గుజరాత్ లోని సూరత్ లో చిన్నతరహా అణుబాంబులు పేల్చడానికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. యాసిన్ సోదరుడుకు ఐఎం చీఫ్ రియాజ్ భత్కల్ ఈ అణుబాంబు సమకూర్చడానికి సిద్ధమయ్యాడు. దాడులు చేయడానికి అణుబాంబులు దొరుకుతాయా అంటూ రియాజ్ కు యాసిన్ ఫోన్ చేసి అడిగినప్పుడు, పాకిస్తాన్ లో ఏదైనా దొరుకుతాయని అతను సమాధానం ఇచ్చాడట. అయితే, సూరత్ లో దాడులు చేసినప్పుడు ముస్లింలు కూడా చనిపోతారు కాబట్టి, నగరాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ మసీదుల్లో పోస్టర్లు అతికిద్దామని కూడా భత్కల్ సోదరులు భావించారు. ఈ వివరాలన్నీ పోలీసుల ఇంటరాగేషన్ లో యాసిన్ భత్కల్ చెప్పినట్లు సమాచారం. అయితే, నేపాల్ సరిహద్దుల్లో భత్కల్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ దాడికి బ్రేక్ పడింది. కానీ, ఎప్పుడోకప్పుడు ఈ తరహా దాడులు జరగవచ్చని, అణు బాంబులను ఉగ్రవాదులు సమకూర్చుకుంటున్నారని నిఘా వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
అణుబాంబులు పేల్చడానికి ఉగ్రవాదుల కుట్ర
Categories :
INDIAN MUJAHIDEEN . news . terrorist . TOP . yasin bhatkal
గుజరాత్ లోని సూరత్ లో చిన్నతరహా అణుబాంబులు పేల్చడానికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. యాసిన్ సోదరుడుకు ఐఎం చీఫ్ రియాజ్ భత్కల్ ఈ అణుబాంబు సమకూర్చడానికి సిద్ధమయ్యాడు. దాడులు చేయడానికి అణుబాంబులు దొరుకుతాయా అంటూ రియాజ్ కు యాసిన్ ఫోన్ చేసి అడిగినప్పుడు, పాకిస్తాన్ లో ఏదైనా దొరుకుతాయని అతను సమాధానం ఇచ్చాడట. అయితే, సూరత్ లో దాడులు చేసినప్పుడు ముస్లింలు కూడా చనిపోతారు కాబట్టి, నగరాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ మసీదుల్లో పోస్టర్లు అతికిద్దామని కూడా భత్కల్ సోదరులు భావించారు. ఈ వివరాలన్నీ పోలీసుల ఇంటరాగేషన్ లో యాసిన్ భత్కల్ చెప్పినట్లు సమాచారం. అయితే, నేపాల్ సరిహద్దుల్లో భత్కల్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ దాడికి బ్రేక్ పడింది. కానీ, ఎప్పుడోకప్పుడు ఈ తరహా దాడులు జరగవచ్చని, అణు బాంబులను ఉగ్రవాదులు సమకూర్చుకుంటున్నారని నిఘా వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
పాట్నా పేలుళ్లు వారి పనేనా?
Categories :
INDIAN MUJAHIDEEN . national . news . patna blast . tehseen aktar . terrorist . TOP
![]() |
| యాసిన్ భత్కల్ అనుచరుడు తెహసీన్ అక్తర్ |
అక్టోబర్ 27,2013 ఆదివారం ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 మధ్య పాట్నాలో ఎనిమిది వరుస పేలుళ్లు సంభవించాయి. రెండు రైల్వే స్టేషన్‌లో పేలగా మరో ఆరు మోడి సభ జరుగుతున్న గాంధీ మైదాన్ దగ్గర విస్పోటనం చెందాయి. ఈ పేలుళ్లలో మొత్తం ఆరుగురు మృతి చెందారు. 83 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే స్టేషన్‌లో పేలుడు జరిగిన వెంటనే పారిపోతున్న ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్నుంచి కీలక వివరాల కూపీ లాగారు. అతనిచ్చిన సమాచారంతో జార్ఖండ్ రాజధాని రాంచీలో దాడులు జరిపిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరంతా ఐఎం ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. పేలుళ్లకు ముందే 11 మంది పాట్నాలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల ముందు నిందితులు ఒప్పుకున్నారు.
అయితే, ఈ పేలుళ్లకు సంబంధించి జాతీయ నిఘావర్గాలు గానీ, బీహార్ రాష్ట్ర నిఘా వర్గాలు కానీ ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారంగా ఉగ్రవాదుల కదలికలపై ఎప్పుడూ కీలక హెచ్చరికలు చేస్తుంటాయి. కానీ, ఈ సారి అలాంటి సమాచారం లేకపోవడంతో మోడి సభకు భద్రత కల్పించే విషయంలో ఉదాసీనంగా పోలీసులు వ్యవహరించారు. నిఘా వర్గాలకు కూడా చిక్కకుండా ఉగ్రవాదులు ఎలా ప్రణాళికను అమలు చేశారన్నదానిపైనే ఇప్పుడు దర్యాప్తు బృందాలు ప్రధానంగా దృష్టి సారించాయి.
రాజధానిలో ఇంకెన్నాళ్లు రక్తం చిందాలి..?
Categories :
dilsuknagar blast . hyderabad blasts . news . terrorist . TOP . twin blasts
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన.. హైదరాబాద్‌ను మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. బాంబ్ బ్లాస్టులు రాజధాని నగరానిక కొత్తేంకాదు. లష్కరే తొయిబా, ఇండియన్ ముజాయిద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చూపాలకున్న సందర్భాల్లో చాలాసార్లు హైదరాబాద్‌పై తెగబడ్డాయి. నెత్తురు చిందించాయి.. ఇప్పటివరకు హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లను ఒక్కసారి చూద్దాం
2002 నవంబర్ 21
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద ఉగ్రవాదులు బాంబులు పేల్చారు . ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు.
2004
ఈ ఏడాది మూడుసార్లు బాంబు పేలుళ్ల జరిగాయి. నవంబర్ 1న సరూర్ నగర్ దగ్గర పార్క్ చేసిన ఓ ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు కింద బాబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ప్రాణనష్టం ఏమి జరుగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మూడు రోజులకే అంటే నవంబర్ 4న పోలీస్ కంట్రోల్ రూం సమీపంలోనే పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ పాదాచారి గాయపడ్డారు. 2004 నవంబర్ 12 జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో ప్రైవేటు బస్సులో పేలుడు జరిగింది.
2005
ఈ ఏడాది కూడా రెండుసార్లు నగరంలో పేలుళ్లు జరిగాయి. ఏప్రిల్ 14న నక్లెస్ రోడ్డు సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన బాంబు పేలుడు జరిగింది. అనంతరం సరిగ్గా ఆరునెలలకు అంటే ఆక్టోబర్ 12వ తేదీన బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో హోం గార్డు మరణించాడు. కానిస్టేబుల్ ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు.
2006
ఈ ఏడాది రెండుసార్లు పేలుళ్లు జరిగాయి. మే 7న నగరంలోని ఒడియన్ థియేటర్‌లో బాంబు పేలుళ్లు సంభవించి ఓ యువతితో సహా ముగ్గురు గాయపడ్డారు. అదే నెల 11న బంజారాహిల్స్ సమీపంలో ఇందిరా నగర్‌లో ఇంట్లో చెత్త సామాన్లు తొలగిస్తుండగా బాక్స్‌లోని బాంబు పేలింది. మరో బాంబును పోలీస్‌లు నిర్వీర్యం చేశారు.
2007
మూడుసార్లు ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. మే 1న మలక్ పేటలో లెటర్ పార్శిల్ బాంబు పేలుడు జరిగి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. మే 18న పాతబస్తీ మక్కా మసీదులో బాంబులు పేలి 14 మంది మృత్యవాత పడ్డారు. మరో మూడు బాంబులను నిర్వీర్యం చేశారు పోలీసులు. ఆగస్ట్ 25న లుంబినీ పార్క్ , కోఠిలోని గోకుల్ ఛాట్‌లో సంబంవించిన పేలుళ్లలో 42 మంది మరణించారు. దిల్‌సుఖ్‌నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద పెట్టిన మరో బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు.
2013
ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్లో జంట పేలుళ్లు.
ఐఈడీ అంటే ఏమిటి..?
Categories :
bomb blast . dilsuknagar blast . IED . news . terrorist . TOP
దేశంలో ఎక్కడ ఏ బాంబు పేలుడు జరిగినా, అందుకు వాడుతున్నది ఐఈడీనే. IEDనే. తక్కువ పరిమాణంలో ఉండే బాంబులను వాడి.. ఎక్కువ నష్టాన్ని కలిగించడానికి ఈ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్‌నే టెర్రరిస్టులు ఎక్కువగా వాడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలోనే వీటి తయారీ మొదలైంది. ప్రధానంగా, గెరిల్లా దాడులకు పాల్పడేవారు, ఉగ్రవాదసంస్థలు, మావోయిస్టులు వీటిని దాడులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆర్డీఎక్స్ కన్నా ఎక్కువ విధ్వంసాన్ని ఈ ఐఈడీల ద్వారా సృష్టించవచ్చు.
దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్లలోనూ IEDలనే ఉపయోగించారు టెర్రరిస్టులు. ముంబై, పూణే,ఢిల్లీ, బెంగళూరు పేలుళ్లోనూ వీటినే వాడారు. ఉగ్రవాదులు జనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబులను తరచూ పేల్చుతున్నారు. అటు మావోయిస్టులు కూడా అడవుల్లో కూబింగ్ చేస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీలను ప్రయోగిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ బాంబ్ డాటా సెంటర్ వివరాల ప్రకారం.. 2012లో మనదేశంలో మొత్తం 241 IEDల పేలుళ్లు జరిగాయి. వీటిలో 119 IEDలు ప్రజలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినవే. ఈ పేలుళ్లలో 113మంది సామాన్యులు ప్రాణాలను వదిలారు.
IED లో స్విచ్, ఫ్యూజ్, కంటైనర్, పేలుడు పదార్థం, బ్యాటరీలు ఉంటాయి. స్విచ్ స్థానంలో మొబైల్‌ఫోన్‌ను గానీ, టైమర్‌ను గానీ ఇపయోగిస్తున్నారు. ఇక పేలుడు పదార్థాల విషయానికి వస్తే అమ్మోనియం నైట్రేట్ లాంటివి ఉపయోగిస్తారు. దీనికి PETNను జోడిస్తే పేలుడు తీవ్రత మరింత పెరుగుతుంది. టెర్రరిస్టులు వీటి తయారీపైనే ఎక్కువగా కాన్‌సన్‌ట్రేట్ చేస్తున్నాయి. హైదరాబాద్ లో జరిగిన అన్ని పేలుళ్లలోనూ ఐఈడీలనే ఎక్కువగా ఉపయోగించారు. వీటిని మన దేశంలో ఎక్కువగా ఇండియన్ ముజాహిదీన్ సంస్థే ఉపయోగిస్తోంది.
ఐదు చోట్ల కాదు.. రెండు చోట్లే పేలుళ్లు.. 15 మంది వరకూ దుర్మరణం
Categories :
dilsuknagar blast . news . terrorist . TOP
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రద్దీగా ఉండే దిల్‌సుఖ్ నగర్‌లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు వరసగా సంభవించాయి. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలనుంచి అంతా ఇళ్లకు వెళ్లే సమయాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు.. అత్యంత దారుణంగా పేలుళ్లకు ఒడిగట్టారు. కోణార్క్ థియేటర్ దగ్గర తొలి పేలుడు సంభవించిన కొంతసేపటికే, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి దగ్గరున్న మోతేశ్వరీ కాంప్లెక్స్‌లోని ఓ సెల్‌ఫోన్ షాప్ దగ్గర రెండో బాబు పేలింది.
సైకిళ్లపై ఉంచిన రెక్సిన్ బ్యాగుల్లో బాంబులు పెట్టి పేల్చారు ఉగ్రవాదులు. పేలుడు దాటికి కొంతమంది అక్కడికక్కడే మృతి చెందారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో జనం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. పేలుడు కారణంగా కోణార్క్ థియేటర్ పరిసర ప్రాంతాలు భీతావహంగా మారిపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
పేలుడు సంభవించిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భారీగా సోదాలు నిర్వహించారు. గాయపడిన వారిని యశోదా, ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. వరుస పేలుళ్లు ఉగ్రవాదుల చర్యేనన్నారు డీజీపీ. రెండు చోట్ల IED బాంబులు పేల్చడం వల్లే భారీ ప్రాణనష్టం జరిగిందన్నారు. బాంబుల్లో మేకులతో పాటు.. ఐరెన్ బాల్స్ వాడినట్లు గుర్తించామన్నారు దినేశ్‌రెడ్డి.
అటు ఈ పేలుళ్లపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఈ దారుణానికి ఒడిగట్టినవారికి పట్టుకుని శిక్షిస్తామన్నారాయన. పేలుళ్లు జరిగిన ప్రాంతానికి వెళ్లి.. వివరాలు తెలుసుకున్నారు. పేలుళ్లలో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. క్షతగాత్రులకు కేంద్రం 50 వేలు, రాష్ట్రం 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ సహాయాన్ని అందిస్తామని తెలిపాయి. గాయపడిన వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే అత్యాధునిక వైద్యం అందిస్తామన్నారు సీఎం.
సీఎంతో పాటే హోంమంత్రి సబితారెడ్డి రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రులకు వెళ్లి గాయపడ్డవారిని పరామర్శించారు. ప్రజలు మనో ధైర్యంగా ఉండాలనీ... పుకార్లు నమ్మొద్దన్నారు సబితా ఇంద్రారెడ్డి . ఈ పేలుళ్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హుటాహుటీన రంగంలోకి దిగింది. పేలుళ్లు జరిగిన ప్రాంతాల నుంచి NIA టీమ్ ఆధారాలను సేకరించింది. దీనిపై హైదరాబాద్ పోలీసులు కూడా దర్యాప్తు మొదలుపెట్టారు.
NSG కి చెందిన పోస్ట్ బ్లాస్ట్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి అర్థరాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఈ బృదం నేరుగా దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లి పూర్తి వివరాలను సేకరించింది.
ఇండియన్ ముజాహిదీన్ పనే..!
Categories :
dilsuknagar blast . INDIAN MUJAHIDEEN . news . terrorist . TOP
దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల దుశ్చర్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుళ్లకు సైకిళ్లు వినియోగించడం ఈ అనుమానాలకు కారణంగా చెబుతున్నారు. మక్కా మసీద్ పేలుళ్లకు ప్రతీకారంగా.. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్కుల్లో ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ నేతృత్వంలో విధ్వంసాలకు తెగబడిన ఉగ్రవాదులు దిల్‌సుఖ్‌నగర్ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వద్దా బాంబు పెట్టారు. గోకుల్,లుంబినీల్లో చాలామంది ప్రాణాలు కోల్పోగా.. దిల్‌సుఖ్‌నగర్ బాంబు మాత్రం పేలలేదు. ఐదున్నరేళ్ల తర్వాత.. కసబ్, అఫ్జల్ గురుల ఉరితీత నేపథ్యంలో మళ్లీ ఇదే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరిగాయి. ఇవి కూడా రియాజ్ నేతృత్వంలోని ఐఎం ఉగ్రవాదుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్‌లో చాలాకాలంగా ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులు మకాం వేశారు. పూణే,ఢిల్లీ, బెంగళూరు బ్లాస్ట్‌లతో సంబంధం ఉన్న కొంతమంది IM టెర్రరిస్టులు ఆయా ప్రాంతాల పోలీసులు హైదరాబాద్‌లోనే అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమి నుంచే ఇండియన్ ముజాహిదీన్ ఏర్పడింది. సిమి అగ్రనేతలపై నిఘా సంస్థల నజర్ ఉండడంతో, దిగువస్థాయి నేతలు ఇండియన్ ముజాహిదీన్‌ను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌కు చెందినది కాకుండా.. దేశీయ జిహాదీ సంస్థగా ప్రచారం చేసుకోవడం కోసం.. ఇండియన్ ముజాహిదీన్ అన్న పేరును పెట్టారు. 2005 నుంచి ఈ సంస్థ మన దేశంలో దాడులకు తగబడుతోంది. 2008లో బాట్లా ఎన్‌కౌంటర్‌లో చాలామంది ఉగ్రవాదులు చనిపోయినా, ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది.
2010లో పూణేలోని జర్మన్ బేకరీలో, 2011లో ముంబాయి జవేరీ బజార్‌లో, 2012 ఆగస్టు 1న మళ్లీ పూణేలో, ఇప్పుడు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లకు పాల్పడింది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. రద్దీగా ఉన్న సమయాలు, మార్కెట్లు, దుకాణాల దగ్గరే బాంబులు పేల్చడం ఇండియన్ ముజాహిదీన్ అలవాటు. దిల్‌సుఖ్‌నగర్‌లోనూ అలాంటి ప్రాంతాల్లోనే బాంబులు పెట్టింది. పైగా, అత్యాధునిక బాంబులు తయారు చేసే పరిజ్ఞానం కూడా ఐఎం తీవ్రవాదుల వద్ద ఉంది. 2008 జైపూర్ పేలుళ్లకు, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకూ పోలికలు కనిపిస్తున్నాయి. రెండుచోట్లా సైకిల్ బాంబులనే ఉపయోగించారు. దీంతో.. ఈ పేలుళ్లు ఇండియన్ ముజాహిదీన్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్: హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు.. 20 మందికి పైగా మృతి
Categories :
bomb blast . dilsuknagar blast . hyderabad . news . terrorist . TOP
అత్యంత రద్దీగా ఉండే దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఐదు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో దాదాపు 20మంది చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. 50 మందికి పైగా గాయాలయ్యాయి. దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ కు ఎదురుగా ఉన్న వెంకటాద్రి, కోణార్క్ థియేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఆనంద్ టిఫిన్ సెంటర్ ల దగ్గర రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 7 నిమిషాల మధ్య బాంబులు ఒక్కసారిగా బాంబుల పేలాయి. పేలుళ్ల శబ్ధం విని జనం భయాందోళనలకు గురయ్యారు. తలోదిక్కూ పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలోనూ చాలా మంది గాయపడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుళ్లపై కేంద్ర హోంమంత్రి షిండే ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ఆఫ్జల్ గురును ఉరి తీశారు
Categories :
afzal guru . death centence . hang . news . terrorist . tihar jail . TOP
ఆ సంగతి సోనియాకు, మన్మోహన్ కూ తెలియదట!
కసబ్ సంగతి సరే.. అఫ్జల్ గురు మాటేమిటి?
సబ్బులో టెర్రరిస్టుల ఎస్కేప్ స్కెచ్
Categories :
escape plan . jail . news . terrorist . TOP . vikaruudin
ఇది మనవాళ్లకే చెల్లు..!
వాడింది ఆర్డీఎక్స్ కాదు.. పీఈటీఎన్
సరిగ్గా మూడు నెలల 13 రోజులు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తీవ్రవాది అరెస్ట్!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి తప్పించుకుని హైదరాబాద్ వచ్చిన శ్రీలంక వాసి ఖాథిర్ ను ఢిల్లీ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఖాదిర్‌ను తీవ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ఖాదిర్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అక్కడి పోలీసులు అప్రమత్తం కావడంతో హైదరాబాద్‌కు తప్పించుకు వచ్చాడు. విషయం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు శంషాబాద్‌లో కాపుగాసి అరెస్ట్ చేశారు.
కసబ్ ఉరి ఎప్పుడు?
Categories :

దేశం యావత్తూ.. ఉత్కంఠగా ఎదురు చూసిన ఫలితం వెలువడింది. కరుడుగట్టిన ఉగ్రవాది కసబ్ పాపం పండింది. అర్థరాత్రిపూట హఠాత్తుగా దాడి చేసి ముంబైలో మారణహోమం సృష్టించిన ముష్కరమూకలో ఒకడైన కసబ్‌ను ఏమాత్రం క్షమించలేమని సెషన్స్ కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపిన జస్టిస్ తెహిల్యాని.. గురువారం శిక్షను ఖరారు చేశారు. అదే.. మరణశిక్ష.
కసబ్‌కు మరణశిక్ష వేయడంతో ఈ కేసు వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్లో ఆనందం తాండవించింది. తీర్పు వెలువడిన అనంతరం ఆర్దర్‌రోడ్ జైలులోని కోర్టునుంచి ఉత్సాహంగా వచ్చిన నిఖమ్ విజయచిహ్నాన్ని చూపించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్య విజయమన్నారు.కసబ్‌పై మోపిన 86 అభియోగాలు రుజువు కావడంతో.. వాటి ఆధారంగానే తీర్పు చెప్పారు తెహిల్యాని. ముఖ్యంగా దేశంపై యుద్దానికి తెగబడడం సహా.. నాలుగు కేసుల్లో ఉరిశిక్ష, 6 కేసుల్లో జీవిత ఖైదు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా.. తెహిల్యాని కొన్ని కామెంట్లు చేశారు. కసబ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజానికి పట్టిన చీడపురుగుగా కసబ్‌ను పోల్చారు. ముంబై దాడి గురించి చెప్పేందుకు మాటలు రావట్లేదన్న జడ్జి... కసబ్‌పై అణువంతైనా దయ చూపలేమన్నారు. కసబ్‌లో మానవత్వం చచ్చిపోయిందని.. మామూలు మనిషిగా మారడానికి ఏమాత్రం అవకాశం లేదన్నారు. టెర్రరిస్టు కావాలనుకునే కసబ్ లష్కరే తోయిబాలో చేరాడే తప్ప.. బలవంతంగా ఎవరూ చేర్పించలేదని తెహిల్యాని తన తీర్పులో పేర్కొన్నారు. అందుకే.. మరణశిక్ష తప్ప మరో శిక్షను వేయలేమన్నారు.
కసాయి కంట కన్నీరు
ప్రాణం పోయేదాకా.. గొంతుకు ఉరితాడు బిగించండంటూ.. జడ్జి తీర్పు చెప్పగానే.. కసాయి కసబ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రాణం ఎంత విలువైందో బహుశా.. ఆ క్షణంలో కసబ్‌కు అర్థమయ్యి ఉండొచ్చు. కానీ.. నిర్దాక్షిణ్యంగా.. విచక్షణారహితంగా చేతిలో AK-47తో తూటాల వర్షం కురిపిస్తూ దాదాపు 72 మందిని పొట్టన పెట్టుకున్న కసబ్‌కు ఉరిశిక్షే సరైన శిక్ష. ఈ భూమ్మీద జీవించడానికి ఏమాత్రం అర్హతలేని ఒకేఒక్క వ్యక్తి కసబ్. ఈ విషయమూ.. కసబ్‌కు తెలిసి ఉండొచ్చు. ఈ శిక్షపై అభిప్రాయమేమింటూ జడ్జి అడిగినా నోరు మెదపలేదు.
అతిపెద్ద తతంగం
ఉరిశిక్షను కోర్టు వేయగానే అమలైపోదు.. దానికి ఎన్నో అడ్డంకులు అధిగమించాలి. రకరకాల కోర్టులు దాటి.. రాష్ట్రపతిదాకా వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రపతికి కూడా మరణశిక్షే సబబని అనిపిస్తే తప్ప.. నేరస్థుడి మెడకు ఉరితాడు బిగుసుకోదు. ఒక్కోసారి.. ఉరిశిక్షకూడా తప్పిపోతుంది. ఇందంతా సంవత్సరాల తరబడి జరిగే ప్రక్రియ. తుదినిర్ణయం వచ్చేసరికి.. అసలు కేసును.. దాని గొడవను అంతా మర్చిపోతారు కూడా..
పదిహేనేళ్ల కాలంలో మనదేశంలో ఉరిశిక్ష అమలయ్యింది రెండే రెండు సార్లు. ఏప్రిల్ 27, 1995న చెన్నైకి చెందిన సీరియల్ కిల్లర్ ఆటో శంకర్‌ను ఉరితీశారు. ఆ తర్వాత.. ఆగస్టు 14,2004న కోల్‌కతాలో ధనుంజయ్ ఛటర్జీని ఉరికంబం ఎక్కించారు. ఆ తర్వాత ఉరితాడును వాడాల్సిన సమయం మళ్లీ రాలేదు. అంటే.. అప్పటినుంచి ఉరిశిక్షలేవీ పడలేదా.? కానేకాదు.. దేశంలో ఏదో ఓ కోర్టు.. ఎప్పటికప్పుడు ఉరిశిక్షను వేస్తూనే ఉంది.. కానీ అవి అమలుకు మాత్రం రావడం లేదు.. దీనికి కారణం మరెవరో కాదు.. చట్టమే.. చట్టంలో ఉన్న నిబంధనలే..
జిల్లాకోర్టులు కాని, సెషన్స్ కోర్టులు గానీ ఉరిశిక్ష ప్రకటించిన తర్వాతే.. అసలు ప్రొసీజర్ మొదలవుతుంది. ఈ శిక్షను నిర్దారించమని ప్రభుత్వం హైకోర్టును కోరుతుంది. అక్కడా ఉరిశిక్షను సమర్థిస్తే.. ఆ కేసు సుప్రీంకోర్టును చేరుతుంది. దేశఅత్యున్నత న్యాయస్థానమూ దీన్ని ధృవీకరిస్తే.. ఉరిశిక్ష వేయడం ఖరారవుతుంది. అప్పుడే ఉరితీసే తేదీని ప్రకటిస్తారు. అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలంటూ.. సుప్రీంకోర్టును కోరవచ్చు. అప్పుడు కూడా.. సుప్రీం కోర్టు కరుణించకపోతే.. చివరగా.. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతిని ఆశ్రయించవచ్చు.
క్షమాభిక్ష పిటిషన్‌పై సలహా ఇవ్వమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రాష్ట్రపతి పంపిస్తారు. దీనిపై.. ఆ కేసుకు సంబంధించిన రాష్ట్రం నుంచి వివరణ కోరుతుంది హోంమినిస్ట్రీ. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత.. వాటిని పరిశీలించి తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపిస్తుంది. వీటి ఆధారంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. ఉరిశిక్షను అమలు చేయమని ఆదేశించవచ్చు.. లేదంటే.. యావజ్జీవ కారాగారశిక్షగానూ మార్చొచ్చు. స్థానిక కోర్టుల నుంచి పై కోర్టులకు.. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు రావడానికి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. దీనివల్లే ఉరిశిక్ష అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కోర్టును ఉరిశిక్ష వేసినా.. కరుడుగట్టిన నేరస్తులు మాత్రం ప్రాణాలతో ఉంటున్నారు.
చావాల్సిన వారు బతికే ఉన్నారు
ఇప్పటికే.. 52 మందికి ఉరిశిక్షలు పడినప్పటికీ ఇంకా అమలు మాత్రం కాలేదు. సుప్రీంకోర్టు శిక్షను ఫైనల్ చేసిన తర్వాత వారంతా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు. ఇందులో కాక ఉగ్రవాదులు,బందిపోట్లే.. 9 మంది ఉన్నారు. పైగా ఇవి ఒకటీ రెండేళ్ల కిందవి కూడా కాదు.. 1998 లో దరఖాస్తు చేసుకున్నవాటికే ఇంతవరకూ మోక్షం కలగలేదు. ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్యకేసులో ఉరిశిక్ష పడిన శ్యాంమనోహర్, మరో ఐదుగురు 1998లో క్షమాభిక్షకు అర్జీ పెట్టుకున్నారు. 1999లో ఓసారి, 2005లో మరోసారి హోంశాఖ వీరి ఫైల్‌కు సంబంధించి సిఫార్సులు చేసింది. ఇటీవలే మళ్లీ ఆ ఫైల్‌ను వెనక్కి తెప్పించి పరిశీలిస్తోంది. పన్నెండేళ్లయైనా.. ఉరిశిక్ష వేయాలో వద్దో ఈ కేసులో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నమాట. టెర్రరిస్టుల విషయంలోనూ తీవ్రజాప్యమే జరుగుతోంది. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో ఉరిశిక్ష పడ్డ మురుగన్, శాంతన్, అరివులకు.. 1999 మే నెలలో సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. రెండువేల సంవత్సరంలో మెర్సీ పిటిషన్‌ను వీరు పెట్టుకున్నారు. ఈ కేసులో ఫైనల్ రికమండేషన్‌ను హోంశాఖ జూన్ 21, 2005న పంపించింది. ఐదేళ్లు గడుస్తున్నా.. రాష్ట్రపతి ఈ ఫైల్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొత్తంమీద చూస్తే.. పదేళ్ల క్రితమే ఉరితీయాల్సిన రాజీవ్‌హంతకులని ఇప్పటికీ జైల్లో ప్రాణాలతోనే ఉంచారు. ఇక 1993 సెప్టెంబర్‌లో ఢిల్లీలో బాంబులు పేల్చిన ఖలిస్తాన్ తీవ్రవాది దేవిందర్ పాల్ సింగ్‌కు డిసెంబర్ 2002 లో సుప్రీం మరణశిక్ష విధించింది. 2003లో కరుణించమంటూ రాష్ట్రపతిని ఆయన వేడుకున్నాడు. ఆగస్టు 9, 2005న హోంశాఖ నుంచి సిఫార్సులు అంచాయి. అయినా.. ఈ ఫైల్‌కూ మోక్షం కలగలేదు. గంధపుచెక్కల దొంగ వీరప్పన్ అనుచరుడు సైమన్, మరో ముగ్గురుకి 2004 జనవరి 29న ఉరిశిక్ష పడింది. అదే ఏడాది రాష్ట్రపతిని శిక్ష తగ్గించమని ఆశ్రయించారు. 2005 మే2న హోంశాఖ ఈ ఫైల్‌ను రాష్ట్రపతి సెక్రటేరియెట్‌కు పంపించింది. దీన్ని కూడా పెండింగ్‌లోనే పెట్టారు. ఇక పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడిలో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు 2005 ఆగస్టు4న సుప్రీంకోర్టు డెత్ సెంటెన్స్ విధించింది. 2006లో అఫ్జల్ మెర్సీపిటిషన్ పెట్టుకున్నాడు. ఈ ఫైల్ కేంద్రహోంశాఖ నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి చేరింది. అక్కడి నుంచి ఇంతవరకూ వెనక్కి రాలేదు. దీనిపై 14 లెటర్లు పంపించినా ఢిల్లీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అత్యంత ప్రమాదకర ఉగ్రవాదిగా భావిస్తున్న అఫ్జల్ గురుకు శిక్ష పడాలంటే.. ముందున్న 8మంది ఉగ్రవాదుల ఫైళ్లూ క్లియర్ కావాల్సి ఉంటుంది. మన ప్రజాస్వామ్యానికి ప్రతీకైన పార్లమెంట్‌పైనే దాడిచేసిన ఉగ్రవాది విషయంలోనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటే.. మన ప్రభుత్వం ఈ విషయంలో ఎంత అలసత్వంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కసబ్ కూడా ఈ లిస్ట్‌లో చేరితే.. ఎంతకాలానికి శిక్ష పడుతుందో అర్థం చేసుకోవచ్చు. కానీ.. ప్రభుత్వం మాత్రం ఒక్కో కేసును క్లియర్ చేస్తామని చెబుతోంది.
టెర్రరిస్టులను పక్కన పెడితే .. హత్యకేసుల్లో ఉరిశిక్ష పడ్డ మరో 43 మంది రాష్ట్రపతి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి సంబంధించిన 23 ఫైళ్లు రాష్ట్రపతి భవన్‌లో మూలుగుతున్నాయి. మూడు కేసుల్లో మాత్రం ఇటీవలే హోంశాఖ తాజా సిఫార్సులు పంపించింది. ఫలానా గడువులోగా నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఏదీ లేకపోవడంతో.. ఏళ్లతరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇక ఇప్పుడు కసబ్ కేసు కూడా రాష్ట్రపతిదాకా వచ్చేటప్పటికి ఎంతలేదన్నా ఏడాది నుంచి రెండేళ్లు పట్టొచ్చు. ఇక అక్కడ ఎన్ని సంవత్సరాలు పడుతుందన్నది మాత్రం ఎవరూ చెప్పలేరు.
ఉరిశిక్షకూ.. రాష్ట్రపతికీ ఎమిటీ లింకు?
ఎలాంటి కేసులో అయినా.. సుప్రీంకోర్టు నిర్ణయమే ఫైనల్ అయినప్పుడు.. ఉరిశిక్షలో మాత్రం ఎందుకు కాదు.. అయితే.. దీనికి స్పష్టమైన నిర్వచనాన్నే ఇచ్చింది భారత రాజ్యాంగం. ఇతర శిక్షలతో పోల్చితే.. మరణశిక్ష అత్యంత ప్రమాదకరం. మనిషి జీవితాన్ని అంతం చేస్తుంది. ఒకవేళ కోర్టుల్లో సరైన విధంగా ప్రాసిక్యూషన్ జరగకపోతే.. ఉరిశిక్షతో ప్రాణం పోతుంది కాబట్టి.. ఆ సమస్య రాకుండా.. రాష్ట్రపతికి విశేషమైన అధికారాలను కట్టబెట్టారు రాజ్యాంగ నిర్మాతలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 క్షమాభిక్షకు సంబంధించి రాష్ట్రపతికి ఉన్న అధికారాలను ప్రస్తావిస్తుంది. కేంద్రమంత్రిమండలి సలహా ఆధారంగానే రాష్ట్రపతి క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఏ సందర్భాల్లో క్షమాభిక్ష పెట్టవచ్చో కూడా రాజ్యాంగం స్పష్టంగానే చెప్పింది. నేరస్తుడు యువకుడైనా,మహిళలైనా, తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు నేరాన్ని చేసి ఉండొచ్చని రాష్ట్రపతి భావిస్తే ఉరిశిక్ష తప్పించవచ్చు. శిక్ష వేయడానికి కారణమైన సాక్ష్యాలు విశ్వసించతగినవి కాదని భావించినా... మళ్లీ విచారణ జరిపితే కొత్త ఆధారాలు దొరుకుతాయని ఆశించినా.. శిక్ష విధించిన కోర్ట్ బెంచ్‌లో జడ్జిల మధ్య విరుద్దమైన అభిప్రాయాలున్నా.. సుదీర్ఘకాలం పాటు విచారణ జరిగిందని భావించినా.. క్షమాభిక్షను రాష్ట్రపతి ప్రసాదించవచ్చు. దీనివల్ల.. ఉరిశిక్ష కాస్తా జీవితఖైదుగా మారిపోతుంది. ఈ పిటిషన్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. హోంశాఖ నిర్లక్ష్యంతో పాటు.. రాష్ట్రపతి భవన్‌లో జాప్యం వల్లా.. ఫైళ్లు పేరుకుపోతున్నాయి.
ఇప్పటికే ఆప్జల్‌గురు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. 2006లో మెర్సీ పిటిషన్‌ను ఆఫ్జల్ గురు పెట్టుకుంటే.. ఇంతవరకూ హోంశాఖ ఫైనల్ రికమండేషన్స్‌ను పంపించలేకపోయింది. ఓ కరుడుగట్టిన ఉగ్రవాదిని శిక్షను వేయకుండా నాలుగేళ్లుగా జైల్లోనే ఉంచారు. రాజకీయకారణాల వల్లే జాప్యం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం లెక్కచేయడం లేదు. ఈ ఆఫ్జల్ గురును విడుదల చేయించడానికి.. తీవ్రవాదులు మరో దాడి చేస్తే దానికి బాధ్యులెవరవుతారు.. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పదు. కానీ.. ఈ విషయం కోర్టులకు బాగా తెలుసు. అందుకే.. కసబ్‌కు ఉరిశిక్ష వేసే విషయంలోనూ దీన్ని ప్రస్తావించింది. యావజ్జీవ శిక్షతో సరిపెడితే.. కాందహార్ హైజాక్‌లాంటి సంఘటనలు మళ్లీ జరగొచ్చన్న ఆందోళనను సెషన్స్ కోర్ట్ వెలుబుచ్చింది. అందుకే.. కసబ్‌కు ఉరిశిక్ష వేసింది. మరి సెషన్స్‌కోర్టు ఆలోచించినంత కూడా మన పాలకులు ఆలోచించరా..
మన దేశ పౌరుల విషయంలో క్షమాభిక్షను పెండింగ్‌లో ఉంచొచ్చేమో కానీ.. ఓ అఫ్జల్‌గురునో.. మరో కసబ్‌నో ఏమాత్రం క్షమించకూడదు. లైన్లు.. ఆర్డర్లు అంటూ.. వీరి పిటిషన్లను పెండింగ్‌లో పెట్టకూడదు. వీలైనంత వెంటనే శిక్షను అమలు చేయాలి. లేదంటే.. ఏడాదిన్నర కాలంలోనే కసబ్‌కు 35 కోట్లు ఖర్చుపెట్టినట్లు.. వందల కోట్ల ప్రజాధనాన్ని ఆ ఉగ్రవాదిని పోషించడానికే ధారపోయాల్సి ఉంటుంది.
అలజడి..

హైదరాబాద్‌పై తీవ్రవాదుల కన్నుపడింది.
మరో విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నారు..
రద్దీగా ఉండే ప్రదేశాలే టార్గెట్
మన రాష్ట్రంపై తీవ్రవాదుల దృష్టి మరోసారి పడింది. రాష్ట్ర రాజధానిలో భారీవిధ్వంసం సృష్టించడానికి టెర్రరిస్టులు కుట్ర పన్నుతున్నారు. అందులో భాగంగానే.. తమ పని సైలెంట్‌గా చేసిపెట్టే స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఇప్పటికే సమాచారం అందింది. హైదరాబాద్‌లో గానీ, దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో గానీ.. విధ్వంసం సృష్టించడానికి టెర్రరిస్టులు ప్రణాళికలు వేస్తున్నారు..
ముంబై తరహాలో.. పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు ఈ సారి రాకపోవచ్చు. మనమధ్యే ఉంటూ దాడులు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. టెర్రరిస్టు సంస్థల కార్యకలాపాలపై దృష్టి పెట్టిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వారి కొత్త వ్యూహాలను పసిగట్టాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని స్లీపర్‌సెల్స్‌ను యాక్టివేట్ చేస్తున్నారంటూ సమాచారాన్ని మన పోలీసులకు అందించాయి. ఘర్షణలతో ఉద్రిక్తంగా ఉన్న సమయంలో.. ఈ స్లీపర్‌సెల్స్ ఏం చేయబోతున్నాయన్నది... అలజడిని సృష్టిస్తోంది. అందుకే.. నగరంలో ఒక్కసారిగా భద్రతను కట్టుదిట్టం చేశారు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. భారీ ఎత్తున తనిఖీలు చేస్తున్నారు.
బెంగళూరు నుంచి
ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్‌ల సందర్భంగా బెంగుళూరులో తక్కువ తీవ్రత గల బాంబు పేలుళ్లు సంభవించాయి. వీటి వెనక ఎవరున్నారన్న విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్ ముఠాలు చేశాయని కొంతమంది భావిస్తుంటే.. లష్కరే తోయిబా మిలిటరీ కమిటీ ఛైర్మన్ ఇలియాస్ కాష్మిరీ హస్తం ఉందన్న అనుమానమూ ఉంది. ఈ సంఘటనకు కొన్ని రోజుల ముందే.. ఓ ఆన్‌లైన్ పత్రిక ఇలియాస్ ఇంటర్వ్యూను ప్రచురించింది. భారత్‌పై దాడులు చేస్తామని అందులో పేర్కొన్నాడీ లష్కరే ఉగ్రవాది. బెంగుళూరులో తక్కువ తీవ్రత బాంబులను వాడడమూ.. వ్యూహాత్మకమేనని తెలుస్తోంది.
దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా.. ఉగ్రవాద దాడులు జరిగినా.. దానికి లింకులు మన హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఇప్పటికే ఎన్నోసార్లు బయటపడింది. పోలీసులకు అందిన తాజా సమాచారం ప్రకారం.. రెండుసార్లు కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాది వికారుద్దీన్... మరోసారి నగరంలోకి వచ్చాడు. వికారుద్దీన్ మళ్లీ నగరంలోకి ఎందుకు వచ్చినట్లు? స్లీపర్‌సెల్స్.. మళ్లీ ఎందుకు యాక్టివేట్ అవుతున్నాయి..? ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే.. టెర్రరిస్టులు మరో వ్యూహం ఏదో పన్నుతున్నారన్న విషయం అర్థమవుతుంది.
హైదరాబాద్‌పై నెత్తుటి మరకలు
హైదరాబాద్‌లో ఎన్నో విద్రోహక చర్యలకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. 2007లో వరస దాడులతో బెంబేలెత్తించారు. మే 18, 2007న మక్కామసీదులు ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో సెల్‌ఫోన్ బాంబును పక్కాప్లాన్‌తో పేల్చారు. 11 మందిని చంపారు. హైదరాబాద్‌లో కల్లోలం సృష్టించడానికి ప్రయత్నించారు.
ఆగష్టు 25, 2007న గోకుల్‌ఛాట్‌లోనూ, లుంబినీ పార్క్‌లోనూ బాంబులు పెట్టారు. రద్దీగా ఉన్న సమయంలో అవి పేలడంతో.. నలభైమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో టెర్రరిస్టుల టాప్‌లిస్ట్‌లో హైదరాబాద్ ఉందన్న విషయం అర్థమైపోయింది.
ఈ పేలుళ్లకు ముందు కూడా కొన్ని విద్రోహ చర్యలకు టెర్రరిస్టులు పాల్పడ్డారు. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర కారుబాంబు ఘటన దగ్గర నుంచి ఇటీవల వికారుద్దీన్ జరిపిన కాల్పుల వరకూ ఉగ్రవాదుల ఆచూకీకి సంబంధించి నగరంలో ఎన్నో ఆనవాళ్లు కనిపిస్తాయి. అయితే.. మూడేళ్లుగా టెర్రరిస్టులు దాడులకు దూరంగానే ఉన్నారు. ముంబైని టార్గెట్ చేసుకుని.. ప్లాన్ అమలు చేసిన టెర్రరిస్టులు.. ఇప్పుడు మిగిలిన నగరాలపైకి దృష్టి మళ్లించారు. అడపదడపా దాడులు చేస్తూ.. నిఘా వర్గాల సామర్థ్యాన్ని, పోలీసుల వేగాన్ని అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు లష్కరే, హిజ్బుల్ దాడులు చేస్తే.. ఇప్పుడాపనిని ఇండియన్ ముజాహిదీన్ చేస్తోంది. పేరు వేరు గానీ, సహాయం అందేది మాత్రం పాక్ సరిహద్దుల్లోని తీవ్రవాద సంస్థల నుంచే. హైదరాబాద్‌ను బేస్ చేసుకుని.. మనదేశంలో వీలైనంత విధ్వంసాన్ని సృష్టించడానికి ఈ ఇండియన్ ముజాహిదీన్ కదులుతోంది. అందులో భాగంగానే.. ఇప్పుడు హైదరాబాద్‌లో స్పీపర్ సెల్స్‌ను మళ్లీ యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.
నగరంలో కొన్ని వందల స్లీపర్‌సెల్స్ ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. అయితే.. వీరెవరు? ఏం చేస్తుంటారన్నది మాత్రం తెలియదు. ఇందులో ఎంతమంది యాక్టివ్ అయ్యారన్నదీ సస్పెన్సే. ఈ గుట్టును ఛేదించే పనిలో పడ్డారు హైదరాబాద్ పోలీసులు. అందుకే.. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. ఈ సెల్స్ ఉన్నాయని అనుమానించే ప్రాంతాల్లో.. సడన్‌గా చెకింగ్‌లకు చేస్తున్నారు. పూర్తిగా అలర్ట్‌గా ఉన్నామన్న సంకేతాలు పంపిస్తున్నారు. హైదరాబాద్‌పై స్పెషల్‌గా కాన్‌సన్‌ట్రేషన్ చేసిన సెంట్రల్ ఇంటెలిజెన్స్.. ఓల్డ్ సిటీలో ఫోన్లను పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేస్తోంది. దీనికోసం ముంబై తరహా వ్యవస్థనూ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కాల్స్‌ను విశ్లేషిస్తున్న సమయంలోనే స్లీపర్స్‌సెల్స్ గురించి సమాచారం అందింది.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరగొద్దంటూ.. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ పౌరులను హెచ్చరించాయి. భారత్‌పై తీవ్రవాద దాడులు జరిగే ప్రమాదముందంటూ హెచ్చరికలు కూడా జారీచేశాయి. అమెరికా వార్నింగ్.. మన ఇంటెలిజెన్స్‌కు వచ్చిన ఇన్‌ఫర్‌మేషన్ రెండూ దాడులకు సంబంధించినవే కావడంతో.. పోలీసులు ఈ విషయంపై చాలా సీరియస్‌గా దృష్టి పెట్టారు.
వీరెక్కడ?
అబ్దుల్ బారీ అలియాస్ అబు హంజా.. యాకుత్‌పురాకు చెందిన ఇతను పదిహేనేళ్లుగా కనిపించడం లేదు. అబ్దుల్ అహద్.. వయస్సు 28 ఏళ్లు.. 2004 లో మాయమయ్యాడు. సయ్యద్ అమ్జద్, సంతోష్‌నగర్‌లో ఎంబ్రాయిడరీ చేసుకునే 23 ఏళ్ల ఈ యువకుడు 2007 నుంచి కనిపించడం లేదు. మహ్మద్ సాజిద్, లారీ క్లీనర్, సైదాబాద్‌కు చెందిన సాజిద్.. 1998 నుంచి కనిపించడం లేదు. వీరు మాత్రమే కాదు.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన చాలామంది సడన్‌గా మాయమవుతున్నారు. ఇలా మాయమైనవారిలో దాదాపు 33 మంది పాకిస్తాన్ గుఢాచారసంస్థ ఐఎస్ఐ ద్వారా టెర్రరిస్టులుగా మారినట్లు సమాచారం. ఇవి బయటకు వచ్చిన వివరాలే.. బయటకు రాని పేర్లు మరెన్నో ఉండొచ్చు..
పాతబస్తీలో మాయమవుతున్న వారిలో 18 ఏళ్ల కుర్రాళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యవయస్సుల వారి వరకూ ఉన్నారు. ఏజ్‌ను బట్టి చూస్తే.. వీరు మిస్ అయ్యారని చెప్పలేం. ఉద్దేశపూర్వకంగానే మాయమయ్యారని చెప్పొచ్చు. పైగా.. ఇందులో చాలామంది సౌదీలోనో, దుబాయ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే.. తమ పరిచయాలను ఉపయోగించుకుని ఇక్కడ విధ్వంసాలకు పాల్పడుతున్నారు.
ముఖ్యంగా.. ఇలా మాయమవుతున్నవారిలో... పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే ఎక్కువ. ఓల్డ్‌సిటీలో పేద యువకులను ఆకర్షించడానికి ఐఎస్‌ఐ రకరాల ఎత్తుగడలు వేస్తోంది. డబ్బు ఎర వేసి.. రెచ్చగొట్టే ప్రసంగాలు చూపించి మనసు మార్చుతోంది. మన దేశంపైనే యుద్ధానికి పురిగొల్పుతోంది.
మనల్ని మనమే కాపాడుకోవాలి
భిన్నత్వంలో ఏకత్వాన్ని స్పురింపజేసే సంస్కృతి మన హైదరాబాద్‌ది. దేశంలో ఉన్న సర్వజాతులు.. మతాల వారు మనకు హైదరాబాద్‌లో కనిపిస్తారు. అంతేకాదు.. ఆఫ్రికన్స్ నుంచి అమెరికన్స్ వరకూ ఎంతోమంది కనిపిస్తారు. కలిసికట్టుగా ఉండే మన మధ్య కొన్ని ఉగ్రవాద సంస్థలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. స్లీపర్ సెల్స్ లక్ష్యం ఇదే. దీన్నే ఇప్పుడు మనం అడ్డుకోవాలి..
గ్రేటర్ హంగు పొందాక.. హైదరాబాద్ జనాభా 70 లక్షలకు చేరువయ్యింది. హైదరాబాద్, సైబరాబాదుల్లో కలిపి మనకున్న పోలీసు బలం 12 వేల లోపే. దీనికి తోడు నిరంతరం నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరిపై నిఘా పెట్టడం సాధ్యమేనా అంటే.. కచ్చితంగా కాదనే చెప్పొచ్చు. మరి ఉగ్రవాద దాడులు పొంచి ఉన్న సమయంలో ఈ మాత్రం పోలీసులు సరిపోతారా.. టెర్రరిస్టుల గుట్టు రట్టు చేయగలరా?
నయా ఇన్‌ఫార్మర్స్ పేరుతో.. కొత్త నెట్‌వర్క్‌ను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. అయితే.. దీనివల్ల కూడా పూర్తిస్థాయిలో విధ్వంసాలను అడ్డుకోలేకపోవచ్చు.. మరి పరిష్కారమేమిటి?
హైదరాబాద్‌లో తిరిగే ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండడమే ఏకైక మార్గం. తీవ్రవాదులగానే.. ఏకే -47లు పట్టుకుని తిరగరు. ముఖ్యంగా రాజధానిలో యాక్టివేట్ అయిన స్లీపర్‌సెల్స్ మరీనూ.. ఏదో వ్యాపారం చేసుకుంటూనో.. ఏ మెకానిక్ షాపులో పనిచేస్తూనో.. తమ అసలు పని కానిచ్చేస్తాయి. మన మధ్యే ఉంటూ.. మనలా జీవిస్తూ.. భారీ విధ్వంసాలను సృష్టిస్తాయి. అందుకే.. మనకెందుకులే అనుకోకుండా.. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కదలికలపై ఓ కన్నేసి ఉంచండి. వారి కదలికల్లో.. వ్యవహారంలో ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ముష్కరమూకల ఆట కట్టించండి..








