ఢిల్లీలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీకి హాజరవడానికి హస్తినకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. శనివారం ఉదయం 10.30కు జరిగే సమావేశానికి హాజరుకావాలంటూ వర్తమానం అందించారు పీఎంఓ అధికారులు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలతోనూ త్వరలోనే మంత్రుల బృందం సమావేశమవుతున్న నేపథ్యంలో, అందరూ కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేదనే ఒత్తిడి తెస్తారు కాబట్టే, ముగ్గురు నేతలతో ప్రధాని సమావేశమవుతున్నట్లు సమాచారం. విభజనకు అంగీకరించాలని కిరణ్‌ను, బొత్సను ప్రధాని కోరే అవకాశాలున్నాయి.
Read more...
botsa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
botsa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
8, నవంబర్ 2013, శుక్రవారం
5, అక్టోబర్ 2013, శనివారం
బొత్స సామ్రాజ్యం కూలుతోందా
Categories :
botsa . congress . POLITICS . samaikya protest . seemandhra . stone attack . TOP . viziayanagaram
ఉత్తరాంధ్రలో ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం వహిస్తూ, విజయనగరం రాజకీయాలను పూర్తిగా శాసిస్తూ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నిర్మించుకున్న సామ్రాజ్యపు పునాదులు, సమైక్య ఉద్యమ దెబ్బకు బీటలు వారుతున్నాయి. ఇంతకాలం బొత్స ఇంటివైపు కన్నెత్తి చూడడానికి కూడా జనం, ప్రత్యర్థులు భయపడే పరిస్థితి ఉండగా, ఇప్పుడు సొంత ఇంటికి రావాలంటేనే బొత్స కుటుంబం భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి బొత్స భార్య ఝాన్సీ పూర్తిగా నిరాకరించడం, బొత్స మొదట్లో విభజనకు అంగీకరించి, ఈ మధ్య సమైక్యవాదాన్ని వినిపిస్తున్నా ఆయన వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమైక్యవాదులు బొత్స కుటుంబమే లక్ష్యంగా విజయనగరంలో ఆందోళన చేపట్టారు. శుక్రవారం బొత్స కుటుంబానికి చెందిన సత్యవిజన్ కేబుల్ కార్యాలయాన్ని తగలబెట్టి, ఇంటిపైనా, కాలేజ్ పైనా దాడులు చేశారు. శనివారం బొత్స సోదరుడు శ్రీనివాసరావు ఇంటిపైనా దాడులు చేసి, కేబుల్ పరికరాలను ధ్వంసం చేశారు. బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలోని ఆయన కార్యాలయాలన్నింటినీ ధ్వంసం చేశారు.
ఇవాళ కాంగ్రెస్ నేత తమ్మనశెట్టి ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. పోలీసులు ఆందోళనలు నియంత్రించడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా, వాటి తీవ్రత క్రమంగా పెరుగుతోందే తప్ప, తగ్గుముఖం పట్టడం లేదు. కలెక్టరేట్ దగ్గర జరిగిన ఆందోళనలు కూడా హింసాత్మకంగా మారాయి. పోలీసులపై ఆందోళనకారులు తరచూ రాళ్లదాడికి దిగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బొత్స ప్రత్యర్థులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న వదంతులున్నాయి. ఆందోళనల్లో ఇద్దరు విద్యార్థులు చనిపోయారంటూ వ్యాపించిన వదంతులు కూడా సమైక్యవాదుల్లో మరింత ఆగ్రహాన్ని కలిగించాయి. అయితే, ఇంతవరకూ ఎవరూ చనిపోలేదని వదంతులు నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, బొత్స సామ్రాజ్యం కూలిపోతున్నట్లే కనిపిస్తోంది.21, జులై 2013, ఆదివారం
హైదారాబాద్ ను హాంకాంగ్ చేయాలట
కోర్ కమిటీ ముందు రాష్ట్రానికి చెందిన త్రిమూర్తులు చెప్పిన అన్ని విషయాల్లోకి అత్యంత కీలకమైన విషయం... హైదరాబాద్ ను హాంకాంగ్ చేయడం. రాష్ట్రాన్ని విభజించవద్దని, తెలంగాణకు ప్రత్యేక రక్షణలు ఇస్తే చాలని వాదించిన సత్తిబాబు... ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో విడదీయాల్సి వస్తే మాత్రం హైదారాబాద్ ను హాంకాంగ్ గా మార్చాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన వివరాలను కూడా ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.
చైనా, బ్రిటన్‌ల మధ్య జరిగిన ఫస్ట్‌ఓపియమ్‌వార్‌లో హాంగ్‌కాంగ్, తెల్లదొరల పాలనలోకి వెళ్లింది. హాంగ్‌కాంగ్ స్వాతంత్ర్యం ఇచ్చి చైనాలో కలపాల్సి వచ్చినప్పుడు రెండు దేశాలు ఓ ఒప్పందాన్ని చేసుకున్నాయి. హాంగ్‌కాంగ్‌అభివృద్ధిలో చైనా, బ్రిటన్‌ల భాగస్వామ్యం ఉన్నందున దీన్ని చైనాలో కలపడానికి ముందు 25 ఏళ్ల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే నిబంధన విధించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌ను ఇరు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చేశారు కాబట్టి... దీన్ని కూడా పాతికేళ్ల పాటు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచి ఆ తరువాత తెలంగాణలో విలీనం చేయాలన్నారు బొత్స. హైదరాబాద్ ప్రాంత కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని కోర్ కమిటీకి నివేదించారాయన.
ఇక రాష్ట్రంలో ప్రత్యేక ఉద్యమం కొంతమంది రాజకీయ నాయకులవల్లే వచ్చిందంటూ కోర్ కమిటీకి నివేదించే ప్రయత్నం చేశారు బొత్స. 57 ఏళ్లుగా వస్తున్న ప్రభుత్వాలు, వాటి అధినేతలు అసలు నిజాలను ప్రజలకు వివరించడంలో విఫలమవ్వడం వల్లే ఈ ఉద్యమం వచ్చిందన్నారాయన. అయితే, తెలంగాణ ప్రాంతానికి అసలు అన్యాయమే జరగలేదని తాను చెప్పడం లేదని, రాష్ట్ర సర్వీసు పరీక్షల్లో ఉద్యోగాలు సీమాంధ్ర ప్రజలకే ఎక్కువగా దక్కుతుండడం, సచివాలయంతో పాటు ప్రభుత్వ శాఖల్లోనూ ఎక్కువ మంది సీమాంధ్రవాళ్లో ఉద్యోగాలు దక్కించుకోవడం, రాజకీయంగానే ఉన్నతపదవులను సీమాంధ్ర నేతలే అనుభవిస్తుడడం వల్లే, తెలంగాణలో ఆత్మగౌరవ పోరాటం మొదలయ్యిందన్నారాయన. ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదని, తెలంగాణకు రాజ్యాంగ రక్షణతో కూడిన అభివృద్ధఇ మండలిని ఏర్పాటు చేయడం, తెలంగాణకు ప్రత్యేకంగా సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపడితే, అక్కడి ప్రజలను సంతృప్తి పరచవచ్చని సూచించారు. అలా కాదని రాష్ట్రాన్ని విభజిస్తే మాత్రం సాగునీటి సమస్య, విద్యుత్ సమస్య పెద్ద తలనొప్పిగా మారతాయని వివరించారు. పైగా సీమాంధ్ర ప్రాంతంలో రాజధానిని నిర్మించాల్సి వస్తుందని, దీనికి వేల కోట్ల ఖర్చవుతుందని, దీన్ని కేంద్రం భరించలేదంటూ చెప్పుకొచ్చారు. చివరకు తాను సమైక్యవాదినే అంటూ, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమనంటూ ముక్తాయించారు.

12, జులై 2013, శుక్రవారం
ఊరించి ఉస్సూరు మనిపించారు..
ఇదిగో తేలిపోతుంది.. అదిగో తేలిపోతోందంటూ పదిరోజులుగా ఊదరగొట్టిన కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ విషయంలో మళ్లీ పాతపాటే పాడింది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ లను రోడ్ మ్యాప్ తెమ్మని తేల్చేస్తామన్న కాంగ్రెస్ హైకమాండ్, దాదాపు రెండు గంటల పాటు ప్రధాని నివాసంలో సుదీర్ఘంగా కసరత్తు చేసింది. డిప్యూటీ సీఎం మొదటగా, ఆ తర్వాత పీసీసీ చీఫ్, చివరగా సీఎం తమ వాదనను సోనియా కు వివరించారు. ప్రధాని మన్మోహన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ, ఆంటోనీ, దిగ్విజయ్, ఆజాద్ లు హాజరైన ఈ భేటీలో, రాష్ట్ర నాయకత్రయం ఇచ్చిన వివరణను పూర్తిగా విన్నారు. అయితే, రాష్ట్ర విభజన విషయాన్ని కేవలం కోర్ కమిటీ భేటీతో తేల్చేయలేమని భావించిన నేతలు, దీన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. మరో వారం పదిరోజుల్లో సీడబ్లూసీలో దీనిపై చర్చిస్తామని, భేటీ అనంతరం ప్రకటించారు దిగ్విజయ్ సింగ్. వర్కింగ్ కమిటీలో నిర్ణయించిన తర్వాత, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వర్కింగ్ కమిటీలోని కీలక నేతలైన సోనియా, రాహుల్, ప్రధాని మన్మోహన్ లు ఉన్న కోర్ కమిటీలోనే నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు, సీడబ్ల్యూసీలో అయినా స్పష్టత ఇస్తారన్న నమ్మకం కలగడం లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, విభజన అంశాన్ని వీలైనంతగా నాన్చేధోరణినే కాంగ్రెస్ కొనసాగించేటట్లు కనిపిస్తోంది.
Read more...
2, నవంబర్ 2011, బుధవారం
అధికారం ఉన్నా.. పోయినా.. తెలంగాణపై నిర్ణయం
"అధికారం ముఖ్యం కాదు.. ప్రజల సంక్షేమమే ముఖ్యం. తెలంగాణపై త్వరలోనే నిర్ణయం కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. యూపీఏలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ త్వరలోనే తెలంగాణ సమస్యకు స్పష్టమైన పరిష్కారం చూపిస్తుంది. సీమాంధ్రలో అధికారం ఉంటుందనో, పోతుందనో, తెలంగాణలో అధికారం ఉంటుందనో, పోతుందనో కాంగ్రెస్ పార్టీ భయపడదు. అధికారం కన్నా కాంగ్రెస్ పార్టీకి ప్రజల సంక్షేమమే ముఖ్యం.. ప్రజల మనోభావాలే ముఖ్యం"... ఈ ప్రకటనను చేసింది పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. రచ్చబండలో పాల్గొనడానికి విశాఖపట్నం వచ్చిన బొత్స బుధవారం ఈ ప్రకటనను చేశారు. దీన్ని బట్టి చూస్తే, కఠినమైన నిర్ణయమే వెలువడవచ్చని తెలుస్తోంది. అయితే.. అది తెలంగాణ సానుకూలంగా ఉంటుందా.. లేక సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉంటుందా అన్నదే ఇప్పుడు సందేహాస్పదం.
Read more...
28, అక్టోబర్ 2011, శుక్రవారం
నెంబర్ 2 ఎవరు?
బొత్స సెక్రటేరియెట్ గడప ఎందుకు తొక్కడం లేదు..?
సర్కార్లో కిరణ్ తర్వాత ఎవరు?
డిప్యూటీ సీఎం కేవలం చెస్ బోర్డులో పావు మాత్రమేనా..?
రాష్ట్రంలో నెంబర్ వన్ ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చెప్పేసింది. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా నెంబర్ 2 ఎవరనే? కిరణ్ తర్వాత సర్కార్ లో కీలక వ్యక్తి ఎవరనే..? అది పీసీసీ అధ్యక్షుడు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణా? లేక, డిప్యూటీ సీఎం గా ఛాన్స్ దక్కించుకున్న దామోదర్ రాజనర్సింహనా..? ఇక్కడే ముసుగులో గుద్దులాటలు, కాంగ్రెస్కు అలవాటైన రాజకీయాలు తెరపైకి వచ్చాయి.
వైఎస్ హయాంలో నెంబర్ 2 ఎవరన్నది అందరికీ సుస్పష్టం. తన తర్వాత రోశయ్యే అంటూ వైఎస్ చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. కీలక బాధ్యతలను అప్పజెప్పారు. అందుకే వైఎస్ హెలికాప్టర్ అదృశ్యం కాగానే, రోశయ్య నేతృత్వంలో కేబినెట్ సమావేశం కాగలిగింది. ఇప్పటి విషయానికి వస్తే, కిరణ్ తర్వాత ఎవరన్నది ఆయన ఎవరికీ చెప్పడం లేదు. అలా చేస్తే, తన పదవికే ముప్పు వస్తుందన్నది ఆయన భయం కావచ్చు. సర్కార్లో మరో కుంపటి మొదలైతే తట్టుకోవడం కష్టమే. పైగా, బాధ్యతలు అప్పజెప్పడానికి రోశయ్యలాంటి పెద్దమనిషి, అజాత శతృవు కేబినెట్లో లేనేలేరు. ఎవరో ఒకరిని ఎంచుకుందామా అంటే, మంత్రుల మధ్య గ్రూపు రాజకీయాలు తలెత్తడం ఖాయం అందుకే, సీఎం ఈ విషయంలో ధైర్యం చేయలేకపోతున్నారు.
సీఎం మాట అటుంచితే, నెంబర్ 2 పోస్టుపై ఆశలు పెట్టుకున్నవారి జాబితా మాత్రం పెద్దగానే ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఈ హోదా కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. ఎలాగూ పార్టీ ప్రెసిడెంట్ ను కాబట్టి, సీఎం తర్వాత అంతా తానే అని ఫీలవుతున్నారు. ఆ సంకేతాలను మిగిలిన మంత్రులకు ఇవ్వడానికి గతంలో గాంధీభవన్లోనే మంత్రులతో మీటింగులు పెట్టారు. సీఎం నోట అధికారికంగా తన హోదాను ప్రకటించుకోవాలని ఫీలయ్యారు. మొదట్లో మిగిలినమంత్రులూ అదే జరుగుతుందనుకున్నా, సీఎం పెదవి మెదలకపోవడంతో, బొత్సను పట్టించుకోవడం మానేశారు. ఇది బొత్సలో మరింత అసంతృప్తిని రగిలించింది. అందుకే, 60 రోజులుగా ఆయన సెక్రటేరియెట్ గుమ్మం తొక్కలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన కేబినెట్ మీటింగ్కు హాజరైనా, సెక్రటేరియెట్ లో జరిగిన సమావేశానికి మాత్రం రాలేదు. 40 రోజుల పాటు సమ్మె జరిగినా, సెక్రటేరియెట్కు వచ్చి సమీక్షించలేదు. చివరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ ప్రకటనను సైతం తన ఇంటినుంచే చేశారు తప్ప, సెక్రటేరియెట్కు రాలేదు. దీంతో, కేబినెట్ నుంచి బొత్సను తొలగించాలంటూ కిరణ్ గ్రూప్ హైకమాండ్ పై ఒత్తిడి తెస్తోంది.
ఇక డిప్యూటీ సీఎంగా దామోదర రాజనర్సింహ ఎంపికైనా, ఆయనకు దక్కిన బాధ్యతలు అంతంతమాత్రమే. సీఎం వెళ్లడానికి ఇబ్బందికరమైన పరిస్థితులున్న చోటకు మాత్రమే ఆయన వెళ్లగలుగుతున్నారు. ఉద్యోగులతో చర్చలు జరిపిన కేబినెట్ సబ్ కమిటీకి నేతృత్వం వహించారు. అంతటితోనే ఆయన పని అయిపోయింది. చివరకు తనంతట తాను నిర్ణయం తీసుకోలేని పరిస్థితి డిప్యూటీ సీఎంది. ఉద్యోగుల డిమాండ్లన్నింటికీ సీఎం ఆమోదం తెలిపితే తప్ప సమ్మె విరమణ జరగలేదు. అంతేకాదు.. రాజనర్సింహ నెంబర్ 2 అంటే ఎవరూ లెక్కచేసే పరిస్థితి లేదు. ఆయనకు పదవి దక్కడంపైనే మిగిలిన మంత్రుల్లో అసంతృప్తి రగులుతోంది. అందుకే, డిప్యూటీ దక్కినా నెంబర్ 2 అన్న సంకేతాలను సీఎం ఇంతవరకూ ఇవ్వలేదు. చెప్పాలంటే... సర్కార్లో ఇప్పుడు ఒకే ఒక్క నెంబర్ ఉంది.. అదే నెంబర్ వన్.. కిరణ్ కుమార్.. మరో నెంబర్ ను తన వెనుక ఎదిగేలా చేయాలనుకోవడం లేదు కిరణ్ కుమార్.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)