ఉనికికోసం చిరంజీవి ఆరాటం
Categories :
chiranjeevi . congress . POLITICS . samaikya protest . seemandhra . TOP
శీలానికి చుక్కెదురు
Categories :
bifurcation . congress . division . hyderabad . jd sheelam . POLITICS . samaikya protest . seemandhra . TOP . ut
విజయవాడ వచ్చిన జేడీ శీలాన్ని సమైక్యవాదులు అడ్డగించారు. ఓ స్టార్ హోటల్లో ప్రెస్‌మీట్‌కు శీలం ఏర్పాట్లు చేసుకోగా, అదే జరిగితే హోటల్‌పై దాడి చేస్తామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, హోటల్ యజమాన్యం ప్రెస్‌మీట్‌కు అనుమతించలేదు. దీంతో హోటల్ బయటే మీడియాతో మాట్లాడారు శీలం. మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనూ సమైక్య ఉద్యమకారులు మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేయడంతో ఆయన అసహనానికి గురయ్యారు.
ఏం సాధించారని విరమించారు..?
Categories :
apngo . news . samaikya protest . seemandhra . strike . strike call off . TOP
ఎన్నో కారణాలు
వారితో మొదలైన సమ్మె ఉద్యమంలోకి ఇతర సంఘాలు క్రమక్రమంగా చేరాయి. అయితే, అలానే విడిపోయి సమ్మెను కూడా విరమించాయి. విద్యుత్ ఉద్యోగులు, సెక్రటేరియెట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు ఒకరి తర్వాత ఒకరు సమ్మె విరమించడంతో ఏపీఎన్జీవోలపై తీవ్రంగా ఒత్తిడి పెరిగిపోయింది. పైగా రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో చిన్న ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అసలు, ఉద్యోగులు చేస్తున్న కీలకమైన డిమాండ్లను తీర్చడం సంగతి అటుంచితే ఇటు రాష్ట్రంలో గానీ, అటు కేంద్రంలో గానీ పట్టించుకునే నాథుడే లేడు. పైగా, రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వారందరినీ దూరం చేసుకున్నారు ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులను చర్చలకు పిలిచిందే లేదు. భవిష్యత్తులో పిలుస్తుందన్న గ్యారెంటీలేదు .మరోవైపు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వడివడిగా సాగిపోతోంది. ఈ నేపథ్యంతో సమ్మె చేస్తూ, ఉద్యోగాలకు దూరం కావడం వల్ల వచ్చే ఉపయోగమేమీ లేదని సీమాంధ్ర ఉద్యోగులు చాలా మంది భావించారు. కేంద్ర మంత్రులే ఇప్పుడేమీ చేయలేమని చెప్పడంతో ఇంకెన్ని రోజులు సమ్మె చేసినా ఉపయోగం లేదని తేలిపోయింది. పైగా ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగిపోవడంతో, ఉద్యోగ సంఘాల నేతలపై తీవ్ర స్థాయిలోనే ఉద్యోగులు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెనుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది . కానీ రెండు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు పడి, జనాన్ని ఇబ్బందులు పెట్టి చేసిన సమ్మె ఏమీ సాధించకుండానే విరమించుకోవాల్సి రావడమే ఉద్యోగ సంఘాల నేతలకు మింగుడుపడడం లేదు.
సమ్మె విరమించిన ఏపీఎన్జీవోలు
Categories :
apngo . news . samaikya protest . seemandhra . strike call off . TOP
ఈ దీక్ష అప్పుడు చేయలేదెందుకు ?
Categories :
chandrababu . congress . deeksha . jagan . POLITICS . samaikya protest . tdp . telangana . TOP . ysrcp
రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి జగన్ హైదరాబాద్ లో దీక్ష చేస్తుంటే, రాష్ట్ర విభజనతో ఇక జాతీయ రాజకీయాలే దిక్కనుకుంటున్న చంద్రబాబు ఢిల్లీలో సమైక్యాగ్రహం(సత్యాగ్రహం అనలేమేమో..?) చేపట్టారు. సీమాంధ్రలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా ఇలా దీక్షలకు దిగడం రాజకీయనాయకుల దృష్టిలో చూసినప్పుడు తప్పు కాదు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల అభిమానం దక్కించుకోవాలి కాబట్టి, నేతలు ఈ తరహా కుటిలయత్నాలు ఎన్నో చేస్తుంటారు. కొంతకాలం క్రితం కేసీఆర్ కూడా చేసింది ఇదే. అయితే, అప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం, అన్ని రాజకీయపార్టీలు విభజనకు అంగీకరించడంతో కేంద్రం దిగిరావాల్సి వచ్చింది. ఈ సారి ఇటు జగన్, అటు చంద్రబాబు చేస్తున్న దీక్షలకు కేంద్రం దిగివస్తుందా రాదా అన్నదే ఊహకు అందని విషయం.
అయితే, నిజంగా చంద్రబాబుకు, జగన్‌కు దీక్షలు చేసే నైతికహక్కు ఉందా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. ప్రజల కోసమే నేతలు దీక్ష చేస్తున్నట్లైతే గనక ఈ దీక్షలు వాస్తవానికి ఎప్పుడో చేసి ఉండాలి. డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం, తిరిగి డిసెంబర్ 23న మాటమార్చగానే, వీరిద్దరూ దీక్ష చేసి ఉండాలి. తెలంగాణ ప్రజలను మోసం చేయవద్దంటూ గొంతు విప్పాలి. కానీ, అప్పుడు చేయలేదు. ఇప్పుడు చేసే హక్కు కూడా లేదు.
ఇంకా కాదంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న రెండు రోజులకు చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి, అపరమేధావిలా సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని, సీమాంధ్ర అభివృద్దికి ప్రత్యేక పథకాలను అమలు చేయాలంటూ ప్రకటన చేశారు. దాని బదులు, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, సమన్యాయం కోసం దీక్ష చేస్తున్నానని అంటే కాస్త సీమాంధ్ర ప్రజల్లోనైనా గౌరవం దక్కి ఉండేది. కానీ, అప్పుడు ఆ మాటే ఎత్తని బాబుకు, ఇప్పుడు దీక్ష చేసే హక్కే లేదు.
సీడబ్ల్యూసీ ప్రకటనకు ముందే వైసీపీఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి, సమన్యాయం పేరుతో కొంతకాలం కబర్లు చెప్పి, సమైక్య శంఖారావం పేరుతో చెల్లెలిని సీమాంధ్రల నడిపించిన జగన్‌కూ ఇప్పుడు దీక్ష చేసే నైతిక హక్కు లేదు. ఇడుపులపాయలో తండ్రి సమాధి సాక్షిగా రాష్ట్రాన్ని విభజించమనే శక్తిగానీ, విభజిస్తే ఆపే శక్తిగానీ లేదంటూ వీరలెవల్లో ఫోజిచ్చిన వైఎస్ తనయుడు, అదే మాటకు కట్టుబడి ఉంటే గనక దీక్ష చేయాల్సిన అవసరమే లేదు.
వీరిద్దరి దీక్షలు జనాన్ని మోసం చేయడానికి, రాజకీయంగా లబ్ది పొందడానికే తప్ప, సీమాంధ్ర ప్రజలకు ఏదో పొడిచేయడానికి కాదు. వైసీపీ ఇప్పటికీ సీమాంధ్ర పార్టీ అయిపోయింది కాబట్టి, రాజకీయ అవసరాల దృష్ట్యా సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ చేస్తుందనుకోవచ్చు. కానీ, తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతున్న చంద్రబాబు, ఈ దీక్షను సమన్యాయం కోసమే చేస్తున్నట్లు చెబుతున్నారు. అసలు సమన్యాయం అంటే ఏమిటి..? ఏం చేస్తే రెండు ప్రాంతాలకు న్యాయం చేసినట్లవుతుంది? ఏం చేస్తే రెండు ప్రాంతాల ప్రజలు ఆమోదాన్ని తెలుపుతారు..? ఈ ప్రశ్నలకు టీడీపీ అధినేత బాబు గానీ, టీడీపీ నేతలు గానీ సమాధానం చెప్పగలరా..? సమైక్యంగా ఉంచితే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందన్న గ్యారెంటీని జగన్ ఇవ్వగలరా.. ? ఈ పరిస్థితుల్లో కేంద్రం వెనక్కి తగ్గితే, సీమాంధ్రలో ఆందోళనలు తగ్గవచ్చేమోగానీ, తెలంగాణలో మొదలుకాకుండా ఉంటాయా..? అందుకే, దీక్షలతో, రెచ్చగొట్టే మాటలతో కాక, సమస్య పరిష్కారానికి ఏం చేయాలన్నది విజ్ఞత గల నేతల్లా అటు జగన్, ఇటు చంద్రబాబు ఆలోచించాల్సి ఉంది. ఉద్యమం ఇంకా కొనసాగితే అంతిమంగా నష్టపోయేది రాష్ట్రం, జనమే కాబట్టి, పరిష్కారానికి కాంగ్రెస్ తో కలిసికట్టుగా ఈ రెండు పార్టీలు వెతకాల్సి ఉంది.
జనాన్ని హింసించి సాధించేదేమిటి?
Categories :
news . power strike . samaikya protest . seemandhra . telangana . TOP
తెలుగువారిని విభజించే హక్కు కేంద్రానికి లేదని వాదిస్తున్న ఉద్యోగులు, ప్రజలను ఇబ్బంది పెట్టే హక్కు తమకు ఉందా లేదా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ కేంద్రంపై నిజంగానే ఒత్తిడి తేవాలనుకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్లకు కరెంట్ కట్ చేయండి, రైలు సర్వీసులకు నిలిపివేయండి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు నిలిపివేయండి.. అంతేగానీ, సామాన్యుడి ఇంటికి వెళ్లే విద్యుత్ నిలిపివేసి వారి ప్రాణాలతో ఆడుకోకండి. ఇప్పటికే సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగుల తీరుపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పలుచోట్ల సబ్ స్టేషన్ల ముందు కరెంటు సరఫరా ఇవ్వాలంటూ ధర్నాలు చేస్తున్నారు. ఇది మరింత ఉధృతమవుతే, పూర్తిగా సమైక్య ఉద్యమానికే ఎసరువచ్చే అవకాశం ఉంది. ఆ ఉద్యమంపైనే ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది.
బొత్స సామ్రాజ్యం కూలుతోందా
Categories :
botsa . congress . POLITICS . samaikya protest . seemandhra . stone attack . TOP . viziayanagaram
ఉత్తరాంధ్రలో ఇంతకాలం ఏకఛత్రాధిపత్యం వహిస్తూ, విజయనగరం రాజకీయాలను పూర్తిగా శాసిస్తూ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నిర్మించుకున్న సామ్రాజ్యపు పునాదులు, సమైక్య ఉద్యమ దెబ్బకు బీటలు వారుతున్నాయి. ఇంతకాలం బొత్స ఇంటివైపు కన్నెత్తి చూడడానికి కూడా జనం, ప్రత్యర్థులు భయపడే పరిస్థితి ఉండగా, ఇప్పుడు సొంత ఇంటికి రావాలంటేనే బొత్స కుటుంబం భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి బొత్స భార్య ఝాన్సీ పూర్తిగా నిరాకరించడం, బొత్స మొదట్లో విభజనకు అంగీకరించి, ఈ మధ్య సమైక్యవాదాన్ని వినిపిస్తున్నా ఆయన వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమైక్యవాదులు బొత్స కుటుంబమే లక్ష్యంగా విజయనగరంలో ఆందోళన చేపట్టారు. శుక్రవారం బొత్స కుటుంబానికి చెందిన సత్యవిజన్ కేబుల్ కార్యాలయాన్ని తగలబెట్టి, ఇంటిపైనా, కాలేజ్ పైనా దాడులు చేశారు. శనివారం బొత్స సోదరుడు శ్రీనివాసరావు ఇంటిపైనా దాడులు చేసి, కేబుల్ పరికరాలను ధ్వంసం చేశారు. బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లిలోని ఆయన కార్యాలయాలన్నింటినీ ధ్వంసం చేశారు.
ఇవాళ కాంగ్రెస్ నేత తమ్మనశెట్టి ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. పోలీసులు ఆందోళనలు నియంత్రించడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా, వాటి తీవ్రత క్రమంగా పెరుగుతోందే తప్ప, తగ్గుముఖం పట్టడం లేదు. కలెక్టరేట్ దగ్గర జరిగిన ఆందోళనలు కూడా హింసాత్మకంగా మారాయి. పోలీసులపై ఆందోళనకారులు తరచూ రాళ్లదాడికి దిగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బొత్స ప్రత్యర్థులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న వదంతులున్నాయి. ఆందోళనల్లో ఇద్దరు విద్యార్థులు చనిపోయారంటూ వ్యాపించిన వదంతులు కూడా సమైక్యవాదుల్లో మరింత ఆగ్రహాన్ని కలిగించాయి. అయితే, ఇంతవరకూ ఎవరూ చనిపోలేదని వదంతులు నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, బొత్స సామ్రాజ్యం కూలిపోతున్నట్లే కనిపిస్తోంది.కాంగ్రెస్ హంస కేసీఆర్ :అశోక్ బాబు
Categories :
apngo . ashok babu . hanuman junction . kcr . krishna district . news . rythu garjana . samaikya protest . TOP
ఉద్యమ పాటలంటే తెలంగాణ పాటలే
ఉద్యమ పాటలంటే తెలంగాణ పాటలే అన్నారు అశోక్ బాబు. తెలంగాణ ఉద్యమ పాటలున్నంత ఊపుగా, సమైక్య పాటలను రాయలేకపోతున్నామని గజల్ శ్రీనివాస్ అన్నారని ఆయన ప్రకటించారు. తెలంగాణ పాటలు వింటే ఉత్సాహం వస్తుందని, వాటిని వినడానికి సమైక్యవాదులకు అహం అడ్డువస్తుందని కానీ, దాన్ని వదలి అంతా తెలంగాణ పాటలు వినాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అప్పుడే సమైక్య ఉద్యమానికి మరింత ఊపు వస్తుందన్నారాయన.
సమైక్య సింహం..కొత్తపార్టీ
ప్రస్తుతం సీఎం కిరణ్ తీరు చూస్తుంటే, తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికన్నట్లే ఉందని కాంగ్రెస్ లోని సీనియర్లు, మంత్రులే బాహటంగా వాపోతున్నారు. పార్టీని, మంత్రిమండలిని ఆత్మరక్షణలో పడేసేలా సీఎం కామెంట్లు చేస్తుండడంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంతో తలపడే స్టార్ బ్యాట్సమెన్ గా, సమైక్య సింహంగా సీఎం కిరణ్ ను ఇప్పటికే సీమాంధ్ర నేతలు, ఉద్యమకారులు పైకెత్తేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మరెవరూ అధిష్టానంతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి లేకపోవడంతో సమైక్యవాదులకు ఏకైక లీడర్ గా సీఎం కనిపిస్తున్నారు. అందుకే, ఉద్యోగుల్లో, ఉద్యమకారుల్లో ఆయనకు పూర్తి మద్దతు లభిస్తోంది. పైగా జగన్ సమైక్య స్టాండ్ తీసుకున్నప్పటికీ, కాంగ్రెస్ తో ఒప్పందంలో భాగంగానే బెయిల్ దక్కించుకున్నారన్న ప్రచారం ఆయనకు మైనస్ గా మారింది. సీమాంధ్రలోనూ ఇప్పుడు జగన్ పూర్తిస్థాయిలో ఆదరణ లేదు. ఇక అటు తెలంగాణ, ఇటు సమైక్య మాటలతో టీడీపీ ఎటూ కాకుండా ఉంది. కాంగ్రెస్ అధిష్టానంపై సీమాంధ్ర ప్రజలంతా మంటతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడితే, అది అందరికీ ప్రత్యామ్నాయంగా ఎదిగి, వచ్చే ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయవచ్చన్న చర్చ సమైక్యవాదుల్లో జరుగుతోంది. దీన్నంతా గమనించే, విశాఖ వేదికగా తాను కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నానని సీఎం చెప్పాలనుకున్నట్లు సమాచారం. మంత్రి గంటా ఏర్పాటు చేసిన ఈ టూర్ లో వంద కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను సీఎం ప్రారంభించాల్సి ఉంది. ఎక్కడా కాంగ్రెస్ జెండా అన్నది కనిపించకుండా, కేవలం సీఎం పోస్టర్లతోనూ, సమైక్యసింహం అంటూ కటౌట్లతోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే, సీఎం ప్రెస్ మీట్ పై అధిష్టానం తీవ్ర ఆగ్రహంగా ఉండడం, ఆయన ఫోన్ కాల్స్ కు కూడా స్పందించకుండా పక్కన పెట్టడం, చివరకు ఎవరు వెళ్లినా సమయం ఇచ్చి మాట్లాడే దిగ్విజయ్ కూడా సీఎం ఫోన్లకు స్పందించకపోవడంతో, ప్రస్తుతానికి ఈ కొత్త పార్టీ కాన్సెప్ట్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఏమైనా సమైక్య ఉద్యమం ఇదే స్థాయిలో కొనసాగి, కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ వైపే అడుగులు వేస్తే మాత్రం సీఎం కొత్త పార్టీ పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
సాంబయ్యకు సమైక్య సెగ
Categories :
congress . kavuri . POLITICS . samaikya protest . TOP . west godavari
మంత్రి టీజీపై చెప్పుల వర్షం
Categories :
attack . congress . kurnool . POLITICS . samaikya protest . tg venkatesh . TOP
ఆ దీక్షను ఈ దీక్ష డామినేట్ చేయగలుగుతుందా?
Categories :
deeksha . kcr . POLITICS . samaikya protest . seemandhra . telangana . TOP . trs . vijayamma . ysrcp
సీమాంధ్రలో సాగుతున్న సమైక్య ఉద్యమాన్ని మొదట్నుంచి సొమ్ము చేసుకునే పనిలో ఉన్న వైసీపీ, అందరికన్నా ముందుగానే రాజీనామాల అస్త్రాన్ని సంధించింది. ఇటీవలే, జగన్, విజయమ్మలు కూడా తమ పదవులకు రాజీనామాలు చేయడంతో, వైసీపీ పూర్తిగా సమైక్య వాదానికే మద్దతిస్తోందని తేలిపోయింది. తెలంగాణలో సీనియర్లంతా వైసీపీకి ఇప్పటికే రాజీనామాలు చేయడంతో, పూర్తిగా సీమాంధ్ర ప్రాంతంపైనే ఆశలు పెట్టుకుని, అక్కడ పట్టు పెంచుకోవడానికి పావులు కదుపుతోంది ఆ పార్టీ. అందులో భాగంగానే విజయమ్మ దీక్ష తెరపైకి వచ్చింది.
ప్రధానికి విజయమ్మ రాసిన లేఖలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరిగేలా విభజన చేయాలని, అలా చేయలేకపోతే మాత్రం రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారావిడ. ( అంటే విభజన కోరుకుంటున్న తెలంగాణకు అన్యాయం జరిగినా పర్వాలేదన్నమాట.) విజయమ్మ దీక్షతో సీమాంధ్ర వైసీపీకి పూర్తిగా పట్టు చిక్కుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ దీక్షలా విజయమ్మ దీక్ష కేంద్రంతో ప్రకటన చేయించగలదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు విజయమ్మను దీక్ష చేయడానికి కూర్చోనిస్తారా.. లేక ముందే అరెస్ట్ చేస్తారా అన్నదీ ఉత్కంఠను సృష్టిస్తోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం కొంతకాలం క్రితం నిరవధిక దీక్ష మొదలుపెట్టిన విజయమ్మ, ప్రభుత్వం ఎంతకీ పట్టించుకోకపోవడంతో, తనకు తానే విరమించాల్సి వచ్చింది. ఈసారి కూడా అదే పద్దతిలో ప్రభుత్వం వ్యవహరించవచ్చన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
సమైక్య ఉద్యమంలోకి జగన్, విజయమ్మ
Categories :
jagan . POLITICS . samaikya protest . seemandhra . telangana . TOP . vijayamma . ysrcp
సమైక్య ఉద్యమంలోకి బిచ్చగాళ్ల జేఏసీ..
Categories :
bikshagalla jac . division . news . samaikya protest . seemandhra . telangana . TOP . yachaka jac













