డీజీపీ కొందరు మత పెద్దలను కలవడంపై స్టోరీ ప్రసారం చేసినందుకు, జీ24 గంటలు సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నారు పోలీసులు. విచారణ పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పిస్తున్నారు. కథనం ప్రసారం అయిన వెంటనే జీ 24 కార్యాలయంలోకి నోటీసుల్లేకుండా వెళ్లి, భారీగా తనిఖీలు చేసిన పోలీసులు, ఇప్పుడు ఛానల్ సిబ్బందిని సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు పిలుపించుకున్నారు. దీనిపై జీ 24గంటలు సిబ్బంది, క్రైమ్ రిపోర్టర్స్ ప్రతినిధులు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మను కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీపీ ఛాంబర్ లో నేలపై బైఠాయించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారాయన. అటు, స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలంటూ జీ 24గంటలు కీలక సిబ్బందిని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు పోలీసులు.
Read more...
journalist protest లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
journalist protest లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
14, సెప్టెంబర్ 2013, శనివారం
డీజీపీపై స్టోరీకి మీడియాపై కేసులు
Categories :
cases . dgp . journalist protest . news . TOP . zee 24 gantalu
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
