ఉత్తరప్రదేశ్‌లో తిరిగి పుంజుకోవాలనుకున్న బీజేపీ ఆశలు నెరవేరలేదు. ఉమాభారతిని రంగంలోకి దింపి హిందుత్వ కార్డును ప్రదర్శించినా, ఫలితం లేకపోయింది. చివరకు, రెండు దశాబ్దాలుగా బీజేపీకి పట్టం కడుతూ వచ్చిన అయోధ్య ఓటర్లు కూడా ఈ సారి కమలనాథులకు మొండిచేయి చూపించారు. అయోధ్యలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌ను కాదని, ఎస్పీ అభ్యర్థి తేజ్ నారాయణ్ పాండేను గెలిపించారు. బాబ్రీ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి దాకా.. ఈ స్థానంలో బీజేపీనే గెలుస్తూ వచ్చింది. కానీ, ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ ప్రభంజనంలో ఈ సీటు కూడా బీజేపీ ఖాతా నుంచి కొట్టుకుపోయింది.
Read more...
up results లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
up results లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
7, మార్చి 2012, బుధవారం
బీజేపీని ఓడించిన అయోధ్య ఓటర్లు
Categories :
ayodhya . bjp . POLITICS . TOP . up results
6, మార్చి 2012, మంగళవారం
రాహుల్ గాంధీని నమ్మని యూపీ జనం
Categories :
congress . rahul gandhi . TOP . up results
కాంగ్రెస్ భవిష్యత్ ఆశాకిరణం, పట్టాభిషేకం జరగని యువరాజు.. రాహుల్ గాంధీ యూపీ రణరంగంలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. యూపీలో కాంగ్రెస్ ను గెలిపించి, తన సమర్థతను చాటుకొని, దేశ రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకోవాలని ఉవ్విళ్లూరిన సోనియా-రాజీవ్ ల తనయుడిని ఊహించని షాక్ ను ఇచ్చాయి. యూపీలో కాంగ్రెస్కు అత్యధిక స్థానాలు కట్టబెట్టడమో లేదంటే, కొత్త ప్రభుత్వానికి తమ అవసరం ఉండేలానో సీట్లను గెలుచుకోవాలని పావులు కదిపిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీకి నాలుగోస్థానాన్ని మాత్రమే సంపాదించగలిగారు. రాహుల్ సభలకు భారీ ఎత్తున జనం వచ్చినా, రోడ్ షోలకు విశేష ఆదరణ లభించినా, ఆ అభిమానం ఓట్ల వర్షాన్ని కురిపించలేదు. చెప్పాలంటే కాంగ్రెస్ యువనేతను గానీ, ఆయన హామీలను గానీ యూపీ ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. యూపీ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాహుల్.. ఈ ఓటమికి తనదే బాధ్యతని ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికలు తనకు మంచి పాఠాన్ని నేర్పాయన్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ కు.. రాహుల్ గాంధీకి మధ్య సాగిన సంగ్రామంలో.. అఖిలేష్ కే విజయం దక్కింది. ఎస్పీ అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా మోస్తూ.. విస్తృతంగా రాష్ట్రంలో ప్రచారం చేసి భారీ విజయాన్ని సాధించారు. కానీ రాహుల్ కు పడ్డ ప్రయాస అంతా వృథానే అయ్యింది.
Read more...
సైకిల్ జోరు.. ఏనుగు బేజారు
Categories :
mulayam . POLITICS . samajwadi win . TOP . up results
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అందరి అంచనాలను మించిపోయాయి. ములాయం నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ భారీ మెజార్టీని సంపాదించింది. మరెవరీసాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 202 స్థానాల్లో గెలుపొందాలి. సమాజ్ వాదీ పార్టీ 224 స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న మాయావతి పార్టీ బీఎస్పీ ఘోర పరాభవాన్ని పొందింది. కేవలం 80 సీట్లనే సాధించగలిగింది. ఇక బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బీజేపీకి 47 స్థానాలు లభించాయి. రాహుల్ ఇమేజ్ తో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే అత్యంత ఘోరం. రాహుల్ రాష్ట్రమంతా తిరిగినా, యూపీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినా కేవలం 38 స్థానాల్లోనే గెలవగలిగింది. మొత్తానికి ఎస్పీ సైకిల్ జోరుకు.. బీఎస్పీ సహా, కాంగ్రెస్, బీజేపీలు కొట్టుకుపోయాయి.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

