ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో ఆత్మహత్యాయత్నం చేసిన మునికామకోటి కన్నుమూశాడు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబాన్ని అన్యాయం చేసి వెళ్లిపోయాడు. ఆత్మహత్యలకు ప్రభుత్వాలు కదలవన్న సంగతిని గుర్తించలేకపోయాడు మునికోటి. చచ్చి కాదు.. బ్రతికి సాధించాలన్న నిజాన్నితెలుసుకోలేకపోయాడు. మునికోటి ఆత్మహత్యతో ఇప్పుడు హడావుడి చేస్తున్న నేతలు..వారం పదిరోజులవగానే.. అతన్ని, అతని కుటుంబాన్నిమర్చిపోతారు. వాళ్లను టీవీల తెరలపై చూపించడానికి రోజుకో కొత్త అంశం పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇప్పుడు మునికోటి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామంటూ కొంతమంది ముందుకు వచ్చినా.. అది ఎంతవరకూ ఆకుటుంబానికి అందుతుందన్నది తెలుసుకోవడం కష్టమే. అయితే..ఇలాంటి సమయంలో కాస్త విభిన్నంగా స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మునికోటి మృతికి సానుభూతిని తెలియజేస్తూనే, ఇలాంటి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తనను తాను నియంత్రించుకుంటున్నట్లు ప్రకటించారు. బాగాన ఉంది. కానీ, ఇలాంటప్పుడే పవన్ లాంటి వ్యక్తులు స్పందించాలి. ఆత్మహత్యలకు ఎవరూ పాల్పడవద్దని.. స్పెషల్ స్టేటస్ కోసం మరో మార్గంలో పోరాడదామంటూ ప్రకటించాలి. అవసరమైతే జనంలోకి వెళ్లాలి. తాను ప్రచారం చేసి, ఓట్లు వేయించినందుకు ప్రధాని మోడీని నిలదీయాలి. ఇవేవీ చేయకుండా కేవలం తనను తాను నియంత్రించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రజలు కూడా దాన్నికోరుకోవడం లేదు. పవన్.. ఇకనైనా నీ పవర్ చూపించు. స్పెషల్ స్టేటస్ పై మోడీని కదిలించు.
pawan kalyan లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
pawan kalyan లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
10, ఆగస్టు 2015, సోమవారం
పవన్.. నువ్వు మాట్లాడాల్సిన సమయం ఇదే!
Categories :
ANDHRA PRADESH . muni koti . news . pawan kalyan . special status
Read more...
పవర్ స్టార్ కు చోటా ఫ్యాన్!
Categories :
abhishesk bachan . cinema . entertainment . pawan kalyan . tollywood
హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ.. హీరోలనే ఫ్యాన్స్ గా మార్చుకునే హీరోలు అరుదుగా ఉంటారు. యాక్టింగ్ లో పవర్ చూపిస్తూ.. తెలుగు సినీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు మరో సూపర్ ఫ్యాన్ దొరికాడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కొడుకు.. చోటా బచ్చన్ అభిషేక్ .. తాను పవన్ కు పిచ్చ ఫ్యాన్ అని చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్ తీసే ప్రతీ సినిమాను చూస్తానని చెప్పాడు. బాలీవుడ్ హీరో అయ్యి ఉండి.. పవన్ కు ఫ్యాన్ అని చెప్పడానికి తనకు ఎలాంటి మొహమాటం లేదంటున్నాడు. అభిషేక్ మాటలతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మరింత ఖుషీ చేసుకుంటున్నారు.
14, మార్చి 2014, శుక్రవారం
నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి.. ? - పవన్
Categories :
breaking news . jana sena party . pawan kalyan . POLITICS . setaire
తన వ్యక్తిగత జీవితంపై రాజకీయనేతలు చేస్తున్న విమర్శలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తనకు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావంటే తనకెంతో అభిమానమన్న పవన్, తనపై ఆయన చేసిన కామెంట్లను ప్రస్తావించారు.."పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు బై.. ఇక రాజకీయాల గురించి ఏం చెబుతాడు.. మా రాహుల్ గాంధీ అయితే, ఒక్క పెళ్లి చేసుకోలేదు బై" అని వీహెచ్ అన్నారని, కానీ, రాహుల్ బ్రహ్మచారి అని మాత్రం చెప్పలేదన్న విషయాన్ని గుర్తు చేశారు పవన్. ఒక్క పెళ్లి చేసుకొని 30 మందితో తిరిగితే తప్పు కాదా అన్నారాయన. కాంగ్రెస్ లో అలాంటి మిత్రులు వీహెచ్ కు ఎంతోమంది ఉన్నారన్నాయన. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తే, కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితాలన్నింటినీ బయటకు తీసుకురావాల్సి వస్తుందని, రాహుల్ వ్యక్తిగత జీవితాన్ని గురించి కూడా చెప్పాల్సి వస్తుందన్నారాయన. తన గురించి ఇతర పార్టీల నేతలు తెలుసుకోవాలంటే గూఢచారులు కావాలని, కానీ, తాను వారి గురించి తెలుసుకోవలంటే మాత్రం తనకు అభిమానబలం ఉందన్నారు పవన్. కుటుంబంలోనూ, ప్రేమికుల మధ్య ఎన్నో సమస్యలు వస్తాయని, బయటనుంచి చూసేవాళ్లకు అవన్నీ కనిపించవన్నారు కళ్యాణ్. వాటిని అలా చూసి విమర్శించడం కూడా అత్యాచారం చేయడం లాంటిదేనన్నారు. మహిళల గురించి మాట్లాడకూడదన్న సంస్కారం ఉండాలన్న పవన్, అలా విమర్శించేవారిని నిర్భయ చట్టం కింద బుక్ చేయాలని డిమాండ్ చేశారు. తనను విమర్శించాలనుకునేవారు, ముందు అద్దంలో చూసుకుని, తమకు ఆ స్థాయి ఉందా లేదా అని నిర్ధారించుకుని మాట్లాడాలని హితవు పలికారు.
జనసేన సభలో పవన్ పంచ్ లు
Categories :
breaking news . chiranjeevi . jana sena party . pawan kalyan . political entry . POLITICS
జనసేన పార్టీని ప్రారంభిస్తున్నట్లు అభిమానుల మధ్య ఘనంగా ప్రకటించారు సినీ నటుడు పవన్ కళ్యాణ్. ఈ సభలో ఎన్నో పంచ్ డైలాగులు పేల్చారు పవన్. తాను రాజకీయాలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తానని మార్చి 2వ తేదీన ప్రెస్ నోట్ విడుదల చేశానని, అప్పటినుంచీ తనపై విమర్శల దాడి మొదలయ్యిందన్నారు. తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ గా పంచ్ లు పేల్చారు పవన్. ఆ పంచ్ ల్లో కొన్ని..
- ఢిల్లీలో నేతలను కాల్మొక్తా బాంచన్ దొరంటూ ఇక్కడి నేతలు బానిసలుగా మారారు
- నా తెలంగాణకు క్షమాపణలు అడగడానికి మీరెవరు?
- నేనేం చేస్తానో చెప్పి రాజకీయాల్లోకి రావాలని కొంతమందన్నారు.. అలా అడగడానికి మీరెవరు..?
- నేను పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్లో కలిపేయాలని దిగ్విజయ్ సింగ్ అన్నారు.. అదేమన్నా గంగానదా? దిగ్విజయ్ కు నేను ఎలా కనిపిస్తున్నాను..
- కేసీఆర్ సినిమావాళ్లను నమ్మొద్దన్నారు.. అసలు నేనేం చేస్తానో చెప్పనియ్యరాదే.. నువ్వను నేను పడతా..
- పార్టీ విధివిధానాలు చెప్పేముందు నన్ను క్షమాపణ చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కానీ, నన్ను అలా అడిగే హక్కు నీకు గానీ, నీ కుటుంబానికి గాను లేదు. నీకు నేను అన్నయ్యలాంటివాడిని.
- తెలంగాణ జాగృతి సంస్థకు సేకరించిన విరాళాలను ఎలా ఖర్చుపెట్టారు.. ఇప్పుటివరకూ ఎలా ఖర్చు పెట్టారు.. భవిష్యత్తులో ఎలా ఖర్చుపెట్టారో కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి...
- నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, కానీ సీమాంధ్ర ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం సహించను.
ఇక పవన్ ప్రసంగంలో మరికొన్ని ప్రధాన అంశాలు..
- దేవుడు లాంటి అన్నయ్యకు ఎదురొస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. కానీ ఢిల్లీ పెద్దలు చేసిన పనికి రావాల్సొచ్చింది..
- అన్నయ్య మీద నాకెప్పుడూ కోపం లేదు..
- ఆనాటి సీపీఎఫ్ (కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్) ఇవాళ జనసేన అయ్యింది.
- వెంకయ్య నాయుడంటే నాకెంతో అభిమానం. సీమాంధ్రకు న్యాయం చేయడానికి పార్లమెంట్ లో ఆయన చేసిన ప్రయత్నం ఎంతో ఉంది. కానీ, నేను పార్టీ పెడుతున్నానంటే, దేశానికి ఎంత దౌర్భాగ్యం పట్టిందన్నారు.. అసలు ఎంతో అనుభవజ్ఞులైన వెంకయ్యనాయుడు నా గురించి అలా ఎలా అంటారు..
- ఢిల్లీలో నేతలను కాల్మొక్తా బాంచన్ దొరంటూ ఇక్కడి నేతలు బానిసలుగా మారారు
- నా తెలంగాణకు క్షమాపణలు అడగడానికి మీరెవరు?
- నేనేం చేస్తానో చెప్పి రాజకీయాల్లోకి రావాలని కొంతమందన్నారు.. అలా అడగడానికి మీరెవరు..?
- నేను పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్లో కలిపేయాలని దిగ్విజయ్ సింగ్ అన్నారు.. అదేమన్నా గంగానదా? దిగ్విజయ్ కు నేను ఎలా కనిపిస్తున్నాను..
- కేసీఆర్ సినిమావాళ్లను నమ్మొద్దన్నారు.. అసలు నేనేం చేస్తానో చెప్పనియ్యరాదే.. నువ్వను నేను పడతా..
- పార్టీ విధివిధానాలు చెప్పేముందు నన్ను క్షమాపణ చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కానీ, నన్ను అలా అడిగే హక్కు నీకు గానీ, నీ కుటుంబానికి గాను లేదు. నీకు నేను అన్నయ్యలాంటివాడిని.
- తెలంగాణ జాగృతి సంస్థకు సేకరించిన విరాళాలను ఎలా ఖర్చుపెట్టారు.. ఇప్పుటివరకూ ఎలా ఖర్చు పెట్టారు.. భవిష్యత్తులో ఎలా ఖర్చుపెట్టారో కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి...
- నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, కానీ సీమాంధ్ర ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం సహించను.
ఇక పవన్ ప్రసంగంలో మరికొన్ని ప్రధాన అంశాలు..
- దేవుడు లాంటి అన్నయ్యకు ఎదురొస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. కానీ ఢిల్లీ పెద్దలు చేసిన పనికి రావాల్సొచ్చింది..
- అన్నయ్య మీద నాకెప్పుడూ కోపం లేదు..
- ఆనాటి సీపీఎఫ్ (కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్) ఇవాళ జనసేన అయ్యింది.
- వెంకయ్య నాయుడంటే నాకెంతో అభిమానం. సీమాంధ్రకు న్యాయం చేయడానికి పార్లమెంట్ లో ఆయన చేసిన ప్రయత్నం ఎంతో ఉంది. కానీ, నేను పార్టీ పెడుతున్నానంటే, దేశానికి ఎంత దౌర్భాగ్యం పట్టిందన్నారు.. అసలు ఎంతో అనుభవజ్ఞులైన వెంకయ్యనాయుడు నా గురించి అలా ఎలా అంటారు..
26, ఫిబ్రవరి 2014, బుధవారం
ఒకే వేదిక ఎక్కుతున్న చిరు, పవన్
Categories :
chiranjeevi . cinema . entertainment . nagababu . pawan kalyan . tollywood . varun tej
చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములైనా ఈ మధ్య కాలంలో ఒకే వేదికపై కనిపించిన సంఘటనలు లేనే లేవు. వీరిద్దరి మధ్యా విబేధాలున్నాయంటూ చాలాకాలంగా అభిమానుల్లోనూ, ఫిల్మ్ నగర్లోనూ వదంతులు షికార్లు చేస్తున్నాయి. మీరు తప్ప నాకెవ్వరూ లేరంటూ అభిమానులనుద్దేశించి ఓ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. వీరిద్దరినీ కలిసి చూడాలన్న అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరబోతోంది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినీ అరంగేట్ర కార్యక్రమం దీనికి వేదికవుతోంది. రేపు ఉదయం (27-2-14) రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమం జరగనుంది. నాగబాబు కోసం వీరిద్దరూ రావడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలోనైనా ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకుంటారో లేక.. ఎడమొహం పెడమొహంగా ఉంటారోనన్న ఉత్కంఠ ఫ్యాన్స్ ను వెంటాడుతోంది.
5, ఆగస్టు 2013, సోమవారం
పవన్ కళ్యాణ్ కాటమ రాయుడి అసలు కథ ఇది..
Categories :
attarintiki daredi . cinema . entertainment . katama rayuda song . pawan kalyan . tollywood . TOP
పవన్ కొత్త సాంగ్.. కాట్రమ రాయుడు.. నెట్ లో షికారు చేస్తోంది. పవర్ స్టార్ ఇరగదీశాడని ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. అయితే, ఇది అత్తారింటికి దారేదీ సినిమా కోసం రాసిన పాట కాదు. 1940లో వాహినీ వారి చిత్రం సుమంగళి లోనిది. కాటమ రాయుడా.. కదిరీ నరసింహుడా అంటూ, పాట సాగుతుంది. దీన్నే ఇప్పుడు పవన్ తో పాడించి, అత్తారింటికి దారేదీలో పెట్టారు. ఎంతో చక్కని జానపదాన్ని మరోసారి జనానికి గుర్తు చేయడం నిజంగా ఆనందించాల్సిన విషయం. అయితే, సినిమాలో ఈ పాట పూర్వాపరాలు చెప్పడం ఎలానూ సాధ్యం కాదు కాబట్టి, కనీసం నెట్ లో విడుదల చేసే ట్రయలర్స్, వీడియోల్లోనైనా ఆ విషయాన్ని చెబితే బాగుంటుందన్నది నా అభిప్రాయం. ఆ పాటకు, దాన్ని రాసిన రచయతకు, బాణీ కట్టిన సంగీత దర్శకుడికి, సినిమాలో పెట్టిన దర్శక నిర్మాతలకు గౌరవం ఇచ్చినట్లూ ఉంటుంది.
Read more...
21, జులై 2013, ఆదివారం
పవర్ స్టార్ ను దూరం చేసుకున్నారా..
Categories :
attarintiki daredi . audio release . chiranjeevi . entertainment . news . pawan kalyan . tollywood . TOP
నాకూ బాధలున్నాయి.. నాకెప్పుడూ మీరు అండగా ఉండాలి.. ఊహించని ఈ డైలాగ్ లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోటి వెంట నుంచి వచ్చాయి. ఆడియో ఫంక్షన్లలో మాట్లాడటానికి భయంతో కూడిన సిగ్గుతో ఇబ్బంది పడే పవన్.. అత్తారింటికి దారేదిలో మాత్రం కాస్త సుదీర్ఘ ప్రసంగమే చేశారు. మీరే నావాళ్లంటూ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన కుటుంబం నుంచి ఆయన తప్ప మరెవరూ రాకపోవడం, మెగా ఫ్యామిలీ ఈ ఫంక్షన్ కు పూర్తిగా దూరంగా ఉండడం, సినీ, రాజకీయ వర్గాల్లో కావల్సింత దుమారాన్ని లేపాయి. పీఆర్పీని కాంగ్రెస్ లో కలిపినప్పటి నుంచీ పవన్ కు , చిరంజీవికి పడడం లేదన్న వార్తలకు ఈ ఆడియో ఫంక్షన్ మరోసారి బలాన్ని చేకూర్చింది. పరిస్థితులు చూస్తుంటే, పవన్ ను మెగా ఫ్యామిలీ పూర్తిగా దూరం పెట్టినట్లే కనిపిస్తోంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)




