ప్రపంచంలో అత్యంత చవక కారైన టాటా నానోకు.. బజాజ్ సవాల్ విసిరింది. తన సరికొత్త, మొట్టమొదటి కారు ఆర్.ఇ. 60ని జనం ముందుకు తెచ్చింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆటో షోలో దీన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రీన్ కార్ గా దీన్ని టాటా ప్రచారం చేస్తోంది. కిలోమీటర్ కు 60 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ ను మాత్రమే ఈ కారు విడుదల చేస్తుందని బజాజ్ ఎండీ రాజీవ్ బజాజ్ ప్రకటించారు. ఇక లీటరు పెట్రోల్ కు 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందనీ ఆయన చెప్పారు. నలుగురు కూర్చోవడానికి వీలుగా తయారు చేసిన ఈ కారులో గరిష్ట వేగం మాత్రం 70 కిలోమీటర్లే సాధ్యం. నగరాల్లో వాడకానికి అనువుగా తీర్చి దిద్దిన ఆర్.ఇ.60 .. టాటా నానోకు గట్టి పోటీ ఇస్తుందని ఆటో ఇండస్ట్రీలో చర్చసాగుతోంది. డిజైన్ విషయంలో నానోతో పోలిక లేకపోయినా, ఆకట్టుకునే రీతిలోనే బజాజ్ డిజైన్ చేసింది. త్వరలోనే దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. నిస్సాన్, రెనాల్ట్ ల భాగస్వామ్యంలో దీన్ని ఉత్పత్తి చేయాలని బజాజ్ భావిస్తోంది. దీని ధర ఎంతన్నది అధికారికంగా ప్రకటించకపోయినా.. లక్షా 25 వేల నుంచి రెండు లక్షల మధ్య ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read more...
car లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
car లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
3, జనవరి 2012, మంగళవారం
8, సెప్టెంబర్ 2011, గురువారం
పిక్సెల్ అంటున్న టాటా
Categories :
car . news . tata pixel . TOP
వరసగా సరికొత్త వాహనాలను పరిచయం చేస్తున్న టాటామోటర్స్.. ఇప్పుడు పిక్సెల్ అంటోంది. క్యాబ్ టైప్ ఇండికాబ్.. మినీ కార్గో ఏస్... లక్ష కారు నానో సంచలనాలతో చరిత్ర సృష్టించిన టాటా.. అధునాతన సిటీ బేస్డ్ కార్.. పిక్సెల్ ను సిద్ధం చేస్తోంది.
ప్రస్తుతం ఉన్న కార్లతో పోలిస్తే.. వంద శాతం భిన్నంగా ఉండే కార్ ఇది. కేవలం మూడు మీటర్ల పొడవుండే పిక్సెల్ లో నలుగురు కూర్చుని హాయిగా ప్రయాణం చేయవచ్చు.
యూరప్ కోసం తయారు చేసిన ఈ కాన్సెప్ట్ కార్ ఇంకా పరీక్షించే దశలోనే ఉంది. ముందు యూరప్ మార్కెట్లో ప్రవేశ పెట్టిన తర్వాత ఇండియాలో నూ విడుదల చేసే ఆలోచనలో టాటా మోటర్స్ ఉంది.
ఇందులో "మై టాటా కనెక్ట్" అనే స్పెషల్ ఫీచర్ ను టాటా మోటర్స్ పరిచయం చేస్తోంది. టాబ్లెట్ ద్వారా కార్ తో కనెక్ట్ అయిపోవచ్చు. దీనికోసం స్టీరింగ్ పక్కనే డాకింగ్ బోర్డ్ ఉంటుంది.
ఇక ఈ కారుకు రెండు డోర్లే ఉంటాయి. ఇవి కూడా పక్కకు కాకుండా పైకి లేస్తాయి. దీనివల్ల ఒకేసారి నలుగురూ ఏ ఇబ్బందీ లేకుండా కారులో కూర్చోవచ్చు.నానో తరహాలోనే ఇంజన్ వెనుకభాగంలో ఉంటుంది. జీరో టర్న్ డ్రైవ్ కారణంగా ఎంతటి ఇరుకైన ప్రాంతంలోనైనా కారును పార్క్ చేసుకోవచ్చు.
పిక్సెల్ పనితీరు చూడాలంటే కింద వీడియోలో వీక్షించవచ్చు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)











