ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ లు కనిపించడంపై రేగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోశారు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ. ఎవరో అభిమాని పెట్టిన దానికి తన కొడుకును బాధ్యుడిని చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారాయన. పైగా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బాలయ్య హెచ్చరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అలా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఎన్టీఆర్ ను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారన్నారాయన. ఎవరో చేసిన తప్పులకు తన కుటుంబం ఇప్పటికే చాలా నష్టపోయిందని, తన కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేయవద్దంటూ కోరారాయన. సీనియర్ ఎన్టీఆర్ దేవుడు లాంటివాడని, ఆయన ప్రజలందరి వాడని, ఎవరైనా పార్టీలకు అతీతంగా ఆయన ఫోటోను పెట్టుకోవచ్చన్నారు హరికృష్ణ. దీనిపై ప్రజల మధ్యకు వస్తే బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. దీంతో, ఇంతకాలం ఎన్టీఆర్, బాలయ్యల మధ్యే ఉందనుకున్న విబేధాలు కాస్తా, హరికృష్ణ, బాలయ్య మధ్యకు షిఫ్ట్ అయ్యాయి. ఈ రెండుకుటుంబాల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలను వీధికెక్కించాయి.
flex dispute లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
flex dispute లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
8, ఏప్రిల్ 2013, సోమవారం
ఎన్టీ..వార్ : బాలకృష్ణపై హరికృష్ణ ఆగ్రహం
Categories :
balakrishna . family war . flex dispute . harikrishna . ntr . POLITICS . tdp . TOP
ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ లు కనిపించడంపై రేగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోశారు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ. ఎవరో అభిమాని పెట్టిన దానికి తన కొడుకును బాధ్యుడిని చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారాయన. పైగా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బాలయ్య హెచ్చరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అలా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఎన్టీఆర్ ను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారన్నారాయన. ఎవరో చేసిన తప్పులకు తన కుటుంబం ఇప్పటికే చాలా నష్టపోయిందని, తన కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేయవద్దంటూ కోరారాయన. సీనియర్ ఎన్టీఆర్ దేవుడు లాంటివాడని, ఆయన ప్రజలందరి వాడని, ఎవరైనా పార్టీలకు అతీతంగా ఆయన ఫోటోను పెట్టుకోవచ్చన్నారు హరికృష్ణ. దీనిపై ప్రజల మధ్యకు వస్తే బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. దీంతో, ఇంతకాలం ఎన్టీఆర్, బాలయ్యల మధ్యే ఉందనుకున్న విబేధాలు కాస్తా, హరికృష్ణ, బాలయ్య మధ్యకు షిఫ్ట్ అయ్యాయి. ఈ రెండుకుటుంబాల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలను వీధికెక్కించాయి.6, ఏప్రిల్ 2013, శనివారం
జూనియర్ నోరు విప్పాల్సిందే: బాలయ్య
Categories :
balakrishna . flex dispute . ntr . POLITICS . tdp . TOP
ఫ్లెక్సీల వివాదంపై జూనియర్ పెదవి విప్పాలని, వైఎస్సార్ సీపీ పార్టీ నేతలు తన ఫోటోను ఫ్లెక్సీల్లో వాడుకోవడాన్ని ఖండించాలని బాలయ్య ప్రకటించారు. ఖండించకపోతే మాత్రం పరిణామాలు వేరేలా ఉంటాయన్నారాయన. జూనియర్ ఏ పార్టీలో ఉన్నాడన్న విషయాన్ని కూడా ఆయనే చెప్పాలన్నారు. ఈ విషయంలో ఎన్టీఆర్ తో తాను మాట్లాడతానన్నారు. కృష్ణాజిల్లా కొమరవోలులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బెజవాడ పర్యటన సందర్భంగా, టీడీపీ నేతలను ఆ పర్యటనకు దూరంగా ఉండాలని తాను ఆదేశించలేదన్నారు. వ్యక్తిగత పర్యటన అని జూనియరే చెప్పాడని గుర్తుచేశారు. అర్హత, వయస్సుతో సంబంధం లేకుండా, పార్టీకోసం ప్రజల కోసం కష్టపడే వారందరినీ పార్టీ గౌరవిస్తుందన్నారు. ఎన్టీఆర్ సినిమాలతో బిజిగా ఉన్నారంటూ, ఎన్టీఆర్ పార్టీకోసం పనిచేయడం లేదంటూ పరోక్షంగా ప్రస్తావించారు బాలయ్య. సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను వైఎస్సార్ సీపీ తమ ఫ్లెక్సీల్లో వాడుకోవడానికి వీల్లేదన్నారాయన. దీనిపై అవసరమైతే కోర్టుకూ వెళతామన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)