సీబీఐ దాడులు, మీడియా కథనాలపై స్పందించారు దర్శకరత్న దాసరి. కొన్ని పత్రికలు తనను బొగ్గుల పులి అంటూ రాయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తానెప్పటికీ బొబ్బిలి పులినే అంటూ ఓ స్టేట్ మెంట్ ను మీడియా సంస్థలకు ఫ్యాక్స్ చేశారు. తనపై కొందరు పనిగట్టుకుని దాడులు చేయిస్తున్నారని, త్వరలోనే నిజానిజాలు బయటపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more...
dasari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
dasari లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, జూన్ 2013, బుధవారం
11, జూన్ 2013, మంగళవారం
మేస్త్రీకి మసి అంటుకుంది
ఎప్పుడూ తెల్ల బట్టలతో నిగనిగలాడుతూ, ఇండస్ట్రీలోని కొంతమందికి తరచూ నీతులు చెబుతూ ఉండే దర్శకరత్న దాసరికి టైడ్ తో ఉతికినా పోలేనంత బొగ్గు మసి అంటుకొంది. బొగ్గు గనుల కేటాయింపులో భాగంగా దాసరి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎప్పటినుంచో ఉన్నాయి. జిందాల్ కంపెనీకి గనులు కేటాయించడం, దాసరికి చెందిన సౌభాగ్య మీడియాలో జిందాల్ కంపెనీల నుంచి పెట్టుబడులు రావడం ఏకకాలంలో జరిగాయి. కోల్ స్కామ్ పై దర్యాప్తు చేస్తున్న సీబీఐ దీన్ని గుర్తించింది. తాజాగా ఢిల్లీలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో జిందాల్ అధినేత, కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ తో పాటు, దాసరి నారాయణ పేరును సీబీఐ నమోదు చేసింది. అదే సమయంలో హైదరాబాద్ లోని దాసరి ఇంట్లోను, కార్యాలయంలోనూ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. దాసరికి చెందిన కార్లను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే, ఈ సోదాలపై మాట్లాడటానికి మాత్రం సీబీఐ అధికారులు నిరాకరించారు.
Read more...
28, జనవరి 2012, శనివారం
దాసరిపై చిరంజీవి ప్రతీకారం
Categories :
chiranjeevi . congress . dasari . POLITICS . TOP
దర్శకరత్న దాసరి నారాయణరావుకు, మెగాస్టార్ చిరంజీవికి అసలు పడదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకే వేదిక మీద ఉన్నప్పుడు చిరును పొగిడే దాసరి .. మరో వేదిక ఎక్కగానే మాత్రం విరుచుకుపడుతుంటారు. అయితే.. దాసరి విమర్శలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం చిరంజీవికి మరోలా చేతికందింది. ప్రజారాజ్యాన్నివిలీనం చేసుకోనున్న కాంగ్రెస్ పార్టీనే ఈ అవకాశాన్ని అందిస్తోంది. రాష్ట్రం నుంచి త్వరలో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిలో దాసరి సీటు కూడా ఉంది. ఇప్పటికే వరసగా రెండుసార్లు రాజ్యసభ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ దాసరికి అందించింది. మరోసారి ఇచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. దాసరి స్థానంలో, చిరంజీవికి అవకాశం కల్పించాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పీఆర్పీ విలీనం సమయంలో ఇచ్చిన హామీ మేరకే, ఈ అవకాశం ఇస్తున్నారు. మిగిలిన సీట్లలో రాజకీయంగా పోటీ ఉండడంతో, దాసరి స్థానంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికే ఛాన్స్ దక్కనుంది. ఈ రకంగా దాసరిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం చిరంజీవికి వచ్చింది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)


