తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో, తనను తాను విమర్శించుకోవడంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మను మించినోడు ఎవరూ ఉండరన్నది జగమెరిగిన సత్యం. అందుకే, ఆయన ఏది మాట్లాడినా, ఏం చేసినా పెద్ద సంచలనం అవుతుంది. ఎప్పటిలానే మరోమారు తనపై తాను ఓ వెరైటీ సెటైర్ వేసుకున్నాడు వర్మ. ఆయన తీస్తున్న సినిమాలు వరసగా ప్లాప్ అవుతున్న సమయంలో, ఇక వర్మ సినిమాలు తీయడం అవసరమా అన్న విమర్శలు చెలరేగుతున్నసమయంలో తన పాత ఫార్ములానే మళ్లీ జనంపైకి వదులుతున్నాడు వర్మ. సూపర్ హిట్ సినిమా సత్య కు సీక్వెల్ గా సత్య -2 ను సిద్ధం చేశాడు. ఈ సినిమా ఎందుకు తీశారన్నదానికి ఎవరూ అడగకుండానే ఆన్సర్ ఇచ్చేశాడు రామ్. "సీమ ఫ్యాక్షనిస్టులు నశించారు గనక, విజయవాడ రౌడీలు దిక్కులేకుండా పోయారు గనక, హైదరాబాద్ రౌడీలు ఇంకేమీ దొబ్బించుకోలేరు కనుక.. సత్య-2 వస్తున్నాడు" అంటూ ఆడియో రిలీజ్ బ్యానర్ పై పేర్కొన్నారు. ఈ మాటల్లోనే చరిత్రంతా చెప్పేశారాయన. రక్తచరిత్రకు మంచి టాక్ వచ్చినా ఆశించినంత హిట్ కాకపోవడం, బెజవాడ రౌడీలు అట్టర్ ప్లాప్ కావడం, గాయం-2 కూడా చెత్తబుట్టలో పడిపోవడం వల్ల, తనకు ఇక మిగిలింది ఒక్క సత్యనే అన్న అసలు సత్యాన్ని బయటపెట్టేశారు. ఎంతైనా నిజం ఒప్పుకోవడానికి చాలా గట్స్ కావాలి.. అవి ఉన్నాయి కాబట్టే.. వర్మ అయ్యాడు.
Read more...
varma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
varma లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
17, సెప్టెంబర్ 2013, మంగళవారం
25, ఫిబ్రవరి 2012, శనివారం
రెడ్డిగారు పోయాక ఏమయ్యింది?
Categories :
entertainment . tollywood . TOP . varma
రెడ్డి గారు పోయారు... ఇదీ కాన్సెప్ట్. సంచలనాలనే సినీ కథాంశాలుగా ఎంచుకునే సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ త్వరలో సంధించబోతున్న సినీ అస్త్రమిది. అవును, ప్రస్తుతం డిపార్ట్ మెంట్ సినిమా తీస్తున్న వర్మ.. అది పూర్తి కాగానే "రెడ్డిగారు పోయారు" తీయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు.
సినిమా టైటిల్ వినగానే మీకు మ్యాటర్ అర్థమైపోయింటుంది. కథ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన సంఘటనల గురించే. చంద్రబాబు, కిరణ్, చిరంజీవి, అందరికన్నా ఎక్కువగా వైఎస్.జగన్ వీరంతా ఈ సినిమాలో పాత్రధారులు. కాకపోతే, తనకు అలవాటైన రీతిలో ఇది కల్పిత కథంటూ బుకాయిస్తూనే... ఓ మాజీ ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలని చెబుతున్నాడు. మరి ఈ సినిమా అయినా సక్సెస్ అవుతుందో.. లేదంటే.. నానా హడావిడి చేసి విడుదలైన రోజే బోర్లా పడుతుందో చూడాలి.
Read more...
22, నవంబర్ 2011, మంగళవారం
రాముడి రావణుడిగా నాగార్జున
Categories :
entertainment . nagarjuna . tollywood . TOP . varma
రాముడి అపర భక్తుడైన శ్రీరామదాసుగా నటించి మెప్పించిన అక్కినేని నాగార్జున త్వరలోనే రావణుడి అవతారం ఎత్తబోతున్నారు. అదీ.. రామ్ గోపాల్ వర్మ తీయబోయే రామాయణం సినిమాలో. ఈ విషయాన్ని స్వయంగా వర్మే తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మిగిలిన నటీనటుల వివరాలన్నీ త్వరలోనే తెలియజేస్తానన్నారు. రామాయణ కథనే నేటి నేటివిటీకి తగ్గట్లుగా సినిమా తీయాలనుకుంటున్న రామ్ గోపాల్ వర్మ... రామాయణం తీస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అందులో అయోధ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అధిపతి దశరథుడు. అతని మొదటి భార్య కౌసల్య. రెండో భార్య కైకేయి. కౌసల్య కొడుకు రామ్ శంకర్. కైకేయి కొడుకు భరత్ కుమార్. తన ఆస్తికి వారసుడు భరత్ కుమారేనని ఓ సందర్భంలో కైకేయికి మాట ఇస్తాడు దశరథుడు. ఆ నేపథ్యంలో రామ్ శంకర్ ను తన కంపెనీల్లో ఓ సిక్ యూనిట్ కు పంపిస్తాడు. ఇదీ కథ. అయితే.. ఇందులో లంక కూడా ఉంటుంది. అదే లంకా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. దీని యజమానే రావణుడు. అదే ఇప్పుడు నాగార్జున చేయబోయే పాత్ర. ఈయనకో చెల్లెలు ఉంటుంది. ఆమే శూర్పణక. ఓ సందర్భంలో రాముడిని చూసి మోజు పడి పరాభవం పాలవుతుంది. అయోధ్య గ్రూప్ కు, లంకా గ్రూప్ మధ్య వ్యాపారపరమైన పోటీ ఉంటుంది. ఈ రెండు కంపెనీల మధ్య జరిగే సంఘర్షణలోంచే రామాయణం సినిమా పుట్టిందంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ప్రతినాయక ఛాయలున్న లంకా గ్రూప్ ఛైర్మన్ పాత్రకు నాగార్జునను ఎంచుకున్నాడు. నాగార్జున దీనికి ఒప్పుకున్నాడా లేదా అన్నది ఇంతవరకూ తెలియలేదు. కానీ, నాగ్ నటిస్తున్నాడని వర్మే స్వయంగా ప్రకటించాడు. ఈ విలన్ క్యారెక్టర్ ను నాగ్ ఎందుకు ఎంచుకున్నాడన్నది అర్థంకాని ప్రశ్న. అయితే.. దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ పోషించిన ధుర్యోధనుడి పాత్ర రేంజ్ లో రావణ్ పాత్ర ఉందని నమ్మబలుకుతున్నాడు వర్మ. సినిమా మొదలుపెట్టడానికి ముందే కోతలు కోయడంలో వర్మను మించినోడు లేడన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి నాగ్ పోషించబోయే పాత్ర ధుర్యోధనుడికి దీటుగా నిలబడుతుందా లేక అట్టర్ ప్లాప్ అయ్యి నాగ్ ఇమేజ్ ను దెబ్బతీస్తుందా..? వేచి చూడాల్సిందే.
Read more...
19, నవంబర్ 2011, శనివారం
ఇది వర్మ రామాయణం
Categories :
entertainment . ramayanam . TOP . varma
రామ్ గోపాల్ వర్మ.. సినీ ఇండస్ట్రీలో విలక్షణంగా ఆలోచించే డైరెక్టర్. స్టోరీ కన్నా, ప్రచారంతోనే సగం బిజినెస్ చేసుకునే టైప్. సిచ్యువేషన్‌కు తగ్గ సినిమాలు తీయడంలో ఆయనది ప్రత్యేకమైన స్టైల్. బెజవాడకు చెందిన ఓ లీడర్ చనిపోగానే.. బెజవాడ రౌడీలంటూ సినిమా మొదలుపెట్టేసిన ఘనత వర్మది.
అలాంటి రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు రామాయణంపై కన్నేశారు. రామాయణాన్ని ఇతివృత్తంగా తీసుకొని, ఆ స్టోరీని ప్రస్తుత పరిస్థితులకు ఆపాదించి.. సినిమా తీయాలనుకుంటున్నారు. దానికి పేరు కూడా రామాయణం అనే పెట్టారు. త్వరలోనే సినిమా తీస్తానంటూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
స్టోరీని కూడా ముందే ప్రకటించారు వర్మ. అయోధ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. లంక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మధ్య జరిగే ఆధిపత్య పోరాటం అన్నారు. సినిమాలో క్యారెక్టర్ల పేర్లను కూడా రామాయణం నుంచే తీసుకున్నారు. వర్మ తీసే మోడ్రన్ రామాయణంలో రాముడిపేరు రామ్ శంకర్. కైకేయి పేరు కైకేయి అగర్వాల్.. భరతుడి పేరు భరత్ కుమార్.
బాపు-బాలకృష్ణల శ్రీరామరాజ్యం సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్న సమయంలో ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు వర్మ. మరి వర్మ ప్లాన్ సక్సెస్ అవతుందా.. వర్మ రామాయణం సక్సెస్ అవుతుందా..? ఇదే ఇప్పుడు తేలాలి..
Read more...
5, నవంబర్ 2011, శనివారం
సత్యం కుంభకోణం నేపథ్యంగా వర్మ సినిమా..
Categories :
entertainment . satyam . tollywood . TOP . varma
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేపథ్యంగా రాంగోపాల్ వర్మ ఓ సినిమాను త్వరలో తీయబోతున్నారు. అందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. ఐటీ ప్రపంచంలో, కార్పోరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన రామలింగరాజు స్టోరీనే కావచ్చని ప్రచారం సాగుతోంది. 32 నెలల పాటు జైలు జీవితం గడిపిన రామలింగరాజు బెయిల్ పై విడుదలై ఇంటికి చేరుకున్న కాసేపటికే , వర్మ ఆయన ఇంటికి వెళ్లి మరీ సమావేశమయ్యారు. ఐటీ ఇండస్ట్రీ గురించి వీరిద్దరి మధ్యా చర్చ సాగినట్లు తెలుస్తోంది. ఎప్పుడు సంచలనాలతో, వివాదాలతో సినిమా మొదలుపెట్టే వర్మ, తన ట్రెండ్‌ను కొనసాగిస్తూ.. రామలింగరాజుతో భేటీ అయ్యారు. సినిమాకు స్కెచ్ వేశారు.
Read more...
1, మార్చి 2011, మంగళవారం
రాంగోపాల్ వర్మ పెళ్లి
Categories :

రొటీన్ సినిమాలతో, రోటీన్ పద్దతులతో బోర్ కొట్టించి.. తాను కూడా బోర్ ఫీలైన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. దానికి చాలా కసరత్తు చేస్తున్నాడు. ఇది వర్మ చేసుకుంటున్న పెళ్లనుకోకండి.. పెళ్లంటే వర్మకు అసలు పడదు. అందుకే, సినిమా జనం కోసం పెళ్లి అనే సినిమాను తీస్తున్నాడు. అయితే.. ఎప్పుడూ ఏదో ఓ సంచలనానికి కేంద్రబిందువుగా ఉండే వర్మ.. ఈ పెళ్లి సినిమాతోనూ అదే కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నాడు. అదేమిటంటే..
పెళ్లి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. పెళ్లి డైరెక్టర్ పూరి జగన్నాథ్.. పెళ్లి డైరెక్టర్ హరీశ్ శంకర్. మళ్లీ కన్‌ఫ్యూజ్ అయ్యారా.. ఇక్కడ కన్‌ఫ్యూజ్ ఏమీ లేదు. ఒకే సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు. అవును, తెలుగులో తొలిసారి ముగ్గురు డైరెక్ట్ చేస్తున్న సినిమా పెళ్లి. అదే ఈ సినిమా స్పెషలాటి. సినీనటులు ఎవరన్నది చెప్పడం లేదు.. తమ కథలోని హీరో పెళ్లేనంటున్నారు. చివరకు పోస్టర్లు, ట్రయలర్స్‌లోనూ స్టార్స్‌ను చూపించరంట.
సినిమాస్టోరీ విషయానికి వస్తే.. పెళ్లి చేసుకోవాలనుకునే ఓ కుర్రాడు, తాను చూసిన ముగ్గురు పెళ్లైన వారి అనుభవాల నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది స్టోరీ. వర్మ అలానే చెప్పాడు. అనగనగా ఓ కుర్రాడు. పెళ్లిచేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ, ఆయనకు ఎదురుపడిన ముగ్గురు క్యారెక్టర్లు.. పెళ్లిని ఎలా ఫీలవుతున్నారో తెలుసుకుంటాడు. చెప్పాలంటే.. ఇది నాలుగు కథల కంగాళీ సినిమా అనమాట. పెళ్లైన ముగ్గురూ ఒకరికొకరు తెలియదట. ఈ మూడు కథలనూ ముగ్గురు డైరెక్టర్లు తీస్తారు. కానీ, మూడు కథల్లోనూ కామన్ క్యారెక్టర్ హీరో అన్నమాట. వీటినుంచి ఏం నేర్చుకున్నాడు.. చివరకు పెళ్లి చేసుకున్నాడా లేదా.. అన్నదే సస్పెన్స్. మొత్తానికి అప్పల్రాజుతో గొప్పల్రాజు అయిపోదామనుకున్న వర్మ పాచిక పారలేదు. దొంగలముఠా అంటూ మరో ప్రయోగం చేస్తున్నాడు. ఇంతలోనే.. పెళ్లంటే ఏమాత్రం సదభిప్రాయం లేని వర్మ, ఈ పెళ్లి సినిమాను తీస్తున్నాడు. ఇక రొటీన్‌గా చెప్పుకోవాలంటే, ఇది జనం కోస్తున్న సినిమా కానేకాదు.. వర్మ కోసం తీసుకుంటున్న సినిమా. చూస్తే చూడండి.. లేకపోతే మానేయండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)






