మాట్లాడితే కరెంట్ కట్. హైదరాబాద్లో మూడు గంటలు, కార్పొరేషన్లలో ఐదు గంటలు, జిల్లాల్లో ఆరు గంటలు, గ్రామాల్లో 12 గంటలు. ప్రస్తుతం మనదగ్గర అమలవుతున్న అధికారిక కరెంటు కోతలు. ఓ రకంగా కరెంటు లేకపోతే ఎంత నరకాన్ని అనుభవించాలో.. కరెంటుకు బానిసలమైపోయిన మనందరికి తెలుసు. అయితే.. కరెంటును సరిపడా ఎందుకు ఉత్పత్తి చేయడం లేదు.. నిజంగానే ఉత్పత్తి లేకా.. లేదంటో మరో ఉద్దేశం ప్రభుత్వాలకు ఉందా..!
" కరెంటు కోతలు నిజంగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. అణు ఆధారిత విద్యుదుత్పత్తిని మనం పెంచుకోవాల్సి ఉంది" - పల్లంరాజు, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి
కాకినాడ ఎంపీ, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లంరాజుగారు సోమవారం అన్న మాటలివి. ఆయన చేసిన ప్రకటనలోనే ఓ కీలక విషయం దాగి ఉంది. అదే అణు విద్యుత్. జపాన్ సునామీలో ఫుకూషిమా అణు ప్లాంట్ నాశనం కావడంతో, మన దగ్గర అణువిద్యుత్ కేంద్రాలపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. ప్రజలను ఈ విషయంలో ఒప్పించలేమని తెలుసుకున్న పాలకులు సరికొత్తమార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అదే కృత్రిమ కొరత. ఎడాపెడా కరెంటు కోతలతో, జనాన్ని విసిగిస్తే, అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని పాలకులు భావిస్తున్నట్లున్నారు. ప్రతీ మనిషికీ కరెంటు అవసరం ఉంది కాబట్టి, ఏదో రకంగా సప్లై చేయండని అడుగుతారు కాబట్టి.. ఆ తరహా వాతావరణం కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎదురు చూస్తున్నట్లున్నాయి.
Read more...
nuclear power plant లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
nuclear power plant లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
17, జులై 2012, మంగళవారం
విద్యుత్ కోతలన్నీ దానికోసమేనా..?
Categories :
news . nuclear power plant . pallam raju . power cuts . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

