అయితే, ఇప్పుడో అద్భుతమైన అవకాశం వచ్చినా దాన్ని రాహుల్ కు అందించడంలో విఫలమయ్యారు సోనియా గాంధీ. ప్రస్తుత లోక్ సభలో ఎవరికీ ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ, రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్సే ఉంది. ఆ పార్టీ లోక్ సభ నేతగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతకే దక్కుతుంది. ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తే, దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ, రాహుల్ సమర్థత మీద అవగాహన ఉండడం వల్లో ఏమో ఆ పదవిని రాహుల్ కు అందించలేదు సోనియా. ఒకవేళ మోడీ వాక్చాతుర్యాన్ని, మాటల దాడిని రాహుల్ ఎదుర్కోలేకపోవచ్చని సోనియా భావించి ఉండొచ్చు. అయితే, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా కొంతమంది ఎంపీలనే నడిపించే సామర్థ్యం లేని వ్యక్తి దేశాన్ని ముందుకు నడిపించగలడా.. ? ఇదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. సోనియా, రాహుల్ లు ఇదే తరహాలో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లోనూ వారి ఛరిష్మా పనిచేయదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
bjp లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జూన్ 2014, మంగళవారం
దీనికి పనికిరానివాడు దానికి పనికొస్తాడా..?
లోక్‌సభా పక్షనేతను ఎన్నుకునే విషయంలో తీవ్రంగా మల్లగుల్లాలు పడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చివరకు సీనియర్ పార్లమెంటేరియన్ మల్లికార్జున ఖర్గేకు ఆ బాధ్యతలు అప్పగించారు. రాహుల్ గాంధీని దీనికి ఎంపిక చేయాలని పార్టీ నేతలు సూచించినా, ఆమె తిరస్కరించారు. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీని అనధికారికంగా ప్రధానిగా ప్రమోట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రచారమంతా ఆయన ఫోటోలతోనే సాగింది. ఎన్నో రాష్ట్రాల్లో ప్రచార బాధ్యతలను మోసి విఫలమైన రాహుల్ గాంధీ.. సాధారణ ఎన్నికల్లోనూ అదే అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీకి అందించారు. దీంతో రాహుల్ పై తీవ్రస్థాయిలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ, రాజస్థాన్ నేతలతైతే బహిరంగంగానే విమర్శించారు కూడా.
అయితే, ఇప్పుడో అద్భుతమైన అవకాశం వచ్చినా దాన్ని రాహుల్ కు అందించడంలో విఫలమయ్యారు సోనియా గాంధీ. ప్రస్తుత లోక్ సభలో ఎవరికీ ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ, రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్సే ఉంది. ఆ పార్టీ లోక్ సభ నేతగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతకే దక్కుతుంది. ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తే, దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ, రాహుల్ సమర్థత మీద అవగాహన ఉండడం వల్లో ఏమో ఆ పదవిని రాహుల్ కు అందించలేదు సోనియా. ఒకవేళ మోడీ వాక్చాతుర్యాన్ని, మాటల దాడిని రాహుల్ ఎదుర్కోలేకపోవచ్చని సోనియా భావించి ఉండొచ్చు. అయితే, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా కొంతమంది ఎంపీలనే నడిపించే సామర్థ్యం లేని వ్యక్తి దేశాన్ని ముందుకు నడిపించగలడా.. ? ఇదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. సోనియా, రాహుల్ లు ఇదే తరహాలో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లోనూ వారి ఛరిష్మా పనిచేయదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
అయితే, ఇప్పుడో అద్భుతమైన అవకాశం వచ్చినా దాన్ని రాహుల్ కు అందించడంలో విఫలమయ్యారు సోనియా గాంధీ. ప్రస్తుత లోక్ సభలో ఎవరికీ ప్రతిపక్ష హోదా దక్కనప్పటికీ, రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్సే ఉంది. ఆ పార్టీ లోక్ సభ నేతగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతకే దక్కుతుంది. ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తే, దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ, రాహుల్ సమర్థత మీద అవగాహన ఉండడం వల్లో ఏమో ఆ పదవిని రాహుల్ కు అందించలేదు సోనియా. ఒకవేళ మోడీ వాక్చాతుర్యాన్ని, మాటల దాడిని రాహుల్ ఎదుర్కోలేకపోవచ్చని సోనియా భావించి ఉండొచ్చు. అయితే, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేతగా కొంతమంది ఎంపీలనే నడిపించే సామర్థ్యం లేని వ్యక్తి దేశాన్ని ముందుకు నడిపించగలడా.. ? ఇదే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. సోనియా, రాహుల్ లు ఇదే తరహాలో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లోనూ వారి ఛరిష్మా పనిచేయదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
27, మే 2014, మంగళవారం
ఒబామా రూల్ నే ఫాలో అయిన మోడీ
Categories :
bjp . cabinet . External Affairs . modi . POLITICS . sushma swaraj
ఓ చిక్కుముడిని విప్పుకునే విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామాను అనుసరించారు భారత కొత్త ప్రధాని నరేంద్ర మోడి. మోడీకొచ్చిన చిక్కేమిటనుకుంటున్నారా.. సుష్మా స్వరాజ్. ప్రతిపక్ష నేతగా హల్ చల్ చేసి ఈ సారి ప్రధాని పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సుష్మా. కానీ, గుజరాత్ లో అప్రతిహత విజయాలతో తెరపైకి వచ్చిన మోడీ, ఆమె ఆశలపై నీళ్లు పోశారు. అప్పటినుంచీ వీరి మధ్య పెద్దగా సఖ్యత లేదనే చెప్పాలి. శివసేన కూడా ఓ దశలో సుష్మా పేరునే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. కానీ, మోడీకే ఎక్కువ బలం ఉండడంతో ఆయనవైపే అంతా చూశారు. దానికి తగ్గ ఫలితాన్ని సాధించారు.. అయితే.. సుష్మాకున్న సీనియరిటీ దృష్ట్యా ఆమెకు తన కేబినెట్ లో ప్లేస్ ఇచ్చారు మోడీ.
ఇక్కడ సీన్ కట్ చేసి , ఓ సారి అమెరికా కు వెళ్దాం. అక్కడ కూడా ఇదే సీన్. ఆరేళ్ల క్రితం ఒబామాతో అధ్యక్ష అభ్యర్థిగా హోరాహోరీగా తలపడ్డారు హిల్లరీ క్లింటన్. చివరకు పార్టీలో ఎక్కువ మద్దతు కూడగట్టిన ఒబామా అధ్యక్ష అభ్యర్థిగా నిలబడడం, ఆపై విజయం సాధించడం అందరికీ తెలిసిందే. ఎన్నికలయ్యాక, హిల్లరీ క్లింటన్ ను తన కేబినెట్ లో చేర్చుకున్నారు, అయితే, దేశానికి సంబంధించిన విధాన నిర్ణయాల్లో తనకు ఎక్కడ హిల్లరీ క్లింటన్ అడ్డు తగులుతుందోనని భావించిన ఆయన తెలివిగా ఆమెకు విదేశీ వ్యవహారాలను అప్పగించారు.
ఇప్పుడు మోడీ కూడా అదే పని చేశారు. సుష్మాకు ఏ ఫోర్ట్ ఫోలియో దక్కుతుందోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఆమెకు విదేశీ వ్యవహారాలిచ్చి చేతులు దులుపుకున్నారు మోడీ. తనకు అనుకూలంగా ఉండే అరుణ్ జైట్లీకి కీలకమైన ఆర్థిక, రక్షణ శాఖలను , హోం శాఖను రాజ్ నాథ్ కు కేటాయించి తన చాణక్యాన్ని చాటుకున్నారు మోడీ.

26, మే 2014, సోమవారం
మోడీ మంత్రులు వీళ్లే..
ఈ సాయంత్రం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్రమోడీ, తన మంత్రివర్గంలో మొత్తం 45 మందికి చోటు కల్పించారు. వీరిలో 24 మంది కేబినెట్ మంత్రులు, 11 మంది సహాయ మంత్రులు, మరో పదిమంది స్వతంత్ర హోదా గల మంత్రులున్నారు.
కేబినెట్ ర్యాంక్ మంత్రులు
రాజ్‌నాథ్ సింగ్
అరుణ్ జైట్లీ
నితిన్ గడ్కరీ
సుష్మా స్వరాజ్
వెంకయ్య నాయుడు
సదానంద గౌడ
ఉమా భారతి
నజ్మా హెప్తుల్లా
గోపీనాథ్ ముండే
రాం విలాస్ పాశ్వాన్
కాల్ రాజ్ మిశ్రా
మనేకా గాంధీ
అనంత్ కుమార్
రవి శంకర్ ప్రసాద్
అశోక్ గజపతి రాజు
అనంత్ గీతే
హర్ స్మిత్ కౌర్ బాదల్
నరేంద్ర సింగ్ తోమర్
జువాల్ ఓరమ్
రాధా మోహన్ సింగ్
తవార్ చంద్ గెహ్లాట్
సృతి ఇరానీ
హర్షవర్ధన్
ఈ జాబితాను ఇప్పటికే రాష్ట్రపతికి పంపించారు మోడీ. ఇక వీరిలో ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

16, మే 2014, శుక్రవారం
కాంగ్రెస్ ను కుళ్లబొడిచేశారు..
కాంగ్రెస్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో గుణపాఠం చెప్పారు దేశ ఓటర్లు. కేవలం 46 సీట్లకే పరిమితం చేసి, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి కసి తీర్చుకున్నారు. అటు చాలాకాలం తర్వాత ఏక పార్టీకి మెజార్టీ కట్టబెట్టిన అన్ని రాష్ట్రాల ఓటర్లు, కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని, బలమైన ప్రధానిని ఎన్నుకున్నారు. ఫలితాలను చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం .. జనానికి ముఖం చూపించలేకపోతోంది.
మోడీని విధ్వంసకర శక్తిగా చూపించడానికి ప్రయత్నించి దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్, దానికి తగ్గ మూల్యమే చెల్లించుకుంది. ఎప్పుడూ లేనంతగా దేశం ఒక్కటై, మోడీకి భారీ మెజార్టీ కట్టబెట్టింది. 285 సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, ఎవరి దయాదాక్షిణ్యాలమీద బతకకుండా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమంటూ ఆశీర్వదించింది.

28, ఏప్రిల్ 2014, సోమవారం
తెలంగాణ ముగిసింది.. ఆంధ్ర మిగిలింది
తెలంగాణలో ప్రచారం నేటితో ముగిసింది. హోరాహోరీగా సాగుతాయని భావిస్తున్న ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు.. తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉధృతంగా ప్రచారం చేశాయి. బీజేపీ మోడీని బరిలోకి దించితే, కాంగ్రెస్ తరపున సోనియా, రాహుల్ రంగంలోకి దిగారు. అటు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ తరపున కేసీఆరే అన్నీ తానై తిరిగారు. టీఆర్ఎస్ చరిత్రలో ఎప్పుడూలేనంతగా ఉధృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కేసీఆర్. అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాస్త వెనుకబడ్డా బీసీ సీఎం నినాదమే తమను గట్టెక్కిస్తుందన్న విశ్వాసంతో ఉంది టీడీపీ. వైసీపీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉన్నా.. ఆ పార్టీ తరపున జగన్, షర్మిలను ప్రచారాన్ని జోరుగానే నిర్వహించారు..
తెలంగాణలో ప్రచారానికి తెరపడుతుండడంతో సీమాంధ్రపైకి దృష్టి మళ్లించాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే చంద్రబాబు కొన్ని జిల్లాల్లో ప్రచారం పూర్తి చేయగా, బాలయ్య కూడా విరామం లేకుండా ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కు స్టార్ క్యాంపైనర్ గా చిరంజీవి తన పని మొదలుపెట్టారు. అన్నింటికీ మోడీ మంత్రాన్నే వల్లె వేస్తున్న బీజేపీ, సీమాంధ్రలోనూ ఆయన్నే ప్రచారానికి పిలుస్తోంది. ఏప్రిల్ 30, మే1 తేదీల్లో ఆయన సీమాంధ్రలో పలు సభల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 30న తిరుపతిలో, మే 1న విశాఖలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఇక మే 2 సోనియా విశాఖ బహిరంగ సభలో పాల్గొంటారు. మోడీ సభ జరిగిన తర్వాతి రోజే సోనియా సభ జరుగుతుండడంతో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు. అటు రాహుల్‌తో కూడా వీలైనంతగా సభలను నిర్వహించాలని భావిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

22, ఏప్రిల్ 2014, మంగళవారం
గడ్డం లేని మోడీ
Categories :
bjp . modi . POLITICS . without beard
17, ఏప్రిల్ 2014, గురువారం
కమలానికి సైకిల్ రాం..రాం.
Categories :
alliance . bjp . chandrababu . modi . nda . POLITICS . seemandhra . tdp
టీడీపీ బీజేపీల మధ్య పొత్తు మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. సీమాంధ్రలో పొత్తును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మోడీని పీఎం చేయాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న ఆయన, ఆ పార్టీ బలహీన అభ్యర్థులను నిలబెడుతోందని విమర్శించారు. దీనివల్ల ఇతర పార్టీలు లబ్ది పొందుతాయని, అందుకే ఆంధ్రప్రదేశ్లో పొత్తును రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు బాబు.
అయితే, పురంధేశ్వరికి బీజేపీ టికెట్ ఇవ్వడం, రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వకపోవడం వల్లే పొత్తును రద్దు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పురంధేశ్వరిని పూర్తిగా పక్కన పెట్టడానికి, నర్సాపురంలో రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వడానికి కమలం పార్టీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆరెస్సెస్ నుంచి వత్తిడి పెరగడంతో గోకరాజు గంగరాజును నర్సాపురం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. దీంతో అవాక్కైన రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో చర్చలు జరిపారు. తాజాగా ఆయన టీడీపీ తరపునే నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పొత్తు రద్దైనప్పటికీ, తెలంగాణలో మాత్రం పొత్తు కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు, మోడీ, చంద్రబాబు సంయుక్త సభలు లేకుండా ఉండేలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

10, ఏప్రిల్ 2014, గురువారం
ఆ నిజం ఒప్పేసుకున్న మోడీ
Categories :
bjp . election . JASHODABEN . modi . MODI WIFE . NOMINATION . POLITICS
అవును, మోడీ అభిమానులకు ఇది షాకింగ్ న్యూసే. చాలాకాలంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, ఎప్పుడూ దాన్ని ఒప్పకుకోని మోడీ అధికారికంగా దాన్ని నిజమని చెప్పేశాడు. అదే.. పెళ్లి వ్యవహారం. తాను బ్రహ్మచారినని ఇంతకాలం చెప్పుకున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి.. ఇప్పుడు తనకు భార్య ఉందని, ఆమె పేరు జశోదా బెన్ అని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నాడు. ఆమె రిటైర్డ్ స్కూల్ టీచర్ అని కూడా ప్రస్తావించాడు.
మోడీ గుజరాత్ సీఎం అయినప్పటి నుంచీ ఆయన పెళ్లి వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. జశోదాబెన్ తానే మోడీ భార్యనంటూ మీడియా ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటోంది. దీన్ని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ సహా ఇతర ప్రతిపక్షపార్టీలు ఎప్పటికప్పుడు మోడీ టార్గెట్ చేసుకోవడానికి వాడుకున్నాయి. అయితే, ప్రతీ సారి తాను బ్రహ్మచారినే అంటూ వాటిని ఖండిస్తూవచ్చాడు గుజరాత్ సీఎం. అంతేకాదు, 2001, 2002, 2007, 2012 ఎన్నికల్లో సమర్పించిన నామినేషన్ పత్రాల్లో భార్య పేరును రాయలేదు. ఈ సారి ఏకంగా ప్రధాని పదవికే పోటీ పడుతున్న సమయంలో మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించడం సంచలనం కలిగిస్తోంది. తనపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టడానికే మోడీ ఇలా చేసి ఉంటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే, ఇది కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు మంచి ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది. అటు, ఈ అంశంతో మహిళల్లోనూ మోడీ ఇమేజ్ పలచన పడొచ్చన్న ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
మోడీకి 17 ఏళ్ల వయస్సులోనే జశోదా బెన్ తో వివాహం జరిగింది. కానీ వారి కాపురం మాత్రం ముందుకు సాగలేదు. వివాహం అనంతరం ఆరెస్సెస్ ప్రచారక్ గా మారిన మోడీ, జశోదాను మళ్లీ కలవలేదు. అటు మోడీ.. ఇటు జశోదా ఇద్దరూ మళ్లీ వివాహం చేసుకోలేదు. ఇప్పుడు జశోదా తన భార్యేనని మోడీ అంగీకరించడంతో మళ్లీ ఆమె వార్తల్లో వ్యక్తయ్యింది. అయితే, ఆమెను ఇప్పటికైనా మోడీ తన ఇంటికి తీసుకెళ్తాడా లేక.. ఇంతకు ముందులానే వ్యవహరిస్తాడా అన్నది చర్చనీయాంశమయ్యింది..

28, జనవరి 2014, మంగళవారం
దగ్గుబాటి కుటుంబం టీడీపీకి దగ్గరవుతోందా..?
Categories :
bjp . chandrababu . congress . daggubati . POLITICS . purandeshwari . tdp
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఫోకస్ అంతా ఓ కుటుంబం పైనే ఉంది. అదే దగ్గుబాటి వెంకటేశ్వరరావు-పురందేశ్వరి కుటుంబం. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు జరుపుతోందన్న సమాచారం తెలుగు తమ్ముళ్లలో విస్మయాన్ని కలిగిస్తోంది. దీనికి అనుకూలంగానే పరుచూరులో "సొంతింటికి ఆహ్వానం" అంటూ దగ్గుబాటి ఫోటోతో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు వాటిని చింపేశారు. అయినప్పటికీ తెరవెనుక ఏదో జరుగుతోందని, లేకపోతే ఈ పోస్టర్లు ఎందుకు వెలుస్తాయంటూ కొంతమంది టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి, ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడంతో చేయీచేయీ కలిపి పనిచేసిన నారా, దగ్గుబాటి కుటుంబాలు తర్వాత మాత్రం పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలతో ఎడమొహం పెడమొహం అయ్యాయి. దగ్గుబాటి కొంతకాలం బీజేపీలో ఉండి, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి తాను ఎమ్మెల్యే అవడమే కాక, తన భార్య పురందేశ్వరిని ఎంపీని , కేంద్రమంత్రిని చేయించుకోగలిగారు. అయితే, సమైక్య ఉద్యమంతో పరిస్థితులు మారడంతో పాటు, కాంగ్రెస్ నుంచి మళ్లీ పోటీ చేస్తే గెలవమేమో అన్న అనుమానం అటు వెంకటేశ్వరరావు, ఇటు పురందేశ్వరికీ ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి పోటీకోసం కొంతకాలం క్రితం సమాలోచనలు జరిపిన వీరిద్దరూ అక్కడ వ్యతిరేకత రావడంతో నరసాపురం ఎంపీ స్థానంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో, నరసాపురం సీటు పై తమకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటినుంచే మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఉన్నతస్థాయిలోనే సాగుతున్న ఈ చర్చలు దగ్గుబాటి ఫ్యామిలీకి అనుకూలంగానే ఉన్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి.

25, జనవరి 2014, శనివారం
ఇంత భావ దారిద్ర్యమా..?
రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోయినా, విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ భావ దారిద్ర్యం మరోసారి బయటపడింది. రాహుల్ కు ప్రచార పగ్గాలు అప్పగించిన తర్వాత శుక్రవారం రోజు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పత్రికల్లోనూ, ప్రధాన నగరాల్లో హోర్డింగుల రూపంలోనూ భారీగా ప్రకటనలు ఇచ్చింది. రాహుల్ ఫోటోను ముందు పెట్టి, ఆయన వెనుక, అన్ని వర్గాల ప్రజలను ఉన్నట్లు చూపించిన ఈ ప్రకటనల్లో ఇచ్చిన స్లోగన్.. మై నహీ, హమ్.. అంటే.. నేను కాదు , మనం.. అందర్నీ తనవాళ్లను చేసుకోవడానికి రాహుల్ ఇచ్చిన ప్రకటనది. పైగా ఇది మోడీకి వ్యతిరేకంగా తయారు చేసిన యాడ్. మోడీ అంతా నేనే అంటున్నాడని, రాహుల్ సిద్ధంగా అందర్నీ కలుపుకుని వెళ్లాలని చెప్పాలనుకొంది కాంగ్రెస్, కానీ, అక్కడే కాంగ్రెస్ చెవిలో కమలం పువ్వు పడింది.
రాహుల్ ప్రకటనలో ఉన్న స్లోగన్ ను మోడీ ఎప్పుడో వాడేశారు. ప్రభుత్వ అధికారుల్లో స్ఫూర్తి నింపడం కోసం ఏర్పాటు చేసిన ఓ సభలో మై నహీ, హమ్ అన్న స్లోగన్ ను ఉపయోగించారాయన. ఈ విషయం గుర్తించని కాంగ్రెస్ దాన్నే తమ పార్టీ లైన్ గా భారీగా ప్రకటనలు ఇచ్చింది. దీంతో, ఆన్ లైన్ లో రెండింటినీ పోల్చుతూ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. మీడియా కూడా దీన్ని పెద్దది చేసి చూపడంతో ఒక్కసారిగా అవాక్కైన కాంగ్రెస్, తన ప్రకటనలను ఉపసంహరించుకొంది. ఢిల్లీలో ఫ్లెక్సీలను వెంటనే మార్చేసింది. అదే అర్థం వచ్చినట్లుగా, మరో స్లోగన్ ను తెరపైకి తెచ్చింది. అదే .. తోడే నహీ.. జోడే.. కాంగ్రెస్ కు సొంతగా ప్రచారం చేసుకునే సత్తా కూడా లేకే, మోడీ స్లోగన్స్ పై పడిందంటూ బీజేపీ మండిపడింది.

2, నవంబర్ 2013, శనివారం
ఉల్లి ధర పెరగడానికి మోడీ కారణమా..?
Categories :
bjp . congress . kapil sibal . modi . onion price . POLITICS . TOP
యాభై రూపాయలను ఎప్పుడో దాటిసేన కిలో ఉల్లి ధర, వడివడిగా వందవైపు పరుగులు పెడుతోంది. ధరలు తగ్గుతాయంటూ ఈ మధ్య కేంద్రమంత్రి శరద్ పవార్ చెప్పినప్పటికీ, వాస్తవంలో మాత్రం అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. నాసిరకం ఉల్లి యాభై రూపాయలు పలుకుతుంటే కాస్త నాణ్యమైన ఉల్లిపాయలు మాత్రం కిలో 65 నుంచి 70 రూపాయల మధ్య అమ్ముడవుతున్నాయి. కేంద్రం అలసత్వం వల్లే ఉల్లి ధర పెరుగుతోందంటూ ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ విరుచుకుపడుతుండడంతో, కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఉల్లి ధరలు పెరగడానికి గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని కారణమంటూ విమర్శించారు కేంద్రమంత్రి కపిల్ సిబల్.
గుజరాత్‌లోని ఖచ్ ప్రాంతంలో ఉల్లిపాయలు ఎక్కువగా పండించే వేలాది ఎకరాలను అదాని గ్రూప్‌కు మోడీ కట్టబెట్టారని, దాని వల్లే ఉల్లి ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని సిబల్ ఆరోపించారు. మరి దీనికి బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read more...

29, అక్టోబర్ 2013, మంగళవారం
ఆ రెండు మళ్లీ కమలానివేనా..?
Categories :
bjp . Chhattisgarh . congress . five state election . madhya pradesh . POLITICS . pre poll survey . TOP
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల సర్వేలు ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నాయి. కాంగ్రెస్ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న మధ్యప్రదేశ్‌లో మళ్లీ ఆ పార్టీకి ఎదురుదెబ్బే తగలనుంది. బీజేపీకి 148 నుంచి 160 సీట్లు రావచ్చని సీఎన్‌ఎన్-ఐబీఎన్, ది వీక్ లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో బీజేపీకి 37.6 శాతం ఓట్లే పోలవ్వగా, ఈ సారి 44 శాతం ఓట్లను సంపాదించవచ్చని సర్వే అంచనా వేసింది. దీన్నిబట్టి చూస్తే, గతంలో కన్నా ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో బీజేపీ మరింత బలపడిందని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు కేవలం 52 నుంచి 62 సీట్లే వస్తాయని సర్వేలో తేలింది. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 71 సీట్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలిస్తే, మూడోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆ రాష్ట్ర సీఎం చౌహాన్‌కు దక్కుతుంది.
ఛత్తీస్‌గఢ్‌లోనూ కమల విరబూయనుందని ఐబీఎన్ సర్వే చెబుతోంది. 91 సీట్లున్న అసెంబ్లీలో 61 నుంచి 71 సీట్లు బీజేపీకే దక్కుతాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు కేవలం 16 నుంచి 24 సీట్లే దక్కవచ్చని సర్వేలో తేలింది. రమణసింగ్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసం వల్లే బీజీపీ మళ్లీ విజయం సాధించవచ్చంటోంది సీఎన్‌ఎన్-ఐబీఎన్, ది వీక్ సంయుక్త సర్వే.

27, అక్టోబర్ 2013, ఆదివారం
మోడి కన్నా నువ్వు బెటర్.. రాహుల్ కన్నా నువ్వు బెటర్
Categories :
bjp . congress . digvijay . digvijaysingh . modi . POLITICS . sushma swaraj . TOP
ప్రధాని అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ - బీజేపీల మధ్య ట్వీట్ల యుద్ధం పతాక స్థాయికి చేరింది. కొంతకాలంగా మోడిని టార్గెట్ చేసుకుని ట్వీట్ల వర్షం కురిపిస్తున్న దిగ్విజయ్ సింగ్ ఈ సారి మరో తీవ్ర విమర్శ చేశారు. బీజేపీ సరైన ప్రధాన అభ్యర్థిని ఎంచుకోలేదని, సుష్మా స్వరాజ్ లాంటి మంచి నాయకురాలిని ఎంచుకోలేకపోయిందని విమర్శించారు..
దీనికి సుష్మా స్వరాజ్ వెంటనే ప్రతిస్పందించారు. రాహుల్ గాంధీ కన్నా దిగ్విజయ్ సింగే బెటర్ అంటూ ట్విట్టర్‌లోనే సెటైర్ వేశారు సుష్మా.

16, అక్టోబర్ 2013, బుధవారం
మోడి కోసం వాస్తు వేదిక
ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఉత్తరప్రదేశ్ లో తొలిసారిగా అక్టోబర్ 19న మోడి తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభ విజయవంతం కావడానికి బీజేపీ నేతలు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే, యూపీలో సీట్లు చాలా కీలకం కాబట్టి, ఉత్తర ప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు మోడి. అందుకే, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కాన్పూర్ లో జరిగే ఈ బహిరంగ సభ కోసం వంద అడుగుల పొడవప, 30 అడుగుల వెడల్పైన వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వాస్తు పరంగా అన్నీ సక్రమంగా ఉండేలా ఈ వేదికను రూపొందిస్తున్నారు బీజేపీ నేతలు. జ్యోతిష పండితులను కూడా పిలిచి, ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకు దేవుళ్లకు శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ వెబ్ సైట్స్ ద్వారా ఆహ్వాన పత్రాలను సైతం పంపిస్తున్నారు. భారీగా పోస్టర్లు, ఫ్లెక్సీలతో హడావుడి చేస్తున్నారు బీజేపీ నేతలు. ఒకప్పుడు యూపీలో అధికారాన్ని అనుభవించి, ఆ తర్వాత ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ, మోడి మ్యాజిక్ తో మళ్లీ పునర్ వైభవాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
Read more...
అతను ప్రధానైతే అంతకన్నా సంతోషముండదంట
కమల కురువృద్ధుడు అద్వానీ తన మనసు పూర్తిగా మార్చుకున్నారు. నరేంద్ర మోడి అభ్యర్థిత్వాన్ని ఇంతకాలం వ్యతిరేకిస్తూ వచ్చిన అద్వానీ, ఇప్పుడు మోడీ ప్రధాని అయితే తనకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఉండదని చెప్పుకొచ్చారు. మోడితో కలిసి గుజరాత్లోని అహ్మదాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత.. ఈ విషయాలను చెప్పారు. దీనిద్వారా తనకు,మోడికి మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పడానికి ప్రయత్నించారాయన. సబర్మతి రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన గార్డెన్స్ ను ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన సభలో అద్వానీ, మోడిలు కలిసి పాల్గొన్నారు. 2011 తర్వాత గుజరాత్ లో ఓ బహిరంగ సభలో ఇద్దరూ కలిసి పాల్గొనడం ఇదే తొలిసారి.
Read more...
2, అక్టోబర్ 2013, బుధవారం
మోడీతో బాబు ములాఖత్
ఎన్డీఏతో ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఉవ్విళ్లూరుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉదయం ఢిల్లీలో జరిగిన సిటిజన్స్ ఫర్ ఎకౌంటబుల్ గవర్నెన్స్ సదస్సులో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు. ఒకరికొకరు ఎదురుపడగానే ఆత్మీయ కరచాలనం చేసుకున్నారు. ఇక ఆ సదస్సులో ఎన్డీఏ పరిపాలనపై ప్రశంసలు కురిపించారు చంద్రబాబు. హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, అభివృద్ధి విషయంలో వాజ్ పేయి ఆదర్శవంతమైన పాలన అందించారన్నారు చంద్రబాబు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో దేశం సంక్షోభంలో చిక్కుకుపోయిందని, ఆ కూటమిని గద్దె దించడానికి 2014 ఎన్నికలే మంచి అవకాశమని ఆయన అన్నారు. ఈ సారి కూడా కాంగ్రెస్ ను గెలిపిస్తే, మళ్లీ కష్టాలు కొనితెచ్చుకున్నట్లేనని ప్రకటించారు చంద్రబాబు. ఆ తర్వాత ప్రసంగించిన నరేంద్రమోడి మాత్రం బాబు ప్రస్తావనే తేలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి, బాబు పాలన గురించి నామమాత్రమైనా ప్రస్తావించలేదు. ఇక సదస్సు ముగిసిన తర్వాత, మోడితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు చంద్రబాబు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి, వచ్చే ఎన్నికల గురించి వీరిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. బీజేపీ-టీడీపీ పొత్తుపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబునే నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బాబు రాక వల్ల ఎన్డీఏ బలపడుతుందని బీజేపీ భావిస్తుంటే, బీజేపీతో కలవడం వల్ల మోడి మ్యాజిక్ వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తుందని చంద్రబాబు ఆశిస్తున్నారు.
Read more...
14, జూన్ 2013, శుక్రవారం
తెలంగాణవాదులు అనుకున్నది సాధించారా..?
టీజేఏసీ నిర్వహించిన ఛలో అసెంబ్లీ ఉద్రిక్తతల మధ్య సాగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు ఈ సారి మాత్రం ఎంతో వ్యూహాత్మకంగా, మరెంతో పకడ్బందీగా వ్యవహరించగలిగారు. ముఖ్యంగా జిల్లాల నుంచే జనాన్ని హైదరాబాద్ కు రాకుండా అడ్డుకోవడంలో పోలీసులు సక్సెస్ కావడంతో, ఛలో అసెంబ్లీ ప్రభావం హైదరాబాద్ పై పెద్దగా పడలేదు. ఇక ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, ఇనుప కంచెలు వేసి రోడ్లు మూసేయడంతో సామాన్యజనం మాత్రం తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఎక్కడికక్కడ మోహరించినా, కొంతమంది మాత్రం వారి కళ్లు గప్పి అసెంబ్లీ వరకూ చేరుకోగలిగారు. వీరిని అసెంబ్లీ సమీపంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ వాదులు పెద్దగా హైదరాబాద్ కు రాలేకపోవడంతో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలే ఆందోళనకారుల పాత్ర పోషించారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు దగ్గర సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టారు. కావేటి సమ్మయ్య, వినయ్ భాస్కర్ లు టీఆర్ఎస్ ఎల్పీ భవనంపైకి ఎక్కి కాసేపు ఆందోళన చేశారు. రెండో గేటు దగ్గర నాగం, బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. సభవాయిదా పడినా బయటకు రాకుండా స్పీకర్ పోడియం దగ్గరే బైఠాయించిన టీటీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తరలించారు. అనంతరం వీరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అసెంబ్లీ బయట ఆందోళన చేయబోయిన కేటీఆర్, హరీశ్ రావు, విజయశాంతి, ఎంపీలు వివేక్, మందాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరా పార్క్ దగ్గర కేసీఆర్ కుమార్తె కవితను, అశోక్ నగర్ దగ్గర కోదండరామ్ ను, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ నేత శ్రావణ్ తో పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంతో, ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బషీర్ భాగ్ ప్రాంతంలో ఆందోళనకు దిగిన న్యూడెమోక్రసీ, ఇతర పార్టీల నేతలను పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి ఉద్రిక్తతలను తగ్గించగలిగారు.
మొత్తం మీద పోలీసులు తమ వ్యూహాలతో అసెంబ్లీ ముట్టడిని కట్టడి చేయగలిగారు. టీజేఏసీ గతంలో చేసిన ఆందోళనలతో పోల్చితే ఈసారి పకడ్బందీగా నిర్వహించలేకపోయింది. హోంమంత్రి కూడా లేకపోవడంతో, సీఎం అన్నీ తానై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ, పోలీసులు పట్టు సడలించకుండా చూసుకోగలిగారు. దీంతో ఛలో అసెంబ్లీని భగ్నంచేయడంలో పోలీసులు విజయం సాధించగలిగారు.
ఉస్మానియాలో మాత్రం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్థులు యూనివర్సిటీ గేటు దాటి రావడానికి ప్రయత్నించడం, వారిని పోలీసులు అడ్డుకోవడంతో యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసులపైకి విద్యార్థులు రాళ్లదాడి చేయగా, బాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు. రబ్బర్ బుల్లెట్ల వాడకం, కాల్పులకు పోలీసులు ఈ సారి దూరంగా ఉండడంతో, ఛలో అసెంబ్లీలో హింసాత్మక సంఘటనలేవీ చోటు చేసుకోలేదు.

13, జూన్ 2013, గురువారం
హైదారాబాద్ లో హై టెన్షన్
తెలంగాణ రాజకీయ ఐకాస పిలుపు ఇచ్చిన చలో అసెంబ్లీ నేపథ్యంలో హైదరాబాద్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చలో అసెంబ్లీని మిలిటెంట్ పోరాటంగా మార్చాలని మావోయిస్టులు లేఖ రాయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పింది. హైదరాబాద్ శివార్లలో సభ పెట్టుకుంటామంటే అనుమతిస్తామని చెప్పింది. అయితే, ప్రభుత్వం,పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా చలో అసెంబ్లీని నిర్వహించి తీరతామని జేఏసీ, దానికి మద్దతు ఇస్తున్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రకటించాయి. దీంతో, ముందు జాగ్రత్తగా హైదరాబాద్ వైపు వచ్చే తెలంగాణ రోడ్లపై పోలీసులు భారీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారు. జిల్లాలో జేఏసీ నేతలను కూడా అరెస్ట్ చేసి బైండోవర్ చేస్తున్నారు. అసెంబ్లీ చుట్టూ కూడా ఎప్పుడూ లేనంతగా భారీగా బలగాలను మోహరించారు. సరిహద్దుల్లో ఏర్పాటు చేసినట్లు ముళ్లకంచెనూ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక్క విద్యార్థిని కూడా బయటకు రానివ్వడం లేదు. హైదరాబాద్ లో అడుగడుగునా పోలీసులను మోహరించారు. రేపు ఉదయంగానీ, ఇవాళ రాత్రి గానీ జేఏసీ ముఖ్యనేతలను, టీఆర్ఎస్ నేతలను సైతం హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇంత కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నా, జేఏసీ నేతలు మాత్రం ఏదో రకంగా అసెంబ్లీని ముట్టడిస్తామని చెబుతున్నారు.
Read more...
11, జూన్ 2013, మంగళవారం
అద్వానీ నిజంగానే మెత్తబడ్డారా?
బీజేపీ కురువృద్ధుడు అద్వానీ సృష్టించిన సంక్షోభం టీకప్పులో తుపానులా సద్దుమణిగిపోయింది. రాజీనామా లేఖను సంధించి, రెండురోజుల పాటు బీజేపీ నేతలకు కంటిమీద నిద్ర లేకుండా చేసిన అద్వానీ.. చివరకు ఆరెస్సెస్ జోక్యంతో మనసు మార్చుకున్నారు.
మంగళవారం ఉదయం నుంచి గడ్కరీ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం పలు దఫాలు అద్వానీతో మాట్లాడింది. అయితే, వీళ్లు చెప్పింది వినడమే తప్ప ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మధ్యాహ్నం వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. మరోవైపు అద్వానీ వర్గమైన సుష్మస్వరాజ్, ఉమాభారతిలు ప్రత్యేకంగా సమావేశమైన చర్చలు జరిపారు. అనంతరం ఉమాభారతి అద్వానీ నివాసానికి చేరుకుని ఆయనతో మాట్లాడారు. బీజేపీలో నెలకొన్న సంక్షోభంపై స్పందించిన ఆర్ఎస్సెస్ నేతలు అద్వానీతో మాట్లాడారు. సంఘ్ చీఫ్ మోహన్ భగత్ .. రాజీనామాను ఉపసంహరించుకోవాలని సూచించారు. దీంతో కాస్తమెత్తబడ్డారు అద్వానీ. అనంతరం రాజ్ నాథ్, సుష్మాస్వరాజ్ లు వెళ్లి అద్వానీతో చర్చలు జరిపారు. పార్టీలో ఆయన లేవనెత్తిన అంశాలపై దృష్టి పెడతామని, అద్వానీ కోరుకున్నట్లే పార్టీని నడిపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో, రాజీనామా ఉపసంహరించుకోవడానికి అంగీకరించారు అద్వానీ. అయితే.. ఈ విషయాన్ని మీడియా ముందుకు వచ్చి ప్రకటించడానికి మాత్రం ఆయన అంగీకరించలేదు. దీంతో, రాజ్ నాథ్, గడ్కరీ, సుష్మాస్వరాజ్ లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, అసలు విషయాన్ని మాత్రమే చెప్పి ముగించారు. రిపోర్టర్లు ప్రశ్నలు వేసినా స్పందించకుండా వెళ్లిపోయారు. దీంతో, అద్వానీ అసంతృప్తి పూర్తిస్థాయిలో సద్దుమణగలేదన్న విషయం అర్థమవుతుంది.

10, జూన్ 2013, సోమవారం
అద్వానీ అస్త్రసన్యాసం వెనుక..?
బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు ఆ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ ఎల్.కె.అద్వానీ. తన అభ్యంతరాలను చెత్తబుట్టలో పడేసి మరీ మోడీని ఎన్నికల ప్రచార సారధిగా నియమించడాన్ని ఆయన అణుమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, బీజేపీ నేతలంతా మోడీకి పట్టం కట్టామన్న సంబరాల్లో మునిగితేలుతుంటే.. వాటన్నింటిని ఒకే ఒక్క లెటర్ తో చెదరగొట్టారు. పార్టీలోని పదవులన్నింటికీ రాజీనామా చేస్తూ, పార్టీ అగ్రనాయకత్వం తీరుపై తీవ్రవిమర్శలు చేస్తూ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు ఓ లేఖ రాశారు. శ్యాంప్రకాశ్ ముఖర్జీ, నానాజీ, వాజ్ పేయి లాంటి నేతల సిద్ధాంతాలకు, ఆశయాలకు బీజేపీ దూరం జరుగుతోందని ఆరోపించారు అద్వానీ. పార్టీ ప్రయోజనాల కోసం కాక కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలకోసమే పాకులాడుతున్నారంటూ విమర్శించారు. అయితే, బీజేపీలో సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు కమల కురువృద్ధ నేత.
సిద్ధాంతాలు దూరమయ్యాయనా..? ప్రధాని పదవి దక్కదనా..?
బీజేపీ అగ్రనాయకత్వంపై అద్వానీ చేస్తున్న విమర్శలు, కొంతకాలంగా ఆయన వ్యక్తపరుస్తున్న అభ్యంతరాలు, ఆయన తీరును చెప్పకనే చెబుతున్నాయి. మోడీకి మొదట్నుంచి అండదండలు అందించి, ఇంతటివాడిని చేసిన అద్వానీ... జాతీయస్థాయిలో అతను ఎదగడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారన్నది వాస్తవం. ఓ రకంగా ఈ ఎన్నికలే అద్వానీ ప్రధాని కావడానికి చివరి అవకాశం. యూపీఏ పనితీరు బాగోలేదు కాబట్టి, ఈ సారి ఎన్డీఏకు ఎలాగైనా మెజార్టీ వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. కాకపోతే, బీజేపీ నేతలకు మాత్రం అద్వానీ నాయకత్వంపై ప్రస్తుతం నమ్మకం లేదు. యువతను, హిందుత్వవాదులను ప్రబలంగా ఆకర్షించగల మోడి మంత్రాన్నే ఎక్కువ మంది జపిస్తున్నారు. మోడిని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా బలమైన హిందూ ఓటు బ్యాంకును సాధించవచ్చని ఆశిస్తున్నారు. కానీ, మైనార్టీ ఓట్లపైనే బతికే బీజేపీయేతర పార్టీలు ఇందుకు మొదట్నుంచి అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా దీన్నే అస్త్రంగా మలచుకొని, కొంతకాలంగా మోడి విషయంలో విబేధిస్తూ వస్తున్నారు అద్వానీ. ముఖ్యంగా మోడి వల్ల బీజేపీకి విజయం దక్కితే ప్రధాని పదవి అద్వానికి ఏమాత్రం అందదు.
ప్రస్తుతం అద్వానీ రాజీనామా చేయడానికి కూడా ఇదే కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే, బీజేపీలో అద్వానీ కన్నా కరుడుగట్టిన హిందుత్వవాది మరొకరు లేదన్నది బహిరంగ సత్యం. రామ్ మందిర్ నినాదంతోనే బీజేపీకి జవసత్వాలు ఊదిన చరిత్ర అద్వానీది. మోడి కూడా హిందుత్వ విషయంలో అద్వానీ తర్వాతే అని చెప్పుకోవాలి. రధయాత్ర చేసినప్పుడు, ఎంతో వివాదాస్పదమైన రామ్ జన్మభూమి నినాదం తీసుకున్నప్పుడు.. అద్వానీకి ముఖర్జీ సిద్దాంతాలు గుర్తుకురాలేదా....? ఇప్పుడు మోడిని భుజాలపైకి ఎత్తుకునేసరికే అవన్నీ గుర్తుకువచ్చాయా....?
ఏమైనా రాజకీయాల్లో ఒక్కో అడుగు ఎక్కుతూ ఎంతో ఎత్తుకు చేరుకున్న అద్వానీ, ఈ విషయంతో మాత్రం తన చిన్నతనాన్ని చాటుకున్నారనే చెప్పాలి.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)