ఆశించినదానికన్నా అదనంగా అధికారులకు ఇస్తూ కొత్త రికార్డు సృష్టిస్తున్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. మంత్రులకూ ఒకటికి రెండు మూడు శాఖలను కేటాయించిన ఆయన.. అదే ట్రెండ్ ను అధికారుల విషయంలోనూ ఫాలో అవుతున్నారు. ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ఇప్పటికే సీసీఎల్ఏ అదనపు బాధ్యతలు కేటాయించారు. దీనికి తోడు ఆర్థిక శాఖలో ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుకు, రాష్ట్ర విభజన సంబంధింత అంశాలను అదనంగా అప్పగించారు. మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను సీఎంఓలోకి తీసుకున్నప్పటికీ, జిల్లా బాధ్యతలను అదనంగా ఆమెకే అప్పగించారు. తాజాగా, తెలంగాణ సమాచార శాఖ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి జనార్దనరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో, ఇంకా ఎంతమంది అధికారులకు అదనపు బాధ్యతలు అందుతాయో అన్న చర్చ సచివాలయంలో జోరుగా సాగుతోంది.
TELANGANA GOVERNMENT లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
TELANGANA GOVERNMENT లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
6, జూన్ 2014, శుక్రవారం
అందరికీ అదనంగా ఇస్తున్న కేసీఆర్
Categories :
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)