రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు కుమ్మరించింది అధిష్టానం. ఇప్పటికిప్పుడు ఈ సమస్యను తేల్చలేమని, దానికి మరింత సమయం పడుతుందంటూ ప్రకటించింది. ఎప్పటివరకూ తేల్చతారో కూడా చెప్పకుండా అనిశ్చితిని మరింతగా పెంచేసింది. ఈనెల 28 కల్లా తేల్చేస్తామని ప్రకటించిన కేంద్రమే, ఇప్పుడు తాజాగా మాటమార్చడం వెనుక సీమాంధ్ర నేతల లాబీయింగ్ బలంగా పనిచేసినట్లు తెలుస్తోంది. అందులోనూ.. సీమాంధ్ర నేతల లాబీయింగ్ పనిచేయడం వెనుక...వైఎస్ ఆత్మగా పేరొందిన కేవీపీ రామచంద్రరావే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
సీమాంధ్రనేతలు ఢిల్లీకి రాగానే ప్రధాని అపాయింట్ మెంట్ దొరికింది, రాష్ట్రపతి నుంచీ కబురొచ్చింది. తాజాగా రాహుల్ కూడా వారితో భేటీకి సమయం కేటాయించారు. మిగిలిన హైకమాండ్ పెద్దలు కూడా సీమాంధ్ర నేతల వాదనలు సావధానంగా విన్నారు. అదే సమయంలో ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ మంత్రులకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వలేదు, రాష్ట్రపతి నుంచి కూడా ఎలాంటి పిలుపు రాలేదు. రాహుల్ సంగతి సరేసరి. ఈ విషయంలో తెలంగాణ నేతలపై సీమాంధ్ర నేతలు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. సీమాంధ్ర నేతలకు, తెలంగాణ నేతలకు మధ్య ఉన్న తేడా అల్లా.. కేవీపీ రామచంద్రరావే.
సీమాంధ్ర నేతలకు ఢిల్లీలో పెద్దల అపాయింట్ మెంట్లన్నీ ఫిక్స్ చేయించింది కేవీపీనే. గతంలో కావూరి ఈవిషయంలో కీలక పాత్ర పోషిస్తే, ఈసారి అన్నీ తానై నడిపించారు కేవీపీ. అధిష్టానం దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి, సీమాంధ్ర నేతల వాదనలను వినిపించేలా చేశారు. తద్వారా రేపోమాపో వచ్చేస్తుందనుకున్న తెలంగాణ ప్రకటనకు అడ్డుకట్ట వేయగలిగారు. షిండే నెలరోజుల గడువు తర్వాత, ఏదో ఓ స్పష్టమైన ప్రకటన వస్తుందని చూసిన రాష్ట్ర ప్రజలందరికీ, తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన పూర్తి నిరాశనే కలిగించిదని చెప్పాలి. కనీసం స్పష్టమైన కాలవ్యవధిని ప్రకటించినా పరిస్థితి మరోలా ఉండేది. ఓ రకంగా కాంగ్రెస్ తీరు చూస్తుంటే తెలంగాణ అంశాన్ని తేల్చకుండా, సమైక్యరాష్ట్రాన్నే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read more...
kvp లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kvp లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
24, జనవరి 2013, గురువారం
16, జనవరి 2012, సోమవారం
కేవీపీ నిజం చెప్పారా..?
ఎమార్ కేసులో సీబీఐ ముందడుగు వేసింది. ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న కేవీపీ రామచంద్రరావును అధికారులు మూడుగంటల పాటు ప్రశ్నించారు. వైఎస్ హయాంలో APIICకు వాటాలు తగ్గడంలో కేవీపీ కీలకపాత్ర పోషించి ఉంటారని సీబీఐ అనుమానిస్తోంది. ఎమార్ కేసులో వచ్చే నెలలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో, కీలక వివరాలను తెలుసుకోవడానికి.. కేవీపీని అధికారులు ప్రశ్నించారు. APIIC వాటా తగ్గడంపైనా, విల్లాల కేటాయింపుపైనా.. కేవీపీపై ప్రశ్నలవర్షం కురిపించారు సీబీఐ అధికారులు.
ఎమార్ కుంభకోణం జరిగిన సమయంలో APIIC డైరెక్టర్‌గా ఉన్న పార్థసారధి.. కేవీపీ బంధువు కావడంతో.. కథంతా ఆయనే నడిపించారని సీబీఐ భావిస్తోంది. దీనికి తోడు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న బీపీ ఆచార్యతో ఉన్న సంబంధాలపైనా అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సమయంలోనే ఎమార్‌లో విల్లాల కేటాయింపు జరిగింది. కేవీపీ భార్య సునీత పేరుతో, వియ్యంకుడు రఘురామరాజు, అతని స్నేహితులకు 16 విల్లాలు కేటాయించడంలో కేవీపీ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీనిపైనా సీబీఐ ప్రశ్నించి, వివరాలను నమోదు చేసుకుంది. కేవీపీ మాత్రం తనను సాక్షిగానే పిలిచారని, తనదగ్గరున్న సమాచారాన్ని అందించానని మీడియాకు తెలిపారు.
ఎమార్ ప్రాపర్టీస్ కేసులో కేవీపీ రామచంద్రరావు ఇచ్చిన సమాచారమే.. సిబిఐ దర్యాప్తులో కీలకం కానుంది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు, బీపీ ఆచార్య, పార్ధసారధిల అరెస్టుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కేసులో అరెస్టుల ప్రకియ మొదలైనట్లే, ఎమార్ లోనూ అరెస్టులు త్వరలోనే ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

