కాంగ్రెస్ నేతల బహిష్కరణ, టీఆర్‌ఎస్, టీజేఏసీ బంద్‌కు పిలుపునిచ్చినా, మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం రచ్చబండ నిర్వహించాలని డిసైడ్ అయ్యి, అన్ని ఏర్పాట్లు చేసుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఢిల్లీలో విభజన ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో, తెలంగాణ నుంచే రచ్చబండకు శ్రీకారం చుట్టడం ద్వారా, సమైక్యవాదాన్ని బలంగా వినిపించాలని భావించారు సీఎం కిరణ్. ఈ విషయంలో తన వెన్నంటి నడిచే సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి సహకరించడంతో సంగారెడ్డి రచ్చబండకు ఏర్పాట్లు శరవేగంగా సాగాయి. అసలే కిరణ్ పేరెత్తితే, కస్సుమంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఈ సభను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరూ సభకు హాజరుకాకూడదంటూ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడే ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి అంతకుముందెప్పుడూ లేదు. పైగా, టీఆర్‌ఎస్, టీజేఏసీలు కూడా బంద్‌కు పిలుపునివ్వడంతో సంగారెడ్డిలో ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది. అయినా సరే, సభను నిర్వహిస్తానంటూ జగ్గారెడ్డి చెప్పడం కాకపుట్టించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో సమావేశమైన సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డిలు సీఎంతో రచ్చబండపై చర్చ జరిపారు. సీఎం పర్యటిస్తే, మరింత వ్యతిరేకత వస్తుందని, తాము కూడా హాజరుకాలేని పరిస్థితి ఉందంటూ వివరించారు. దీంతో, ప్రస్తుతానికి సంగారెడ్డి సభను వాయిదా వేసుకోవాలని కిరణ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read more...
jaggareddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
jaggareddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, నవంబర్ 2013, మంగళవారం
కిరణ్ వెనకడుగుకు కారణమేమిటో..?
Categories :
cm kiran . congress . jaggareddy . POLITICS . rachabanda . sangareddy . telangana . TOP . trs
5, నవంబర్ 2011, శనివారం
సామాన్యుడి చెంపపగలగొట్టిన ఎమ్మెల్యే
Categories :
jaggareddy . news . slap . TOP
ఈ ఫోటోలో ఉన్న దృశ్యం నిజంగానే జరిగింది. కొడుతున్న వ్యక్తి.. మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి. దెబ్బలు తింటున్న వ్యక్తి సదాశివపేటకు చెందిన చాకలి బాలరాజు. అక్కడ జరిగిన రచ్చబండలో ఎమ్మెల్యే ఇలా చేయి పారేసుకున్నారు.
సదాశివపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ... స్థానికుల సమస్యలు తెలుసుకుంటుండగా.. పెద్ద మూటతో అక్కడికి బాలరాజు వచ్చాడు. అయితే పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు అతన్ని అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది. ఈ లోపు అతన్ని తన దగ్గరకు పంపించాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించాడు. ఎమ్మెల్యే దగ్గరకు వచ్చిన అతను తాను తీసుకువచ్చిన బియ్యం చూపించాడు. ఈ బియ్యం బాగోలేవన్నాడు.. రూపాయి కిలో బియ్యం పథకం కింద వీటిని ఇస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చాడు. ఎలా తినాలి అని ప్రశ్నించాడు. దీంతో ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఓ మహిళకు ఆ బియ్యం చూపించాడు.. ఆమె బాగానే ఉన్నాయని చెప్పడంతో, బాలరాజు చెంపను ఎమ్మెల్యే పగలగొట్టాడు. అందరి ముందే విచక్షణను కోల్పోయారు ఎమ్మెల్యే.. సామాన్యుడిపై విరుచుకుపడ్డారు.. ఎమ్మెల్యేకు చెప్పుకుంటేనైనా మంచి బియ్యం అందుతాయని ఆశగా వెళ్లిన ఆ సామాన్యుడికి.. చివరకు చెంపదెబ్బ దక్కింది. జనం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే.. ఇలా ప్రవర్తించడమే వివాదాస్పదమవుతోంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)


