రుణమాఫీ అన్నంవండి పెట్టడం లాంటిదేనట
Categories :
ANDHRA PRADESH . chandrababu . loan waiver . nannapaneni . seemandhra . tdp
మాఫీ మాయమవుతుందా..?
Categories :
ANDHRA PRADESH . chandrababu . loan waiver . new rules . seemandhra . tdp
ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు?
Categories :
ANDHRA PRADESH . chandrababu . news . seemandhra . state formation day . tdp . telangana
రాష్ట్రం విడిపోవడం సీమాంధ్ర ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి జూన్ 2 వారికి సంబంధించినంతవరకూ విద్రోహ దినమే తప్ప అవతరణ దినోత్సవం కాదు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే జూన్ 8ని కూడా అవతరణ దినోత్సవంగా స్వీకరిస్తారా లేదా అన్నదీ అనుమానమే. ఇంతవరకూ జరుపుకుంటూ వచ్చిన నవంబర్ 1 కి ఇకపై ప్రాధాన్యత ఉండనే ఉండదు. ఎందుకంటే, అది ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా అవతరించిన సందర్భం. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ కు సంబంధించిన ఏ ప్రాంతమూ ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదు కాబట్టి, నవంబర్ 1 ఆ అర్హత కోల్పోయింది. పోనీ ఆంధ్ర రాష్ట్రం అవతరించిన అక్టోబర్ 1ని జరుపుకుందామంటే, దానికీ ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే, అక్టోబర్ 1కి ఇప్పటి పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు. దీంతో, కొత్త ప్రభుత్వం రాష్ట్ర దినోత్సవంగా దేన్ని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి పాలన ముగిసి ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి, అందులోనూ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి, జూన్ 8నే చరిత్రలో మిగిలిపోయేలా చేయడానికి ఆ రోజునే అవతరణ దినోత్సవంగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, దానికి జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తోంది.
జగన్ కు నిద్రపట్టదా..?
Categories :
babu . butta renuka . jagan . jumpings . POLITICS . seemandhra . spy reddy . tdp . ysrcp
పార్టీ నేతలు ఎక్కడ జంప్ చేస్తారో అన్న భయంతో ఇడుపులపాయలో నిర్వహించిన సమావేశంలోనే అందరితో ప్రమాణం చేయించారు జగన్. ఎవరం పార్టీ మారమని, వైసీపీతోనే కొనసాగుతామని ప్రతీ ఒక్కరి నోటితోనూ చెప్పించారు. అది జరిగి నాలుగు రోజులైనా కాకుండానే ఒట్టు తీసి గట్టుమీద పెట్టేశారు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక. ఫ్యాన్ స్విచ్ ఆపేసి సైకిల్ ఎక్కేశారు. వీరిపై వేటు తప్పదని వైసీపీ నేతలు చెబుతున్నా, అది ఎప్పటికవుతుందన్నది ఎవరికీ అర్థం కాని విషయమే. ఎందుకంటే, అనర్హత మీద నిర్ణయం తీసుకోవాల్సింది లోక్ సభ స్పీకర్. కానీ, వైసీపీకి వ్యతిరేకమైన బీజేపీ-టీడీపీ కూటమి అధికారంలో ఉండడంతో, వైసీపీ చేసే ఫిర్యాదుపై ఎంతవరకూ చర్యలుంటాయన్నది సందేహమే.
ఇక మిగిలిన నేతలు ఎప్పుడు పార్టీ గోడ దూకేస్తారో అన్న టెన్షన్ జగన్ కు ఉంటూనే ఉంటుంది. ప్రతీ నేతనూ అనుమానిస్తూనే ఉండాలి. ఇక పొరపాటున సీబీఐ కేసులు ముందుకు సాగి, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం ఖాయం. ఈ టెన్షన్లతో సతమతమవుతున్న జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారనే చెప్పాలి.
రెండు రాష్ట్రాల్లోనూ చంద్రోదయం
తెలంగాణలో పోటాపోటీగా ఎన్నికలు జరిగాయంటూ సర్వేలు చెప్పినా, కాంగ్రెస్ నేతలు తమదే విజయం అన్నా.. ప్రజాతీర్పు మాత్రం వన్ సైడ్ గానే వచ్చింది. టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో మెజార్టీని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ ను మాత్రం పాతిక మార్కును దాటనివ్వలేదు. చాలామంది మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా చుక్కలు చూపించారు తెలంగాణ ఓటర్లు..
సీమాంధ్రలో మాత్రం రెండు రకాల తీర్పులొచ్చాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఓటర్లు టీడీపీ పక్షాన నిలిస్తే, దక్షిణ కోస్తా, అనంత మినహా రాయలసీమ మిగిలిన మూడు జిల్లాల ప్రజలు మాత్రం వైసీపీ పక్షాన నిలబడ్డారు. జిల్లాల వారీగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ నడిచింది. ఎక్కడా కాంగ్రెస్ ను ఖాతా తెరవనివ్వలేదు ఆంధ్ర ఓటర్లు.జిల్లాల వారీగా బలాబలాలు
శ్రీకాకుళం (10): టీడీపీ-7, వైసీపీ-3
విజయనగరం (9): టీడీపీ-6, వైసీపీ-3
విశాఖపట్నం (15): టీడీపీ-11, వైసీపీ-3, బీజేపీ-1
తూ.గో. (19): టీడీపీ-12, వైసీపీ-5, బీజేపీ-1, ఇండిపెండెంట్-1
ప.గో. (15): టీడీపీ-14, బీజేపీ-1
కృష్ణా (16): టీడీపీ-10, వైసీపీ-5, బీజేపీ-1
గుంటూరు (17): టీడీపీ-12, వైసీపీ-5
ప్రకాశం (12): వైసీపీ-6, టీడీపీ-5, ఇండిపెండెంట్-1
నెల్లూరు (10): వైసీపీ-7, టీడీపీ-3
చిత్తూరు (14): టీడీపీ-6, వైసీపీ-8
అనంతపురం (14): టీడీపీ-12, వైసీపీ-2
కడప (10): వైసీపీ-9, టీడీపీ-1
కర్నూలు (14): టీడీపీ-3, వైసీపీ-11
ఆళ్లగడ్డలో మాత్రం దివంగత నేత శోభానాగిరెడ్డినే గెలిపించారు అక్కడి ప్రజలు. ఆమె చనిపోయినా, ఆమెకు ఓటేస్తే ఉపఎన్నికలు వస్తాయని తెలిసినా, ఓటు ద్వారా ఆమెకు నివాళులు అర్పించారు ఆళ్లగడ్డ ఓటర్లు.
సీమాంధ్రలో సైకిల్ సవారీ .. హస్తగతమైన తెలంగాణం
ఇక తెలంగాణ విషయానికి వస్తే కారు జోరుకు హస్తం అడ్డుగా నిలిచింది. మున్సిపాలిటీల్లో సింహభాగం కాంగ్రెస్ పార్టీకే దక్కి, ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. 21 మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకోగా, టీడీపీ రెండు, టీఆర్ఎస్ 8 మున్సిపాలిటిల్లో అధికారాన్ని అందుకున్నాయి. అయితే, ఈ సారి ఆశ్చర్యకరంగా, బీఎస్పీ రెండు మున్సిపాలిటీలను దక్కించుకోవడం విశేషం. ఎంఐఎం భైంసా మున్సిపాలిటీలో జయకేతనం ఎగరవేసింది. తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. నిజామాబాద్, రామగుండంలో హస్తం హవానే నడిచింది.
భారీ ఓటింగ్‌తో ఛాన్స్ దక్కేదెవరికి?
Categories :
chandrababu . election . jagan . POLITICS . POLLING . seemandhra . tdp . voters . ysrcp
సీమాంధ్రలో శివమెత్తిన ఓటర్లు
తెలంగాణ ముగిసింది.. ఆంధ్ర మిగిలింది
తెలంగాణలో ప్రచారానికి తెరపడుతుండడంతో సీమాంధ్రపైకి దృష్టి మళ్లించాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే చంద్రబాబు కొన్ని జిల్లాల్లో ప్రచారం పూర్తి చేయగా, బాలయ్య కూడా విరామం లేకుండా ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కు స్టార్ క్యాంపైనర్ గా చిరంజీవి తన పని మొదలుపెట్టారు. అన్నింటికీ మోడీ మంత్రాన్నే వల్లె వేస్తున్న బీజేపీ, సీమాంధ్రలోనూ ఆయన్నే ప్రచారానికి పిలుస్తోంది. ఏప్రిల్ 30, మే1 తేదీల్లో ఆయన సీమాంధ్రలో పలు సభల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 30న తిరుపతిలో, మే 1న విశాఖలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఇక మే 2 సోనియా విశాఖ బహిరంగ సభలో పాల్గొంటారు. మోడీ సభ జరిగిన తర్వాతి రోజే సోనియా సభ జరుగుతుండడంతో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. అటు రాహుల్‌తో కూడా వీలైనంతగా సభలను నిర్వహించాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
కమలానికి సైకిల్ రాం..రాం.
Categories :
alliance . bjp . chandrababu . modi . nda . POLITICS . seemandhra . tdp
అయితే, పురంధేశ్వరికి బీజేపీ టికెట్ ఇవ్వడం, రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వకపోవడం వల్లే పొత్తును రద్దు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పురంధేశ్వరిని పూర్తిగా పక్కన పెట్టడానికి, నర్సాపురంలో రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వడానికి కమలం పార్టీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆరెస్సెస్ నుంచి వత్తిడి పెరగడంతో గోకరాజు గంగరాజును నర్సాపురం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. దీంతో అవాక్కైన రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో చర్చలు జరిపారు. తాజాగా ఆయన టీడీపీ తరపునే నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పొత్తు రద్దైనప్పటికీ, తెలంగాణలో మాత్రం పొత్తు కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు, మోడీ, చంద్రబాబు సంయుక్త సభలు లేకుండా ఉండేలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
తొమ్మిది దశల్లో పోలింగ్
Categories :
breaking news . election . news . POLITICS . polling dates . seemandhra . telangana
జూన్ 2న ఆవిర్భవించనున్న తెలంగాణ
Categories :
bifurcation . POLITICS . seemandhra . telangana . telangana formation day
సీఎం కిరణ్ రాజీనామా
Categories :
bifurcation . cm kiran . kiran kumar reddy . POLITICS . resign . seemandhra . TOP
సీమ, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ
Categories :
bifurcation . cabinet . POLITICS . seemandhra . tbill . telangana
అసెంబ్లీలో గెలిచిందెవరు..?
Categories :
assembly . bifurcation . parliament . POLITICS . seemandhra . t bill . telangana
చివరిరోజు ఏమవుతుందో అన్న టెన్షన్ లో అంతా ఉండగానే, ప్రక్రియను ముగించేశారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. విభజన బిల్లుకు ఓ లక్ష్యం, ఓ ఆశయం లేదంటూ, అసలది బిల్లే కాదంటూ.. దాన్ని తిరస్కరించి పంపాల్సిందేనంటూ సీఎం కిరణ్ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి సభ సజావుగా సాగడం లేదు. కేవలం వాయిదాలకే పరిమితం అవుతోంది. బీఏసీల మీటింగులు ఎన్ని నిర్వహించినా, పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. సీఎం నోటీస్ తిరస్కరించాల్సిందేనంటూ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించాల్సిందేనంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు శాసనసభలో ఆందోళనలకు దిగడంతో చర్చలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇక చివరి రోజు కూడా ఇవే సంఘటనలు సభలో పునరావృతమయ్యాయి. రెండుసార్లు సభ వాయిదా వేసి, మూడోసారి సమావేశ పరిచిన స్పీకర్.. అకస్మాత్తుగా చర్చా వివరాలను ప్రకటించి, ఇంతవరకూ రికార్డైన 86 మంది ప్రసంగాలలో పాటు ఎమ్మెల్యేలు ఇచ్చిన లిఖితపూర్వక సమాచారాన్ని, బిల్లుకు సూచించిన 9072 సవరణలను కలిపి రాష్ట్రపతికి పంపిస్తానని సభలో ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ముందు ఓటింగ్ కు ఉంచారు. మూజువాణి ఓటింగ్ ను నిర్వహించి.. తీర్మానం నెగ్గిందని చెప్పి సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇక్కడే అసలు గొడవ మొదలయ్యింది.
రాష్ట్రపతి ఇచ్చిన గడువు ప్రకారం చర్చను ముగించేశారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. సభ్యుల అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపించనున్నారు. దీంతోపాటే, సభ బిల్లును తిరస్కరించాలని తీర్మానించిందంటూ రాష్ట్రపతికి పంపించనున్నారు. దీంతో బిల్లుపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. అయితే, కేవలం అభిప్రాయాల కోసమే బిల్లును శాసనసభకు పంపించారు కాబట్టి, వాటినే రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. అయితే, బిల్లును తిరస్కరిస్తూ సభ తీర్మానం చేసింది కాబట్టి, పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టకూడదని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూజువాణి ఓటంటే ఏకగ్రీవ నిర్ణయంతో సమానం కాబట్టి, సభంతా సమైక్యవాదానికే కట్టుబడి ఉందని గుర్తించాలన్నారు మంత్రి ఆనం.
సీఎం తీర్మానాన్ని సభలో నెగ్గించడం దుర్మార్గమంటూనే, చర్చ ముగిసినందుకు మాత్రం హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ నేతలు. తమకు కావాల్సింది అసెంబ్లీలో ప్రక్రియ ముగియడమేనంటున్నారు. ఢిల్లీ దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్లూ దీనికి తగ్గట్లే ఉన్నాయి. సీఎం తీర్మానంపై మాత్రమే సభ ఓటింగ్ నిర్వహించిందని, బిల్లుపై కాదంటూ ఆయన ప్రకటించారు. పైగా, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి సంక్రమించిన అధికారాలకు ఈ తీర్మానం ఏమాత్రం విఘాతం కలిగించదన్నారాయన. ఫిబ్రవరి 4న జీవోఎం సమావేశంలో అసెంబ్లీ పంపించిన అభిప్రాయాలపై చర్చించే అవకాశం ఉంది. సభ సూచించిన సవరణల్లో సహేతుకమైన వాటిని బిల్లులో పొందుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని భావిస్తున్న యూపీఏ సర్కార్కు బీజేపీ మద్దతు తప్పని సరి. అందుకే, బీజేపీ సూచిస్తున్న పోలవరానికి జాతీయ హోదా, పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చడం, సీమాంధ్ర రాజధానికి నిర్ధిష్టమైన నిధుల కేటాయింపును ప్రకటించే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమైక్య తీర్మానం చేయగలిగిన సీమాంధ్ర నేతలు, ఇప్పుడు దృష్టంతా ఢిల్లీపై పెట్టారు. పార్లమెంట్లోనూ బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
యూటీ మూగబోయే.. ప్రత్యేక రాష్ట్ర పాట మొదలయ్యే
Categories :
bifurcation . hyderabad . jd sheelam . kavuri . pallam raju . POLITICS . seemandhra . shinde . special state . telangana . TOP
సీమాంధ్రకు రాజధాని అదేనా..?
Categories :
bifurcation . capital . GOM . POLITICS . seemandhra . TOP . vijayawada
జీవోఎంకు ఇచ్చిన నివేదికలో హైకోర్ట్ బెంచ్‌లను కర్నూలులోనూ, విశాఖలోనూ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తరాజధానిలో హైకోర్ట్ ఏర్పాటవుతుంది కాబట్టి, వాటి బెంచ్‌లు మాత్రమే ఈ రెండు నగరాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. అంటే, ఈ రెండింటినీ రాజధానిగా సీమాంధ్ర కేంద్రమంత్రులు కోరుకోవడం లేదన్నమాట. పైగా భౌగోళికంగా ఎన్నో ఇబ్బందులు ఈ రెండు ప్రాంతాలకు ఉన్నాయి. కర్నూలును రాజధాని చేస్తే, ఉత్తరాంధ్రకు దూరం అవుతుంది. ప్రతీదానికి కర్నూలు దాకా శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ వాసులు రావడం కష్టం. పైగా కర్నూలుకు వరదముప్పు పొంచి ఉంటుంది. విమానాశ్రయం కూడా లేకపోవడం మరో మైనస్. ఇక విశాఖను రాజధానిని చేస్తే, రాయలసీమ,నెల్లూరు వాసులకూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. విమానాశ్రయం ఉన్నప్పటికీ, తూర్పు నావికాదళ కేంద్రం కావడంతో ఎన్నో పరిమితులున్నాయి. పైగా గట్టిగా వర్షం పడితే ఎయిర్‌పోర్ట్‌లోకి నీళ్లొచ్చేస్తాయి. కాబట్టి వైజాగ్ కూ రాజధాని అర్హత లేదని తేల్చేసుకున్నారు సీమాంధ్ర కేంద్ర మంత్రులు.
వాన్‌పిక్ భూములు ఎక్కువగా ఉండడంతో కొత్తరాజధాని ప్రచారంలో ఒంగోలు పేరు బాగా ప్రచారం సాగుతున్నప్పటికీ, రాజధానికి అవసరమైన మౌలికసదుపాయాలు అక్కడ లేవంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో అందరి ఛాయిస్‌గా గన్నవరం-విజయవాడ-మంగళగిరి-గుంటూరు కారిడార్‌నే కొత్త రాజధానిగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఊపందుకొంటోంది. సీమాంధ్రకు దాదాపుగా మధ్యలో ఉండడం, విమానాశ్రయాన్ని విస్తరించే అవకాశాలుండడం, విశాలమైన భూభాగం, రోడ్,రైల్ కనెక్టివిటీ ఉండడంతో విజయవాడలో ఓటు పడిపోతోంది. అయితే రాజధానికి కొత్త పేరు పెడతారా లేక, విజయవాడ పేరునే ఉంచాతారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.
జీవోఎంకు హోంశాఖ పంపించిన పూర్తి నోట్
Categories :
డౌన్లోడ్ . downloads . GOM . HOME MINISTRY . POLITICS . secret note . seemandhra . telangana
రాష్ట్ర విభజన పై కేంద్ర హోంశాఖ పంపించిన కీలక నోట్ ను కింద ఉన్న లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. మొత్తం 85 పేజీలున్న ఈ నివేదికల రాష్ట్ర విభజనకు సంబంధించి తేల్చాల్సిన పలు అంశాలను హోంశాఖ పేర్కొంది.
హోంశాఖ పంపించిన నోట్ (డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింకును క్లిక్ చేయండి)
ఆ నాలుగూ తేల్చేస్తే విభజిచ్చేస్తాం..
Categories :
bifurcation . GOM . HOME MINISTRY . POLITICS . secret note . seemandhra . telangana . TOP
ఉనికికోసం చిరంజీవి ఆరాటం
Categories :
chiranjeevi . congress . POLITICS . samaikya protest . seemandhra . TOP






