రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో అభ్యర్థులు సాధించిన మెజార్టీలివి. రాయచోటి నుంచి పోటీచేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి అత్యధికంగా 56891 ఓట్ల మెజార్టీ సాధించారు. అత్యల్పంగా పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి 1562 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. నెల్లూరు లోక్ సభ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి 2,91,745 ఓట్ల మెజార్టీతో సుబ్బిరామిరెడ్డిపై గెలుపొందారు. (ఈసీ అధికారికంగా ప్రకటించిన తర్వాత మెజార్టీల్లో స్వల్పమైన మార్పులు ఉంటే ఉండొచ్చు..నెటిజన్లు గమనించగలరు.)జాబితాను పెద్దదిగా చూడడం కోసం ఇమేజ్ పై క్లిక్ చేయండి.
byelection లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
byelection లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
15, జూన్ 2012, శుక్రవారం
మెజార్టీతో ఉపఎన్నికల ఫలితాలు
రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో అభ్యర్థులు సాధించిన మెజార్టీలివి. రాయచోటి నుంచి పోటీచేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి అత్యధికంగా 56891 ఓట్ల మెజార్టీ సాధించారు. అత్యల్పంగా పరకాలలో టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి 1562 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. నెల్లూరు లోక్ సభ స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి 2,91,745 ఓట్ల మెజార్టీతో సుబ్బిరామిరెడ్డిపై గెలుపొందారు. (ఈసీ అధికారికంగా ప్రకటించిన తర్వాత మెజార్టీల్లో స్వల్పమైన మార్పులు ఉంటే ఉండొచ్చు..నెటిజన్లు గమనించగలరు.)జాబితాను పెద్దదిగా చూడడం కోసం ఇమేజ్ పై క్లిక్ చేయండి.జగన్ గాలికి కొట్టుకుపోయిన కాంగ్రెస్, టీడీపీ
Categories :
byelection . jagan . POLITICS . results . seemandhra . sharmila . TOP . vijayamma . ysrcp
అవినీతి ఆరోపణలు చేసినా, ప్రచారం చేయకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా.. జగన్ తన సత్తా చూపించారు. ఉప ఎన్నికల ఫలితాల్లో ఊహించినదానికన్నా ఎక్కువ సీట్లను వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. మొత్తం 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరగగా.. 15 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానంలో ఫ్యాన్ గాలే వీచింది. వైఎస్ విజయమ్మ, షర్మిలల ప్రచారాన్ని ఓటర్లు మెచ్చారు. పరకాలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొండాసురేఖ పరాజయం పాలయ్యారు. అయితే.. టీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ నిచ్చారు. చివరకు స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి విజయాన్ని దక్కించుకున్నారు. జగన్కు మొదటినుంచీ మద్దతుగా నిలిచిన పిల్లి సుభాష్ చంద్ర ఓడిపోవడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. చాలా చోట్ల కాంగ్రెస్ మూడోస్థానానికే పరిమితమయ్యింది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన చిరంజీవి రాజీనామా చేసిన స్థానంలోనూ జగన్ పార్టీ గెలిచింది. రెండుచోట్ల మాత్రం కాంగ్రెస్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. రామచంద్రాపురం, నర్సాపురంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. టీడీపీ మాత్రం ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది.
మాట నిలబెట్టుకున్న చిరు..
చిరంజీవి ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించలేకపోయారు. అయితే.. ఆయన ఊరటనిస్తూ.. నర్సాపురం, రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. తూర్పుగోదావరి డీసీసీ ప్రెసిడెంట్ ప్రమాణస్వీకార సభలో.. రామచంద్రాపురాన్ని సోనియాకు గిఫ్ట్ గా ఇస్తానన్న ఆయన మాట చెల్లింది.
అత్యుత్సాహంతో జైలుకు..
వైఎస్సార్సీపీ గెలిచిన అత్యుత్సాహంలో చేసిన పనికి.. మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ జైలుపాలయ్యారు. ఫలితాల సమయంలో పార్టీ కార్యాలయం జరిగిన సంబరాల్లో.. ఆయన గాల్లోకి నాలుగురౌండ్ల కాల్పులు జరిపారు. ఇలా కాల్పులు జరపడం నేరం కావడంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో జగన్ పార్టీ నేతలు పోలీసులను అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు.. రెహ్మన్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే.. ఆయన కూడా.. ప్రస్తుతం జగన్ ఉన్న జైలుకే వెళ్లడం గమనార్హం.27, ఫిబ్రవరి 2012, సోమవారం
ఉపఎన్నికల్లో ధన ప్రవాహం
Categories :
byelection . cash seize . POLITICS . TOP
రాష్ట్రంలో జరగుతున్న ఉపఎన్నికల్లో నోట్ల కట్టలు ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన నాగర్ కర్నూలుకే ఎక్కువగా నోట్ల కట్టలు తరలుతున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో నగదు సరఫరా పై దృష్టి పెట్టిన పోలీసులు భారీగా తనిఖీలు చేస్తున్నారు. శనివారం నిర్వహించిన సోదాల్లో ఓ చోట నాలుగు లక్షలు, మరో చోట ఆరు లక్షల నగదు పట్టుబడింది. కార్లలో అక్రమంగా తీసుకెళుతుండగా పోలీసులు వీటిని పట్టుకున్నారు. ఇక సోమవారం దేవరకద్ర చెక్ పోస్ట్ దగ్గర తనిఖీల్లో మరో 30 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేత కారులో వీటిని పోలీసులు గుర్తించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న నాగం జనార్దనరెడ్డిని ఓడించడానికి, జేసీ బ్రదర్స్ అధినేత జనార్ధనరెడ్డిని బరిలోకి దింపిన తెలుగుదేశం పార్టీ.. ఇక్కడ సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
