upa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
upa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
18, నవంబర్ 2013, సోమవారం
21నే తేలిపోతుందట
తెలంగాణపై కేంద్రమంత్రుల అభిప్రాయ సేకరణ నేటితో ముగిసింది. ముఖ్యమంత్రి, తెలంగాణ, సీమాంధ్ర కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై వారి వాదనలను వింది జీవోఎం. ఇప్పటికే ఈమెయిళ్ల ద్వారా సేకరించిన సమాచారంతో పాటు, రాజకీయ పార్టీలు వెలుబుచ్చిన అభిప్రాయాలు, అధికార వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా విభజన ఎలా చేయాలన్నదానిపై ముసాయిదాను తయారు చేయనుంది జీవోఎం. ఈ నెల 21న చివరిసారిగా సమావేశం కానున్న మంత్రుల బృందం అదేరోజు ముసాయిదాను రూపొందిస్తుంది. ఆ రోజే జరిగే, కేంద్ర కేబినెట్ ముందు దీన్ని ప్రవేశపెట్టనుంది. దాన్ని కేబినెట్ ఆమోదించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తైతే త్వరలోనే జరగనున్న శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ సమావేశాల్లోనే బిల్లును పెడతామని కేంద్ర హోంశాఖ కూడా స్పష్టం చేసింది.
Read more...
5, అక్టోబర్ 2013, శనివారం
సీమాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్
Categories :
bifurcation . POLITICS . seemandhra . shinde . special package to seemandhra . telangana . TOP . upa
టీనో్ట్కు కేంద్ర
కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిసిన దగ్గర నుంచి సీమాంధ్ర మండుతూనే ఉంది. బంద్లు,
రాస్తారోకోలు,
ఆందోళనలతో అట్టుడుకుతోంది. సీడబ్ల్యూసీ తీర్మానంతో పొగ రాజేసి.. కేబినెట్ నోట్‌తో మంటపెట్టిన కేంద్రం.. సీమాంధ్ర ఆందోళనలను ఇప్పటికీ రాష్ట్ర విభజనపై వెనక్కి తగ్గేదే లేదని చెబుతోంది. అయితే,
సీమాంధ్రుల ఆందోళనలను జాగ్రత్తగా గమనిస్తున్న మన్మోహన్ సర్కార్.. వాటిని నియంత్రించేందుకు ప్యాకేజ్ అస్త్రాన్ని ప్రయోగించనుంది. కొండ ప్రాంతాల రాష్ట్రాలకు అమలవుతున్న ట్యాక్స్ హాలిడేను సీమాంధ్రకు వర్తింపజేయనుంది. అంతేకాదు. చాలామంది అభ్యంతరం అంతా హైదరాబాద్ పైనే కాబట్టి,
ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లలో శాంతి భద్రత ల వ్యవహారాన్ని పూర్తిగా గవర్నర్ చేతిలో పెట్టనుంది.
రాష్ట్రాన్ని
ఎలా
విభజించాలన్న దానిపై కసరత్తు చేయడానికి,
మంత్రుల బృందం ఏర్పాటు చేసిన కేంద్రం,
ఇప్పటికే కాంగ్రెస్లో అంతర్గతంగానూ,
కాంగ్రెస్కు - కేంద్రానికి మధ్య జరిగిన రాజకీయ సంప్రదింపుల ఆధారంగా విస్తృతస్థాయి న్యాయపరమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం తెలంగాణ,
సీమాంధ్రకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండే పదేళ్ల పాటు ఒకే గవర్నర్ ఉంటారు. శాంతిభద్రతల వ్యవహారం కేంద్ర పాలిత ప్రాంతాల తరహాలో గవర్నర్ చేతిలోనే ఉంటుంది. యూటీ కేడర్ అధికారులే హైదరాబాద్లో బాధ్యతలు నిర్వహిస్తారు.
రెండు
రాష్ట్రాలకు రెండు ప్రత్యేక అసెంబ్లీలు,
రెండు
హైకోర్టులు హైదరాబాద్లోనే పనిచేస్తాయి. వీటని ఎలా ఏర్పాటు చేయాలన్నది మంత్రుల బృందం నిర్ణయిస్తుంది. కొత్త అసెంబ్లీకోసం హైదరాబాద్లో భవనం సిద్ధంగానే ఉన్నప్పటికీ,
కొత్త
హైకోర్ట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించనుంది కేంద్రం. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర మంత్రులు,
ఎంపీలకు ఈ ప్యాకేజ్ గురించి ప్రభుత్వ పెద్దలు వివరించినట్లు సమాచారం. అయితే,
ఈ
ప్యాకేజ్ను మరింత మెరుగుపరచడానికి వీరు సలహాలిస్తమనగా,
మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న చిదంబరం ముందు వినిపించాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్
పార్టీ పరంగా ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీ,
రాజకీయ కోణంలో సమస్యను పరిష్కరించడానికి అభిప్రాయ సేకరణను జరుపుతూనే ఉంది. అయితే కేబినెట్ నోట్ తర్వాత సీమాంధ్రలో ఆందోళనలు మరింత ఉధృతం కావడంతో,
ఈ
సమస్యను వెంటనే పరిష్కరించాలనుకొంటోంది. అందుకే,
సీమాంధ్ర ప్యాకేజ్కు తుదిరూపునిస్తోంది.
4, అక్టోబర్ 2013, శుక్రవారం
ఇన్నాళ్లూ ఎందుకు ఆపారు.. ఇప్పుడు దొడ్డిదారిన ఎందుకు తెచ్చారు
ఎంతో శాంతియుతంగా, సామరస్యంగా జరగాల్సిన రాష్ట్ర విభజన ప్రక్రియ యూపీఏ సర్కార్, కాంగ్రెస్ హైకమాండ్ రాజకీయాల కారణంగా అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగుతోంది. ముఖ్యంగా ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చే వరకూ తెలంగాణ నోట్ ఆగిపోతుందన్న ధీమాతో ఉన్న సీమాంధ్రులు.. కేబినెట్ నోట్ ఆమోదం పొందడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. 63 రోజులుగా ఉద్యమం చేస్తున్నా తమ మనోభావాలను గుర్తించేలేదని, తమను కేంద్రం మోసం చేస్తుందన్న భయాందోళనకు గురయ్యారు.
సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత వెంటనే కార్యాచరణ మొదలుపెట్టామన్న కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని తేల్చకుండా ఇంతకాలం నాన్చుతూ వచ్చింది. కేబినెట్ నోట్ తయారువుతోందని కొంతకాలం క్రితం చెప్పిన షిండే, ఆ తర్వాత మాట మార్చారు. అంతెందుకు, గురువారం సాయంత్రం కేబినెట్ భేటీలో నోట్ ప్రస్తావన ఉంటుందని మీడియా కోడైకూస్తుంటే, మధ్యాహ్నం వేళ తీరిగ్గా అవన్నీ వదంతులేనని కొట్టి పారేశారు. చివరకు కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యే మంత్రులకు కూడా నోట్ వ్యవహారాన్ని ముఖ్యమైన విషయంగా చెప్పలేదు. కేవలం టేబుల్ అజెండాగా పెట్టి అందరినీ మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. చివరకు, కేబినెట్ సమావేశం మొత్తాన్ని కేవలం తెలంగాణ నోట్ కే పరిమితం చేశారు. ఇలా దొంగచాటుగా వ్యవహరించాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకు వచ్చింది. టీ నోట్ తయారయ్యిందని, కేబినెట్ భేటీలో చర్చిస్తామని నేరుగా ప్రకటించవచ్చు కదా.. ఇలాంటి చర్యల వల్ల జనంలో మరిన్ని అపోహలు ఏర్పడుతున్నాయి. అసలు ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదు.. కేబినెట్ నోట్ పై ఏర్పాటు చేసే మంత్రుల బృందమే అన్ని ప్రాంతాల అభిప్రాయం తీసుకుంటుంది, విభజన ఎలా జరగాలే నిర్ణయిస్తుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని వేసి కాలహరణకు పాల్పడింది. జనాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. పోనీ, అదన్నా సక్రమంగా చేసిందా అంటే అదీ లేదు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించడానికి వస్తోందని పీసీసీ చీఫ్ బొత్స ప్రకటించిన మరుసటి రోజే టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలా వరసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఏం చేయబోతోందన్నది అనుమానాస్పదంగా మారింది. ఓ వైపు సీమాంధ్రలో ఉద్యమం తీవ్రంగా సాగుతుంటే, టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలపడం ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అనుకోవాలా లేక, ఈ ఆందోళనలకు మరింత ఆజ్యం పోసి, తర్వాత వాటిని సాకుగా చూపి వెనక్కి తగ్గే వ్యూహాన్ని ఏమైనా అమలు చేస్తోందా అన్న అనుమానాలు కలగకమానవు.
Read more...
సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత వెంటనే కార్యాచరణ మొదలుపెట్టామన్న కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని తేల్చకుండా ఇంతకాలం నాన్చుతూ వచ్చింది. కేబినెట్ నోట్ తయారువుతోందని కొంతకాలం క్రితం చెప్పిన షిండే, ఆ తర్వాత మాట మార్చారు. అంతెందుకు, గురువారం సాయంత్రం కేబినెట్ భేటీలో నోట్ ప్రస్తావన ఉంటుందని మీడియా కోడైకూస్తుంటే, మధ్యాహ్నం వేళ తీరిగ్గా అవన్నీ వదంతులేనని కొట్టి పారేశారు. చివరకు కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యే మంత్రులకు కూడా నోట్ వ్యవహారాన్ని ముఖ్యమైన విషయంగా చెప్పలేదు. కేవలం టేబుల్ అజెండాగా పెట్టి అందరినీ మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. చివరకు, కేబినెట్ సమావేశం మొత్తాన్ని కేవలం తెలంగాణ నోట్ కే పరిమితం చేశారు. ఇలా దొంగచాటుగా వ్యవహరించాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకు వచ్చింది. టీ నోట్ తయారయ్యిందని, కేబినెట్ భేటీలో చర్చిస్తామని నేరుగా ప్రకటించవచ్చు కదా.. ఇలాంటి చర్యల వల్ల జనంలో మరిన్ని అపోహలు ఏర్పడుతున్నాయి. అసలు ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదు.. కేబినెట్ నోట్ పై ఏర్పాటు చేసే మంత్రుల బృందమే అన్ని ప్రాంతాల అభిప్రాయం తీసుకుంటుంది, విభజన ఎలా జరగాలే నిర్ణయిస్తుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని వేసి కాలహరణకు పాల్పడింది. జనాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. పోనీ, అదన్నా సక్రమంగా చేసిందా అంటే అదీ లేదు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించడానికి వస్తోందని పీసీసీ చీఫ్ బొత్స ప్రకటించిన మరుసటి రోజే టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలా వరసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఏం చేయబోతోందన్నది అనుమానాస్పదంగా మారింది. ఓ వైపు సీమాంధ్రలో ఉద్యమం తీవ్రంగా సాగుతుంటే, టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలపడం ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అనుకోవాలా లేక, ఈ ఆందోళనలకు మరింత ఆజ్యం పోసి, తర్వాత వాటిని సాకుగా చూపి వెనక్కి తగ్గే వ్యూహాన్ని ఏమైనా అమలు చేస్తోందా అన్న అనుమానాలు కలగకమానవు.
3, అక్టోబర్ 2013, గురువారం
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Categories :
cabinet note . division . seemandhra . shinde . t note . telangana . TOP . upa
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. ప్రధాని నివాసంలో రెండు గంటల పాటు జరిగిన చర్చ అనంతరం తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించింది కేబినెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తెలంగాణ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ను పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని తీర్మానించింది. ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి షిండే మీడియా ముందుకు వచ్చి ఈ వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలను రక్షించడంపై మంత్రుల బృందం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారాయన. జలవనరులు సహా, ఇతర పంపకాలపై మంత్రుల బృందం నిర్ణయం తీసుకుంటుందన్నారు షిండే. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడంతో, పెద్ద ముందడుగు పడినట్లయ్యింది. కేంద్రకేబినెట్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలియగానే, సీమాంధ్రలో ఆందోళనలు వెల్లువెత్తాయి. సీమాంధ్రలో 72 గంటల బంద్ కు పిలుపునిచ్చారు సమైక్యవాదులు.
Read more...
టీ నోట్ వచ్చేసింది
రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పటినుంచి వాయిదా పడుతూ వచ్చిన తెలంగాణ నోట్ ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చింది. ప్రధాని నివాసంలో సాయంత్రం ఐదున్నరకు సమావేశమైన కేబినెట్ ముందు ఈ నోట్ ను ప్రవేశ పెట్టారు హోంమంత్రి షిండే. సీడబ్ల్యూసీ ప్రకటనకు తగ్గట్లుగానే హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకే కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టిందని పేర్కొన్నారు. కేబినెట్ ముందుకు టీ నోట్ రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమైక్యవాదులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థి జేఏసీ నేతలు ఢిల్లీలో ప్రధాని నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. వీరిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...
21, మార్చి 2013, గురువారం
సోనియాకు తెలియకుండా సీబీఐ సోదా చేస్తుందా..?
యూపీఏ ప్రభుత్వానికి డీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడం, ఆ పార్టీకి చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామాలు చేయడం.. ఆ వెంటనే, డీఎంకే అధినేత కరుణానిధి తనయుడు, ఆ పార్టీ స్టీరింగ్ తిప్పుతున్న స్టాలిన్ ఇంట్లో సీబీఐ సోదాలు అన్నీ ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. ఇదంతా కేంద్రం కుట్రేనని డీఎంకే నేతలు గగ్గోలు పెడుతుంటే, సీబీఐ సోదాలు దురదృష్ణ కరమంటూ ఓ స్టేట్ మెంట్ పడేసి చేతులు దులుపుకున్నారు పీఎం మన్మోహన్.
రెవన్యూ ఇంటిలిజెన్స్ ఫిర్యాదు మేరకే తాము సోదాలు నిర్వహించామని ప్రకటించింది సీబీఐ. అయితే, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న కీలక సమయంలో అదీ ఒక్కరోజు తేడాలోనే సీబీఐ సోదాలు జరపడం రాజకీయవర్గాల్లో పెను ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ గొడవతో ఒక్కసారిగా కలవరపడ్డ కేంద్రం హడావుడిగా ప్రధాని, సోనియా, చిదంబరంలతో చర్చలు జరిపారు. అనంతరం సోదాలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీబీఐ బృందాలు స్టాలిన్ నివాసం నుంచి అర్థాంతరంగా వెనుదిరిగాయి.
సీబీఐకు ఆమాత్రం తెలియదా..?
దేశంలో ఎన్నో కేసులను, ఎంతోమంది రాజకీయ నేతలపై ఆరోపణలను దర్యాప్తు చేస్తోంది సీబీఐ. రాజకీయంగా ఎవరిపై ఎప్పుడు ముందడుగు వేయాలో ఆ సంస్థకు బాగా తెలుసు. అలాంటిది, శ్రీలంక విషయంలో ప్రభుత్వానికి డీఎంకే మద్దతు ఉపసంహరించిన సమయంలో స్టాలిన్ ఇంటిపై పడడం, కక్ష సాధింపు కిందకువస్తుందనే విషయం తెలియదనుకోలేం. ఇది పొరపాటు జరిగిందని కూడా భావించలేం. ఈ విషయంలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మొదటిది, కేంద్రానికి డీఎంకే దూరమైంది కాబట్టి, స్టాలిన్ వ్యవహారంలో స్వేచ్ఛగా దర్యాప్తు చేయవచ్చని సీబీఐ భావించడం ఒకటైతే, తనకు దూరమైన పార్టీలపై సీబీఐను పురిగొల్పాల్సి ఉంటుందని మిగిలిన రాజకీయ పార్టీలకు సోనియా సిగ్నల్ ఇవ్వడం మరొకటి. ఎందుకంటే, ఇప్పటికే కేంద్రమంత్రి బేణి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు అలిగిన సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ తోక జాడించడానికి సిద్ధంగా ఉన్నారు. స్టాలిన్ ఇంట్లో తనిఖీల దెబ్బతో ములాయం సెట్ అయిపోవచ్చు.
మరో విషయం ఏమిటంటే, యూఎన్ హెచ్ ఆర్సీలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ డీఎంకే చేసిన డిమాండ్ పై స్పష్టమైన ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం, అక్కడ మాత్రం శ్రీలంకకు వ్యతిరేకంగానే ఓటు వేసింది. ఇదేదో ముందే డీఎంకేకు చెబితే, ఆ పార్టీ కూటమినుంచి బయటకు వెళ్లేదే కాదు. డీఎంకే బయటకు పోయే వరకూ చూసి, ఆ తర్వాత ఆ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంలో సోనియా, మన్మోహన్ల ఆంతర్యం ఏమిటన్నదీ అంతుబట్టడం లేదు.
సీబీఐను ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకొంటోందన్న విమర్శలు చేసేవారికి ఇప్పుడు మరో అస్త్రం దొరికినట్లయ్యింది. 19, మార్చి 2013, మంగళవారం
అత్యాచార నిరోధంపై మనోళ్ల చిత్తశుద్ధి అంతే..!
Categories :
anti rape bill . bjp . POLITICS . TOP . upa
అత్యాచార నిరోధక చట్టం ఎట్టకేలకు పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే, కఠినమైన నిబంధనలను చేర్చాలన్న విపక్షాల తీర్మానాలు మాత్రం వీగిపోయాయి. మహిళలు వేధించేవారికి బెయిల్ ఇవ్వకుండా చట్టంలో మార్పు తేవాలన్న బీజేపీ సవరణతో పాటు, యాసిడ్ దాడులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించాలన్న సవరణ తీర్మానం కూడా వీగిపోయింది. యాసిడ్ దాడులకు ఒడిగట్టే వారికి పదేళ్ల వరకే జైలు శిక్ష కు ప్రస్తుత చట్టం అంగీకరిస్తుంది. బహుశా యాసిడ్ దాడి ఎంత దారుణంగా ఉంటుందో ప్రభుత్వానికి తెలియలేదనుకుంటా..
ఇక కీలకమైన ఈ బిల్లు పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న సమయంలో సభ్యులు, కీలకమైన నేతలు సభలో లేకుండా పోయారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, భావి ప్రధానిగా కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకొంటున్న రాహుల్ గాంధీ, సీనియర్ మంత్రులు సభకు గైర్హాజరయ్యారు. ఇక జేడీయూ నేత చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి. మనలో అమ్మాయిలను ఫాలో అవ్వని వాళ్లు ఎవరన్నా ఉన్నారా అంటూ ప్రశ్నించారాయన. మహిళల వెంటపడడం, మాటలతో వేధించడాన్ని నేరంగా చూడడం వల్ల, మగాళ్లపై అక్రమ కేసులు ఎక్కువవుతాయంటూ లోక్ సభలో తన వాదన వినిపించారు.
అత్యంత క్రూరంగా అత్యాచారం చేసేవాళ్లకు మరణ శిక్ష, సాధారణ అత్యాచారాలకు 20 ఏళ్ల వరకూ జైలు శిక్షను ఈ చట్టం ప్రతిపాదిస్తోంది. యాసిడ్ దాడులు, మహిళల వెంటపడడం, ఇతరుల శృంగార కార్యకలాపాలు చూసి ఆనందించడం (బ్లూఫిల్మ్స్ చూడడం) లాంటివన్నీ కొత్త చట్టం కింద నేరాలుగా పరిగణిస్తారు. ప్రతీ పోలీస్ స్టేషన్ లోనూ ఓ మహిళా అధికారిని ఈ చట్టం కింద నియమించే అవకాశం ఉంది.
28, ఫిబ్రవరి 2013, గురువారం
లగ్జరీ అంటే లేచిపోతుంది!
ఖరీదైన వాహనాల కొనుగోలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లు, టూవీలర్స్ ను ఉన్నతస్థాయి వర్గాలు విపరీతంగా కొంటున్నాయి. వీటిపై కొత్త బడ్జెట్ లో భారీగా వాత వేశారు చిదంబరం. విదేశీ కార్లపై వందశాతం ఇంపోర్ట్ డ్యూటీ విధించారు. 800 సీసీ ద్విచక్ర వాహనాలపై 15 శాతం ట్యాక్స్ పెంచారు. గతంలో ఇది 60 శాతం ఉండగా, ఇప్పుడు 75 శాతం పెరగనుంది. SUV లపై ఎక్సైజ్ ట్యాక్స్ ను 27 శాతం నుంచి 30 శాతానికి పెంచారు. ఇది ఉన్నతవర్గాలకు మింగుడు పడని విషయమే. విదేశీ కార్లు కొని తమ స్పెషాలిటీని చాటుకోవాలనుకునే వాళ్లు ఇకపై మరింతగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
సెల్లుకూ బిల్లే..!
ప్రతీ ఒక్కరికీ కనీస అవసరంగా మారిన సెల్ ఫోన్ నూ వదిలిపెట్టలేదు చిదంబరం. రెండు వేల రూపాయల ఖరీదు దాటిన ప్రతీ ఫోన్ పైనా 6 శాతం పన్ను విధించారు ఆర్థికమంత్రి. ఇకపై ఫోన్లు కూడా ఖరీదు కానున్నాయి.
పొగరాయుళ్లకు మొహాన పొగకొట్టారు చిదంబరం. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై 18 శాతం ఎక్సైజ్ ట్యాక్స్ వేశారు. ట్యాక్స్ స్లాబ్ లను మాత్రం మార్చలేదు చిదంబరం. రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించేవారికి మాత్రం రెండు వేల రూపాయల ట్యాక్స్ క్రెడిట్ చేస్తామని హామీ ఇచ్చారు.
కోటిరూపాయలు పైన సంపాదిస్తున్న వారు కేవలం 42600 మంది మాత్రమే ఉన్నారని చెప్పిన చిదంబరం, కోటి రూపాయల ఆదాయం దాటిన వ్యక్తిగత, హిందూ అవిభాజ్య కుటంబాలకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరానికి పది శాతం సర్ ఛార్జ్ విధించారు. 1, ఫిబ్రవరి 2013, శుక్రవారం
శరద్ పవార్ కామెంట్లు తెలంగాణకు లాభమా..? నష్టమా..?
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలంగాణను త్వరగా ఇచ్చేయాలని వార్తలు వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ వాదులు కొండంత అండ లభించినట్లు ఫీలవుతున్నారు. యూపీఏలో ఉన్న పార్టీల్లో ప్రధాన పార్టీ ఎన్సీపీ మద్దతు వచ్చేసింది కాబట్టి, ఇక రాష్ట్ర విభజన ఖాయమని చాలామంది భావిస్తుండవచ్చు. అయితే, శరద్ పవార్ వ్యాఖ్యలు నిజంగానే తెలంగాణను సాకారం చేస్తాయా..? లేక అడ్డం పడతాయా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.
తెలంగాణపై ప్రధానితో మాట్లాడానన్న విషయాన్ని మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ తెలిపారు శరద్ పవార్. అయితే, దీనిపై అధికారిక ప్రకటనను మాత్రం ఎన్సీపీ అధికార ప్రతినిధి త్రిపాఠీ చేశారు. తెలంగాణకు తమ పార్టీ పూర్తి మద్దతు పలుకుతుందని, అలాగే, మహారాష్ట్రలో విదర్భను కూడా ఏర్పాటు చేయాలని, గూర్ఖాల్యాండ్ కూ తమ సపోర్ట్ ఉంటుందని ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే, తెలంగాణ ఇచ్చేస్తే, విదర్భ కూడా ఇవ్వాలన్నది పవార్ ఉద్దేశం కావచ్చు. పైగా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి గెలుస్తుందో లేదో తెలియని పరిస్థితి. విదర్భకు మద్దతు పలకడం ద్వారా, ఆ ప్రాంతం సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునే అవకాశం ఎన్సీపీకి ఉంటుంది. అదే సమయంలో ఎలాగూ తెలంగాణ ఇస్తున్నారు కాబట్టి, విదర్భ కూడా ఇవ్వడంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచొచ్చు. దేశంలో తెలంగాణ సమస్య వేరని, ఇతర ప్రాంతాల్లో సమస్యలు వేరని ఇంతవరకూ తెలంగాణ వాదులు వాదిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఇస్తే, మిగిలిన రాష్ట్రాల్లో విభజన ఉద్యమాలు ఉధృతమవుతుందనేది వాస్తవం కాదంటున్నారు. కానీ, ఎన్సీపీ విదర్భను కూడా ఇవ్వమంటోంది కాబట్టి, తెలంగాణ ఇస్తే, తేనెతుట్టెను కదిపినట్లే అవుతుందని సీమాంధ్ర నేతలు హైకమాండ్ దగ్గర పైరవీ చేయొచ్చు. తెలంగాణను అడ్డుకోవచ్చు.
Read more...
15, జూన్ 2012, శుక్రవారం
కొత్త రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనే..!
ప్రతిభాపాటిల్ తర్వాత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించనున్న వ్యక్తి పేరు దాదాపుగా ఖరారయ్యింది. ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీనే.. కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూపీఏ తమ అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని ప్రకటించింది. ప్రణబ్ గెలిపించుకోవడానికి సరిపడా ఓట్లు తమవద్ద లేకపోయినా.. ఎన్డీఏ కూటమి దగ్గర గానీ, థర్డ్ ఫ్రంట్ దగ్గర కానీ, కాంగ్రెస్ ను మించిన ఓట్లు లేకపోవడంతో ప్రణబ్ ఎన్నిక ఖాయమనే చెప్పొచ్చు. ఓరకంగా రాష్ట్రపతి ఎంపిక విషయంలో మమత పాచిక పారలేదు. మమత బెదిరింపులకు భయపడకూదని నిర్ణయించిన సోనియా.. అవసరమైతే సంబంధాలు తెచ్చుకోవడానికీ సిద్ధమేనని తేల్చి చెప్పేశారు. ప్రణబ్ ముఖర్జీని కాకుండా.. మన్మోహన్, కలాం, సోమనాథ్ లలో ఒకరిని ఎంపిక చేస్తే మద్దతిస్తామంటూ.. సమాజ్ వాదీ పార్టీతో కలిసి మమత కొత్త సమీకరణాలకు తెరతీశారు. అయితే.. ఎన్ని గొడవలైనా కీలకసమయంలో కాంగ్రెస్ కు ప్రాణవాయువును అందించే ములాయం.. మమతకు చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చి.. సోనియాతో చేతులు కలిపారు. దీంతో.. బెంగాల్ దీదీ ఒంటరిగా మిగిలిపోయారు. ఎన్డీఏతో సత్సంబంధాలు లేకపోవడం.. ఒకవేళ ఎన్డీఏ పక్షాన నిలబడ్డా.. వారి అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకం లేకపోవడంతో.. బెంగాల్ బ్రదర్ ప్రణబ్ కు సపోర్ట్ చేయడం తప్ప మరో మార్గం ఆమె ముందు లేదనే చెప్పొచ్చు. కాబట్టి.. మన నెక్ట్స్ ప్రెసిడెంట్ ప్రణబే..
రాహుల్ కు లైన్ క్లియర్..!
వచ్చే ఎన్నికల్లో యూపీఏ మళ్లీ విజయం సాధిస్తే.. ప్రధాని పదవిని అందుకోవడానికి అనుభవం ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. మన్మోహన్ పై ఇంటా బయటా విమర్శలు వస్తుండడంతో.. ఈ సారి క్యాండిడేట్ ను మార్చడం తప్పనిసరి. పైగా, యువరాజుగా కాంగ్రెస్ శ్రేణులు కీర్తించే రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేయాల్సిన సమయం. కానీ, ప్రణబ్ ఉంటే, ఆయనకు పదవిని ఇవ్వకుండా, రాహుల్ ను ప్రధానిని చేస్తే.. విమర్శల పాలవుతామన్న అనుమానం సోనియాది. అందుకే.. ప్రణబ్ ను రాష్ట్రపతి భవన్ కు పంపించి... పార్లమెంట్లో రాహుల్ కు ఎదురులేకుండా చేస్తున్నారు. సవాలక్ష ఒత్తిళ్లతో సతమతమయ్యే కన్నా.. రాష్ట్రపతిగా రెస్ట్ తీసుకోవాలని అటు ప్రణబ్ కూడా అనుకుంటున్నారు.. అందుకే.. ఆల్ హ్యాపీస్..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)





