టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్‌ని తెలంగాణ ఏసీబీ టార్గెట్ చేసుకోగానే.. ఏపీ సీఐడీ నుంచి ప్రతీకార చర్యలు మొదలైనట్లు కనిపిస్తోంది. లోకేశ్ కారు డ్రైవర్ కు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇస్తే.. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ కారు డ్రైవర్ కు, గన్ మెన్ కు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్యను చంద్రబాబు పేరు చెప్పాలంటూ బెదిరించారని నమోదైన కేసులో ఈ నోటీసులు జారీ చేసింది సీఐడీ. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఓటుకు నోటు కేసు తాజానోటీసులతో మళ్లీ దుమారం రేపడం మొదలుపెట్టింది. అటు టీడీపీ, ఇటు టీఆర్ఎస్ రెండూ.. ఈ నోటీసుల వ్యవహారాన్ని రచ్చరచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ktr లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ktr లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, ఆగస్టు 2015, బుధవారం
టిట్ ఫర్ టాట్ - కేటీఆర్ పై ఏపీ సీఐడీ కన్ను
Read more...
2, జూన్ 2014, సోమవారం
ఉద్యోగ నేతల్లేరు.. ఖమ్మం,పాలమూరుకు చోటు లేదు..
కేసీఆర్ తొలి కేబినెట్ కొలువు దీరింది. పదకొండుమందికి తన కేబినెట్లో చోటు కల్పించారు కేసీఆర్. కేసీఆర్ తనయుడు కేటీఆర్ తో పాటు, మేనల్లుడు హరీశ్ రావు కూ ఈ సారి మంత్రిపదవులు దక్కాయి. వీరితో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావుకూ చోటు దక్కింది. మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమూద్ అలీ, సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, జోగురామన్న, మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. ఇక ఉద్యోగ సంఘాల నేతల నుంచి ప్రజాప్రతినిధులుగా ప్రమోషన్ పొందిన శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్ లలో ఏ ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ఇక ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకూ ఈ కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది.
18, ఫిబ్రవరి 2013, సోమవారం
కేసీఆర్ ఫ్యామిలీ ప్లానింగ్
తెలంగాణ వాదంతో ఉద్యమకారులకు తాను చెప్పిందే వేదంగా మార్చుకున్న కేసీఆర్ కు అంతా బాగానే ఉంటున్నా, ఎన్నికల సమయంలోనే పరిస్థితి తారుమారు అవుతోంది. ప్రధాన ఎన్నికల్లో ఆశించినంతగా ఫలితాలను రాబట్టుకోలేకపోతోంది టీఆర్ఎస్. ఎన్నికల వరకూ కాంగ్రెస్ తెలంగాణ విషయాన్ని తేల్చేలా కనిపించకపోవడంతో ..టీఆర్ఎస్ కు వచ్చే సీట్ల ఆధారంగానే రాష్ట్ర భవిష్యత్ ఉండే అవకాశాలున్నాయి. ఈసారి ఉద్యమం తారాస్థాయిలో సాగిన నేపథ్యంలో, కేంద్రం మాట మార్చిన నేపథ్యంలో టీఆర్ ఎస్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నేతలు పైకైతే చెబుతున్నారు గానీ, గతాన్ని తలచుకొని లోలోన ఆందోళనకూ గురవుతున్నారు.
పైగా, ఈ ఎన్నికలు చాలా కీలకం కాబట్టి, తన ఫ్యామిలీ మొత్తాన్ని పాలిటిక్స్ లో సెట్ రైట్ చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే కుమారుడు కేటీఆర్ ను ఎమ్మెల్యేను చేసుకున్న ఆయన, ఈ సారి కొడుకును, కూతుర్ని ఎంపీలుగా చూడాలనుకుంటున్నారు. దానికి ఇప్పటి నుంచే వేదిక సిద్ధం చేస్తున్నారు.
అందుకే ఈసారి అసెంబ్లీ సీట్ల సంగతి ఎలా ఉన్నా, పార్లమెంట్ సీట్లను మాత్రం కచ్చితంగా ఎక్కువ మొత్తంలో దక్కించుకోవాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతీ ఎన్నికల్లోనూ ప్రాంతాన్ని మారుస్తున్న కేసీఆర్, ఈ సారి కూడా మహబూబ్ నగర్ నుంచి మరో సీటుకు వలసవెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపైనే ఆయన ప్రధానంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. నల్గొండ నుంచి గానీ, జహీరాబాద్ నుంచి గానీ పోటీ చేయడానికి కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డిని పోటీకి దించే సూచనలున్నాయి. అటు మెదక్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయశాంతిని భువనగిరికి పంపొచ్చు. కరీంనగర్ నుంచి కేటీఆర్, నిజామాబాద్ నుంచి కవిత, వరంగల్ నుంచి విజయరామారావులను పోటీ చేయించే అవకాశాలున్నాయి. పొలిటికల్ జేఏసీలో కీలకపాత్ర పోషిస్తున్న టీఆర్ ఎస్ సానుభూతి పరులకు కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ నుంచి కొంతమంది తెలంగాణ ఎంపీలు టీఆర్ఎస్ లోకి వచ్చే అవకాశాలు ఉండడంతో, వారికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలనే కేటాయింటే అవకాశాలున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
