ఉగ్రవాది ఆఫ్జల్‌గురుకు క్షమాభిక్ష ఇవ్వరాదన్న కేంద్ర హోంశాఖ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత, అన్ని వ్యవహాలు అత్యంత వేగంగా గుట్టుగా సాగిపోయాయి. శుక్రవారమే కోర్టు ఉరిశిక్షను అమలు చేసే తేదీని, సమయాన్ని ఖరారు చేసింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారమే వ్యవహరించిన తీహార్ జైలు అధికారులు.. ఉరి తీస్తున్నామన్న విషయాన్ని ఆ సాయంత్రమే అతనికి చెప్పారు అధికారులు. ఈ విషయం తెలియగానే గురు... ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అదే ఆలోచనలతో గడిపిన ఆఫ్జల్.. రాత్రి భోజనం కూడా చేయలేదు. కేవలం మంచినీళ్లు మాత్రమే తాగాడు..
చివరి క్షణాలను ప్రశాంతంగా గడపడం కోసం.. ఓ మత గ్రంథాన్ని ఇవ్వాల్సిందిగా కోరాడు ఆఫ్జల్ గురు. ఉదయాన్నే ఉరికంబం వైపు, మౌనంగా నడిచాడు. మానసికంగా కుంగిపోయినట్లు ఆసమయంలో కనిపించాడని జైలు సిబ్బంది చెబుతున్నారు. చనిపోవడానికి ముందు ఓ చివరి కోరికను కూడా కోరినట్లు సమాచారం. అయితే, నిబంధనల ప్రకారం అదేమిటన్నది బయటేకు వెల్లడించలేమంటున్నారు జైలు అధికారులు.
ఉరిశిక్ష అమలు చేయడానికి ముందే, ఆ సమాచారాన్ని ఆఫ్జల్ గురు కుటుంబానికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారు అధికారులు. ఓ న్యాయమూర్తి, డాక్టర్, కొంతమంది జైలు అధికారుల సమక్షంలో ఉదయం 8 గంటలకు తీహార్‌లోని మూడో నెంబర్ జైలులో ఆఫ్జల్ గురును ఉరితీశారు. అనంతరం జైలు ఆవరణలోనే మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియలను ఓ ముస్లిం మతపెద్ద సమక్షంలో సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. భద్రతా కారణాల రీత్యా ఉరి తీసిన తలారి వివరాలను అధికారులు రహస్యంగా ఉంచారు.
Read more...
parliament attack లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
parliament attack లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
9, ఫిబ్రవరి 2013, శనివారం
ఆఫ్జల్ గురు ... ఆ చివరి క్షణాలు
Categories :
afzal guru . death . hang . news . parliament attack . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
