shinde లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
shinde లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
3, డిసెంబర్ 2013, మంగళవారం
యూటీ మూగబోయే.. ప్రత్యేక రాష్ట్ర పాట మొదలయ్యే
Categories :
bifurcation . hyderabad . jd sheelam . kavuri . pallam raju . POLITICS . seemandhra . shinde . special state . telangana . TOP
రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్ ను యూటీ చేయాల్సిందేనని, లేకపోతే విభజనకు అంగీకరించమని నానా హడావుడి చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, హైకమాండ్ పట్టించుకోకపోయేసరికి కొత్తపాట మొదలుపెట్టారు. ఇవాళ సాయంత్రం జీవోఎం చివరి సమావేశం జరుగుతుండడంతో సరికొత్త ప్రతిపాదనను లేవనెత్తారు. పరిమితకాలం పాటు హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కావూరి చాంబర్ లో సమావేశమై చర్చలు జరిపిన జేడీశీలం, పళ్లంరాజు, జీవోఎం భేటీకి ముందే షిండేను కలిసి ఈ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అటు 69 పేజీల నివేదికను సిద్ధం చేసిన జీవోఎం ఇవాళ భేటీ అనంతరం, దాన్ని ప్రధానికి, కేబినెట్ కు పంపించనుంది. రాయలతెలంగాణ ఏర్పాటు దిశగానే నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Read more...
5, అక్టోబర్ 2013, శనివారం
సీమాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్
Categories :
bifurcation . POLITICS . seemandhra . shinde . special package to seemandhra . telangana . TOP . upa
టీనో్ట్కు కేంద్ర
కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిసిన దగ్గర నుంచి సీమాంధ్ర మండుతూనే ఉంది. బంద్లు,
రాస్తారోకోలు,
ఆందోళనలతో అట్టుడుకుతోంది. సీడబ్ల్యూసీ తీర్మానంతో పొగ రాజేసి.. కేబినెట్ నోట్‌తో మంటపెట్టిన కేంద్రం.. సీమాంధ్ర ఆందోళనలను ఇప్పటికీ రాష్ట్ర విభజనపై వెనక్కి తగ్గేదే లేదని చెబుతోంది. అయితే,
సీమాంధ్రుల ఆందోళనలను జాగ్రత్తగా గమనిస్తున్న మన్మోహన్ సర్కార్.. వాటిని నియంత్రించేందుకు ప్యాకేజ్ అస్త్రాన్ని ప్రయోగించనుంది. కొండ ప్రాంతాల రాష్ట్రాలకు అమలవుతున్న ట్యాక్స్ హాలిడేను సీమాంధ్రకు వర్తింపజేయనుంది. అంతేకాదు. చాలామంది అభ్యంతరం అంతా హైదరాబాద్ పైనే కాబట్టి,
ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లలో శాంతి భద్రత ల వ్యవహారాన్ని పూర్తిగా గవర్నర్ చేతిలో పెట్టనుంది.
రాష్ట్రాన్ని
ఎలా
విభజించాలన్న దానిపై కసరత్తు చేయడానికి,
మంత్రుల బృందం ఏర్పాటు చేసిన కేంద్రం,
ఇప్పటికే కాంగ్రెస్లో అంతర్గతంగానూ,
కాంగ్రెస్కు - కేంద్రానికి మధ్య జరిగిన రాజకీయ సంప్రదింపుల ఆధారంగా విస్తృతస్థాయి న్యాయపరమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం తెలంగాణ,
సీమాంధ్రకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండే పదేళ్ల పాటు ఒకే గవర్నర్ ఉంటారు. శాంతిభద్రతల వ్యవహారం కేంద్ర పాలిత ప్రాంతాల తరహాలో గవర్నర్ చేతిలోనే ఉంటుంది. యూటీ కేడర్ అధికారులే హైదరాబాద్లో బాధ్యతలు నిర్వహిస్తారు.
రెండు
రాష్ట్రాలకు రెండు ప్రత్యేక అసెంబ్లీలు,
రెండు
హైకోర్టులు హైదరాబాద్లోనే పనిచేస్తాయి. వీటని ఎలా ఏర్పాటు చేయాలన్నది మంత్రుల బృందం నిర్ణయిస్తుంది. కొత్త అసెంబ్లీకోసం హైదరాబాద్లో భవనం సిద్ధంగానే ఉన్నప్పటికీ,
కొత్త
హైకోర్ట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించనుంది కేంద్రం. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర మంత్రులు,
ఎంపీలకు ఈ ప్యాకేజ్ గురించి ప్రభుత్వ పెద్దలు వివరించినట్లు సమాచారం. అయితే,
ఈ
ప్యాకేజ్ను మరింత మెరుగుపరచడానికి వీరు సలహాలిస్తమనగా,
మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న చిదంబరం ముందు వినిపించాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్
పార్టీ పరంగా ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీ,
రాజకీయ కోణంలో సమస్యను పరిష్కరించడానికి అభిప్రాయ సేకరణను జరుపుతూనే ఉంది. అయితే కేబినెట్ నోట్ తర్వాత సీమాంధ్రలో ఆందోళనలు మరింత ఉధృతం కావడంతో,
ఈ
సమస్యను వెంటనే పరిష్కరించాలనుకొంటోంది. అందుకే,
సీమాంధ్ర ప్యాకేజ్కు తుదిరూపునిస్తోంది.
4, అక్టోబర్ 2013, శుక్రవారం
ఇన్నాళ్లూ ఎందుకు ఆపారు.. ఇప్పుడు దొడ్డిదారిన ఎందుకు తెచ్చారు
ఎంతో శాంతియుతంగా, సామరస్యంగా జరగాల్సిన రాష్ట్ర విభజన ప్రక్రియ యూపీఏ సర్కార్, కాంగ్రెస్ హైకమాండ్ రాజకీయాల కారణంగా అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగుతోంది. ముఖ్యంగా ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చే వరకూ తెలంగాణ నోట్ ఆగిపోతుందన్న ధీమాతో ఉన్న సీమాంధ్రులు.. కేబినెట్ నోట్ ఆమోదం పొందడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. 63 రోజులుగా ఉద్యమం చేస్తున్నా తమ మనోభావాలను గుర్తించేలేదని, తమను కేంద్రం మోసం చేస్తుందన్న భయాందోళనకు గురయ్యారు.
సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత వెంటనే కార్యాచరణ మొదలుపెట్టామన్న కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని తేల్చకుండా ఇంతకాలం నాన్చుతూ వచ్చింది. కేబినెట్ నోట్ తయారువుతోందని కొంతకాలం క్రితం చెప్పిన షిండే, ఆ తర్వాత మాట మార్చారు. అంతెందుకు, గురువారం సాయంత్రం కేబినెట్ భేటీలో నోట్ ప్రస్తావన ఉంటుందని మీడియా కోడైకూస్తుంటే, మధ్యాహ్నం వేళ తీరిగ్గా అవన్నీ వదంతులేనని కొట్టి పారేశారు. చివరకు కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యే మంత్రులకు కూడా నోట్ వ్యవహారాన్ని ముఖ్యమైన విషయంగా చెప్పలేదు. కేవలం టేబుల్ అజెండాగా పెట్టి అందరినీ మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. చివరకు, కేబినెట్ సమావేశం మొత్తాన్ని కేవలం తెలంగాణ నోట్ కే పరిమితం చేశారు. ఇలా దొంగచాటుగా వ్యవహరించాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకు వచ్చింది. టీ నోట్ తయారయ్యిందని, కేబినెట్ భేటీలో చర్చిస్తామని నేరుగా ప్రకటించవచ్చు కదా.. ఇలాంటి చర్యల వల్ల జనంలో మరిన్ని అపోహలు ఏర్పడుతున్నాయి. అసలు ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదు.. కేబినెట్ నోట్ పై ఏర్పాటు చేసే మంత్రుల బృందమే అన్ని ప్రాంతాల అభిప్రాయం తీసుకుంటుంది, విభజన ఎలా జరగాలే నిర్ణయిస్తుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని వేసి కాలహరణకు పాల్పడింది. జనాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. పోనీ, అదన్నా సక్రమంగా చేసిందా అంటే అదీ లేదు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించడానికి వస్తోందని పీసీసీ చీఫ్ బొత్స ప్రకటించిన మరుసటి రోజే టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలా వరసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఏం చేయబోతోందన్నది అనుమానాస్పదంగా మారింది. ఓ వైపు సీమాంధ్రలో ఉద్యమం తీవ్రంగా సాగుతుంటే, టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలపడం ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అనుకోవాలా లేక, ఈ ఆందోళనలకు మరింత ఆజ్యం పోసి, తర్వాత వాటిని సాకుగా చూపి వెనక్కి తగ్గే వ్యూహాన్ని ఏమైనా అమలు చేస్తోందా అన్న అనుమానాలు కలగకమానవు.
Read more...
సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత వెంటనే కార్యాచరణ మొదలుపెట్టామన్న కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని తేల్చకుండా ఇంతకాలం నాన్చుతూ వచ్చింది. కేబినెట్ నోట్ తయారువుతోందని కొంతకాలం క్రితం చెప్పిన షిండే, ఆ తర్వాత మాట మార్చారు. అంతెందుకు, గురువారం సాయంత్రం కేబినెట్ భేటీలో నోట్ ప్రస్తావన ఉంటుందని మీడియా కోడైకూస్తుంటే, మధ్యాహ్నం వేళ తీరిగ్గా అవన్నీ వదంతులేనని కొట్టి పారేశారు. చివరకు కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యే మంత్రులకు కూడా నోట్ వ్యవహారాన్ని ముఖ్యమైన విషయంగా చెప్పలేదు. కేవలం టేబుల్ అజెండాగా పెట్టి అందరినీ మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. చివరకు, కేబినెట్ సమావేశం మొత్తాన్ని కేవలం తెలంగాణ నోట్ కే పరిమితం చేశారు. ఇలా దొంగచాటుగా వ్యవహరించాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకు వచ్చింది. టీ నోట్ తయారయ్యిందని, కేబినెట్ భేటీలో చర్చిస్తామని నేరుగా ప్రకటించవచ్చు కదా.. ఇలాంటి చర్యల వల్ల జనంలో మరిన్ని అపోహలు ఏర్పడుతున్నాయి. అసలు ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదు.. కేబినెట్ నోట్ పై ఏర్పాటు చేసే మంత్రుల బృందమే అన్ని ప్రాంతాల అభిప్రాయం తీసుకుంటుంది, విభజన ఎలా జరగాలే నిర్ణయిస్తుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని వేసి కాలహరణకు పాల్పడింది. జనాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. పోనీ, అదన్నా సక్రమంగా చేసిందా అంటే అదీ లేదు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించడానికి వస్తోందని పీసీసీ చీఫ్ బొత్స ప్రకటించిన మరుసటి రోజే టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలా వరసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఏం చేయబోతోందన్నది అనుమానాస్పదంగా మారింది. ఓ వైపు సీమాంధ్రలో ఉద్యమం తీవ్రంగా సాగుతుంటే, టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలపడం ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అనుకోవాలా లేక, ఈ ఆందోళనలకు మరింత ఆజ్యం పోసి, తర్వాత వాటిని సాకుగా చూపి వెనక్కి తగ్గే వ్యూహాన్ని ఏమైనా అమలు చేస్తోందా అన్న అనుమానాలు కలగకమానవు.
3, అక్టోబర్ 2013, గురువారం
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Categories :
cabinet note . division . seemandhra . shinde . t note . telangana . TOP . upa
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. ప్రధాని నివాసంలో రెండు గంటల పాటు జరిగిన చర్చ అనంతరం తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించింది కేబినెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తెలంగాణ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ను పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని తీర్మానించింది. ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి షిండే మీడియా ముందుకు వచ్చి ఈ వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలను రక్షించడంపై మంత్రుల బృందం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారాయన. జలవనరులు సహా, ఇతర పంపకాలపై మంత్రుల బృందం నిర్ణయం తీసుకుంటుందన్నారు షిండే. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడంతో, పెద్ద ముందడుగు పడినట్లయ్యింది. కేంద్రకేబినెట్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలియగానే, సీమాంధ్రలో ఆందోళనలు వెల్లువెత్తాయి. సీమాంధ్రలో 72 గంటల బంద్ కు పిలుపునిచ్చారు సమైక్యవాదులు.
Read more...
టీ నోట్ వచ్చేసింది
రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పటినుంచి వాయిదా పడుతూ వచ్చిన తెలంగాణ నోట్ ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చింది. ప్రధాని నివాసంలో సాయంత్రం ఐదున్నరకు సమావేశమైన కేబినెట్ ముందు ఈ నోట్ ను ప్రవేశ పెట్టారు హోంమంత్రి షిండే. సీడబ్ల్యూసీ ప్రకటనకు తగ్గట్లుగానే హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకే కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టిందని పేర్కొన్నారు. కేబినెట్ ముందుకు టీ నోట్ రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమైక్యవాదులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థి జేఏసీ నేతలు ఢిల్లీలో ప్రధాని నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. వీరిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...
19, సెప్టెంబర్ 2013, గురువారం
కాక రేపుతున్న కేబినెట్ నోట్
Categories :
cabinet note . congress . POLITICS . seemandhra . shinde . telangana . TOP
తెలంగాణ కేబినెట్ నోట్ ప్రతి సిద్ధమయ్యిందన్న హోంమంత్రి షిండే ప్రకటన అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఒక్కసారిగా కలకలం పుట్టించింది. ఆంటోనీ కమిటీ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న సీమాంధ్ర నేతలు ఒక్కసారిగా ఈ ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంటోనీ కమిటీ నివేదిక రాకుండా కేబినెట్ నోట్ ఎలా తయారు చేస్తారంటూ ప్రశ్నించారు. దిగ్విజయ్ ను కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. కేబినెట్ నోట్ విషయంలో కేంద్రం ముందుకు వెళితే గనక, తాము పదవులకు రాజీనామా చేస్తామంటూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు ఓ లేఖను రాశారు. దీన్ని సోనియాకు అందించాలని దిగ్విజయ్ ను కోరారు.
అటు తెలంగాణ విషయంలో కేంద్రం మాత్రం ముందడుగు వేయాలనే భావిస్తున్నట్లు సమాచారం. హోంశాఖకు అందిన ముసాయిదా ప్రతిని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ల పరిశీలనకు పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుండడంతో, తెలంగాణ అంశంపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కేబినెట్ నోట్ ను ఇంకా షిండే, మన్మోహన్, సోనియాలు పరిశీలించకపోవడంతో, కేబినెట్ ముందుకు వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఆంటోనీ కమిటీ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అందులో పేర్కొన్న అంశాలను కూడా ఈ ముసాయిదాలో చేర్చి, నోట్ ను న్యాయశాఖకు పంపించనుంది హోంశాఖ. ప్రస్తుతం సీమాంధ్ర నేతల అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం ముందడుగు వేస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
Read more...
అటు తెలంగాణ విషయంలో కేంద్రం మాత్రం ముందడుగు వేయాలనే భావిస్తున్నట్లు సమాచారం. హోంశాఖకు అందిన ముసాయిదా ప్రతిని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ల పరిశీలనకు పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుండడంతో, తెలంగాణ అంశంపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కేబినెట్ నోట్ ను ఇంకా షిండే, మన్మోహన్, సోనియాలు పరిశీలించకపోవడంతో, కేబినెట్ ముందుకు వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఆంటోనీ కమిటీ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అందులో పేర్కొన్న అంశాలను కూడా ఈ ముసాయిదాలో చేర్చి, నోట్ ను న్యాయశాఖకు పంపించనుంది హోంశాఖ. ప్రస్తుతం సీమాంధ్ర నేతల అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం ముందడుగు వేస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
1, ఆగస్టు 2013, గురువారం
ఆరునెలల్లో తెలంగాణ
సీమాంధ్రలో ఎన్ని ఆందోళనలు జరిగినా, తెలంగాణ విషయంలో వెనకడుగు వేసేదే లేదని విస్పష్టంగా ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే. తెలంగాణ బిల్లును తయారు చేసే పనిలో హోంశాఖ ఉందన్న ఆయన, సమయం తక్కువగా ఉండడంతో ఈ సెషన్లో బిల్లును ప్రవేశ పెట్టలేమన్నారు. శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తెలంగాణ బిల్లును తీసుకువస్తామన్నారు షిండే. ఈలోగా అసెంబ్లీలో తీర్మానం, ఇతర వ్యవహారాలను పూర్తి చేస్తామన్నారు. గతంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటైనప్పటికీ, రాష్ట్ర విభజనకు అదే ప్రాతిపదికను అనుసరించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు హోంమంత్రి. తెలంగాణ ఏర్పాటు వ్యవహారమంతా ఆరునెలల్లోపే పూర్తవుతుందని చెప్పారు షిండే.
Read more...
21, ఫిబ్రవరి 2013, గురువారం
తప్పైపోయిందన్న కేంద్ర హోంమంత్రి షిండే
నెల రోజుల క్రితం జైపూర్లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో ఆవేశంగా ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి షిండే ఎట్టకేలకు మెట్టుదిగారు. బీజేపీ, ఆరెఎస్సెస్ శిబిరాలు హిందూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, దీనిపై తమ దగ్గర కచ్చితమైన సమాచారం ఉందన్న షిండే.. బడ్జెట్ సమావేశాలకు ముందు తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ఏదో ఓ మతానికి ముడిపెట్టడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వల్ల బాధపడినవారికి పశ్చాతాపాన్ని వ్యక్తం చేస్తున్నానంటూ.. ఓ లేఖను విడుదల చేశారు షిండే.
నెలరోజులగా ఈ విషయంపై నోరు మెదపకుండా ఉన్న హోంమంత్రి ఇప్పుడు సడన్‌గా పశ్చాతాప పడడానికి పెద్ద కారణమే ఉంది. బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించడం కోసం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ ఈ వ్యవహారాన్ని లేవనెత్తింది. షిండే క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్. తమ పార్టీ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తుంటే, తనను, తమ పార్టీ ఎంపీలను సభలోకి అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకోవాలన్నారామె. అఖిలపక్ష సమావేశం పూర్తైన తర్వాత, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్, సుష్మాస్వరాజ్‌తో ప్రత్యేకంగా సమావేశమై సంధియత్నాలు చేశారు. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో షిండే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ సభలో ఇదేవిషయంపై ఆయన ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
హిందూ ఉగ్రవాద వ్యాఖ్యలపై షిండే చింతిస్తున్నానని ప్రకటించడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. హోంమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. వివాదం పరిష్కారం కావడంతో, బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని పేర్కోంది కమలం పార్టీ. షిండేకు, బీజేపీకి మధ్య వివాదం పరిష్కారం కావడంపై ఎన్డీఏ పక్షాలు కూడా సంతృప్తిని వ్యక్తం చేశాయి.
9, ఫిబ్రవరి 2013, శనివారం
షిండే ఆనాటి మాటల వెనుకున్న లెక్క ఇదేనా!
Categories :
afzal guru . death . hindutva terrorism . POLITICS . shinde . TOP
రాజకీయ నేతల మాటలకు అర్థాలు వేరులే అంటే.. ఇదే కాబోలు. పైకి మాట్లాడేది ఒకటైతే.. లోపల జరిగేది మరొకటి. మన రాజకీయాలను, మన పొలిటికల్ లీడర్లను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది. తాజాగా అఫ్జల్ గురును ఉరి తీసే విషయంలోనూ ఇదే జరిగింది. హిందుత్వ ఉగ్రవాదంపై కామెంట్లు చేసి.. దేశవ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టించిన షిండే.. అదే సమయంలో ఆఫ్జల్ గురును ఉరి తీసే ఫైల్‌పైనా సంతకం చేయడమే... యూపీఏ పొలిటికల్ స్ట్రాటజీకి అద్దం పడుతోంది.
పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి సూత్రధారి ఆఫ్జల్ గురుకు ఉరిశిక్ష వ్యవహారాన్ని చాపకిందనీరులా చక్కబెట్టారు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే. ఎవరికీ అనుమానం రాకుండా ఉండడంకోసం మరో తేనెతుట్టెను కదిపారాయన. ఆఫ్జల్ గురు కు క్షమాభిక్ష తిరస్కరిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న జనవరి 21కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అంతకు ముందు మూడు రోజుల పాటు, జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబర్‌ను నిర్వహించింది. చివరి రోజు అంటే.. జనవరి 20న షిండే హిందుత్వ ఉగ్రవాదంపై వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్త దుమారాన్ని సృష్టించారు. బీజేపీ , ఆరెస్సెస్‌లు ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్నాయని, హిందుత్వ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయనీ చింతన్ శిబిర్‌లో ఆరోపించారు షిండే. పైగా, నిఘా వర్గాల సమాచారమూ తమ దగ్గర ఉందని దాన్ని సమర్థించుకున్నారు.
షిండే వ్యాఖ్యలపై హిందుత్వవాదులు విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్సెస్, బీజేపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. షిండేను పదవినుంచి దింపాలంటూ డిమాండ్ చేశాయి. జైపూర్‌లో హిందుత్వ ఉగ్రవాద చిచ్చు రగిలించి.. ఢిల్లీకి చేరుకున్న షిండే.. చాలా ప్రశాంతంగా జనవరి 21న ఆఫ్జల్ గురును ఉరితీయడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు. ఫైల్‌పై సంతకం చేసి రాష్ట్రపతికి పంపించారు.
హిందుత్వ ఉగ్రవాదం విమర్శలు చేసిన మరుసటి రోజే.. ఆఫ్జల్ గురును ఉరి తీయాలని షిండే ఎందుకు డిసైడ్ అయ్యారన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆఫ్జల్ గురును ఉరితీయాలని ముందే డిసైడ్ అయిన షిండే, ఆ పని చేస్తే, మైనార్టీల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత వస్తుందని భావించినట్లు తెలుస్తోంది. అందుకే, దేశంలో హిందుత్వ ఉగ్రవాదం రాజ్యమేలుతోందంటూ విమర్శలు చేశారు. అటు హిందుత్వ ఉగ్రవాదం ఉందని ప్రకటించడం.. ఇటు ఆఫ్జల్ గురును ఉరి తీయమని సంతకం చేయడం.. రెండింటికీ లెక్క సరిపోయిందనుకున్నారాయన. హిందుత్వ ఉగ్రవాదంపై మాట్లాడినందుకు మైనార్టీల్లోనూ.. ఆఫ్జల్‌ను ఉరితీయడం వల్ల మిగిలిన వర్గాల్లోనూ కాంగ్రెస్‌కు ఇమేజ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు షిండే.
Read more...
4, ఫిబ్రవరి 2013, సోమవారం
హోంమంత్రి షిండే పైనా కేసు పెట్టారు
Categories :
case . hindutva terrorism . POLITICS . shinde . TOP
నోటి దురుసుతో తిప్పలు పడుతున్న వారి జాబితాలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా చేరారు. హిందుత్వ ఉగ్రవాదం అంటూ కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో వ్యాఖ్యానించిన షిండేపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే, ఎక్కడా కేసులు మాత్రం నమోదు కాలేదు. పైగా, బీజేపీ కూడా షిండే ను తప్పించాలంటూ తీవ్రంగా ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని మధురలో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ లో కేసు నమోదు చేశారు. సాహెబ్ సింగ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై ఈ నెల 12న విచారణ జరపనుంది కోర్టు.
Read more...
27, జనవరి 2013, ఆదివారం
మళ్లీ మెలికపెట్టారు..!
తెలంగాణపై అన్నట్లే నెలరోజుల్లోగా కేంద్రం హోంమంత్రి ఓ ప్రకటన చేశారు. అయితే, చెప్పినట్లుగా నిర్ణయాన్ని ప్రకటించకుండా, నిర్ణయానికి మరికొంత గడువు కావాలని అందులో పేర్కొన్నారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కానందున నిర్ణయాన్ని వెలువరచలేకపోతున్నట్లు తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ కోర్ కమిటీ వరసగా నాలుగోసారి సమావేశమై తెలంగాణ అంశంపై చర్చలు జరిపింది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, సంప్రదింపులు ఎన్ని రోజులు జరుగుతాయన్నదానికి నిర్దిష్టమైన గడువేదీ లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్ ను, మూడు ప్రాంతాల నేతలను త్వరలోనే ఢిల్లీకి పిలిచి మాట్లాడతామన్నారాయన. అనంతరం పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. దాని తర్వాత ... కేంద్రం విభజనపై తన వైఖరిని ప్రకటిస్తుందన్నారు. దీంతో.. ఈ అంశం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)








