బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపుల్లో మరో కోణం ఇది. ఓ మహిళ పదకొండేళ్ల పిల్లాడితో బలవతంగా శృంగారం జరిపినందుకు అతను తండ్రి కావాల్సి వచ్చింది. ఈ ఘటన న్యూజిల్యాండ్ లో చోటు చేసుకుంది. ఆక్ లాండ్ లోని 36 ఏళ్ల మహిళ, తన కొడుకు స్నేహితుడిపై కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతోంది. అతను తమ ఇంటికి వచ్చిన ప్రతీసారి బలవంతంగా అతనితో సెక్స్ చేయించుకుంటూ వచ్చింది. ఏం జరుగుతుందో తెలియని ఆ పిల్లాడు, కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్స్ పల్ కు తెలియజేయడంతో విషయం బయటపడింది. దీనిపై బాలల రక్షణ బృందాలకు ప్రిన్స్ పల్ ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ పిల్లాడి కారణంగా ఆ మహిళ అప్పటికే గర్భం దాల్చినట్లు, ఓ హాస్పిటల్ లో డెలివరీ కూడా అయినట్లు న్యూజిలాండ్ మీడియా చెబుతోంది. బాలుడిపై లైంగిక వేధింపులకు దిగినందుకు గానూ, ఆ మహిళపై క్రిమినల్ కేసు పెట్టాలని భావిస్తున్నారు అక్కడి పోలీసులు.
Read more...
sex లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sex లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
20, జూన్ 2013, గురువారం
11 ఏళ్లకే తండ్రయ్యాడు...!
Categories :
11 yrs boy became father . child sexual abuse . newzealand . sex . special . TOP
16, జనవరి 2012, సోమవారం
కొరియర్లో తల్లిపాలు
Categories :
breast milk . courier . indonesia . life . mother milk . news . sex . TOP
నవమాసాలు మోసి కన్న బిడ్డ ఇంట్లో ఉంటుంది. ఆ బిడ్డకు ఆకలేసిన సమయంలో పాలు ఇవ్వలేని స్థితిలో తల్లి ఉంటుంది. ఎందుకంటే ఆమె వర్కింగ్ వుమెన్ కాబట్టి. వరల్డ్‌వైడ్‌గా ఆఫీస్, ఫ్యాక్టరీ, కంపెనీల్లో పనిచేస్తున్న తల్లులు ఎదుర్కొనే సమస్యే ఇది. మరి దీనికి పరిష్కారం లేదా..?
కొరియర్‌లో తల్లిపాలు...కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ... ఫిలిప్పీన్స్‌లో వర్కింగ్ వుమెన్ ఇప్పుడీ పద్దతినే అవలంభిస్తున్నారు. శిశువు ఆకలి అలమటిస్తున్న వేళ...తల్లి పాలే అందిస్తే. అంతకన్నా కావాల్సింది ఇంకేముంది. ఓ ఇండోనేషియన్ ఆలోచన ఎంతోమంది నవజాతశిశువుల ఆకలిని తీర్చడమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుతోంది. ఎంతోమంది తల్లులకు, తమ పిల్లలకు తమ పాలే ఇవ్వగలుగుతున్నామన్న తృప్తినీ కలిగిస్తోంది. ఇటీవలే రాజధాని జకార్తాలో సర్వీస్‌ను ప్రారంభించిన బ్రెస్ట్ మిల్క్ కొరియర్... తల్లికి, బిడ్డకు మధ్య వారధిగా పనిచేస్తోంది.
బ్రెస్ట్ మిల్క్ కొరియర్ ప్రారంభానికి వెనుక ఓ సదుద్దేశం ఉంది. పోషక విలువలున్న తల్లి పాలు లభించకపోతే శిశువుల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 2007లో ఇండోనేషియాలో 38 శాతం పిల్లలు.. తల్లిపాలకు దూరమయ్యారు. దీనిపై తీవ్రంగా ఆలోచించిన...40 ఏళ్ల ఫిక్రీ నౌవల్ అనే ఈ వ్యక్తి...బ్రెస్ట్ మిల్క్ కొరియర్‌ను ప్రారంభించాడు. భవిష్యత్తు తరం ఆరోగ్యంగా ఉండాలన్నది ఇతని లక్ష్యం. అందుకోసం వివిధ రూట్లను సెర్చ్ చేస్తూ... తల్లి ఇచ్చే పాలను తీసుకెళ్లి బిడ్డకు అందేలా చేస్తున్నాడు..
కాంపిటీషన్ వరల్డ్‌లో వర్కింగ్ వుమెన్ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఫిలిప్పీన్స్‌లో అయితే.. నవమాసాలు మోసి కన్న బిడ్డలను కనీసం.. మూడు నెలలన్నా అల్లారుముద్దుగా చూసుకోలేని పరిస్థితి. సమయానికి తల్లిపాలందించడానికి కొరియర్స్ సిద్ధంగా ఉండడంతో.. తల్లులకు ఇప్పుడు టెన్షన్ తీరిపోయింది. 45 నిమిషాల నుంచి గంట మధ్యలో డెలివరీ చేసే బ్రెస్ట్ మిల్క్ కోసం...కొరియర్స్ సంస్థ..మన కరెన్సీలో...దాదాపు..175 రూపాయల నుంచి...225 రూపాయలు ఛార్జ్ చేస్తోంది. అమ్మో ఇంత ధరా అనుకోకండి. కన్నబిడ్డ ఆరోగ్యంతో పోల్చితే.. ఈ మొత్తం చాలా తక్కువేకదా..
Click Here For English Version
Read more...
1, డిసెంబర్ 2011, గురువారం
ప్రపంచంలోనే తొలి సెక్స్ స్కూల్ ప్రారంభం

స్కూళ్ల జాబితాలో మరో కొత్త స్కూల్ చేరింది. అదే సెక్స్ స్కూల్. ఇందులో సెక్స్ పాఠాలు మాత్రమే చెబుతారు. ప్రపంచంలోనే మొట్టమొదటిగా భావిస్తున్న...ఆస్ట్రియన్ ఇంటర్నేషనల్ స్కూల్.. ఆ దేశ రాజధాని వియన్నాలో ప్రారంభమయ్యింది. ఎల్వా మారియా థాంప్సన్ అనే మహిళ దీన్ని ప్రారంభించింది. సెక్స్ ఎలా చేయాలనే దానిపై అద్భుతమైన తర్ఫీదును ఇందులో ఇస్తారట. 16 ఏళ్ల పైబడిన వారెవరైనా ఈ స్కూల్లో చేరవచ్చు. కేవలం థియరీ క్లాసులు మాత్రమే కాదని.. ప్రాక్టికల్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని మారియా చెబుతున్నారు. స్టూడెంట్స్ హోంవర్క్ చేసుకోవడానికి ప్రత్యేకంగా కో-ఎడ్ డార్మిటరీని ఏర్పాటు చేశారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి.. సర్టిఫికెట్ కూడా ఇస్తారట.
11, నవంబర్ 2011, శుక్రవారం
పూనం అందరికే షాకిస్తే.. ఈ సారి పూనంకే షాక్..
అర్ధనగ్న ఫోజులతో, కౌంట్ డౌన్ అంటూ మగాళ్లకు మత్తెక్కించే ఫోటోలను అర్థరాత్రి పూట రిలీజ్ చేయడంలో బాగా పేరుగడించిన పూనం పాండేకు దిమ్మ తిరిగిపోయింది. అవును మరి, ఆమె ఫోటోను చూసుకుని ఆమెకు అంతవరకూ ఉన్న మత్తు వదిలిపోయింది. పూర్తి నగ్నంగా ఫోటోలు దిగుతానని అప్పుడెప్పుడో వాడీవేడి ప్రకటనలు గుప్పించిన ఈ అమ్మడు, నగ్నంగా ఉంటే ఎలా ఉంటుందో చూడమంటూ కొంతమంది న్యూడ్ ఫోటోలను ఇంటర్నెట్ లో వదిలారు. వీటిని చూసి తెగ మండిపడుతోంది పూనం. పూర్తినగ్నంగా ఉన్న పూనం.. విష్ణుమూర్తి రూపంలో ఉన్న సచిన్ ఫోటో ఫ్రేమ్ ను పట్టుకొని నిలబడి ఉంది. ఆ ఫోటో ముందు షోయబ్ అక్తర్ మోకరిల్లి ఉన్నట్లు కనిపిస్తోంది. దీనిపై పూనం ట్వీట్ కూడా చేసింది. ఈ ఫోటో చూసి బాధపడుతున్నట్లు చెప్పింది. అయితే, నగ్నంగా చూపించనందుకు కాదట.. క్రికెట్ ను అవమానించినందుకట. ఇలాంటి ఫోటోను సృష్టిస్తారని కలలో కూడా ఊహించలేదంటోంది పూనమ్.
Read more...
5, సెప్టెంబర్ 2011, సోమవారం
పూనంకు సిగ్గులేదు..
Categories :
entertainment . sex . TOP
పూనం పాండే.. వరల్డ్ కప్ సమయంలో టీం ఇండియా గెలిస్తే నగ్నంగా ఫోజులిస్తానని ఘాటు ప్రకటన చేసిన మోడల్. కింగ్ ఫిషర్ మోడల్ గా క్యాలెండర్ గర్ల్ గా పేరుగాంచిన పూనం, కొంతకాలంగా ఇలా హాట్ హాట్ న్యూస్ ను అందిస్తూనే ఉంది. అయితే ,భారత్ వరల్డ్ కప్ ను గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకోకపోయినా.. ఇప్పుడు మాత్రం చెప్పకుండానే చేసి కాదు కాదు.. విప్పి చూపిస్తోంది. వర్షార్పణమైన ఇంగ్లాండ్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని, వారికి ఇన్స్సిరేషన్ గా ఉండడం కోసమని సెమీన్యూడ్ ఫోజులిచ్చింది. రెండు పీలికలు తప్ప ఒంటిపై ఏమీ లేని ఫోటోలను తన ట్విట్టర్ ఎకౌంట్లోనే పోస్ట్ చేసింది. చెప్పాలంటే సిగ్గు లేకుండా అందర్నీ చూడమని కోరుతోంది. పైగా, టీం ఇండియా గెలిస్తే.. ఇంకా సంచలనమైన ఫోటోలు ఇస్తానంటోంది. ఇదంతా తన ట్విట్టర్ ఎకౌంట్కు కస్టమర్లను లాక్కోవడానికో, బాలీవుడ్లో ఐటెం సాంగులు సంపాదించడానికో.. లేదంటే.. నగ్నంగా నటించమంటూ వచ్చే హాలివుడ్ ఛాన్సులకో తెలియదు కానీ.. ఇంటర్నెట్ లో మాత్రం పూనం రెచ్చిపోతోంది. ఇలాగే చూస్తూ ఊరుకుంటే.. పూర్తి నగ్నంగానూ త్వరలోనే దర్శనమిచ్చేయొచ్చు... ట్విట్టర్ లో పూనం స్వయంగా పెట్టిన ట్వీట్ చదవండి ఎంత ఆత్రంగా ఉందో తెలుస్తుంది.
@iPoonampandey Poonam Pandey
time for Men in Blue to Win ne how at ne Cost!!! Will b Releasing a sensational Pic as they get on the field!! i am with them! keep Watching
Read more...
1, సెప్టెంబర్ 2011, గురువారం
అక్కడ దానికీ పన్ను కట్టాల్సిందే..!
ఇంటి పన్ను కట్టి ఉంటారు...
ఆస్తి పన్ను కట్టి ఉంటారు..
సేవా పన్ను కూడా కట్టి ఉంటారు..
ఇంకా ఎడ్యుకేషన్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్
అంటూ చాలా చాలా ట్యాక్స్‌లను ప్రభుత్వానికి చెల్లించి ఉంటారు... కానీ మీరెప్పుడైనా సెక్స్ ట్యాక్స్ గురించి విన్నారా...ఏంటీ సెక్స్ ట్యాక్సా అంటూ నోరు వెళ్లపెట్టకండి.. మీరు చదివింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే...
సెక్స్ ట్యాక్స్...ఇదెప్పుడు వసూలు చేస్తారా అని అప్పుడే లెక్కలు వేయకండి..ఎందుకంటే సెక్స్ ట్యాక్స్ అన్నది మన యవ్వారం కాదు. జర్మన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ట్యాక్స్ కలెక్టింగ్ పాలసీ. ఇంతకీ సెక్స్ ట్యాక్స్ కట్టేదెవరో తెలుసా? విటులను ఆకర్షించి...శృంగార వాంఛలు తీర్చే అందమైన జర్మన్ భామలు. జర్మనీలో బాన్ అనే నగరం ఉంది. పశ్చిమ జర్మనీకి ఇది ఒకప్పటి రాజధాని. ఇక్కడ వ్యభిచారం పూర్తిగా చట్టబద్దం. అలాగని విచ్చలవిడిగా, ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు. రాత్రి 8.15 నుంచి ఉదయం 6 వరకూ ఇక్కడ ప్రాస్టిస్టూషన్ లీగల్‌గా సాగిపోతూ ఉంటుంది. వ్యభిచారాన్ని వృత్తిగా గుర్తించిన ఇక్కడి ప్రభుత్వం వాళ్లనెందుకు ట్యాక్స్ పరిధి నుంచి మినహాయించాలి అనుకున్నట్లుంది అందుకే.. వాళ్లపై ట్యాక్స్ కొరడా ఝలిపించింది. సుఖపెట్టండి...పన్ను కట్టండి అంటూ సెక్స్ ట్యాక్స్ మీటర్స్‌ను ఇంట్రడ్యూస్ చేసేసింది.
పార్కింగ్ మీటర్స్ తరహాలోనే సెక్స్ ట్యాక్స్ మీటర్స్‌ను ఏర్పాటు చేశారు. పడుపు వృత్తిలో ఉన్న అమ్మాయిలు తమ పని ప్రారంభించడానికంటే ముందే సెక్స్ మీటర్స్ నుంచి టోకెన్స్ తీసుకోవాలి. ఆ రాత్రికి వాళ్లు ఎంతమందిని సుఖ పెట్టినా సరే. ఒక్కసారి టోకెన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా టికెట్ కొనకుండా ఎవరైనా డ్యూటీలోకి దిగితే మాత్రం కష్టమే. ఎందుకంటే, టోకెన్ లేకుండా పోలీసులకు పట్టుపడితే వ్యభిచారం చేయకుండా నిషేధం విధిస్తారు. లేదంటే భారీగా జరిమానా వేస్తారు. ఇంతకీ ఒక్కరాత్రికి వీళ్లు కట్టాల్సిన పన్ను ఎంతో తెలుసా.. మన కరెన్సీలో 403 రూపాయలు... ఈ లెక్కన జర్మనీ సర్కారుకు భారీగానే ఆదాయం రావచ్చు.
7, ఆగస్టు 2011, ఆదివారం
జంబలకిడి పంబ

ఇప్పటివరకూ ఆడాళ్లను వేధించే మగాళ్లనే చూశారు. కానీ, ఇది రివర్స్ కేసు. మగాడిని వేధించే అమ్మడి కేసు. మ్యాటర్లోకి వెళితే.. ఊరు విశాఖ. అక్కడి పోలీసులకు తాజాగా ఓ కంప్లైట్ వచ్చింది. ఇచ్చింది రామకృష్ణ అనే వ్యక్తి. తనతో కాపురం చేయమంటూ ఎస్‌ఎంఎస్‌లతో ఓ మహిళ వేధిస్తుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సాక్ష్యంగా ఆమె పంపిన మెసేజ్ లనూ చూపించాడు. తనకు ఇంతకుముందే పెళ్లయ్యిందని, పిల్లలు కూడా ఉన్నారని పోలీసుల ముందు వాపోయాడు రామకృష్ణ. గతంలో తాను పనిచేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేసిన అమ్మాయే ఇలా మెసేజ్ లు పంపిస్తుందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు సదరు మహిళను స్టేషన్ కు తీసుకొచ్చారు. అయితే ఆమె చెబుతున్న వెర్షన్ మాత్రం మరోలా ఉంది. తనకు రామకృష్ణతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పింది. పెళ్లి చేసుకోమంటే ప్లేట్ మార్చి ఫిర్యాదు చేయడానికి వచ్చాడంటున్నారు.
31, జులై 2011, ఆదివారం
మారాల్సింది మా బట్టలు కాదు.. మీ చూపులు

మహిళలు ధరించే దుస్తులపై కొనసాగుతున్న వివక్ష తొలగాలంటూ ఢిల్లీలో అంతర్జాతీయ స్లట్ వాక్ నిర్వహించారు. మారాల్సింది తమ దుస్తులు కాదని.. పురుషుల ఆలోచనా ధోరణి అంటూ అమ్మాయిలు గళమెత్తారు. అబ్బాయిల్లానే నచ్చిన డ్రస్సులు వేసుకొనే స్వతంత్రం అమ్మాయిలకు ఉందని, వాటిపై ఆంక్షలు విధించడం తగదంటూ ర్యాలీ నిర్వహించారు. మహిళలపై దాడులు తగ్గాలంటే.. వస్త్రధారణ మార్చాలంటూ వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఈ ర్యాలీ జరిగింది. నాలుగు నెలల కిందట టొరంటోలో జరిగిన ర్యాలీకి కొనసాగింపుగా ఢిల్లీలో ఈ ర్యాలీని నిర్వహించారు. దీనికి ఢిల్లీ యూత్ మద్దతు పలికారు. జంతర్ మంతర్ దగ్గర ప్రారంభమైన ఈ ర్యాలీ రాజధాని నగరంలో ప్రధాన రహదారుల గుండా కొనసాగింది.
16, జులై 2011, శనివారం
దొంగతనానికి వెళ్లి బలైపోయాడు...! (పెద్దలకు మాత్రమే)

రష్యాలో చోరికి వెళ్లిన ఓ దొంగకు భలేగా బుద్దిచెప్పింది ఓ అమ్మడు. విక్టర్ జాసిన్కీ అనే 32 ఏళ్ల దొంగ, మెస్కోవస్క్ పట్టణంలోని ఓ బ్యూటీ పార్లర్ లోకి చొరబడ్డాడు. అయితే, అతని ఖర్మ కాలి, కాసేపటికే దాని యజమాని ఓల్గా జాజాక్ వచ్చేసింది. అమ్మడి వయస్సు 28 ఏళ్లే. కానీ, కరాటేలో బ్లాక్ బెల్ట్ కొట్టిన ఓల్గా, దొంగను కనిపెట్టి ఒక్క కిక్ తో మట్టికరిపించింది. దెబ్బలు తింటే తిన్నాను వదిలే చాలనుకున్న విక్టర్ కు వెంటనే మరో షాక్ ఇచ్చింది. సెలూన్ లో వెనకున్న గదిలోకి లాక్కెళ్లి అతణ్ణి కట్టి పడేసింది. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు కేవలం వయాగ్రా మాత్రలు మాత్రమే మింగిస్తూ, ఆ దొంగను అనుభవించింది. మూడోరోజు కోరిక తీర్చుకున్న తర్వాత, ఇప్పటికైనా బుద్ధితెచ్చుకొని బతకమని చెప్పి వదిలిపెట్టింది. అయితే, తనకు అన్యాయం జరిగిందంటూ ఆ దొంగ పోలీసులను ఆశ్రయించాడు. ఇప్పుడు షాక్ తినడం పోలీసుల వంతయ్యింది. ఓల్గాను పిలిచి ఎంక్వైరీ చేస్తే, అంతా నిజమేనని ఒప్పుకుంది. దొంగకు బుద్ధి చెప్పడానికే అలా చేశానని చెప్పింది. రెండుసార్లు మాత్రమే సెక్స్ చేశానని, కానీ, జీన్స్ కొనిచ్చానని, తిండిపెట్టానని, వదిలిపెట్టేటప్పడు.. వెయ్యి రూబుల్స్ కూడా ఇచ్చానని తన నిజాయితీని చాటిచెప్పుకుంది. పోలీసులు మాత్రం చట్టం తనపని తాను చేసుకుపోతోందని, ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. ఇంతకీ ఇక్కడ తప్పు చేసింది ఎవరు? దొంగతనానికి వెళ్లి దొరికిపోయిన విక్టర్ దా? బుద్ధి చెప్పాలనుకొని వెరైటీగా ట్రై చేసిన ఓల్గాదా..? ఇద్దరిపైనా కేసులు నమోదు చేసిన పోలీసులదా?
1, జులై 2011, శుక్రవారం
కారులో రాసలీలలు.. దొరికిపోయిన కార్డియాలజిస్ట్

విజయవాడకు చెందిన ఓ కార్డియాలిజిస్ట్ కారులో రాసలీలలు సాగిస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు. సిటీ సివిల్ కోర్ట్స్ సమీపంలో కారులో సాగుతున్న వ్యవహారాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు డాక్టర్ గారి వ్యవహారం బయటపడింది. పోలీసులు వచ్చేవరకూ అదే పొజిషన్లో ఉన్న డాక్టర్ గారిని అరెస్ట్ చేశారు. సదరు డాక్టర్ విజయవాడలో పేరున్న హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. డాక్టర్ తో పాటు పట్టుబడ్డ మహిళ, అదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ప్రతీ దానికీ ఓ చోటుంటుందన్న విషయాన్ని మర్చిపోయిన కామడాక్టర్... కెరీర్ నే రిస్క్ లో పడేసుకున్నాడు.
1, జూన్ 2011, బుధవారం
వివాహేతర సంబంధాలపై మహిళల మోజు
Categories :

పెద్దలు కుదిర్చిన సంబంధం.. ఈడు జోడు అదిరిపోయింది.. అందమైన జంట అని అంతా అనుకున్నారు..
ప్రేమపెళ్లి. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ఒకరికొకరు తోడుగా ఉండాలనుకున్నారు.
పెద్దలు కుదిర్చినదైనా, ఎదిరించి చేసుకునేదైనా.. పెళ్లికున్న ప్రత్యేకతే వేరు. ఆ పరమార్ధమే వేరు. ఆడ, మగను ఆలుమగలుగా మార్చే పవిత్రకార్యం వివాహం. భార్యాభర్తలిద్దరూ జీవితాతం ఒకరికొకరు తోడునీడగా ఉండాలన్న ఉద్దేశంతో చేసేదే పెళ్లి. పెళ్లి అయ్యే వరకూ బాగానే ఉంటుంది. ఆ తర్వాత కూడా కొంతకాలం బాగానే ఉంటుంది. కానీ, రెండుమూడేళ్లు గడుస్తున్నాయో లేదో.. ప్రాబ్లం స్టార్ట్. ఒకప్పుడు భర్తలనుంచి ఎక్కువ సమస్యలు. కానీ, ఇప్పుడు భార్యల నుంచి వస్తున్నాయి. భర్తకు తగ్గ భార్యగానే మసలుకుంటూనే.. మరో బంధంలో చిక్కుకుంటోంది. కాదు కాదు.. కావాలనే దాని కోరుకొంటోంది.
పవిత్రబంధం ఉండగా.. అపవిత్ర బంధాన్ని ఎంచుకుంటున్నారు. భర్త ఉండగానే .. మరో మగాడిని కోరుకుంటున్నారు. నేటి మహిళల్లో కొంతమంది ఎంచుకుంటున్న కొత్త బంధమిది. చిన్నపాటి పరిచయాలతో మొదలయ్యే సంబంధాలు.. ఎక్కడెక్కడివరకో తీసుకువెళ్లిపోతున్నాయి. గీతదాటేలా చేస్తున్నాయి. పరాయి పురుషుల మోజులో పడి.. సంసారాన్ని నిర్లక్ష్యం చేసుకునేలా చేస్తున్నాయి.
భర్త, పిల్లలు, సలక్షమైన కుటుంబం ఉన్నప్పటికీ, కొంతమంది మగువలు పరాయిపరం కావాలనుకొంటున్నారు. దానికోసం.. కుటుంబం మొత్తాన్ని వదిలేయడానికి సిద్ధపడుతున్నారు. పెళ్లయ్యాక, ఇలా మరొకరితో వెళ్లిపోతున్న కేసులు ఇటీవలికాలంలో విపరీతంగానే పెరిగాయి. పద్దతిగా విడాకులు తీసుకొని, మరో పెళ్లి చేసుకుంటే అందులో ఏ తప్పూ లేదు. దానికి ఎవరూ ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు. కానీ, వివాహబంధాన్ని చట్టప్రకారం విడదీసుకోకుండానే, గడపదాటుతున్నారు కొంతమంది మహిళలు. మరొకరితో సెటిల్ అయిపోతున్నారు. పవిత్రబంధాన్ని అపహాస్యం చేస్తున్నారు..
నగరాలు, పట్టణాలకే ఇది పరిమితం అనుకోవడానికి లేదు. గ్రామాలు పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. పెళ్లైనా, పిల్లలున్నా.. మరొకడు నచ్చితే, ముందూ వెనుకా ఆలోచించకుండా వెళ్లిపోతున్నారు. మరో కాపురం పెట్టేస్తున్నారు. లోక్లాస్ నుంచి హైక్లాస్ వరకూ అన్ని వర్గాల్లోనూ ఈ తరహా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచానికే ఆదర్శప్రాయమని మనం చెప్పుకునే భారతీయ విలువలను పతనం దిశగా నడిపిస్తున్నాయి. అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి..? తప్పు ఎవరిలో ఉంది..? ఆడవాళ్లలోనా..? మగవాళ్లలోనా..? లేక, తప్పుగా చూస్తున్న సమాజంలోనా..?
కారణం ఏమిటి?
మహిళలు గీతదాటుతున్నారు. కానీ , దాటడానికి కారణం ఏమిటి? ఇంట్లో భర్త ఉన్నా, మరో మగాడిపై మనసు పడాల్సిన అవసరం ఏమిటి?
వాస్తవానికి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంలో మగాళ్లదే పైచేయి. చాలామంది భర్తలు తమ భార్యలను మోసం చేస్తూనే ఉన్నారు. తరతరాలుగా, యుగయుగాలుగా ఇది జరుగుతూనే ఉంది. పెళ్లి చేసుకున్నా, ఇద్దరు ముగ్గరితో శారీరక సంబంధాలు కలిగిన మగాళ్లు ఇప్పటికీ మన మధ్యలో ఎంతోమంది ఉన్నారు. ఆ స్థాయిలో కాకపోయినా, స్త్రీలల్లోనూ ఇలాంటి మార్పే వస్తోంది. భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నవారూ క్రమంగా పెరుగుతున్నారు.
వివాహేతర సంబంధాలపై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిలోనూ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతీ వందమంది మగాళ్లలో 28 మందికి, ప్రతీ వందమంది స్త్రీలల్లో 18 మందికి వివాహేతర సంబంధాలున్నాయని బ్రిటన్‌లో ఇటీవల జరిగిన ఓ అధ్యయనం బయటపెట్టింది. మూడు దశాబ్ధాల్లో ఇదే అత్యధికమట. మన దేశంలోనూ ఇదే స్థాయిలో అక్రమబంధాలుంటాయన్నది అంచనా.
వివాహేతర సంబంధాలవైపు మహిళలు మొగ్గుచూపడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో మొదటిది ఎంజాయ్‌మెంట్. సెక్స్‌ను మొక్కుబడి వ్యవహారంగా వారు భావించడం లేదు. పైగా, ఒకప్పటిలా పురుషుడి ఆధిపత్యాన్ని కోరుకోవడం లేదు. కానీ, బెడ్‌రూంలో చాలా వరకూ భర్తదే ఆధిపత్యం. అంతా ఆయనకు నచ్చినట్లే జరగాలి. ఇది సహజంగానే ఆమెకు నచ్చదు. అలాగని, అక్కడ ఫ్రీగానూ ఉండలేదు. భర్త దగ్గర ముడుచుకుపోయి ఉండే భార్య.. ప్రియుడి దగ్గర మాత్రం చాలా ఫ్రీగా ఉంటుందట. పైగా, వెరైటీని ఎక్కువగా కోరుకునేవాళ్లూ ఈ తరహా బంధాలపై మోజు పెంచుకుంటున్నారు.
భర్తతో పడకసుఖం సరిగా పొందలేని సందర్భాల్లోనూ మహిళలు పక్కదారులు వెదుక్కుంటున్నారు. తమకు నచ్చినవారితో కోర్కెలు తీర్చుకుంటున్నారు. ఒకప్పుడు ఇలా చేయడానికి భయపడేవారేమో కానీ, ఇప్పుడు మాత్రం ధైర్యంగా తోడును వెదుక్కుంటున్నారు. ఉమ్మడి కుటుంబాలు పోయి.. చిన్నకుటుంబాలు ఏర్పడడంతో, స్త్రీని నియంత్రించేవారూ ఉండరు. భర్త జాబ్‌కు వెళితే.. భార్య ఒంటరిగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే కొత్త వ్యక్తులు.. వారిని లొంగదీసుకుంటున్నారు. మాటల్లో ముంచి, వారి మనసు దోచుకొని.. ముగ్గులోకి దించుతున్నారు. భార్యా భర్తల మధ్య సరైన అవగాహన లేకపోయినా, భర్తంటే భార్యకు ఇష్టం లేకపోయినా కొత్త బంధాలకోసం వెదుక్కుంటారు. ఇంట్లో అన్నీ ఉన్నా, భర్త బాగా చూసుకుంటున్నా, గీత దాటే మహిళలూ ఉన్నారు. సెక్స్ కోసం వెంపర్లాడే కొంతమంది ఇలా పక్కదారి పడుతున్నారు. హైఫై సొసైటీలో ఈ తరహా మహిళలు ఎక్కువగా తారసపడుతుంటారు.
వరసగా కేసులు
భార్య మోసం చేస్తోంది.. తాను కూడా మోసపోతోంది. వివాహేతర బంధాల్లో చిక్కుకొని సర్వం కోల్పోతోంది. పెళ్లినాడు చేసిన ప్రమాణాన్ని మరిచిపోయినందుకు ఫలితాన్ని అనుభవిస్తోంది. తొందరపడినందుకు... పవిత్రమైన బంధాన్ని వద్దనుకున్నందుకు జీవితాన్ని కోల్పోతోంది. ఇలా చెబితే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ, అందుకు సాక్షాలున్నాయి. మన కళ్లముందే చోటుచేసుకున్న సంఘటనలున్నాయి. విశాఖపట్నంలో ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు ఎక్కువగా బయటకొచ్చాయి.
దివ్యది సాలూరు. ఈడు రాగానే, మేనమామతో పెళ్లయ్యింది. కానీ, ఆమె మరొకరిని కోరుకొంది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మళ్లీ మనసు మారింది. మరొకరిపై మోజు పడింది. భర్తను,కన్నబిడ్డలను వదిలి అతనితో వెళ్లిపోయింది. కొంతకాలం తర్వాత పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి సీన్ మారింది. పెళ్లిచేసుకోనని అతను తెగేసిచెప్పేసరికి.. హంతకురాలిగా మారింది. నిద్రపోతున్నప్పుడు చున్నీని మెడకు బిగించి ప్రాణం తీసింది. ఇప్పుడు జైలుపాలయ్యింది. రెండు పెళ్లిళ్లు.. ముగ్గురు మగాళ్లు.. కానీ, ఇప్పుడు మాత్రం ఆమె ఒంటరిగానే మిగిలింది. భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంటే.. కన్నీరుపెట్టడం తప్ప ఏమీ చేయలేకపోతోంది. గాడి తప్పినందుకు ఫలితం అనుభవిస్తోంది.
ఇది మరో విషాధగాధ. పెళ్లై చక్కగా ఉంటున్న వరలక్ష్మి అనే మహిళ జీవితంలోకి మరో యువకుడు వచ్చాడు. పిన్నీ అంటూ పిలిచి వరసకలుపుకున్నాడు. వరసను మర్చిపోయి లొంగదీసుకున్నాడు. ఆమె కూడా క్రమంగా అతని మాయలో పడింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త బయటకు గెంటేశాడు. చేరదీస్తాడనుకున్న ప్రియుడు చేయిచ్చాడు. మరో పెళ్లి చేసుకున్నాడు. మరి.. ఈమెను సాకేదెవరు.. ? తనకు న్యాయం చేయమంటూ ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది.
తనకు నచ్చినట్లుగా బతకాలనుకొంది మరో మహిళ. ప్రేమించి పెళ్లి చేసుకుంది విశాఖకు చెందిన రత్నం. ఎనిమిదేళ్లు కాపురం చేసింది. ఇద్దరు పిల్లల్ని కనింది. కానీ ఆమెకు మరో యువకుడు పరిచయం అయ్యాడు. భర్తపై నుంచి మనసు అతనిపైకి మళ్లింది. భర్తను అడ్డుగా భావించిన ఆమె.. ప్రియుడితో కలిసి హత్య చేసింది. భర్త ప్రాణం తీసింది.
హైదరాబాద్‌లోనూ ఇలాంటిదే మరో కేసు. ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించిన ఓ ఇల్లాలు అత్తను చంపేసింది. ఇంట్లో బంగారం, డబ్బు తీసుకుని వెళ్లిపోవడానికి ప్లాన్ చేసి, భర్త, అత్తకు మత్తుమందు ఇచ్చింది. వారు స్పృహలో లేని సమయంలో ప్రియుడితో కలిసి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యింది. కానీ, అత్తకు మెలకువ రావడంతో.. ఆమెను హత్య చేసింది. ఇద్దరూ జైలుగోడలపాలయ్యారు.
గుణపాఠాలు
ఒకరు నచ్చక మరొకరిని మార్చిన దివ్య.. మూడో మనిషి చేతిలో ఘోరంగా మోసపోయింది. అప్పుడు గానీ, ఆమె చేసిన తప్పేమిటో తెలియలేదు. అందుకే.. హంతకురాలిగా మారింది. ఇక ప్రియుడి కోసం భర్తలను, కుటుంబ సభ్యులను కడతేర్చుతున్న ఆడవాళ్లూ ఉన్నారు. ఈ తప్పు ఆడవాళ్లదేనా..? ఆడవాళ్లనే మనం నిందించడం కరెక్టేనా..? వారి పాత్ర ఎక్కువగానే ఉన్నా.. ఈ పరిస్థితికి మగాళ్లు కూడా బాధ్యులే. భార్యను బొమ్మగానే చూస్తే ఇలాంటివే జరుగుతాయి. భర్తగా అజమాయిషీ చేయడం కాదు.. ప్రేమను పంచాలి. అప్పుడు.. మరో మగాడి గురించి ఆలోచించే అవకాశమే ఏ మహిళకూ ఉండదు.
తాత్కాలిక సుఖంకోసం వెంపర్లాడే స్త్రీలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. వివాహబంధమంత బలమైంది.. ఏదీ లేదు. కేవలం శారీరక కోర్కెలు తీర్చుకోవడానికే మహిళలను ప్రలోభ పెట్టే మగాళ్లుంటారు. మోజు తీరగానే వదిలేస్తారు. అలాంటి వారి కోసం కుటుంబాన్ని, భర్తను వదిలివెళ్లాల్సిన అవసరం లేదు. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుని, భర్తను మోసం చేయాల్సిన పనిలేదు. ఇటు భర్తను మోసం చేసి. .అటు ప్రియుడి చేతిలో మోసపోయి.. జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
ఒకవేళ భర్త నచ్చకపోయినా, అతనితో సుఖపడలేకపోతున్నా, చట్టప్రకారం విడిపోవడానికి మార్గాలున్నాయి. ఆ తర్వాత నచ్చినవాళ్లను మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. అంతేగానీ, వివాహబంధంలో ఉండగానే.. మరో తోడును వెదుక్కోకూడదు. అది లేనిపోని సమస్యలను సృష్టిస్తుంది. మీ పరువు ప్రతిష్టలను దిగజార్చుతుంది. అంతేకాదు.. ఇలా వివాహేతర బంధాల్లో చిక్కుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్న మహిళల పిల్లలూ అనాధలుగా మిగిలిపోతున్నారు. అటు భర్త..ఇటు ప్రియుడు ఎవరూ వారిని ఆదరించరు. మరి వారి పరిస్థితి ఏమిటి? అందుకే.. తప్పు చేసేముందు ఒక్కసారి ఆలోచించండి.
23, డిసెంబర్ 2010, గురువారం
మగాళ్లకు మాత్రమే..
Categories :

అమ్మాయిని చూస్తే.. అబ్బాయికి.. అబ్బాయిని చూస్తే అమ్మాయికి... కలిగేదే ఆకర్షణ. నచ్చినవారు కనిపిస్తే మది పులకిస్తుంది. మదనరాగం ఆలపిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య ఇలాంటి ఆకర్షణ సహజసిద్ధం. కానీ.. ఓ మగాడికి. .మరో మగాడి మధ్యే ఆకర్షణ చిగురిస్తే.. అది ఏ బంధం... దాన్ని ఏమని పిలవాలి..? ఇప్పుడు మన చుట్టూ ఇలాంటి వారే పెరుగుతున్నారు.
అందమైన అమ్మాయిని చూడగానే అబ్బాయి మనస్సు గాల్లో తేలిపోతుంది. మెచ్చినవాడు కంటపడితే అమ్మాయి ఊహాలోకంలోకి పరుగులు పెడుతుంది. అబ్బాయికి అమ్మాయి కావాలి.. అమ్మాయికి అబ్బాయి కావాలి. ఒకరికొకరు తోడు కావాలి. స్త్రీ, పురుషుల మనసులు కలిస్తే.. ఊహాలోకం నేలకు దిగివస్తుంది. వారిని ఏకం చేస్తుంది. అందరూ ఉన్నా.. వారిద్దరికీ ఏకాంత లోకమవుతుంది. స్త్రీ పురుషుల శరీరాల్లోనే ఓ అద్భుతమైన అయస్కాతం ఉంటుంది. ప్రకృతి పులకరించినప్పుడు ఆ ఆకర్షణ పెరుగుతుంది. రెండు తనువులను ఏకం చేస్తుంది. సృష్టి ధర్మాన్ని కాపాడుతూ మరో జీవికి ప్రాణం పోసే మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుంది.
సృష్టి ప్రారంభం నుంచి, కొనసాగుతున్న మహాప్రక్రియ ఇది. అందుకే.. స్త్రీ, పురుషుల మధ్య శృంగారం ప్రకృతి ధర్మమయ్యింది. కట్టుబాట్లకు లోబడి అది సాగితే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ, శృంగారంలో ఇప్పుడు ప్రకృతి విరుద్ధమైన పోకడలు ఎక్కువవుతున్నాయి. లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఇంతకాలం.. స్త్రీనే కోరుకున్న పురుషుడు.. ఇప్పుడు మనసు మార్చుకుంటున్నాడు. తనలాంటి మరో మగాడితో గడపడానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. అదే.. మేల్ సెక్స్ విత్ మేల్. MSMగా పిలిచే ఈ శృంగార పద్దతి మన దగ్గర శరవేగంగా విస్తరిస్తోంది. అసలు మగాడితో మగాడికి అవసరం ఎందుకు వస్తోంది..?
మగాళ్లే కావాలి..
వాళ్లూ మగాళ్లే... అందరిలాంటి వారే. కానీ, శృంగారం విషయంలో మాత్రం వారి ఫీలింగ్స్ వేరు. తోడు కోసం తపించినా వారికి కావాల్సింది స్త్రీ సాంగత్యం కాదు. పురుష సంభోగం. తమలాంటి మగాళ్లతోనే ఏకాంతాన్ని కోరుకుంటున్నారు కొంతమంది మగాళ్లు. వాళ్లే MSMలు. ఆడవాళ్లను చూస్తే రాని ఫీలింగ్.. మగాళ్లను చూడగానే మదిలో మొలకెత్తుతాయి. వారితో కాసేపన్నా గడపాలన్న కోరిక పుడుతుంది. హోమోసెక్స్‌ను ఎంజాయ్ చేయడానికి తమలాంటి వారికోసం అన్వేషణ మొదలుపెడతారు. అలాంటి వారు తారసపడితే, వారికి బంగారు నిధి దొరికినట్లే. కొంతమంది స్త్రీలతోనూ శృంగారంలో పాల్గొంటున్నా.. మగాళ్లతో గడిపినప్పుడే అసలైన అనుభూతిని పొందుతామనుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా హోమోసెక్సువల్స్ పెరుగుతున్నారు. స్త్రీ,పురుషులు కలిసి జంటగా ఉండడం కన్నా, ఇద్దరు మగాళ్లే జంటగా ఏర్పడుతున్నారు. ఫారిన్ కంట్రీస్‌లో ఇలాంటి వారికి ఆదరణ కూడా లభిస్తుండడంతో, ఈ ధోరణి మరింతగా పెరుగుతోంది. మన దగ్గర కూడా ఎంతో కాలంగా ఇలా మగాళ్లనే కోరుకునే మగాళ్లున్నప్పటికీ, వారి సంఖ్య ఈ మధ్యే వేగంగా పెరుగుతోంది. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చేసిన సర్వే ప్రకారమే.. రాష్ట్రంలో పురుష స్వలింగ సంపర్కుల సంఖ్య 60 వేలు. ఇది అధికారికంగా గుర్తించిన సంఖ్య మాత్రమే. బయటపడకుండా.. గుట్టు చప్పుడుగా స్వలింగ సంపర్కాన్ని కొనసాగిస్తున్న వారు లక్షమందికి పైగా ఉండొచ్చన్నది స్వచ్ఛంద సంస్థల అంచనా.
తోటి పురుషులతో తాత్కాలికంగానూ, శాశ్వతంగానూ శారీరక సంబంధాలను ఏర్పరుచుకుంటున్నారు చాలామంది మగాళ్లు. కొంతమంది సాధారణ జీవితం గడుపుతూనే, తరచుగా పురుషులతోనూ సెక్స్‌లో పాల్గొంటుంటారు. ఇక మరికొంతమంది స్త్రీలకు పూర్తిగా దూరంగా ఉండి పురుషులతోనే లైంగికవాంఛలు తీర్చుకుంటారు. ఈ రెండు కేటగిరీలు కాకుండా..మరో రకం మగాళ్లు, పురుషుల వాంఛలను తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. చెప్పాలంటే శృంగారంలో స్త్రీ పాత్రను వీరు పోషిస్తారు. అయితే.. ఇది సెక్స్ ట్రేడ్‌లో భాగంగానే సాగుతుంది. ఓ రకంగా.. వీరు మగవేశ్యలన్నమాట.
హోమోసెక్స్ ట్రేడ్
మగవేశ్యలు పెరుగుతున్నారు. మగాళ్లను తృప్తి పరచడానికి మగాళ్లే వేశ్యల అవతారం ఎత్తుతున్నారు. ప్రతీ జిల్లాలోనూ ఇలా కమర్షియల్‌గా సెక్స్ ట్రేడ్‌లోకి దిగుతున్న ఎంఎస్‌ఎంల సంఖ్య వేయికి పైనే ఉంది. జనాలు ఎక్కువగా ఉండే బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, సినిమాహాళ్లే వీరి హాట్‌స్పాట్‌లు. అక్కడే తమ అవసరం ఉన్న మగాళ్ల కోసం ఎదురు చూస్తుంటారు.
ఎంఎస్ఎంలు సెక్స్ ఛేంజ్ ఆపరేషన్లు చేయించుకోరు. హిజ్రాలుగా మారరు. మగాళ్లలానే జీవిస్తారు. కానీ, శృంగారాన్ని మాత్రం స్త్రీలతో కాక, పురుషలతో సాగిస్తుంటారు. స్వలింగ సంపర్కులు అందరి మగాళ్లలానే ఉన్నప్పటికీ, సెక్స్ ట్రేడ్‌లో ఉండే వారు మాత్రం తమ గెటప్‌ను కొద్దిగా మారుస్తారు. తాము హోమోసెక్స్‌వల్స్ అన్న సిగ్నల్స్‌ను జనంలోకి పంపిస్తుంటారు. ఈ పద్దతుల్లోనే మరో మగాడ్ని ఆకర్షిస్తారు. వీలైతే ఆ ప్రాంతంలోనే సెక్స్ జరుపుతారు. లేదంటే, ఫోన్ నెంబర్లు తీసుకొని, కుదిరినప్పుడు ఏకాంతంగా కలుస్తారు.
స్వలింగ సంపర్కం ఎందుకు?
వ్యభిచారంపై మనదగ్గర ఉన్న నిషేధమే ఎంఎస్‌ఎంల సంఖ్యను పెరిగేలా చేస్తోంది. సెక్స్ వర్కర్స్‌తో లాడ్జిలకు వెళ్లడం, జనం మధ్య గడపడమూ కష్టమే. పైగా పోలీసుల రైడింగ్‌లో దొరికితే ఎన్నో సమస్యలు. అదే మగవాడితో అయితే.. ఫ్రెండ్స్‌లా మూవ్ కావచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోవచ్చు. ఎవరికీ అనుమానం రాదు. మేల్ సెక్స్ విత్ మేల్ ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణం ఇదే. స్వలింగ సంపర్కులు.. సెక్స్‌ట్రేడ్‌లోకి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. మొదటిది ఆర్థికపరమైన ఇబ్బందులు. సులువుగా డబ్బు సంపాదించవచ్చన్న ఆశే.. హోమోసెక్స్‌వల్స్‌ను వ్యభిచారంలోకి దింపుతోంది.
మగవేశ్యలకు డిమాండ్ పెరుగుతోందంటున్నాయి స్వచ్ఛంద సంస్థలు. ప్రతీ ఏటా, ఇలాంటి వారిని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందంట. ఇప్పటివరకూ అయితే.. మన దగ్గర ఈ హోమోసెక్స్ చీకటిమాటునే సాగుతోంది. మరికొన్నాళ్లు పోతే, విదేశాల్లో సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు మనదగ్గరా కనిపించవచ్చు.
మగాళ్లు ఎందుకు మారుతున్నారు?
స్వలింగ సంపర్కులు పెరగడానికి రకరకాల పరిస్థితులు దోహదం చేస్తున్నాయి. చెప్పాలంటే చిన్న తనంలోనే ఎంతోమంది దీనికి అలవాటు పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన రెసిడెన్షియల్ స్కూళ్లలోనే దీనికి బీజం పడుతోంది. లైగింక వేధింపులకు గురయ్యే విద్యార్థులు క్రమంగా హోమోసెక్స్‌కు అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు ఎంఎస్‌ఎంలలో చాలామంది బ్యాక్‌గ్రౌండ్ ఇదే.
హాస్టల్స్‌లో పిల్లలంతా ఒకే చోట పడుకోవాల్సి ఉంటుంది. టీనేజ్‌లో అడుగుపెట్టే సమయంలో వారి శరీరాల్లో వచ్చే మార్పులు అనుకోకుండానే లైంగిక కోరికలను కలిగిస్తాయి. రాత్రుళ్లు ఒకేచోట ఆనుకొని పడుకొని ఉన్నప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోంది. విద్యార్థుల మధ్య స్నేహబంధం క్రమంగా లైంగిక బంధంగా మారిపోతోంది.
ఇక, స్త్రీ సాంగత్యానికి మగాళ్లు ఎక్కువ కాలం దూరమైనప్పుడూ స్వలింగ సంపర్క బంధాలు ఏర్పడుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోయే లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి ఎక్కువమంది ఈ పద్దతినే అనుసరిస్తున్నారు. తోటి మగాళ్లలోనే తోడును వెదుక్కుంటున్నారు. జైళ్లలోని ఖైదీల్లో ఈ తరహా ధోరణి గమనించవచ్చు.
ఇవి కాక.. పుట్టుకతోనే వచ్చే జన్యుపరమైన లోపాలు కూడా మగాళ్లను హోమోసెక్స్‌వల్స్‌గా మార్చుతున్నాయి. చిన్నప్పటి నుంచే అమ్మాయిలా ఉండాలనుకునేవారు స్వలింగ సంపర్కంవైపు మొగ్గు చూపుతున్నారు. జన్మత వచ్చిన శరీరాన్ని మార్చుకోలేక, లైంగికంగా మాత్రం మనసుకు నచ్చిన విధంగా ఉంటున్నారు.
MSMలు పెరగడంలో సమాజం పాత్ర కూడా ఉంది. హార్మోన్స్ సమస్యతో స్త్రీ లక్షణాలతో ఉన్నవాళ్లను అవహేళన చేయడం.. అడుగడుగునా అవమానించడం వల్ల, వారు మానసికంగా ధైర్యం కోల్పోతున్నారు. స్త్రీలతో సెక్స్‌కు పనికిరామేమోననుకుని.. హోమోస్‌గా మారుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా..
స్వలింగ సంపర్కం అసహజమైన ప్రక్రియే కావచ్చు.. కానీ, దాన్ని అంగీకరించాలా.. వద్దా అన్న విషయంలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే సాగుతోంది. కొన్ని దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మరికొన్ని దేశాలు మరణశిక్షనూ విధిస్తున్నాయి. చాలా దేశాల్లో హక్కుల కోసం హోమోస్ పోరాటాన్ని సాగిస్తున్నారు. మన దేశంలో స్వలింగ సంపర్కం నేరం కాదని నిరుడు సుప్రీంకోర్టు స్వయంగా తీర్పు నిచ్చింది. అయితే.. ఇద్దరు మగాళ్ల మధ్య బంధానికి మాత్రం చట్టబద్ధత లేదు. అందుకే, ఎంఎస్‌ఎంలకు పోలీసుల నుంచి వేధింపులు తప్పడం లేదు.
పద్దతి మార్చుకోలేరా..?
మరి వీరంతా మారడం సాధ్యం కాదా అంటే ఓ రకంగా కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే, మందులతోనో, మాటలతోనే నయం చేయడానికి ఇది జబ్బు కాదు. మానసికంగా వచ్చిన మార్పు. మనసుకు నచ్చినట్లు ఉన్నప్పుడే వారు స్వేచ్ఛగా జీవిస్తారు. మార్చడానికి ప్రయత్నిస్తే .. మరింతగా కుంగిపోతారు.
ఎయిడ్స్ ఎఫెక్ట్
హోమోసెక్సువల్స్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య ఎయిడ్స్. మేల్ సెక్స్ విత్ మేల్ గ్రూపుల్లోనే హెచ్‌ఐవీ ఎక్కువగా వ్యాపిస్తోందని రిపోర్టులు చెబుతున్నాయి. 2007లో ఎంఎస్‌ఎంల్లో 17 శాతంగా ఉన్న హెచ్‌ఐవీ కేసులు.. 2010 కల్లా 23 శాతానికి చేరుకున్నాయి. అరక్షిత పద్దతుల్లో సంభోగించడమే దీనికి ప్రధాన కారణం. మలద్వారం సున్నితంగా ఉంటుంది కాబట్టి, అది త్వరగా చిట్లి పోతుంది. ఫలితంగా చాలా వేగంగా ఎయిడ్స్ ఎఫెక్ట్ అవుతుంది. సాధారణంగా స్త్రీలతో సంభోగించే వారితో పోల్చితే మగాళ్లతో కలిసే వారిలో 30 శాతం అధికంగా ఎయిడ్స్ సోకుతోందట.
హోమోసెక్స్ నిర్మూలన సాధ్యం కాదు కాబట్టే.. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వీరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందుకే, ల్యూబ్రికేషన్ ఎక్కువగా ఉన్న కండోమ్స్‌ను ప్రత్యేకంగా MSMల కోసం మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. శృంగారం జరిపేటప్పుడు తప్పనిసరిగా కండోమ్‌ను వాడమని ప్రచారం చేస్తోంది. లేదంటే.. ఎయిడ్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ.
17, డిసెంబర్ 2010, శుక్రవారం
మాకో వయాగ్రా కావాలి..!

వయసు మళ్లినవారికోసం..
సెక్స్ సామర్థ్యం తగ్గినవారికోసం..
శృంగార సమస్యలతో బాధపడుతున్నవారికోసం..
వయాగ్రా....
కానీ... ఇప్పుడో కుర్రాళ్లకోసమే వయాగ్రా...
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ సెక్స్ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. శృంగారంలో పూర్తి స్థాయి ఆనందం పొందడం కూడా సాధ్యం కాదు.. ఇలాంటి వారికోసం తయారైన దివ్య ఔషధమే - వయాగ్రా. కానీ.. ఇప్పుడు ముసలి వాళ్లకేంటే.. యువతే వయాగ్రా కోసం ఎగబడుతోంది.. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవారే వయాగ్రా లాంటి ఉత్ర్పేరకాలను వాడుతున్నారు.. కేవలం హైదరాబాద్ నగరంలో నెలకు 30 లక్షలకు రూపాయల విలువచేసే వయాగ్రాలు అమ్ముడవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో సుమారు 8వేల మెడికల్ షాపులున్నాయి.. చిన్నచిన్నగల్లీల్లో ఉన్న మెడికల్ షాపులో కూడా రోజుకు ఒకటో రెండో వయాగ్రాలు అమ్ముడవుతున్నాయి.. ఇక.. ప్రధాన కూడళ్లలో ఉండే షాపుల్లో రోజుకు 50 నుంచి వంద స్ట్రిప్పుల వరకూ ఉత్ర్పేరకాలు సేల్ అవుతున్నాయి. శృంగారానికి దోహదం చేసే ఉత్ర్పేరకాలు మార్కెట్లో 30 వరకూ ఉన్నాయి.. వయాగ్రా, సోహాగ్రా, మ్యాన్‌ఫోర్స్, కవర్టా, ఫిల్గ్రా, సిలిడినాసిల్ సిట్రెట్, అండ్రోజు, పెనిగ్రా వంటి టాబ్లెట్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వివిధ రకాల పరిమాణాల్లో లభించే ఈ మందులు.. 50 నుంచి 120 రూపాయల మధ్యలో లభిస్తాయి.
శృంగార సంబంధ ఉత్ర్పేరకాలను కొంటున్నవారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా టీనేజ్‌లో ఉన్నవారిలో సెక్స్ సామర్థ్యం పూర్తిస్థాయిలో ఉంటుంది. 35-40 ఏళ్ల నుంచి శృంగార సామర్థ్యం తగ్గుతూ వస్తుంది.. మరి సెక్స్ సామర్థ్యం పూర్తిస్థాయిలో ఉన్న యూత్.. వయాగ్రా లాంటి ఉత్ర్పేరకాలపైన ఎందుకు ఆధారపడుతోంది..?
టెన్షన్స్.. టెన్షన్స్
పదిహేనేళ్లకే పెళ్లి.... ఆ తర్వాతే ఉద్యోగం లేదా వ్యాపారం.. ఇదీ ఒకప్పటి మాట.. టీనేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి కావడంతో.. ఒకప్పుడు సెక్స్‌ను పూర్తిగా ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్... పెళ్లి, సంసారం కంటే ముందు లైఫ్‌లో సెటిల్ కావడానికి యువత ప్రాధాన్యమిస్తోంది.. అందుకే.. చదువు సంధ్యల్లో మునిగి తేలుతోంది.. మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యేసరికి 25 నుంచి 30 ఏళ్లు గడిచిపోతున్నాయ్.. ఆ తర్వాతే పెళ్లి..! పాపం- సగం జీవితాన్ని ఉద్యోగవేటలోనే గడిపేస్తుంటే.. ఇక సంసారం సాఫీగా ఎలా సాగుతుంది..?
పాతికేళ్లకే లక్షలు ఆర్జిస్తుండడంతో.. ఆఫీసుల్లో పని ఒత్తిడి పెరుగుతోంది. టైంకి తిండి లేకపోవడం.. జంక్ ఫుడ్‌కి అలవాటుపడటం.. లాంటి సమస్యలు యువతను వేధిస్తున్నాయి. ఆఫీస్‌లో వదిలేయాల్సిన సమస్యలను ఇంటికి తీసుకొస్తున్నారు. ఇంట్లో జీవిత భాగస్వామికి కూడా తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు...? మానసిత ఒత్తిడితో.. సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడంతో పాటు ఎక్కువ సేపు సెక్స్ చేయలేకపోతున్నారు.. చిన్నవయసులోనే పనిభారం ఎక్కువ కావడంతో సమయానికి తిండి కూడా కరవైంది. దీంతో.. పోషకాహార సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ఆందోళనే వారిని ఉత్ర్పేరకాలవైపు మళ్లిస్తోంది..
బ్లూఫిల్మ్‌లు, టీవీల్లో శృంగార సంబంధ కార్యక్రమాలు కూడా యువతను రెచ్చగొడుతున్నాయి.. దీంతో.. శృంగారాన్ని పూర్తిస్థాయిలో ఆనందించాలని యూత్ తెగ తొందరపడుతోంది. అందుకే వయాగ్రాకోసం క్యూ కడుతోంది..ఇక.. శృంగారాన్ని ఎక్కువసేపు చేయాలనే కోరిక మరొకరిది.. శీఘ్రస్కలనంతో బాధపుడుతున్న కొంతమంది యువత.. అలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు మందులు వాడుతున్నారు.
అంగస్తంభన లోపం, నరాల బలహీనత, ఆయాసం.. లాంటి సమస్యలతో బాధపడుతున్నవారికి వైద్యులే కొన్ని మందులను సూచిస్తున్నారు. శృంగార సమస్యలతో వస్తున్నవారిలో పది శాతం మందికి ఇవే కారణాలు. ఒంట్లో అన్నీ బాగానే ఉన్నా.. తాము ఫిట్‌గా లేమనే భయం నేటి యువతను వెంటాడుతోంది. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న వివాహితులకు ఈ సమస్య ఎదురవుతోంది. అందుకే.. వారు వయాగ్రాలను ఆశ్రయిస్తున్నారు. కానీ ఇది మంచి పరిణామం కాదంటున్నారు వైద్యులు.
దివ్య ఔషధమేనా..!
వాస్తవానికి వయాగ్రా వండర్ డ్రగ్.. కానీ దానివల్ల పెద్దగా దుష్పరిణామాలు లేవు. కానీ.. వాడిన ప్రతి పదిమందిలో ఒకరికి తీవ్రమైన తలనొప్పి కలిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. వయాగ్రా డోస్ పెరిగేకొద్ది తలనొప్పి కూడా ఎక్కువ అవుతుంది. వయాగ్రా వాడినవారిలో 3శాతం మందికి తాత్కాలికంగా కళ్ళు కనబడకపోవడం, మసగబారడం జరుగుతోంది. అంతేకాదు.. వయాగ్రా రక్తపోటును తగ్గిస్తుంది.. బీపీ ఉన్నవారు వయాగ్రా వాడినప్పుడు.. రక్తపోటు మరింత పడిపోయి స్పృహ కోల్పోవడంలాంటివి జరుగుతున్నాయి.
వయాగ్రా వాడితే చాలాసేపు అంగం స్తంభించి ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ వయాగ్రా వాడుతున్నవారెవరిలోనూ... అంగం ఎక్కువసేపు నిలబడటం లేదని సర్వేలు చెబుతున్నాయి. శృంగారానికి గంటముందు ఈ టాబ్లెట్ వేసుకోవడం ద్వారా ఉపయోగం ఉంటోంది.
సాధారణంగా గుండెజబ్బు, మదుమేహం లాంటి జబ్బులున్నవారిలో అంగస్తంభన సమస్య ఉంటుంది. ఇలాంటి వారు తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు మాత్రమే వయాగ్రాలాంటి ఉత్ర్పేరకాలను వాడాలి.
వయాగ్రా వాడేవారిలో ఎక్కువ శాతం మంది అనవసరంగా భయపడటం, ఒత్తిళ్లకు గురవడమే కారణం.. డ్రగ్స్ మత్తులో పడిన నేటి యువత.. ఆమోజులో పడి శరీరాన్ని గుల్ల చేసుకుంటోంది. దీంతో.. త్వరగా సెక్స్ సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతోంది. సమయానికి భోజనం చేయడం, ఫాస్టు ఫుడ్స్‌కు దూరంగా ఉండడం.. పళ్లు, పాలు లాంటి పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని.. తద్వారా సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు..
కొందరు మగవారు తమ భార్యలను సంతృప్తిపరచలేమోనని, తాము తొందరగా ఉత్తేజితులం కావడం లేదనే కారణాలతో వీటిని ఉపయోగిస్తుంటారు. పడక గదిలో సుఖంగా ఉండడానికి కావల్సింది వయాగ్రా కాదు.. జీవిత భాగస్వామితో సఖ్యత, స్నేహభావం..! వీటితోపాటు.. మనసులో గూడుకట్టుకున్న భయం, అపోహలను వదిలించుకోవాలి.. వీలయినంతవరకూ ఒత్తిడికి దూరంగా ఉండాలి..
రోజుకు ఒక్క వయాగ్రా మాత్ర మాత్రమే వాడాలి. సెక్స్‌లో పాల్గొనే ఒక గంట ముందు దీన్ని తీసుకోవాలి. నోట్లో వేసుకున్న 10 నిమిషాలలో ఇది కరిగిపోతుంది. పూర్తిగా కరిగిన అర్ధగంట తర్వాత ఇది తన ప్రభావం చూపించడం మొదలుపెడుతుంది. ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇది కొంచెం లేటుగా ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. వయాగ్రా వాడే సమయంలో ద్రాక్ష పళ్లు లేదా ద్రాక్ష రసాన్ని తీసుకోకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వయగ్రా వాడేముందు ఓ సారి డాక్టర్‌ను సంప్రదించడం శ్రేయస్కరం..
ప్రేమానురాగానే ఉత్ప్రేరకాలు
సంసారాన్ని సుఖవంతం చేసుకోవడానికి.. శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికి భార్యాభర్తలు ప్రయత్నించాలి. ఇందుకోసం మొదట వారిద్దరి మధ్య సఖ్యత అవసరం.. భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన.. వారి జీవితాన్ని సుఖమయం చేస్తుంది. భార్యాభర్తలు.. తమ బలహీనతలను ఒకరినొకరు పరస్పరం ఎత్తిచూపడం ద్వారా వారి మధ్య మరింత దూరం పెరుగుతుంది. పడకగదిలో అలాంటి మనస్ఫర్థలకు దూరంగా ఉండడం మంచిది..
సంసారమన్నాక చిన్నచిన్న కోపాలు, పట్టింపులు కామన్.. ఇవి సంసారంలో సరిగమల లాంటివి..! ఒకరినొకరు తమ కోపాన్ని అణుచుకోవడం ద్వారా దగ్గరయ్యే అవకాశముంటుంది. భార్యాభర్తల వ్యక్తిగత విషయాల్లో పరాయి వ్యక్తుల ప్రస్తావన లేకుంటే మంచింది. పరాయి వ్యక్తుల ముందు భార్యను అవమానించకుంటే మంచింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనప్పుడు.. మనసును ఆహ్లాదపరుచుకునేందుకు సమయం కేటాయించుకోవాలి. భార్యాభర్తలు పరస్పరం బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా వారి మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడుతాయి..
పడక గదిలో ఒత్తిడికి గురవకుండా.. మానసికంగా ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇద్దరూ ఎడమొహం-పెడమొహంలాగా ఉండకుండా.. అన్యోన్యంగా ఉండాలి. అభిప్రాయాలను పంచుకోవాలి. రోమాంటిక్ మాటలు శృంగారాన్ని ప్రేరేపిస్తాయి. జీవిత భాగస్వామి సహకరించేందుకు ఈ మాటలు ఎంతో దోహదపడుతాయి. మనిషికి కెరీర్, సంపాదన ఎంత ముఖ్యమో.. జీవితంలో సంతోషం కూడా అంతే ముఖ్యం. సంతోషం లేనప్పుడు ఎంత సిరిసంపదలు ఉన్నా ఉపయోగం ఉండదు.. భార్యాభర్తలు బిజినెస్ పార్ట్‌నర్స్‌గా వ్యవహరించకూడదు.. తాము లైఫ్ పార్ట్‌నర్స్ అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
26, జూన్ 2010, శనివారం
రసిక రాజధానులు
Categories :

ఒకప్పుడది చీకటి వ్యాపారం. చీకట్లు కమ్ముకుంటుంటే...వ్యాపారం జోరందుకునేది. పేద కుటుంబాల్లోనే వారే.. ఆ రొంపిలోకి దిగేవారు. కానీ.. ఇప్పుడు.. చీకట్లను దాటుకొని అది విస్తరిస్తోంది. హైక్లాస్ పేరుతో హైటెక్ సిటీనే మార్చేస్తోంది.
హైదరాబాద్‌లో జోరుగా సాగే బిజినెస్ అదే..
ఏ కాలమైనా.. ఏ సీజన్ అయినా... ఫుల్ బిజినెస్..
మాంద్యంలోనూ హవా తగ్గలేదు..
రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది
టర్నోవర్ పెంచుకోంటోంది..
ఇప్పుడు ఇంపోర్టెడ్ సరకునూ అందుబాటులోకి తెచ్చింది..
వేలకు వేలు పోయగలిగితే చాలు.. సర్వసుఖాలు క్షణాల్లో...
ఇంత హిస్టరీ చెబుతోంది.. ఒకే ఒక్క బిజినెస్ గురించి.. అదే వ్యభిచారం. అవును.. హైదారాబాద్‌కు ఇప్పుడు ఇదే అట్రాక్షన్. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వారంతా ముందుగా ఆరాతీస్తోంది కూడా దీనిగురించే. క్షణికానందం కోసం.. ఎంతైనా ఖర్చుపెట్టగలిగేవారు పెరుగుతుండడంతో... కాల్‌గర్ల్స్‌కు క్రేజ్ ఎక్కువవుతోంది. అందుకే.. రాష్ట్ర రాజధాని ఇప్పుడు రసిక రాజధానిగా మారిపోయింది. ఘనమైన చరిత్రను తోసిరాజని.. వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.
కుర్రాళ్ల బలహీనతను ఆసరా చేసుకుంటున్న సెక్స్‌ముఠాలు.. రాజధానిపై పట్టుబిగిస్తున్నాయి. రాష్ట్రం నలుమూల నుంచే కాక.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నవారిని టార్గెట్ చేసుకుంటూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రతీ చోటా ఈ బ్రోతల్ హౌస్‌ల ఉనికి కనపడుతూనే ఉంది. ఇద్దరు ముగ్గురు అమ్మాయిల దగ్గర నుంచి మొదలుపెడితే.. నెట్‌వర్క్‌గా వందలాదిమందితో బిజినెస్ చేస్తున్న ముఠాలు కూడా ఇప్పుడు రాజధానిలో పాగా వేశాయి. పైగా.. మారుతున్న టెక్నాలజీని ఊతం చేసుకుని ఫోన్‌కాల్స్‌లోనే పని కానిచ్చేస్తున్నాయి. హైటెక్ పద్దతుల్లో తమ కస్టమర్లను సెట్ చేసుకుంటున్నాయి.
హైదరాబాద్‌లో మెయిన్ సెంటర్లైన.. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్.ఆర్.నగర్‌లలోనే వందలాది సెక్స్‌ముఠాలు పనిచేస్తున్నాయి. వీఐపీలు, హైక్లాస్ వారి కోసం ప్రత్యేకంగా అమ్మాయిలను ఏర్పాటు చేస్తున్నాయి. వెరైటీ కోరుకునే వారికోసం ఏకంగా విదేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకువస్తున్నాయి. కస్టమర్ల ఎంపిక విషయంలోనూ ఈ సెక్స్ సెంటర్ల యజమానులు చాలా జాగ్రత్త వహిస్తున్నారు. ఎంతో నమ్మకం కుదిరితేగానీ డీల్ కుదుర్చుకోరు. హైదరాబాద్ మొత్తం మీద చూస్తే.. ప్రతీరోజు కోట్లల్లోనే ఈ వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది.
కాస్ట్‌లీ వ్యాపారమే...
అబ్బాయిలకు ఎరవేసే బ్రోకర్లు హైదరాబాద్‌లో వేలల్లో ఉన్నారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్, కాలేజ్ స్టూడెంట్స్, బ్యాచ్‌లర్స్‌ను వీరంతా ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి అందమైన అమ్మాయిలను రాజధానికి రప్పిస్తున్నాయి. కాస్ట్‌లీ ఏరియాల్లో డెన్‌లను ఏర్పాటు చేసుకొని.. సీక్రెట్ బిజెనెస్‌ను నిర్వహిస్తున్నాయి.
హైదరాబాద్‌లో సెక్స్ ట్రేడ్ డైలీ టర్నోవర్.. దాదాపు కోటి రూపాయలు. రాజధానిలో ఎంత హైరేంజ్‌లో వ్యభిచారం జరుగుతోందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి.. మనుషులను బట్టి రకరకాల లెవల్స్‌లో ఈ వ్యాపారం జరుగుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. మురికివాడల నుంచి ఫైస్టార్ హోటల్స్‌దాకా అన్నమాట. బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, పార్కుల దగ్గర లోక్లాస్ వ్యభిచారం జరుగుతుంటుంది. ఇక మిడిల్ లెవల్ అంతా బ్రోకర్ల ద్వారా జరుగుతుంది. అమ్మాయిల ఫొటోలు చూపించి ఈ తరహా దందా నిర్వహిస్తారు. రోజుకు 1500 నుంచి 3 వేల దాకా వసూలు చేస్తారు. మూడోది హైటెక్ వ్యవహారం. హైటెక్‌లోనూ రకరకాల సర్వీసులున్నాయి. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్‌ను అద్దెకు తీసుకుని వాటినే వ్యభిచార గృహాలుగా మార్చేస్తారు. విటులను రప్పించుకొని.. అక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 10 వేల దాకా వసూలు చేస్తారు. దీని తర్వాత స్థాయి హైక్లాస్ ఏరియాది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టల్లో ఈ తరహా దందా కొనసాగుతోంది. ఇండిపెండెంట్ హౌసుల్లో ఈ వ్యాపారం కొనసాగుతోంది. ఒక్కోరోజుకు 20 వేలకు పైగా ఖర్చుపెట్టగలిగితే తప్ప.. వీటిల్లోకి ఎవరూ అడుగుపెట్టలేరు.
ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెక్స్‌ట్రేడ్ కూడా జతకలుస్తోంది. పార్టీల పేరుతో నగర శివార్లలోని రిసార్టుల్లో ఈ తరహా బిజినెస్ ఎక్కువగా జరుగుతోంది. అశ్లీల నృత్యాలు.. ఆ పై అందాల విందులు వీటిల్లో కామన్. ఇక ఫామ్‌హౌసుల్లోనూ.. అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న సంఘటనలూ ఎక్కువగానే జరుగుతున్నాయి. గ్రూప్‌గా బుక్ చేసుకుంటారు కాబట్టి.. లక్షల్లోనే చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా ప్రతీ చోటా జరుగుతోందనడానికి ఆధారం.. ఇటీవల వరసగా పోలీసులకు దొరుకుతున్న వ్యభిచార ముఠాలే. ఫాంహౌసులు, రిసార్టులపై దృష్టి పెట్టిన పోలీసులు.. పెద్ద సంఖ్యలోనే డ్యాన్సర్లను అరెస్ట్ చేశారు. ఇక బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ ఎన్నో వ్యభిచార ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ రెండు మూడు నెలల్లోనే వంద మందికి పైగా సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేశారు. అందరూ.. హైటెక్ సెక్స్ రాకెట్‌లో మునిగి ఉన్నవారే..
రాష్ట్రమంతా ఇదే రూటు
రాష్ట్రంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి బెజవాడ. అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ వెలసిన ఈ క్షేత్రం క్రమంగా వ్యభిచార కూపంలో కూరుకుపోతోంది. భక్తికి బదులు రక్తి రాజ్యమేలుతోంది. బెజవాడ బస్టాండ్ ఆధారంగా ఎంతోకాలంగా వ్యభిచార దందా జరుగుతున్నా ఎవరూ అరికట్టలేకపోతున్నారు. బస్సుదిగే ప్రతీ ప్రయాణీకుడిని.. ఎవరో ఒకరు లాడ్జీకి వెళదామంటూ అడగడం సర్వసాధారణం.
ఇప్పుడు మాత్రం ఈ బిజినెస్ కొత్త పుంతలు తొక్కుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్స్‌నే వ్యభిచార కేంద్రాలుగా మార్చేస్తున్నారు. ఫ్లాట్స్ అద్దెకు తీసుకోవడం.. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి విటులను ఆకర్షిస్తున్నారు.
అంతేకాదు.. మైనర్లతో వ్యభిచారం చేయించడంలోనూ విజయవాడది నెంబర్‌వన్ ప్లేస్. చిన్న పిల్లలను ఈ రొంపిలోకి దింపుతూ.. బ్రోకర్లు లక్షలు సంపాదిస్తున్నారు. అమ్మాయిలు కావాలంటూ.. జీ24 గంటల ప్రతినిధి అడిగితే.. బ్రోతల్ హౌస్ నిర్వహాకులు చెబుతున్న మాటలు వినండి.. పారిశ్రామికంగా.. పర్యాటకంగా ఎదుగుతున్న విశాఖలోనూ ఇదే పరిస్థితి. ఫ్రెండ్‌షిప్ క్లబ్‌ల పేరిట కుర్రాళ్లను బురిడీ కొట్టించి.. వ్యభిచారానికి అలవాటు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ వ్యభిచారం జోరుగానే సాగుతోంది. ప్రతీ పట్టణంలోనూ.. ముఠాలు భారీ ఎత్తున సెక్స్‌ట్రేడ్‌ను నిర్వహిస్తున్నాయి. లాడ్జీలు, హోటళ్లనే స్థావరాలుగా మార్చుకొంటున్నాయి. అప్పుడప్పుడూ పోలీసుల దాడుల్లో ఒకటీ అరా ఇలాంటి ముఠాలు దొరుకుతున్నా.. బయటకురాని ముఠాలు చాలానే ఉన్నాయి.
లక్షమంది సెక్స్‌వర్కర్లు
వ్యభిచారంపై రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించిన ఓ సర్వే ఒళ్లు జలధరించే నిజాలను బయటపెట్టింది. గతంతో పోల్చితే రాష్ట్రంలో వ్యభిచారం పదిశాతానికి పైగా పెరిగిందని ఈ సర్వేలో తేలింది. దాదాపు 211 పట్టణాల్లో వ్యభిచారం పెద్దఎత్తున సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే.. మిగిలిన జిల్లాల్లోనే 56 వేలకు పైగా సెక్స్‌వర్కర్లు ఉన్నారని సర్వే చెబుతోంది. రాజధాని కావడంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే దాదాపు పదివేల మంది సెక్స్ వర్కర్లు ఉంటారని అంచనా. ఇదంతా అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఉన్నవారు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పోతున్నవారూ కలుపుకుంటే.. దాదాపు లక్షమంది మహిళలు.. వ్యభిచార వృత్తిలో కూరుకుపోయి ఉన్నారు.
వ్యభిచారానికి సంబంధించి 65 శాతం బుకింగ్‌లు కేవలం సెల్‌ఫోన్‌ల ద్వారానే జరుగుతున్నాయి. స్టార్‌హోటల్స్ నుంచి చిన్న చిన్న లాడ్జీల దాకా అన్నింటిలోనూ వ్యభిచారం జరుగుతూనే ఉంటోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖల్లో అయితే.. మసాజ్ సెంటర్ల రూపంలోనూ సెక్స్‌ట్రేడ్ కొనసాగుతోంది. పైకి మసాజ్ సెంటర్లలానే కనిపించినా.. అక్కడే.. బుకింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకప్రాంతానికి చెందిన వారు.. మరో ప్రాంతానికి వెళ్లి వ్యభిచారంలో పాల్గొంటున్నారు. ఈ నీచవృత్తిలో ఇరుక్కుంటున్న వారిలో మూడు రకాలున్నారు. పొట్టకూటి కోసం.. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచారం చేస్తున్నవారు మొదటి రకమైతే.. రెండో రకం జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం ఒళ్లు అమ్ముకుంటున్నవారు. ఇక మూడోరకం.. బలవంతంగా ఈ రొంపిలోకి దిగినవారు. డబ్బుకోసం ఎవరో ఒకరు అమ్మేస్తే..వ్యభిచార గృహాలకు వీరు చేరతారు. అక్కడ బందీలై.. అందులోనే జీవిస్తారు.
దేశవ్యాప్తంగా చూస్తే.. ఢిల్లీ,ముంబై, కోల్‌కతా, పూణేల్లో వ్యభిచారం విశృంఖలంగా సాగుతోంది. ఇక్కడి రెడ్‌లైట్ ఏరియాల్లో ఎక్కువమంది అమ్మాయిలు మనరాష్ట్రం వారే. హైదరాబాద్, విజయవాడ, అనంతపురం కేంద్రంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కొనసాగుతోంది. ప్రతీ నెలా కనీసం.. ఇరవై నుంచి ముప్పై మందిని ట్రాఫికింగ్ ముఠాలు తమ వలలో వేసుకుని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లిపోతున్నారు. ఇదంతా కూడా అత్యంత పకడ్బందీగా జరుగుతుంది. పేద కుటుంబాలు.. ఆదాయం కోసం ఎదురుచూసేవారిని టార్గెట్ చేసుకొని ముఠా సభ్యులు పని మొదలుపెడతారు. ఢిల్లీ, ముంబైల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని చెబుతారు. నెలకు ఇరవై, ముప్పైవేల జీతాన్ని ఆశచూపుతారు. చివరకు.. బ్రోతల్ హౌసుల్లో అమ్మేస్తారు. ఇలా దేశంలోని ప్రధాన పట్టణాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో.. ఎంతోమంది మహిళలకు విముక్తి లభించింది. వ్యభిచార గృహాల నుంచి సురక్షితంగా తీసుకొచ్చినప్పటికీ.. వీరందరికీ పునరావాసం కల్పించడమే సమస్యగా మారుతోంది.
మగాళ్లదే తప్పు..
లక్షమంది వ్యభిచారం చేస్తున్నారంటే.. దానికి పదింతల మగాళ్లు.. సెక్స్‌కోసం పక్కదారి పడుతున్నట్లే లెక్క. ఇంత విచ్చలవిడిగా రాష్ట్రంలో వ్యభిచారం సాగుతున్నా.. పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోవడంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని పట్టణాలన్ని రసిక రాజధానులు మారిపోయినా... ఎయిడ్స్ లాంటి మహమ్మారి ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నా.. ఈ వృత్తికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.
ప్రపంచంలోనే అతిపురాతన వృత్తి వ్యభిచారం. ప్రభుత్వాల అనుమతి లేకున్నా.. విచ్చలవిడిగా సాగుతూనే ఉంది. హైటెక్ రూపానికి మారి. .మరింత రెచ్చిపోతోంది. పెద్దగా కష్టపడకుండానే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చన్న ఆశే వ్యభిచారం వైపు అమ్మాయిల చేత అడుగులు వేయిస్తోంది. సరిగ్గా ఈ కాసుల వలనే అందమైన అమ్మాయిలపై వేస్తున్నారు బ్రోకర్లు. వ్యభిచారంలోకి దింపుతున్నారు. ముందుగా అడ్డుకోవాల్సింది ఇలాంటి వారినే..
అయితే.. శరీరాలను అమ్ముకుంటూ సాగించే ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైడ్స్‌లో పట్టుబడ్డప్పుడు అమ్మాయిలనే కాక.. విటులను, బ్రోకర్లకు కూడా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. బలవంతంగా అమ్మాయిలను ఈ రొంపిలోకి దింపుతున్న వారిపై.. కఠినాతికఠినంగా వ్యవహరించాలి.
వ్యభిచారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు ఎక్కువగా హైక్లాస్ వ్యభిచారంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. హైటెక్ సెక్స్ బిజినెస్‌లో మునిగితేలుతున్నవారినే అరెస్టులు చేస్తున్నారు.
అయితే.. వ్యభిచారం గుట్టుగా సాగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఉప్పును అందించాల్సింది స్థానికులే. అంతేకాదు.. మీ పరిసర ప్రాంతాల్లో వ్యభిచారం జరగకుండా చూసుకోవాల్సింది కూడా పబ్లిక్కే.
వ్యభిచారంలో ఉన్న మహిళలంతా కోరుకుని వచ్చినవారు కాదు.. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినవారు. అందుకే.. వీరిని రక్షించడం మాత్రమేకాదు.. పునరావాసమూ దొరికేలా చేయాలి. మరో ఆదాయమార్గం ఉంటే.. మూడొంతుల మంది.. వ్యభిచారం నుంచి బయటపడతారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



