ఐఫోన్ కొనడం కోసం కూతుర్ని అమ్మేసిందంట చైనాలోని ఓ జంట. షాంఘైలో ఉండే ఈ జంటకు ముగ్గురు పిల్లలు. మూడో పిల్లను ఎవరైనా 5 వేల డాలర్ల నుంచి 8 వేల డాలర్ల వరకూ ఇచ్చి దత్తత తీసుకోవచ్చంటూ ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. పిల్లను ఇచ్చేయడానికి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. ఆ డబ్బుతో ఐఫోన్‌ను, స్పోర్ట్స్ షూను, ఇతర లగ్జరీ ఐటెమ్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారట. ఈ విషయం బయటకు పొక్కడంతో షాంఘై పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మానవ అక్రమ రవాణా కింద కేసు నమోదు చేశారు. అయితే, తమ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూతుర్ని సరిగ్గా చూడలేమని, అందుకనే దత్తత ఇవ్వాలనకున్నామే తప్ప, ఐ ఫోన్ కొనడానికి అమ్మలేదని పోలీసుల ముందు చెప్పినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులున్నప్పుడు, ఆ డబ్బుతో పిల్లలకు కావాల్సిన వస్తువులేవో కొనుక్కోవాలి కానీ, మరీ ఐఫోన్ కొనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందో... నిరుడు కూడా చైనాలోని ఓ కుర్రాడు ఇలానే ఐఫోన్, ఐప్యాడ్ కోసం కిడ్నీ అమ్మేశాడు. చైనాలో ఐఫోన్‌కు విపరీతమైన డిమాండ్ ఉండడం, దాన్నో లగ్జరీ వస్తువుగా జనం చూస్తుండడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. వీరిమీద నమోదైన కేసు రుజువైతే మాత్రం చాలాకాలం జైల్లోనే మగ్గాల్సి ఉంటుంది.
Read more...
china లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
china లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
18, అక్టోబర్ 2013, శుక్రవారం
ఐఫోన్ కోసం కన్నకూతుర్ని అమ్మేశారు
Categories :
child selling . china . iphone . special . TOP
11, జనవరి 2012, బుధవారం
360 గంటల్లో 30 అంతస్తుల మేడ
ఇండిపెండెంట్ ఇల్లు కట్టాలంటే.. కనీసం ఆర్నెళ్లు.. అదే రెండంతస్తుల మేడ కట్టాలంటే ఎంత లేదన్నా ఏడాది. అలాంటిది.. 30 అంతస్తుల మహా మేడ కట్టాలంటే.. మన దగ్గర మినిమం ఐదారేళ్లు పడుతుంది. కానీ, చైనాలో మాత్రం దీనికి పట్టిన సమయం.. కేవలం 360 గంటలు... మరోలా చెప్పాలంటే 15 రోజులు... నిజం.. ఊహకు అందని రీతిలో, రికార్డ్ స్థాయి టైమ్ లో చేసి చూపించారు చైనా చిచ్చరపిడుగులు.
ఇదోదో సరదా కోసం కట్టింది కాదు. పక్కా ప్లానింగ్ తో, పర్ ఫెక్ట్ డిజైన్ తో రూపొందించారు. 9 మాగ్నిట్యూడ్ భూకంపం వచ్చినా, ఈ బిల్డింగ్ చెక్కుచెదరదని ఇంజనీర్లు భరోసా ఇస్తున్నారు. ది ఆర్క్ అనే హోటల్ కోసం దీన్ని నిర్మించారు. ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్న ఈ మల్టీస్టోర్‌డ్ బిల్డింగ్‌ను బ్రాడ్ గ్రూప్ అనే సంస్థ నిర్మించింది. హునాన్ ప్రావిన్స్‌లో డాంగ్‌టింగ్ సరస్సు పక్కన ఈ హోటల్ ఉంది. పిల్లర్లు, ఇతరత్రా కాంక్రీట్ షీట్లను ముందుగానే తయారు చేసుకుని వాటిని ఒక్కచోట చేర్చి ఈ రాజభవనాన్ని 360 గంటల్లో కట్టిపడేశారు. చైనా ఇంజనీరింగ్ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పారు.. దీన్ని చూశాకా అయినా.. మనం చైనా ది గ్రేట్ అనక తప్పదు. మీకేమైనా అనుమానం ఉంటే ఈ వీడియోను చూడండి.
Read more...
18, అక్టోబర్ 2011, మంగళవారం
సిగ్గు సిగ్గు.. ఇదేనా మానవత్వం..!
చైనాలో దారుణం చోటు చేసుకుంది. మోడ్రన్ సొసైటీలో మానవత్వం ఎలా మంట గలిసిపోతోందో మరోసారి స్పష్టమయ్యింది. చైనాలోని ఫోషన్ నగరంలో చావుబతుకుల మధ్య ఓ రెండేళ్ల చిన్నారి కొట్టుమిట్టాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ పసిపాప పక్కనుంచే వెళ్తూ కూడా స్పందించలేదు. ఓ రోడ్డులో చిన్నారి వాంగ్ యూ నడుస్తుండగా.. ఓ కారు ఢీ కొట్టింది. ముందు టైర్లు పాపపైనుంచి వెళ్లిపోయాయి. కారును ఆపినట్లే ఆపి.. మళ్లీ పోనిచ్చాడు. దీంతో వెనుక టైర్ల కింద ఆ అమ్మాయి నలిగిపోయింది. వెంటనే ఆ వీధిలోనుంచి చాలామంది నడుచు కుంటూ.. సైకిళ్లపైనా, మోపెడ్లపైనా వచ్చినా.. చూడనట్లే వెళ్లిపోయారే తప్ప.. వాంగ్ యూను రక్షించడానికి ప్రయత్నించలేదు. ఇంతలో వచ్చిన మరో వ్యాన్ కూడా ఆ అమ్మాయి పై నుంచే వెళ్లింది. ఆ తర్వాత వచ్చిన ఓ మహిళ.. ఆ పసిపాపను పక్కకు లాగింది. ప్రస్తుతం ఆస్పత్రికి తరిలించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉంది. వాంగ్‌యూ బ్రెయిన్‌డెడ్ అయినట్లు చైనా అధికారిక పత్రిక ప్రకటించింది. ఏ క్షణమైనా ఆ అమ్మాయి చనిపోవచ్చని పేర్కొంది. చిన్నారిని ఢీకొట్టిన ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానికులపై చైనా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Read more...
2, సెప్టెంబర్ 2011, శుక్రవారం
చైనా ఎక్కువగా దిగుమతి చేసుకునేదేమిటో తెలుసా..?
Categories :
bride . china . entertainment . TOP
ఫోన్ మేడ్ ఇన్ చైనా..
వాచ్ మేడ్ ఇన్ చైనా..
కంప్యూటర్ మేడ్ ఇన్ చైనా...
ప్రపంచంలోని సగం వస్తువులు మేడ్ ఇన్ చైనా...
ఆల్ మేడ్ ఇన్ చైనా...
ఇన్నింటిని తయారు చేస్తున్న చైనా... ఒక్క విషయంలో మాత్రం నానా అగచాట్లు పడుతోంది. అదే కమ్యూనిస్ట్ చైనాను కలవరానికి గురిచేస్తోంది. ఇంతకీ చైనీయుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న.... ఆ పెను సమస్యేమిటో తెలుసా.. పెళ్లి కూతుర్ల కరువు. అందుకే, విదేశాల నుంచి అమ్మాయిలను దిగుమతి చేసుకొంటోంది.
చైనాలో స్త్రీ, పురుష నిష్పత్తిలో వ్యత్యాసం రానురాను భారీగా పెరుగుతోంది. దీంతో చైనా పెళ్లికొడుకులు వియత్నాం, లావోస్, నార్త్ కొరియా.. తదితర దేశాల నుంచి పెళ్లి కూతుర్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా యేటా ఝాజింగ్ ప్రావిన్స్‌లోనే 36 వేల మంది అమ్మాయిలను ఇతర దేశాల నుంచి తీసుకువస్తున్నారు. మరో ట్విస్టేంటంటే ఇక్కడ పుట్టిపెరిగిన కొద్దిమంది అమ్మాయిలేమో కాస్త రిచ్‌గా ఉన్న వెల్‌సెటిల్డ్ అబ్బాయిల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇక చెప్పేదేముంది... చైనాలో పెళ్లికాని చింగ్ చాంగ్ చుంగ్‌లు ఎక్కువైపోయారు. తాజా జనాభా లెక్కల ప్రకారం 19 ఏళ్లలోపు వయసున్న వారిలో అమ్మాయిలకంటే 2 కోట్ల 30 లక్షల మంది అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. దీనికంతటికీ కారణం ఆడపిల్లలను పురిట్లోనే హతమార్చడం... మనదేశంలోలాగానే ఇక్కడా... పుట్టబోయేదీ ఆడా మగా అనే టెస్ట్‌లు నిషిద్దం... కానీ టైప్ -B అల్ర్ట్రాసోనిక్ టెస్ట్ వల్ల పుట్టబోయేది ఎవరో తెలిసిపోతోంది. దీనితోనే అక్కడ అమ్మాయిలకు కరువొచ్చింది. రెండు దశాబ్దాలుగా ఈ వ్యత్యాసం మరీ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ తేడా 13 శాతం ఉంది.
చైనా చిన్నోళ్లను మరో సమస్య నిద్రకూడా పోనివ్వటం లేదు... ఎన్నో రూపాయలు ఖర్చుచేసి పక్క దేశాల నుంచి కొనుగోలుచేసి మరీ పెళ్లాడిన అమ్మాయిలు చెప్పా పెట్టకుండా తుర్రుమంటున్నారు. మరీ వియత్నాం యువతులైతే అంగడి సరుకుగా మారి మరొకరికి అమ్ముడు పోతున్నారు.. సొమ్మూ పోయి.. భార్యాపోయి... రెంటీకి చెడ్డ రేవడిలా మారిన ఇలాంటి వారిపై జాలితో బీజింగ్‌లోని ఓ మ్యారేజ్ బ్యూరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. పక్కదేశాల నుంచి తీసుకువచ్చి పెళ్లి చేసుకున్న అమ్మాయి మిస్సైతే... వియత్నాం వర్జిన్ ఉమెన్ ఫ్రీ అని ప్రకటించిందో బ్యూరో. 32 వేల డాలర్లు చెల్లించి వారు కుదిర్చిన సంబంధానికి ఓకే అంటే... ఏడాది వరకు రీప్లేస్‌మెంట్ గ్యారంటీ ఇస్తున్నారు.. అంటే సంవత్సరంలోగా భార్య మాయమైతే మరో కన్యను ఇచ్చి ఫ్రీగా పెళ్లి జరిపిస్తారన్నమాట. అయితే ఈ ఆఫర్ పెళ్లైన ఏడాదిలోపు మాత్రమే వర్తిస్తుందట. ఒక్కరోజు దాటినా.. మళ్లీ కొనుక్కోవాల్సిందే.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



