చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములైనా ఈ మధ్య కాలంలో ఒకే వేదికపై కనిపించిన సంఘటనలు లేనే లేవు. వీరిద్దరి మధ్యా విబేధాలున్నాయంటూ చాలాకాలంగా అభిమానుల్లోనూ, ఫిల్మ్ నగర్లోనూ వదంతులు షికార్లు చేస్తున్నాయి. మీరు తప్ప నాకెవ్వరూ లేరంటూ అభిమానులనుద్దేశించి ఓ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. వీరిద్దరినీ కలిసి చూడాలన్న అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరబోతోంది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినీ అరంగేట్ర కార్యక్రమం దీనికి వేదికవుతోంది. రేపు ఉదయం (27-2-14) రామానాయుడు స్టూడియోలో ఈ కార్యక్రమం జరగనుంది. నాగబాబు కోసం వీరిద్దరూ రావడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలోనైనా ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకుంటారో లేక.. ఎడమొహం పెడమొహంగా ఉంటారోనన్న ఉత్కంఠ ఫ్యాన్స్ ను వెంటాడుతోంది.
nagababu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
nagababu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
26, ఫిబ్రవరి 2014, బుధవారం
ఒకే వేదిక ఎక్కుతున్న చిరు, పవన్
Categories :
chiranjeevi . cinema . entertainment . nagababu . pawan kalyan . tollywood . varun tej
Read more...
24, అక్టోబర్ 2013, గురువారం
నాగబాబు లేఖ ఎందుకు రాసినట్లు?
Categories :
chiranjeevi . entertainment . letter . nagababu . pavan . tdp . TOP
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తాను కొంతకాలంగా తెలుగుదేశంలో చేరుతున్నారని సాగుతున్న ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేశారు నాగబాబు. ఈ మేరకు మీడియాకు సింపుల్‌గా స్ట్రెయిట్‌గా ఉండేలా ఓ లేఖను విడుదల చేశారాయన. ప్రస్తుతం సినిమాలతో పవన్, తానూ బిజీగా ఉన్నామని, ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని అందులో తేల్చిపారేశారు. తెలుగుదేశం పార్టీలో చేరే ఉద్దేశం కూడా తమకు లేదని, అభిమానులెవరూ గందరగోళానికి గురికావద్దని కోరారాయన.
ఈ లేఖను విడుదల చేయడానికి ముందు చిరంజీవితోనూ, పవన్ కళ్యాణ్‌తోనూ నాగబాబు మాట్లాడినట్లు సమాచారం.అయితే పవన్ కళ్యాణ్ నేరుగా ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం విశేషం. కనీసం నాగబాబులా మీడియాకు లేఖను కూడా ఆయన పంపించలేదు. తమ్ముడి తరపున కూడా వకల్తా పుచ్చుకున్న నాగబాబే ఇద్దరికీ కలిపి ఓ లేఖను రాసిపారేశారు. ముఖ్యంగా వీరిద్దరూ టీడీపీకి చేరువవుతున్నారన్న ప్రచారం జోరందుకోవడం కాంగ్రెస్‌లో ఉన్న చిరంజీవికి ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబుపై చిరంజీవి క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలోకి వెళితే అనవసర ఇబ్బందులు వస్తాయనే ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావడం లేదంటూ లేఖ రాసేశారు నాగబాబు. అయితే, భవిష్యత్తులో వస్తారా రారా అన్నదానిపై లేఖలో స్పష్టత ఇవ్వలేదు.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)