మోడీని విధ్వంసకర శక్తిగా చూపించడానికి ప్రయత్నించి దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్, దానికి తగ్గ మూల్యమే చెల్లించుకుంది. ఎప్పుడూ లేనంతగా దేశం ఒక్కటై, మోడీకి భారీ మెజార్టీ కట్టబెట్టింది. 285 సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, ఎవరి దయాదాక్షిణ్యాలమీద బతకకుండా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమంటూ ఆశీర్వదించింది.
కాంగ్రెస్ ను కుళ్లబొడిచేశారు..
మోడీని విధ్వంసకర శక్తిగా చూపించడానికి ప్రయత్నించి దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్, దానికి తగ్గ మూల్యమే చెల్లించుకుంది. ఎప్పుడూ లేనంతగా దేశం ఒక్కటై, మోడీకి భారీ మెజార్టీ కట్టబెట్టింది. 285 సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, ఎవరి దయాదాక్షిణ్యాలమీద బతకకుండా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమంటూ ఆశీర్వదించింది.
రెండు రాష్ట్రాల్లోనూ చంద్రోదయం
తెలంగాణలో పోటాపోటీగా ఎన్నికలు జరిగాయంటూ సర్వేలు చెప్పినా, కాంగ్రెస్ నేతలు తమదే విజయం అన్నా.. ప్రజాతీర్పు మాత్రం వన్ సైడ్ గానే వచ్చింది. టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో మెజార్టీని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ ను మాత్రం పాతిక మార్కును దాటనివ్వలేదు. చాలామంది మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా చుక్కలు చూపించారు తెలంగాణ ఓటర్లు..
సీమాంధ్రలో మాత్రం రెండు రకాల తీర్పులొచ్చాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఓటర్లు టీడీపీ పక్షాన నిలిస్తే, దక్షిణ కోస్తా, అనంత మినహా రాయలసీమ మిగిలిన మూడు జిల్లాల ప్రజలు మాత్రం వైసీపీ పక్షాన నిలబడ్డారు. జిల్లాల వారీగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ నడిచింది. ఎక్కడా కాంగ్రెస్ ను ఖాతా తెరవనివ్వలేదు ఆంధ్ర ఓటర్లు.జిల్లాల వారీగా బలాబలాలు
శ్రీకాకుళం (10): టీడీపీ-7, వైసీపీ-3
విజయనగరం (9): టీడీపీ-6, వైసీపీ-3
విశాఖపట్నం (15): టీడీపీ-11, వైసీపీ-3, బీజేపీ-1
తూ.గో. (19): టీడీపీ-12, వైసీపీ-5, బీజేపీ-1, ఇండిపెండెంట్-1
ప.గో. (15): టీడీపీ-14, బీజేపీ-1
కృష్ణా (16): టీడీపీ-10, వైసీపీ-5, బీజేపీ-1
గుంటూరు (17): టీడీపీ-12, వైసీపీ-5
ప్రకాశం (12): వైసీపీ-6, టీడీపీ-5, ఇండిపెండెంట్-1
నెల్లూరు (10): వైసీపీ-7, టీడీపీ-3
చిత్తూరు (14): టీడీపీ-6, వైసీపీ-8
అనంతపురం (14): టీడీపీ-12, వైసీపీ-2
కడప (10): వైసీపీ-9, టీడీపీ-1
కర్నూలు (14): టీడీపీ-3, వైసీపీ-11
ఆళ్లగడ్డలో మాత్రం దివంగత నేత శోభానాగిరెడ్డినే గెలిపించారు అక్కడి ప్రజలు. ఆమె చనిపోయినా, ఆమెకు ఓటేస్తే ఉపఎన్నికలు వస్తాయని తెలిసినా, ఓటు ద్వారా ఆమెకు నివాళులు అర్పించారు ఆళ్లగడ్డ ఓటర్లు.
సీమాంధ్రలో సైకిల్ సవారీ .. హస్తగతమైన తెలంగాణం
ఇక తెలంగాణ విషయానికి వస్తే కారు జోరుకు హస్తం అడ్డుగా నిలిచింది. మున్సిపాలిటీల్లో సింహభాగం కాంగ్రెస్ పార్టీకే దక్కి, ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. 21 మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకోగా, టీడీపీ రెండు, టీఆర్ఎస్ 8 మున్సిపాలిటిల్లో అధికారాన్ని అందుకున్నాయి. అయితే, ఈ సారి ఆశ్చర్యకరంగా, బీఎస్పీ రెండు మున్సిపాలిటీలను దక్కించుకోవడం విశేషం. ఎంఐఎం భైంసా మున్సిపాలిటీలో జయకేతనం ఎగరవేసింది. తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. నిజామాబాద్, రామగుండంలో హస్తం హవానే నడిచింది.
ప్రణబ్ జీ నీకిది తగునా...?
సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడం భారత పౌరుల విధి. విధిని సరిగా నిర్వర్తించలేని వాడికి హక్కులు కోరే అధికారం ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఓటు వేయాలంటూ భారీగా ప్రకటనలు ఇస్తూనే ఉంది. దానికి తగ్గట్లే ఈ సారి కూడా చాలామంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే, ఈసారి రాష్ట్రపతి మాత్రం ఓటు వేయడం లేదు. తటస్థంగా ఉండాలన్న ఉద్దేశంతో ఓటు వేయడం లేదంటూ రాష్ట్రపతి భవన్ ధృవీకరించింది. వాస్తవానికి ఆయన బ్యాలెట్ ఓటు వేయాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో మాత్రం ఇతర రాష్ట్రపతుల్లా ఓటు వేయకుండా ఉండడమే మంచిదని భావించారట.
దేశ ప్రథమ పౌరుడే ఓటేయకపోతే, మిగిలిన జనం ఓటెలా వేస్తారు.. ? ఏ పార్టీకి ఓటేయాలన్నది వ్యక్తిగత విషయం. దాన్ని అధికారిక వ్యవహారాలతో ముడి పెట్టడం ఎంతవరకూ సమంజసం. రాష్ట్రపతి అయినంతమాత్రాన ఆయన కాంగ్రెస్ వ్యక్తి కాకపోతారా.. ఒకవేళ అంత కాదనుకుంటే, ఈ సారి నుంచి నోటా ను కూడా ఈసీ అందుబాటులోకి తెచ్చింది కదా.. కనీసం అదన్నా వేసి ఓటు గౌరవాన్ని కాపాడవచ్చు కదా.. అంతేకాని, నేను ఓటేయనంటే.. జనం కూడా మాకేంటి అనుకోరూ.. ప్రణబ్ జీ ఓటేయండి.. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవండి.
భారీ ఓటింగ్‌తో ఛాన్స్ దక్కేదెవరికి?
Categories :
chandrababu . election . jagan . POLITICS . POLLING . seemandhra . tdp . voters . ysrcp
సీమాంధ్రలో శివమెత్తిన ఓటర్లు
తెలంగాణలో భారీగా పోలింగ్
జిల్లాల వారీగా చూస్తే
ఆదిలాబాద్ 78%
నిజామాబాద్ 70%
కరీంనగర్ 76.02%
మెదక్ 77%
రంగారెడ్డి 60%
హైదరాబాద్ 53%
మహబూబ్ నగర్ 73%
నల్గొండ 80.56%
వరంగల్ 75%
ఖమ్మం 78%
భారీగా పోలింగ్ నమోదు కావడంతో, విజయం ఎవరిదన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమదే విజయం అంటూ బీరాలు పోతున్నాయి. అటు దేశవ్యాప్తంగానూ భారీగా పోలింగ్ నమోదయ్యింది. ఐదు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది.
పాపం బ్రహ్మీ..
Categories :
election . news . POLLING . telangana . VOTE MISSING
చిరూ.. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో..!
హైదరాబాద్ వెనుకబడింది..
తెలంగాణ ముగిసింది.. ఆంధ్ర మిగిలింది
తెలంగాణలో ప్రచారానికి తెరపడుతుండడంతో సీమాంధ్రపైకి దృష్టి మళ్లించాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే చంద్రబాబు కొన్ని జిల్లాల్లో ప్రచారం పూర్తి చేయగా, బాలయ్య కూడా విరామం లేకుండా ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కు స్టార్ క్యాంపైనర్ గా చిరంజీవి తన పని మొదలుపెట్టారు. అన్నింటికీ మోడీ మంత్రాన్నే వల్లె వేస్తున్న బీజేపీ, సీమాంధ్రలోనూ ఆయన్నే ప్రచారానికి పిలుస్తోంది. ఏప్రిల్ 30, మే1 తేదీల్లో ఆయన సీమాంధ్రలో పలు సభల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 30న తిరుపతిలో, మే 1న విశాఖలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఇక మే 2 సోనియా విశాఖ బహిరంగ సభలో పాల్గొంటారు. మోడీ సభ జరిగిన తర్వాతి రోజే సోనియా సభ జరుగుతుండడంతో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. అటు రాహుల్‌తో కూడా వీలైనంతగా సభలను నిర్వహించాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
రాహుల్‌కు క్లారిటీ ఉందా..?
Categories :
election . made in telangana . POLITICS . rahul gandhi . telangana
ప్రస్తుతం యువకులు ధరిస్తున్న గడియారాలు, టీషర్టులు, షూలు అన్నీ మేడిన్ చైనా అన్న పేరుతో వస్తున్నాయన్నారు రాహుల్ గాంధీ. డబ్బు మనది, ఉపాధి చైనా వాళ్లదంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాటన్నింటిపైనా మేడిన్ తెలంగాణ అని వస్తుందని, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. హామీ వరకూ బాగానే ఉన్నా.. ఓ వస్తువు మీద మేడిన్ తెలంగాణ అని వేయడం కరెక్టా కాదా అన్నది రాహుల్ ఆలోచించలేకపోయారు. మన దేశంలో తయారైన ఏ ఉత్పత్తి అయినా మేడిన్ ఇండియా అనే ఉంటుంది తప్ప.. మేడిన్ ఆంధ్రప్రదేశ్, మేడిన్ మధ్యప్రదేశ్, మేడిన్ గుజరాత్ అంటూ ఉండదు. జనాన్ని ఆకర్షించడానికి మరీ ఇంతలా హామీ ఇవ్వాల్సిన అవసరమూ లేదు.. రాహుల్ కాస్త ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకుంటే మంచిదేమో..!
దొరికింది గోరంత... దొరకాల్సింది కొండంత
ఎన్నికల వేళ ధనప్రవాహం వరదలా దేశాన్ని ముంచెత్తుతోంది. ఎన్నికల సంఘం, పోలీసులు సంయుక్తంగా చేస్తున్న సోదాల్లో భారీగా నోట్ల కట్టలు, మద్యం బాటిళ్లు పట్టుబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ చూస్తే ఎందుకంటే, చాలామంది నేతలు ఇతర మార్గాల్లో కోట్లాది రూపాయలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలోనే ఈ సారి అభ్యర్థులు చేస్తున్న ఖర్చు రెండు వేల నుంచి మూడు వేల కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఒక్కసారి పెట్టుబడి పెడితే, ఐదేళ్ల పాటు సంపాదించుకునే అవకాశం ఉండడమే ఈ స్థాయిలో అభ్యర్థులతో ఖర్చు పెట్టించేలా చేస్తోంది. డబ్బు, మద్యం, తాయిలాల పేరుతో ఓటర్లను మభ్యపెట్టి, తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతీ పార్టీ అభ్యర్థి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి బంధువులు, సన్నిహితులు, అనుచరుల ఇళ్లల్లో నిత్యం సోదాలు చేస్తే వేలాది కోట్లు దొరకడం ఖాయం. అటు ఎన్నికల సంఘం.. ఇటు పోలీసులు ఈ విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంది.
ఇక ఇలా దొరుకుతున్న డబ్బును ఏం చేస్తారన్నదానిపై సరైన వివరాలు లేవు. నిబంధనల ప్రకారం ఐటీ శాఖకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే, ఏ నియోజకవర్గంలో ఈ డబ్బు దొరికితే, ఆ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో వీటిని చేర్చితే మేలు. వీటి ఖర్చు వ్యవహారం ప్రజాప్రతినిధులకు కాక, కలెక్టర్ చేతిలో పెడితే కాస్తోకూస్తో ప్రయోజనం కూడా కలుగుతుంది. ఎక్కడ దొరికిన డబ్బు అక్కడి అభివృద్ధికే వినియోగమవుతుంది.
దాదాపు 300 కోట్ల రూపాయలు, లక్షా 33 వేల లీటర్ల మద్యం, 30 వేల కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇందులో దాదాపు సగం డబ్బు, మద్యం మన రాష్ట్రంలోనే దొరకడం నిజంగానే సిగ్గు చేటు. ఎప్పుడూ లేనంతగా డబ్బు, నగదు పట్టుబడడం చూస్తుంటే నోట్లతో ఓట్లను కొనడానికి నేతలు ఎంతగా ప్రయత్నిస్తున్నారో అర్థం అయిపోతుంది. ఇంత డబ్బు దొరకడం చూసి అధికారులు నోళ్లు వెళ్లబెడుతున్నారు. అయితే, ఇలా దొరుకుతున్న డబ్బు చాలా కొద్ది మొత్తం మాత్రమే.
బాల్ పడకుండానే వికెట్ పడింది
Categories :
election . jsp . kiran kumar . POLITICS . samaikya
సమైక్యవాదానికి హోల్ అండ్ సోల్ లీడర్ గా సీఎంగా ఉన్న సమయంలో బిల్డప్ ఇచ్చుకున్న కిరణ్ కు వాస్తవ పరిస్థితి ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నట్లుంది. సీఎం కుర్చీలో ఉన్నంత కాలం తాను ఏదికావాలంటే అది చేసుకున్న ఆయన చుట్టూ లీడర్లు వందిమాగధుల్లా తెగ తిరిగారు. ఆయనపై ఈగ వాలినా కత్తితో నరికేస్తాం అన్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. ఇక్కడే కిరణ్ పప్పులో కాలేశారు. వాపును చూసి బలుపు అనుకున్నారు. తాను పార్టీ పెడితే, అన్ని పార్టీలు ఖాళీ అవడం ఖాయమని, అందరూ తనవెంటే ఉంటారన్న అతివిశ్వాసాన్ని తన గుండెల్లో నింపేసుకున్నారాయన. పైగా, కాంగ్రెస్ పార్టీకి అతీతంగా ప్రజల్లో తనకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా వచ్చేసిందనుకున్నారు. అయితే, అది సీఎం కుర్చీలో కూర్చోవడం వల్లే వచ్చిందని, అందులో నుంచి దిగగానే అది మాయమైపోతుందన్న సంగతిని ఆయన గుర్తించలేకపోయారు. సీన్ కట్ చేస్తే, పదవికి రాజీనామా చేయడం, కొన్నాళ్లు ఖాళీగా ఉండడం, తీరిగ్గా పార్టీ అనౌన్స్ చేయడం, ఇలా ప్రతీ దానిలోనూ ఆయన వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
కిరణ్ పార్టీ పెట్టి ఇన్నాళ్లైనా ఇంతవరకూ పెద్ద లీడర్లెవరూ ఆయన వెంట లేరు. కాంగ్రెస్ బహిష్కరించిన ఎంపీలు తప్ప, మరెవరూ ఆయనవైపు చూడలేదు. మీరు పార్టీ పెట్టడం మీ వెంటే ఉంటామన్న రాయపాటి, శైలజానాథ్, కొండ్రు మురళి, పితాని లాంటి వాళ్లు.. ఆయనకు హ్యాండిచ్చేశారు. చెప్పాలంటే, ఇప్పుడు కిరణ్ ఒంటరి. సమైక్యవాదాన్నే నమ్ముకున్న ఆయన కనీసం సీమాంధ్రలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. దీన్ని అవమానంగా భావించారో ఏమో గానీ, నామినేషన్ల చివరి రోజు సడన్ గా అందరికీ ఝలక్ ఇచ్చారు కిరణ్. పీలేరు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేస్తానని అందరికీ సమాచారం ఇచ్చిన ఆయన, చివరకు తన తమ్ముడు కిశోర్ కుమార్‌తో నామినేషన్ వేయించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన తప్పుకోవడంతో జేఎస్పీ నేతలంతా విస్తుపోయారు. యుద్ధంలోకి దిగకుండానే ఓటమిని అంగీకరించారంటూ చెవులు కొరుక్కుంటున్నారు. నాయకుడే పోటీ నుంచి తప్పుకుంటే ఇక తమ పరిస్థితి ఏమిటంటున్నారు అక్కడక్కడా పోటీ చేస్తున్న జేఎస్పీ నేతలు.
తమ్ముడికి గుణపాఠం చెప్పమన్న ప్రియాంక
Categories :
congress . election . POLITICS . priyanka . rahul gandhi . varun gandhi
ఆ నిజం ఒప్పేసుకున్న మోడీ
Categories :
bjp . election . JASHODABEN . modi . MODI WIFE . NOMINATION . POLITICS
మోడీ గుజరాత్ సీఎం అయినప్పటి నుంచీ ఆయన పెళ్లి వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. జశోదాబెన్ తానే మోడీ భార్యనంటూ మీడియా ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటోంది. దీన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ సహా ఇతర ప్రతిపక్షపార్టీలు ఎప్పటికప్పుడు మోడీ టార్గెట్ చేసుకోవడానికి వాడుకున్నాయి. అయితే, ప్రతీ సారి తాను బ్రహ్మచారినే అంటూ వాటిని ఖండిస్తూవచ్చాడు గుజరాత్ సీఎం. అంతేకాదు, 2001, 2002, 2007, 2012 ఎన్నికల్లో సమర్పించిన నామినేషన్ పత్రాల్లో భార్య పేరును రాయలేదు. ఈ సారి ఏకంగా ప్రధాని పదవికే పోటీ పడుతున్న సమయంలో మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించడం సంచలనం కలిగిస్తోంది. తనపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టడానికే మోడీ ఇలా చేసి ఉంటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే, ఇది కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు మంచి ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది. అటు, ఈ అంశంతో మహిళల్లోనూ మోడీ ఇమేజ్ పలచన పడొచ్చన్న ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
మోడీకి 17 ఏళ్ల వయస్సులోనే జశోదా బెన్ తో వివాహం జరిగింది. కానీ వారి కాపురం మాత్రం ముందుకు సాగలేదు. వివాహం అనంతరం ఆరెస్సెస్ ప్రచారక్ గా మారిన మోడీ, జశోదాను మళ్లీ కలవలేదు. అటు మోడీ.. ఇటు జశోదా ఇద్దరూ మళ్లీ వివాహం చేసుకోలేదు. ఇప్పుడు జశోదా తన భార్యేనని మోడీ అంగీకరించడంతో మళ్లీ ఆమె వార్తల్లో వ్యక్తయ్యింది. అయితే, ఆమెను ఇప్పటికైనా మోడీ తన ఇంటికి తీసుకెళ్తాడా లేక.. ఇంతకు ముందులానే వ్యవహరిస్తాడా అన్నది చర్చనీయాంశమయ్యింది..
కొత్త పార్టీ పెట్టిన కిరణ్
Categories :
congress . election . kiran kumar . new party . POLITICS
తొమ్మిది దశల్లో పోలింగ్
Categories :
breaking news . election . news . POLITICS . polling dates . seemandhra . telangana
ఇవేమి రిజర్వేషన్లు బాసూ..!
Categories :
election . panchayat election . POLITICS . reservations . state . TOP
అదలా ఉంచితే, పంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలు చేస్తున్న రిజర్వేషన్ల ప్రకియ నవ్వు తెప్పించేలానే ఉంది. ఒకే ఒక్క ఎస్సీ కుటుంబం ఉన్న గ్రామంలోనూ సర్పంచ్ పదవి ఎస్సీకే రిజర్వ్ అయ్యింది. గుంటూరు జిల్లాలో ఒకే ఒక్క మనిషి (బిచ్చగత్తె అని వార్తల్లో వచ్చింది) ఉన్న చోట కూడా ఇదే సీన్. వాస్తవానికి ఎస్సీలు ఎక్కువగా ఉన్న చోట్ల మాత్రం అక్కడి సర్పంచ్ పదవులు అగ్రకులాలకే దక్కాయి. ఒకే ఒక్క మహిళో, ఒకే ఒక్క కుటుంబమో ఉన్న చోట సర్పంచ్ పదవిని రిజర్వ్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా.. దానివల్ల రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరుతుందా.. పైగా, ఐఏఎస్ లు , గ్రూప్ వన్ అధికారుల్లాంటి వాళ్లు దీనికోసం ఎంతో కసరత్తు చేసి, ఎన్నో లెక్కలు వేసి, ఎంతో సమయం తీసుకుని మరీ రిజర్వేషన్ల లిస్ట్ తయారు చేశారు. దాన్ని ప్రభుత్వ పెద్దలు చూసి ఆమోదించారు. అయినా, ఇలాంటి జాబితా తయారు కావడం మన వాళ్ల పరిపాలన దక్షతకు నిదర్శనం.
కేసీఆర్ ఫ్యామిలీ ప్లానింగ్
తెలంగాణ వాదంతో ఉద్యమకారులకు తాను చెప్పిందే వేదంగా మార్చుకున్న కేసీఆర్ కు అంతా బాగానే ఉంటున్నా, ఎన్నికల సమయంలోనే పరిస్థితి తారుమారు అవుతోంది. ప్రధాన ఎన్నికల్లో ఆశించినంతగా ఫలితాలను రాబట్టుకోలేకపోతోంది టీఆర్ఎస్. ఎన్నికల వరకూ కాంగ్రెస్ తెలంగాణ విషయాన్ని తేల్చేలా కనిపించకపోవడంతో ..టీఆర్ఎస్ కు వచ్చే సీట్ల ఆధారంగానే రాష్ట్ర భవిష్యత్ ఉండే అవకాశాలున్నాయి. ఈసారి ఉద్యమం తారాస్థాయిలో సాగిన నేపథ్యంలో, కేంద్రం మాట మార్చిన నేపథ్యంలో టీఆర్ ఎస్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నేతలు పైకైతే చెబుతున్నారు గానీ, గతాన్ని తలచుకొని లోలోన ఆందోళనకూ గురవుతున్నారు.
పైగా, ఈ ఎన్నికలు చాలా కీలకం కాబట్టి, తన ఫ్యామిలీ మొత్తాన్ని పాలిటిక్స్ లో సెట్ రైట్ చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే కుమారుడు కేటీఆర్ ను ఎమ్మెల్యేను చేసుకున్న ఆయన, ఈ సారి కొడుకును, కూతుర్ని ఎంపీలుగా చూడాలనుకుంటున్నారు. దానికి ఇప్పటి నుంచే వేదిక సిద్ధం చేస్తున్నారు.
అందుకే ఈసారి అసెంబ్లీ సీట్ల సంగతి ఎలా ఉన్నా, పార్లమెంట్ సీట్లను మాత్రం కచ్చితంగా ఎక్కువ మొత్తంలో దక్కించుకోవాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ ప్రాంతాన్ని మారుస్తున్న కేసీఆర్, ఈ సారి కూడా మహబూబ్ నగర్ నుంచి మరో సీటుకు వలసవెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపైనే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. నల్గొండ నుంచి గానీ, జహీరాబాద్ నుంచి గానీ పోటీ చేయడానికి కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డిని పోటీకి దించే సూచనలున్నాయి. అటు మెదక్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయశాంతిని భువనగిరికి పంపొచ్చు. కరీంనగర్ నుంచి కేటీఆర్, నిజామాబాద్ నుంచి కవిత, వరంగల్ నుంచి విజయరామారావులను పోటీ చేయించే అవకాశాలున్నాయి. పొలిటికల్ జేఏసీలో కీలకపాత్ర పోషిస్తున్న టీఆర్ ఎస్ సానుభూతి పరులకు కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ నుంచి కొంతమంది తెలంగాణ ఎంపీలు టీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశాలు ఉండడంతో, వారికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలనే కేటాయింటే అవకాశాలున్నాయి.




