సీబీఐ దాడులు, మీడియా కథనాలపై స్పందించారు దర్శకరత్న దాసరి. కొన్ని పత్రికలు తనను బొగ్గుల పులి అంటూ రాయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తానెప్పటికీ బొబ్బిలి పులినే అంటూ ఓ స్టేట్ మెంట్ ను మీడియా సంస్థలకు ఫ్యాక్స్ చేశారు. తనపై కొందరు పనిగట్టుకుని దాడులు చేయిస్తున్నారని, త్వరలోనే నిజానిజాలు బయటపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more...
raids లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
raids లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, జూన్ 2013, బుధవారం
11, మార్చి 2012, ఆదివారం
అక్రమ ఖాకీలపై ఏసీబీ కొరడా
మద్యం సిండికేట్లు, ఎక్సైజ్ అధికారుల వెన్నులో వణుకు పుట్టించిన ఏసీబీ.. ఇప్పుడు పోలీస్ డిపార్ట్ మెంట్ ను టార్గెట్ చేసుకుంది. సిండికేట్ల డైరీల్లో దొరికిన వివరాలతో, కొంతమంది కీలక అధికారుల ఇళ్లల్లో మెరుపుదాడులు చేసింది. తమ జోలికి రాదనుకుని ఇంతకాలం ధైర్యంగా ఉన్న ఖాకీల్లో తాజా దాడులు కలకలాన్ని సృష్టించాయి.
చిన్న చేపలు మాత్రమే కాదు.. పెద్ద చేపలను కూడా ఏసీబీ అదుపులోకి తీసుకొంటోంది. ఆదిలాబాద్ జిల్లా ఓఎస్డీ ఉమామహేశ్వరరావు, ఖమ్మం జిల్లా ఓఎస్డీ రాంప్రసాద్ నివాసాల్లో సోదాలు చేసిన ఏసీబీ వారిద్దరని అదుపులోకి తీసుకొంది. వీరిద్దరిదీ అడిషనల్ ఎస్పీ ర్యాంక్. ఇక ఆదిలాబాద్ రూరల్ సీఐ శ్రీధర్, వరంగల్ జిల్లాకు చెందిన డీఎస్పీ మదన్ మోహన్ రెడ్డి, సీఐలు విజయసారధి, అశ్వక్, ఎస్.ఐ డేవిడ్ రాజు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీఐగా పనిచేసి, ప్రస్తుతం వీఆర్ లో ఉన్న గుణశేఖర్ ల నివాసాల్లోనూ సోదాలు జరిగాయి. వీరందరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. హైదరాబాద్ కు తరలించింది. మద్యం ముడుపుల కేసులో సిండికేట్లను మొదలుకొని, ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఏసీబీకి తర్వాత టార్గెట్ ఎవరవుతారన్నది ఆసక్తిగా మారింది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

