ఇలా సగం ధరకే చికెన్ అమ్మడానికి కారణం ఏమిటంటే.. చికెన్ వ్యాపారుల్లో మార్పు తేవడం కోసమేనట. సూరారం కాలనీలో చికెన్ వ్యాపారులంతా ఎవరికి ఇష్టం వచ్చిన ధరకు వాళ్లు అమ్ముతున్నారట. ఒకే ధరకు అమ్ముదామంటూ ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ వినిపించుకోకపోవడంతో.. ఒళ్లు మండిన మహమూద్ ఇలా బంపర్ ఆఫర్ జనానికి ఇచ్చేశాడు. వ్యాపారులంతా కలిసికట్టుగా ఒకే రేటుకు అమ్ముతామని ఒప్పుకునే వరకూ.. కిలో చికెన్ 70 రూపాయలకే అమ్ముతానంటున్నాడు. మొత్తానికి వ్యాపారుల మధ్యపోటీ.. చికెన్ ప్రియులకు మాత్రం కడుపు నింపుతోంది.
అక్కడ కిలో చికెన్ రూ.70 మాత్రమే!
Categories :
chicken rate . chicken@Rs.70 . hyderabad . jeedimetla . news . special . variety
ఇలా సగం ధరకే చికెన్ అమ్మడానికి కారణం ఏమిటంటే.. చికెన్ వ్యాపారుల్లో మార్పు తేవడం కోసమేనట. సూరారం కాలనీలో చికెన్ వ్యాపారులంతా ఎవరికి ఇష్టం వచ్చిన ధరకు వాళ్లు అమ్ముతున్నారట. ఒకే ధరకు అమ్ముదామంటూ ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ వినిపించుకోకపోవడంతో.. ఒళ్లు మండిన మహమూద్ ఇలా బంపర్ ఆఫర్ జనానికి ఇచ్చేశాడు. వ్యాపారులంతా కలిసికట్టుగా ఒకే రేటుకు అమ్ముతామని ఒప్పుకునే వరకూ.. కిలో చికెన్ 70 రూపాయలకే అమ్ముతానంటున్నాడు. మొత్తానికి వ్యాపారుల మధ్యపోటీ.. చికెన్ ప్రియులకు మాత్రం కడుపు నింపుతోంది.
తొమ్మిదిన్నర చేరుకున్న బాలాపూర్ ప్రసాదం
Categories :
BALAPUR LADDU . ganesh immersion . hyderabad . laddu . news . nimajjanam
రికార్డు కొట్టేసిన కేసీఆర్
తెలంగాణలో భారీగా పోలింగ్
జిల్లాల వారీగా చూస్తే
ఆదిలాబాద్ 78%
నిజామాబాద్ 70%
కరీంనగర్ 76.02%
మెదక్ 77%
రంగారెడ్డి 60%
హైదరాబాద్ 53%
మహబూబ్ నగర్ 73%
నల్గొండ 80.56%
వరంగల్ 75%
ఖమ్మం 78%
భారీగా పోలింగ్ నమోదు కావడంతో, విజయం ఎవరిదన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమదే విజయం అంటూ బీరాలు పోతున్నాయి. అటు దేశవ్యాప్తంగానూ భారీగా పోలింగ్ నమోదయ్యింది. ఐదు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది.
దూసుకెళ్తున్న వరంగల్.. రేసులో వెనుకబడ్డ రాజధాని
వరంగల్ 37.34%
నిజామాబాద్ 37.50%
ఖమ్మం 36.97%
మహబూబ్‌నగర్ 35.71%
మెదక్ 34.33%
ఆదిలాబాద్ 33.96%
కరీంనగర్31.96%
నల్గొండ 23.30%
రంగారెడ్డి 26%
హైదరాబాద్ 18.03%
చిరూ.. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో..!
హైదరాబాద్ వెనుకబడింది..
యూటీ మూగబోయే.. ప్రత్యేక రాష్ట్ర పాట మొదలయ్యే
Categories :
bifurcation . hyderabad . jd sheelam . kavuri . pallam raju . POLITICS . seemandhra . shinde . special state . telangana . TOP
అభయ కేసులో అసలు దోషులెవరు?
Categories :
abhaya case . gang rape . hyderabad . news . TOP
ఇక ఈ ఘటన జరగడం వెనుక లోపాలను పరిశీలిస్తే, ఎన్నో కనిపిస్తాయి. ఢిల్లీలో నిర్భయ కేసు జరిగిన తర్వాత, ఐటీ ఆఫీసులు, కాల్ సెంటర్లు ఎక్కువగా ఉన్న సైబరాబాద్ పరిధిలో సీసీ కెమెరాలు భారీగా అమర్చామని, నిర్బయలాంటి ఘటనలు తమ పరిధిలో జరగవని అప్పటి పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల నాథ్ ప్రకటించారు. కానీ, అదంతా వట్టిమాటలేనని తాజా ఘటనతో తేలిపోయింది. ఎందుకంటే, మాదాపూర్ నుంచి కొల్లూరు వెళ్లేదాకా ఒక్క సీసీ కెమెరా కూడా కారును రికార్డ్ చేయలేకపోయింది. ఇంత దారుణంగా సీసీ కెమెరాల పనితీరు ఉన్నా మన పోలీసులు పట్టించుకోవడం లేదు. అదృష్టవశాత్తూ బిర్లా స్కూల్ దగ్గర సీసీ కెమెరా పనిచేసింది కాబట్టి ఈ కేసులో చిక్కుముడి చాలావరకూ వీడిపోయింది. ఒకవేళ అక్కడ కెమెరా లేకపోతే పరిస్థితి ఏమిటి.. ఈ నిందితులు దొరికేవారా..? ఒకవేళ దొరకకపోతే మాత్రం, ఇదే తరహాలో మరెంతోమంది యువతుల జీవితాలతో చెలగాటమాడేవారన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఈ కేసును పోలీసులు త్వరగా ఛేదించినప్పటికీ, వారి నిర్లక్ష్యం వల్లే ఇంత దారుణం చోటుచేసుకుందన్నది అందరూ గుర్తించాల్సిన విషయం.
ఇక త్వరగా హాస్టల్‌కు వెళ్లాలన్న తపనలో ప్రైవేట్ కార్‌లో ఎక్కడం కూడా అభయ తప్పే. నిర్భయ లాంటి ఘటనలు జరిగిన తర్వాత కూడా, ఒక్కసారి కూడా ఆమె ఆలోచించకపోవడం వల్లే ఈ దారుణం జరిగింది. కారులో ఎక్కకుండా బస్సు కోసమో, షేర్ ఆటో కోసమో కనీసం మరో పదినిమిషాలు వేచి ఉన్నా సరిపోయింది. ఒంటరిగా వెళ్లాల్సి వచ్చిప్పుడు వీలైనంతవరకూ బస్టాండ్‌ల దగ్గరకు వచ్చి ఎక్కించుకునే క్యాబ్‌లను ఆశ్రయించకపోవడమే మంచింది. ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఇలాంటి వాహనాలను ఎంచుకోవాలి.
అమ్మాయిల భద్రత కోసం మనవాళ్లు కొంతకాలం ఆండ్రాయిడ్ ఆప్‌ను తయారు చేశారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉంచుకోవడం మంచిది. ఇక పెప్పర్ స్పే లాంటివి అమ్మాయిలు బ్యాగ్‌లో ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. తాము ప్రయాణిస్తున్న వాహనం దారి మళ్లిందని గుర్తించగానే డ్రైవర్‌ను నిలదీయాలి. అతనిచ్చిన సమాధానం సరిగా లేకపోతే మాత్రం వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ 100కు డయల్ చేయాలి. ఒకవేళ ఫోన్ చేసే పరిస్థితులు లేకపోతే, మేసేజ్ పంపించినా చాలు.
ఔటర్ రింగ్‌రోడ్డు టోల్‌గేట్ల దగ్గర కూడా పోలీస్‌లను డ్యూటీలో ఉంచాల్సిన అవసరం ఉంది. కార్లలో అనుమానాస్పదంగా ఉన్నవాళ్ల వివరాలను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.
మగాళ్లు కూడా ఈ విషయంలో మారాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్లపై లైగింక దాడులు చేయాలన్న దురాలోచనను మానుకోవాలి.
శీలానికి చుక్కెదురు
Categories :
bifurcation . congress . division . hyderabad . jd sheelam . POLITICS . samaikya protest . seemandhra . TOP . ut
విజయవాడ వచ్చిన జేడీ శీలాన్ని సమైక్యవాదులు అడ్డగించారు. ఓ స్టార్ హోటల్లో ప్రెస్‌మీట్‌కు శీలం ఏర్పాట్లు చేసుకోగా, అదే జరిగితే హోటల్‌పై దాడి చేస్తామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, హోటల్ యజమాన్యం ప్రెస్‌మీట్‌కు అనుమతించలేదు. దీంతో హోటల్ బయటే మీడియాతో మాట్లాడారు శీలం. మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనూ సమైక్య ఉద్యమకారులు మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేయడంతో ఆయన అసహనానికి గురయ్యారు.
విశ్వాస ఘాతుకం
Categories :
crime . hyderabad . murder . news . sanghi temple road murder . TOP . wife killed husband
అగ్నిసాక్షిగా చేపట్టిన బంధమే అంతం చేసింది
వందేళ్లనుకున్న జీవితం
వందరోజులకే ముగిసిపోయేలా చేసింది
కట్టుకున్న భార్యే కడతేర్చింది
అనుకున్నదే అయ్యింది. అనుమానం నిజమయ్యింది. సెప్టెంబర్ 14న సంఘీ టెంపుల్ నుంచి వస్తున్న భార్యభర్తలపై దుండగులు దాడి చేశారని, ఈ దాడిలో భర్త వెంకటేశ్వరరావు హతమయ్యాడని, భార్య సౌజన్యకు తీవ్ర గాయాలు అయ్యాయన్న వార్త హైదరాబాద్ లో తీవ్ర కలకలం పుట్టించింది. అయితే, ఈ దాడి జరిగిన తీరుపై అప్పట్లోనే ఎన్నో అనుమానాలయ్యాయి. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ హత్య చేసినట్లుగా తేల్చారు.
వెంకటేశ్వరరావు ఆర్టీసీలో మెకానిక్ గా పనిచేస్తుండగా, సౌజన్య బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. , వీరిద్దరికీ మే 29న వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సౌజన్య బెంగళూరుకు వెళ్లిపోయింది, వెంకటేశ్వరరావు ఉద్యోగం రీత్యా ఇక్కడే ఉంటున్నాడు. వారాంతాల్లో హైదరాబాద్ కు వస్తూ వెళుతోంది సౌజన్య. కానీ, ఈ పెళ్లంటే ఆమెకు ఇష్టంలేదు. అంతకు ముందే ఆమె మరొకరిని ప్రేమించింది. అతడితో కలిసి వెంకటేశ్వరరావును అడ్డుతొలగించుకోవాలని పన్నాగం పన్నింది. ప్లాన్ ప్రకారం భర్తను సంఘీటెంపుల్ కు తీసుకువెళ్లింది. తిరిగి వచ్చే దారిలో ఎవరూ లేని చోట దాడి చేయించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం తన చేతులూ కోసుకుంది. కానీ, కాల్ రికార్డులు అసలు దొంగను పట్టించాయి.
వెంకటేశ్వరరావు అడ్డు తొలిగితే సౌజన్య నచ్చినవాడిని పెళ్లిచేసుకోవచ్చు.. కానీ, అతన్ని హత్య చేస్తే, తాను హంతకురాలై జైలు గోడల మధ్య బతకాల్సి వస్తుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా, ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యింది. హత్యకు బదులు వెంకటేశ్వరరావుకే అసలు విషయం చెబితే, ఈ కథ మరోలా ఉండేదేమో..
రేపు ఏమవుతుందో?
Categories :
apngo . hyderabad . lb stadium meeting . POLITICS . save andhra pradesh . TOP
ఇదెక్కడి న్యాయం.. ?
ఈ ఫోటో ఫేస్ బుక్ లో తెగ తిరుగుతోంది. ఫోటోలో విషయం కరెక్ట్ కాదు గానీ, దానికి ఉపయోగించిన టైటిల్ మాత్రం కరెక్టే. ఎందుకంటే, 1956 నాటికి హైదరాబాద్ ఏదీ లేదని, మొక్కనాటి, నీళ్లు పోసి పెంచి పెద్దది చేస్తే తెలంగాణవాళ్లే ఫలాలన్నీ తింటున్నారని చెబుతుంది. ఇదెక్కడి న్యాయం.. రాష్ట్రం విలీనం అయ్యేనాటికి హైదరాబాద్ లాంటి నగరం ఉమ్మడి రాజధానిలో ఎక్కడా లేదు. అసెంబ్లీ భవనం ఉంది, కోర్టు బిల్డింగ్ లు ఉన్నాయి, ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడే వందలాది భవనాలు సిద్ధంగా ఉన్నాయి, స్టేడియాలున్నాయి, పార్క్ లు ఉన్నాయి.. ఇక నిజాం పెట్టిన ఎన్నో కంపెనీలున్నాయి.
![]() |
| చార్మినార్ |
![]() |
| ఉస్మానియా హాస్పిటల్ |
![]() |
| నాంపల్లి రైల్వే స్టేషన్ |
ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలావరకూ హైదరాబాద్ లోనే ఏర్పాటు కావడానికి ప్రత్యేక కారణం ఉంది. సముద్ర తీరానికి దూరంగా ఉండడం, మనకు శత్రువులైన పాకిస్తాన్, చైనాలకు సుదూర ప్రాతంలో ఉండడం వల్లే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడీఎల్, హెచ్ఏఎల్ లాంటి రక్షణరంగ సంస్థలు హైదరాబాద్లో ఏర్పాటయ్యాయి.
![]() |
| మొజంజాహీ మార్కెట్ |
కర్నూలు రాజధానిగా ఎలాంటి భవనాలు, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని స్థితిలో హైదరాబాద్ కు రాజధాని తరలిందే తప్ప, హైదరాబాద్ ను అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతో మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే, రాష్ట్రానికి రాజధాని కావడం, పరిపాలనాపరమైన సౌలభ్య ఉండడంతో ఆ తర్వాత చాలా కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల విస్తరించాయి. దీనివల్ల ఎక్కువగా లబ్దిపొందింది కూడా సీమాంధ్ర వ్యాపారవేత్తలే. ఆంధ్రప్రదేశ్ హయాంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలు హైదరాబాద్ లో బాగా అభివృద్ధి చెందాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ మద్రాస్ నుంచి తరలివచ్చింది. కొన్ని ఫీలింగ్స్ చాలామందిలో బలంగా ఉంటాయి హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టింది మేమే ( ఈ పేరుతో ఫేమస్ అయిన బిల్డింగ్ ఎల్ అండ్ టీ వాళ్ల ప్రైవేట్ ప్రాపర్టీ, ఈ ప్రాంతంలో ఉన్న కంపెనీలన్నీ ప్రైవేటు కంపెనీలే. పైగా, వీటి కోసం భూములు కోల్పోయింది మాత్రం తెలంగాణ ప్రజలు),
![]() |
| నిజాం ఎయిర్ పోర్ట్ |
ట్యాంక్ బండ్ కట్టించింది ఎన్టీఆరే.. (ఈ ట్యాంక్ బండ్ ఎప్పటి నుంచో ఉంది, ఎన్టీఆర్ చేసిందల్లా సాగర్లో బుద్ధ విగ్రహం పెట్టించడం, ట్యాంక్ బండ్ పై తెలుగువాళ్ల విగ్రహాలు పెట్టించడం మాత్రమే)![]() |
| పరేడ్ గ్రౌండ్స్ |
1956 నాటికే ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో కలిసినా కలవకపోయినా, ఈ మాత్రం అభివృద్ధి చెందేది. దీన్ని కేవలం సీమాంధ్ర ప్రజల గొప్పతనంగానే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏమిటంటే, ఈ యాభై ఏళ్ల కాలంలో విశాఖ మినహా, మిగిలిన ఏ నగరమూ (అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలో ) అభివృద్ధి చెందకపోవడం, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం నిజంగా పాలకుల అసమర్థతే. దానివల్లే ఇప్పుడు ఇన్ని సమస్యలు. హైదరాబాద్ ను మేము మాత్రమే అభివృద్ధి చేశామని చెప్పుకునే వాళ్లు.. ఒక్కసారి చరిత్రతను తిరగేస్తే మంచింది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఫలాలిచ్చే చెట్టుకు సీమాంధ్రులు కాస్త ఎరువు వేశారు.. అది మరిన్ని ఫలాలను ఇచ్చింది. వాటినీ ఇంతకాలం సీమాంధ్ర ప్రజలు సంతోషంగానే తిన్నారు. అంతేకాని, మొక్కను నాటి, దానికి నీళ్లుపోసి, కాయలు కాసేలా చేసి, వాటిని కేవలం తెలంగాణకే వదిలేస్తామని అభిప్రాయపడడం మాత్రం పూర్తిగా అవివేకం.
![]() | |
| లోయర్ ట్యాంక్ బండ్ |
బ్రేకింగ్ న్యూస్: హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు.. 20 మందికి పైగా మృతి
Categories :
bomb blast . dilsuknagar blast . hyderabad . news . terrorist . TOP
అత్యంత రద్దీగా ఉండే దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఐదు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో దాదాపు 20మంది చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. 50 మందికి పైగా గాయాలయ్యాయి. దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ కు ఎదురుగా ఉన్న వెంకటాద్రి, కోణార్క్ థియేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఆనంద్ టిఫిన్ సెంటర్ ల దగ్గర రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 7 నిమిషాల మధ్య బాంబులు ఒక్కసారిగా బాంబుల పేలాయి. పేలుళ్ల శబ్ధం విని జనం భయాందోళనలకు గురయ్యారు. తలోదిక్కూ పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలోనూ చాలా మంది గాయపడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుళ్లపై కేంద్ర హోంమంత్రి షిండే ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. టీజేఏసీ సమరదీక్షకు సర్కార్ రెడ్ సిగ్నల్
తెలంగాణాకే మద్దతన్న దానం
హైదరాబాద్లో సొరంగం నిజమే
ఏం చేశారు గురూ...!
Categories :
హాలీవుడ్ సినిమా కావడంతో అంతా అమెరికా సీనరీలే కనిపిస్తాయి. ఎంతో ఖర్చుపెట్టి తీసిన ఈ గ్రాఫికల్ సీక్వెన్స్ కు లోకల్ టచ్ ఇచ్చారు హైదరాబాద్ అబ్బాయిలు. IACG కి చెందిన కొంతమంది ఓ అద్భుతమైన మల్టీమీడియా వీడియోను తమ క్రియేటివిటీతో సృష్టించారు. 2012లో యుగాంతం నిజంగా సంభవిస్తే హైదరాబాద్ ఎలా ఉంటుందన్నదే వీరి కాన్సెప్ట్. సెంటిమెంట్లు, ఫీలింగ్స్ పక్కన పెట్టి చూస్తే హాలీవుడ్ గ్రాఫిక్స్ ను తలదన్నేలా ఉంది మనవాళ్లు తయారు చేసిన వీడియో. ఇక్కడ రెండు వీడియోలను ఇస్తున్నాను. కాస్త తీరిక చేసుకుని చూసి.. మీకు ఏదినచ్చిందో చెప్పండి.
హైదరాబాద్ వీడియో
2012 మూవీ ట్రైలర్

















