తెలంగాణ ఉద్యమానికి ఇంతకాలం దూరంగా ఉంటూ వచ్చిన హైదరాబాద్ మంత్రి దానం నాగేందర్ మనసు మార్చుకున్నట్లే కనిపిస్తోంది. తెలంగాణకు వ్యతిరేకమని తానెప్పుడూ అనలేదంటూ తాజాగా ప్రకటన చేశారాయన. త్వరలోనే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందన్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయకూడదనే తమ డిమాండ్ అన్నారు. లగడపాటి లాంటి నేతలు చేస్తున్న ప్రకటనలతో తెలంగాణ ఉద్యమం మరింత బలపడిందన్నారు దానం. తాను తెలంగాణకు వ్యతిరేకమని ఎవరైనా నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు మంత్రి దానం నాగేందర్. దానం ప్రకటనతో తెలంగాణవాదుల్లో మరింత జోష్ వచ్చేలా కనిపిస్తోంది.
Read more...
danam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
danam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
22, జనవరి 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
