గణేశ్ నిమజ్జనం అంటే ముందుగా అందరిదృష్టీ పడేది బాలాపూర్ లడ్డూపైనే. ఈ లడ్డూ కోసం సాగే వేలం పాటపై ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువాళ్లూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ మహా ప్రసాదాన్ని దక్కించుకున్నవాళ్లకు ఎంతో కలిసివస్తుందన్న నమ్మకం ఏటా పెరుగుతున్నకొద్దీ.. లడ్డూ ధర కూడా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది 9 లక్షల 26 వేల రూపాయలకు ఈ లడ్డూను సొంతం చేసుకున్న టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో, ఈ నమ్మకం మరింత ఎక్కువయ్యింది. దీంతో ఈ సారి కూడా లడ్డూవేలం పోటా పోటీగా మొదలయ్యింది.50 వేల రూపాయలతో మొదలైన వేలం పాట కొన్ని నిమిషాల్లోనే 9 లక్షలకు చేరుకుంది. చివరకు 9 లక్షల 50 వేల రూపాయలకు ఈ లడ్డూను సింగిరెడ్డి జైహింద్ రెడ్డి దక్కించుకున్నారు.
BALAPUR LADDU లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
BALAPUR LADDU లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
8, సెప్టెంబర్ 2014, సోమవారం
తొమ్మిదిన్నర చేరుకున్న బాలాపూర్ ప్రసాదం
Categories :
BALAPUR LADDU . ganesh immersion . hyderabad . laddu . news . nimajjanam
Read more...
18, సెప్టెంబర్ 2013, బుధవారం
తొమ్మిది దాటేసిన బాలాపూర్ లడ్డూ
Categories :
BALAPUR LADDU . ganesh immersion . news . RECORD PRICE . TOP
గణేశ్ నిమజ్జనం అనగానే శోభాయాత్ర, హుస్సేన్ సాగర్ తో పాటు అందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డూ. లడ్డూ వేలం పాటలకే కొత్త కళ తెచ్చిన ఘనత బాలాపూర్ లడ్డూది. ఎంతో మహిమాన్వితమైనదని పేరున్న ఆ లడ్డూ ఈ సారి ఏకంగా 9 లక్షల 26 వేల రూపాయల ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంలో ఈ మొత్తాన్ని చెల్లించి లడ్డూను దక్కించుకున్నారు టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి. నిరుడు ఈ లడ్డూ 7 లక్షల 50 వేల రూపాయలు పలికింది. అప్పటికన్నా ఈ సారి మరింత ఎక్కువ ధర రావడం ఆనందంగా ఉందన్నారు బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

