పార్టీ ఇమేజ్ ను పెంచడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాళ్లరిగేలా జనంలో తిరుగుతుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం సీట్ల కోసం కీచులాడుకుంటున్నారు. ముఖ్యంగా బెజవాడ పార్లమెంట్ సీటు కోసం నేతల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ఓ రకంగా చంద్రబాబే ఈ వివాదానికి ఆజ్యం పోశారని చెప్పాలి. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేశారు. అయితే, ఈ మధ్య పార్టీలో చేసిన మార్పులతో విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవినుంచి వంశీని తప్పించిన చంద్రబాబు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా కేశినేని ట్రావెల్స్ అధినేత నానిని నియమించారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన నానికి ఈ పదవి కట్టబెట్టడంపై వంశీవర్గం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, గతంలో విజయవాడ ఎంపీగా గెలిచి, అనంతరం రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన గద్దె రామ్మోహన్, ఈసారి విజయవాడ ఎంపీ స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కేశినేని నానిని ఇంఛార్జ్ గా నియమించడంతో, ఇక ఆ స్థానం తనకు దక్కదనుకున్న ఆయన, నేరుగా చంద్రబాబు దగ్గరే పంచాయతీ పెట్టారు. విజయవాడ ఎంపీసీటు తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన గద్దె, పనిలో పనిగా, విజయవాడ నుంచి దేవినేని నెహ్రూపై, ఆయన సోదరుడు దేవినేని ఉమను పోటీకి దింపాలని కూడా బాబుకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు వంశీ కూడా తనను అర్బన్ అధ్యక్ష పదవినుంచి తొలగించడంపై అసంతృప్తితో ఉన్నారు. నేతల మధ్య తగవుతో విజయవాడలో టీడీపీ పరిస్థితి ఏమవుతుందో అనే ఆందోళనలో పార్టీ కార్యకర్తలున్నారు.
vamshi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
vamshi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
4, ఏప్రిల్ 2013, గురువారం
బెజవాడ సీటు కోసం తమ్ముళ్ల కీచులాట
Categories :
devineni uma . gadde . kesineni nani . POLITICS . tdp . TOP . vamshi . vijayawada
పార్టీ ఇమేజ్ ను పెంచడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాళ్లరిగేలా జనంలో తిరుగుతుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం సీట్ల కోసం కీచులాడుకుంటున్నారు. ముఖ్యంగా బెజవాడ పార్లమెంట్ సీటు కోసం నేతల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ఓ రకంగా చంద్రబాబే ఈ వివాదానికి ఆజ్యం పోశారని చెప్పాలి. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేశారు. అయితే, ఈ మధ్య పార్టీలో చేసిన మార్పులతో విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవినుంచి వంశీని తప్పించిన చంద్రబాబు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా కేశినేని ట్రావెల్స్ అధినేత నానిని నియమించారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన నానికి ఈ పదవి కట్టబెట్టడంపై వంశీవర్గం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, గతంలో విజయవాడ ఎంపీగా గెలిచి, అనంతరం రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన గద్దె రామ్మోహన్, ఈసారి విజయవాడ ఎంపీ స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కేశినేని నానిని ఇంఛార్జ్ గా నియమించడంతో, ఇక ఆ స్థానం తనకు దక్కదనుకున్న ఆయన, నేరుగా చంద్రబాబు దగ్గరే పంచాయతీ పెట్టారు. విజయవాడ ఎంపీసీటు తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన గద్దె, పనిలో పనిగా, విజయవాడ నుంచి దేవినేని నెహ్రూపై, ఆయన సోదరుడు దేవినేని ఉమను పోటీకి దింపాలని కూడా బాబుకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు వంశీ కూడా తనను అర్బన్ అధ్యక్ష పదవినుంచి తొలగించడంపై అసంతృప్తితో ఉన్నారు. నేతల మధ్య తగవుతో విజయవాడలో టీడీపీ పరిస్థితి ఏమవుతుందో అనే ఆందోళనలో పార్టీ కార్యకర్తలున్నారు. 30, ఏప్రిల్ 2012, సోమవారం
వంశీకి షోకాజ్ వెనుక బాలయ్య హస్తం?
విజయవాడ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీకి చంద్రబాబు నాయుడు షోకాజ్ నోటీస్ జారీ చేయడం వెనుక బాలయ్య హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో బహిరంగంగా జగన్ ను కలుసుకోవడంతో పాటు, వంశీ అతన్ని కౌగలించుకోవడం ఇప్పటికే పెద్ద వివాదాన్ని సృష్టించింది. పార్టీలో పట్టుపెంచుకోవడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్న బాలకృష్ణ ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. దీనిపై చంద్రబాబు దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే వెంటేనే షోకాజ్ ఇవ్వాలని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
అసలు గొడవ దమ్ముదేనా..!
ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమా రిలీజ్ కు.. వంశీ జగన్ ను కలవడానికి మధ్య లింకు ఉన్నదన్నది బాలయ్య అనుమానం. సినిమా రిలీజ్ రోజునే కృష్ణా జిల్లాలో బందర్ పోర్టు సాధన కోసం బంద్ నిర్వహించారు. రిలీజ్ నేపథ్యంలో దీన్ని వాయిదా వేసుకోవాలంటూ కొడాలి నాని, వంశీలు కోరినా.. టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు దీనికి అంగీకరించలేదు. అఖిలపక్షంతో కలిసి బంద్ నిర్వహించారు. అయితే.. కొడాలి నాని మాత్రం గుడివాడలో థియేటర్ల యజమానులతో మాట్లాడి సినిమాను విడుదల చేయించారు. విజయవాడలో మాత్రం ఉదయాన్నే సినిమా విడుదల కాలేదు. కొడాలి నాని, వంశీలు బందర్ పోర్ట్ బందుకు దూరంగానే ఉన్నారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ తో నాని, వంశీలు చర్చించారు. కృష్ణాజిల్లా టూర్ లో ఉన్న జగన్ ను పబ్లిక్ గా కలవడం ద్వారా.. పార్టీ నాయకత్వంలో కల్లోలం పుట్టించాలని ఎన్టీఆర్ చెప్పిన మేరకే, వంశీ ధైర్యం చేసి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలకృష్ణ.. చంద్రబాబుతో సీరియస్ గానే చర్చించినట్లు తెలుస్తోంది. "పార్టీని ధిక్కరించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.జూనియర్ల మీద (ఎన్టీఆర్) మనం ఏమాత్రం ఆధారపడకూడదు. పార్టీకన్నా పెద్దవాళ్లమనుకునేవారి పనిపట్టాల్సిందే" అని బాలయ్య.. బాబుతో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వంశీని జగన్ కౌగిలిపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు.మరి ఈ వివాదం ఎక్కడి వరకూ వెళుతుందో.. చూడాలి.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
