రాజకీయ పార్టీల అంచనాలకు అతీతంగా సీమాంధ్ర ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెల్లువలా తరలివచ్చారు. తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. అయితే, ఇంత భారీగా పోలింగ్ జరగడంతో, ఏ పార్టీకి విజయం దక్కుతుందన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలు విజయం తమదంటే తమదని చెబుతున్నా.. లోలోన మాత్రం కాస్త ఆందోళనగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఓటింగ్ సరళిని చూస్తుంటే, సీమాంధ్ర వైసీపీకే ఆధిక్యం దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
voters లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
voters లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
7, మే 2014, బుధవారం
భారీ ఓటింగ్‌తో ఛాన్స్ దక్కేదెవరికి?
Categories :
chandrababu . election . jagan . POLITICS . POLLING . seemandhra . tdp . voters . ysrcp
Read more...
సీమాంధ్రలో శివమెత్తిన ఓటర్లు
సీమాంధ్రలో ఓటర్లు శివమెత్తారు. కనీవినీ ఎరుగని రీతిలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కొన్ని జిల్లాలో ఎండలు, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు అడ్డంకులు సృష్టించినా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పారు సీమాంధ్ర ప్రజలు. మధ్యాహ్నం 3 గంటల సమయానికే సీమాంధ్రలో పోలింగ్ 63 శాతాన్ని దాటేసింది. సాయంత్రం 6 గంలకు పోలింగ్ ముగిసే సమయానికి ఇది 75 శాతం వరకూ చేరే సూచనలు కనిపిస్తున్నాయి. గుంటూరు, కడప జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య దాడులు మినహా మిగిలిన చోట్ల చాలావరకూ ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది.
30, ఏప్రిల్ 2014, బుధవారం
చిరూ.. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో..!
హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన చిరంజీవికి షాక్ ఇచ్చారు జూబ్లీహిల్స్ ఓటర్లు. కేంద్రమంత్రిననో, వీవీఐపీననో గానీ చిరంజీవి నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లిపోయారు. దీంతో , అప్పటికే అక్కడ క్యూలో ఉన్న ఓటర్లకు ఒళ్లుమండి ఆయన్ను వెనక్కు పిలిచారు. క్యూలో ఉండి ఓటేయాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక.. ఆయన క్యూలో నిలబడ్డారు.ఈ విషయం మీడియాలో జోరుగా ప్రసారం కావడంతో, ఓటేసిన అనంతరం వివరణ ఇచ్చారు చిరంజీవి. తన ఓటు ఉందో లేదో తెలుసుకుందామన్న ఉద్దేశంతోనే లోపలికి వెళ్లానే తప్ప, నిబంధనలను ఉల్లంఘించాలన్న ఉద్దేశం తనకు లేదన్నారాయన. గతంలో కర్నాటక ఎన్నికల్లోనూ బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడికీ ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)