కరుడు గట్టిన ఉగ్రవాది కసబ్ ఉరిశిక్ష అమలును ఆపరేషన్ కోడ్ ఎక్స్ గా నామకరణం చేసిన ప్రభుత్వం ఆఫ్జల్ గురు ఉరిశిక్షను ఆపరేషన్ త్రీస్టార్ గా పేర్కొంది. తీహార్ లోని మూడో నెంబర్ జైల్లో శిక్ష అమలుజరగడంతోనే ఆపరేషన్ త్రీస్టార్ అని వ్యవరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఉరిశిక్ష అమలు గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసని వారంటున్నారు. ఎప్పుడెప్పుడు ఏం చేయాలన్నది ముందుగానే నిర్ణయం జరిగిపోయిందని, అంతా ప్లాన్ ప్రకారం పూర్తి చేసుకున్నాకే, ఉరి తీసిన విషయం బయటకు వచ్చిందని వారంటున్నారు. ఆఫ్జల్ ను ఎక్కడ ఖననం చేయాలన్నదానిపై తర్జనభర్జనలేవీ జరగలేదని, దాన్ని కూడా ప్రభుత్వం ముందే నిర్ణయించిందని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు.
ఉరిశిక్షకు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ లెటర్ ను జైలు సూపరింటెండెంట్ కు అందించిన ఆఫ్జల్, దాన్నితన భార్యకు చేరాల్సిందిగా కోరాడు. తన మరణం గురించి వేదన చెందవద్దని, కొడుకును జాగ్రత్తగా పెంచాలని, ఇతర కుటుంబ విషయాలను అందులో పేర్కొన్నట్లు జైలు సిబ్బంది తెలిపారు.
Read more...
hang లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
hang లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, ఫిబ్రవరి 2013, మంగళవారం
దానిపేరు ఆపరేషన్ త్రీస్టార్ అట
Categories :
afzal guru . death . hang . news . operation three star . tihar jail . TOP
10, ఫిబ్రవరి 2013, ఆదివారం
అదంతా మోడిని తట్టుకోవడానికేనా..?
Categories :
afzal guru . congress . election . hang . modi . POLITICS . rahul gandhi . sonia . TOP
మొన్న కసబ్.. నిన్న ఆఫ్జల్ గురు.. ఉగ్రవాదులకు ఉరిశిక్ష ఖరారు చేయడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఎవరూ ఊహించని దూకుడును ప్రదర్శిస్తోంది. ఉరిశిక్షల విషయంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పైళ్ల దుమ్ము దులుపుతోంది. ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తున్న సమయంలో మైనార్టీల ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాహసోపేతమైన చర్యే. మెజార్టీ ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టైనా సరే మైనార్టీలకు కొమ్ము కాయడమే లౌకికవాదమనుకునే కాంగ్రెస్ ఇంతటి తెంగుపు ప్రదర్శిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అసలు యూపీఏ ఇంత సాహసాన్ని ఎందుకు ప్రదర్శిస్తోంది..?
జైపూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో రాహుల్ ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పట్టాభిషేకం చేసింది సోనియా. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆయనే ప్రధాని అభ్యర్థని ప్రకటించినట్లయ్యింది. అటు గుజరాత్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించిన నరేంద్రమోడి బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా ఎదుగుతున్నాడు. దేశంలోని హిందూసంస్థలన్నీ మోడీ పేరునే బలపరుస్తున్నాయి. వీహెచ్ పీ ఆరెస్సెస్ లాంటి సంస్థలూ బీజేపీపై ఈ విషయంలో వత్తిడి తెస్తున్నాయి. బీజేపీలో దీనిపై భిన్నవాదనలు ఉన్నా, వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే మోడిమంత్రం జపించక తప్పని పరిస్థితి. ప్రస్తుతం దేశంలో మోడికి ఉన్న పాపులారిటీ, మరే లీడర్ కు లేదన్నది వాస్తవం. మీడియా జరుపుతున్న సర్వేల్లోనూ ప్రధాని అభ్యర్థిగా మోడినీ ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ కూడా మోడి కన్నా వెనుకబడే ఉన్నారు. సరిగ్గా ఇదే కాంగ్రెస్ పై ప్రభావం చూపించి ఉండొచ్చు.
చిన్న చితకా పార్టీలు బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో తప్పిస్తే, దేశవ్యాప్తంగా మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపే ఉంటుంది. ఇక బీజేపీకి ప్రధాన బలమైన హిందుత్వ ఓటు బ్యాంకును కొల్లగొడితే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలిచి, రాహుల్ ను ప్రధానిని చేసే అవకాశాలు రాకపోవచ్చు. పైగా, ఆఫ్జల్ గురు వ్యవహారాన్ని, హిందుత్వ ఉగ్రవాదం విషయాన్ని వచ్చే ఎన్నికల్లో బీజేపీ అస్త్రంగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే, బీజేపీకి ఆ అవకాశం లేకుండా చేయడానికే, ప్రభుత్వం హడావుడిగానే ఆఫ్జల్ గురును ఉరితీసినట్లు తెలుస్తోంది. దేశభద్రతకు సవాల్ విసురుతున్న ఉగ్రవాదంపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తామని ఈ రకంగా ఎన్నికలకు ముందు చెప్పుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.
హిందూ ఓట్లను ఆకర్షించడానికే కాంగ్రెస్ ఆఫ్జల్ గురును ఉరి తీయించి ఉండొచ్చనడానికి కళ్లముందే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. 2006 లో ఆఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆయన భార్య రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకుంది. కానీ, అంతకు ముందు నుంచి పెండింగ్లో ఉన్న వాటిపై నిర్ణయం తీసుకోకుండానే, ఈ ఫైల్ ను క్లియర్ చేయశారు. వాటిలోనూ ముఖ్యంగా రాజీవ్ గాంధీ హంతకులు ఉండడం గమనార్హం. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో ఉరిశిక్ష పడ్డ మురుగన్, శాంతన్, అరివులకు.. 1999 మే నెలలో సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. రెండువేల సంవత్సరంలో మెర్సీ పిటిషన్‌ను వీరు పెట్టుకున్నారు. ఈ కేసులో ఫైనల్ రికమండేషన్‌ను హోంశాఖ జూన్ 21, 2005న పంపించింది. ఈ పైల్ పెండింగ్ లోనే ఉంది. ఇక 1993 సెప్టెంబర్‌లో ఢిల్లీలో బాంబులు పేల్చిన ఖలిస్తాన్ (సిఖ్) తీవ్రవాది దేవిందర్ పాల్ సింగ్‌కు డిసెంబర్ 2002 లో సుప్రీం మరణశిక్ష విధించింది. 2003లో కరుణించమంటూ రాష్ట్రపతిని ఆయన వేడుకున్నాడు. ఆగస్టు 9, 2005న హోంశాఖ నుంచి సిఫార్సులు అంచాయి. అయినా.. ఈ ఫైల్‌కూ మోక్షం కలగలేదు. గంధపుచెక్కల దొంగ వీరప్పన్ అనుచరుడు సైమన్, మరో ముగ్గురుకి 2004 జనవరి 29న ఉరిశిక్ష పడింది. అదే ఏడాది రాష్ట్రపతిని శిక్ష తగ్గించమని ఆశ్రయించారు. 2005 మే2న హోంశాఖ ఈ ఫైల్‌ను రాష్ట్రపతి సెక్రటేరియెట్‌కు పంపించింది. దీన్ని కూడా పెండింగ్‌లోనే పెట్టారు. ఈ తీవ్రవాదులనందరినీ పెండింగ్ లో పెట్టి ఆఫ్జల్ గురు ఉరిపైనే నిర్ణయం తీసుకోవడాన్ని బట్టి, యూపీఏ వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. కేవలం హిందువుల ఓట్లు సంపాదించడానికే ఈ ప్రయత్నం చేసిందనుకోవచ్చు. అలా కాదనుకుంటే, ఎన్నికల్లోగానే మిగిలిన వారి ఉరిశిక్షలపైనా రాష్ట్రపతి నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.
Read more...
9, ఫిబ్రవరి 2013, శనివారం
ఆఫ్జల్ గురు ... ఆ చివరి క్షణాలు
Categories :
afzal guru . death . hang . news . parliament attack . TOP
ఉగ్రవాది ఆఫ్జల్‌గురుకు క్షమాభిక్ష ఇవ్వరాదన్న కేంద్ర హోంశాఖ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత, అన్ని వ్యవహాలు అత్యంత వేగంగా గుట్టుగా సాగిపోయాయి. శుక్రవారమే కోర్టు ఉరిశిక్షను అమలు చేసే తేదీని, సమయాన్ని ఖరారు చేసింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారమే వ్యవహరించిన తీహార్ జైలు అధికారులు.. ఉరి తీస్తున్నామన్న విషయాన్ని ఆ సాయంత్రమే అతనికి చెప్పారు అధికారులు. ఈ విషయం తెలియగానే గురు... ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అదే ఆలోచనలతో గడిపిన ఆఫ్జల్.. రాత్రి భోజనం కూడా చేయలేదు. కేవలం మంచినీళ్లు మాత్రమే తాగాడు..
చివరి క్షణాలను ప్రశాంతంగా గడపడం కోసం.. ఓ మత గ్రంథాన్ని ఇవ్వాల్సిందిగా కోరాడు ఆఫ్జల్ గురు. ఉదయాన్నే ఉరికంబం వైపు, మౌనంగా నడిచాడు. మానసికంగా కుంగిపోయినట్లు ఆసమయంలో కనిపించాడని జైలు సిబ్బంది చెబుతున్నారు. చనిపోవడానికి ముందు ఓ చివరి కోరికను కూడా కోరినట్లు సమాచారం. అయితే, నిబంధనల ప్రకారం అదేమిటన్నది బయటేకు వెల్లడించలేమంటున్నారు జైలు అధికారులు.
ఉరిశిక్ష అమలు చేయడానికి ముందే, ఆ సమాచారాన్ని ఆఫ్జల్ గురు కుటుంబానికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారు అధికారులు. ఓ న్యాయమూర్తి, డాక్టర్, కొంతమంది జైలు అధికారుల సమక్షంలో ఉదయం 8 గంటలకు తీహార్‌లోని మూడో నెంబర్ జైలులో ఆఫ్జల్ గురును ఉరితీశారు. అనంతరం జైలు ఆవరణలోనే మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియలను ఓ ముస్లిం మతపెద్ద సమక్షంలో సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. భద్రతా కారణాల రీత్యా ఉరి తీసిన తలారి వివరాలను అధికారులు రహస్యంగా ఉంచారు.
Read more...
ఆఫ్జల్ గురును ఉరి తీశారు
Categories :
afzal guru . death centence . hang . news . terrorist . tihar jail . TOP
పార్లమెంట్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్జల్ గురును ఎట్టకేలకు ఉరి తీశారు. ఉదయం 8 గంటలకు తీహార్ జైల్లో ఉన్న ఆఫ్జల్ గురును, అదే జైల్లో ఉరి తీశారు. ఉరిశిక్ష అమలు విషయం తెలుసుకుని గురు కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపం చెందారు. అతని మృతదేహాన్ని తమకు అప్పగించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ఆఫ్జల్ గురును బయటెక్కడ ఖననం చేసినా, అది తీవ్రవాదులకు, మతోన్మాదులకు పవిత్రస్థలంగా మారిపోతుందని, ఉగ్రవాదులను మరింతగా రెచ్చగొడుతుందని కేంద్రం భావిస్తోంది. అందుకే, కసబ్ తరహాలోనే తీహార్ జైల్లోనే ఓ ప్రాంతంలో ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది. కసబ్ వ్యవహారంలానే ఈ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా వ్యవహరించింది. కసబ్ కు క్షమాభిక్ష ఇవ్వకూడదని కేంద్ర హోంశాఖ నిర్ణయించుకున్నప్పటి నుంచి.. దానికి రాష్ట్రపతి ఆమోదం.. జైలు అధికారులకు ఆదేశాలు.. చివరకు ఉరిశిక్ష అమలు వరకూ చిన్న విషయాన్ని కూడా బయటకురాకుండా జాగ్రత్త పడింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది.
కేసు పూర్వాపరాలు
డిసెంబర్13, 2001 లో పార్లమెంట్ పై దాడికి జైషే -ఈ - మహమ్మద్ టెర్రరిస్ట్ అయిన ఆఫ్జల్ గురు కుట్ర పన్నాడు. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు డిసెంబర్ 18, 2002న ఉరి శిక్ష విధించింది. అక్టోబర్ 29, 2003న ఢిల్లీ హైకోర్టు దీన్ని సమర్థించింది. ఉరిశిక్షను రద్దుచేయాలన్న అప్పీల్ ను సుప్రీంకోర్టు ఆగస్టు 4, 2005న తిరస్కరించడంతో.. ఆఫ్జల్ గురుకు ఉరిశిక్ష ఖరారయ్యింది. అయితే.. దాదాపు ఏడేళ్ల పాటు దీనిపై నిర్ణయం తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఇటీవల కసబ్ ను ఉరితీసిన ప్రభుత్వం.. గురు వ్యవహారంలోనూ నిర్ణయం తీసుకుంది. ఉరి తీయాలన్న ఫైల్ ను రాష్ట్రపతికి జనవరి 21న పంపించింది కేంద్ర హోంశాఖ. ఫిబ్రవరి 3న దీనిపై సంతకం చేశారు ప్రణబ్ ముఖర్జీ. అప్పటినుంచి ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన కేంద్రం.. ఫిబ్రవరి 9న ఉదయం 8 గంటలకు తీహార్ జైల్లోనే ఆఫ్జల్ గురును ఉరి తీసింది.
Read more...
21, నవంబర్ 2012, బుధవారం
కసబ్ సంగతి సరే.. అఫ్జల్ గురు మాటేమిటి?
ఉదయం 8 గంటలకు టీవీలు పెట్టినవాళ్లంతా ఓ రకమైన ఆశ్చర్యానికి, షాక్ కు గురై ఉంటారు. ఎందుకంటే..కసబ్ క్షమాభిక్షను రాష్ట్రపతిని తిరస్కరించాడని.. బ్రేకింగ్ న్యూస్ లు పడుతున్నాయి. అంతలోనే కసబ్ ను ఉరి తీసేశారని ఆ బ్రేకింగ్స్ మారిపోయాయి. ఇదీ మరో షాక్.. ఎందుకంటే.. కసబ్ లాంటి వ్యక్తి ఉరిని.. చివరి నిమిషం వరకూ అత్యంత గోప్యంగా ఉంచి సంచలనం సృష్టించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర పతి కార్యాలయంనుంచి పూణేలోని ఎరవాడ జైలు వయా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సిబ్బంది వరకూ.. ఈ విషయంలో పెదవి విప్పకుండా రహస్యంగానే పని పూర్తిచేయడం మీడియా వర్గాలను షాక్ కు గురిచేసిందనే చెప్పాలి.
అక్టోబర్ 15న కసబ్ క్షమాభిక్ష పిటిషన్ ను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. నవంబర్ 5న ప్రణబ్ ముఖర్జీ దాన్ని తిప్పి పంపించేశారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే, అంటే నవంబర్ 7న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఉరిశిక్షను అసలు చేయాలన్న ఆదేశాలపై సంతకం పెట్టేశారు. నవంబర్ 8న ఆ ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపించివేశారు. ఉరి వేయడానికి అన్ని వసతులూ ఉన్న పూణే ఎరవాడ జైలుకు నవంబర్ 19న కసబ్ ను మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించింది. నవంబర్ 21 ఉదయం 7.30 గంటలకు ఉరిశిక్షకు పకడ్బందీ అమలు చేసింది.
కసబ్ ను ఉరితీయడంపై అన్ని వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. ముంబై మారణహోమంలో 166 మంది ప్రాణాలను బలిగొని, ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన ముష్కరమూకలో ఒకడైన కసబ్ ను రహస్యంగా ఉరితీయకుండా.. బహిరంగంగా ఉరితీసి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సామాజిక ఉద్యమ కారుడు అన్నా హజారే కూడా.. కసబ్ ను బహిరంగంగా ఉరితీస్తే, ఎంతోమంది ఉగ్రవాదుల వెన్నులో వణుకుపుట్టేదనడమూ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమే. నవంబర్ 26కు అంటే.. మరో వారం రోజుల్లో ముంబైదాడులకు నాలుగేళ్లు పూర్తవుతాయి. ఆ లోగానే కసబ్ ను ఉరి తీయడం ద్వారా బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం స్వాంతన ఇచ్చిందని భావించవచ్చు. అయితే, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనూ, పొలిటకల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చన్న వాదనా వినిపిస్తోంది.
ఆఫ్జల్ గురు సంగతేమిటి..?
కసబ్ కన్నా ముందే భారత పార్లమెంట్ పై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరిశిక్షపై ఇంతవరకూ నిర్ణయం తీసుకోకపోవడం ఇప్పుడు ప్రధాన వార్తగా మారింది. కసబ్ ను ఉరి తీసినప్పుడు.. ఆఫ్జల్ గురును ఎందుకు ఉరి తీయరన్న వాదన వినిపిస్తోంది. అయితే.. కొన్ని రిపోర్టుల ప్రకారం ఆప్జల్ గురుతో పాటు మరో ఆరుగురికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారని తెలుస్తోంది. కానీ, ఆఫ్జల్ గురు కు కూడా మరణశిక్ష వేస్తేనే.. ఉగ్రవాదుల దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగే అవకాశం కొంతైనా ఉంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)




