ప్రపంచ కారు చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. ముడుచుకుపోయే అత్యద్భుతమైన కారును స్పెయిన్ కంపెనీ తయారు చేసింది. దీనిపేరు హిరికో. గతంలో ఎం.ఐ.టీ పేరుతో డిజైన్ అయిన ఈ కాన్సెప్ట్ కార్.. ఇప్పుడు హిరికో పేరుతో రోడ్డెక్కడానికి సిద్ధమవుతోంది. ఇందులో ఇద్దరు కూర్చునే వీలుంటుంది. విద్యుత్ ఆధారంగా పనిచేయడంతో పొల్యూషన్ కూడా విడుదల కాదు. పట్టణాల్లో తిరగడానికి అత్యంత అనువైన కార్ అని కంపెనీ చెబుతోంది. 2013 కల్లా యూరప్ లోని 24 నగరాల్లో వీటిని అమ్మడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగే ఈ కారును కావల్సినప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓ సాధారణ కారు పార్కింగ్కు పట్టే స్థలంలో మూడు హిరికో కార్లను ఉంచొచ్చు. వంద కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లగలిగే అవకాశం ఈ కారులో ఉంటుంది. మన కరెన్సీలో దీని ధర దాదాపు 8 లక్షలు.
Read more...
technology లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
technology లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
9, ఫిబ్రవరి 2012, గురువారం
మార్కెట్లోకి ముడుచుకుపోయే కారు
Categories :
folding car . hiriko . specail . technology . TOP . variety
రూ.5 వేలలోపు దొరికే అద్భుతమైన మొబైల్స్
Categories :
mobile . technology . TOP
ఇది మొబైల్ యుగం. లేటెస్ట్ మొబైల్ చేతిలో లేకపోతే వెనకపడినట్లే లెక్క. ఇన్ స్టంట్ మెసేజ్, ఫేస్ బుక్, ఇంటర్నెట్, మల్టీ పిక్సెల్ కెమెరా.. ఇలా అన్నీ సెల్ ఫోన్లో ఉండాల్సిందే. కానీ అన్ని ఫీచర్లూ కావాలంటే పదివేలకు పైనే చెల్లించాల్సిఉంటుంది. ఇది అందరికీ సాధ్యం కాదు. కానీ, రూ.5 వేలలోపే అద్భుతమైన ఫీచర్లున్న ఫోన్లు అందుబాటులో ఉంటే.. ఆశ్యర్యమే కదూ.. అలాంటి ఐదు ఫోన్లు మీ కోసం..
ఈ లిస్టులో అన్నింటికన్నా ముందున్నది Nokia C2-03 Touch and Type ఫోన్. దీని కాస్ట్ కేవలం 4,425 రూపాయలు మాత్రమే. ఈ టచ్ అండ్ టైప్ స్లైడర్ డివైజ్‌తో వావ్ అనిపిస్తోంది. 2.6 ఇంచస్ డిస్‌ప్లేతో ఇందులో డ్యూయల్ సిమ్, 2 మెగా పిక్సల్ కెమెరా, 32 జిబి మైక్రో ఎస్‌డి కార్డ్ ఫెసిలిటీ ఉంది. బ్యాటరీ బ్యాకప్ మినిమమ్ 2 డేస్ వరకు ఉంటుంది. దీనికున్న మరో విశిష్టత.. రెండో సిమ్ కార్డును పెట్టడానికి, తీయడానికి మొబైల్ ను స్విచ్ఛాఫ్ చేయాల్సిన అవసరం లేదు. సైడ్ న ఉన్న స్లాట్లో నేరుగా పెట్టుకోవచ్చు.
రెండో ఫోన్ మోటరోలా క్వార్ట్జ్ EX212. దీని కాస్ట్ కేవలం 4,599 రూపాయలు మాత్రమే. ఇందులో కూడా డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ ఉంది. 2మెగా పిక్సల్ కెమెరాతో పాటు విత్ వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. ఎఫ్‌ఎమ్, మ్యూజిక్ ప్లేయర్‌తో పాటు బెస్ట్ లుక్కింగ్ హ్యాండ్ సెట్ అవడంతో కస్టమర్స్ దీనిపై మనసుపారేసుకుంటున్నారు. గతంలో మోటరోలా రిలీజ్ చేసిన రేజర్ మోడల్లోనే కనిపించే ఈ ఫోన్ ధర విషయంలో మాత్రం అందరికీ అందుబాటులో ఉంది.
లో కాస్ట్ మొబైల్స్ తయారీపై దృష్టి పెట్టిన నోకియా.. ఆశ పేరుతో ఓ కొత్త సిరీస్ ను తీసుకొస్తోంది. అందులో మొదటిది Nokia Asha 200. దీని ధర కేవలం 4వేల 370. 2.4 అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్, వెల్ స్పేస్డ్ కీపాడ్, 2మెగా పిక్సల్ కెమెరా, 1430 mAh battery కెపాసిటీ ఉండటంతో ఒక్కసారి రీచార్జ్ చేస్తే మినిమమ్ 3 డేస్ వరకు ఉంటుంది. 32 GB micro SD cardతో చూడగానే అందరినీ ఆకర్షిస్తోంది.
ఇక మా ఎంపికలో నాలుగో ఫోన్.. Samsung Chat C3222, క్వర్టీ కీ ప్యాడ్, 2.2 అంగుళాల స్క్రీన్, 1.3 మెగాపిక్సెల్ కెమెరా దీని ప్రత్యేకత. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే, 12 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇందులో ఉన్న మ్యూజిక్ ప్లేయర్ త్రీడీ సౌండ్ సిస్టంను అందిస్తుంది. దీని ధర రూ.3850.
టాప్ -5 లిస్టులో చివరిది Karbonn K1616 Magic. దీని ధర రూ.4829. అతిపెద్ద డిస్ ప్లే స్క్రీన్ దీని ప్రత్యేకత. మెటాలిక్ బ్యాటరీ కవర్, హై సెన్సిటివీ టచ్ స్క్రీన్తో ఇది తయారయ్యింది. అంతేకాదు.. SMS, నోట్స్ ను కట్, కాపీ, పేస్ట్ చేసుకునే సౌలభ్యాన్ని అందించే ఫోన్ కూడా ఇదే.
మరి వీటిలో మీ ఛాయిస్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. తక్కువ ధరలోనే అన్ని ఫీచర్లనూ పొందండి.
Read more...
19, జులై 2011, మంగళవారం
ఆ కోటు వేసుకుంటే ఏసీలో ఉన్నట్లే..!
Categories :
news . technology . TOP

ఏసీలో ఉండడం అలవాటైన వారికి బయటకు వెళ్లాలన్నా, నాన్-ఏసీలో ఉండాలన్నా చాలా కష్టం. పైగా, ఎండలు మండిపోతున్న సమయంలో ఎక్కడికైనా వెళ్లాలంటే.. ఉక్కపోతకు చచ్చిపోవాల్సిందే. అందుకే, ఈ సమస్యకు ఓ బ్రహ్మాండమైన పరిష్కారాన్ని కనిపెట్టారు జపాన్ పరిశోధకులు. ఏసీని మోసుకెళ్లడం కష్టం కాబట్టి... ఏసీ కోటునే తయారు చేసేశారు. ఈ కోటు వేసుకుంటే, మనం ఏసీలో ఉన్నట్లే ఉంటుంది. ఈ కోటు కిందిభాగంలో ఓ ప్రత్యేక ఫ్యాన్ ఉంటుంది. ఇది ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటుంది. కోటు ఏసీ అని చిన్నచూపు చూడకండి, సెకనకు ఇది 20 లీటర్ల గాలిని కోటులో ప్రవహింపచేస్తుంది. కాలర్ దగ్గర, చేతుల దగ్గర గాలి బయటకు వెళ్లిపోవడానికి ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. ఈ అద్భుతమైన కోటును జపానుకు చెందిన కుచోఫుకు అనే కంపెనీ తయారు చేసింది. దీని ధర 11 వేల జపాన్ యెన్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే కేవలం 5500 రూపాయలు మాత్రమే. మామూలు కోట్లే నాలుగైదు వేలు ఉన్నప్పుడు, ఈ ఏసీ కోటు ధర ఆమాత్రం ఉండడంలో తప్పేమీ లేదనుకుంటా.. ఈ వేసవి నాటికి మనకూ ఇవి అందుబాటులోకి వస్తే చాలా బాగుంటుంది కదూ...!
29, జూన్ 2011, బుధవారం
అంతరిక్షంలోకి వెళుతున్న కోతిగారు
Categories :
news . technology . TOP

ఓ కోతి దశ తిరిగింది. కాదు కాదు.. కష్టం వచ్చింది. ఏమనుకున్నా సరే.. భూకక్ష్యను దాటుకొని విశ్వంలోకి వెళ్లి జీవుల జాబితాలో ఓ కోతి చేరబోతోంది.
కొన్నేళ్లుగా అంతరిక్ష పరిశోధనలను భారీగా చేస్తున్న ఇరాన్, ఆగస్టులో కోతిని అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. కావోస్గర్ -5 అనే రాకెట్లో ఈ కోతిని పంపిస్తారు. భూమికి 125 కిలోమీటర్ల ఎత్తువరకూ ఈ రాకెట్ వెళుతుంది. మనుషులను పంపడానికి ముందుగా కోతిని పంపించి తన అంతరిక్ష పరిశోధనా శక్తి సామర్థ్యాలను పరీక్షించుకొంటోంది ఇరాన్. ఇరాన్ పరీక్షలు విజయవంతం కావాలని... అలాగే కోతి కూడా క్షేమంగా భూమికి తిరిగిరావాలని కోరుకుందాం.
ఫేస్ బుక్ బోర్ కొట్టిందా? గూగుల్ ప్లస్ ట్రై చేయండి
Categories :

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ హవాను చూసిన ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్.. తన పోటీ సర్వీసును ప్రారంభించింది. ఆర్కుట్ సర్వీస్ ను గూగుల్ నిర్వహిస్తున్నా, ఫేస్ బుక్ కు అది ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. అందుకే... గూగుల్ ప్లస్ పేరుతో కొత్త సైట్ ను లాంఛ్ చేసింది. ఎవరికీ పోటీ కాదని గూగుల్ చెబుతున్నా.. సైట్ ను చూస్తే మాత్రం ఫేస్ బుక్ కు పోటీనే అంటున్నారు కంప్యూటర్ నిపుణులు. పైగా ఫేస్ బుక్ లో లేని సరికొత్త ఫీచర్లనూ ఇందులో పొందుపరిచారు. పైగా, ఒకేసారి ఎంతమందితోనైనా వీడియో ఛాట్ చేసుకోవచ్చు. ప్లస్ ప్రాజెక్ట్ తో సోషల్ నెట్ వర్కింగ్ లోనూ అగ్రస్థానాన్ని అందుకోవాలనుకొంటోంది గూగుల్. ప్రస్తుతానికి అందరికీ దీన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు. సైట్ టెస్టింగ్ దశలోనే ఉండడంతో, కొంతమందికి మాత్రమే దీన్ని పరిమితం చేసింది. ముందుగా రిజిస్టర్ చేసుకుంటే, గూగుల్ పరిశీలించి సభ్యత్వాన్ని ఇస్తుందన్నమాట. కావాలంటే మీరూ ఓ సారి దాన్ని చూడొచ్చు. సైట్ అడ్రస్ https://plus.google.com/
4, మార్చి 2011, శుక్రవారం
మల్లెపువ్వంటే భయపడుతున్న చైనా
Categories :

ప్రపంచంలోనే మహాశక్తి చైనా. ఆర్థికంగా, సైనికంగా అన్నిదేశాల్లోకి బలమైన దేశంగా ఎదిగింది చైనా. చెప్పాలంటే.. ప్రపంచ పోలీస్ అమెరికాను ఎదిరించి నిలువగల శక్తి ఒక్క చైనాకు మాత్రమే ఉంది. కానీ.. ఈ కమ్యూనిస్ట్ రాజ్యం కూడా ఇప్పుడు ఓ దానికి భయపడుతోంది. తమ ప్రభుత్వానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని కలవరపడుతోంది.. అదే మల్లెపువ్వు.. అసలీ మల్లెపువ్వు ఏమిటి..? దానివెనుకున్న స్టోరీ ఏమిటి?
అరుణదేశం భయపడుతోంది... నిజమే.. మంచుకురుస్తున్న కాలంలోనూ చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. బలీయమైన సైనికశక్తి .. అమేయమైన సాయుధ సంపత్తి ఉన్నప్పటికీ, వచ్చి పడేముప్పును ఎలా ఎదుర్కోవాలో.. చైనా ప్రభుత్వానికి అర్థం కావడం లేదు.. ఇంతకాలం సాగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏకచక్రాధిపత్యానికి గండిపడేలా ఉంది. చైనాకు ఇన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది.. అగ్రరాజ్యం అమెరికా కాదు. చైనాలోని కొన్ని ప్రావిన్స్‌లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న ఛాందసవాదులూ కాదు. పోనీ.. ఐటీ, ఇతర రంగాల్లో పోటీ ఇస్తున్న మనదేశమూ కాదు.. మరి.. చైనాను భయపెడుతోంది ఎవరు..? చైనాకు ముచ్చెమటలు పోయిస్తోంది ఎవరు..?
చైనా భయానికి కారణం.. మనుషులూ కాదు... దేశాలు కాదు.. జీవం లేని ఇంటర్నెట్. అవును, ఆ ఇంటర్నెట్టే ఇప్పుడు చైనా సర్కార్‌కు ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టబోతోంది. చైనా ప్రభుత్వాన్ని కంగారు పెడుతోంది. జనంపై ఆంక్షలు విధించేలా చేస్తోంది.. ముఖ్యంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను తలుచుకుంటేనే చైనా పాలకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు.. ఎక్కడ ఊతమిస్తాయో అన్నభయం చైనాది. పైగా, నెట్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశం.. చైనాలో చాలా పట్టణాల్లో జనాన్ని రోడ్లపైకి తెచ్చింది. వారి చేతుల్లో గన్నులు లేవు.. రాడ్స్ లేవు.. కనీసం కర్రలు కూడా లేవు. వారి చేతుల్లో ఉన్నదల్లా ఓ మొక్కమాత్రమే. అదీ మల్లె మొక్క. సువాసనలు వెదజల్లే ఆ మల్లె.. చైనా ప్రభుత్వానికి మాత్రం తలనొప్పిని తెచ్చింది.
ఇంటర్నెట్‌లో ఎవరో ఇచ్చిన పిలుపు... వేలాది మందిని కదిలించింది. ప్రభుత్వ నిర్భంధం ఎక్కువగా ఉన్నప్పటికీ నిరసనలకు దిగేలా చేసింది. ఉద్యమం బాట పట్టిన వారందరినీ పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి మరీ జైళ్లలో పడేశారు. మల్లెమొక్క పట్టుకున్నా.. మల్లెమొగ్గలతో కనిపించినా అరెస్ట్ చేసి పడేస్తున్నారు.
ప్రతీ చోటా చైనా ప్రభుత్వం నిఘాను పెంచేసింది. ఇంటర్నెట్ వాడుతున్నవారిని నిశితంగా గమనిస్తోంది..? ఏమాత్రం అనుమానం వచ్చినా అరెస్ట్ చేస్తోంది. మల్లెపూలను, మల్లెమొక్కలనూ కనిపించకుండా చేస్తోంది.. ఈ ఇంటర్నెట్‌కు.. మల్లెపూలకు.. చైనా ప్రభుత్వానికి మధ్య సాగుతున్న వ్యవహారం ఏమిటి? చైనా ప్రభుత్వం ఇంతగా ఎందుకు భయపడుతోంది... ? అసలు అంతగా భయపడాల్సిన అవసరం ఉందా..?
మల్లెపువ్వు ముప్పు
మల్లెపూవు ముప్పు నుంచి తప్పించుకోవడానికి చైనా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఈ మల్లెపూవు గురించి చైనా ఇంతగా భయపడడానికి కారణం.. అరబ్ దేశాల్లో వెల్లువెత్తిన విప్లవమే. టునీషియాలో మొదలై.. ఇతర దేశాలకు పాకిన ఈ విప్లవానికి పెట్టిన పేరే.. జాస్మిన్ రెవల్యూషన్. అది చైనాకు కూడా ఎక్కడ వ్యాపిస్తుందో అన్నది అక్కడి పాలకుల భయం. అందుకే.. దాన్ని మొగ్గలోనే తుడిమేయాలనుకుంటున్నారు. ఆందోళన చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
జాస్మిన్ రెవల్యూషన్ అన్న పేరే చైనీయులకు వినపించకుండా చేస్తోంది హ్యూజింటావో ప్రభుత్వం. ఇంటర్నెట్‌పై నియంత్రణను మరింత కట్టుదిట్టం చేసింది. జాస్మిన్ రెవల్యూషన్ అని సెర్చ్ చేస్తే ఒక్క రిజల్ట్ కూడా రాకుండా చేసింది. దీంతో పాటు విప్లవం చెలరేగిన ట్యునీషియా, ఈజిప్ట్ లాంటి పదాలతో సెర్చ్ చేసినా, రిజల్ట్స్‌ను చూపించకుండా సెన్సార్ చేస్తోంది. ఇక తిరుగుబాటుకు సిద్ధం కమ్మంటూ చైనీయులకు పిలుపిచ్చిన బోక్సన్ న్యూస్ సైట్‌ను కూడా బ్లాక్ చేసింది. చైనాలో ప్రజాపోరాటం గురించి ముందుగా ప్రపంచానికి ఈ సైటే ఫోటోలను అందించింది. దీన్ని బ్లాక్ చేసి ఎవరికీ సమాచారం అందకుండా చేసింది చైనా ప్రభుత్వం.
మోస్ట్ పాపులర్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ ఫేస్‌బుక్, ట్విట్టర్, వీడియో షేరింగ్ సైట్ యూట్యూబ్‌ను చైనా వాసులకు ఇప్పటికే అందుబాటులో లేకుండా చేశారు కమ్యూనిస్ట్ పాలకులు. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న లింక్‌డ్‌ఇన్ సర్వీస్‌నూ ఎత్తేసింది. ఇందులో జాస్మిన్ వాయిస్ అంటూ ఓ గ్రూప్ ప్రారంభం కావడమే కారణం. ఇక రెవల్యూషన్‌కు రెడీ కమ్మంటూ పోస్ట్ చేస్తున్న వారిపైనా కొరడా ఝలిపిస్తోంది.
ఆన్‌లైన్‌లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను ఎదుర్కోవడానికి ఆన్‌లైన్ అస్త్రాన్నే ప్రయోగించారు చైనా పాలకులు. ఒకవేళ చైనాలో ఉద్యమం జరిగితే, అది నెటిజన్ల నుంచే మొదలుకావచ్చని భావిస్తున్న సర్కార్, వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే చైనా ప్రధాని వెన్ జియబావో ఆన్‌లైన్‌లో చాట్ చేశారు. చైనా న్యూస్ ఏజెన్సీ నిర్వహించిన ఆన్‌లైన్ ఫోరంలో రెండుగంటల పాటు పాల్గొన్నారు. దాదాపు ఆరువేల ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తే.. వాటిలోనుంచి 20 ప్రశ్నలను మాత్రం ఎన్నుకొని సమాధానం చెప్పారు. నిత్యావసర ధరల నియంత్రణ, రియల్‌ఎస్టేట్ ధరలకు కళ్లెం వేయడం... ఉద్యోగావకాశాలను మెరుగు పరచడం వంటి అంశాలకే జియబావో పరిమితమయ్యారు. మార్చి 5నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. అయితే.. విప్లవం, తిరుగుబాట్లు, అరబ్‌దేశాల్లో ఉద్యమాలపై మాత్రం ఆయన స్పందించలేదు. వీలైనంతవరకూ ప్రభుత్వం ప్రజలకు మేలైన పాలన అందిస్తుందన్న సంకేతాలనే అందించడానికి జియబావో ప్రయత్నించారు.
ప్రభుత్వ విధానాలపైనా, ప్రభుత్వ పథకాలపైనా ఏమైనా అనుమానాలున్నా, ఫిర్యాదులున్నా చెప్పడానికి ప్రత్యేకంగా ఓ ఆన్‌లైన్ ఫోరంను కూడా ఏర్పాటు చేస్తామని చైనా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రజా సమస్యలపై ఎప్పుడూ ఇంతలా చైనా ప్రభుత్వం ప్రవర్తించలేదు. ఎవరైనా ఆందోళన చేస్తే వారిని అణిచివేయాలనే చూసిందే తప్ప.. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించలేదు. కానీ.. E-ఉద్యమం దెబ్బకు కరడుగట్టిన చైనా పాలకులకూ మనసుమార్చుకోక తప్పలేదు. మొత్తానికి ఆన్‌లైన్ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఆన్‌లైన్ ట్రీట్‌మెంట్‌నే ఎంచుకుంది చైనా సర్కార్.
చైనాకు భయమెందుకు?
ఎంత పెద్ద పామైనా... చలిచీమల చేతిలో చావాల్సిందే. అరబ్ దేశాల్లో జరుగుతున్నది ఇదే. అధికారం గుప్పిట పెట్టుకుని, సైన్యం అండతో నిరంకుశాన్ని, రాజరికాన్ని కలగలపి దశాబ్దాలుగా దేశాలను ఏలుతున్న నియంతలకు అంతిమగడియలు వచ్చేశాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో అధికారపీఠాలు కూలిపోయాయి. టునీషియా అధ్యక్షుడు విదేశాలకు పారిపోతే, ఈజిప్ట్ అధ్యక్షుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక లిబియాలో నాలుగుదశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్న గడాఫీకి అంతిమ గడియలు సమీపించాయి. జనోద్యమం దాటికి కరడుగట్టిన నియంతలు తలవంచక తప్పడం లేదు.
దశాబ్దాలుగా నియంతృత్వాన్ని అనుభవిస్తున్నా, ప్రజా హక్కులను పాలకులు కాలరాసినా నోరుమెదపని అరబ్ దేశాల ప్రజల్లో ఇంత చైతన్యం ఎలా వచ్చింది.? బతికుంటే చాలనుకుని జీవితాలను వెళ్లదీస్తున్నవారికి.. నియంతలనే ఎదిరించే సాహసం ఎక్కడినుంచి వచ్చింది.? తమను ఇంతకాలం పట్టిపీడించిన చీడపురుగులను తరిమికొట్టాలన్న తలంపు ఎలా కలిగింది..? దీనికంతటికీ కారణం.. ఇంటర్నెట్. అరబ్ దేశాల్లో వెల్లువెత్తిన విప్లవానికి కారణం ఇంటర్నెట్. ఎంతో విలువైన టైంను హరించివేస్తున్నాయని అపనిందమోస్తున్న సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లే... నియంతల కాళ్లకింద నలుగుతున్న ప్రజలకు ఊపిరి అందించాయి. నియంతృత్వపు సంకెళ్లను తెంపి.. స్వేచ్ఛావాయువులను పీల్చేలా చేశాయి. ఓ ఫేస్‌బుక్.. మరో ట్విట్టర్.. ఇంకో యూట్యూబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. జాస్మిన్ రివెల్యూషన్‌కు ప్రతీ నెట్‌వర్కింగ్ సైట్ ఎంతో కొంత సాయం చేసింది.
ఇది ఒక్కరోజులో చోటుచేసుకున్న సంఘటన కాదు. ఇంతటి ఉద్యమానికి కారణం డిసెంబర్ 17న టునీషియాలో జరిగిన సంఘటన. వీధుల్లో పళ్లమ్ముకుంటూ జీవించే, మహమ్మద్ బౌజిజి అనే 26 ఏళ్ల యువకుడిని మున్సిపల్ మహిళా అధికారి తీవ్రంగా దూషించింది. మొహంపై ఉమ్మేసింది. ఫైన్ కడతానన్నా ఊరుకోకుండా అవమానించింది. దీన్ని తట్టుకోలేక.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు బౌజిజి. ఈ విషయం వెంటనే ఆన్‌లైన్‌లోకి చేరిపోయింది. ట్విట్టర్‌లో ట్వీట్స్ మొదలయ్యాయి. సిద్దిబుజిది అనే ట్యాగ్‌తో ఇవి దర్శనమిచ్చాయి. అధికారుల దౌర్జనాన్ని ఈ ట్వీట్స్ ఎండగట్టాయి.
వందలాది ఫోటోలు, వీడియోలు.. ఆందోళనలకు సంబంధించిన దృశ్యాలు.. పోలీసుల ఫైరింగ్.. ఒక్కటేమిటి టునీషియాలో ఏమి జరిగినా.. నెట్‌లోకి ఎక్కేసింది. ప్రతీ చిన్న విషయం నెట్ ద్వారా అందరికీ చేరిపోయింది. ప్రపంచం నలుమూలల నుంచి వీటిని చూస్తున్న వారు.. ఆందోళనకారులకు మద్దతుగా ట్వీట్స్, మెసేజెస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రపంచ మీడియా కూడా టునీషియా పరిణామాలను తెలుసుకోవడానికి.. పూర్తిగా సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్స్‌పైనే ఆధారపడిందంటే.. ఇవి ఎంత క్రియాశీల పాత్ర పోషించాయో అర్థం చేసుకోవచ్చు.
టునీషియా ప్రభుత్వం ఈ సమయంలో చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేయడం మొదలుపెట్టింది. దీంతో... అనానిమస్ పేరుతో ఆందోళనకారులు ట్వీట్స్‌ను మొదలుపెట్టారు. అంతేకాదు.. ఆపరేషన్ టునీషియా పేరుతో వీరు తిరుగుబాటు మొదలుపెట్టారు. ప్రెసిడెంట్, మినిస్టర్స్, స్టాక్ మార్కెట్ వెబ్‌సైట్స్‌ను స్తంభింపచేశారు. సైబర్‌వార్ సర్వైవల్ గైడ్‌ను అందిరికీ అందుబాటులోకి తెచ్చారు. ఉద్యమం ఎలా చేయాలో సలహాలను నెట్‌లో పెట్టారు. వీటిని అడ్డుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. చివరకు విజయం విప్లవకారులను వరించింది. టునీషియాలో ప్రజాప్రభుత్వానికి మార్గం సుగమమయ్యింది. అప్పటివరకూ అధికారాన్ని అనుభవించిన బెన్ అలీ దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది.
టునీషియా విప్లవ ఫలితం ఈజిప్ట్ వాసులను మేల్కొలిపింది. ఇతర అరబ్ దేశాలకు స్పూర్తిగా నిలిచింది. ఈజిప్ట్‌లో ముబారక్ పాలనను నిరసిస్తూ ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో కామెంట్లు మొదలయ్యాయి. ఈజిప్ట్‌లోనూ తిరుగుబాటు చేయాల్సిందేనంటూ పిలుపు మొదల్యయింది. జనవరి 25న ఈజిప్ట్‌లో పోరాటం మొదలయ్యింది. శాంతియుతంగా చేసిన ధర్నాపై పోలీసుల అరాచకత్వాన్ని ఇంటర్నెట్ ప్రపంచం మొత్తానికి చూపించింది. వీడియోలు నెట్‌లోకి ఎక్కాయి. కామెంట్లు వెబ్‌సైట్లలో కనిపించాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్ సహా సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్స్ అన్నింటిపైనా ముబారక్ నిషేధం విధించాడు. కానీ, అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.
పోరాటానికే సిద్దమైన వారు.. ట్విట్టర్‌ను యాక్సెస్ చేయడానికి మారుమార్గాలను వెతికి ప్టటుకున్నారు. ప్రోక్సీలను సంపాదించి.. వాటి ద్వారా ట్విట్టర్‌ను యాక్సెస్ చేశారు. ట్వీట్స్‌ను పంపించారు. తెలియనివారికోసం లింకులనూ నెట్‌లో ఉంచారు. దీంతో, సైట్‌లను బ్యాన్‌చేసినా, సందేశాలు మాత్రం జనంలోకి వెళ్లిపోయాయి..
ఈజిప్ట్‌లోనూ ప్రజాతిరుగుబాటుకు నియంత తలవంచక తప్పలేదు. రాజీనామా చేసేదే లేదంటూ భీష్మించిన ముబారక్ ఫిబ్రవరి 11న పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మిలటరీ అధికారాన్ని అందుకొంది. త్వరలోనే అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు లిబియాలోనూ ఇదే పరిస్థితి. పోలీసుల అరాచకాలు.. దాడులు, గడాఫీ సైన్యం చేస్తున్న దురాగతాలు యూట్యూబ్‌కు ఎక్కుతున్నాయి. ఎంతోమందిలో ఉద్యమకాంక్షను రగిలిస్తున్నాయి. అక్కడా ప్రభుత్వ అనుకూల వ్యతిరేక సేనల మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతోంది.
లిబియాలోనూ త్వరలోనే నియంత పాలనకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో ఇంత విప్లవం వచ్చిందంటే దానికి ఓ రకంగా కారణం సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లే. ఈ సైట్లే లేకపోతే, సమాచారం ఎక్కువమందికి తెలిసి ఉండేది కాదు. కొంతమంది పోరాటం చేస్తే.. వారిని అణగదొక్కడం నిరంకుశ ప్రభుత్వాలకు సులువయ్యేది. కానీ,లక్షలాది మందిని ఒక్కతాటిపైకి తెచ్చి, ప్రజా వ్యతిరేక పాలన అంతమయ్యేలా చూశాయి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్.
చైనాలో ఉద్యమం తప్పదా?
ఏక పార్టీ స్వామ్యం... జాతీయ స్థాయిలో చైనా రాజకీయ విధానం. అధికారం ఎప్పుడూ ఒక పార్టీదే. లీడర్లు మారతారు తప్ప పార్టీ మారదు. పార్టీ సిద్ధాంతమూ మారదు. ఓ రకంగా చైనా అభివృద్ధికి, ప్రపంచ శక్తిగా ఎదగడానికీ ఇదే కారణం. కానీ, ఇదే సమయంలో దేశంలో నిరంకుశత్వం పెరగడానికి, మానవహక్కులు హరించుకుపోవడానికీ ఈ విధానమే కారణం.
చైనా పద్దతి మారాలని, రాజకీయ విధానం మార్చుకోవాలని ప్రపంచ దేశాలు ఎప్పటినుంచో ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. కానీ, వేటినీ చైనా లెక్కచేయడం లేదు. పైగా, రోజురోజుకూ శక్తిని పెంచుకుంటూ అగ్రరాజ్యంగా ఎదుగుతోంది. ఇక చైనాలోనూ ప్రభుత్వ పాలసీలను తీవ్రంగా వ్యతిరేకించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ, వీరందరూ కలిసికట్టుగా ఉద్యమం చేసే అవకాశాలు ఇంతవరకూ లేవు. కొన్ని సంఘటనలు జరిగినా, వాటిని తన బలంతో అణగదొక్కేయగలిగింది చైనా ప్రభుత్వం. పైగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా చిన్న ఆందోళన జరిగినా తీవ్రంగానే స్పందింస్తోంది.
పాశ్చాత్యదేశాల ఆలోచనల ప్రభావం చైనా వాసులపైన పడకుండానే చాలా జాగ్రత్తలు తీసుకొంది చైనా సర్కార్. ముఖ్యంగా మీడియాను పూర్తిగా తన కంట్రోల్‌లో ఉంచుకుంది. సమాచారాన్ని క్షణాల్లో విశ్వవ్యాపింతం చేసే ఇంటర్నెట్‌ను కూడా తన నియంత్రణలో పెట్టుకుంది. చైనా ప్రభుత్వానికి అనుకూల సమాచారం ఇచ్చే వెబ్‌సైట్లు తప్ప, వ్యతిరేక సమాచారం ఇచ్చే సైట్లు చైనాలో ఓపెన్ కావు. అందుకే.. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సైట్లను చైనీయులకు దూరం చేసింది.
ఇప్పుడు అరబ్ దేశాల్లో వెల్లువెత్తిన విప్లవానికి సంబంధించిన సమాచారం కూడా పూర్తిగా చైనా వాసులకు తెలియదు. దానిగురించి ఇంటర్నెట్‌లో తెలుసుకునే మార్గం కూడా లేదు. అంతేకాదు.. విప్లవానికి సిద్ధం కమ్మని ఓ సైట్‌లో సమాచారం వచ్చిన వెంటనే... పోలీసు బలగాలను వీధుల్లో మోహరించింది. అరబ్ దేశాలతో పోల్చితే, ఇలా ఆన్‌లైన్ పిలుపునకు స్పందించినవారు తక్కువ మందే. అలా వచ్చినవారినీ ప్రభుత్వం అరెస్ట్ చేసేసింది. ఇక ఉద్యమానికి రెచ్చగొట్టే మెసేజ్‌లను ఇంటర్నెట్‌లో పెట్టిన వారికోసం గాలిస్తోంది. వీలైనంతవరకూ అరబ్ దేశాల్లో వెల్లువెత్తిన విప్లవం చైనాలో రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఇప్పటికే చేసేసింది.
చైనా జనాభాలో ఇప్పుడు యువతరం శాతం పెరుగుతోంది. వీరిలో చాలామంది ఇంటర్నెట్ సేవీస్. పైగా ప్రజాస్వామ్య విలువలను కోరుకొనే వారి సంఖ్య క్రమంగా ఎక్కువవుతోంది. నియంతృత్వ పాలనకు బదులు.. ప్రజాహక్కులు కావాలన్న డిమాండ్ క్రమంగా విస్తరిస్తోంది. వీరివల్ల ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉంది. కానీ, సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్స్ అందుబాటులో లేకపోవడం, టెక్నాలజీపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉండడం వల్ల, సంఘటితం అయ్యే అవకాశం మాత్రం కనిపించడం లేదు.
అరబ్ దేశాల పరిస్థితికి చైనా పరిస్థితికి ఎంతో తేడా ఉంది. అరబ్ దేశాల్లో అవినీతి, అక్రమాలు భారీగా సాగుతున్నాయి. ప్రజల జీవన సామర్థ్యం రోజురోజుకూ తగ్గిపోతోంది. దీనికి వ్యతిరేకంగానే ప్రజాగ్రహం పెల్లుబుకింది. కానీ, చైనాలో పరిస్థితి వేరు. అన్నిదేశాల్లో ఉన్నట్లే సమస్యలు ఉన్నప్పటికీ, అరబ్ దేశాలంత దారుణమైన స్థితిగతులు లేవు. చైనాలో విప్లవం వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అరబ్ దేశాల్లో ఉద్యమకారుల వైపు సైన్యం నిలబడడమూ.. నియంతృత్వపాలనకు తెరపడడానికి కారణంగా కనిపిస్తుంది. కానీ, చైనాలో మాత్రం సైన్యం ప్రభుత్వ పక్షమే ఉంటుంది. ఆందోళనకు దిగినవారిని పూర్తిగా అణిచివేసే శక్తి చైనా ప్రభుత్వానికి ఉంది. పైగా, దీనికి సంబంధించిన చిన్నవార్తను కూడా బయటకు రాకుండా చేయగలదు. ప్రభుత్వం శక్తేమిటో తెలుసు కాబట్టి, చైనీయులు అంత సాహాసానికి ఒడిగట్టకపోవచ్చు.
కాకపోతే, ఇప్పుడున్నట్లే కొనసాగితే, భవిష్యత్తులోనైనా ముప్పు రాక తప్పదన్నది చైనా పాలకుల అభిప్రాయం. పైగా, ఇటీవలికాలంలో ధరలు పెరగడం, ఉద్యోగాలు లేకపోవడం వల్ల యువతరం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. వీరిలో అసంతృప్తి పెచ్చుమీరితే అది తిరుగుబాటుకు బీజం వేసే అవకాశాలున్నాయి. అందుకే, వీరిని ప్రసన్నం చేసుకోవడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇవి ఎంతవరకూ విజయం సాధిస్తాయన్నదానిపైనే.. చైనాలో విప్లవం వస్తుందా రాదా అన్నది ఆధారపడి ఉంటుంది. మరి మనదేశంలో ఇలాంటి పరిస్థితి వస్తుందా? అన్నది నెటిజన్లే తేల్చాలి.
30, నవంబర్ 2010, మంగళవారం
మిరపబాంబు
Categories :

మిరపకాయతో ఏం చేయొచ్చు...? ఇదీ ఓ ప్రశ్నేనా అనుకుంటున్నారా...? అయినా.. చెప్పాలంటే.. వంటల్లో వాడొచ్చు... బజ్జీలు చేయొచ్చు... కానీ అదే మిరపకాయతో... శతృవుల గుండెలు దడదడలాడించొచ్చు.... ఉగ్రవాదులను తరిమి తరిమి కొట్టొచ్చు... దేశాన్ని కాపాడొచ్చు... అంతటి అరివీర భయంకరమైన మిరపకాయ ఎక్కడుందో తెలుసా...?
మిరపకాయ ఘాటు... అంటే మనకు గుర్తుకువచ్చేది..గుంటూరు మిర్చి... ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే చాలు... .కళ్ల నంచి నీళ్లు ధారలు కడతాయి. మనకు తెలిసింది ఇంతే...కాని ప్రపంచంలోనే అతి ఘాటైన మిరపకాయ ఒకటి ఉందని మీకు తెలుసా..? అదేదో ఖండాంతరాలలో ఉందనుకోకండి. ఆ భయంకరమైన మిరపకాయ పెరిగేది మనదేశంలోనే. ఉప్పుడదే మిరపకాయ... మన సైన్యానికి ఆయుధంగా మారబోతోంది.
మిరపకాయ... సైన్యం... జోక్ కాదు.. నిఖార్సైన నిజం... అదే భుట్ జొలాకియా... ది గ్రేట్ అస్సాం మిర్చి... భుట్ జొలాకియా పవరేంటో మీకు తెలుసా....? అత్యంత ఘాటైన మిరపకాయ ఇది.
ఇంతకీ ఏ మిరపకాయ ఘాటు ఎంతో ఎలా తెలుసుకోవాలి...? అదేనా మీ డౌట్... మిర్చీ ఘాటుకు కప్సీన్ అనే రసాయనమే కారణం... దీన్ని స్కొవిల్లీ యూనిట్స్‌లో కొలుస్తారు... ఒక సాధారణ మిర్చి 2500 స్కొవిల్లీ యూనిట్స్ ఉంటే... వరల్డ్స్ హాటెస్ట్ మిర్చి భుట్ జొలాకియా... ఎన్ని స్కొవిల్లీ యూనిట్సో తెలుసా... మనం తినే మిర్చికి 4వేల రెట్లు ఎక్కువ... అంటే పదిలక్షల స్కొవిల్లీ యూనిట్స్. అసోం, నాగాలండ్, మణిపూర్‌లో పండే ఈమిర్చి ప్రపంచలోనే హాటెస్ట్ మిర్చి.
ప్రపంచంలో నోటిని భగ్గుమనిపించే మిర్చీ వెరైటీలు చాలానే ఉన్నాయి... టబస్కో సాస్ అనే రకంలో స్కొవిల్లీ హీట్ యూనిట్ రేంజ్ 2600 నుంచి 5వేలు ఉంటుంది.ఇక జలపెనోలో ఈరేంజ్ 9వేలకు ఉంటుంది. థాయ్ HOTలో SHU అరవై వేల ఉంటుంది.మెక్సికోలో పండే రెడ్ సావినాలో ఘాటు ఐదు లక్షల 80 వేల స్కొవీల్లే యూనిట్లు ఉంటుంది. కాని అస్సోంలో పండే భుట్ జొలోకియాలో ఏకంగా SHU పది లక్షల 41 వేల 427 ఉంటుంది. ఈఘాటుపైనే చాలాకాలంగా డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ DRDO పరిశోధనలు చేసింది. తీవ్రవాదులు,శత్రువులను ఎదుర్కోవడానికి కొత్త కొత్త టెక్నాలజీతో అత్యాధునిక ఆయుదాలను రూపొందించి సైన్యానికి ఇచ్చే DRDO..ఇప్పుడు మిర్చిలో దాగున్న ఘాటును గుర్తించింది.ఆఘాటును తీవ్రవాదులపై ప్రయోగించడానికి సిద్దం చేసింది. భుట్ జొలోకియాను వాడి చిల్లీ గ్రెనేడ్‌ను రూపొందించింది.. త్వరలోనే... ఈ రాకాసి మిరప.. ఇండియన్ ఆర్మీ అమ్ములపొదిలో ... అద్భుతమైన ఆయుధంగా మారనుంది.
20, ఆగస్టు 2010, శుక్రవారం
గ్రాఫిక్ కాదు.. కెమెరా ట్రిక్కు
Categories :
ఈ ఫోటోలను చూడండి. చూడడానికి ఫోటోషాప్ ఓపెన్ చేసి.. నాలుగు ఎఫెక్టులు ఇచ్చినట్లు కనిపిస్తోంది కదూ. కానీ, అది నిజం కాదు. ఇవి అసలుసిసలైన ఫోటోలే. డిజిటిల్ కెమెరా మాయకు చిక్కిన చిత్రరాజాలు. కోడక్ సి190 ద్వారా, నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా తీసిన చిత్రాలు. రాత్రి 7.30 గంటలకు, హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న లైట్లను ఓ ఎఫెక్ట్ మార్చి తీస్తే ఇలా వచ్చాయి. మొదటి ఫోటో చూసి బాగుంది కదా.. అని మరికొన్ని ప్రయోగాలు చేశాను. ఇంతకీ ఇవి మోడ్రన్ ఫోటోగ్రఫీ కోవలోక వస్తాయంటారా?
14, ఆగస్టు 2010, శనివారం
రోబోలొస్తున్నాయ్...
Categories :

రజనీ నటించిన రోబో ఇప్పుడో సంచలనం. రోబో స్టోరీ ఏమిటన్నది పక్కన పెడితే... ఫ్యూచర్‌లో జరగవచ్చని భావిస్తున్న కొన్ని సంఘటనలకు ముందుగానే రూపం ఇచ్చాడు డైరెక్టర్ శంకర్. రోబోలు మనిషి జీవితంలోకి ఎలా చొచ్చుకువస్తాయో ఈ రోబో సినిమాలో చూపించాడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తమకు తామే నిర్ణయాలు తీసేసుకోగల రాబోలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. మంచికి వాడుకుంటే వాటివల్ల ఎంత ఉపయోగమో.. చెడుకు వాడుకుంటే అంత నష్టమూ సంభవిస్తుంది. మరి ఫ్యూచర్ రోబోటిక్స్ ఎలా ఉండబోతున్నాయి.. రోబోలోకం ఆవిష్కృతమవుతుందా..? ఈ ప్రపంచం రోబోలతో నిండిపోతుందా.. ? రోబో లేనిదే మనిషి బతకలేని స్థితికి వచ్చేస్తాడా..? రోబోలపై జరుగుతున్న పరిశోధనలు.. మనుషులను తలపించే రోబోలపై ఆసక్తికరమైన విషయాలను మీముందుకు తెచ్చింది 24 గంటలు
హ్యూమనాయిడ్స్..
ఒకప్పుడు రోబోలంటే మెటాలిక్ బాడీతో.. డబ్బాలు ఒకదానిపై ఒకటి పేర్చినట్లు కనిపించేవి. కానీ, ఇప్పుడు ఆ గెటప్ పూర్తిగా మారిపోయింది. న్యూస్టైల్‌తో తయారైన హ్యూమనాయిడ్స్ వచ్చేశాయి. మనిషిలా కనిపిస్తూ.. మనిషిలా పనిచేయడం వీటి ప్రత్యేకత. వీటిని అభివృద్ధి చేయడంలోనే.. జపాన్,కొరియాలాంటి టెక్నికల్లీ డెవలప్‌డ్ కంట్రీస్ తలమునకలై ఉన్నాయి.
పైకి చూడడానికి మనిషి బాడీనే ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తప్ప అది రోబో అని చెప్పలేం. మనిషి చేయగలిగే పనులన్నీ చేయడమే ఈ నయా రోబోల స్పెషాలిటీ. మనం మాట్లాడినట్లే మాట్లాడతాయి. కనిపించివారితో ఇంటరాక్ట్ అవుతాయి. ఏవైనా ప్రశ్నలు వేస్తే.. వాటికీ సమాధానం చెబుతాయి. కానీ.. స్కిన్‌ను తీసి చూస్తేమాత్రం లోపలంతా వైర్లు, చిప్స్‌తో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు తయారయ్యే రోబోలు పవర్‌ఫుల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి చూస్తే.. ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలుగుతాయి.
ఆనందం, దుఖం, కోపం, విసుగు, నిరాశ ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఇప్పటివరకూ మనిషికే సొంతం. ఇప్పుడు మనిషిలా మారుతున్న రోబోకూడా వీటిని అందిపుచ్చుకొంటోంది. ఫీలింగ్స్‌ను ప్రదర్శించగలిగే రోబోలు రెడీ అవుతున్నాయి. సందర్భానికి తగ్గట్లుగా మాటలతో పాటు భావాలను పలికించడం వీటి ప్రత్యేకత.
అందుకే.. వీటిని రోబోలని పిలవడం మానేశారు. మనిషిలా మారాక కూడా మరమనిషిని పిలిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే.. సింపుల్‌గా హ్యుమనాయిడ్స్ అంటున్నారు. యంత్రంలా కనిపించే దశనుంచి మనిషిలా కనిపించే స్థాయికి ఎదిగిన రోబో.. మరో రెండు మూడు దశాబ్దాల్లో పూర్తిగా మనిషిలా మారిపోయినా ఆశ్చర్య పోనక్కరలేదు. ఇది కేవలం ఊహమాత్రమే కాదు.. వాస్తవం కూడా. మరో ఇరవైఏళ్లలో రోబోలోకం సాకారం కాబోతోంది. ఈ ప్రపంచ మంతా రోబోలతో నిండిపోవచ్చు.
కేవలం యంత్రమేనా..?
ఫీలింగ్ ఉండదు.. స్పర్శ ఉండదు. కేవలం మరమనిషి. చెబితే తప్ప ఏ పనీ చేయదు. ఇవన్నీ రోబో లక్షణాలు. కానీ, ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే సెన్సిటివ్‌రోబోలు తయారయ్యాయి. ఫ్రెంచ్ కంపెనీ ఆల్డీబరాన్ రోబోటిక్స్ తయారు చేసిన నావో రోబోను చూస్తే.. మీ ఆలోచనలు కచ్చితంగా మారిపోతాయి. కిందలింక్‌ను క్లిక్ చేసి నావో పనితీరును చూడొచ్చు.
http://www.youtube.com/watch?v=2STTNYNF4lk
మీడియం సైజ్‌లో ఉండే ఈ రోబో పూర్తిగా స్వతంత్ర రోబో. దానంతట అదే నిర్ణయాలు తీసుకొని అమలు చేసేస్తుంటుంది. మనుషులను గుర్తిస్తుంది. ఎవరైనా ఏమైనా చెబితే బుద్ధిగా వాటిని చేసేస్తుంది. అంతేనా.. తనలాంటి రోబోలు ఎదురుపడితే వాటితో ముచ్చటిస్తుంది కూడా. కేవలం అరమీటరు ఎత్తుండే ఈ నావోకు మనిషి భావాలను తెలుసుకుని ప్రవర్తించడమూ తెలుసు. అందుకే.. రోబోటిక్స్‌లో ఇప్పుడు నావో ఓ సంచలనం.
నోవో కన్నా పెద్దగా ఉండే మరో అద్భుతమైన రోబోను హోండా కంపెనీ తయారు చేసింది. అదే అసిమో. ఇళ్లల్లో ఉపయోగించుకోవడానికి పూర్తిగా అనువైన రోబో అని హోండా కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. మనిషిలా పనిచేయడానికి వీలుగా దీనికోసం ఎన్నో ప్రయోగాలు చేశారు. మనిషి ఎలా నడుస్తాడన్న సూత్రాన్ని ఆధారంగా చేసుకుని, దీని కాళ్లను రూపొందించారు. అందుకే.. మెట్లను సైతం అవలీలగా అసిమో ఎక్కగలదు. ఇంటిలో చక్కగా తిరుగుతూ అన్ని పనులనూ అసిమో చేసిపెడుతుంది. చెప్పాలంటే.. ఓ మనిషి ఎలా పనిచేస్తాడో.. అలానే చేస్తుంది. మనుషుల్ని, వస్తువులను గుర్తించడం వాటిని గుర్తుపెట్టుకోవడం కూడా అసిమోకు వచ్చు. ఒక్కోసారి ఏదైనా వస్తువును సరిగ్గా చూడకుండా మనం కాలితో తన్నేస్తామేమో గానీ.. ఈ హోండా హ్యుమనాయిడ్ మాత్రం ఆ పని చేయదు. కిందలింక్‌ను క్లిక్ చేసి అసిమో పనితీరును చూడొచ్చు.
http://www.youtube.com/watch?v=kFgXEkzMq7A
ప్రతీపనికీ ఓ రోబో
టిఫిన్ చేసుకోవడం.. వంట వండుకోవడం ఇబ్బందిగా ఉందా? అయితే రోబో చెఫ్ మీకు చాలా ఉపయోగపడుతుంది..
ప్రతీరోజు కూరగాయలు తరగడం చికాకుగా ఉందా.. అయితే.. రోబోకు అప్పజెప్పండి. క్షణాల్లో మీ పని అయిపోతుంది.
వంటపనిలో సాయం చేయడానికి.. ఫుడ్ ఐటెమ్స్ తయారు చేయడానికి ఎన్నో రకాల రోబోలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇక స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన రోబో మరొకటుంది. ఇంటిపనులు చేసిపెట్టే ఆల్‌రౌండర్ రోబోను జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు తయారు చేశారు. భోజనం అయిపోయిన తర్వాత వదిలేసిన డిష్‌లను తీసుకువెళ్లిపోతుంది. వాటిని క్లీన్ చేయమని రోబోటిక్ ఆర్మ్‌కు అప్పగిస్తుంది. మాసిన బట్టలుంటే వాటిని వాషింగ్ మెషిన్లో వేసేస్తుంది. అంతేకాదు.. ప్రతీరోజు ఇంటిని క్లీన్ చేయడం కూడా దీని డ్యూటీనే. ఇంటిపనులు చేసిపెట్టడానికి, పేషెంట్స్ ఉంటే హెల్ప్ చేయడానికి మరో రోబోను కూడా జపాన్ పరిశోధకులు డెవలప్ చేశారు. ఇంట్లో చెత్త ఎక్కువైతే దాన్ని పారబోయడానికి కూడా ప్రత్యేక రోబోలు తయారయ్యాయి.
ఇలా ఒకటీ రెండు కాదు.. కాలు కిందపెట్టకుండానే మన పనులు చేసి పెట్టడానికి రోబోలు రెడీ అవుతున్నాయి. చిన్న ప్రోగ్రామ్ ఫీడ్ చేస్తే చాలు.. వరసగా దానంతట అదే అన్ని పనులను చేసేస్తుంది. భవిష్యత్తులో మన అవసరాలను అర్థం చేసుకుని పనిచేసే రోబోలను తయారు చేయాలన్నది సైంటిస్టుల ప్లాన్.
రోబోనాట్..
అంతరిక్ష ప్రయోగాల్లో రోబోలు ఎప్పటినుంచో పాలు పంచుకుంటున్నాయి. ఇవన్నీ చాలావరకూ క్రేన్‌ల రూపంలోనో, రోవర్ల రూపంలోనో ఉన్నాయి. మనిషిని పోలిన రోబో ఒక్కటి కూడా ఇంతవరకూ అంతరిక్షంలోకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ ఘనత రోబోనాట్ - R2కు దక్కించుకోబోతోంది. నాసా, జనరల్ మోటర్స్ సంయుక్తంగా పరిశోధనలు చేసి రూపొందించిందే.. ఈ రోబోనాట్. దీనికి సాధారణ రోబోల తరహాలో కాళ్లుండవు. కేవలం బాడీ మాత్రమే ఉంటుంది. జీరోగ్రావిటీలో సులువుగా పనిచేయడం కోసం ఈ తరహా డిజైన్‌ను రూపొందించారు. 350కి పైగా సెన్సార్లను ఇందులో అమర్చారు. నవంబర్ 1న భూమిపై నుంచి అంతరిక్షకేంద్రానికి ఈ రోబో వెళ్లనుంది. అక్కడ ఉన్న వ్యోమగాములకు పరిశోధనల్లో సహాయం చేస్తుంది. చెప్పాలంటే, ఆస్ట్రోనాట్‌లు చేసే పనులన్నింటినీ ఈ రోబోనాట్ చేయగలదు. ఇక ఇంటర్నెట్‌ను వాడుకోవడంలో దీని స్టైలే వేరు. అంతరిక్ష కేంద్రం నుంచి ట్విట్టర్‌లో ట్వీట్స్ పంపిస్తుంది.
రోబోనాట్ విజయవంతంగా పనిచేయగలిగితే.. మరో మహా ప్రయోగానికి తెర లేచినట్లే. ప్రాజెక్ట్ M పేరుతో అమెరికాలోని జాన్షన్ స్పేస్‌సెంటర్ దీనికోసం ప్రతిపాదనలను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. మరో మూడేళ్లలోగా.. రోబోనాట్‌ను చంద్రుడిపైకి పంపిచాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. చంద్రుడిపై ప్రయోగాల కోసం వ్యోమగాములను కాకుండా కేవలం రోబోలను మాత్రమే పంపిస్తారు.
చంద్రుడిపై వ్యోమగాములు ఎక్కువ కాలం ఉండలేరు కాబట్టి, రోబో ద్వారా అన్వేషణ కొనసాగించాలన్నది నాసా ఆలోచన. పూర్తిగా మనిషిలా ఉండే ఈ రోబోనాట్.. చంద్రుడిపైకి వెళితే మాత్రం ఎన్నో విలువైన విషయాలు.. చంద్రుడిపై దాగున్న రహస్యాలు భూమికి చేరతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
నాశనం చేస్తాయా..?
ఇంతవరకూ చెప్పుకొంది హ్యూమన్ ఫ్రెండ్లీ రోబోల గురించే. మనిషిలా మారుతున్న రోబోకు మేథస్సు కూడా పెరుగుతోంది. స్వతంత్రంగా ఆలోచించగలుగుతోంది. ఈ ఆలోచనలే రోబోను మనిషికి శత్రువును చేస్తాయా.. మన వినాశనానికి దారి తీస్తాయా.. చాలామందిలో ఇప్పుడు ఇదే ఆందోళన.
రోబోటిక్స్ డెవలప్ అయ్యే కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. మనలా ఆలోచించగలిగే శక్తిని సంపాదించుకుంటున్న రోబోలు, చివరకు మనల్నే నాశనం చేస్తాయోమేనన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. హాలీవుడ్‌లో వచ్చిన కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు .. ఈ టెన్షన్‌ను మరింత పెంచాయి.
సొంతగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకునే శక్తి రోబోకు వచ్చేసిందంటే.. మనిషి కంట్రోల్‌లో ఉండకపోవచ్చన్నది చాలామంది నమ్మకం. తనను బానిసగా చూస్తున్న మనిషిపై దాడిచేసి.. ప్రపంచాన్ని తనగుప్పిటలోకి సూపర్‌రోబోలు తెచ్చుకుంటాయేమోనన్న భయమూ ఉంది.
అయితే.. ఇదంతా సులువు కాదు. ప్రోగ్రామింగ్ ఆధారంగా తయారయ్యే రోబో ఆలోచనలకూ కొన్ని పరిమితులుంటాయి. మనిషిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన రోబోకు రాదనే చెప్పొచ్చు. కాబట్టి వాటివల్ల మనకు పెద్దగా సమస్యలు రావు. కానీ.. సంఘవిద్రోహుల చేతికి రోబో టెక్నాలజీ అందిందంటే మాత్రం పెను ప్రమాదమే ముంచుకొస్తుంది. మనిషికి మేలు చేసే రోబోను కాస్తా.. విధ్వంసకారిగా మార్చడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇలాంటి రోబోలు కొన్ని తయారైనా.. మానవాళికి మనుగడకు కష్టమే.
30, మార్చి 2010, మంగళవారం
సృష్టి రహస్యం ఛేదిస్తారా?
Categories :

శాస్త్ర, సాంకేతిక ప్రయోగాల్లో కొత్త శకం మొదలయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగం తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. విశ్వమూలాలను కనిపెట్టడానికి మొదలైన ఎల్‌హెచ్‌సీ ప్రయోగంలో తొలిమెట్టును విజయవంతంగా అధిగమించారు సైంటిస్టులు.
బ్లాక్ హోల్ అంతు తేల్చడానికి నడుం బిగించిన శాస్త్రవేత్తలకు తొలి విజయం దక్కింది. ప్రపంచ మంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన బిగ్‌బ్యాంగ్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. విశ్వసృష్టి రహస్యాన్ని ఛేధించడంలో తొలి అడుగు పడింది. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దుల్లోని యూరోపియన్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ ల్యాబ్‌లో మొదలైన LHC ఎక్స్‌పర్‌మెంట్‌లో కాంతి కిరణాలు విజయవంతంగా ఢీకొన్నాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4 గంటల 28 నిమిషాలకు రెండు కిరణాలు పరస్పరం ఢీకొన్నాయి. అంతే.. ఎప్పటినుంచే.. ఈ విజయం కోసం ఎదురుచూస్తున్న శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ LHC ప్రయోగం మంగళవారం జరుగుతోందని విస్తృత ప్రచారం జరిగింది. వారం రోజుల నుంచే.. కాంతి కిరణాలను పంపించే ప్రక్రియ మొదలయ్యింది. అయితే.. ఈ రోజు ఉదయం మాత్రం సైంటిస్టులకు ఊహించని సమస్య ఎదురయ్యింది. ప్రయోగం మరికాసేపట్లో మొదలవుతోందనగా.. సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కిరణాలను విడుదల చేయాల్సిన ప్రోటాన్ బీమ్స్ మొండికేశాయి. దీంతో.. మరోసారి టెన్షన్‌కు గురయ్యారు బిగ్‌బ్యాంగ్ సైంటిస్టులు. మూడుసార్లు ప్రయత్నిస్తేగానీ.. కిరణాలు విడుదల కాలేదు. చివరకు ప్రోటాన్ కిరణాలు విడుదల కావడం.. విజయవంతంగా ఒకదాన్నొకటి ఢీకొట్టడంతో సైంటిస్ట్‌ల టెన్షన్ తీరిపోయింది. కిరణాల ఢీ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులను ప్రస్తుతం అన్వేషిస్తున్నారు.
రహస్యాల అన్వేషణ
భూమి ఎలా పుట్టింది... భూమి గమనానికి కారణమైన సౌరమండలం ఎలా ఏర్పడింది... సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగడానికి కారణం ఏమిటి? అసలీ విశ్వంలో గ్రహాలు, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి... ఇలా అంతులేని ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్న శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగమే... LHC.
అనంత విశ్వం ఎలా ఏర్పడిందన్నది ఎంతోమంది శాస్త్రవేత్తల మదిని తొలుస్తున్న ప్రశ్న. దీనికి కారణాలను చెప్పడానికి ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ.. శాస్త్రీయంగా మాత్రం ఏ సిద్ధాతమూ ఇప్పటివరకూ నిరూపణ కాలేదు. చివరకు బిగ్‌బ్యాంగ్ థియరీ ఆధారంగానే ఈ విశ్వం ఏర్పడిందని ఎక్కువమంది నమ్ముతూ వచ్చారు. బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం.. దాదాపు 14 వందల కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో అతిపెద్ద విస్పోటనం సంభవించింది. ఈ విస్పోటనం తర్వాతే.. గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడ్డాయి. సూర్యమండలూ ఇలానే అవతరించింది. భూమి పుట్టుకకూ కారణం ఈ పేలుడే. అయితే.. ఈ వాదనలో నిజమెంత అన్నది తేలడానికి ఓ మహాప్రయోగానికే శ్రీకారం చుట్టారు.. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలు.
విశ్వం అనంతం.. విశ్వంలో మన భూమి కనీసం ఒక్కవంతు కూడా ఉండదు. అలాంటింది.. విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకునే ప్రయోగాన్ని భూమిపై చేయడం సాధ్యమేనా.. అసలు శాస్త్రవేత్తలు దీనికోసం ఏం చేస్తున్నారు.. ఇది తెలుసుకోవాలంటే.. మనం జెనీవా వెళ్లాలి..
ప్రపంచ భౌతిక శాస్త్రవేత్తలు.. సృష్టి రహస్యంతో తలపడుతున్నారు. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. బ్లాక్ హోల్ అంతు చూడడానికి సమాయత్తమయ్యారు. అందుకే.. చరిత్రలో ఎప్పుడూ లేనంత మహా ప్రయోగం. ఫిజిక్స్ ఎక్స్‌పరిమెంట్స్‌ను సాధారణంగా.. ఒకటో రెండో దేశాలు కలిసి చేయడం సర్వసాధారణం. కానీ.. ఈ ప్రయోగంలో మాత్రం... దాదాపు 40 దేశాలు పాలుపంచుకొంటున్నాయి. సృష్టి ఎలా ఏర్పడిందన్నది తేలితే.. విశ్వంలో రహస్యాలుగానే మిగిలిపోయిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అందుకే.. ఇంత భారీ ప్రయోగం..
స్విట్జర్లాండ్, ఫ్రాన్ సరిహద్దుల్లో ఈ ప్రయోగం జరుగుతుంది. దీనికోసం భూగర్భంలో ప్రత్యేకంగా ప్రయోగశాలను నిర్మించారు. ఈ ప్రయోగం పేరు.. లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్. భూమికి వంద మీటర్ల లోతులో.. ప్రత్యేకంగా ఈ ల్యాబ్‌ను నిర్మించారు. భూగర్భంలో దాదాపు 27 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని ఈ ప్రయోగం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. రెండు ప్రోటాన్ కాంతి పుంజాలను పరస్పరం వ్యతిరేక దిశలలో ప్రయాణింప జేసి.. ఒకదానితో ఒకటి ఢీకొట్టిస్తారు. దీనిద్వారా.. విశ్వసృష్టికి మూలమైన మహావిస్పోటనాన్ని కృత్రిమంగా సృష్టించాలన్నది సైంటిస్టుల ప్రణాళిక.
ఈ ప్రయోగం ఒక్కసారితో పూర్తైపోదు. ఇందులో అనేక దశలున్నాయి. ప్రోటాన్ కిరణాలను పదేపదే ఢీకొట్టిస్తారు. అయితే.. ప్రతీ దశలోనూ ఈ కిరణాల వేగాన్ని పెంచుతూ వెళతారు. తాజాగా జరిగే ప్రయోగంలో.. 7 టెరా ఎలక్ట్రాన్ వోల్స్ వేగం వద్ద ఈ కిరణాలను ఢీకొట్టిస్తున్నారు. పూర్తిగా అణుపరిజ్ఞానంతో ఈ ప్రయోగం జరుగుతోంది. 2011 చివరి వరకూ ఈ ప్రయోగం జరుగుతుంది. మధ్య మధ్యలో విరామం ఇస్తూ.. ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తారు. తుదిదశలో 14 టెరా ఎలక్ట్రాన్ వోల్డ్స్ వేగం వద్ద కాంతి కిరణాలను ఢీకొట్టిస్తారు. దీంతో.. విశ్వం ఆవిర్భావం నాటి పరిస్థితులు ఈ ప్రయోగశాలలో ఏర్పడతాయన్నది శాస్త్రవేత్తల అంచనా. లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్‌లో కాంతికిరణాల కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎప్పటికప్పుడు రికార్డు చేయడానికి, విశ్లేషించడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు నిత్యం సిద్ధంగా ఉంటారు. ఈ పరిశోధన ఆధారంగానే.. విశ్వసృష్టికి మూలాన్ని కనిపెడతారు.
9, జనవరి 2010, శనివారం
శాటిలైట్ కిల్లర్స్...
Categories :

ఒక దేశ సార్వభౌమత్వానికి.. సరిహద్దు రక్షణకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఉండాలంటే.. బలమైన సైనిక పాటవం కావాలి. అత్యాధునిక ఆయుధాలు కావాలి. వాటిని సరైన దిశలో నడిపించగల సమర్దవంతమైన నాయకత్వం కావాలి. కానీ, ఇవి మాత్రమే ఉంటే.. ఇప్పుడు లాభం లేదు. అంతరిక్షంలోనుంచి దూసుకువచ్చే ముప్పునూ తట్టుకోగలగాలి. అందుకే.. ఆ దిశలోనే అడుగులు వేస్తోంది మనదేశం. శత్రుదేశాల ఉపగ్రహాల పనిపట్టే.. అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసుకొంటోంది..
అంతరిక్ష యుద్ధానికి భారత్ సిద్ధమవుతోందా.. శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేసే టెక్నాలజీని తయారు చేస్తోందా.. వీటన్నిటికీ అవునన్న సమాధానమే వస్తోంది. యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టం ను అభివృద్ధి చేస్తున్నట్లు.. డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్ వి.కె.సారస్వత్ ప్రకటించారు. "భారత శత్రుదేశాల శాటిలైట్లను నిర్వీర్యం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిద్వారా అంతరిక్షంలో మన ఉపగ్రహాలను కూడా రక్షించుకోగలం. ఈ టెక్నాలజీపైనే పరిశోధనలు చేస్తున్నాం. దీనివల్ల శత్రువులు తమ అంతరిక్ష పరికరాలను మన భూభాగంపై ఉపయోగించలేరు." ఇటీవల తిరువనంతపురంలో జరిగిన 97వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభల్లో పాల్గొన్న ఆయన... సరికొత్త ఆయుధాల తయారీపై పెదవి విప్పారు. శత్రుదేశాల ఉపగ్రహ వ్యవస్థలపై దాడి చేసే అత్యంత ఆధునిక టెక్నాలజిపై DRDO విస్త్రత స్థాయిలో పరిశోధనలు చేస్తోందని ఆయన తెలిపారు. దీంతో అంతరిక్షంలో భారత భూకక్ష్యలో పరిభ్రమించే శత్రుదేశాల నిఘా ఉపగ్రహాలు, సైనిక ఉపగ్రహాలపై మనం దాడిచేసే సత్తా భారతసైన్యానికి అందుబాటు లోకి వస్తుంది.
యాంటీ శాటిలైట్ వెపన్స్ ఎందుకు?
కేవలం శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేయడమే కాదు.. మన శాటిలైట్లపైకి దూసుకువచ్చే మిసైల్స్‌ను అడ్డుకోవాలి. అప్పుడే మన అంతరిక్ష పరిశోధనలు సజావుగా జరుగుతాయి. సరిగ్గా ఈ లక్ష్యంతోనే టెక్నాలజీని అభివృద్ధి చేయాలనుకొంటోంది రక్షణరంగ సంస్థ డీఆర్‌డీఓ. ముఖ్యంగా భూమికి సమీపంలో తిరిగే ఉపగ్రహాలనే టార్గెట్ చేసుకుంటూ.. ఈ కొత్త వెపన్ సిస్టంకు రూపకల్పన చేస్తోంది. 2014 నాటికల్లా దీన్ని సైన్యానికి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉపగ్రహాలను నాశనం చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందంటే.. అంతరిక్షయుద్ధం చేయడానికి మనం సిద్ధమైనట్లే.
అయితే.. ఈ ఉపగ్రహ వినాశులను మనం మాత్రమే తయారు చేయడంలేదు. ఈ విషయంలో అగ్రరాజ్యాలు మనకన్నాముందే ఉన్నాయి. శాటిలైట్ కిల్లర్స్‌ను తమ అమ్ములపొదిలో ఎప్పుడో సమకూర్చుకున్నాయి. అంతరిక్ష పరిశోధనలను ప్రపంచంలో తొలిసారిగా మొదలుపెట్టిన.. అమెరికా, సోవియెట్ యూనియన్‌లే.. ఈ విధ్వంసకర ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాయి. కోల్డ్‌వార్ సమయంలోనే ఈ రెండు దేశాలు కలిసి దాదాపు 54 సార్లు ఈ యాంటీ శాటిలైట్ వెపన్స్‌ను పరీక్షించాయి. ఒకదేశంపై మరొకటి దాడి చేయడం కోసం.. కొన్ని నెలలపాటు.. వీటిని ప్రయోగానికి సిద్ధంగా మోహరించాయి. 1985లో తన వెదర్ శాటిలైట్ స్లోవిండ్‌ను అమెరికా... ఇదే పద్దతిలో కూల్చేసింది. సెప్టెంబర్ 13, 1985న భూమికి 555 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాన్ని.. ఎఫ్-15 నుంచి దూసుకెళ్లిన మిసైల్ తునాతునకలు చేసింది..
ఇదే తరహాలో సోవియెట్ ఎన్నో ప్రయోగాలు చేసింది. అయితే.. యూనియన్ విచ్చిన్నం కావడంతో.. పెద్ద దేశంగా మిగిలిన రష్యా.. అంతరిక్ష యుద్ధంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇతరత్రా ప్రయోగాలు జరిగినా.. యాంటీ శాటిలైట్ వెపన్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం అమెరికా, రష్యాలకు రాలేదు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రశాంతంగా ఉన్న అంతరిక్షంలో.. బాంబుపేల్చింది.. చైనా. ప్రపంచ దేశాల అభ్యంతరాలను ఏమాత్రం లెక్కచేయకుండా.. 2007, జనవరి 17న యాంటీ శాటిలైట్ టెస్ట్ జరిపింది. ఫెంగ్‌యున్ - 1సి వెదర్ శాటిలైట్ చెడిపోయిందని చెప్పిన చైనా.. S-19 మిసైల్‌ను పంపించి.. దాన్ని పేల్చేసింది. చైనా ఉపగ్రహం దాదాపు 40 వేల ముక్కలైనట్లు అంచనా. ఇవి ఇప్పటికీ భూమిచుట్టూ తిరుగూతూనే ఉన్నాయి. చెడిపోయిన ఉపగ్రహాన్ని నాశనం చేయడానికే పేల్చేశామని చైనా చెబుతున్నా.. దాని ఆంతర్యం మాత్రం వేరన్న సంగతి అందరికీ తెలిసిందే. శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేయగల సత్తా తనకుందని నిరూపించుకోవడానికే.. చైనా ఈ ప్రయోగం చేసిందన్న వాదనా ఉంది. అయితే.. అమెరికా మాత్రం.. అనూహ్యంగా రియాక్ట్ అయ్యింది. చైనాను తలదన్నే రీతిలో యాంటీశాటిలైట్ వెపన్ సిస్టంను ప్రయోగించింది. 2006 డిసెంబర్ 14న అమెరికా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం USA - 193ని ఈ ప్రయోగానికి ఎన్నుకొంది. పసిఫిక్ సముద్రంలో మోహరించిన యుద్ధ నౌక నుంచి.. ఫిబ్రవరి 20, 2008న SM-3 మిసైల్‌ను పంపి.. స్పై శాటిలైట్‌ను కూల్చేసింది. చైనా చూపించిన సాకునే.. అమెరికా ఇక్కడా చూపించింది. ఈ స్పై శాటిలైట్ పనిచేయడం లేదన్న అమెరికా.. అందులో 450 కిలోల టాక్సిక్ హైడ్రోజన్ ఉందని.. అది భూమిపై కూలిపోతే.. పెను ప్రమాదం జరుగుతుందని ఊదరగొట్టింది. కానీ.. వాస్తవం మాత్రం వేరు. చైనాకు దీటుగా తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికే ఈ ప్రయోగం చేసిందన్నదే.. ఆ వాస్తవం.
అమెరికా, రష్యా, చైనాల తీరుతో.. మన దేశం కూడా త్వరపడక తప్పడం లేదు. ఎదుటి దేశాల మీద దాడి సంగతి పక్కన పెడితే.. మనల్ని, మన ఉపగ్రహాలను కాపాడుకోవాలన్నా.. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోకతప్పదు. పైగా.. ఉపగ్రహ ప్రయోగాల్లో ముందున్నమనకు.. ఈ తరహా రక్షణ తప్పనిసరి. యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టంను డీఆర్‌డీఓ అభివృద్ధి చేయడానికి కారణం ఇదే.
శాటిలైట్లకు రక్షణ లేదా?
టెక్నాలజీ ఇప్పుడు భూ ప్రపంచపు అంచులను దాటిపోయింది. వైర్‌లెస్ కనక్టివిటీ పెరిగిపోయింది. క్షణకాలం సెల్‌ఫోన్లు ఆగిపోయినా.. టీవీలు పనిచేయకపోయినా.. ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది. ఇవి సరిగ్గా పనిచేయాలంటే.. అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. వాతావరణాన్ని అంచనా వేయడం దగ్గర మొదలుపెడితే.. మిలటరీ అవసరాలు తీర్చడం వరకూ.. ఇప్పుడు ఉపగ్రహాలదే కీలక పాత్ర. పైగా.. ఇటీవలి కాలంలో నిఘా ఉపగ్రహాలను ప్రయోగించడం ఎక్కువయ్యింది. శత్రుదేశాల కదలికలను తెలుసుకోవడంలో ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు.. యుద్ధసమయంలో శాటిలైట్లను పనిచేయకుండా ఆపగలిగితే.. ఎనిమీ వెనక్కి తగ్గడం ఖాయం. అందుకే.. ప్రపంచ అభ్యంతరాలను లెక్కచేయకుండా చైనా ఈ ప్రయోగానికి తెగించింది.
మన దేశం విషయానికి వస్తే.. ఇస్రో చేస్తున్న ప్రయోగాలు చాలా వరకూ విజయవంతమైనవే. 1975 నుంచి ఇప్పటివరకూ 54 భారత ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. వాతావరణ శాటిలైట్లను మొదలుకొని.. నిఘా ఉపగ్రహాలవరకూ ఈ జాబితాలో ఉన్నాయి. చైనాకు మనకూ మధ్య ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ శాటిలైట్లన్నింటినీ రక్షించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో మన రక్షణ రహస్యాలు.. శత్రు దేశాలకు చిక్కకుండానూ చూసుకోవాలి. అందుకే.. సరిహద్దు రక్షణతో పాటు.. అంతరిక్ష రక్షణ కూడా ఎంతో కీలకం. ఈ విషయంపైనా దృష్టి పెట్టిన భారత సైన్యం.. ఇస్రో సహకారంతో కలిసి ఏరో స్పెస్ కమాండ్ ఏర్పాటుకు కృషి చేస్తోంది. పొరుగు దేశాలనుంచి ముప్పు పొంచి ఉండటంతో ఏరోస్పేస్ కమాండ్ వ్యవస్థ భారత్‌కు రక్షణ కవచంగా దోహదపడనుంది. ఈ కమాండ్‌ను త్రివిధదళాలను అనుసంధానం చేసి శాటిలైట్ పంపే చిత్రాలు... రాడార్స్ పంపే సిగ్నల్స్ ఆధారంగా శత్రుదేశాల కదిలికలను గుర్తించి ముందస్తుగా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ తరహా టెక్నాలజీని అమెరికా, రష్యా, చైనాలు సమకూర్చుకున్నాయి...
సుఖోయ్, మిరాజ్ వంటి యుద్దవిమానాలతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ఫోర్స్‌లో ఒకటిగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఎంతో మంచి పేరుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి లక్ష్యాలను చేధించగల అగ్ని బాలిస్టిక్ మిసైల్స్ కూడా భారత్ వద్ద ఉన్నాయి. వీటికి కొద్దిగా మార్పులు చేసి యాంటీ శాటిలైట్ మిసైల్స్‌గా అభివృద్ధి చేయవచ్చు. అయితే.. ఉపగ్రహాలను కచ్చితంగా పేల్చగలగాలంటే మాత్రం రాడార్ సిస్టంను ఇంకా మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. 2001లోనే టెక్నాలజి ఎక్స్‌పర్‌మెంట్ శాటిలైట్‌ను ఇండియా ప్రయోగించింది. సైనిక నిఘా అవసరాల కోసం కార్టో సెట్ - 2 ను 2008లో ప్రయోగించింది. భూమి మీద ఒక మీటర్ దూరం వరకు ఈ శాటిలైట్లు ఫోటోలు తీయగలవు. ఇదే క్రమంలో 2009 ఏప్రిల్‌లో రిశాట్-2 ను నింగిలోకి పంపించింది. ఈ ఉపగ్రహం రాత్రి వేళల్లో సైతం స్పష్టమైన ఫోటోలను తీయగలగడంతో పాటు.. సరిహద్దుల్లో శత్రుదేశాల సైనికుల కదిలికల్ని సైతం గుర్తిస్తుంది. ఇప్పుడు యాంటీశాటిలైట్ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటే.. శత్రుదేశాలు మన ఉపగ్రహాలవైపు కన్నెత్తిచూసే సాహసం చేసే అవకాశం ఉండదు.
అంతరిక్ష యుద్ధం తప్పదా?
అంతరిక్షం ఎవరి సొత్తూ కాదు. అన్ని దేశాలకు సమాన హక్కులు ఉన్నాయి. స్సేస్ఏజ్ మొదలైనప్పటి నుంచీ.. రెండు దేశాల ఆధిపత్య ధోరణులను ప్రపంచ దేశాలు.. ఖండిస్తూనే ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే.. ఐక్యరాజ్యసమితి కూడా.. ఔటర్ స్పేస్ విషయంలో ఓ తీర్మానం చేసింది. 1967లో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం.. అంతరిక్షం మానవజాతి మొత్తానికి చెందుతుంది. కానీ.. ప్రస్తుతం ప్రయోగాలు చేయగల సామర్థ్యం.. స్పేస్‌లోకి శాటిలైట్లను పంపించగల టెక్నాలజీ కొన్ని దేశాలకు మాత్రమే ఉండడంతో అవి మాత్రమే వాడుకోగలుగుతున్నాయి.. భూమండలంపై బిగ్‌బాస్‌గా వ్యవహరిస్తున్నఅమెరికా.. అంతరిక్షంలోనూ తానే లీడర్‌ను కావాలనుకొంటోంది. ప్రపంచాధిపత్యంకోసం ఎదురుచూస్తున్న చైనాకు సహజంగానే ఇది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే.. పోటాపోటీగా ఆయుధాలను తయారు చేస్తోంది. అంతేకాదు.. అమెరికాకు 2006లోనే చైనా షాక్ ఇచ్చింది. చైనా భూభాగంపైకి వెళ్లిన అమెరికా మిలిటరీ స్పై శాటిలైట్ అనేక ఇబ్బందులకు గురయ్యింది. ఈ ఉపగ్రహంపై లేజర్ కిరణాలతో దాడి జరిగిందంటూ అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఈ దాడి తర్వాత.. శాటిలైట్‌లోని కొన్ని వ్యవస్థలు పనిచేయకుండా పోయాయనీ ప్రకటించింది. ఇది చాలు.. చైనా సమరసిద్ధతను అర్థం చేసుకోవడానికి. 2007లో అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని పేల్చివేయడం ద్వారా.. తన యాంటీ శాటిలైట్ వెపన్స్ సామర్థ్యాన్ని చైనా చెప్పకనే చెప్పింది. కాబట్టి.. చైనాతో కయ్యానికి దిగే సాహసం చేయలేదు అమెరికా.
రష్యా దగ్గర కూడా.. శాటిలైట్ కిల్లర్స్ ఉన్నాయి. శత్రుదేశ ఉపగ్రహాన్ని గుర్తించిన వెంటనే.. భూమిపై నుంచి మిసైల్స్ దూసుకువెళతాయి. శాటిలైట్‌కు చేరువలోకి వచ్చిన తర్వాత వాటంతట అవే పేలిపోతాయి. దీంతో.. శాటిలైట్ కూడా నాశనమవుతుంది. దాదాపు కిలోమీటర్ ముందే మిసైల్ పేలినా.. శాటిలైట్ విధ్వసం కావడం ఖాయం. అయితే.. మిసైల్స్ ద్వారా కన్నా.. లేజర్ కిరణాల ద్వారానే ఇతర దేశాల శాటిలైట్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది రష్యా.
వాస్తవంగా చూస్తే.. అంతరిక్ష యుద్ధానికి భారత్ పూర్తి వ్యతిరేకం. తొలినాళ్లలో చైనా కూడా ఇదే సిద్ధాంతాన్ని అవలంభించినా.. రెండేళ్లక్రితమే స్వయంగా నిర్దేశించుకున్న పరిధులను దాటేసింది. దీంతో.. ఇప్పుడు ఆ హద్దును చెరిపివేసుకోవాల్సిన అవసరం మనకూ వచ్చింది. ఈ పోటాపోటీగా ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలను తయారు చేసుకోవడంతో.. యుద్ధం వచ్చేస్తుందని.. స్పేస్‌వార్ మొదలైందని భావించలేం. ఎందుకంటే.. శత్రుదేశంపైకి ఒకదేశం వెపన్‌ను ప్రయోగించిన కొన్ని క్షణాల్లోనే.. ఎదుటి దేశం నుంచి ప్రతిస్పందిన కచ్చితంగా వచ్చి తీరుతుంది. దీనివల్ల రెండు దేశాలకూ తీరని నష్టం వాటిల్లుతుంది. కాకపోతే.. మరోదేశం దాడి చేయకుండా ఉండాలంటే మాత్రం.. మనకు ఎదురుదాడి చేయగల సత్తా ఉందని చాటిచెప్పాలి. ఇప్పుడు భారత్ చేస్తోంది కూడా అదే. ఓ చెంప మీద కొడితే.. మరో చెంప చూపించమన్నాడు గాంధీ.. కానీ.. మొదటి దెబ్బే పడకూడదంటే.. మనమూ కొట్టగలమని ఎదుటివాడికి తెలియాలి.
16, ఆగస్టు 2009, ఆదివారం
హీలియం మామ
Categories :

చందమామపై ప్రయోగాలు ఆసక్తికర ఫలితాలు అందిస్తున్నాయి. అమెరికా, రష్యాల తర్వాత.. జాబిల్లిపై ప్రయోగాలు చేపట్టిన ఆసియా ఖండ దిగ్గజం.. చైనా.. ఓ అద్భుత ఫలితాన్ని అందుకొంది. చందమామ భూభాగాన్ని అణువణువూ శోధించిన చైనా.. భవిష్యత్ మానవజాతికి అవసరమైన ఇంధన నిక్షేపాలు భారీగా ఉన్నాయంటోంది. భారత్ చంద్రయాన్ మొదలుపెట్టడానికి ముందే.. మూన్‌మిషన్ ప్రారంభించింది చైనా. సరిగ్గా పద్దెనిమిది నెలల క్రితం.. చందమామపై పరిశోధనలకు చాంగే వన్ ఉపగ్రహాన్ని పంపించింది. చంద్రుడికి సంబంధించి నాలుగు లక్ష్యాలను విధించుకొంది. అందులో ఒకటి.. చంద్రుడిపై మనవజాతికి అవసరమైన ఇంధన నిల్వలు కనిపెట్టడం. భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్న హీలియం.. చంద్రుడిపై భారీమొత్తంలో ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ అంచనా వేస్తూ వచ్చారు. సరిగ్గా ఈ కోణంలోనే పరిశోధనలు మొదలుపెట్టిన చైనా.. చందమామపై హీలియం త్రీ నిక్షేపాలను గుర్తించింది. కోట్లాది టన్నుల అణుశక్తిని దీనిద్వారా సాధించుకోవచ్చని చైనా భావిస్తోంది.
చైనా పంపించిన ఉపగ్రహం.. చాంగే వన్.. చంద్రుడి పొరలను పరిశీలిస్తుండగా.. ఈ హీలియం త్రీ విషయం బయటపడింది. మైక్రోవేవ్ టెక్నాలజీ ద్వారా.. చంద్రుడిపై ఉన్న మట్టి పొరల లోతును ఉపగ్రహం విశ్లేషించింది. చంద్రుడి ఉపరితలాన్ని మూడు లేజర్ బీమ్స్‌తో స్కాన్ చేసింది చైనా ఉపగ్రహం. ఇంతవరకూ రష్యాగానీ.. అమెరికా గానీ ఈ తరహా పరిశోధనలను చేయలేదు. అయితే.. కచ్చితంగా ఎంతమొత్తంలో హీలియం ఉంటుందన్నది మాత్రం చైనా అంచనా వేయలేకపోయింది. భూమిపొరల్లో ఉన్న సహజవాయు నిక్షేపాలు మరో శతాబ్ధంలోగా అడుగంటిపోతాయన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో చైనా ఆవిష్కరణ కొత్త దారిని చూపించనుంది. ఈ హీలియం త్రీని అణుఇంధనంగా మార్చుకోవాలంటే మాత్రం.. మన టెక్నాలజీని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. చంద్రుడికి సంబంధించిన 2D,3D మ్యాపులను తయారు చేయడానికి కూడా చైనా సిద్ధమయ్యింది. చాంగే వన్ ఉపగ్రహం దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సేకరించింది. ఈ ఏడాది చివరికల్లా ఈ మ్యాపులను సిద్ధం చేస్తామని చైనా ప్రకటించింది. ఇవి కూడా సిద్ధమైతే.. చందమామ అణువణువునూ చూసే అవకాశం అందరికీ లభిస్తుంది.
భారత కీర్తిపతాక.. ఇస్రో
Categories :
ఒక చిన్న అడుగు.. భారత దేశ గమ్యాన్ని.. గమనాన్ని మార్చేస్తుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. ఆ అడుగు మన దేశాన్ని ప్రపంచ శక్తుల్లో ఒకటిగా నిలబెడుతుందనీ అనుకోలేదు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా.. ప్రయత్నించాడు. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ఒప్పించి.. భారత అంతరిక్ష పరిశోధనలకు బీజం వేశాడు. దాన్నుంచి పుట్టిన మొక్కే.. ఇస్రో. ఆ మహామనిషే.. విక్రం సారాభాయ్.. భారత అంతరిక్ష పితామహుడు.. తప్పటడుగులతో అడుగులతో మొదలైన ఇస్రో ప్రస్థానం ఇప్పుడు చందమామను అందుకునే వరకూ చేరిందంటే.. దానికి కారణం సారాభాయే.
నిప్పులు చిమ్ముకుంటూ.. భారత రాకెట్లు ఆకాశాన్ని చీల్చుకొని అంతరిక్షంలోకి దూసుకువెళుతుంటే.. ప్రపంచమంచా నిబిడాశ్చర్యంతో చూసింది. మన సత్తాకు సలామ్ చేసింది. అగ్రరాజ్యాలకే పరిమితమైన స్పేస్ రీసెర్చ్‌లో మనకూ ప్రత్యేకస్థానం లభించిందంటే.. దానికి కారణం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో. ఎన్నో విజయాలు.. మరెన్నో ప్రణాళికలతో..
భారత కీర్తిపతాకను.. వినువీధుల్లో ఎగరవేస్తోంది ఇస్రో. ఆగస్టు 15తో నలభై వసంతాలను పూర్తి చేసుకొంది ఈ సంస్థ. ఈ నాలుగ దశాబ్దాల్లో.. ఎవరూ ఊహించలేని విజయాలను సొంతం చేసుకొంది. అంతరిక్ష ప్రయోగాల్లో మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ఏకైక సంస్థ మన ఇస్రో. ఉపగ్రహాలను విజయవంతగా ప్రయోగించడంలో మనకు మనమే సాటి. ఇస్రోకు అత్యంత నమ్మకమైన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్.. PSLV ద్వారా మొత్తం 32 ఉప్రగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడితే.. అందులో.. పదహారు ఇతర దేశాలకు చెందినవి కావడమే దీనికి నిదర్శనం. ఇన్ని విజయాలు సాధిస్తున్న ఇస్రో ఏర్పాటు వెనుకున్న ఒకే ఒక వ్యక్తి విక్రం సారాభాయ్. 1957లో స్పుత్నిక్ ఉపగ్రహాన్ని రష్యా ప్రయోగించిన వెంటనే.. అంతరిక్ష పరిశోధనలకున్న అవసరాన్ని ఆయన గుర్తించారు. అప్పటి ప్రధాని నెహ్రూను ఒప్పించి.. స్పేస్ రీసెర్చ్ వైపు అడుగులు వేయించారు. భారత అణుశక్తి పితామహుడు హోమీబాబా పర్యవేక్షణలో 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటయ్యింది. 1969లో ప్రత్యేకంగా అంతరిక్ష పరిశోధనల కోసం ఇస్రో రూపుదిద్దుకొంది. చిన్న చిన్న వైఫల్యాలున్నప్పటికీ.. ఇస్రో సాధించిన విజయాలే ఎక్కువ. ప్రస్తుతం రెండు రకాల ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తోంది. మొదటిది.. ఇన్‌శాట్. రెండోది.. ఐఆర్‌ఎస్. చంద్రయాన్ ప్రాజెక్టుతో.. ప్రపంచదేశా దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. త్వరలోనే.. సూర్యుడి పని కూడా పట్టడానికి సిద్ధమవుతోంది.
భారత్‌లో టెలివిజన్ ప్రసారాలు ఇంతగా ఊపందుకున్నాయన్నా... రేడియో ప్రసారాల్లో భారీ మార్పులు వచ్చాయన్నా... మొబైల్స్ సామాన్యుడిదరికి చేరాయన్నా.. దానికి ఓ రకంగా ఇస్రోనే కారణం. ఇస్రో ప్రయోగించిన ఇన్‌శాట్ ఉపగ్రహాలవల్లే నిరంతరాయంగా ఈ ప్రసారాలు జరుగుతున్నాయి. ఆసియా-పసిఫిక్ దేశాల్లోనే.. ఇన్‌సాట్ ఉపగ్రహాలది అతిపెద్ద శ్రేణి. ఇది కూడా మనం మరోదేశంపైన ఆధారపడకుండా.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న టెక్నాలజీ. ఇక వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి.. IRS శ్రేణి ఉపగ్రహాలను, దూరవిద్యను అందించడానికి ఎడ్యుశాట్‌ను ప్రయోగించింది ఇస్రో. పైగా.. ఇప్పుడు వ్యాపారమూ చేయగలుగుతోంది. ఇస్రో ద్వారా.. ప్రయోగిస్తే.. కచ్చితంగా కక్ష్యలోకి ఉపగ్రహాలు వెళ్లతాయన్న నమ్మకం.. ప్రపంచ దేశాలది. అందుకే.. ఇస్రోకు ఆర్డర్లమీద ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి.
విజయపరంపర
తొలినాళ్లలో.. కొన్ని వైఫల్యాలు ఎదురైనప్పటికీ వాటిని చాలా వేగంగానే ఇస్రో అధిగమించింది. భారత తొలి ఉపగ్రహ వాహక నౌక.. SLV నాలుగుసార్లు ప్రయోగిస్తే.. రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత.. అభివృద్ధి చేసిన ASLV కూడా నాలుగు సార్లు ప్రయోగిస్తే.. రెండు సార్లు మాత్రమే విజయవంతమయ్యింది. ఈ రెండు ఉపగ్రహ వాహక నౌకల అనుభవంతో.. పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్‌ను తయారు చేసింది ఇస్రో. 1993 సెప్టెంబర్ 20న IRS-1Eని మోసుకుని నింగికెగిసిన PSLV-D1 లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. కానీ.. ఆ తర్వాత.. వరసగా 14 సార్లు విజయవంతంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి.. తన సత్తా చాటుకొంటి. ఇస్రోకు వాణిజ్య పరంగా ఉపయోగపడుతున్న వాహకనౌక కూడా ఇదే. IRS శ్రేణి ఉపగ్రహాలతో పాటు.. చంద్రయాన్-1ను కూడా ఈ పీఎస్‌ఎల్‌వీనే కక్ష్యలోకి చేర్చింది.
పీఎస్‌ఎల్పీ త్వరాత విజయవంతమైన వాహకనౌక.. జీఎస్‌ఎల్‌వి. ఇన్సాట్ శ్రేణి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడానికి ఉపయోగిస్తారు. ఐదుసార్లు ప్రయోగించగా.. నాలుగుసార్లు విజయం సాధించింది. GSLV త్రీని మరింత ఆధునిక పరిజ్ఞానంతో ఇస్రో అభివృద్ధి చేస్తోంది. తాజాగా.. భువన్ పేరుతో.. ఇమేజ్ మ్యాపింగ్ సర్వీస్‌ను కూడా ప్రారంభించింది ఇస్రో. ప్రపంచంలోని ఏమూలైనా చూడగలిగే.. గూగుల్‌ఎర్త్, వీకీ మ్యాపియాలకు పోటీగా ఈ సర్వీస్‌ను అభివృద్ధి చేసింది. గూగుల్ ఎర్త్‌కన్నా.. ఎంతో నాణ్యమైన చిత్రాలను.. రకరకాల ఫీచర్లతో ఈ భువన్‌లో చూడొచ్చు. ఏడాది క్రితం తన శాటిలైట్లద్వారా తీసిన ఫోటోలను భువన్‌లో అందుబాటులో ఉంచింది.. ఇస్రో. టెక్నాలజీని సామాన్యుడి దరికి చేర్చడంలో మరో ముందడుగు వేసింది.
భువన్‌పై ఇప్పటికే ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ ప్రాజెక్టు కూడా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చింది. అందుకే భవిష్యత్ ప్రాజెక్టుల కోసం.. సన్నాహాలు చేస్తోంది. ఇందులో మొదటిది.. 2104 కల్లా అంతరిక్షంలోకి మనిషిని పంపించడం. అంగారక గ్రహంతో పాటు.. ఉల్కలపైనా ఇదే సమయంలో పరిశోధనలు చేయాలని భావిస్తోంది ఇస్రో. విక్రం సారాభాయ్ మొదలుకొని.. సతీశ్‌ధావన్, కస్తూరి రంగన్, ఇప్పుడు మాథవన్ నాయర్... ఇస్రోకు సరైన మార్గనిర్దేశం చేస్తుండడంతో.. అంతరిక్షంలో అగ్రరాజ్యాల సరసన సగర్వంగా నిలబడగలిగింది భారత్.
Read more...
నిప్పులు చిమ్ముకుంటూ.. భారత రాకెట్లు ఆకాశాన్ని చీల్చుకొని అంతరిక్షంలోకి దూసుకువెళుతుంటే.. ప్రపంచమంచా నిబిడాశ్చర్యంతో చూసింది. మన సత్తాకు సలామ్ చేసింది. అగ్రరాజ్యాలకే పరిమితమైన స్పేస్ రీసెర్చ్‌లో మనకూ ప్రత్యేకస్థానం లభించిందంటే.. దానికి కారణం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో. ఎన్నో విజయాలు.. మరెన్నో ప్రణాళికలతో..
భారత కీర్తిపతాకను.. వినువీధుల్లో ఎగరవేస్తోంది ఇస్రో. ఆగస్టు 15తో నలభై వసంతాలను పూర్తి చేసుకొంది ఈ సంస్థ. ఈ నాలుగ దశాబ్దాల్లో.. ఎవరూ ఊహించలేని విజయాలను సొంతం చేసుకొంది. అంతరిక్ష ప్రయోగాల్లో మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ఏకైక సంస్థ మన ఇస్రో. ఉపగ్రహాలను విజయవంతగా ప్రయోగించడంలో మనకు మనమే సాటి. ఇస్రోకు అత్యంత నమ్మకమైన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్.. PSLV ద్వారా మొత్తం 32 ఉప్రగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడితే.. అందులో.. పదహారు ఇతర దేశాలకు చెందినవి కావడమే దీనికి నిదర్శనం. ఇన్ని విజయాలు సాధిస్తున్న ఇస్రో ఏర్పాటు వెనుకున్న ఒకే ఒక వ్యక్తి విక్రం సారాభాయ్. 1957లో స్పుత్నిక్ ఉపగ్రహాన్ని రష్యా ప్రయోగించిన వెంటనే.. అంతరిక్ష పరిశోధనలకున్న అవసరాన్ని ఆయన గుర్తించారు. అప్పటి ప్రధాని నెహ్రూను ఒప్పించి.. స్పేస్ రీసెర్చ్ వైపు అడుగులు వేయించారు. భారత అణుశక్తి పితామహుడు హోమీబాబా పర్యవేక్షణలో 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటయ్యింది. 1969లో ప్రత్యేకంగా అంతరిక్ష పరిశోధనల కోసం ఇస్రో రూపుదిద్దుకొంది. చిన్న చిన్న వైఫల్యాలున్నప్పటికీ.. ఇస్రో సాధించిన విజయాలే ఎక్కువ. ప్రస్తుతం రెండు రకాల ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తోంది. మొదటిది.. ఇన్‌శాట్. రెండోది.. ఐఆర్‌ఎస్. చంద్రయాన్ ప్రాజెక్టుతో.. ప్రపంచదేశా దృష్టిని ఆకర్షించిన ఇస్రో.. త్వరలోనే.. సూర్యుడి పని కూడా పట్టడానికి సిద్ధమవుతోంది.
భారత్‌లో టెలివిజన్ ప్రసారాలు ఇంతగా ఊపందుకున్నాయన్నా... రేడియో ప్రసారాల్లో భారీ మార్పులు వచ్చాయన్నా... మొబైల్స్ సామాన్యుడిదరికి చేరాయన్నా.. దానికి ఓ రకంగా ఇస్రోనే కారణం. ఇస్రో ప్రయోగించిన ఇన్‌శాట్ ఉపగ్రహాలవల్లే నిరంతరాయంగా ఈ ప్రసారాలు జరుగుతున్నాయి. ఆసియా-పసిఫిక్ దేశాల్లోనే.. ఇన్‌సాట్ ఉపగ్రహాలది అతిపెద్ద శ్రేణి. ఇది కూడా మనం మరోదేశంపైన ఆధారపడకుండా.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న టెక్నాలజీ. ఇక వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి.. IRS శ్రేణి ఉపగ్రహాలను, దూరవిద్యను అందించడానికి ఎడ్యుశాట్‌ను ప్రయోగించింది ఇస్రో. పైగా.. ఇప్పుడు వ్యాపారమూ చేయగలుగుతోంది. ఇస్రో ద్వారా.. ప్రయోగిస్తే.. కచ్చితంగా కక్ష్యలోకి ఉపగ్రహాలు వెళ్లతాయన్న నమ్మకం.. ప్రపంచ దేశాలది. అందుకే.. ఇస్రోకు ఆర్డర్లమీద ఆర్డర్లు వచ్చిపడుతున్నాయి.
విజయపరంపర
తొలినాళ్లలో.. కొన్ని వైఫల్యాలు ఎదురైనప్పటికీ వాటిని చాలా వేగంగానే ఇస్రో అధిగమించింది. భారత తొలి ఉపగ్రహ వాహక నౌక.. SLV నాలుగుసార్లు ప్రయోగిస్తే.. రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత.. అభివృద్ధి చేసిన ASLV కూడా నాలుగు సార్లు ప్రయోగిస్తే.. రెండు సార్లు మాత్రమే విజయవంతమయ్యింది. ఈ రెండు ఉపగ్రహ వాహక నౌకల అనుభవంతో.. పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్‌ను తయారు చేసింది ఇస్రో. 1993 సెప్టెంబర్ 20న IRS-1Eని మోసుకుని నింగికెగిసిన PSLV-D1 లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. కానీ.. ఆ తర్వాత.. వరసగా 14 సార్లు విజయవంతంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి.. తన సత్తా చాటుకొంటి. ఇస్రోకు వాణిజ్య పరంగా ఉపయోగపడుతున్న వాహకనౌక కూడా ఇదే. IRS శ్రేణి ఉపగ్రహాలతో పాటు.. చంద్రయాన్-1ను కూడా ఈ పీఎస్‌ఎల్‌వీనే కక్ష్యలోకి చేర్చింది.
పీఎస్‌ఎల్పీ త్వరాత విజయవంతమైన వాహకనౌక.. జీఎస్‌ఎల్‌వి. ఇన్సాట్ శ్రేణి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడానికి ఉపయోగిస్తారు. ఐదుసార్లు ప్రయోగించగా.. నాలుగుసార్లు విజయం సాధించింది. GSLV త్రీని మరింత ఆధునిక పరిజ్ఞానంతో ఇస్రో అభివృద్ధి చేస్తోంది. తాజాగా.. భువన్ పేరుతో.. ఇమేజ్ మ్యాపింగ్ సర్వీస్‌ను కూడా ప్రారంభించింది ఇస్రో. ప్రపంచంలోని ఏమూలైనా చూడగలిగే.. గూగుల్‌ఎర్త్, వీకీ మ్యాపియాలకు పోటీగా ఈ సర్వీస్‌ను అభివృద్ధి చేసింది. గూగుల్ ఎర్త్‌కన్నా.. ఎంతో నాణ్యమైన చిత్రాలను.. రకరకాల ఫీచర్లతో ఈ భువన్‌లో చూడొచ్చు. ఏడాది క్రితం తన శాటిలైట్లద్వారా తీసిన ఫోటోలను భువన్‌లో అందుబాటులో ఉంచింది.. ఇస్రో. టెక్నాలజీని సామాన్యుడి దరికి చేర్చడంలో మరో ముందడుగు వేసింది.
భువన్‌పై ఇప్పటికే ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ ప్రాజెక్టు కూడా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చింది. అందుకే భవిష్యత్ ప్రాజెక్టుల కోసం.. సన్నాహాలు చేస్తోంది. ఇందులో మొదటిది.. 2104 కల్లా అంతరిక్షంలోకి మనిషిని పంపించడం. అంగారక గ్రహంతో పాటు.. ఉల్కలపైనా ఇదే సమయంలో పరిశోధనలు చేయాలని భావిస్తోంది ఇస్రో. విక్రం సారాభాయ్ మొదలుకొని.. సతీశ్‌ధావన్, కస్తూరి రంగన్, ఇప్పుడు మాథవన్ నాయర్... ఇస్రోకు సరైన మార్గనిర్దేశం చేస్తుండడంతో.. అంతరిక్షంలో అగ్రరాజ్యాల సరసన సగర్వంగా నిలబడగలిగింది భారత్.
4, ఆగస్టు 2009, మంగళవారం
నాసా బంధించిన భూవాతావరణం
Categories :

ఈ ఫోటోను నాసా వ్యోమగాములు ఎండీవర్ లో వస్తూ తీసారు. సూర్యాస్తమయం సమయం లా కనిపిస్తున్నప్పటికీ ఇది భూవాతావరణం ఫోటో. జూలై 29 న ఈ ఫోటోను తీసారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)







