ప్రతిభాపాటిల్ తర్వాత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించనున్న వ్యక్తి పేరు దాదాపుగా ఖరారయ్యింది. ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీనే.. కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూపీఏ తమ అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని ప్రకటించింది. ప్రణబ్ గెలిపించుకోవడానికి సరిపడా ఓట్లు తమవద్ద లేకపోయినా.. ఎన్డీఏ కూటమి దగ్గర గానీ, థర్డ్ ఫ్రంట్ దగ్గర కానీ, కాంగ్రెస్ ను మించిన ఓట్లు లేకపోవడంతో ప్రణబ్ ఎన్నిక ఖాయమనే చెప్పొచ్చు. ఓరకంగా రాష్ట్రపతి ఎంపిక విషయంలో మమత పాచిక పారలేదు. మమత బెదిరింపులకు భయపడకూదని నిర్ణయించిన సోనియా.. అవసరమైతే సంబంధాలు తెచ్చుకోవడానికీ సిద్ధమేనని తేల్చి చెప్పేశారు. ప్రణబ్ ముఖర్జీని కాకుండా.. మన్మోహన్, కలాం, సోమనాథ్ లలో ఒకరిని ఎంపిక చేస్తే మద్దతిస్తామంటూ.. సమాజ్ వాదీ పార్టీతో కలిసి మమత కొత్త సమీకరణాలకు తెరతీశారు. అయితే.. ఎన్ని గొడవలైనా కీలకసమయంలో కాంగ్రెస్ కు ప్రాణవాయువును అందించే ములాయం.. మమతకు చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చి.. సోనియాతో చేతులు కలిపారు. దీంతో.. బెంగాల్ దీదీ ఒంటరిగా మిగిలిపోయారు. ఎన్డీఏతో సత్సంబంధాలు లేకపోవడం.. ఒకవేళ ఎన్డీఏ పక్షాన నిలబడ్డా.. వారి అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకం లేకపోవడంతో.. బెంగాల్ బ్రదర్ ప్రణబ్ కు సపోర్ట్ చేయడం తప్ప మరో మార్గం ఆమె ముందు లేదనే చెప్పొచ్చు. కాబట్టి.. మన నెక్ట్స్ ప్రెసిడెంట్ ప్రణబే..
రాహుల్ కు లైన్ క్లియర్..!
వచ్చే ఎన్నికల్లో యూపీఏ మళ్లీ విజయం సాధిస్తే.. ప్రధాని పదవిని అందుకోవడానికి అనుభవం ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. మన్మోహన్ పై ఇంటా బయటా విమర్శలు వస్తుండడంతో.. ఈ సారి క్యాండిడేట్ ను మార్చడం తప్పనిసరి. పైగా, యువరాజుగా కాంగ్రెస్ శ్రేణులు కీర్తించే రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేయాల్సిన సమయం. కానీ, ప్రణబ్ ఉంటే, ఆయనకు పదవిని ఇవ్వకుండా, రాహుల్ ను ప్రధానిని చేస్తే.. విమర్శల పాలవుతామన్న అనుమానం సోనియాది. అందుకే.. ప్రణబ్ ను రాష్ట్రపతి భవన్ కు పంపించి... పార్లమెంట్లో రాహుల్ కు ఎదురులేకుండా చేస్తున్నారు. సవాలక్ష ఒత్తిళ్లతో సతమతమయ్యే కన్నా.. రాష్ట్రపతిగా రెస్ట్ తీసుకోవాలని అటు ప్రణబ్ కూడా అనుకుంటున్నారు.. అందుకే.. ఆల్ హ్యాపీస్..
mamatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
mamatha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
15, జూన్ 2012, శుక్రవారం
కొత్త రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనే..!
ప్రతిభాపాటిల్ తర్వాత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించనున్న వ్యక్తి పేరు దాదాపుగా ఖరారయ్యింది. ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీనే.. కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూపీఏ తమ అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని ప్రకటించింది. ప్రణబ్ గెలిపించుకోవడానికి సరిపడా ఓట్లు తమవద్ద లేకపోయినా.. ఎన్డీఏ కూటమి దగ్గర గానీ, థర్డ్ ఫ్రంట్ దగ్గర కానీ, కాంగ్రెస్ ను మించిన ఓట్లు లేకపోవడంతో ప్రణబ్ ఎన్నిక ఖాయమనే చెప్పొచ్చు. ఓరకంగా రాష్ట్రపతి ఎంపిక విషయంలో మమత పాచిక పారలేదు. మమత బెదిరింపులకు భయపడకూదని నిర్ణయించిన సోనియా.. అవసరమైతే సంబంధాలు తెచ్చుకోవడానికీ సిద్ధమేనని తేల్చి చెప్పేశారు. ప్రణబ్ ముఖర్జీని కాకుండా.. మన్మోహన్, కలాం, సోమనాథ్ లలో ఒకరిని ఎంపిక చేస్తే మద్దతిస్తామంటూ.. సమాజ్ వాదీ పార్టీతో కలిసి మమత కొత్త సమీకరణాలకు తెరతీశారు. అయితే.. ఎన్ని గొడవలైనా కీలకసమయంలో కాంగ్రెస్ కు ప్రాణవాయువును అందించే ములాయం.. మమతకు చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చి.. సోనియాతో చేతులు కలిపారు. దీంతో.. బెంగాల్ దీదీ ఒంటరిగా మిగిలిపోయారు. ఎన్డీఏతో సత్సంబంధాలు లేకపోవడం.. ఒకవేళ ఎన్డీఏ పక్షాన నిలబడ్డా.. వారి అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకం లేకపోవడంతో.. బెంగాల్ బ్రదర్ ప్రణబ్ కు సపోర్ట్ చేయడం తప్ప మరో మార్గం ఆమె ముందు లేదనే చెప్పొచ్చు. కాబట్టి.. మన నెక్ట్స్ ప్రెసిడెంట్ ప్రణబే..
రాహుల్ కు లైన్ క్లియర్..!
వచ్చే ఎన్నికల్లో యూపీఏ మళ్లీ విజయం సాధిస్తే.. ప్రధాని పదవిని అందుకోవడానికి అనుభవం ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. మన్మోహన్ పై ఇంటా బయటా విమర్శలు వస్తుండడంతో.. ఈ సారి క్యాండిడేట్ ను మార్చడం తప్పనిసరి. పైగా, యువరాజుగా కాంగ్రెస్ శ్రేణులు కీర్తించే రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేయాల్సిన సమయం. కానీ, ప్రణబ్ ఉంటే, ఆయనకు పదవిని ఇవ్వకుండా, రాహుల్ ను ప్రధానిని చేస్తే.. విమర్శల పాలవుతామన్న అనుమానం సోనియాది. అందుకే.. ప్రణబ్ ను రాష్ట్రపతి భవన్ కు పంపించి... పార్లమెంట్లో రాహుల్ కు ఎదురులేకుండా చేస్తున్నారు. సవాలక్ష ఒత్తిళ్లతో సతమతమయ్యే కన్నా.. రాష్ట్రపతిగా రెస్ట్ తీసుకోవాలని అటు ప్రణబ్ కూడా అనుకుంటున్నారు.. అందుకే.. ఆల్ హ్యాపీస్..14, మార్చి 2012, బుధవారం
రైల్వే మంత్రి పదవికి గండం తెచ్చిన బడ్జెట్..
Categories :
mamatha . news . railway budget . railway minister . TOP
ప్రతిష్టాత్మక రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి దినేశ్ త్రివేదికి.. అదే బడ్జెట్ పదవీ గండాన్ని తెచ్చిపెట్టింది. బడ్జెట్‌లో రైలు ఛార్జీలను పెంచిన పాపానికి ఏకంగా తన పదవినే కోల్పోవాల్సి వచ్చింది. దీనికి కారణం ఎవరో కాదు.. బెంగాలీ దీదీ మమతా బెనర్జీ. తనకు ముఖ్యమంత్రి పదవి లభించడంతో, అంతవరకూ తాను పాలించిన రైల్వే మంత్రిత్వ శాఖను ఏరికోరి తన పార్టీ ఎంపీ దినేశ్ త్రివేదీకి అప్పజెప్పింది మమతా బెనర్జీ. అయితే.. ఈ సారి రైల్వే బడ్జెట్‌లో ఛార్జీలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా, ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. అయితే.. దీనికి త్రివేదీ నిరాకరించడంతో మమతా కన్నెర్ర చేసింది. దినేశ్ త్రివేదీని మంత్రి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో ముకుల్ రాయ్ ను నియమించాలంటూ ప్రధానికి సిఫార్సు చేస్తూ ఓ లేఖను కొద్ది సేపటి క్రితం మమతా బెనర్జీ రాశారు. అయితే.. దీనిపై ప్రధాని ఎలా స్పందిస్తారన్నదానిపైనే రాజకీయం ఎలా మారుతుందన్నది ఆధారపడి ఉంది. అవసరమైతే, యూపీఏకు మద్దతు ఉపసంహరించడానికి కూడా మమత సిద్ధంగా ఉన్నట్లు సమాచారం..
Read more...
8, నవంబర్ 2011, మంగళవారం
బీరాలు పోయారు.. బెదిరించారు.. చివరకు తోక ముడిచారు
పెట్రోల్ ధరలు పెరిగీ పెరగగానే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్లిలం అయ్యారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని, ధరల పెంపుతో సామాన్యుడి జీవితం అతలాకుతలమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎంపీలంతా మద్దతు ఉపసంహరించమంటున్నా, ప్రధానితో భేటీకోసం ఆగామన్నారు. వెనక్కి తగ్గకపోతే, సర్కార్ నుంచి వైదొలగడానికీ సిద్ధమేనన్నారు. మమత మాటలతో యూపీఏ విచ్చిన్న ఖాయమనే అంతా అనుకున్నారు. మన్మోహన్ సర్కార్ ధరలు తగ్గించమని స్పష్టంగా ప్రకటించడంతో, యూపీఏ నుంచి తృణమూల్ చీలిపోతుందనే చాలా మంది అంచనాకు వచ్చారు. మమత పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడింది. TMC కి చెందిన 18 మంది లోక్ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు మంగళవారం ప్రధానితో ములాఖత్ అయ్యారు. రాజీనామా లేఖలు ఇచ్చి వస్తారనుకుంటే, రాజీ పడి వచ్చారు. సమావేశం అయ్యాక, ప్రధానికి తమ అసంతృప్తిని తెలయజేశామని, సామాన్యులు ఈ ధరల పోటును భరించలేరని చెప్పామని, ప్రధాని కూడా తమతో ఏకీభవించారని స్టేట్ మెంట్ ఇచ్చారు. మరోసారి ధరలు పెరిగితే మాత్రం మద్దతు ఉపసంహరిస్తామంటూ, ప్రస్తుతానికి ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారు.
ఆది నుంచీ అంతే..
మమత వ్యవహార శైలిని దగ్గరనుంచి పరిశీలించినవారికి, ఆమెదంతా హడావిడిగానే కనిపిస్తుంది. ఆవేశంగా ముందడుగు వేయడం, ఆ తర్వాత వెనక్కి తగ్గడం మమతకు కొత్తేమీ కాదు. రెండువేల సంవత్సరంలోనూ వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఇలానే ముప్పుతిప్పలు పెట్టారు మమతా బెనర్జీ. పెట్రోల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ, సెప్టెంబర్ 30,2000 న మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ, వాజ్‌పేయి హామీ ఇవ్వడంతో వారంలో వెనక్కి తగ్గారు. అదే ఏడాది డిసెంబర్ 3న పంజాబ్‌లో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. కానీ ప్రధాని ఆమోదించకపోవడంతో పదవిలోనే కొనసాగారు. 2001, మార్చి లో తెహల్కా కుంభకోణం బయటపడ్డప్పుడు , ఎన్డీఏకు తృణమూల్ మద్దతు ఉపసంహరించింది. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి.. కాంగ్రెస్‌కు స్నేహహస్తం చాచింది. అప్పట్లో బెంగాల్‌లో ఎన్నికలు ఉండడంతో బెంగాల్ దీదీ.. కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. కానీ, మే నెలలో జరిగిన ఎన్నికల్లో తృణమూల్‌కు చావు తప్పి కన్ను లొట్టపోయింది. దారుణంగా ఓడిపోవడంతో మమత మనసు మరోసారి మారింది. జూన్-జులైల మధ్య కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకుని, మళ్లీ ఎన్డీఏ వైపు అడుగులు వేశారు. ఆగస్టు 27న ఎన్డీఏలో అధికారికంగా చేరారు. ఆ తర్వాత మళ్లీ ఎన్డీఏను వదిలిపెట్టి, యూపీఏతో సంబంధాలు కొనసాగిస్తున్నారు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)