పవన్.. నువ్వు మాట్లాడాల్సిన సమయం ఇదే!
Categories :
ANDHRA PRADESH . muni koti . news . pawan kalyan . special status
బాబు సెంటిమెంట్‌ను రగిలిస్తున్నాడా?
Categories :
ANDHRA PRADESH . babu . cash for vote . chandrababu . maha sankalpam . POLITICS . revanth reddy . tdp
తెలంగాణలో చంద్రబాబుపై ఎక్కడ కేసులు నమోదవుతాయో అన్న అందోళనతో కొత్త స్కెచ్ ను అమలు చేయడంలో బిజీగా ఉన్నాయి తెలుగుదేశం శ్రేణులు. ఆంధ్రప్రదేశ్్లో ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నాయి. చంద్రబాబు ప్రతిష్ట దిగజార్చాయంటూ కేసీఆర్ పై కేసులు పెడుతున్నాయి. ఒకవేళ హైదరాబాద్లో చంద్రబాబుపై కేసు నమోదైతే.. ఈ పోలీస్ స్టేషన్లన్నింటి నుంచీ కేసీఆర్ కు నోటీసులు పంపించాలన్నది ఏపీ ప్రభుత్వ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది.
ఎన్నికల సమయంలో నోట్ల పంపిణీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటినుంచో తెరవెనుక జరుగుతున్న తతంగమే. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేనే లేదు. కాకపోతే.. చంద్రబాబు అండ్ కో ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అయితే.. ఈ కేసులో బాబు టీమ్ ఎంత హుందాగా ప్రవర్తిస్తే అంత ప్రతిష్ట పెరుగుతుంది. కానీ.. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు సెంటిమెంట్ ను రగిలించే దిశగానే సాగుతున్నాయి. గుంటూరు మహాసంకల్పసభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. ఇది తనపై పెట్టిన కేసు కాదని.. ఐదుకోట్ల ఆంధ్రుల ప్రతినిధిపై పెట్టిన కేసంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. బాబు చేసిన ప్రకటనలతో రెండు పార్టీల వ్యవహారం కాస్తా రెండు రాష్ట్రాల వివాదంగా మారిపోయింది. ఇప్పటివరకూ నీటికోసం, విద్యుత్ కోసం, విద్యావ్యవస్థలో ఆధిపత్యం కోసం కొట్టుకున్న రెండు రాష్ట్రాలు.. ఇప్పుడు ఓటుకు నోటు వ్యవహారంపైనా కయ్యానికి దిగేలా పరిస్థితి దిగజారింది.
కేసీఆర్ కన్నా ఓమెట్టు ఎక్కువే అంటున్న చంద్రబాబు
Categories :
ANDHRA PRADESH . babu . helicopter . POLITITCS . tdp
ప్రస్తుతం జిల్లాల పర్యటనకు జీఎంఆర్ కు చెందిన విమానాలు, హెలికాప్టర్లను చంద్రబాబు ఉపయోగిస్తున్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించడానికి హెలికాప్టర్ పూర్తిగా అనువుగా ఉండదు కాబట్టి, అలాంటి సమయాల్లో ఉపయోగించుకోవడానికి విమానాన్ని కూడా కొనుగోలు చేయనున్నారు.తాజా పరిస్థితి చూస్తుంటే.. ఇద్దరు సీఎంలకు దాదాపుగా ఒకే సమయంలో కొత్త హెలికాప్టర్లు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బాబు కోరిక తీరుతుందా..?
Categories :
ANDHRA PRADESH . capital . chandrababu . modi . POLITICS . tdp . vijayawada
అన్ని రంగాల్లోనే అభివృద్ధిని సాధించిన హైదరాబాద్ కు ధీటుగా రాజధాని నిర్మాణం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. హైదరాబాద్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఐదు దశాబ్ధాల్లో 15 లక్షల కోట్ల వరకూ ఖర్చుపెట్టాయంటున్న ఆయన.. అలాంటి నగరాన్ని ఇప్పటికిప్పుడు సృష్టించాలంటే.. కనీసం నాలుగైదు లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు. తిరుపతిలో జరిగిన ఆర్థికసంఘం సమావేశంలో దీనిపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో కేంద్రం సాయంగా లక్షా 2 వేల కోట్లను ఇవ్వాలని కోరారు. దీంతో పాటు, కేంద్రం దగ్గర రాష్ట్రానికి ఉన్న రూ. 10400 కోట్ల అప్పులను రద్దు చేయాలని, అప్పులు మరింతగా తెచ్చుకోవడానికి FBRM చట్టాన్ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. మరి ఈ విజ్ఞప్తులకు కేంద్రం ఎంతవరకూ సహకరిస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. రైతు రుణమాఫీ విషయంలో కేంద్ర సహకారాన్ని ఎంతో ఆశించిన బాబుకు.. చుక్కెదురయ్యింది. ఇప్పుడు రాజధాని వ్యవహారంలో కేంద్రం తీరు ఎలా ఉండొచ్చన్నదానిపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది..
ఏపీ రాజధాని ఎక్కడ?
Categories :
ANDHRA PRADESH . capital . chandrababu . guntur . mangalagiri . POLITICS . tdp . TOP . vijayawada
విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని అంటూ చాలాకాలంగా చంద్రబాబు సహా టీడీపీ నేతలు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఈ ప్రాంతమైతేనే రాష్ట్రం మొత్తానికి మధ్యన ఉంటుందన్నది తెలుగుతమ్ముళ్ల అభిప్రాయం. అయితే.. ఈ రెండింటిని ఉమ్మడిగా రాజధానిగా ప్రకటిస్తారా.. లేక... రెండింటి మధ్యన ఉన్న మంగళగిరిని రాజధానిగా ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అంతేకాదు, ఇక్కడ భూముల లభ్యత తక్కువగా ఉండడంతో, అమరావతిని గానీ, గన్నవరం, నూజివీడులను గానీ ప్రకటించవచ్చనీ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి లీకులనూ ఇవ్వలేదు చంద్రబాబు. దీంతో.. అసెంబ్లీలో ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారన్నది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. రాజధాని పేరు నేరుగా చెప్పకుండా, విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేస్తామని, సలహాలు, అభిప్రాయాలను చెప్పమంటూ సభను చంద్రబాబు కోరవచ్చన్న వాదనా వినిపిస్తోంది. దీంతో పాటు.. కమిటీల బాబుగా పేరున్న టీడీపీ అధినేత ఈ విషయంలో మరో కమిటీ వేసినా ఆశ్చర్యం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
రుణమాఫీ అన్నంవండి పెట్టడం లాంటిదేనట
Categories :
ANDHRA PRADESH . chandrababu . loan waiver . nannapaneni . seemandhra . tdp
మాఫీ మాయమవుతుందా..?
Categories :
ANDHRA PRADESH . chandrababu . loan waiver . new rules . seemandhra . tdp
ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు?
Categories :
ANDHRA PRADESH . chandrababu . news . seemandhra . state formation day . tdp . telangana
రాష్ట్రం విడిపోవడం సీమాంధ్ర ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి జూన్ 2 వారికి సంబంధించినంతవరకూ విద్రోహ దినమే తప్ప అవతరణ దినోత్సవం కాదు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే జూన్ 8ని కూడా అవతరణ దినోత్సవంగా స్వీకరిస్తారా లేదా అన్నదీ అనుమానమే. ఇంతవరకూ జరుపుకుంటూ వచ్చిన నవంబర్ 1 కి ఇకపై ప్రాధాన్యత ఉండనే ఉండదు. ఎందుకంటే, అది ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా అవతరించిన సందర్భం. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ కు సంబంధించిన ఏ ప్రాంతమూ ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదు కాబట్టి, నవంబర్ 1 ఆ అర్హత కోల్పోయింది. పోనీ ఆంధ్ర రాష్ట్రం అవతరించిన అక్టోబర్ 1ని జరుపుకుందామంటే, దానికీ ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే, అక్టోబర్ 1కి ఇప్పటి పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు. దీంతో, కొత్త ప్రభుత్వం రాష్ట్ర దినోత్సవంగా దేన్ని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి పాలన ముగిసి ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి, అందులోనూ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి, జూన్ 8నే చరిత్రలో మిగిలిపోయేలా చేయడానికి ఆ రోజునే అవతరణ దినోత్సవంగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, దానికి జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తోంది.
అసలు తెలంగాణను విడదీయాల్సిన అవసరం లేదు..
Categories :
ANDHRA PRADESH . division . POLITICS . seemandhra . telangana . TOP
ఆంధ్ర, తెలంగాణ కలిసినప్పుడు హైదరాబాద్ ను వీరేమైనా తెచ్చి తెలంగాణకు ఇచ్చారా..? ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాతే, హైదరాబాద్ రాజధాని అయ్యిందా..?
రెండింటికీ సమాధానం ఒక్కటే. అసలు ఆంధ్ర నుంచి తెలంగాణ ఎందుకు విడిపోవాలి..? తెలంగాణ ప్రాంతం ఏమీ ఆంధ్రతో కలవడానికి ఎగబడలేదే.. నిబంధనలు పక్కనపెట్టి ఆంధ్రప్రాంతంతో కలవలేదే.. ఆంధ్ర ప్రాంతమే కదా కోరి కోరి వచ్చిమరీ హైదరాబాద్ తో కలిసింది. అందుకని, ఇప్పుడున్న రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోవాల్సిన అవసరం లేనేలేదు. ప్రస్తుత రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతాన్నే విడదీస్తే సరిపోతుంది. అప్పుడు, రాజధానికి దూరంగా ఉన్న ప్రాతం విడిపోతుంది కాబట్టి, రాజధాని విషయంలో గొడవే ఉండదు. తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ అన్న పేరే ఉంచొచ్చు (రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తైన తర్వాత కావలంటే తెలంగాణగా మార్చుకోవచ్చు (ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ అయినట్లు, ఒరిస్సా ఒడిషా అయినట్లు). ఇక కొత్తగా ఏర్పాటు చేసే ఆంధ్ర ప్రాంతానికి రెండు ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యంగా సీమాంధ్ర అన్న పేరుపెట్టొచ్చు. దీంతో గొడవే ఉండదు..
సెటిలర్లకు నిజంగానే సమస్యా?
Categories :
ANDHRA PRADESH . news . seemandhra . settlers . telangana . TOP
అంతెందుకు, తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఐదు దశాబ్దాలకు ముందే వచ్చి స్ధిరపడ్డ ఆంధ్రా కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీళ్లకు తమ సొంత ప్రాంతాల్లో అంగుళం భూమి గానీ, అర్థరూపాయి ఆస్తిగాని లేదు. తెలంగాణ ఉద్యమం మొదలై పదమూడేళ్లుగా సాగుతున్నా, గత మూడేళ్లలో కనీవినీ ఎరుగుని రీతిలో ఉధృతంగా సాగినా, ఒక్క సెటిలర్ కూ ఇబ్బంది రాలేదు. ఇలా స్థిరపడ్డ కుటుంబాల్లో ఒక్క కుటుంబం కూడా ఆంధ్రాకు తిరిగి వలస పోలేదు. ఎందుకంటే, వాళ్లూ ఇక్కడ భూమితో, ఇక్కడి సమాజంతో మమేకమైపోయారు. ఆంధ్రా కుటుంబాల్లో ఎంతో మంది ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్లున్నారు. వాళ్లూ తెలంగాణ బిడ్డలే.
ఈ విషయాన్ని పక్కన పెడితే, సీమాంధ్ర నేతలు, సీమాంధ్రలో ఉండి తెలంగాణలో ఉన్న తమవాళ్ల గురించి ఆందోళన చెందుతున్న వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. హైదరాబాద్ లోని నిత్యావసర హోల్ సేల్ దుకాణాల్లో 90 శాతం తెలుగువాళ్లవి కాదు. రాజస్థాన్ నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఈ దుకాణాలను నడుపుతున్నారు. హార్డ వేర్, ఎలక్ట్రానిక్స్ దుకాణాలూ 80 శాతానికి పైగా తెలుగువాళ్లవి కాదు, గుజరాత్ మార్వాడీల చేతుల్లోనే ఉన్నాయి. కోఠిలో గుజరాత్ గల్లీ పేరిట పెద్ద వాణిజ్య ప్రాంతమే ఉంది. ఇక బంగారం దుకాణాలు.. హైదరాబాద్లో ఉన్నవాటిలో ఒక్కటంటే ఒక్కటీ తెలుగువాళ్లది కాదు. హైదరాబాద్లో వీధికొక్కటి కనిపించే చాట్ బండార్స్ నడిపేవాళ్లలో ఒక్కరూ తెలుగువాళ్లు కాదు. వీళ్లెవరకూ విభజనతో రానిసమస్య ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ తెలుగువాళ్లకు వస్తుందని ఆందోళన చెందాల్సిన పనేలేదు. అనవసరంగా రాజకీయ నాయకులు ఏదేదో ఊహించుకుని, నోటికొచ్చి మాట్లాడి, ఇక్కడ ఉన్నవాళ్లలో అనవసరమైన అనుమానాలు లేపకుండా ఉంటే అదే పదివేలు.
పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
Categories :
ANDHRA PRADESH . congress . POLITICS . seemandhra . telangana . TOP
రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలు ఎలా ఉంటాయి..?
Categories :
ANDHRA PRADESH . POLITICS . seemandhra . telangana . TOP






