ఇది బాబా రాందేవ్ కు ఢిల్లీలో ఎదురైన పరిస్థితి. దేశ రాజధానిలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో నల్లధనం గురించి ఇవాళ(శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో) రాందేవ్ బాబా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశంలోకి తెచ్చి, అభివృద్ధికి వాడాలని మరోసారి డిమాండ్ చేశారు. సమావేశం ముగియగానే, ఆయన్ను ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. వారు ఫోటోలు తీసుకుంటుండగానే, ఓ వ్యక్తి బాబా రాందేవ్ మొహంపై పడేటట్లు నల్ల ఇంక్ పోశాడు. ఒక్కసారిగా జరిగిన ఈ దాడితో రాందేవ్ అవాక్కయ్యారు. వెంటనే స్పందించిన ఆయన అనుచరులు, ఇంక్ పోసిన వ్యక్తిని చితకబాదారు. ఆయన నోట్లోంచి రక్తం వచ్చేలా కొట్టారు.
నల్లధనంపై మాట్లాడినందుకు.. నల్ల ఇంకు బహుమతి ఇచ్చారంటూ బాబా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, దాడి చేసిన వ్యక్తిని కమ్రాన్ సిద్దిఖీగా గుర్తించారు. బాట్లా ఎన్ కౌంటర్ పై ఇటీవల బాబా రాందేవ్ చేసిన కామెంట్కు నిరసనగా, ఈ దాడి చేశానని అతను చెబుతున్నాడు.
Click Here for English Version
Read more...
ink attack లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ink attack లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
14, జనవరి 2012, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

