సునీల్ రెడ్డిది కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం అనిమెల గ్రామం.. నర్రెడ్డి సంగిరెడ్డి రెండో కుమారుడు ఈ సునీల్‌రెడ్డి. 30 సంవత్సరాల క్రితం సంగిరెడ్డి తన కుటుంబంతో సహా పులివెందులకు వచ్చి స్థిరపడ్డాడు. వైఎస్ బావ సీవీ సుబ్బారెడ్డికి ... సంగిరెడ్డి బంధువు కావడంతో వైఎస్ కుటుంబంతోనూ పరిచయం ఏర్పడింది. అప్పట్లో జియాలజిస్ట్‌గా పనిచేసిన సంగిరెడ్డి... వైఎస్ కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల ప్రాంతంలో మైన్స్ వ్యాపారాలు చేశాడు.. నష్టాలు రావడంతో సంగిరెడ్డి ఆర్ధికంగా కుంగిపోయాడు. దీంతో సంగిరెడ్డి ఆస్తులను కూడా వైఎస్ కుటుంబీకులు తీసుకున్నారని సమాచారం.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంగిరెడ్డి కుటుంబాన్ని YSR చేరదీశారు. సంగిరెడ్డి కుమారుడు సునీల్‌రెడ్డికి జగన్ కంపెనీలో ఓ చిరుద్యోగం ఇచ్చారు.. సునీల్‌లో ఉన్న చురుకుదనం, ఉత్సాహం గమనించిన జగన్.. సునీల్‌రెడ్డిని తన ఆంతరంగికుడిగా, వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు. అధికారికంగా పీఏ కాకపోయినా, అన్ని వ్యవహారాలను సునీల్ రెడ్డే నిర్వహించేవాడు. అతి తక్కువ కాలంలోనే జగన్ ఆర్థిక, వ్యక్తిగత కార్యకలాపాల్లో సునీల్ ప్రముఖ పాత్ర పోషించే స్థాయికి ఎదిగాడు. సునీల్ రెడ్డికి కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డితోనూ బంధుత్వం ఉంది. ఆయన సోదరుడి కుమార్తె కృష్ణతేజతో సునీల్ రెడ్డికి వివాహమ్యయింది. ఇప్పుడు సునీల్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తుండడంతో జగన్ కేసుపై మరింత ఉత్కంఠ పెరిగింది.
Read more...
sunil reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sunil reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
24, జనవరి 2012, మంగళవారం
సునీల్‌రెడ్డి ఎవరు..? జగన్ తో సంబంధం ఏమిటి?
Categories :
cbi . jagan . news . sunil reddy . TOP
జగన్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు
వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ జగన్ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే విజయసాయి అరెస్ట్ తో జగన్కు కంటిమీద కునుకు లేకుండా చేసిన సీబీఐ అధికారులు, తాజాగా జగన్ సన్నిహితుడు, ఆయన భార్య భారతి బంధువు సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ఇవాళ ఉదయం గోపన్ పల్లిలోని సునీల్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు, ఆయన్ను తమతో పాటు కార్యాలయానికి తీసుకెళ్లి, చాలా సేపు ప్రశ్నించారు. అనంతరం మళ్లీ ఆయన్ను తమ వాహనంలోనే ఇంటికి తీసుకువెళ్లి, అక్కడ సోదాలు చేశారు. సునీల్ రెడ్డి నివాసం నుంచి కీలక వివరాలను ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. జగన్ ఆస్తుల గురించి, అక్రమ పెట్టుబడుల గురించి చాలా వివరాలు సునీల్ రెడ్డికి తెలుసని సీబీఐ భావిస్తోంది. జగన్ వెన్నంటి ఉండే సునీల్ రెడ్డి కూడా, ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నాడని అనుమానిస్తోంది. సునీల్ రెడ్డి అరెస్ట్ను ఇంకా ధృవీకరించకపోయినా, త్వరలోనే సీబీఐ జేడీ ఆ ప్రకటనా చేసే అవకాశం కనిపిస్తోంది. ఓ రకంగా జగన్ చుట్టూ ఉన్న అన్ని మార్గాలను మూసివేసి, అక్రమాలకు సంబంధించి పక్కా ఆధారాలు సంపాదించి ఆ తర్వాతే జగన్ పై దృష్టి పెట్టాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో A1 గా ఉన్న జగన్ ను వదిలి, ఒక్కొక్కరిపైనా పంజా విసురుతోంది.
అయితే, జగన్ చుట్టూ ఉన్న వారిని అరెస్ట్ చేసి, ఆయన్ను ఆత్మరక్షణ నెట్టడానికి అధికారపార్టీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలూ లేకపోలేవు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అతి పెద్ద ప్రమాదంగా భావిస్తున్న జగన్ ను, సీబీఐతోనే చెక్ చెప్పి, తమకు లొంగి ఉండేలా చేసుకోవడానికే, ఈ తరహా దర్యాప్తును తెరపైకి తెచ్చిందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

