పవర్ స్టార్ కు చోటా ఫ్యాన్!
Categories :
abhishesk bachan . cinema . entertainment . pawan kalyan . tollywood
శ్వేత చేస్తే తప్పు.. సన్నీ చేస్తే ఒప్పా..?
Categories :
bollywood . cinema . entertainment . prostitution . shwetha basu prasad . sunny leone . TOP
అంతెందుకు, పోర్న్ మూవీస్ లో తెగ నటించి, అత్యంత దారుణమైన అలాంటి వీడియో క్లిప్పులనే ఇప్పటికీ అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్న పోర్న్ స్టార్ సన్నీలియోన్ ను మాత్రం బాలీవుడ్ నెత్తిన పెట్టుకుంది. శ్వేత చేసింది తప్పైతే.. సన్నీ చేసింది ఏమిటి.. ? ఆమె ఇప్పుడు అలాంటి వీడియోలకు దూరంగా ఉండొచ్చు.. కానీ, బాలీవుడ్ నటిగా మారాక, ఆ వీడియోలకు మరింత డిమాండ్ పెరిగిందన్నది వాస్తవం. అంతేకాదు.. ప్రపంచం నలుమూలల ఉన్న ఆమె దృశ్యాలను నాశనం చేయగలరా.. రోజూ ఆ క్లిప్స్ ను చూస్తున్న లక్షలాది మందిని కంట్రోల్ చేయగలరా..? ఏమాత్రం సాధ్యం కాదు. అలాంటి సన్నీలియోన్ కే ఎన్నో అవకాశాలిస్తున్నారే.. ఆమె కోసమే క్యారెక్టర్లు సృష్టిస్తున్నారే.. అలాంటప్పుడు శ్వేతబసు కోసం చిన్నపాటి క్యారెక్టర్లను సృష్టించలేరా.. ఇండస్ట్రీనే నమ్ముకుని వచ్చినవాళ్లను రక్షించాల్సిన బాధ్యత.. వారి గౌరవాన్ని కాపాడి, వారికి అండగా దండగా ఉండాల్సిన బాధ్యత ఆ ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకునే వాళ్లకు లేదా..
ఈ సారి ఆరు కాదు.. ఏకంగా పది
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. మరో సారి తన అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగించనున్నాడు. ఓం శాంతి ఓం కోసం 42 ఏళ్ల వయస్సులో సిక్స్ ప్యాక్‌తో కనిపించి దేశం మొత్తాన్ని అవాక్కు పరిచిన కింగ్ ఖాన్.. ఈ సారి హ్యాపీ న్యూ ఇయర్ సినిమా కోసం ఏకంగా టెన్ ప్యాక్ తో సిద్ధమయ్యాడు. 48 ఏళ్ల వయస్సులో టెన్ ప్యాక్ సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దేశ వ్యాప్తంగా సిక్స్ ప్యాక్ కు ఆ మధ్య క్రేజ్ వచ్చిందంటే దానికి షారుక్ ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు టెన్ ప్యాక్ ను కూడా సాధించడం చూస్తే.. దానికీ డిమాండ్ పెరిగిపోతుంది. ఐస్ మళ్లీ వస్తోంది..!
Categories :
ఆమె సరసన ఇంటర్నేషనల్ ఫేమస్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ నటించబోతున్నాడు. ఐశ్వర్య ఈ సినిమాలో లాయర్ గా నటిస్తుండగా, ఇర్ఫాన్ ఖాన్ సస్పెండ్ అయిన పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోంది.
మనంలో ఏదో మహత్తుంది..!
అందరికీ తెలిసిన కథే. అందరి జీవితాల్లో జరిగే కథే. కానీ, మనం తేలిగ్గా తీసుకునే రొటీన్ లైఫే.. కానీ తెరపై చూస్తే తప్ప అందులోని లోతెంతో తెలియదు. ప్రతీ మాట వెనుక, ప్రతీ చర్య వెనుక మనసులు పడే మథనం అర్థం కాదు. దాన్నే చూపిస్తుంది మనం. ప్రతీ కుటుంబం, ఇంకా చెప్పలంటే ప్రతీ భార్యాభర్త చూడాల్సిన సినిమా ఇది. ఎందుకు చూడాలన్నది.. చూసిన తర్వాతే అర్థమవుతుంది. ప్రతీ చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని తగువులు పెట్టుకునే నేటితరం భార్యాభర్తలైతే తప్పకుండా చూడాలి. చిన్నచిన్న గొడవలు ఎంతటి అనర్థాలను సృష్టిస్తాయో.. సూటిపోటి మాటలు జీవితాన్ని ఎలా కోల్పోయేలా చేస్తాయో సినిమా చూస్తేనే అర్థమవుతుంది.
ఒక్కో సన్నివేశం చూస్తూ కథలో లీనమైపోయే మనం.. అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అని అనుకోకుండా ఉండలేం. కొన్ని సన్నివేశాలను చూడగానే.. మనసు పొరల్లోనుంచి మీదైన అనుభవాలు గుర్తుకొచ్చి.. మీ కళ్లలోనుంచి మీకు తెలియకుండానే నీళ్లు కారిపోతాయి. అలాగని ఇది ఏడుపుగొట్టు సినిమా అసలే మాత్రం కాదు. కావల్సినంత వినోదం ఉన్న సినిమా. చెప్పాలంటే అన్నింటినీ సమపాళ్లలో రంగరించిన ఉగాది పచ్చడి ఈ మనం. ఈ సినిమాను ఇంత అద్భుతంగా మలిచిన దర్శకుడు విక్రమ్ కుమార్ కు, ఈ సినిమాను నిర్మించిన అక్కినేని కుటుంబానికి ధన్యవాదాలు చెప్పాల్సిందే.
సోనమ్ కపూర్ షేవింగ్ చేసుకుంటుందా..?
Categories :
bollywood . cinema . entertainment . photo shoot . shaving . sonam kapoor
నిజంగా ఆమె మొహంపై అవాంఛిత రోమాలేవీ లేవు.. కాకపోతే ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ట కోసం ఇచ్చిన స్టిల్స్ ఇవి. మగరాయుడిలా సరదాగా ఈ ఫోటోషూట్‌లో పాల్గొంది సోనమ్. అయితే, దీనిపై నెట్‌లో మాత్రం జోరుగా సెటైర్లు పడుతున్నాయి.
ఒకే వేదిక ఎక్కుతున్న చిరు, పవన్
Categories :
chiranjeevi . cinema . entertainment . nagababu . pawan kalyan . tollywood . varun tej
ఆస్పత్రిలో బెడ్ మీదే బెంగాలీని పట్టేశారట
Categories :
chakrapani . cinema . entertainment . tollywood . TOP
తెలుగు సినీ ప్రపంచంపై తిరుగులేని ముద్ర వేసిన మహానుభావుడు చక్రపాణి. ఆయన తీసిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ ఎప్పటికీ అజరామరం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారనడానికి ఆయన జీవితం ఓ ఉదాహరణ. నేర్చుకోవాలన్న తపన ఆయనలో నిరంతరం ఉండేదట. 1934లో ఆయనకు టీబీ కారణంగా ఓ ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది. ఆయనకు మదనపల్లిలోని ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రి, ఆపరేషన్ అంటేనే సగం ప్రాణం చచ్చిపోతుంది. ఆస్పత్రి బెడ్ పై నుంచి ఇంటికి వచ్చే దాకా ఏమీ చేయలేని పరిస్థితి. కానీ, ఈ సమయాన్ని కూడా ఎంతో చక్కగా ఉపయోగించుకున్నారు చక్రపాణి. తన పక్క బెడ్ లో ఉన్న బెంగాలీ బాబుతో పరిచయం ఏర్పరుచుకుని బెంగాలీని నేర్చుకున్నారట ఆయన. అంతేకాదు, ఆ పరిజ్ఞానంతో శరత్ నవలలను తెలుగులోకి అనువదించారు. శరత్ కు తెలుగుగడ్డపై విశేష ప్రాచుర్యం లభించడానికి ఓ రకంగా చక్రపాణే కారణం. ఆయన జీవితం నుంచి అందరం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో ఆయన జీవితం గురించి వచ్చిన చిన్న ఆర్టికల్ ఈ దిగువనే ఉంది. ఓ సారి చదవండి.

ఒక్క రోజులోనే మూడుసార్లు చూసిన బిగ్ బీ
జోరుగా జూనియర్
కమల్‌కు వెయ్యి కోట్లు కావాలట!
Categories :
cinema . collections . entertainment . kamal hasan . kollywood . tamil cinema . TOP
వెయ్యి కోట్లపైన్న కన్నేసిన క్రిష్
Categories :
1000cr club . bollywood . cinema . entertainment . hrutik roshan . krrish-3 . TOP
క్రిష్ -3 ఏ క్లబ్‌లో చేరుతుందంటూ మీడియా ప్రతినిధులు సినిమా నిర్మాత, హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్‌ను అడిగితే, వెయ్యికోట్ల క్లబ్ అంటూ సమాధానం ఇచ్చాడట. అయితే, ఏదో మాటవరసకు చెప్పినట్లు కాకుండా, ఆ రేంజ్‌లోనే వసూళ్లు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట రాకేశ్ రోషన్. భారతీయ సినిమాకు హాలీవుడ్ మూవీ రేంజ్‌లో కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు సీనియర్ రోషన్. అన్నట్లు, ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా భారతీయ నిపుణులతోనే పనిచేయించడం విశేషం. ఈ సినిమా హిట్ అయితే, ఇండియన్ సినిమా లెవల్ మరింత పెరుగుతుందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.
బాహుబలి ఫస్ట్ లుక్
Categories :
bahubali . cinema . entertainment . first look . prabhas . rajamouli . tollywood . TOP
రాజమౌళి దర్శకత్వంలో తెలుగు చిత్రపరిశ్రమలోనే అత్యంత భారీబడ్జెట్‌తో రూపొందుతున్న సంచలనాత్మక చిత్రం బాహుబలి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, యువ హీరో రాణా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను ప్రభాస్ జన్మదినం సందర్భంగా విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి. ఆ ట్రయలర్‌ను మీరు కూడా వీక్షించవచ్చు.
మహేశ్‌నే నమ్ముకున్న యూటీవీ
Categories :
cinema . entertainment . koratala shiva . mahesh babu . tollywood . TOP . utv movie
అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ డిస్నీ - యూటీవీ మోషన్ పిక్చర్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును నమ్ముకుని తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్, హాలీవుడ్లో అద్భుతమైన సినిమాలను నిర్మించిన యూటీవీ, ఇప్పటికే తమిళ, మలయాళ చిత్రాలను నిర్మిస్తున్నాయి. అయితే తెలుగులో మాత్రం తొలి సినిమాను మహేశ్ బాబుతోనే మొదలుపెట్టనుంది. దీనికోసం మహేశ్‌కు, యూటీవీకి మధ్య ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ 1లో నటిస్తున్నాడు. 'ఆగడు' కూడా మరికొన్ని రోజుల్లోనే సెట్స్‌పైకి వెళుతోంది. ఇది పూర్తికాగానే వచ్చే ఏడాది జులైలో యూటీవీ సినిమా మొదలవుతుంది. యూటీవీతో పాటు మహేశ్ కుటుంబ బ్యానర్ ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తాయి. అత్యంత భారీ బడ్జెట్‌ను దీనికోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మిర్చితో ఆకట్టుకున్న కొరటాల శివ ఈ సినిమాకు డైరెక్టర్. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఫ్యామిలీ,యాక్షన్ డ్రామాను అద్భుతంగా తెరకెక్కించగలిగే కొరటాల శివ, మహేశ్‌కు సూపర్ హిట్ ఇస్తాడని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
దూసుకెళ్తాతో దశ తిరిగినట్లేనా!
Categories :
cinema . doosukeltha . entertainment . tollywood . TOP . vishnu
అసలు నిజం ఒప్పుకున్న వర్మ
పవన్ కళ్యాణ్ కాటమ రాయుడి అసలు కథ ఇది..
Categories :
attarintiki daredi . cinema . entertainment . katama rayuda song . pawan kalyan . tollywood . TOP
అనుష్క లవ్ ఫెయిల్ అయ్యిందా..?
Categories :
anushka . cinema . entertainment . tollywood . TOP
అప్పుడెప్పుడో లోకల్ టీవీలో జయప్రదం కార్యక్రమంలో జయప్రదతో ముచ్చట్లు చెప్పినప్పుడు.. ఓ మంచి వ్యక్తిని చూసుకున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది హాట్ హీరోయిన్ అనుష్క. అదే షోలో వేదం డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొని అనుష్కతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఇది జరిగి దాదాపు రెండేళ్లు పైనే కావొస్తుంది. అనుష్క ఎవరిని పెళ్లి చేసుకోబోతోందంటూ అప్పట్లోనే చాలా వదంతులు వచ్చాయి. ఈ క్రమంలో గోపిచంద్ పేరు కూడా కొన్నాళ్లు వినిపించింది. నాగార్జున తనయుడు నాగచైతన్యతో కూడా అనుష్క క్లోజ్ గా తిరుగుతోందన్న రూమర్లూ పుట్టాయి. కొన్ని ఛానళ్లైతే వారిద్దరికీ పెళ్లంటూ బ్రేకింగ్స్ కూడా ఇచ్చాయి. తెలుగు సినిమాలను వదలి, మద్రాస్ లో కొన్నాళ్లు ఆమె మకాం వేయడంతో ఈ పుకార్లు ఆగిపోయాయి. మళ్లీ ఇప్పుడు అనుష్క పెళ్లి మాటలు ఫిల్మ్ నగర్ లో మొదలయ్యాయి. మిర్చి సినిమా ఇంటర్వ్యూల్లోనూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పింది స్వీటీ. అయితే, లవ్ మ్యారేజ్ కాదని, పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటున్నానని తేల్చేసింది. తాజా సమాచారం ప్రకారం ఆమె బంధువుల అబ్బాయినే పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా పూర్తయ్యే సరికి 2015 అవుతుంది కాబట్టి, ఆ తర్వాతే రుద్రమదేవి పెళ్లిబాజా మోగనుంది.బండ్ల గణేశ్ పని అయిపోయిందా..? బాద్షా ఆగిపోతుందా..?
Categories :
bandla ganesh . cinema . entertainment . income tax . it raids . news . tollywood . TOP

















