నిజమే.. నిజాయతీగా పనిచేసినందుకు ఓ ఐఏఎస్ అధికారికి దక్కిన బహుమానమిది. 30 ఏళ్లలో ఆయన్ను ఏకంగా 60 సార్లు ట్రాన్స్‌ఫర్ చేసి తమ కక్ష తీర్చుకుంది ఆ ప్రభుత్వం.. ఒక్కనిమిషం మీరు ఊహిస్తున్నట్లు అతను సోనియా అల్లుడు వాద్రా భూముల వ్యవహారం బయటపెట్టిన అశోక్ ఖేమ్కా కాదు.. ఈయన ప్రదీప్ కాస్ని. ఈయన కూడా హర్యానాలోనే ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. అక్కడి సీఎం హుడా హడావుడిగా నియమించిన సమాచార కమిషనర్లకు అపాయింట్ మెంట్ లెటర్లు ఇవ్వనందుకు ఆయన్ను లో ప్రొఫైల్ పోస్ట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు హుడా. 1984లో స్టేట్ సివిల్ సర్వీస్ లో చేరిన కాస్ని అంచెలంచెలుగా ఎదిగారు. 2006లో స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన 30 నిమిషాల్లోనే ఆయనకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ అందింది. 2012లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ డైరెక్టర్ గా మూడురోజులు పనిచేయగానే మరో చోటకి బదిలీ అయ్యింది. ఇలాంటి అనుభవాలు ఆయనకు ఎన్నో. అయితే.. ఈ ట్రాన్స్‌ఫర్లు తనకు కొత్తేమీ కాదని.. ఎక్కడున్నా సమర్థవతంగా పనిచేయడమే తనకు తెలుసంటున్నారు ప్రదీప్ కాస్ని.
haryana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
haryana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
6, ఆగస్టు 2014, బుధవారం
30 ఏళ్లు.. 60 ట్రాన్స్‌ఫర్లు
Categories :
30 years 60 transfers . haryana . hooda . ias officer . news . pradeep kasni . transfer
Read more...
5, ఏప్రిల్ 2013, శుక్రవారం
ట్రాన్స్ ఫర్స్ లో ఈయన్ని మించినోడు లేడు
Categories :
ashok khemka . haryana . ias officer . news . rabert vadra . sonia . TOP . transfer
ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, 20 ఏళ్ల సర్వీసులో ఎన్నిసార్లు ట్రాన్స్ ఫర్ అయి ఉంటారు.. సాధారణంగా ఒక్కో చోట కనీసం రెండేళ్లన్నా ఐఏఎస్ అధికారులు పనిచేస్తారు. పోనీ ఏడాదే వేసుకున్నా.. 20 ఏళ్లలో 20 ట్రాన్స్ ఫర్స్. కానీ, హర్యానా కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, అశోక్ ఖేమ్కా మాత్రం, ఈ 20 ఏళ్లలో 44 సార్లు ట్రాన్స్ ఫర్స్ ఆర్డర్స్ అందుకున్నారు. అంటే సగటున ఆర్నెళ్లు కూడా ఆయన్ను ప్రభుత్వం స్థిరంగా ఉండనివ్వలేదన్నమాట.
ఇంతకీ ఈ అశోక్ ఖేమ్కా ఎవరో తెలుసా.. రియాల్టీ దిగ్గజం డీఎల్ ఎఫ్ కు సోనియా అల్లుడు రాబర్డ్ వాద్రాకు మధ్య అక్రమంగా జరిగిన భూ బదలాయింపును రద్దు చేసిన అధికారి. ఆ కేటాయింపులు రద్దు చేసిన వెంటనే ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పించింది హర్యానా సర్కార్. అనంతరం హర్యానా సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. అక్కడ జరిగిన 60 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు ఖేమ్కా. మోసపూరితంగా ఫంగిసైడ్స్ ను రైతులకు అమ్మినందుకు ఓ జర్మనీ పురుగుమందుల కంపెనీపై క్రిమినల్ కేసుకు సిఫార్సు చేశారు ఖేమ్కా. దీంతో కలవరపడ్డ సర్కార్, ఆయన్ను అత్యంత అప్రాధాన్య పోస్టైన హర్యానా ఆర్కైవ్స్ కు సెక్రటరీగా బదిలీ చేసింది. ఈ ఆదేశాలు ఇంకా ఆయనకు అందకుముందే, మరో జూనియర్ అధికారిని పంపించి, బాధ్యతలను బలవంతంగా బదిలీ చేయించింది. ఏడాది కాలంలో ఖేమ్కా ట్రాన్స్ ఫర్ కావడం ఇది నాలుగోసారి. నిజాయితీగా పనిచేసే అధికారులకు మన ప్రభుత్వాలు ఇచ్చే బహుమతులు ఇలానే ఉంటాయి మరి..
22, జనవరి 2013, మంగళవారం
మాజీ సీఎంకు పదేళ్ల జైలు
అధికారంలో ఉన్నప్పుడు ఎంత అవినీతికి పాల్పడినా చెల్లుతుందనుకునే నేతల తీరుకు చెల్లు చెప్పింది ఢిల్లీ కోర్టు. టీచర్స్ స్కామ్ లో ప్రధాన నిందితులైన హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా, ఆయన తనయుడు అభయ్ చౌతాలాకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ, ఢిల్లీలోని రోహిణీ కోర్టు తీర్పు చెప్పింది. ఈ స్కామ్ లో పాలుపంచుకున్న మరో ముగ్గురికి కూడా ఇదే శిక్షను విధించింది. 1999-2000 మధ్య 3206 మంది జూనియర్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ల నియామకంలో ముడుపులు తీసుకున్నారని వీరిపై అభియోగాలున్నాయి. వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు చౌతాలా, ఆయన కుమారుడు దోషులుగా తేల్చింది. ఇవాళ శిక్షను ఖరారు చేసింది. చౌతాలాకు జైలు శిక్ష విధించడంతో ఢిల్లీ వీధుల్లో ఆయన అనుచరులు, ఐఎన్ఎల్డీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోహిణి కోర్టుల దగ్గర పోలీసులపైనా దాడి చేశారు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

