నేనెప్పుడూ జయలలితకు ద్రోహం చేయలేదు...
ముఖ్యమంత్రి కావాలని ఆశించలేదు.
జయను మోసం చేసిన వారు నాకూ శత్రువులే.
కుట్ర విషయం తెలిసి షాక్‌కు గురయ్యాను.
కుట్రపన్నిన వారిని క్షమించే ప్రసక్తే లేదు- శశికళ
ఇది జయలలిత ఒకప్పటి ప్రియసఖి శశికళ స్టేట్ మెంట్. తన బంధువులు, కుటుంబసభ్యులతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటున్నానని ప్రకటించింది చిన్నమ్మ. జయలలితకు దగ్గర కావడం కోసమే ఈ ప్రకటన చేసి ఉండొచ్చని చెన్నై వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఇటీవలే బెంగళూరు స్పెషల్ కోర్టులో అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరైన శశికళ జయలలితను వెనకేసుకొచ్చారు. కంపెనీ వ్యవహారాలతో జయలలితకు ఎలాంటి సంబంధంలేదని ప్రకటించి జయ మెప్పుపొందేందుకు యత్నించారు. తాజాగా మరోసారి జయకు అనుకూలంగా ఆమె టీవీలోనే తన అభిప్రాయాలను వెల్లడించి దోస్త్‌ను కూల్ చేసే పనిలో పడ్డారు.
గత ఏడాది డిసెంబర్‌లో తనకు వ్యతిరేకంగా శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు కుట్రపన్నారని పురుచ్చితలైవి అందరినీ పార్టీ నుండి బహిష్కరించింది. ఇంట్లో నుండి కూడా వెళ్లగొట్టింది. కీలక పదవుల్లో ఉన్న కొందరిపై వేటు వేసింది. మరికొందరిని అరెస్ట్ చేసి జైలులో పెట్టించింది. శశికళ భర్త నటరాజన్‌ను కూడా క్రిమినల్ కేసు కింద అరెస్ట్ చేయించింది.
అటు... జయ...శశికళను దూరం చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు.. 1996లోనూ శశికళను జయలలిత దూరంగా ఉంచింది. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి శశికళ.. ఆమె కుటుంబసభ్యులు, బంధువులే కారణమని జయలలిత ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత... కొన్ని నెలలకే మళ్లీ ఇద్దరూ దగ్గరయ్యారు.
ఆ తర్వాత... జయపై విషప్రయోగం జరిగిందనీ.. అందుకు శశికళ బంధువులే కారణమనే వదంతులు వచ్చాయి... దీంతో శశిని మరోసారి దూరం పెట్టారు జయ... మళ్లీ ఇన్నాళ్లకు... శశి స్నేహహస్తం... దీంతో వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోయే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.. మరి పురుచ్చితలైవి కరుణిస్తుందా? ఇష్టసఖిని చేరదీస్తుందా ... కాలమే నిర్ణయిస్తుంది.
Read more...
sashikala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sashikala లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
29, మార్చి 2012, గురువారం
జయను మాయలో పడేస్తున్న శశికళ
Categories :
jayalalitha . news . sashikala . tamilnadu . TOP
19, డిసెంబర్ 2011, సోమవారం
శశిని వదిలించుకున్న జయ
స్నేహానికి మారుపేరుగా, అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా ఇంతకాలం కనిపించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె సహచరి శశికళ విడిపోయారు. విడిపోయారేనకన్నా, శశికళను జయలలితే వదిలించుకున్నారనడం వాస్తవం. శశికళ జోక్యం రోజురోజుకూ ఎక్కువవుతుండడం, ప్రభుత్వంలో పెత్తనం చెలాయిస్తుండడంతో, జయలలిత అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. శశికళను, ఆమె భర్తను, ఆమెకు సంబంధించిన మరో పదిమందిని పార్టీనుంచి బహిష్కరించారు. ఇకపై పార్టీనేతలు వారితో ఏ స్థాయిలోనూ, ఎలాంటి సంబంధాలు కొనసాగించకూడదని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చిన శశికళను అంటిపెట్టుకునే ఇంతకాలం ఉన్న జయలలిత ఆకస్మికంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం డీఎంకే వర్గాలకు, రాజకీయ పండితులకు అంతుబట్టడం లేదు. అయితే, పార్టీలో మరో పవర్ సెంటర్ గా శశికళ ఎదగడానికి ప్రయత్నించడమే జయ ఆగ్రహానికి కారణమయ్యిందన్న అనుమానాలున్నాయి. వారం రోజుల క్రితమే శశికళకు దూరంగా ఉండాలని కొంతమంది మంత్రులకు జయలలిత సూచించినట్లు సమాచారం. శశికళ మాత్రం ఈ విషయంలో ఇంతవరకూ స్పందించలేదు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

