అందాలతార ఐశ్వర్యారాయ్ కూతురు ఫోటోల కోసం క్రేజ్ మొదలయ్యింది. ఐస్ ఎవరిని కంటారని ఇంతకాలం ఎదురుచూసిన ప్రపంచం.. ఇప్పుడు ఐస్ కూతురు ఎలా ఉంటుందో చూడాలనుకొంటోంది. అయితే, బచ్చన్ లు మాత్రం ఇంతవరకూ తమ వారసురాలి ఫోటోలను విడుదల చేయలేదు. ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయిన సమయంలోనూ.. ఎవరికీ పాప కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే.. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోటోల కోసం కొన్ని మ్యాగజైన్లు బచ్చన్ కుటుంబాన్ని సంప్రదిస్తున్నాయని పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అయితే, ఏకంగా ఐస్ కూతురి ఫస్ట్ ఫోటోల కోసం ఐదుకోట్లు ఇవ్వడానికి సిద్ధపడిందట. అయితే.. ఇవన్నీ వట్టి పుకార్లేనని అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. తమ వ్యక్తిగత విషయాలతో వ్యాపారం చేయమని తేల్చి చెప్పారు. అభి-ఐస్ ల వివాహ సమయంలోనూ ఇలాంటి వదంతులే పుట్టించారని, కానీ తామెవరికీ హక్కులు అమ్ముకోలేదని చెప్పారు.
Read more...
betiB లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
betiB లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
2, డిసెంబర్ 2011, శుక్రవారం
ఐస్ కూతురికి ఐదు కోట్ల డిమాండ్..
Categories :
aishwarya . betiB . daughter . entertainment . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
