అయితే, ఇప్పుడో అద్భుతమైన అవకాశం వచ్చినా దాన్ని రాహుల్ కు అందించడంలో విఫలమయ్యారు సోనియా గాంధీ. ప్రస్తుత లోక్ సభలో ఎవరికీ ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ, రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్సే ఉంది. ఆ పార్టీ లోక్ సభ నేతగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతకే దక్కుతుంది. ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తే, దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ, రాహుల్ సమర్థత మీద అవగాహన ఉండడం వల్లో ఏమో ఆ పదవిని రాహుల్ కు అందించలేదు సోనియా. ఒకవేళ మోడీ వాక్చాతుర్యాన్ని, మాటల దాడిని రాహుల్ ఎదుర్కోలేకపోవచ్చని సోనియా భావించి ఉండొచ్చు. అయితే, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా కొంతమంది ఎంపీలనే నడిపించే సామర్థ్యం లేని వ్యక్తి దేశాన్ని ముందుకు నడిపించగలడా.. ? ఇదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. సోనియా, రాహుల్ లు ఇదే తరహాలో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లోనూ వారి ఛరిష్మా పనిచేయదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
దీనికి పనికిరానివాడు దానికి పనికొస్తాడా..?
అయితే, ఇప్పుడో అద్భుతమైన అవకాశం వచ్చినా దాన్ని రాహుల్ కు అందించడంలో విఫలమయ్యారు సోనియా గాంధీ. ప్రస్తుత లోక్ సభలో ఎవరికీ ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ, రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్సే ఉంది. ఆ పార్టీ లోక్ సభ నేతగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతకే దక్కుతుంది. ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తే, దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ, రాహుల్ సమర్థత మీద అవగాహన ఉండడం వల్లో ఏమో ఆ పదవిని రాహుల్ కు అందించలేదు సోనియా. ఒకవేళ మోడీ వాక్చాతుర్యాన్ని, మాటల దాడిని రాహుల్ ఎదుర్కోలేకపోవచ్చని సోనియా భావించి ఉండొచ్చు. అయితే, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా కొంతమంది ఎంపీలనే నడిపించే సామర్థ్యం లేని వ్యక్తి దేశాన్ని ముందుకు నడిపించగలడా.. ? ఇదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. సోనియా, రాహుల్ లు ఇదే తరహాలో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లోనూ వారి ఛరిష్మా పనిచేయదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
కాంగ్రెస్ ను కుళ్లబొడిచేశారు..
మోడీని విధ్వంసకర శక్తిగా చూపించడానికి ప్రయత్నించి దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్, దానికి తగ్గ మూల్యమే చెల్లించుకుంది. ఎప్పుడూ లేనంతగా దేశం ఒక్కటై, మోడీకి భారీ మెజార్టీ కట్టబెట్టింది. 285 సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, ఎవరి దయాదాక్షిణ్యాలమీద బతకకుండా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమంటూ ఆశీర్వదించింది.
రెండు రాష్ట్రాల్లోనూ చంద్రోదయం
తెలంగాణలో పోటాపోటీగా ఎన్నికలు జరిగాయంటూ సర్వేలు చెప్పినా, కాంగ్రెస్ నేతలు తమదే విజయం అన్నా.. ప్రజాతీర్పు మాత్రం వన్ సైడ్ గానే వచ్చింది. టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో మెజార్టీని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ ను మాత్రం పాతిక మార్కును దాటనివ్వలేదు. చాలామంది మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా చుక్కలు చూపించారు తెలంగాణ ఓటర్లు..
సీమాంధ్రలో మాత్రం రెండు రకాల తీర్పులొచ్చాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఓటర్లు టీడీపీ పక్షాన నిలిస్తే, దక్షిణ కోస్తా, అనంత మినహా రాయలసీమ మిగిలిన మూడు జిల్లాల ప్రజలు మాత్రం వైసీపీ పక్షాన నిలబడ్డారు. జిల్లాల వారీగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ నడిచింది. ఎక్కడా కాంగ్రెస్ ను ఖాతా తెరవనివ్వలేదు ఆంధ్ర ఓటర్లు.జిల్లాల వారీగా బలాబలాలు
శ్రీకాకుళం (10): టీడీపీ-7, వైసీపీ-3
విజయనగరం (9): టీడీపీ-6, వైసీపీ-3
విశాఖపట్నం (15): టీడీపీ-11, వైసీపీ-3, బీజేపీ-1
తూ.గో. (19): టీడీపీ-12, వైసీపీ-5, బీజేపీ-1, ఇండిపెండెంట్-1
ప.గో. (15): టీడీపీ-14, బీజేపీ-1
కృష్ణా (16): టీడీపీ-10, వైసీపీ-5, బీజేపీ-1
గుంటూరు (17): టీడీపీ-12, వైసీపీ-5
ప్రకాశం (12): వైసీపీ-6, టీడీపీ-5, ఇండిపెండెంట్-1
నెల్లూరు (10): వైసీపీ-7, టీడీపీ-3
చిత్తూరు (14): టీడీపీ-6, వైసీపీ-8
అనంతపురం (14): టీడీపీ-12, వైసీపీ-2
కడప (10): వైసీపీ-9, టీడీపీ-1
కర్నూలు (14): టీడీపీ-3, వైసీపీ-11
ఆళ్లగడ్డలో మాత్రం దివంగత నేత శోభానాగిరెడ్డినే గెలిపించారు అక్కడి ప్రజలు. ఆమె చనిపోయినా, ఆమెకు ఓటేస్తే ఉపఎన్నికలు వస్తాయని తెలిసినా, ఓటు ద్వారా ఆమెకు నివాళులు అర్పించారు ఆళ్లగడ్డ ఓటర్లు.
సీమాంధ్రలో సైకిల్ సవారీ .. హస్తగతమైన తెలంగాణం
ఇక తెలంగాణ విషయానికి వస్తే కారు జోరుకు హస్తం అడ్డుగా నిలిచింది. మున్సిపాలిటీల్లో సింహభాగం కాంగ్రెస్ పార్టీకే దక్కి, ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. 21 మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకోగా, టీడీపీ రెండు, టీఆర్ఎస్ 8 మున్సిపాలిటిల్లో అధికారాన్ని అందుకున్నాయి. అయితే, ఈ సారి ఆశ్చర్యకరంగా, బీఎస్పీ రెండు మున్సిపాలిటీలను దక్కించుకోవడం విశేషం. ఎంఐఎం భైంసా మున్సిపాలిటీలో జయకేతనం ఎగరవేసింది. తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. నిజామాబాద్, రామగుండంలో హస్తం హవానే నడిచింది.
తెలంగాణ ముగిసింది.. ఆంధ్ర మిగిలింది
తెలంగాణలో ప్రచారానికి తెరపడుతుండడంతో సీమాంధ్రపైకి దృష్టి మళ్లించాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే చంద్రబాబు కొన్ని జిల్లాల్లో ప్రచారం పూర్తి చేయగా, బాలయ్య కూడా విరామం లేకుండా ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కు స్టార్ క్యాంపైనర్ గా చిరంజీవి తన పని మొదలుపెట్టారు. అన్నింటికీ మోడీ మంత్రాన్నే వల్లె వేస్తున్న బీజేపీ, సీమాంధ్రలోనూ ఆయన్నే ప్రచారానికి పిలుస్తోంది. ఏప్రిల్ 30, మే1 తేదీల్లో ఆయన సీమాంధ్రలో పలు సభల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 30న తిరుపతిలో, మే 1న విశాఖలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఇక మే 2 సోనియా విశాఖ బహిరంగ సభలో పాల్గొంటారు. మోడీ సభ జరిగిన తర్వాతి రోజే సోనియా సభ జరుగుతుండడంతో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. అటు రాహుల్‌తో కూడా వీలైనంతగా సభలను నిర్వహించాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
తమ్ముడికి గుణపాఠం చెప్పమన్న ప్రియాంక
Categories :
congress . election . POLITICS . priyanka . rahul gandhi . varun gandhi
కొత్త పార్టీ పెట్టిన కిరణ్
Categories :
congress . election . kiran kumar . new party . POLITICS
రాహుల్ కు ముద్దు పెట్టినందుకు హత్య
చెయ్యికి కారు చెయ్యిస్తుందా...?
కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీన పంచాయతీపై సాగుతున్న ఉత్కంఠ మరో రెండు రోజుల్లో విడిపోయే అవకాశం ఉంది. మార్చి 3న జరిగే పార్టీ పొలిట్ బ్యూరో, శాసనసభా పక్ష, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో దీనిపై పార్టీ నేతలతో చర్చించనున్నారు కేసీఆర్. అయితే, ఇప్పటివరకైతే పార్టీ నేతలెవరికీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇంతకాలం కష్టపడి ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకుని, ఫలితాలు సాధించే సమయంలో విలీనం చేయడం సరికాదంటున్నారు టీఆర్ఎస్ నేతలు. కావాలంటే పొత్తు పెట్టుకుని సరిపెడదామని, విలీనంతో టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా నష్టపోతారని కేసీఆర్ కు చెప్పుకుంటున్నారు. దీంతో, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠను కలిగిస్తోంది.
అయితే, రాజకీయ పార్టీని నిర్వహించడమన్నది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. 15 ఏళ్లుగా పార్టీని నడిపిస్తున్న కేసీఆర్ కు ఇది బాగా తెలుసు. ఇంతకాలం ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్.. తెలంగాణ ఏర్పాటుతో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారనుంది. ఉద్యమం కారణంగా ఇంతకాలం వచ్చిన విరాళాలు, నిధులు ఇకపై ఆ స్థాయిలో రాకపోవచ్చు. పైగా, ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ కు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, అధికారాన్ని దక్కించుకోలేకపోతే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దీనికి తోడు పార్టీలో ముగ్గురి మధ్య సాగుతున్న వారసత్వపోరు పార్టీకి ఇబ్బందిని కలిగించే పరిస్థితులూ ఉన్నాయి. దీంతో విలీనం చేయడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపైనే కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు జరిపిన కేసీఆర్, హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. విలీనం కన్నా పొత్తుకే ప్రాధాన్యం ఇచ్చి, ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుందామని కొంతమంది నేతలు ప్రతిపాదిస్తున్నారు. టీఆర్ఎస్ , కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే మెజార్టీ స్థానాలు ఆ కూటమికే దక్కే అవకాశాలున్నాయి. ఈ విషయంపైనే మూడో తేదీన టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో చర్చించనుంది.
పొత్తుకే సిద్ధమని కేసీఆర్ ప్రకటిస్తే మాత్రం, కాంగ్రెస్ కు అది ఆశాభంగమే. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్న హస్తం, టీఆర్ఎస్ విలీనంతో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. కానీ, పొత్తుతో పోటీకి వెళ్తే మాత్రం, ఆ తర్వాత అధికారాన్ని పూర్తిస్థాయిలో దక్కించుకోవడం అసంభవం. కచ్చితంగా టీఆర్ఎస్ నేతలు ముఖ్యపదవులనే కోరుకుంటారు. దీనికి కాంగ్రెస్ నేతలూ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. దీంతో, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
దగ్గుబాటి కుటుంబం టీడీపీకి దగ్గరవుతోందా..?
Categories :
bjp . chandrababu . congress . daggubati . POLITICS . purandeshwari . tdp
వాస్తవానికి, ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడంతో చేయీచేయీ కలిపి పనిచేసిన నారా, దగ్గుబాటి కుటుంబాలు తర్వాత మాత్రం పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలతో ఎడమొహం పెడమొహం అయ్యాయి. దగ్గుబాటి కొంతకాలం బీజేపీలో ఉండి, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి తాను ఎమ్మెల్యే అవడమే కాక, తన భార్య పురందేశ్వరిని ఎంపీని , కేంద్రమంత్రిని చేయించుకోగలిగారు. అయితే, సమైక్య ఉద్యమంతో పరిస్థితులు మారడంతో పాటు, కాంగ్రెస్ నుంచి మళ్లీ పోటీ చేస్తే గెలవమేమో అన్న అనుమానం అటు వెంకటేశ్వరరావు, ఇటు పురందేశ్వరికీ ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి పోటీకోసం కొంతకాలం క్రితం సమాలోచనలు జరిపిన వీరిద్దరూ అక్కడ వ్యతిరేకత రావడంతో నరసాపురం ఎంపీ స్థానంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో, నరసాపురం సీటు పై తమకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటినుంచే మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఉన్నతస్థాయిలోనే సాగుతున్న ఈ చర్చలు దగ్గుబాటి ఫ్యామిలీకి అనుకూలంగానే ఉన్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.
ఇంత భావ దారిద్ర్యమా..?
రాహుల్ ప్రకటనలో ఉన్న స్లోగన్ ను మోడీ ఎప్పుడో వాడేశారు. ప్రభుత్వ అధికారుల్లో స్ఫూర్తి నింపడం కోసం ఏర్పాటు చేసిన ఓ సభలో మై నహీ, హమ్ అన్న స్లోగన్ ను ఉపయోగించారాయన. ఈ విషయం గుర్తించని కాంగ్రెస్ దాన్నే తమ పార్టీ లైన్ గా భారీగా ప్రకటనలు ఇచ్చింది. దీంతో, ఆన్ లైన్ లో రెండింటినీ పోల్చుతూ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మీడియా కూడా దీన్ని పెద్దది చేసి చూపడంతో ఒక్కసారిగా అవాక్కైన కాంగ్రెస్, తన ప్రకటనలను ఉపసంహరించుకొంది. ఢిల్లీలో ఫ్లెక్సీలను వెంటనే మార్చేసింది. అదే అర్థం వచ్చినట్లుగా, మరో స్లోగన్ ను తెరపైకి తెచ్చింది. అదే .. తోడే నహీ.. జోడే.. కాంగ్రెస్ కు సొంతగా ప్రచారం చేసుకునే సత్తా కూడా లేకే, మోడీ స్లోగన్స్ పై పడిందంటూ బీజేపీ మండిపడింది.
రాయల తెలంగాణకు ప్రజల ఆమోదం ఉంది:జేసీ
Categories :
bifurcation . congress . division . jc . POLITICS . rayala telangana . telangana
సోనియా సంపన్నురాలు కాదట.. వెనక్కి తగ్గిన హఫింగ్టన్
Categories :
congress . huffingtonpost.com . POLITICS . sonia . sonia assets . TOP
21నే తేలిపోతుందట
కిరణ్ వెనకడుగుకు కారణమేమిటో..?
Categories :
cm kiran . congress . jaggareddy . POLITICS . rachabanda . sangareddy . telangana . TOP . trs
ప్రధాని కార్యాలయం ఎందుకు పిలిచినట్లు?
ఉల్లి ధర పెరగడానికి మోడీ కారణమా..?
Categories :
bjp . congress . kapil sibal . modi . onion price . POLITICS . TOP
గుజరాత్‌లోని ఖచ్ ప్రాంతంలో ఉల్లిపాయలు ఎక్కువగా పండించే వేలాది ఎకరాలను అదాని గ్రూప్‌కు మోడీ కట్టబెట్టారని, దాని వల్లే ఉల్లి ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని సిబల్ ఆరోపించారు. మరి దీనికి బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఆ రెండు మళ్లీ కమలానివేనా..?
Categories :
bjp . Chhattisgarh . congress . five state election . madhya pradesh . POLITICS . pre poll survey . TOP
ఛత్తీస్‌గఢ్‌లోనూ కమల విరబూయనుందని ఐబీఎన్ సర్వే చెబుతోంది. 91 సీట్లున్న అసెంబ్లీలో 61 నుంచి 71 సీట్లు బీజేపీకే దక్కుతాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు కేవలం 16 నుంచి 24 సీట్లే దక్కవచ్చని సర్వేలో తేలింది. రమణసింగ్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసం వల్లే బీజీపీ మళ్లీ విజయం సాధించవచ్చంటోంది సీఎన్‌ఎన్-ఐబీఎన్, ది వీక్ సంయుక్త సర్వే.
కాలుజారిన చిరంజీవి
Categories :
boat . chiranjeevi . congress . flood area visit . POLITICS . slipped . TOP
![]() |
| పడవ ఎక్కబోతూ పడిపోయిన చిరంజీవి |
మోడి కన్నా నువ్వు బెటర్.. రాహుల్ కన్నా నువ్వు బెటర్
Categories :
bjp . congress . digvijay . digvijaysingh . modi . POLITICS . sushma swaraj . TOP
దీనికి సుష్మా స్వరాజ్ వెంటనే ప్రతిస్పందించారు. రాహుల్ గాంధీ కన్నా దిగ్విజయ్ సింగే బెటర్ అంటూ ట్విట్టర్‌లోనే సెటైర్ వేశారు సుష్మా.












