టీడీపీ కార్యకర్తలకు ఇది ఎమర్జెన్సీ కాలమని, ఆస్తులు అమ్మైనా పార్టీని గెలిపించుకోవాలని అన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసిన ఆయన, భీమవరం, ఉండి నియోజకవర్గాల సమావేశం నిర్వహించారు. నిద్రలో కూడా పార్టీ గురించే ఆలోచించాలని, పార్టీకి పూర్వ వైభవం తేవాలని అన్నారు. అంతా బాగానే ఉన్నా, కార్యకర్తలను ఆస్తులు అమ్ముకోమని బాబు కోరడమే విచిత్రంగా ఉంది. దేశంలోనే ఆస్తులను ప్రతీఏటా ప్రకటిస్తున్న రాజకీయ నేతల్లో తానే మొదటివాడినని ఘనంగా చెప్పుకునే బాబుగారు, పార్టీ కోసం ఆ ఆస్తులను అమ్ముకుంటారా..? మీ వంది మాగధుల ఆస్తులు అమ్ముతారా..? లేక జనం ఆస్తులు అమ్మించి, అధికారాన్ని సంపాదించుకుని అనుభవిస్తారా..?
padayatra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
padayatra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
14, మార్చి 2013, గురువారం
బాబు గారూ మీ ఆస్తులు అమ్ముకుంటారా మరి!
Categories :
chandrababu . padayatra . POLITICS . tdp . TOP
టీడీపీ కార్యకర్తలకు ఇది ఎమర్జెన్సీ కాలమని, ఆస్తులు అమ్మైనా పార్టీని గెలిపించుకోవాలని అన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసిన ఆయన, భీమవరం, ఉండి నియోజకవర్గాల సమావేశం నిర్వహించారు. నిద్రలో కూడా పార్టీ గురించే ఆలోచించాలని, పార్టీకి పూర్వ వైభవం తేవాలని అన్నారు. అంతా బాగానే ఉన్నా, కార్యకర్తలను ఆస్తులు అమ్ముకోమని బాబు కోరడమే విచిత్రంగా ఉంది. దేశంలోనే ఆస్తులను ప్రతీఏటా ప్రకటిస్తున్న రాజకీయ నేతల్లో తానే మొదటివాడినని ఘనంగా చెప్పుకునే బాబుగారు, పార్టీ కోసం ఆ ఆస్తులను అమ్ముకుంటారా..? మీ వంది మాగధుల ఆస్తులు అమ్ముతారా..? లేక జనం ఆస్తులు అమ్మించి, అధికారాన్ని సంపాదించుకుని అనుభవిస్తారా..?26, జనవరి 2013, శనివారం
బాబు పాదయాత్ర ఆగిపోతుందా..?
Categories :
chandrababu . krishna district . padayatra . POLITICS . tdp . TOP
టీడీపీ అధినేత చంద్రబాబు, తన వస్తున్నా మీకోసం పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బాబు ప్లాన్ చేసుకున్న ప్రకారం జనవరి 26వరకూ పాదయాత్ర సాగింది. అయితే.. అనారోగ్యంతో పాటు, మధ్యలో మూడు రోజుల విరామం కారణంగా, విజయవాడకు చేరుకోవాల్సిన పాదయాత్ర, కృష్ణాజిల్లాలోని పరిటాల వరకే వచ్చింది. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి మార్చి వరకూ కొనసాగించాలని ఖమ్మం పర్యటనలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్నారు. కానీ, కాలినొప్పులతో చంద్రబాబు తీవ్రంగా బాధపడుతున్ననేపథ్యంలో ఆయన్ను పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇవ్వాలని కుటుంబసభ్యులు, పార్టీ నేతలు కోరుతున్నారు. పరిటాలలో 117 అడుగుల స్థూపాన్నిఆవిష్కరించిన అనంతరం జరిగే బహిరంగ సభలో పాదయాత్ర కొనసాగింపు పై ఆయన ప్రకటన చేయనున్నారు.
Read more...
25, జనవరి 2013, శుక్రవారం
బాబు గతేమిటి..?
తెలంగాణపై ఎప్పటిలానే కాంగ్రెస్ పార్టీ తప్పించుకొంటోంది. నెల రోజులంటూ తమకు తామే విధించిన గడువును కూడా హేళన చేస్తూ, మాటమార్చేసింది. ఇప్పుడు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందో లేదో తెలియడం లేదు. వీలైనంతవరకూ వచ్చే ఎన్నికలదాకా ఇదే సందిగ్ధతను కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా రాష్ట్రంలో ఉద్రిక్తతలు తగ్గించడానికే, కాంగ్రెస్ హైకమాండ్ వరస భేటీలను నిర్వహిస్తుందే తప్ప, నిర్ణయం తీసుకోవడానికి కాదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పైగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే నంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదంటున్నారు.
తెలంగాణలో పాదయాత్ర చేస్తూ, అఖిలపక్షానికి లేఖ పంపించిన చంద్రబాబు, తెలంగాణ ఏర్పాటుకు తనకు అభ్యంతరం లేదనే చెప్పారు. అఖిలపక్షంలో అన్ని పార్టీలు తెలంగాణకే మద్దతు ఇస్తాయి కాబట్టి, కాంగ్రెస్ పార్టీనే ఇరుకున పడుతుందని ఆయన భావించిఉండొచ్చు. తొలిదశలో అదే జరిగింది. కానీ, తమదైన శైలిలో రాజకీయాలను రక్తి కట్టించే కాంగ్రెస్ నేతలు సీన్ మొత్తాన్ని మార్చేశారు. ఇటు చంద్రబాబు పాదయాత్ర కోస్తా జిల్లాల్లోకి అడుగుపెట్టింది. అటు విభజన విషయంపై మరింత ఉత్కంఠ పెరిగింది. కాంగ్రెస్ నేతలంతా సమైక్య ఉద్యమమంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేసి, జనంలో పేరు తెచ్చుకుంటుంటే, అధినేత మాటకు కట్టుబడ్డ తెలుగు తమ్ముళ్లు మాత్రం మౌనంగానే అంతా చూడాల్సి వస్తోంది. రాష్ట్రాన్ని చంద్రబాబు విభజించడానికి ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అటు రాష్ట్ర విభజన జరగకపోతే తెలంగాణలో టీడీపీకి మైలేజీ రావడం కష్టమే, ఉద్యమాన్ని సాకుగా చేసుకుని టీఆర్ ఎస్ ఎక్కువ స్థానాలను దక్కించుకోవచ్చు. ఇటు సీమాంధ్రలోనూ కాంగ్రెస్ కే మైలేజీ దక్కొచ్చు. సెంటిమెంట్ తో జగన్ పార్టీ కూడా భారీగానే స్థానాలు దక్కించుకోవచ్చు. అటు ఇటూ చూస్తే.. అడకత్తెరలో పోకచక్కలా ఇరుక్కుపోయేది మాత్రం తెలుగుదేశం పార్టీనే అనేవాదన వినిపిస్తోంది. ఇప్పటికే అధికారంలోకి రావడానికి అష్టకష్టాలు పడుతున్న చంద్రబాబునాయుడు, ఈ విపత్కర పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో మరి..?
Read more...
4, జనవరి 2013, శుక్రవారం
ఆయన సాధించారు.. ఈయన సాధిస్తారా..?
Categories :
chandrababu . padayatra . POLITICS . TOP . ysr
పాదయాత్ర పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వరసగా రెండు సార్లు ప్రతిపక్షంలో ఉండి... జావగారిన కాంగ్రెస్‌కు మళ్లీ జవసత్వాలు అందించింది వైఎస్ పాదయాత్రే. మండుటెండలను సైతం లెక్కచేయక జనంలోకి నడుచుకుంటూ వెళ్లిన రాజశేఖర్‌రెడ్డిని జనం అందంలం ఎక్కించారు. కాంగ్రెస్‌కు అధికారం అందించారు.
తెలుగుదేశం పార్టీది కూడా అదే పరిస్థితి. వైఎస్ దెబ్బకు.. టీడీపీ రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న చంద్రబాబు.. వైఎస్ నే అనుసరించారు. వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర మొదలుపెట్టారు.
అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ పాదయాత్ర చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌కు, వైఎస్సార్‌సీపీకి, టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ పాదయాత్ర ఏప్రిల్ 9, 2003న చేవెళ్లలో ప్రారంభమై... 58 రోజుల పాటు సాగి... జూన్ 14న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. 1468.8 కిలో మీటర్ల మేర వైఎస్ నడిచి రికార్డు సృష్టించారు. అక్టోబర్ 2న హిందూపురం నుంచి మొదలైన చంద్రబాబు పాదయాత్ర.. ఇప్పటివరకూ ఎనిమిది జిల్లాల్లో సాగింది. 94 రోజుల పాటు నడిచిన టీడీపీ అధినేత.. 1500 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. జనవరి 26కే తొలిదశ పాదయాత్రను పూర్తిచేయాలనుకున్నా... మార్చి 29వరకూ వస్తున్నా మీకోసంను బాబు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
53 ఏళ్ల వయస్సులో 44 డిగ్రీల మండే ఎండల్లో పాదయాత్ర చేసి జనం గుండెల్లో నిలిచిపోయారు వైఎస్సార్. ఎంతమంది వారించినా... వద్దని ఎంతగా చెప్పినా.. మొండిగానే ముందడుగు వేసిన వైఎస్.. జనానికి ఎన్నో హామీలు ఇచ్చారు. కరెంట్ సమస్యలతో సతమతమవుతున్న రైతన్నలకు.. ఉచితకరెంట్ హామీని వాగ్ధానం చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం దక్కేలా చేసింది. 63 ఏళ్ల వయస్సులో పాదయాత్ర మొదలుపెట్టిన చంద్రబాబు కూడా భారీగానే హామీలు గుప్పిస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. గిరిజన డిక్లరేషన్‌ను ప్రకటించారు. పాదయాత్రలో ఉండగానే తెలంగాణపై అఖిలపక్షానికి లేఖ పంపించారు. వైఎస్ తరహాలో.. ఈ పాదయాత్ర తెలుగుదేశానికి మళ్లీ అధికారాన్ని అందిస్తుందని భావిస్తున్నారు చంద్రబాబు.
అప్పుడు వైఎస్‌కు.. ఇప్పుడు చంద్రబాబుకూ.. పాదయాత్రలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అయినా.. ఇద్దరూ మధ్యలో యాత్రను విరమించుకోలేదు. తూర్పుగోదావరి జిల్లాలోనే విశ్రాంతి తీసుకుని పాదయాత్రను వైఎస్ మళ్లీ కొనసాగించారు. చంద్రబాబు కాలి వేలుకి గాయమైనా.. లెక్కచేయకుండా నడుస్తూనే ఉన్నారు. అయితే.. నరాలపై ఒత్తిడి పెరుగుతుండడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ఇప్పటికే వైఎస్ రికార్డును అధిగమించిన చంద్రబాబు.. తొలివిడత యాత్ర పూర్తయ్యే సరికి.. ఎన్ని కిలోమీటర్లు నడిచినా.. అది సరికొత్త రికార్డుగానే మిగిలిపోనుంది. అయితే.. వైఎస్‌లా ఈ పాదయాత్ర చంద్రబాబుకు అధికారాన్ని మళ్లీ అందించగలుగుతుందా.. అన్నది ఎన్నికలు అయితేగానీ తెలిసే అవకాశాలు లేవు.. తెలుగు తమ్ముళ్లు మాత్రం.. వస్తున్నా మీకోసం.. తమకు అధికారాన్ని తెచ్చిపెడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read more...
29, నవంబర్ 2012, గురువారం
బాబు మాటలు నిజమేనా..?
Categories :
chandrababu . padayatra . POLITICS . tdp . TOP
నిజం నిష్టూరంగా ఉండొచ్చు. చాలామందికి ఇబ్బంది కలిగించవచ్చు. కాని నిజం నిజమే. రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు.. తన హయాంలో అందరినీ నీళ్లిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ మద్యం ఇస్తోందని నిజామాబాద్ జిల్లా పాదయాత్రలో అన్నారు. నాదీ నిజామాబాద్ జిల్లానే. మా ఊరి పక్కగానే నిజాంసాగర్ ప్రధాన కాలువ వెలుతుంది. ఆ కాలువ ఆధారం చేసుకునే, వేలాదిమంది రైతులు వరి, చెరుకు, మొక్కజొన్న, ఇతర పంటలు సాగుచేసుకుంటున్నారు. నిజామాబాద్ పట్టణానికి తాగునీరు అందించేది కూడా ఈ కాలువే. బాబుగారు వచ్చాక, నిజాంసాగర్ కాలువ ఎండిపోయింది. ఆయన పాలనలో చివరిరెండు మూడు ఏళ్లలో ఒక్కసారైనా కాలువ విడుదల చేసిన దాఖలాలు లేవు. నిజాం సాగర్ లో పేరుకున్న పూడికను తీయడానికి ప్రయత్నించిన సందర్భాలూ లేవు. గ్రామాలకు గ్రామాలు కరవుతో అల్లాడిపోయాయి. బతుకుదెరువు కోసం జనం వలసబాటలు పట్టారు. నిజాం షుగర్స్ ప్రైవేటీ కరణ పుణ్యమా అని చెరుకు సాగు గణనీయంగా తగ్గిపోయింది. అంతెందుకు, ఆయన హయాంలోనే గ్రామాల్లోకి మద్య ప్రవాహం మొదలయ్యింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు అది పరవళ్లు తొక్కుతూ వరదలా గ్రామాలను ముంచెత్తుతుందన్నది నిజం. కానీ, గ్రామాల్లో బెల్టుషాపులు మొదలైంది మాత్రం బాబుగారి పాలనలోనే. మహానుభావుడు ఎన్టీఆర్ విధించిన సంపూర్ణ మద్యపాననిషేధాన్ని ఎత్తివేసింది కూడా చంద్రబాబే అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మద్యాన్నే ప్రధాన ఆధారంగా చేసుకుని పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు తిట్టడం ఏమాత్రం తప్పుకాదు. కానీ, ఆయన చేసిందేమిటన్నది కూడా గుర్తు పెట్టుకుంటే మంచిది.
5, అక్టోబర్ 2012, శుక్రవారం
తిండి విషయంలో బాబు జాగ్రత్తలు
Categories :
babu food . chandrababu . padayatra . tdp . TOP
తన రాజకీయ జీవితంలో సుదీర్ఘ ప్రజా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం కప్పు ఓట్లు, రెండు ముక్కల శాండ్ విచ్, రెండు గుడ్ల తెల్ల సొనతో వేసిన ఆమ్లెట్ తీసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు సోయా పాలు తాగుతున్నారు. మధ్యాహ్నం భోజనంలో అరకప్పు రాగిసంకటి, కప్పు బీరకాయ కూర, కప్పు పాలక్ పన్నీర్, కప్పు పెరుగు తింటున్నారు. రాత్రికి గోధుమ రవ్వ ఉప్మా, వేరుశెనగ చట్నీ, పచ్చసొన లేకుండా ఆమ్లెట్, ఓ గ్లాసు పాలు, పండ్లు తీసుకుంటున్నారు. నడుస్తున్న సమయంలో కీరారసం గానీ, మజ్జిగా కానీ తాగుతున్నారు. ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో నాలుగు రోజులుగా నడుస్తున్నా.. బరువు ఏమాత్రం తగ్గలేదు. ఇదే పద్దతిని కంటిన్యూ చేస్తే, జనవరి 26 వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేయొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, షూలు వాడుతూ నడవడం వల్ల కాలి బొటనవేలికి బొబ్బలు వచ్చాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది.
దండోరా వాయించిన బాబు
ప్రజలతో కలిసి సాగుతున్న చంద్రబాబు, వారిని ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం నాడు... పొలం దున్నడంతో పాటు, దండోరా వాయించారు..
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)




