ్ తాజా చిత్రం దూకుడు బద్దలు కొట్టడంతో, వాటిని బిజినెస్ మ్యాన్ తిరగరాస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు పూరీ. అంతేకాదు, వరసగా ప్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డ తన కెరీర్ ను, ఆర్థిక స్థితిని ఈ సినిమాతో మార్చుకోవాలనుకుంటున్నాడు. బెస్టాఫ్ లక్ జగన్.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)


