కొన్ని రోజులుగా రాష్ట్రరాజకీయాల్లో కాక పుట్టించిన అఖిలపక్ష సమావేశం ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర హోం శాఖ పిలుపు అందుకున్న అన్ని పార్టీలు.. సమావేశానికి హాజరై తమ వాదనలు వినిపించాయి. మెజార్టీ పార్టీలు తెలంగాణకు అనుకూలంగానే వాదించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని బీజేపీ లేఖను హోంమంత్రి షిండేకు అందిస్తే.. గతంలో ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామంటూ చంద్రబాబు రాసిన లేఖను అందించారు టీడీపీ నేతలు. కాంగ్రెస్ తరపున సురేశ్ రెడ్డి తెలంగాణ తరపున వాదన వినిపించారు. గాదె వెంకటరెడ్డి మాట్లాడుతుండగా, షిండే వారించి, మరో పార్టీకి అవకాశమిచ్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. సీపీఎం మాత్రం సమైక్యరాష్ట్రాన్నే కొనసాగించాలని కోరింది. నెలరోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరింది. దీనికి షిండే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తెలంగాణ విషయంలో ఇదే చివరి అఖిలపక్ష సమావేశం అని ఆయన ప్రకటించారు. వైఎస్సార్ సీపీ ఏ నిర్ణయమూ తీసుకోలేమని చెప్పినట్లు తెలుస్తోంది.
Read more...
all party meeting లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
all party meeting లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
28, డిసెంబర్ 2012, శుక్రవారం
మొదలైన అఖిలపక్షం
Categories :
తెలంగాణపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం మొదలయ్యింది. కాంగ్రెస్ నుంచి గాదె వెంకటరెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ కుమార్ రెడ్డిలు పాల్గొంటున్నారు. ఇద్దరూ రెండు ప్రాంతాల అభిప్రాయాలను చెప్పే అవకాశం ఉంది. టీడీపీ నుంచి యనుమల, కడియం పాల్గొంటున్నారు. ఒకే అభిప్రాయాన్ని చెబుతామంటున్న టీడీపీ నేతలు తమ అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో హోంమంత్రికి అందించనున్నారు. టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, నాయని, వైఎస్సార్ సీపీ నుంచి మైసూరారెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, సీపీఎం నుంచి రాఘవులు, జూలకంటి, సీపీఐ నుంచి నారాయణ, గుండా మల్లేశ్, ఎంఐఎం నుంచి అసదుద్దీన్, జీవీకే నాయుడులు పాల్గొంటున్నారు. ఎంఐఎం సమైక్య రాష్ట్రానికే పట్టుబడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లోవిడగొట్టాలంటే రాయలతెలంగాణను ఏర్పాటు చేయమంటోంది. సీపీఐ తెలంగాణకు మద్దతిస్తుండగా, వైఎస్సార్ సీపీ కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామంటోంది. పదకొండున్నర కల్లా ఈ భేటీ ముగిసిపోనుంది. అనంతరం షిండే మీడియా ముందు సమావేశ వివరాలను వెల్లడించనున్నారు.
Read more...
18, డిసెంబర్ 2012, మంగళవారం
కాంగ్రెస్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు?
Categories :
రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశానికి ముందు కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అఖిలపక్ష సమావేశాన్ని టార్గెట్ చేసుకుని అటు టీఆర్ ఎస్ , ఇటు తెలంగాణ జేఏసీలు పావులు కదుపుతున్నాయి. షిండేతో జరిగే సమావేశంలో ఒకే అభిప్రాయాన్ని చెప్పాలని ఒత్తిడి తెస్తున్నాయి. అటు పాదయాత్రలు తెలంగాణలో సాగుతుండడంతో టీడీపీ, వైఎస్సార్ సీపీలు కూడా రాష్ట్రవిభజనకు సానుకూలంగానే చెప్పే అవకాశం ఉంది. అఖిలపక్షంలో ఏం చెబుతామన్నది చెప్పకపోయినా.. సమావేశానికి ఒక్కరినే పంపిస్తామని, తమ నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటిస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అయితే.. స్వయంగా చంద్రబాబే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని టీడీపీలోని తెలంగాణ ప్రాంత నేతలు కోరుతున్నారు. అటు టీఆర్ఎస్ కూడా దీన్నే డిమాండ్ చేస్తోంది. అయితే.. చంద్రబాబు మాత్రం ఇంతవరకూ ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు.
వైఎస్సార్ సీపీ కూడా అఖిలపక్షంలో తమ నిర్ణయాన్ని స్పష్టంగా చెబుతామంటోంది. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీనే. అఖిలపక్షంలో కార్నర్ అయ్యేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని తెలుస్తోంది. కాంగ్రెస్ వైఖరి చెప్పకుండా, మిగిలిన పార్టీల అభిప్రాయం కోరడం సరికాదని అన్ని పార్టీలు వాదిస్తున్నాయి. మిగిలిన పార్టీలో అఖిలపక్షంలో చెప్పాల్సిన విషయంపై కాస్త స్పష్టత వచ్చినా.. కాంగ్రెస్ లో మాత్రం ఈ విషయంపై పెద్ద వాగ్వాదమే జరుగుతోంది. మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో రగిలిపోతున్న కావూరి.. సీమాంధ్రలో విపరీతంగా పర్యటిస్తున్నారు. విద్యార్థి జేఏసీలు ఏర్పాటు చేస్తున్న సభల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి వీల్లేదంటున్నారు. సీమాంధ్ర నేతలంతా కూడా విభజనకు వ్యతిరేకంగానే కనిపిస్తున్నారు. అఖిలపక్షంలో రెండు అభిప్రాయాలు చెప్పాల్సిందేనంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఒక్క అభిప్రాయాన్నే చెప్పాలంటున్నారు. దీంతో అఖిలపక్షంలో కాంగ్రెస్ ఇరుకున పడడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే తప్ప.. రాష్ట్ర నాయకత్వానికి ఈ తలనొప్పి తగ్గేలా లేదు. ఒకవేళ అన్ని పార్టీలు స్పష్టత ఇచ్చి, కాంగ్రెస్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే మాత్రం.. తెలంగాణ ప్రాంతంలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుదన్న వాదన వినిపిస్తోంది.
6, డిసెంబర్ 2012, గురువారం
తెలంగాణ విషయంలోనూ ఏకాభిప్రాయానికి అదే అర్థమా?
Categories :
లోక్ సభలో ఎఫ్.డిఐపై ఓటింగ్ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ ఓ ఊహించని వివరణ ఇచ్చారు. "ఎన్నికైన ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. దాన్నెవరూ అడ్డుకోజాలరు. ఏకాభిప్రాయం అంటే ఎక్కువ మంది ఆమోదం పొందడమే కాని ఏకగ్రీవం అని అర్థం కాదు" అన్నారు ఆనంద్ శర్మ. దేశంలోని 18 పార్టీల్లో 14 పార్టీలు రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐలను వ్యతిరేకించినా.. కాంగ్రెస్ మాత్రం పట్టుబట్టి, లోకసభనుంచి ఎస్పీ, బీఎస్పీలను పంపించేసి మరీ, ఓటింగ్ లో నెగ్గుకొచ్చింది.
ఇంతవరకూ బాగానే ఉంది, కానీ, దాదాపు నాలుగేళ్లుగా తెలంగాణ విషయంలో సాగుతున్నపోరాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే స్థాయిలో ఎందుకు చొరవ చూపించడం లేదు. ఏకాభిప్రాయం వచ్చే వరకూ తెలంగాణపై నిర్ణయం తీసుకోలేమని చెప్పుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఎఫ్.డి.ఐల విషయంలో నిర్వచించిన ఏకాభిప్రాయ అర్థాన్ని.. ఎందుకు ఆపాదించదు. ?
రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 8 పార్టీల్లో ప్రధానంగా తెలంగాణపై ఖచ్చితమైన నిర్ణయం ప్రకటించాల్సింది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీనే ముందుగా తన నిర్ణయాన్ని(ఎఫ్.డి.ఐ ల తరహాలో) ప్రకటించాలి. తెలుగుదేశం పార్టీ కూడా రెండు సిద్ధాంతాలను కట్టిబెట్టి ఏదో ఓ సిద్ధాంతాన్నే నమ్ముకోవాలి. పాము చావకుండా, కర్ర విరగకుండా అన్న రీతిలో వ్యవహరిస్తే, వచ్చే ఎన్నికల్లో అందుకు తగిన పాఠాన్నే నేర్చుకోవాల్సి వస్తుంది. ఎనిమిది పార్టీల్లో టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐలు స్పష్టంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణకు స్పష్టంగా వ్యతిరేకంగా ఉన్నది సీపీఎం ఒక్కటే. వైఎస్సార్ సీపీ, లోక్ సత్తాలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామంటున్నాయి. ఎంఐఎం రాయల తెలంగాణకు ఓకే అంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకే ఎక్కువ మెజార్టీ ఉన్నట్లు.
ఏకాభిప్రాయమంటే లోక్ సభ సాక్షిగా కేంద్రమంత్రి ఇచ్చిన వివరణకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ కట్టుబడి ఉండాలి. డిసెంబర్ 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో వచ్చే అభిప్రాయాల విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించారు. అన్ని పార్టీలు ఒప్పుకుంటాయని కాకుండా, రాష్ట్ర విభజనకు మెజార్టీ ఉందా లేదా అనే లెక్కచూడాలి. ఈ విషయంలో అటు తెలంగాణ ఎంపీలు, తెలంగాణకు మద్దతు పలుకుతున్న బీజేపీ, అనుకూలంగా వ్యవహరిస్తామంటున్న టీడీపీ, వైఎస్సార్ సీపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఎన్నికైన ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే హక్కుందని, దాన్ని ఎవరూ ఆపలేరని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కాబట్టి, తెలంగాణ విషయంలో ఏదో ఒకటి తేల్చేయాలి.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



