అనవసరంగా నోరు పారేసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు ఎంఐఎం అగ్రనేతల్లో ఒకరైన అక్బరుద్దీన్. రాజమహల్ లాంటి ఇంట్లో హైక్లాస్ జీవితం అనుభవించే అక్బర్.. ఇప్పటికే జైలు జీవితంతో నానా అవస్థలు పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కేసుల కారణంగా జైలు నుంచే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఆదిలాబాద్ నుంచి సంగారెడ్డి కోర్టుకు రావాల్సి వచ్చింది. నిజామాబాద్ కోర్టుకూ హాజరు కావాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటిపై కోర్టులు విచారణ మొదలుపెడితే, ఆయా కోర్టులకూ ఆయన్ను పోలీసులు తరలించాల్సి వస్తుంది.
తాజాగా అక్బరుద్దీన్ పై నమోదైన కేసులో బెంగళూరు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 23లోగా తమ ముందు అక్బరుద్దీన్ ను తమ ఎదుట హాజరు పరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో, మరోసారి సుదీర్ఘ ప్రయాణం అక్బరుద్దీన్ కు తప్పకపోవచ్చు. పైగా, ఈ కేసులన్నీ తేలేసరికి ఎన్నాళ్లు పడుతుందో, అప్పటివరకూ బెయిల్ వస్తుందో లేదో చెప్పడం కష్టమే. ఒక వేళ బెయిల్ వచ్చినా, పలు కోర్టుల్లో జరిగే ఈ విచారణకు హాజరుకావడంతోనే విలువైన సమయం అంతా హరించుకుపోతుంది.
Read more...
mim లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
mim లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
24, జనవరి 2013, గురువారం
22, జనవరి 2013, మంగళవారం
అన్నదమ్ములిద్దరూ ఇక జైల్లో మగ్గాల్సిందేనా..?
మైనార్టీ కార్డు చూసుకుని నోరు పారేసుకున్నందుకు మూల్యం చెల్లిస్తున్నారు మజ్లిస్ పార్టీ అగ్రనేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్. ప్రభుత్వం తమను ఏమీ చేయలేదన్న ధీమాతో రెచ్చిపోయిన మాట్లాడినందుకు ఇప్పుడు జైలు పాలయ్యారు. 15 నిమిషాల సమయం ఇస్తే దేశంలోని హిందువుల అంతు చూస్తామన్న అక్బరుద్దీన్.. ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో ఉన్నారు. ఆయనకు బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. పైగా, జిల్లాకో కేసు ఆయనపై నమోదయ్యింది.
అటు 2005లో మెదక్ జిల్లా ముత్తంగి రోడ్డు విస్తరణ పనులను అడ్డుకోవడంతో పాటు అప్పటి జిల్లా కలెక్టర్ సింఘాల్ ను దూషించినందుకు అసద్ చిక్కుల్లో పడ్డారు. ప్రభుత్వం అండ చూసుకుని ఇంతకాలం విచారణకు కూడా హాజరుకాకుండా ఉన్న అసద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో.. ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. దీంతో దిక్కుతోచని అసద్.. నేరుగా కోర్టుకు వెళ్లి లొంగిపోయారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. దాన్ని కొట్టివేయడంతో అసద్ కు కష్టకాలం మొదలైనట్లే.
ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న జగన్ ఎనిమిది నెలలుగా జైల్లోనే ఉన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం నేతలు కూడా జైలు పాలయ్యారు. తాజా పరిస్థితులు చూస్తుంటే.. ఇప్పట్లో మజ్లిస్ సోదరులకు బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఎంఐఎంలోనే మరో కీలక నేత పాషాఖాద్రీపై కూడా కేసులు నమోదు కావడంతో.. ఎంఐఎం నేతలకు దిక్కుతోచడం లేదు. ఓవైసీ బ్రదర్స్ త్వరగా బయటకు రాకపోతే మాత్రం.. ఎంఐఎం పరిస్థితి తెగిన గాలిపటంలా మారిపోయే అవకాశం ఉంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

