కమల కురువృద్ధుడు అద్వానీ తన మనసు పూర్తిగా మార్చుకున్నారు. నరేంద్ర మోడి అభ్యర్థిత్వాన్ని ఇంతకాలం వ్యతిరేకిస్తూ వచ్చిన అద్వానీ, ఇప్పుడు మోడీ ప్రధాని అయితే తనకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఉండదని చెప్పుకొచ్చారు. మోడితో కలిసి గుజరాత్లోని అహ్మదాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత.. ఈ విషయాలను చెప్పారు. దీనిద్వారా తనకు,మోడికి మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పడానికి ప్రయత్నించారాయన. సబర్మతి రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన గార్డెన్స్ ను ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన సభలో అద్వానీ, మోడిలు కలిసి పాల్గొన్నారు. 2011 తర్వాత గుజరాత్ లో ఓ బహిరంగ సభలో ఇద్దరూ కలిసి పాల్గొనడం ఇదే తొలిసారి.
Read more...
gujarat లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
gujarat లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
16, అక్టోబర్ 2013, బుధవారం
21, డిసెంబర్ 2012, శుక్రవారం
అదే మోడి మాయ కదా..!
గుజరాత్ సీఎం, బీజేపీ తురుపు ముక్క నరేంద్రమోడి చరిత్ర సృష్టించారు. వరసగా నాలుగోసారి గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. గుజరాత్ లో బీజేపీ విజయఢంకా మోగించగానే.. మోడి వేసిన అడుగులు బీజేపీ నేతలనే కాదు.. రాజకీయ విమర్శకులను సైతం నివ్వెరపోయేలా చేశాయి.
మోడి అంటే అణువణువూ మండిపడే వ్యక్తి కేశూభాయ్. మోడి రాకతో.. గుజరాత్లో కేశూభాయ్ చరిత్ర ముగిసిపోయింది. పటేల్ సాబ్ నుంచే.. మోడి పాలనా పగ్గాలు అందుకున్నారు. మోడి అంటే కోపంతో గత ఎన్నికల్లో కేశూభాయ్ పటేల్ ప్రచారం కూడా చేయలేదు. ఈ ఎన్నికల్లో అయితే ఏకంగా పార్టీ పెట్టి, మోడికి, బీజేపీ వ్యతిరేకంగా పోరాడారు. కానీ, గుజరాత్ అంటే మోడి.. మోడి అంటే గుజరాత్ గా మారిపోయిన తరుణంలో పటేల్ ప్రభావం చూపించలేకపోయారు. ఆయనతో పాటు ఆ పార్టీ తరపున మరొకరు మాత్రమే గెలిచారు. కాకపోతే, చాలా చోట్ల బీజేపీ అభ్యర్తులు ఓడిపోవడానికి మాత్రం జీపీపీ కారణమయ్యింది. లేదంటే గుజరాత్ లో బీజేపీకి ఈ సారి మరిన్ని సీట్లు దక్కేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీకి, తనకు శత్రువుగా మారిపోయిన పటేల్ ఇంటికి ఎన్నికల ఫలితాలు వెలువడగానే వెళ్లారు మోడి. ఆయనకు స్వీట్ తినిపించారు. ఆయనతో తనకు ఎలాంటి శత్రుత్వమూ లేదని మీడియా ముఖంగా ప్రపంచానికి చాటిచెప్పారు. అయితే.. పటేల్ ఇంటికి మోడి ఎందుకు వెళ్లారన్నదే అందరి మదినీ తొలిచేస్తోంది. పైగా, పటేల్ అవసరమూ మోడికి ఇప్పుడు లేనేలేదు. అయినా.. మోడి వెళ్లడం వెనుక చాలా కారణాలున్నాయి.
ఎవరికీ అంతుబట్టని వ్యక్తిత్వం నరేంద్రమోడిది. అందుకే, సమాంతర రాజకీయాల్లో ఆయనది విలక్షణ శైలిగా కనిపిస్తుంది. ఓ రాష్ట్రానికి సీఎం అయినా ఆయన ఎప్పుడూ జాతీయస్థాయి నేతలతో తలపడుతుంటారు. ముఖ్యంగా సోనియా, రాహుల్, మన్మోహన్ లనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుంటారు. తద్వారా జాతీయ మీడియాలో ఎప్పుడూ తనపేరుండేలా చూసుకోవడంలో దిట్ట మోడి. గుజరాత్లో మరోసారి మోడి గెలిస్తో.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఆయనే నిలబడతారన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఇప్పుడు అదే నిజం కాబోయేలా ఉంది. దీనికి సరైన వేదికను సిద్ధం చేసుకుంటున్నారు మోడి. తన సొంత ప్రాంతంలోనే వ్యతిరేకులు లేకుండా చూసుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగానే కేశూభాయ్ పటేల్ ఇంటికి వెళ్లారు.
గుజరాత్ విజయం దేశంలో అభివృద్ధిని కోరుకునే అందరి విజయంగా వర్ణించడం ద్వారా.. తాను గుజరాత్ కే పరిమితం కావడం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు మోడి. బీజేపీలో ప్రస్తుతం ఉన్న సీనియర్లతో పోల్చితే.. దేశవ్యాప్తంగా ప్రభావం చూపించకగలిగే నేత కూడా మోడినే అన్నది కాదనలేని సత్యం. ముఖ్యంగా యువతరంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి.. ప్రధాని అభ్యర్థికి మోడి తగినవ్యక్తే. అయితే.. ఆధిపత్యపోరుతో కొట్టుకు చస్తున్న బీజేపీ నేతలకు మోడిని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టగలిగేంత ఉదార స్వభావం ఉందా లేదా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న.
Read more...
20, డిసెంబర్ 2012, గురువారం
అనుకున్నన్ని సీట్లు మోడికి దక్కుతాయా?
గుజరాత్ గడ్డ మీద మోడీకి ఎదురులేకుండా పోయింది. మరోసారి విజయాన్ని అందుకోబోతున్నారు నరేంద్రమోడి. మోడి సీఎంగా బీజేపీని గుజరాత్లో గెలిపించడం ఇది మూడో సారి. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 56 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కేశుభాయ్ పటేల్ పార్టీ 4 స్థానాల్లో లీడ్ లో ఉంది. మరో రెండు స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.
182 స్థానాలకు గానూ బీజేపీ 120కి పైగా స్థానాల్లో గెలుపొందుతుందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించాయి. కాంగ్రెస్ 40 నుంచి 50 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొన్నాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే మోడి జయకేతనం ఎగరవేస్తున్నా.. కాంగ్రెస్ మాత్రం కాస్త ఎక్కువ సీట్లనే దక్కించుకునే కనిపిస్తోంది.
కానీ, కేంద్రంలో అధికారంలో ఉండి, మోడీపై ఎప్పటినుంచే రాజకీయంగా ఆధిపత్యం కోసం ఆరాటపడి.. పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ ఫలితాలు మింగుడుపడనివే అని చెప్పాలి. మోడి కారణంగా.. గుజరాత్ కాంగ్రెస్ కు 15 ఏళ్లుగా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
Read more...
18, డిసెంబర్ 2012, మంగళవారం
పీఎం పోస్ట్ కు లైన్ క్లియర్..!
ఊహించిందే జరిగేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పన్నినా.. ఎంతగా వ్యతిరేక ప్రచారం చేసినా.. అవి గుజరాత్ లో మోడి ప్రాభవానికి గండికొట్టలేకపోయినట్లే కనిపిస్తోంది. గుజరాత్లో రెండో విడత పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ.. మళ్లీ నరేంద్ర మోడికే పట్టంకట్టాయి. ఇవి నిజమైతే గనక.. వరసగా మూడోసారి బీజేపీని గుజరాత్ లో అధికారంలోకి తెచ్చిన ఘనత మోడికి దక్కుతుంది. ఇది ఓ అరుదైన, అనితరసాధ్యమైన రికార్డుగా నిలిచిపోతుంది. పైగా, గతంలో కన్నా.. ఈ సారి బీజేపీకి మరికొన్ని సీట్లు పెరిగేలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని కాదని సొంత పార్టీ పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ సొంతప్రాంతమైన సౌరాష్ట్ర ప్రాంతంలోనూ పటేళ్లు.. మోడి మెడలోనే దండవేసినట్లు తెలుస్తోంది. గురువారం జరిగే ఓట్ల లెక్కింపుతో వాస్తవ ఫలితాలు వెల్లడవుతాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో అప్పుడే బీజేపీలో ఉత్సాహవాతావరణం నెలకొంది. అటు కాంగ్రెస్ లో నిస్తేజం అలముకొంది.
గుజరాత్ లో బీజేపీ విజయం సాధిస్తుందన్న అంచనాలతో.. ఆపార్టీలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ జయకేతనం ఎగరవేయాలంటే.. మోడినే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకొంది. ఇటీవలే సుష్మా స్వరాజ్, అద్వానీలు కూడా ప్రధాని పదవికి మోడీని అర్హుడిగా పేర్కొనడంతో.. ఆయనకు లైన్ క్లియర్ అయినట్లే. దీంతో.. హిందుత్వం బదులు వచ్చే ఎన్నికల్లో బిజేపీ మోడిత్వాన్ని ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)


